అన్నపురాజులు ఒకచోట..ఆకలి మంటలు ఒకచోట
అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒక చోట.. అలసిన దేహాలు ఒకచోట..సంపద అంతా ఒకచోట.. గంపెడు బలగం ఒకచోట..’ అంటూ కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అసమానతలపై ధర్మాగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. నేటికీ అవి పెచ్చుమీరుతూనే ఉన్నాయి. అనంతపురం కలెక్టరేట్‌కు సమీపంలోనే దళిత మహిళ అంజలి ఆకలితో అలమటిస్తూ.. కన్నుమూసింది. మరోవైపు భారత్ బ్రిటీష్ రాజ్ నుంచి బిలియనీర్ రాజ్‌గా మారిందని ప్రపంచ అసమానతల ల్యాబ్ నివేదిక ఎత్తిచూపింది.
ప్రభుత్వ ఆదాయమంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకే ఖర్చు చేసెస్తున్నా యని,ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారని కార్పొ రేట్,మీడియాలో ప్రచారం నిత్యం హోరెత్తి పోతూ నే ఉంది. మీడియాలో సింహభాగాన్ని ఆక్రమించిన గోడీ మీడియా సంగతి ఇక చెప్పనక్కరేలేదు. మద్యా నికి బానిసై వేధించుకుతినే భర్త, తిండి లేక అలమ టిస్తూ అడుక్కుంటున్న ముగ్గురు బిడ్డలు,రోజుల తరబడి ఆహారం లేక బక్కచిక్కి ఆకలితో మరణిం చిన అంజలి ఉదంతం.ఆ ప్రచారంలోనూ,నేటి సంక్షేమ పథకాల అమలులోనూ ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.అంజలి, ఆమె పిల్లలకు ఆధార్ కార్డే లేదు. ఇంటింటికీ సంక్షేమ పథకాలంది స్తున్నా మంటున్న ప్రభుత్వాలకు, అధికారులకు, వాలంటీర్ల కు ఇల్లేలేని ఆమె కనిపించనేలేదు. కనీసం బియ్యం అందినా అంజలి ప్రాణం నిలబడేదని చెబుతున్న స్థానికుల మాటలు చేదు నిజాలను కళ్లముందుంచు తున్నాయి.77ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో..మరీ ముఖ్యంగా2000నుంచీ విపరీతంగా పెరిగి పోయి న ఆర్థిక అసమానతలు పేదల ఆకలిచావు లకు, రైతుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నాయి. 15 కోట్ల మంది నిరుపేదలు ఒక్కపూట తిండికోసం అల్లాడుతున్నారని తాజా నివేదిక ఎత్తిచూపింది. 144 కోట్ల మంది ప్రజలు నా అక్కచెల్లెల్లు, అన్నద మ్ములు అని నిత్యం ప్రధాని మోడీ వల్లెవేస్తుండగానే ప్రపంచ ఆకలి సూచీలో 125దేశాలకుగాను అట్ట డుగున111వ స్థానానికి మనదేశం దిగజా రింది. 2015 నుంచి పురోగతి శూన్యమని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తేల్చిచెప్పింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 38శాతం మంది పోషకా హార లోపంతో బాధపడుతున్నారు.ఇబ్బడిము బ్బడి గా పెరుగుతున్న కార్పొరేట్ల ఆదాయం, వారి దురాశే పేదరికాన్నిరోజురోజుకూ వృద్ధి చేస్తోందని ఆక్స్ ఫామ్ తేల్చిచెప్పింది.1947నుంచి 80 వరకూ అస మానతలు తగ్గుముఖం పట్టగా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో అసమానతలు పెరి గాయి. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద కేంద్రీకరణ మరింత పెరిగి పోయింది.1951లో 11.5శాతం జాతీయాదా యం మాత్రమే వారి చేతుల్లో ఉండేది. 10 శాతం సంపన్నుల చేతిలో1951లో 36.7శాతం సంపద ఉండగా,2022నాటికి57.7శాతానికి పెరిగి పోయింది. అంతేలే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు పేదలబతుకులు రోజురోజుకూ తీసికట్టుగా మారి పోతున్నాయి.దిగువన ఉన్న 50శాతం మంది ఆదాయం 1951లో20.6శాతం ఉండగా, 2022 నాటికి 15శాతానికి పడిపోయింది. జనాభాలో దాదాపు 40శాతంగా ఉన్న మధ్యతరగతి ఆదా యం కూడా 42.8 శాతం నుంచి 27.3 శాతానికి తగ్గిపోయింది.2022లో మనదేశ జాతీయాదాయం లో 22.6 శాతం, 40.10శాతం ఆస్తి ఒకశాతం సంపన్నుల చేతిలో ఉంది.1991లో ఒకే ఒక శత కోటీశ్వరుడు ఉంటే 2022 నాటికి 162కి పెరిగి పోయింది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలోనూ ప్రభుత్వ పెట్టుబడులు సగటు భారతీయుల స్థితిగతులను మార్చేకన్నా సంపన్నులకు కట్టబెట్టేందుకు దోహదం చేస్తున్న దుస్థితిని నివేదిక ఎత్తిచూపింది.
‘ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అనుమతిస్తే, ప్రపంచానికి ఆహార నిల్వలను అందిం చేందుకు భారత్ సిద్ధం’.గత ఏప్రిల్‌లో గుజరాత్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భా టంగా చేసిన ప్రకటన ఇది. ప్రధాని అలా చెప్పారో లేదో.. ప్రపంచానికి భారత్ అన్నపూర్ణగా మారి పోయిందంటూ కమలశ్రేణులు గప్పాలు కొట్టాయి. అయితే,భారత్‌లో ఆహార సంక్షోభం, పోషకాహార లోపం, శిశు మరణాల రేటు ప్రమాదకరస్థాయికి చేరిం దంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ దారుణమైన స్థితికి పడిపోయింది. ఎంతలా అంటే.. కటిక పేద దేశాలుగా పరిగణించే సూడాన్, రువాం డా,నైజీరియా,ఇథియోపియా,రిపబ్లిక్ ఆఫ్ కాంగోతోపాటు యుద్ధంతో కకావికలమై, తినడానికి గింజలు లేక అల్లాడుతున్న ఉక్రెయిన్ కంటే కూడా హీనమైన ర్యాంకును నమోదు చేసింది.మోదీ 10ఏండ్ల పాలనలో ఆకలిసూచీలో భారత్.. ఏకం గా 52 స్థానాలను కోల్పోయింది.
దారుణమైన పరిస్థితి
వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్‌ఐ)లో భారత్ స్థానం మరింతగా దిగజారింది.2022 సంవత్సరానికిగానూ మొత్తం 121దేశాలను పరిగణలోకి తీసుకొంటే 29.1 హంగర్ స్కోరుతో భారత్ 107వస్థానంలో నిలిచింది. గత కొంత కాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియో పియా,రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ (36) తో పోలిస్తే భారత్ దారుణమైన ర్యాంకుకు పడి పోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్ వరల్డ్‌వైడ్, వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు శనివారం సంయుక్తంగా ప్రచురించాయి. భారత్‌లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని హెచ్చరించాయి. సూచీలో చైనా, కువైట్, టర్కీ సహా 17దేశాలు 5కంటే తక్కువ స్కోర్‌తో అగ్ర స్థానంలో నిలిచాయి.ఎంతదారుణమంటే.. దక్షిణా సియాలోని అన్ని దేశాలకంటే కూడా దిగువ స్థానా నికి భారత్ చేరుకొన్నది.
మోదీ నిర్వాకం ఇది
పైకి ఉత్తుత్తి మాటలు చెప్పాలంటే మోదీ ఆయన వందిమాగధ జనం ఎంత పెప్ప మన్నా చెప్తారు. కానీ..మోదీ ఆయన మంత్రిగ ణానికి ఎలాంటి దూరదృష్టి కానీ, దార్శనికత కానీ సున్నాశాతం కూడా లేదు.ముఖ్యంగా ఆహార భద్రత విషయంలో ఎంతమాత్రం ప్రణాళిక లేదు. దేశం లో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటాయి. మరో వైపు ఏరాష్ట్రంలోనైనా రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే..తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలఆహారభద్రత హక్కును పణంగా పెడతారు.
పండిన ధాన్యాన్ని కొనరు. ఇదేమయ్యా అంటే.. ఓప్‌ా మాదగ్గర నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని చెప్తారు. ధాన్యం బాగా పండుతున్నప్పుడు నిల్వల సామర్థ్యాన్ని పెంచవచ్చు కదా అంటీ అదీ చేయరు. ఉన్న నిల్వలను పేదలకు పంచాలి కదా..అంటే అదీ చేయరు.ధాన్యం నిల్వల నిర్వహణకు ఒక విధానమంటూ ఉండదు. బోలెడు నిల్వలు ఉన్నయనిచెప్పి నాలుగైదు నెలలైనా కాలేదు. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు నిండుకున్నయి. లబోదిబోమంటూ..గోధుమలు,బియ్యం, నూకలు.. ఇలా అన్నింటి దిగుమతులపైనా నిషేధం విధిం చారు.ఓపక్క పండిరచడానికి రైతుసిద్ధంగా ఉన్న ప్పటికీ అతనికి మోదీ సర్కారు నుంచి మద్దతు కొరవడిరది సరికదా.. వ్యవసాయాన్నే దారుణంగా దెబ్బతీసే దిశగా మోదీ దుందుడుకు విధానాలు సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే.. ఎగుమతులపై నిషేధం విధించటమే ఆలస్యం..దేశంలోని గోధు మల్లో సింహభాగం ముకేశ్ అబానీ కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.ఇదొక్క నిదర్శనం చాల దా మోదీ దర్శనం కార్పొరేట్ల కోసమేనని చెప్ప డానికి..
ఏమిటీ సర్వే? నిర్వహించేదెవరు?
ప్రపంచదేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయి లు, పిల్లల్లో పోషకాహారలోపం,శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని జీహె చ్‌ఐ వార్షిక నివేదికను ఐర్లాండ్‌కు చెందిన కన్‌సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్ సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాలి.
భారత్ ఖండిస్తుందని ముందే తెలిసి..
ఆకలి సూచీలో కిందటేడాది116 దేశా ల్లో భారత్ 101స్థానంలో నిలిచింది.అయితే అప్పు డు కేంద్రం ఈ నివేదికను తప్పుబట్టింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదనని నివేదికను ఖండిరచింది. ఈ క్రమంలో నివేదికను వెలువరించే సమయం లోనే సదరు సంస్థలు ప్రత్యేక వివరణ ఇచ్చాయి. ప్రధాని మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో జీహెచ్‌ఐలో భారత్ స్కోరు దారుణంగా పతన మైంది. చిన్నారుల్లో కనిపిస్త్తున్న పోషకాహార లోపం, ఆకలి, ఎదుగుదల లోపం, కుంగుబాటు వంటివాటి పై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. దేశంలో 22.4కోట్ల మంది ప్రజలు పోష కాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి సూచీ లో భారత దాదాపు అట్టడుగు స్థానానికి చేరు కొన్నది.
బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వా నికి మధ్య సంబంధాలు పెరిగిపోవడాన్ని,ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశ పాలనకు దారితీస్తుందని హెచ్చరించింది. హిందూ మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్ క్యాపిటల్ కలిసి దేశాన్ని లూటీ చేసిన పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్తలు థామస్ పికెట్టి, లూకాస్ ఛాన్సెల్,నితిన్‌కుమార్ భారతి,అన్మోల్ సోమంచి తదితరులు రూపొందించిన ఈ నివేదిక ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టాయి. తాజాగా ఎన్నికల బాండ్ల విషయంలోనూ మోడీసర్కారుకు,కార్పొ రేట్లకు ఉన్న అనుబంధాన్ని తేటతెల్లం చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ, కార్పొరేట్ రాజ్‌ను మట్టికరిపించాలి.అందుకు ఉక్కు సంకల్పం తీసుకోవాలి.- (వ్యాసకర్త : ఇండిపెండెంట్ సీనియర్ పాత్రికేయులు`న్యూఢల్లీి)