అపరా అనుభవసారం ఆదివాసీ ఆత్మగానం
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘‘ డాక్టర్ వి.ఎన్ .వి. కె, శాస్త్రి గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘ఆదివాసి ఆత్మగానం’ – డా. అమ్మిన శ్రీనివాసరాజు
గిరిజన జన జీవితాలను అత్యంత దగ్గరగా గమనించడమే కాక సుమారు 50సంవత్స రాల పాటు వారితో సహజీవత్వం చేసిన పరిశోధకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రచయిత, ముఖ్యంగా కేవలం గిరిజనుల గురించి అనేక పుస్తకాలు పరిశోధనాత్మకంగా వ్రాసిన వ్యక్తి, తెలుగు గిరిజన రచయిత లలో ప్రథమ స్థానంలో నిలిచేవారు, వారే అందరికీ డాక్టర్‌విఎన్.వి.కె,శాస్త్రిగా సుపరిచి తులైన ‘‘వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి’’ ఆయన ఇటీవల వెలువరించిన వ్యాససంపుట్టి ‘‘ఆదివాసి ఆత్మగానం’’ ఆదివాసి జీవన సంస్కృతులకు దర్పణం పడుతున్న ఈ వ్యాసవళిలో మొత్తం 34వ్యాసాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో మన గిరిజన బిడ్డలు పడుతున్న ఇక్కట్ల గురించి సహేతుకంగా వివరించే నేపథ్యంలో ఒకవైపు సంస్కృతి పరంగా, మరోపక్క పాలకులు చేస్తున్న దురాగతాలు, అలాగే వలస గిరిజనుల వల్ల కలుగుతున్న నష్టాలు అదేవిధంగా గిరిజనే తరులు, ప్రపంచీకరణ సాయంతో సాగు తున్న ఆధునిక అభివృద్ధివల్ల వాటిల్లుతున్న నష్టం గురిం చి రచయిత పారదర్శకంగా ఆలోచింప జేసే విధంగా ఈవ్యాస ప్రస్థా నం కొనసాగించారు. ఆనాటి మొగ లాల సాయంతో మన తెలుగు ప్రాంతానికి వచ్చిన బంజారాలు తమదైన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అష్ట కష్టాలు పడి దుర్భర జీవితాలు అనుభ వించిన వారు ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో సుగాలీలుగా తెలంగాణలో లంబాడాలుగా పేర్లు కలిగి గిరిజ న సామాజిక వర్గ సౌక ర్యాలు పొందుతున్న తీరును వివరిం చిన శాస్త్రిగారి వ్యాసంలో కేవలం వారి చరిత్ర జీవితం మాత్రమే ప్రస్తావించారు, వారివల్ల నిజమైన కొండల్లోని గిరిజన సామాజిక వర్గం వారికి జరుగుతున్న ఉపాధి ఉద్యోగ ఆర్థిక నష్టాల ప్రస్తావన లేదు.కానీ ఇదే వ్యాస సంపు టిలో ‘‘నకిలీ గిరిజన సర్టిఫికెట్ గాళ్లు’’ అనే మరో వ్యాసంలో ఆయన స్వీయ అనుభవంలోని విష యాలు ప్రస్తావించారు. సుమారు 50 సంవత్స రాల క్రితమే నకిలీ సర్టిఫికెట్లు పొంది వివిధ ఉద్యోగ హోదాల్లో ఉన్నవారు ప్రస్తుతం వారి పిల్లలకు సైతం అదే సర్టిఫికెట్లతో రిజర్వేషన్ సౌకర్యాలు అనుభవిస్తున్న వైనం ఇందులో పేర్కొంటూ నకిలీ గిరిజనులు ఏర్పడుతున్న తీరును, తెలిపి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గూర్చి మాత్రం అస్పష్టంగా ముగించారు. కోసం మెరుపుగా ఏజెన్సీ బయట నివసిస్తున్న గిరిజనులు ఏజెన్సీ గిరిజనులుగా నకిలీ సర్టిఫికెట్లు పొంది స్థానిక గిరిజన కోటాలో ఉద్యోగాలు పొందుతున్న వైనం, ప్రస్తావించిన శాస్త్రిగారు తనదైన పారదర్శకత చూపించే ప్రయత్నం చేశారు. ఆధునికత పేరుతో ఆవిర్భవించిన పర్యాటక రంగం వల్ల అడవి బిడ్డల సంస్కృతి ఎలా నాశనం అవుతుందో వివరించే వ్యాసంతో పాటు మాయమవుతున్న సాంప్రదాయ నాయకత్వం, గిరిజనేతరులైన వడ్డీ వ్యాపారులు, గిరిజనులను ఆర్థికంగా దోచుకుంటున్న వైనంతో పాటు ప్రస్తుతం ఆధునిక గిరిజన జనాభా పోడు వ్యవసాయం నుంచి కాఫీ తోటలు సాగు చేసే స్థాయి వరకు సాధించిన అభివృద్ధిని కూడా వ్యాస ర చయిత ఇందులో పేర్కొనడం అభినందనీయం.
ఇక గిరిజనులు అంటేనే సాంస్కృతి సాంప్రదాయాల వారసులుగా చెప్పుకుంటాం. అంతేకాక వారిలో అబ్బురపరిచే జీవన సంస్కృతి ఆగుపిస్తుంది ఈ వ్యాస సంపుటలో ఈ కోవకు చెందిన వ్యాసాలు కూడా మనం చదివే వీలు కల్పించారు. గోండు గిరిజనుల సలహాదారులైన ‘‘ప్రధానులు’’ అనే గిరిజన ఉపతెగ ప్రస్థానంతో పాటు,యానాదులు కొండరెడ్లు చెంచులు రాచకోయలు గుండులు తదితర గిరిజన జాతుల వారి జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విశేషమైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి, మనం అంతా గోండులు అని వ్యవహరిస్తున్న వారు గోండ్లు కాదు కోయత్తుర్లు అనే సహేతుక విశ్లేషణ కూడా వ్యాస రచయిత ఇందులో చేశారు.ప్రస్తుత గిరిజన సాహిత్యంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న విషయం’’ గిరిజన చట్టాలు’’ వీటికి సంబంధించిన విలువైన సమాచారయుతమైన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు, ఉమ్మడి అటవీ యాజమాన్య చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం గురించిన ఎంతో ఉపయుక్త సమాచారం ఇందులో వివరించబడిరది. అలాగే గిరిజన యువతలో విద్యావంతులతో పాటు పెరుగుతున్న నిరుద్యోగిత గురించి కూడా వివరిస్తూనే గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన లేని తీరు, భాష అంతరిస్తే జరిగే పరిణామాలు గిరిజన పాఠశాలల సంఖ్య తో పాటు పెరగాల్సిన సౌకర్యాలు గురించిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవస్థాగత లోపాల కారణంగా గిరిజన అక్షరాస్యత దేశవ్యాప్తంగా 58.96% మాత్రమే కాగ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే గణాంకాలు ఉన్నట్లు చెబుతూ.. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన అక్షరాస్యత ఆశించినంత ఎక్కువగా లేదనే అభిప్రాయం వెల్లడి చేశారు. అంతేకాక గిరిజన స్త్రీ అక్షరాస్యత 40% మాత్రమే ఉండటం మరింత అన్యాయంగా వ్యాసకర్త అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన జన జాతుల్లో ఒకటైన ‘‘సవర’’ తెగ గురించిన సంపూర్ణ వివరణలో భాగంగా చిత్రకళలో వారి నైపుణ్యాన్ని వారు ఇచ్చే ప్రాధాన్యతల గురించి ఎంతో ఆసక్తిగా విశేషంగా వివరించారు ‘‘ఇడి సింగ్ లేని ఇల్లుండదు’’ వ్యాసంలో. ఇలా ఈ 34 వ్యాసాలు వేటికవి ప్రత్యేకతలు కలిగి ఆసక్తి విశేషాలతో కూడిన విలువైన సమాచారం నిండి ఉన్నాయి. వ్యాసాలు అనగానే పాఠకుల దృష్టి అదో గణాంకాల సమూహం, అనే సాధారణ అభిప్రాయం ఉంటుంది కానీ ఈ వ్యాసాల రచయిత ఒక పరిశోధకుడు మాత్రమే కాక అర్థశతాబ్దం పాటు అచ్చంగా గిరిజనులతోనూ వారు నివసించే ప్రాంతాల లోను అత్యంత దగ్గర సంబంధాలతో నివసించిన వ్యక్తి అలాగే 1980 దశకంలో గోండు గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే లండన్ విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ఆచార్యుడు, గిరిజన పరిశోధకుడు, నైజాం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, అయిన ‘‘హేమన్ డార్ప్’’ తో డాక్టర్ శాస్త్రి ప్రత్యక్ష పరిచయం, వారి పర్యటనల్లో భాగస్వామి కూడా అయిన అనుభవాల సారం తదితర ప్రత్యేక అర్హతలు గల ఈ వ్యాసర చయిత కలం నుంచి జాలువారిన ఈ అన్ని వ్యాసాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయి. వ్యాసాలు అన్నీ సాధారణ నిడివి అత్యంత సరళమైన భాష ఆసక్తిని పెంచే అనుభవ సంఘటనలు, తదితరాల మేళవింపుతో ఈ వ్యాస సంపుటి విలువ మరింతగా పెరిగింది, కేవలం గిరిజన జీవన విధానం, చరిత్ర, సంస్కృతి,తో పాటుగా పరిశోధనలకు అవసరమైన ప్రామాణిక విషయా లు గణాంకాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు పరిశోధకులు విధిగా చదవాల్సిన వ్యాసావళి ఇది.
ఆదివాసి ఆత్మగౌరవం… వ్యాసకర్త: డాక్టర్ వి ఎన్ వి కె శాస్త్రి, పేజీలు: 152, వెల: రూ 90/-ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలు. ఫోను: 040 – 27665420. సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:7729883223.