అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది..!
భారతదేశంలోని ధనవంతులైన 70లక్షల మంది పేదవారు 80కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే,ఎగువ0.5శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాదిస్తారు.ఈసంఖ్యలు వివాదాస్పదంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమానత ఆర్థికవేత్త థామస్ పికెట్టీ,అతని సహచరుల అంచనాల ఆధారంగా ప్రముఖ సీనియర్ ఎకనామిక్ అనలిస్ట్ ఔనింద్యో చక్రవర్తి రూపొం దించారు.
199లో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపంచీకరణ మరియు ప్రైవేటీకరణ ప్రవేశపెట్టింది.ఈసంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవడం,దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగామారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇది దోహద పడిరది.ఇదిదేశంలో ప్రైవేట్‌రంగం విస్తరించడానికి మరియు ఆర్థికవృద్ధికి దోహదం చేసింది. ఈనేపథ్యంలోనే నూతన ఆర్ధికసరళీకరణ విధానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇంటర్నేషనల్ మోనార్టింగ్ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్‌లు అప్పటి నుంచి వీటిని తమ గుప్పెట్లోకి వచ్చాయి.
దాని ముందర మనకు సోషలిస్టు విధానం ఉండేది. 30 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తోంది.కానీ డేటా పరిశీలిస్తే0.5శాతం జనాభ ధనికవర్గానికే చెందు తుంది. సంపాదనలో 80కోట్ల మంది పేదవారి సంపాదనతో సమానం అని డేటా చెబుతుందని ఔనింద్యోచక్రవర్తి ద్వారా తెలుస్తోంది.దీనబట్టి పరిశీలస్తే,ముప్పైయేళ్ల క్రితం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానం ధనవంతులకే ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందినదేశాల కంటే అత్యంతపేదగా పరిగణించబడే బురుండి,మడగాస్కర్.ఈ రెండుదేశాల సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదా యాలతో దాదాపు సమానంగా ఉంటాయి.ఎందుకంటే ఇక్కడ పేదరికం ఎక్కువ..ఆదాయం తక్కువ.
2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750 (ూూూ).భారత దేశంలో దిగువన ఉన్న42శాతం మంది పెద్దలు దానికంటే తక్కువ సంపాదించారు దాదాపు వి1,720 (ూూూ).అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065 (ూూూ).భారతదేశంలో దిగువన ఉన్న52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు.దీనర్థం దాదాపు58కోట్ల మంది భారతీయులు(ఈపెద్దలపై ఆధార పడిన పిల్లలతోసహా) ప్రపంచంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తివలే పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయపరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నట్టు డేటాద్వారా తెలుస్తోంది.
అయితే దేశరాజ్యాంగం మాత్రం ఒకసోషలిస్టు విధానాన్ని స్థాపించేదిగా ఉంది.కానీ ఆర్ధిక విధానంమాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుతోంది.అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది.ఆర్ధిక విధానాలను రూపొందించే సమయంలో పాలకులు ఇలాంటి అంశాలపై దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు తయారుకు భలోపేతం చేసినవాళ్లం అవుతాం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్