అనుకున్నంతగా..వానల్లేవు
వేసవిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే వానాకాలం సీజన్ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయడంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల రాక కోసం తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
స్తారు నుంచి భారీవర్షాలు లేక కంది,సోయా, మిర్చి,వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశిం చిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏడాది రాష్ట్రంలోదాదాపు50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసా యశాఖ అంచనా వేసింది.కాని వర్షాలు ముఖం చాయే టడంతో అడపదడపావాన లకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు. ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తినాటేం దుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.సాధారణం గా ఏటావర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షా లతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు.వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తివిత్తనాలు నాటారు. అయితే జూన్ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సి నంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురు ముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకె త్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంట లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతే డాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారంవచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్ నెలతలో 144.1మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కేవలం 66.9 మి.మీ. వర్ష పాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది.దాదాపు 77.2మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్క లు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకు నేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది.కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశ లోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయి లో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతు లు చెబుతున్నారు.
ఏ పంట..ఎప్పుడు వేసుకోవాలంటే!
వ్యవసాయ సీజన్ ప్రారంభమవు తున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవు తున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవా లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒకరకమే సాగు చేస్తూ అన్న దాతలు నష్టపోతు న్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవ డంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడుసాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? అనే అంశాలపై నిపుణుల
సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది.జూన్ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి.మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు.కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంటసాగు చేసిన 30రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.30రోజులు గడిచిన తర్వాత దాని ప్రభా వం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరివారం నుంచి ఆగస్ట్ లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది.జూన్ లో మొక్కజొన్న సాగు చేయడంవల్ల పంటకాలం 30రోజులుదాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు.ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది.రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర :పెసర పంట కాలం 60నుంచి 75 రోజులు ఉంటుంది.జూన్ 15నుంచి జూలై 15లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండ డంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉం టుంది.జూన్ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది.రబీలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 30లోపు సాగు చేయాలి నవంబర్ 20 నుంచి జనవరి 15వరకు పంట చేతికొస్తుంది. పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర లేకపోవ డంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ల రేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వా త పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్ 20 నుంచి జూలై 20వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చుపురుగులు ఉధృతితక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసు కోవాలి. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయ డం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు.నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్, మొక్కజొన్న సాగు చేయడంవల్ల అధికలాభాలు సాధించవచ్చు. సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్ 20 నుంచి జూలై 10వరకు సాగు చేయాలి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ,మూడో పంటగా వేసవి లో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్‌లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసు కోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది.అక్టోబర్ 31నుంచి నవంబర్ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్ 20 నుంచి జులై 10లోపు పోసుకోవాలి. పంటకాలం125 నుంచి 135 రోజులు. నవంబర్ 5నుంచి 25లోపు పంట చేతికొస్తుంది. వానకా లంలో సాగుచేసిన పంటసకాలంలో చేతికి రావ డంతో నవంబర్‌లో వేసవి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమౌతున్నది.ఏప్రిల్‌లో వడ గండ్ల వర్షాలకు వేసవిలో సాగుచేసిన వరి నష్టపో వాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్ 20 నుంచి అక్టోబర్15లోపు సాగుచేయాలి.మధ్య కాలిక రకాలను జూన్ 20నుంచి జూలై 10లోపు సాగు చేయాలి. అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి.ఏపంటలను ఎప్పుడు సాగు చేయాల నేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకో వాలి.కాలానుగుణంగా సాగుచేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది.ఏ పంటలను సాగు చేయా లన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తిం పు పొందిన డీలర్ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
ఖరీఫ్ సన్నద్ధత ఏదీ?
ఈమారు తొలకరి పలకరింపు ఆలస్య మైంది. జూన్ మూడవవారానికీ వర్షాల్లేక ఏరు వాక కదల్లేదు. ఖరీఫ్ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది.తుపాన్లు,వరదలు,అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్ రైతుల ఉసురు తీశా యి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడలేదు. ఆ ప్రాం తం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రత లు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61శాతానికిపైన తక్కువ పడిరది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి.ఎ.పి.లో 679 మండ లాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడిరది. 11 మండలాల్లో చినుకు లేదు.
మో91మండలాల్లో మాత్రమే నార్మల్, అంతకంటే కొంచెం వర్షం కురిసింది.ఈగణాం కాలు ప్రభుత్వానివి.క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్ కీలకమైనది కాగా రానురా ను రైతులకు సీజన్ భారంగా కష్టం గా తయారైం దని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదు న్నర లక్షలఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల -ఎకరాల్లో పంట ల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండ టంతో నిర్ణయించుకునే నార్మల్ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి.ఉదాహరణకు నిరుడు ఖరీఫ్ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్స రంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగుతున్నా యి. ధాన్యాగారాలైన గోదావరి,కృష్ణా,పెన్నా డెల్టా లలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షి యల్ క్రాప్స్ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏపంట వేసినా పెట్టు బడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతు లకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయా లంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగు నీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపించారు. ఇండెంట్ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు.నిరుడు నకిలీ, కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్ మొదలుకాక ముందే చాలాచోట్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత.పురుగు మందుల అక్ర మాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫ రాలో అస్తవ్య స్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్ బీమా ఇంకా అంద లేదు. అకాలవర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు.పి.ఎంకిసాన్ జాడ లేదు. కేలం డర్ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతు న్నామం టున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మ తుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతు న్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది.ఏర్పాట్లు లేకుం డా ఖరీఫ్ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.
–వ్యాసకర్త : కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి-(దొంగరి నరేశ్)