అభివృద్ధి పేరుతో అప్పులు ఎవరి కోసం?
ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. అప్పుల భారతాన్ని, ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆ ఊబి నుంచి ఎవరు బయటపడేస్తారు? లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్టు? ఏ అభివృద్ధి పేరుతో ఎవరు తిన్నట్టు? ఎన్నో వనరులున్న భారతదేశ అభివ ృద్ధికి అప్పులు అవసరమా? అప్పులు చేసి అభివృద్ధి చేయాలా? లక్షల కోట్ల అప్పులున్న దేశాన్ని అభివ ృద్ధి చెందిన దేశంగా ఎలా శ్లాఘించగలం? అన్నీ ప్రశ్నలే..?
అభివృద్ధి పేరుతో జరిగిన లక్షల కోట్ల అప్పు కనిపిస్తోంది తప్ప అభివ ృద్ధి కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి అభివ ృద్ధి కనిపిస్తుంది? ఇన్నిన్ని కోట్ల అప్పు చేస్తే మిగిలిందేమిటీ? పేదలపాలిట కన్నీళ్లు.. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎవరికొరకు చేసారు? ఎందుకు చేసారు? అప్పుమూలంగా ఎవరు లాభపడ్డారు? అభివృద్ధి కనిపించదు. అప్పు కనిపిస్తుంది ఎందుకు?
అప్పు నిజం.. అభివ ృద్ధి అబద్ధం. ఇదీ మనదేశస్థితి… ఇదీ మన తెలంగాణ స్థితి. అన్నీ ఉండి అప్పులు చేసి.. అభివృద్ధి చేస్తామని గొప్పలు చేప్పుకోవటం ఇప్పటి ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ అభివ ృద్ధికి అప్పు చేసామంటే ఒక అర్థముంది. ఆ అభివృద్ధి కనిపించాలి. ఈ ప్రాజెక్టుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. అన్నీ ఉండి సరిపోయే ఆదాయముండి లక్షల కోట్లు అప్పు చూపిస్తే ప్రజలేమనుకుంటారు? అభివృద్ధి పేరుతో అప్పు తెచ్చి.. తమ ఆస్తులు పెంచుకున్నారని.. కోట్ల రూపాయలు దోచుకొని, దాచుకున్నారని భావిస్తారు. వాస్తవం కూడా ఇదే!
పాలకుల మీద రాజకీయ నాయకుల మీద నిందలు వేయటం సరదాకాదు. నిజానికి ప్రజలు పాలకులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా, ఆదర్శంగా, కడిగిన ముత్యంలా ఉండాలని భావిస్తారు. ‘’మేము ఓటువేసి గెలిపించాం కానీ దొంగైతేలిండు అని చెప్పుకోవటం ప్రజలకు కూడా అవమానమే. అభివృద్ధి పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతి గూర్చి నేను రాయటం, మీరు చెప్పటం కాదు, ‘రాజకీయ పక్షాలే ఒకరి నొకరు ‘నీవు దొంగ నీవు దొంగ’ అని తిట్టుకుం టున్నాయి. రాళ్లు వేసుకుంటున్నాయి. దేశంలోని అత్యున్నత నేర పరిశోధనా సంస్థ సీబీఐలోని ప్రధమ ద్వితీయ అధికారులే ఒకరినొకరు అవినీతి పరులని ఆడిపోసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం అప్పు యాబదివేల కోట్లు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో ఏడాది క్రితం తేలిన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల కోట్లు.. ఇప్పుడు పత్రికల కథనాల ప్రకారం రెండు లక్షల ముప్పది వేల కోట్ల అప్పు… ఇంత అప్పు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన అప్పు అభివ ృద్ధిలో కనిపించాలి. కనిపిస్తుందా? రెండు లక్షల ముప్పదివేల కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకు చేసినట్టు? తెలంగాణలో ఏఅభవృద్ధి కనిపిస్తుంది? అప్పులతో కూడిన అభివృద్ధి సంత ృప్తికలిగించదు. అభివృద్ధి కనిపించినా కొంత సంత ృప్తి కనిపిస్తుందేమో.‘అభివృద్దే’ కనిపించక పోతే…ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు కానీ, నూతన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల ముప్పదివేల కోట్లు. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? నాలుకోట్లని కొందరంటారు. మనిషికి.. అంటే తలకు ఎంత అప్పు? అరువదివేల అప్పు.. భయం వేయటం లేదూ..? తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తెచ్చుకొని.. మన రాష్ట్రాన్ని మనం పాలిస్తున్న తృప్తిలో రెండు లక్షల ముప్పదివేల కోట్ల అప్పు పెంచుకున్నాం. అవసరమా? అవసరమైన అప్పుగా భావించాలా? ఈ లెక్కలు ఇలా ఉండగా.. భారతదేశ అప్పు 50 లక్షల కోట్లు అని ఎక్కడో చదివింది జ్ఞాపకమొచ్చింది. నిజమా? అబద్దమా? లెక్క తేలటానికి అవకాశం లేదు. రకరకాల అప్పులుంటాయి కాబట్టి లెక్క తేలటం కష్టం.. సమాచార హక్కు క్రింద ఈ లెక్కలు యివ్వకపోవచ్చు.. రాష్ట్రాలు సంస్థలు.. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగం కాబట్టి లెక్క కష్టమే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘పరిశ్రమల’ పేరుతో ఉపాధి పేరుతో బిచ్చగాళ్లలాగా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎవరిచ్చారు అధికారం? అప్పుల పేరుతో అభివ ృద్ధి పేరుతో ఎవరు దోచుకున్నారు? ఎవరు సంపన్నులయ్యారు? అప్పులు లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. ఎవరు అభివృద్ధి చెందినట్టు? రాఫెల్ అవినీతిలో 30వేల కోట్ల అవినీతి ఉందని దేశం సంపద అనిల్ అంబానీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్ నేత రాహూల్ లెక్కలతో చెపుతున్నారు. బడా వ్యాపారులు బ్యాంకులను ముంచిన సొమ్ము పన్నెండు లక్షల కోట్లు. ఇట్టి డబ్బు ఏదో రూపంలో ప్రభుత్వం బ్యాంకులకు యివ్వాలి. ఒకవేళ బ్యాంకులను నింపకపోతే.. బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులకు నింపాలంటే ఎలా? ఘనమైన భారత సర్కారు అప్పు చేయవల్సిందే… లేకపోతే పన్నులు పెంచాలి.. లేకపోతే పెట్రోల్ డిజీల్‌పై మరో పది ఇరువది దోచుకోవాలి.. ఇదే భారతదేశ అభివృద్ధి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకయింది? దేశంలో ఉన్న 80శాతం పేద ప్రజలు, శ్రమజీవులు బాగుపడ్డారా? దేశం ప్రధాన ఉత్పత్తి, జీవనాధారం వ్యవసాయం. రైతులు బాగుపడ్డారా? ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేల మంది రైతులు అప్పులతో మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఏఅభివృద్ధికి ఈ అప్పులు? భారతదేశం ఎన్నో వనరులున్న దేశం.. ఎన్నో సంపదలున్న విశాల భారతదేశం. మానవశక్తి విపరీతంగా ఉన్న దేశం. డెబ్బది ఏండ్ల స్వాతంత్య్రంలో యాబది కోట్ల లక్షల అప్పు చేసిన ఘనత మన ప్రజాస్వామ్య పరిపాలకులది. ఆంగ్లేయ పాలకులు దేశ సంపదను దోచుకొని ఇంగ్లాడు పంపిస్తే.. మన స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి అభివ ృద్ధి పేరుతో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని విపరీతంగా పెంచారు. ఆర్థిక అసమానతలకు తెరదీసారు.
నిజానికి భారతదేశానికి 50 లక్షల కోట్లు అప్పు ఎందుకయ్యిందో అర్థం కాదు. ఏ అభివృద్ధి జరిగిందో అర్థం కాదు. ఉద్యోగాల కల్పన లేదు. కొత్త నిర్మాణాలు లేవు. ఎవరితో యుద్ధం లేదు. అందరూ జీతాలు రెట్టింపు చేసుకోవటం తప్ప కొత్త ఉద్యోగాలు లేవు. ఆదాయం విషయంలో గతం కంటే రెట్టింపు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రకరకాల ఆదాయం పెరిగింది. పెట్రోల్ డీజిల్ రెట్టింపు రేట్ల అమ్మకం ద్వారా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. పైగా కొత్తగా బొగ్గు, మైనింగ్ ద్వారా, ఇంటర్నెట్ సేవల మూలంగా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పన్నుల చట్టం జీఎస్టీ ఆదాయం ఉండనే ఉంది! మరి ఈ ఆదాయమంతా ఏమైనట్టు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయినట్టు? ప్రతి ఏటా ఇరువది లక్షల పైన బడ్జెట్? ఎవరు తింటున్నట్టు? తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే అన్నారు. తెలంగాణకు వనరులు న్నాయి. నదులున్నాయి. పచ్చని పొలాలున్నాయి. ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. లక్షకోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని అమిత్‌షా అన్నారు. రెండు లక్షల కోట్లకు అప్పు ఎందుకు పెరిగినట్టు?ఎవరు బోంచేసినట్టు?- – సిహెచ్.మధు