అమల్లోకి సీఏఏ

‘‘ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓట్లు కురిపిస్తున్నందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్ధు లుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది.’’ ` గునపర్తి సైమన్‌
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భార తాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ-2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపర మైన ఉద్రిక్త తలు రెచ్చగొట్టడం దేశ సమగ్రత, సమె ౖక్యతకు గొడ్డలిపెట్టు. ఎన్నికల్లో లబ్ధిపొం దాలన్న యావతో వివాదాస్పద సిఎఎ అమలుకు అది తెగబడిరది.ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019-20లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ రాక్షసత్వానికి దాదాపు వంద మంది బల య్యారు. అప్పట్లో తాత్కాలికంగా వెనక్కితగ్గి ఇన్నాళ్లూ కోల్డ్‌ స్టోరేజిలో పెట్టిన ఈ చట్టాన్ని ఎన్నికల ముంగిట అందునా రంజాన్‌ ఉపవా సాలు ప్రారంభమైన ముందురోజున నోటిఫై చేయడం దాని దుష్ట ఎజెండాలో భాగమే. విచ్ఛిన్నం చేసే మత విభజనను తెచ్చి రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు,నిరు ద్యోగం,కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలన్నీ పక్కనపెట్టి భావోద్వేగ అంశాలను, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం వల్లే ప్రయోజనం పొందాలనేది బిజెపి కుతంత్రం. 2019లో ఎన్నికల ముందు పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్స్‌,దేశభక్తి లాంటి అంశాలను ముందుకు తెచ్చినట్టే ఇప్పుడూ సిఎఎ లాంటి అంశాలతో లబ్ధిపొందాలని ఆపార్టీ చూస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఆమోదింప జేసుకుంది.ఎన్‌డిఎ భాగస్వాము లతోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎంపిలు ఆనాడు దీనికి అనుకూలంగా ఓటు వేశారు.ఈచట్టం ప్రకారం 2014డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లా దేశ్‌ల నుండి మనదేశానికి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు,సిక్కులు,క్రైస్తవు లు,పార్శీలకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ చట్టం అమలును జాతీయ పౌరపట్టిక ఏర్పాటుతో ముడిపెట్టడం ముస్లిం పౌరులను లక్ష్యంగా చేసుకునేందుకే. రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి గుర్తింపు,పేర్ల నమోదు క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. ఇది భారత ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం. ఈ చట్టాన్ని మూడు దేశాలకే పరిమితం చేయడం,మతం ఆధారంగా తీసుకురావడం 1955లో తీసుకొచ్చిన సిఎఎ చట్టానికి, రాజ్యాం గ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం.రాజ్యాంగం లోని 19వ అధికరణం మతప రమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లం ఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపర మైన హింసను ఎదుర్కొం టున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారు? తమిళులపట్ల వివక్షా? ఇప్పుడు ముస్లిములను మినహాయించిన వారు తరువాత క్రైస్తవులను, ఇతర మైనార్టీలను మినహాయిం చరా? వంటి ప్రశ్నలనేకం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం,మతం,రంగు,జాతి,ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండ కూడదు.కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుంది కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రా లను (బేసిక్‌ స్ట్రక్చర్‌ను) మార్చే అధికారం పార్ల మెంట్‌కు కూడా లేదని కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఇవేవీ పట్టని మన పాలకులు మతాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ‘జై భజరంగి’ అంటూ ఓట్లు వేయాలని ప్రధాని స్వయంగా పిలుపు నిచ్చారు.‘పాకిస్తాన్‌కు వెళ్లండి..లేదా కబరి స్థాన్‌కు వెళ్లండి’అంటూ వీరంగం వేయడం, బుల్డోజర్లతో నివాసాలను కూల్చివేయడం..కమ లం పార్టీకి,ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వా లకు నిత్యకృత్యమే.400 సీట్లు ఇవ్వండి రాజ్యాం గాన్నే మార్చేస్తాం..సెక్యులర్‌ దేశంగా భారత్‌ను ఉంచం అని బిజెపి ఎంపి అనంత హెగ్డే అన్నారు. సిఎఎను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ,తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటిం చగా, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భిన్న మతాలు, ఆచారా లు,సంప్రదాయాలు,సంస్కృతులకు నియమైన మన దేశానికి ఈ చట్టం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.మత మారణహోమాన్ని రగిలించే మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు యావ ద్భారత జాతి ఐక్యంగా ముందుకు ఉరకాలి. సిఎఎను తిప్పికొట్టాలి.
ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం.. అంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్య అజెండాల్లో ఒకటి.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ). ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ అంశం వివాదాస్పదమవుతోంది. సీఏఏను వారంలో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటిం చడం కాక రేపుతోంది. అయోధ్యలో రామాల య నిర్మాణంతోపాటు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందని విపక్షాలు విమర్శి స్తున్నాయి.ఇంతకూ ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంటే..పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించ డం.2014 డిసెంబర్‌ 31కి ముందు ఆయా దేశాల నుంచి భార్ష కు వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు. ఆయా దేశాల నుంచి వలస వచ్చిన హిందు వులు,సిక్కులు,జైనులు,బౌద్ధులు,పార్శీలు,క్క్రెస్తవులు దీని సీఏఏ కింద భారత పౌరసత్వం పొం దొచ్చు. ఆఫ్గనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా,వాటి గడువు ముగిసినా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకో వచ్చు.ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టా నికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేసింది. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపాదన బిల్లును మొదట 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్‌ తోపాటు తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెం టు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రూపుదాల్చింది.అయితే దేశవ్యా ప్తంగా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్షాల ఆందోళనలతో దాని అమలు ఇన్నాళ్లూ వాయిదా పడిరది. కానీ జమ్ముకాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం,లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం,అయోధ్యలో రామా లయం నిర్మాణం వంటి చర్యలతో దూకుడు మీదున్న బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం విషయంలోనూ అంతే పట్టుదలతో ఉం దని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఖాయమని వెల్లడిర చారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు భారత పౌరసత్వం కల్పిస్తారు. అలాగే వీరు భారత్‌ పౌరసత్వం పొందడానికి భారత్‌లో కనీసం 11ఏళ్లుగా నివసిస్తూ ఉండా లన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. అయితే హిందువులకు, క్క్రెస్తవులకు, బౌద్ధులకు, పార్శీలకు పౌరసత్వం ఇస్తూ ముస్లిం మైనారిటీ లను చేర్చకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. సీఏఏపై విపక్షాల అభ్యంతరా లెందుకు అంటే..వివిధ దేశాల నుంచి వలస వచ్చి భారత్‌లో జీవిస్తున్న వివిధ మతాలవారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీరికి పౌర సత్వం కల్పిస్తే వారంతా బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారతారని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విదే శీయుల కారణంగా స్థానికంగా ఉండేవారికి ఉపాధి విషయంలో,సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రతిపక్షాల అభ్యంతరంగా ఉంది.అలాగే పాకిస్థాన్‌,బంగ్లాదేశ్‌,ఆప్గనిస్తాన్‌ల నుంచి వచ్చినవారికి పౌరసత్వం కల్పిస్తూ శ్రీలంక, టిబెట్‌,మయన్మార్‌ నుంచి వచ్చినవారికి పౌర సత్వం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ పలు పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. వీటిపై విచారణ తుది దశలో ఉంది.
చట్టం అమలుకు నిబంధనలను విడుదల
ఈ చట్టాన్ని అమలు పరచడానికి అవసరమైన నియమ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసిం దని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడిరచింది. ఈ నిబంధనలకు అమల్లోకి వస్తే 2014డిసెంబర్‌ 31తర్వాత పాకిస్తాన్‌,అఫ్గానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుందని హోంశాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.ఇందుకోసం పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఏమిటీ బిల్లు
ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ)లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే..ఈశాన్య భారత దేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభ (రాజ్యసభ)లో ఇది ఆమోదం పొందలేదు. ముఖ్యంగా..ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టం,ఆపౌరుల జాబి తా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ..ఆ జాబి తాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు. జాతీయ పౌరుల జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ) అనేది..1971 మార్చి 24వ తేదీ నాటికి – అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించు కోగలగిన ప్రజల జాబితా.ఆ జాబితాను ప్రచురించటానికి ముందు ఎన్‌ఆర్‌సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ.. తుది జాబితాను ప్రచురించటానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులు ఉన్నాయంటూ వైఖరి మార్చుకుంది. దానికి కారణం..బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందు వులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. ఈ నియమాలు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మతపరంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు మన దేశంలో పౌరసత్వాన్ని పొందేలా చేస్తాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు,సిక్కులు, బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని గ్రహించి,ఈ నోటిఫికేషన్‌తో నరేంద్ర మోదీ నెరవేర్చారు’’ అని ఎక్స్‌ వేదికగా తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరి జానికి విఘాతం కలుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి.
పౌరసత్వ చట్టం చరిత్ర ఏమిటి?
అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది.ఆచట్టం ప్రకారం.. అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.ఆరు మతపర మైన మైనారిటీ సమూహాలకు-హిందువులు, సిక్కులు,బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది.అయితే..వారు పాకిస్తాన్‌,అఫ్ఘానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించు కోగలగాలి.అటువంటి వారు పౌరసత్వం పొంద టానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవ త్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉంటేచాలు. ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా- ఓసీఐ) కార్డులుగల వ్యక్తులు-భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవ ధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న,పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లం ఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పో తారని కూడా ఈ సవరణ చెప్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? దేశం లోని కొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయబోమని ప్రకటించాయి.అయితే, పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ ?అధికార పరిధి లోకి వస్తుంది కదా,మరి అది సాధ్యమేనా? పౌరసత్వ సవరణ చట్టం-2019ను భారత పార్లమెంట్‌ ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధిం చిన నిబంధనలు నోటిఫై చేసింది.ఈచట్టం ప్రకారం 2014కు ముందు పాకిస్తాన్‌,బంగ్లా దేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ,బౌద్ధ,పార్సీ,క్రైస్తవ,జైన మతాలకు చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.వారు భారత్‌లోకి ప్రవేశించినట్లుగా నిరూపించే ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అందించా ల్సిన పత్రాలను సెక్షన్‌ 1ఏ,సెక్షన్‌ 1బీ విభాగా ల్లో పొందుపరిచారు.1ఏ పత్రాలలో జనన ధ్రువీకరణ,అద్దె ఒప్పంద పత్రం, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌,అఫ్గానిస్తాన్‌, బంగ్లా దేశ్‌,పాకిస్తాన్‌ దేశాలు జారీ చేసిన విద్య సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చాలి.1బీ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన వీసా,పాన్‌ కార్డు,మ్యారేజ్‌ సర్టిఫికేట్‌,సెన్సస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ అడ్మిట్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్డులు పేర్కొన్నారు.ఈ పత్రాలు 2014కి ముందే తీసుకొని ఉండాలి. ఈ పత్రాలు అందుబాటులో ఉంటే,ఈ మూడు దేశాల ప్రజలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా?పౌరసత్వం మంజూరు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది, అయితే ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయ కుండా ఉండటం సాధ్యమవుతుందా? ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.భారత రాజ్యాంగంలోని భాగం సెంట్రల్‌ లిస్ట్‌,స్టేట్‌లిస్ట్‌,కామన్‌ లిస్ట్‌ పరిధిలోకి వచ్చే విషయాలను నిర్వచిస్తుంది. కేంద్ర జాబితాలో మొత్తం 97అంశాలు ఉన్నాయి. 17వ అంశంగా ‘సిటిజన్‌షిప్‌,నాచురలైజేషన్‌, అలియన్స్‌’లను ప్రస్తావించారు.ఈ జాబితాలో ఉన్న విషయాలపై చట్టం చేసే హక్కు పూర్తిగా పార్లమెంట్‌ది.భారత పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోగలవా?
కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడం,వ్యతిరేకించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ గతం లో కొన్ని వ్యాఖ్యలు చేశారు.2020లో కేరళలో జరిగిన ‘కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..‘సీఏఏను పార్ల మెంట్‌ ఆమోదించిన తర్వాత ఏరాష్ట్రం కూడా దాన్ని అమలు చేయబోమని చెప్పలేదు.కానీ, వ్యతిరేకించవచ్చు.అసెంబ్లీలో తీర్మానం చేయ వచ్చు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయవచ్చు.కానీ దానిని అమలు చేయబోమని చెప్పడం రాజ్యాంగ పరంగా సంక్లిష్టమైనది’’ అని ఆయన అన్నారు. అంతేకాదు, పౌరసత్వం కోరేవారు కేంద్ర ప్రభు త్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా అడ్డుకుంటుంది లేదా అమలు చేయ కుండా ఉంటుందా?అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
‘పౌరుల రిజిస్టర్‌ తయారు చేయగలరా?’
సిటిజన్‌ షిప్స్‌, నాన్‌- సిటిజన్‌ షిప్స్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చినా,రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఏమీ చేయలేరని డీఎంకే అధికార ప్రతినిధి సీ రవీంద్రన్‌ అన్నారు.‘‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు ఒకదానికొకటి అనుసంధానమైనవి. రాష్ట్ర ప్రభుత్వ సహాయం లేకుండా పౌరుల రిజిస్టర్‌ తయారుచేయవచ్చా? ఉదాహరణకు, శ్రీలంక తమిళులు ఈ సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం పొందలేరు. వారు ఒకవేళ శ్రీలంక తమిళులని చెబితే వెళ్లగొడతారు,అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా?మేం అంగీకరించం’’ అని రవీంద్రన్‌ అన్నారు.రాజకీయాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.‘‘ఉత్తర భారతదేశంలో హిందూ శక్తులు బలంగా ఉన్న ప్రాంతాలలో,బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని నటిస్తోంది. వాళ్లు దీన్ని పూర్తిగా అమలు చేయలేరు’’ అని రవీంద్రన్‌ ఆరోపించారు.