అమ్మాయి వివాహం వయస్సు 21కి పెంపు
అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిందూ వివాహ చట్టం (1955)ను అనుసరించి అమ్మాయిల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండేది. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయా నికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. అమ్మాయిల వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమి టీని నియమించింది.21 సంవత్సరాలకు పెంచా లని ఈ కమిటీ ప్రతిపాదించింది. ఇందు కోసం దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలు,15 స్వచ్చంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీకి సమతా పార్టీమాజీఛైర్మన్ జయ జైట్లీ నేతృత్వం వహించారు. ఈమెతో పాటు, ఈ కమిటీ లో నీతిఆయోగ్‌సభ్యులు డాక్టర్ వి.కె.పాల్, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.స్కూళ్లలో లైంగిక విద్యను తప్పని సరి చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది.ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధించేందుకు సహకరిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. అమ్మాయిలు,అబ్బాయిల వివాహ వయసు లోని అంతరాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధిస్తుందా?
సమాజంలో పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషించినంత వరకూ బాలికల హోదాలో, పరిస్థి తుల్లో ఎటువంటి మార్పులు రావని స్త్రీవాద పత్రిక ‘భూమిక’సంపాదకురాలు కొండవీటి సత్యవతి అంటారు. బాలికల కనీస వివాహ వయసును ప్రభుత్వం 21సంవత్సరాలకు పెంచడంపై ఆమె ఒక వ్యాసం రాశారు. సామాజిక వాతావరణాన్ని ప్రక్షాళన చేయకుండా వివాహ వయో పరిమితిని పెంచడంలో అర్ధం లేదు. బాలికలపై చూపించే వివక్షకు మూలకారణాలను తెలుసుకోకుండా సమా నత్వాన్ని సాధించడం కష్టమని ఆమె అంటారు. ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతి స్తున్నానని అంటూ లింగ సమానత్వం సాధించ డానికి ఇదొక మెట్టు లాంటిదని ఆంధ్రయూని వర్సిటీ లా కాలేజీ విభాగాధిపతి డాక్టర్ సుమిత్ర అన్నారు.
ఈ నిర్ణయం బాల్య వివాహాలను ఆపుతుందా?
భారతదేశంలో 2019-20నాటికి బాల్య వివా హాలు 23% ఉన్నట్లు ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇది 2015-16లో 27% ఉండేది.బాల్య వివాహాలు శిశు మరణాలకు, ప్రసూతి మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.చిన్న పిల్లల పెళ్లిళ్ల గురించి చర్చ మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా, నేటికీ ఇదొక సమస్యగానే ఉండిపోవడం విచారకరమని సత్యవతి అంటారు. ‘‘చిన్న వయసులోనే రజస్వల అవ్వడంవల్ల చురుకుగా మారే హార్మోన్ల ఒత్తిడిని అమ్మాయిలు ఎలా అధిగమిస్తారు? గ్రామాల్లో హై స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడ చదివించాలనే సందేహం,ఆడపిల్లలను దూరంగా పంపించి చది వించేందుకు ఇష్టం చూపకపోవడం, అమ్మాయిలకు సురక్షిత వాతావరణం లేకపోవడం, లైంగిక వేధింపులు కూడా బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. యుక్తవయసులో ఉన్న 51% చదువు లేని అమ్మాయిలు, ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన 47%మంది అమ్మా యిలు 18సంవత్సరాలులోపే వివాహం చేసు కున్నట్లు యూఎన్ఎఫ్పీఏ ఇండియా-2020 నివేదిక చెబుతోంది. భారత్‌లో 1.5కోట్ల మంది అమ్మాయిలకు 18ఏళ్లలోపే వివాహమైందని నివేది కలో జయ చెప్పారు. అయితే ఇదివరకు 46శాతం (మొత్తం బాలికల్లో 46శాతం మంది)గా ఉండే ఈ వివాహాలు ప్రస్తుతం 27శాతానికి తగ్గాయని జయా జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన తెగల్లో మార్పు తెస్తుందో లేదో సందేహమేనని అంటున్నారు నిర్ణయ్ స్వచ్చంద సంస్థకు చెందిన నిఖిని వర్మ. ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళలు, బాలికల విద్య కోసం పని చేస్తున్నారు.‘‘గిరిజన ప్రాంతాల్లో పాటించే ఆచారాలు వారి సంస్కృతి పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా,ఈప్రాంతాల్లో ప్రతి నిర్ణ యానికి గ్రామపెద్దపై ఆధారపడతారు. ఈ ప్రాంతా ల్లో 18 ఏళ్లురాక ముందేపెళ్లి చేసేస్తారు. ఆ విష యం గురించి ఫిర్యాదు కూడా ఎవరూ చేయరు. పెళ్లి వయసు 21లేదా25కు పెరిగినా 18 సంవత్స రాలే ఉన్నా అది గిరిజనసమాజాల్లో పెద్దగా ప్రభావం చూపించదు’’అనిఅన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్పెషల్ మ్యారేజ్ చట్టం (1954) హిందూ వివాహచట్టం(1955)ప్రకారం వివాహం చేసుకునేవారికి ఈనిర్ణయం వర్తిస్తుంది.
మహిళా సాధికారత సాధించేందుకు తోడ్పడు తుందా?
చట్టంలో మార్పులు చేసినంత మాత్రాన మహిళా సాధికారత వస్తుందని చెప్పలేం,కానీ,ఇదొక మార్పు కు నాంది పలుకుతుందని డాక్టర్ సుమిత్ర అంటారు.‘‘సాధికారతకు సమానత్వం తొలి మెట్టు’’. సమానత్వ భావన అనేది సామాజికంగా వచ్చే వరకూ సాధికారత సాధ్యం కాదని ఆమె అంటారు. ఆర్ధిక,రాజకీయ సమానత్వం కొంత వరకు సాధిం చాం కానీ, సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదంటారు డాక్టర్ సుమిత్ర.
‘‘మహిళలు కూడా జెండర్ స్టీరియోటైప్స్ ను దాటి ఆలోచించగలగాలని అన్నారు. సమాజం ఒక పరి ణామం చెందుతున్న దశలో ఉంది.చట్టంతో పాటు సామాజిక దృక్పధం కూడా మారాలి. కానీ, మార్పు సాకారమయ్యేందుకు చాలా సమయం పడుతుంది’’ అని అన్నారు.అమ్మాయిల వివాహ వయసును పెంచ డం ద్వారా వారి విద్య ఉద్యోగావకాశాలు పెరిగితే, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని సుమిత్ర అన్నారు.
అమలు చేయడంలో ఉన్న సవాళ్లేంటి?
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా పిల్లలు,మహిళలపై మాత్రమే కాకుండా కుటుం బం,ఆర్ధిక,సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపి ిస్తుందని టాస్క్ ఫోర్స్ కమిటీ అభిప్రాయపడిరది. కొన్ని వెనుకబడిన వర్గాల్లో 70% బాల్య వివాహాలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. చదువును ఆపేసిన పిల్లల్లో 3నుంచి4రెట్లు మందికి పెళ్లిళ్లు చేసే అవకాశముందని లేదా వారి వివా హం నిశ్చయం అయిపోయి ఉంటుందని ఇంట ర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్ నిర్వహిం చిన అధ్యయనం పేర్కొంది. గ్రామీణ,గిరిజన ప్రాం తాల్లో నాటుకుపోయిన నమ్మకాలు, ఆచారాలను ఆపమని చెప్పడం చాలా కష్టమని అంటారు నిఖిని వర్మ.‘‘అదిలాబాద్ జిల్లాలోజరిగే నాగోబా జాతర లో వధూవరులను ఎంపిక చేసుకుంటారు. మాకు దేముడు చూపించిన మనువు అని అంటూ ఉంటారు. అటువంటి వారిని18లేదా21 సంవత్స రాల వరకూ పెళ్లి చేయకుండా ఆపమని ఒప్పించ డం చాలా కష్టమైన పని’’అని అంటారు నిఖిని. లోహారా గ్రామంలో బాల్య వివాహాలను ఆపేం దుకు పిల్లల తల్లితండ్రులను ఒప్పించడం చాలా కష్టంగా మారినట్లు వివరించారు.
పెంపు ద్వారా లింగ సమానత్వం సాధ్యమా…? ప్రపంచంలో జరిగే బాల్యవివాహాల్లో మూడవ వంతు మనదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆడపిల్లలు అంటే ‘’ఆళ్ళ’’ పిల్లలే అని దురభిప్రాయం మన కుటుంబాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది. అందు చేతనే పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. రాజస్థాన్ ఈవిషయంలో దేశంలోనే మొద టి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా నేటికీ 47 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి అని ఐక్య రాజ్యసమితి బాలలనిధి తెలియజేస్తున్నది. చదువు కున్న వారు కూడా బాల్యవివాహాలు జరిపించడం బాధాకరమైన విషయం. మగ పిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువఅనే భావం నేటికీ అనేక కుటుం బాల్లో కనపడుతోంది. ఈరకమైన ఆలోచనలు మార్చుకోవాలి.‘’లింగ సమానత్వం’’ దిశగా ప్రయా ణం చేయాలి. మత విశ్వాసాలను, మూఢ విశ్వా సాలను, ఆచారాలను పక్కన పెట్టాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. స్త్రీని దైవంగా కొలిచే ఈ దేశం నిరంతరం మహిళల వేదింపు లకు నిలయంగా ఎందుకు ఉంటుందో ఆలోచన చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చా త్య దేశాల్లో గొప్పలుగా చెప్పుకొంటున్న మనం, ఈరోజున మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమి సంజాయిషీ ఇస్తాం…?ఆకలి బాధలు, ఆక్రందనలు, వివక్షత, పేదరికం, అవిద్య, అక్రమ రవాణా,అఘాయిత్యాలు,ఆత్మహత్యలు,యాసిడ్ దాడులు,పరువు హత్యలు,వరకట్న వేదింపులు, వ్యభిచారకూపాలు, అవహేళనలు, గృహహింసలు, లైంగిక దోపిడీ,ర్యాగింగ్,రేప్‌లకు నిలయంగా ఉన్న ఈదేశంలో సగౌరవంగా స్త్రీబతికేది ఎప్పు డు…? ఆలోచన చేయాలి.అందుకే ‘’ఒకదేశ అభి వృద్ధి,ఆ దేశ మహిళా అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’’ అంటారు అంబేద్కర్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. కానీ అంతమాత్రానికే దేశంలో మహి ళలకు రక్షణ, భధ్రత, సమానత్వం కలుగుతుందా?. పురుషులుతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారా?. దేశాభివృద్ధికి తిరుగులేని శక్తిగా నిలబడుతారా? దిశయాప్,షీ టీం,మహిళా పోలీస్ స్టేషన్లు, నిర్భయ చట్టం ఉన్నా, అనునిత్యం దేశంలో ఏదో ఒకచోట మహిళల ఆక్రందనలు ఎందుకు వినిపిస్తున్నాయో గుర్తెరగాలి.
ఇటీవలి కాలంలో దేశంలో లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు, మహిళలు 1020 పైబడి నమోదు కావడం శుభ పరిణామంగా భావించాలి. భ్రూణ హత్యలు తగ్గాయి.అయితే అదే సమయంలో అఘాయిత్యాలు, గృహహింస రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో మరింత ఎక్కువయినాయి. చట్టాలు ఎన్నిఉన్నా సమాజంలో మహిళలపై చిన్న చూపు,వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ విషయా లపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. -జి.ఎన్.వి.సతీష్