అనివార్యంగా వాతావరణ సంక్షోభం..!
సీజన్‌తో సంబంధం లేకుండా తుపాన్లు సంభవిస్తున్నాయి.ఎండాకాలం ముగిసినా..హీట్ వేవ్స్ వెంటాడుతూనే ఉంటున్నాయి.శీతాకాలంలో..చలితీవ్రత ఊహించనిస్థాయికి పెరిగి పోతుంది. వర్షా కాలంలోకుండపోత వానలతో వరదలు పోటెతున్నాయి.హిమాలయాల్లాంటి ప్రాంతాల్లో మంచు ఫలకాలు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతాయి.అంతకుముందెన్నడూ చూడని జలప్రళయం సంభ విస్తుంది.నానాటికీ భూతాపం పెరిగిపోయి..భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారి పోతుం దని,మానవాళి చాలాడేంజర్‌లో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు.
ఈ ఏడాదిజూన్28,జూలై15,19,ఆగస్టు3,29,సెప్టెంబర్5,13,23తేదీల్లో బంగా ళాఖాతంలో ఏర్పడిన వరస అల్పడీనాలు కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే..ఈఏడాది సెప్టెంబర్ నాటికే ఎనిమిదిసార్లు అల్పపీడనాలు తూర్పుతీరాన్ని భయపెట్టించాయి.వాతావరణం మార్పులు, భూతాపంవల్ల మహాసముద్రాలు వేడెక్కితున్నాయని,వర్షపాతంలో అసాధారణ పరిస్ధితులు సంభ విస్తున్నాయనడానికి సాక్షీభూతమే..ఈఏడాది నైరుతి సీజన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. రుతు పవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా,వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంటవెంటనే ఏర్పడటం,తీవ్రరూపం దాల్చి తుఫాన్లుగా మారడం,కుంభవృష్టి కురిపించ డాన్ని అసాధారణంగా విశ్లేషిస్తున్నారు.
లానినో,పసిఫిక్ పరిణామాలుతోడై..బంగాళాఖాతంలో అల్పపీడనాలు సంఖ్య,వాటి తీవ్రత పెరుగుతోంది.తదుపరి భారీవర్షాలు కురుస్తుండటంతో తీరప్రాంతంలోనే కాదు..మధ్య,ఉత్తర భారతం వరకూ అధికశాతం జనాభా ప్రభావితమవుతోంది.విజయవాడ,ఖమ్మంప్రాంతాల్లో ఇటీవల కుంభ వృష్టిక కూడా ఇక్కడి పరిస్థితులే కారణం.సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువే. ఈసారి వాటకి లానినో ప్రభావం తోడైంది.పశ్చిమ పసిఫిక్‌మహాసముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్లు తూర్పు,ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం,కంబోడియా,ధాయ్‌లాండ్ మీదుగా పయనించి బలహీన పడుతున్నాయి.ఈసీజన్‌లో ఇప్పటికే ఎనిమిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి.అందులో ఐదు వాయు గుండాలుగాబలపడి,తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
అల్పాపీడనాలు తీరం దాటినా అదే తీవ్రత సంభవిస్తోంది.భూతాపం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్‌ఎస్‌టీ)పెరిగి,తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.అవి తీరానికి చేరువగా వచ్చే సరికి తీవ్రత పెరుగుతోంది.మరోవైపు వారా నికో అల్పపీడనం రావడంతో నేలలో తేమశాతం పెరుగుతోంది.ఈ కారణంగా అల్పపీడనం సముద్రతీరం దాటి,భూభాగంపైకి వచ్చినా బలహీన పడట్లేదు.ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణం గానే దేశ పశ్చిమ,వాయువ్య ప్రాంతాలైన గుజరాత్,రాజస్థాన్ వరకూ పయనించాయి.ఒడిశా, రaార్ఖండ్,తెలంగాణ,మధ్యప్రదేశ్,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో భారీవర్షాలకు కారణమయ్యాయి.
గతంలో అండమాన్ దీవులవద్ద తుఫాన్లు ఏర్పడితే,పశ్చిమ దిశగా నెల్లూరు,వాయవ్యంగా కోల్‌కతా వైపు పయనించేవి.కొన్నాళ్లుగా వాటి గమనం మారుతోంది.తీరాలు కోతకు గురికావడంతో తుఫాన్ తీరాన్నితాకే ప్రాంతాలు మారిపోతున్నాయి.తీరంవైపు వెళ్తున్నట్లే కనిపించిన తుఫాన్లు, సముద్రంలోనే దిశ మార్చు కుంటున్నాయి.లేదా ఆకస్మాత్తుగా తీవ్రమవుతున్నాయి.భూతాపం,తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుఫాన్ల ఉధ్దృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గ్లోబుల్ వార్మింగ్ పరిరక్షణకు అంతర్జాతీయంగా సహకరించుకోవాలి.ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన యాగి తుఫాను మయన్మార్ వద్ద బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిరది.దీని ప్రభావంతో ఉత్తర భారతదేశ:లో భారీ వర్షాలు కురిశాయి. ఇది అంచనాలకు అందనిది.ప్రస్తుతం పసిఫిక్,హిందూ,అట్లాంటిక్ మహాసముద్రాల్లోని పరిస్థితులను జపాన్,భారత్, అమెరికాలు పర్యవేక్షిస్తున్నాయి.ఈదేశాలు కలసి కట్టుగా వీటిపై పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్