అడవి బతుకులు ఆదివాసీ నవల

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు పమ్రుఖ రచయిత,పరిశోధకులు డాక్టర్‌ దిలావర్‌ కలం నుంచి జాలువారిన ఆధ్యాత్మక, చారిత్రక,ప్రాధాన్యత సంతరించుకొని గిరిజనల్లో ఒక ప్రత్యేకత చాటుకున్న ‘ అడవి బతుకులు ఆదివాసీ నవల’ అనే పుస్తకంపై సమీక్ష
అడవి జన జాతుల్లో అచ్చమైన అడవి బిడ్డలు చెంచులు,మన తెలుగు రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో అధికంగా అగుపించే ఈచెంచులకు ఎంతో ఆధ్యాత్మిక,చారిత్రక,ప్రాధాన్యత ఉండి గిరిజనుల్లో ఒక ప్రత్యేకత చాటు కున్నారు.
ఎంతో ఘనమైన చరిత గల ఈ చెంచు జాతి అడవి బిడ్డలు నేటి ఆధునిక కాలంలో ఎదుర్కొంటున్న అగచాట్ల గురించి ఆవిష్కరించిన ఆదివాసీ నవల‘‘అడవి బ్రతు కులు’’దీని రచయిత ప్రముఖ పరిశోధకుడు ‘‘డాక్టర్‌ దిలావర్‌’’ వీరు తెలుగు బోధకునిగా పనిచేస్తూ పలు గిరిజన జనవాసాల్లో ప్రత్యక్షంగా గడిపిన అనుభవంతో పాటు తనదైన పరిశోధన, పరిశీలన, సాయంగా ఈ నవలను అనేక విషయాలు విశేషాల సమాహారంగా అందించారు.
నవల మొత్తం 21అధ్యాయాలుగా విభ జించబడి కొనసాగింది, కాల్పనిక పద్ధతిలో వాస్తవ సంఘటనలను మిళితం చేసి వ్రాసిన ఈనవల రచనా శైలి సరళంగా ఆసక్తిదాయకంగా కొనసాగింది,
నవల మొత్తం చెంచుల సంస్కృతి సాంప్ర దాయాల ఆవిష్కరణతో పాటు వారి జీవనం లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా ఆధునిక వ్యక్తులు ఆధునిక కట్టడాలు నిర్మాణాలు ద్వారా అడవి బిడ్డలు ఎదు ర్కొంటున్న కష్టాలే కాక నష్టాలు,తద్వారా తమ జాతి జనాభా నిర్వీర్యం అయి అంత రించిపోతున్న తీరు,నల్లమల ప్రాంతంలో నిర్మించిన నాగార్జునసాగర్‌ ఆనకట్ట నిర్మా ణం తీరు ఆనాటి పరిస్థితులు, చెంచులు నష్టపోయిన వైనం, వంటి చారిత్రక విష యాలు విశేషాలతో పాటు నేటి ఆధునిక కాలంలో స్వార్థపు స్మగ్లర్ల వల్ల అటవీ సంపద కొల్లగొట్ట పడుతున్న తీరు,ఆ దాస్టి కంలో అమాయక చెంచులు సమిదలవు తున్న వైనం,కళ్ళకు కట్టారు రచయిత డాక్టర్‌ దిలావర్‌.ఈనవలలో ప్రధాన పాత్రలు ప్రొఫెసర్‌ రచయిత రమణారావు, అతని భార్య సృజన,పరిశోధక రచయిత రమ ణారావు తన దగ్గర గల క్షేత్ర పర్యటనల అను భవ సారంతో ఒక మంచి ‘ఆదివాసీనవల’ రాయలనుకొని చాలా కాలం కృత్యాద్య వస్థ పొంది చివరికి రచన ఆరంభిస్తారు.కట్‌ చేస్తే తెలంగాణకు హృదయం వంటి అందమైన నల్లమల అడవుల్లో నవల ప్రారంభమవుతుంది. నవల రెండో భాగంలో చెంచులు నల్లమల ప్రాంతానికి దూరమైన తీరు తద్వారా మరణి మరణించిన వైనం చెప్పడం జరుగుతుంది. మూడవ భాగంలో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ కట్టిన నేపథ్యం వివరిస్తూ దాని నిర్మాణంలో వందలాది చెంచులు అసువులు బాసిన మరు గున పడిన చరిత్రను,ఈ నవలా రచయిత ఆవిష్కరించటం ఇందులో విశేషం. నల్లమల అడవుల్లోని పక్షి, జంతు,సంతతి వివరాలు, చెంచుల జీవన విధానం ఆహారపు అలవాట్లు కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ …డాక్టర్‌ దిలావర్‌ తనదైన శైలిలో స్థానిక విషయాలతో కూడిన ఉపమానాలు అన్వయిస్తూ నవలను నడిపించిన వైనం పాఠకులను అబ్బురపరుస్తుంది.4,5 భాగాలలో ఈ అక్షర దృశ్యాలు నల్లమల అందా లు చెంచుల ఆనంద వైభవాలు హృ ద్యంగా చదవవచ్చు.సంస్కృతి సాంప్రదాయాలను పర్యా వరణను పరిరక్షించే అడవిబిడ్డలైన చెంచుల్లో నిభిడీకృతమైన ప్రేమఅనురాగాలు,అమలిన శృంగార కథనాలు కూడా మనం ఈనవలలో గమనించవచ్చు.కోనమ్మ,కొండడు,అనే ఇద్దరు చెంచు యువతీ యువకుల ప్రణయగాథ ఈ నవలకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక రచయితలోని ప్రేమతత్వం చిలిపితనం,శాంత స్వభావం,అర్థం అవుతాయి.ఇష్టపడ్డ ఇద్దరూ యువతీ యువకులు కుల పెద్ద అంగీకారంతో రెండు మూడు రోజులు వనవాసం చేసివస్తే ఆ తర్వాత కులదేవత సాక్షిగా వారికి అందరి అంగీకారంతో పెళ్లిచేసే సంప్రదాయం చెంచు జాతిలో ఉందనే విషయంఈనవలలో కొండడు, కోనమ్మల,పెళ్లి సందర్భంగా రచయిత వివరిం చారు.భార్యా,భర్త చనిపోయిన జంటలు తిరిగి పెళ్లి చేసుకునే సహృదయ సాంప్రదాయం సైతం చెంచు జాతిలో ఉందని, ఆ సహజీవ నం కూడా కుల పెద్ద అంగీకారంతోనే అంటూ చెంచుల కుల కట్టుబాటును ఉదహరిస్తూ గుర్రమ్మ,లింగయ్యల సహజీవనం గురించి కూడా రచయిత ఈనవల ద్వారా వివరించారు,
చెంచుల్లో ఉండే పోడు వ్యవసాయ విధానం, సంచార జీవనం ద్వారా ఎక్కడ పంటలకు అనుకూలమైన వాతావరణం భూమి ఉంటుం దో అక్కడే వారు జీవనం చేస్తూ జీవితం గడుపుతారు.ముఖ్యంగా వారి వ్యవసాయ పద్ధతులు అన్ని సహజత్వంగా ప్రకృతికి దగ్గరగా ప్రకృతిని పరిరక్షించే తీరులో ఉండ టం అందరికీ ఆశ్చర్యకరమే కాదు ఆదర్శ నీయం కూడా. చెంచులు ఎంతగా ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛ మైన జీవనం సాగిస్తున్న,చెట్ల మందులతో వైద్యం చేయడం వచ్చిన, అత్య వసరమైన కాన్పుల సమయంలో కనలేక ఎందరో చెంచు మహిళలు మరణిస్తున్నారు. అందులో ఒకటి లింగయ్య ఇష్టపడి మారు మనువు చేసుకున్న గుర్రమ్మ, కాన్పు సమ యంలో మరణించడం,కొందరు చెంచు యువకులు మత్తు పానీయాల వ్యసనాలకు లోనై నాలుగు పదుల వయసులోనే చనిపోతూ… చెంచు గుడేలు,పెంటలు, విధవ రాళ్ల తో నిండిపోతున్నాయని,హృదయ విధా రక ఆవేదనను సైతం రచయిత ఈ నవలలో ఆవిష్కరించారు. నవల పదవ భాగం నుంచి పరిశోధక రచయిత ప్రొఫెసర్‌ రమణరావు చెంచుల మరి కొన్ని జీవన విధానాలు ప్రత్య క్షంగా చూసి తెలుసుకోవడానికి గాను తన మిత్రులతో కలసి చెంచు గుడేలకు వెళ్లడంతో మొదలవుతుంది. స్థానిక చెంచు పెద్దలు వీరికి చెప్పిన స్థానిక చరిత్రల ఆధారంగా అనేక చారిత్రక సత్యాలు అర్థం అవుతాయి,చెంచుల తొలి దేవర వృద్ధ మల్లికార్జునుడు అతను శ్రీశైలంలో స్వయంభూ గా వెలిసినట్టు,అతనిని ‘‘మలల అన్న’’అని మొదట పిలిచేవారని, అతను తమ ఆడబిడ్డ ‘‘బ్రహ్మ రాండదేవి’’ని పెళ్లి చేసుకున్నట్టు, శ్రీశైలం మొదట చెంచుగూడెం అని, అక్కడ గుడి కట్టింది కూడా చెంచులే అని గజ్జల కొండడు ఆలయతొలి పూజారి అనే మరుగున పడిన చారిత్రక విశేషాలు రచయిత ఈనవల లో అందించారు. శివాజీ చేసిన యుద్ధాలకు చెంచులు అందించిన సహకారం గురించి మరికొన్ని మరుగున పడిన చెంచు ప్రాంత చారిత్రక విషయాల గురించి రమణారావు పాత్ర క్షేత్ర పర్యటనల ద్వారా తెలుసుకున్నట్టు రచయిత దిలావర్‌ నవలీకరించారు.
అలాగే నల్లమల అడవుల్లో ప్రస్తుత ఆధునిక కాలంలో స్వార్థపరులైన వ్యాపారులు దళారీల ద్వారా జరుగుతున్న అటవీ ఉత్పత్తుల రవాణా వల్ల స్థానిక చెంచు కుటుంబాలు నేటి కాలంలో ఎలా నష్టపోతున్నాయో అన్యాయాలు ఇబ్బందు లు ఎలా ఎదుర్కొంటున్నారో ఈ నవల ముక్తా యింపులో రచయిత డాక్టర్‌ దిలావర్‌ అందం గా ఆలోచింపజేసే విధంగా ఆవిష్కరించారు. అందమైన స్థానిక అంశాల ఉపమానాలే కాక స్థాని సరళమైన భాషను కూడా నవలలో ప్రయోగించటం రచయితకు గల అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది ఎన్నో చారిత్రక సాంస్కృతిక విలువలు గల విలువైన ఆదివాసీ నవల‘‘అడవి బతుకులు’’ అందరూ విధిగా చదవాలి.
అడవి బతుకులు (నవల),రచయిత: డాక్టర్‌ దిలావర్‌, పేజీలు: 112, వెల:100/- రూ,
ప్రతులకు: యండి అక్బర్‌,సెల్‌: 93811 06671,సమీక్షకుడు:డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.