అడవి బిడ్డల బ్రతుకు చిత్రం అనంత యానం
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ గుమ్మడి లక్ష్మీనారాయణ’’ కలం నుంచి జాలువారిన ‘‘ అనంత యానం ’’ అనే పుస్తకంపై సమీక్ష –డా. అమ్మిన శ్రీనివాసరాజు
అడవి బిడ్డల బ్రతుకుచిత్రం అనంతయానం నేటి ఆధునిక తెలుగు సాహిత్యంలో అంత ర్భాగం అవు తున్న గిరిజన సాహిత్యం ప్రారం భంలో మౌఖికంగా తర్వాత కాలంలో ఆంత్రోపాలజిలో ఒక భాగంగా ఉండేది అనంతర కాలంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలకు ఎంతో ప్రధాన వస్తువుగా ఉన్న ఈ గిరిజన సాహిత్యం నేడు ఎంతో పరిణితి చెంది ప్రామాణిక దశకు చేరుకుంది. ప్రభుత్వాల లక్ష్య శుద్ధి తో గిరిజన యువతలో అక్షరాస్యత శాతం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉద్యోగులుగా రచయితలుగా ఎదుగు తున్న శుభ తరుణం ఇది. అందులో భాగం గానే ఆదివాసి తొలి వ్యాసకర్తగా చరిత్రలో నిలిచిన ఆధ్యాపక రచయిత గుమ్మడి లక్ష్మీ నారాయణ కలం నుంచి వెలువడిన వ్యాస సంపుటి ఈ ‘‘అనంతయానం’’
సుమారు పాతికేళ్లపాటు ఆయన చేసిన అక్షర ప్రస్థానంలో అనేక ప్రామాణిక వ్యాసాలు వెలు వడ్డాయి,ఇవి అడవిబిడ్డలచరిత్ర,సంస్కృతి, సమకాలీన సమస్యలు,విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాలు,సామాజిక జీవన పోరాటాలు,ఆధ్యా త్మిక సంబరాలు,తదితర అంశాలుగా విభజిం చబడి కూలం కశంగా సవివరమైన ప్రామా ణిక గణాంకాలతో పొందు పరచబడ్డాయి. ఇటు సమాచారానికి అటు పరిశోధనలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈగిరిజన వ్యాస రత్నాలన్నిటిని ఒకచోట రాసి పోసి అందించి నట్టు పుస్తక రూపంలో వెలువరించిన వ్యాస రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణగారి అక్షర కృషి అభినందనీయం ఆచరణీయం.నిరంతర పరిశీలన అధ్యయనంద్వారా తన జాతి జనుల అభివృద్ధి కోసం రచనల పరంగా గుమ్మడి గారి కృషిలో ఆవేదన అడుగడుగునా అర్పి స్తుంది,తన జాతికి చెందిన మరుగునపడ్డ వీరుల వివరాలు గురించి గతంలో వివరిం చిన ఈరచయిత ఇప్పుడు అదే బాణిలో తన జాతి సంస్కృతిలోని చరిత్ర పుటలు తిరగేస్తూ అనేక ఆసక్తికర విషయాలు ఆవిష్కరించారు.
ఇప్ప చెట్టుకు,పచ్చబొట్టుకు,అడవి బిడ్డలతో గల అనుబంధం గురించి ఇందులో ఎంతో శాస్త్రీయంగా చారిత్రకంగా తెలిపారు.వారి పెళ్లిళ్లలోని నిరాడంబరత సంస్కృతిని ప్రతిబిం బించే నృత్యం సొగసులు గురించి చెబుతూ ఆదిమ గిరిజనులు అంటే ఆదివాసీలే అని సూత్రీకరించారు,అంతటితో ఆగకుండా అడవి బిడ్డలను ఆత్మ గౌరవ ప్రతీకలు అని నిరూ పించారు.
ఇంతటి ప్రాధాన్యత గల ఈ ఆదివాసీలు నాటి నిజాం కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ప్రభు త్వాల దాకా ఎదుర్కొన్న బాధల గురించి వివరించారు. అంతేగాక ఆదరణ కోల్పోతున్న ఆదివాసి వైవిధ్యం గురించి కూడా చర్చించారు.ఆదివాసుల భూసంరక్షణ కోసం ప్రతిష్టా త్మకంగా ఏర్పాటు చేసిన 1/70 చట్టంకు సంబంధించిన పూర్వ చరిత్ర దాని నిర్మాణం అనంతర కాలంలో దాని అమలులో అధికా రులు,గిరిజనేతరులు చేస్తున్న కుతం త్రాల కారణంగా చట్టం వల్ల ఆదివా సులకు జరుగు తున్న నష్టం అరణ్య రోదనగా అభివర్ణి స్తూ అధికారులను ఆలోచింపజేశారు.అలాగే అటవీ హక్కుల చట్టం,పెసా,గిర్‌గ్లాని,నివేదిక లు తదితర అంశాల గురించి వివరించిన విషయాలవల్ల వ్యాస రచయిత పరిశీలన, ఆవేదన,కూలంకషంగా అర్థమవుతాయి. బహుళ ప్రజాదరణ పొందిన గిరిజన చట్టాల వివరణతో పాటు అంతగా ప్రాచుర్యం పొందని ‘1960చట్టం’వివరణతో అమాయక గిరిజనులు వడ్డీవ్యాపారుల బారినపడ కుండా ఎలా రక్షణ కలిగిస్తుందో దీనిలో వివరిస్తూ ఏజెన్సీలో రెడ్డి వ్యాపారుల అక్రమాలు గురిం చిన వివరణ తెలిపారు వ్యాసకర్త. అలాగే పోలవరం నిర్వాసితుల గోడు గురించి చెబుతూనే గిరిజనుల అభివృద్ధి కోసం విడు దల చేస్తున్న నిధులకు అవినీతి చెదలు ఎలా పడుతున్నాయో వివరిస్తూ స్వయం పాలన, రాజకీయ చైతన్యం,గిరిజనుల రాజ్యాంగ రక్షణలు,ఐదవ షెడ్యూల్,గురించిన వివరణతో పాటు ఆదివాసీల స్వయం పాలనకు‘‘పెసా చట్టం’’ఎలా ఉపకరిస్తుందో తగు వివరణ అందించారు. ఇంద్రవెల్లి సంఘటనను గోండులకు మాయని గాయంగా గుర్తుచేస్తూనే అడవి బిడ్డల హక్కుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రవృక్షంగా,విప్ప చెట్టును ప్రక టించాలనే డిమాండ్ గట్టిగానే వినిపించారు. ఇక అడవి బిడ్డల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే,నాగోబా,వంటి కుల దేవతల గురించే గాక సమ్మక్క సారక్క గుండం రామక్క, జంగుబాయి,ముసలమ్మ,వంటి వీరవనితల ప్రస్తావన తీసుకువచ్చారు,కోయిల మాఘ పున్నమి గోవులు దండారి పాండవుల ఏడు బావుల జలపాతం గురించి వివరణ చేస్తూనే అసలు ఆదివాసీలది ఏమతం? అనే ప్రశ్నను వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
నేటి ఆధునిక గిరిజన సమాజంకు అందుతున్న విద్యా ఉద్యోగ ఆరోగ్యం గురించిన వ్యాసపరం పరలో రచయిత ఆవేదన అర్థమవుతుంది, ఏజెన్సీలో నిర్వహించబడుతున్న విద్యా విధా నం అంతరించిపోతున్న ఆదిమ భాషలో వాటిని కాపాడాల్సిన బాధ్యతలు గిరిజనులకు మాతృభాషలో విద్యాభ్యాసం అందించాల్సిన అవసరం ఆన్లైన్ విద్యద్వారా సమాచార వ్యవస్థకు అల్లంత దూరాన ఉండే ఆదివాసీ సమాజానికి జరుగుతున్న నష్టాలను సహేతు కంగా వ్యాస రచయిత అందించారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతున్నప్పటికీ అది అసలైన ఆదివాసీల దరి చేరడం లేదనే విషయాన్ని కూడా సవివరమైన గణాంకాలతో వివరంగా అందించారు, ప్రభుత్వాలు,రాజకీయ పక్షాలు, ఆదివాసీల హక్కులకు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించే శక్తులను గురించి రక్షణ కల్పిం చాల్సిన తక్షణ కర్తవ్యాన్ని గుమ్మడి తన వ్యాసాక్షరాల గుండా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే గిరిజన జాతులపై జరిగిన జరుగుతున్న దాడులు సామూహిక హత్యల గురించి సభ్య సమాజానికి కూడా తెలియడం లేదని ఇలాంటి దాడులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరాన్ని పాలకులకు హెచ్చరిక వంటి సందేశాన్ని ఇందులో ఉటంకించారు, వాస్తవానికి అతి ప్రాచీన కాలానికి చెందిన ఆదిమ జాతులైన ఆదివాసీలను ప్రామాణి కంగా చారిత్రకంగా గుర్తించలేదని కేవలం వారిలోని నిరక్షరాస్యత కారణంగా వారి ఉత్కృష్టమైన చరిత్ర సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి, కానీ వారిదైనా చిత్రలిపి పడిగెలు మౌఖిక సాహిత్యాల ద్వారా వారి అమూల్యమైన చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారనే పరిశోధనాత్మక అంశాలను ఇందులో పొందుపరిచారు రచయిత లక్ష్మీనారాయణ. ప్రధాన వ్యాసావళికి అనుబంధంగా అందిం చిన అనుబంధంలో కూడా చాలా విలువైన విషయాలు పొందుపరిచారు పుస్తక రచయిత ఆదివాసీల పోరాట విజయాలకు ప్రతీక అయి నా మేడారం సమ్మక్క సారక్క జాతర గురిం చిన చారిత్రిక విజయాలు జాతర పరాయి కరణ అవుతున్న తీరు. ఆదిలాబాద్ ప్రాంతా నికి చెందిన గోండులు ఆరాధ్య దైవంగా భావించే ‘‘జంగుబాయి’’ని వారు ఆరాధించే వైనం,వింత ఆచారాలు గురించిన సమాచారం మనం ఇందులో చదవవచ్చు. నేటి ఆధునిక ఆదివాసీ సమాజంలో ఆదివాసి యువత సాధించిన విజయాల స్ఫూర్తిగాథలు సైతం ఇందులో అందించడం ద్వారా నేటి గిరిజన యువత సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది ఇలా ప్రతి విషయం ప్రామా ణికంగా అక్షయకరించిన ఈ గిరిజన వ్యాసాలు భావితరం పరిశోధకులకే కాక గిరిజన సాహిత్య వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయి.ఎంతో విలువైన గిరిజన జాతి సమాచారం సేకరించి పుస్తక రూపంగా అక్షరబద్ధం చేసిన రచయిత అక్షర కృషి వెలకట్టలేనిది.
అనంత యానం (వ్యాస సంపుటి) రచయిత : గుమ్మడి లక్ష్మీనారాయణ పేజీలు : 226 వెల : రూ 300/- ప్రతులకు : రచయిత `9491318409 సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు సెల్ : 7729883223.