అమరశిల్పి..అంబేద్కర్‌

కుల,మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవిత కాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమా పేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కో కూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్ర మాలు ఇప్పటికీ చారిత్రా త్మకమైనవి. (ఏప్రిల్‌ 14) ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది. – (కత్తి పద్మారావు)

అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్‌’ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈనెల ఏఫ్రిల్‌ 14న డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది.డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌..న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరా టం చేసిన యోధుడాయన. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో రామ్‌జీ,భీమా బాయి దంపతులకు జన్మించారు.తండ్రి రామ్‌ జీ బ్రిటీష్‌ భారతీయ సైన్యంలో సుబేదార్‌గా పని చేసేవారు. అంబేద్కర్‌ చిన్ననాటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్‌ కులానికి చెందిన ఆయణ్ని అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోపెట్టేవారు. ఇలా అగ్రకులాల వారి ఆధిపత్యపోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరారు.అక్కడ హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు.. ఈ వివక్షలన్నిం టినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‌ అత్యధిక మార్కులతో పాసయ్యారు. బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్‌..ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. ఎంఏ,పీహెచ్‌డీ,న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.విదేశాలలో ఎకనామిక్స్‌లోడాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువొ క్కటే మార్గమని భావించారు. తనలా అంటరాని తనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలనకు సమరశంఖం మ్రోగించారు. అణగారిని వర్గంలోని ప్రజలకు అంబేద్కర్‌ చదువు చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపిం చారు. అంటరానితనంపై పోరాటం చేశారు.. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని,మనుధర్మాన్ని వ్యతిరేకించారు.1927లో దళిత జాతుల మహా సభ జరిగింది..మహారాష్ట్ర,గుజరాత్‌ నుంచి కొన్ని వేలమంది వచ్చారు. మహత్‌ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేద్కర్‌ ఆచెరువులోని నీటిని తాగారు. చరిత్రలో అదో సంచలనం.
1931లో రౌండ్‌టేబుల్‌ సన్నాహాలు సంద ర్భంగా అంబేద్కర్‌ గాంధీజీని కలిశారు. తర్వా త స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు..దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్‌ నియ మించిన రాజ్యాంగ సంఘానికి ఆయణ్ని అధ్యక్షు నిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్‌ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. తరతరాలుగా బడుగు,బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్‌.. వారి అభ్యున్నతకి రిజర్వే షన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు.అంబేద్కర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ,వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయ త్నించిన హిందూ కోడ్‌ బిల్లు ముసాయిదాను పార్లమెం టులో నిలిపివేయడంతో..1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అంబేద్కర్‌ తన జీవితంలోని ముఖ్యాం శాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. హిందూ సమాజం పట్ల ఆగ్రహించారు. హిందూసమాజ వినా శనాన్ని కోరుకోలేదు: భీమ్‌రావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రికలద్వారా హిందువుల ఆలోచనా ధోరణిని మార్చటానికి ప్రయత్నిం చారు. నాసిక్‌ కాలారాం మందిర ప్రవేశంకోసం 18నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను,రాజ్యాంగంలో పొందు పరిచారు.
అంబేడ్కర్‌ జీవితంలోని లోతు తాత్త్వికమైంది భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలను కున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్‌ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్‌ ఆర్థిక,తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది.
అస్పృశ్యత మూలాల నిర్మూలన
మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడిరది! మనిషిని మనిషిగా చూడ టమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక,విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్‌ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడిరది. బౌద్ధాన్ని ఆయన వ్మాయంగానే కాక, తత్త్వ శాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్య యనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చి వేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు. అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొం దించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం,అవమా నించటం,అపహాస్యం చేయటం,అణచివే యటం.మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజ మూ చేస్తుంది. ఈ మూడిరటిని ఈ ఆర్టికల్‌ నిరోధిస్తుంది.
రాజ్యాంగంపై అంబేడ్కర్‌ జీవిత ప్రభావం
బాబాసాహెబ్‌ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’ అంబే డ్కర్‌ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్‌ కీర్‌ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్‌ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్‌ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు.అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందు పరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయు లందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్‌ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి.