అటవీ సంరక్షణే పర్యావరణ పరిష్కారం!
పర్యావరణ పరిరక్షణలో అడవులది కీలకపాత్ర అనేది కాదనలేని వాస్తవం.పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగాకోట్లాది రూపా యలు వెచ్చించి మొక్కలు నాటుతున్నారు. మరొక పక్క విచక్షణారహితంగాఅడవులను ధ్వంసం చేస్తు న్నారు.నాటుతున్న మొక్కల్లో ఎంత శాతంపెరిగి పెద్దవవుతున్నాయో చెప్పలేం కాని ఊహించని రీతి లో అడవుల్లోని భారీ వృక్షాలనుసైతం కూల్చివేసి తరలిస్తున్నారు. అటవీసంపద హరించుకుపోతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది.దేశంలో సగ టున రోజుకుదాదాపు 300ఎకరాలకు పైగా అటవీ భూమి అదృశ్యమైపోతున్నదని గతంలో అటవీ మంత్రిత్వశాఖ వెల్లండిరచిన నివేదికల్లో స్పష్ట మైంది. బొగ్గుగనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, నదిలోయ ప్రాజెక్టులకోసం అడవులను నరికివేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, జార?ండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితరరాష్ట్రాల్లో ఇతర ప్రయోజనాలకు కూడా భూములను ఉపయోగించు కుంటున్నారు.తెలుగురాష్ట్రాలకు సంబంధించి ఖమ్మం,వరంగల్,అదిలాబాద్,కరీంనగర్ తది తర జిల్లాల్లో వేలాదిఎకరాలు అటవీభూమి అన్యాక్రాంత మైనట్లు అటవీశాఖ అధికారుల రికార్డులు వెల్లడిస్తు న్నాయి.భారత అటవీ సర్వే(ఎఫ్ఎస్ఐ)సంస్థ గతంలో విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ప్రకా రం దేశంలో దాదాపు ఏడు లక్షల చదరపు కిలోమీ టర్ల విస్తీర్ణంలో అడువులు ఉన్నాయి.పర్యావరణ జీవావరణ పరిరక్షణతోపాటు ఆర్థిక, సామాజిక జీవన వ్యవస్థలకు అడవులు ఆలంబనగా నిలుస్తు న్నాయి. భూసారాన్ని కాపాడడమేకాకుండా తుపా నులు,వరదలులాంటి దుష్ఫ్రభావాలను అడ్డుకో వడంలో వాటిపాత్ర విస్మరించలేనిది. కోస్తాప్రాం తాల్లో భూమి కోసుకపోకుండా కూడా అడవులు కాపాడుతున్నాయి. భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్‌వాయువులువాతా వరణంలోకి పెద్ద ఎత్తున విడుదల కాకుండా నిరోధించే శక్తి అడవు లకు ఉంది. బొగ్గుపులుసువాయువు పీల్చుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించడం ద్వారా ఎప్పటి కప్పుడు కొత్తఊపిరులు పోస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా160కోట్ల మందికిపైగా ఆవాసం, రక్షణ, జీవనోపాధి కోసం అడవుల మీదనే ఆధారపడు తున్నారు. అభివృద్ధిచెందు తున్నదేశాల్లో ఇంధన వనరులు, పారిశ్రామిక అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను వినియోగించుకుంటున్నారు.కొన్ని లక్షలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. అటవీఉత్పత్తుల ఔషధ ఆరోగ్యపరమైన ప్రయోజ నాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి విలువ అంచనాలకు అందదు. అందుకే మానవ నాగరికత వికాసంలో అడవుల పాత్ర అత్యంత కీలకమైందని ఏనాటి నుంచో పెద్దలు చెప్తున్నారు. సింధునాగరికత అంతరించి పోవడా నికి ప్రధానకారణాల్లో అటవీ ప్రాధాన్యతను గుర్తించకపో వడమేనని చరిత్రకా రులు స్పష్టం చేస్తున్నారు. అడవులు రానురాను అదృశ్యమైపోతుండడం వల్లనే ప్రకృతి బీభత్సవాలు పెరిగిపోతున్నాయనేది వాతావరణ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరుచగా వస్తున్న వరదలు, అందు వల్ల జరుగుతున్న బీభత్సం, మరొకపక్క కరువుకాట కాలు కూడా ఈ అడవుల విధ్వంసం వల్లనే జరుగు తున్నదనేది కాదనలేని వాస్తవం. ఇంత జరుగు తున్నా పాలకులు ప్రకటనలతో సరిపెడుతున్నారు తప్ప నిర్దిష్టమైనచర్యలు తీసుకొనలేకపోతున్నారు. అంతెందుకు ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందం చెట్లను నరికి విదే శాలకు స్మగ్లింగ్ చేయకుండా నిరోధించలేకపోతున్నారు. వందలాది మంది పోలీసులను పెట్టినా చివరకు కాల్పులు జరిపినా ఈస్మగ్లింగ్ ఆగడం లేదు. ఇక చెట్లను పెంచే కార్యక్రమం అంతంత మాత్రం గానే ఉన్నది. కాగి తాలపై ఉన్న చెట్లెన్ని క్షేత్రస్థాయి లో అందులో ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తే ఆశ్చర్యకర మైన దృశ్యాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వం కూడా చెట్ల పెంపకంలో ఒకనిర్దిష్ట విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. స్విట్జర్లాండ్ లాంటిదేశాల్లో ఇంట్లో పెరటి మొక్కలు పెంచుకునేందుకు ముందుకొస్తేతప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వ డంలేదు.భూటాన్,నేపాల్,గాంభియా,తదితర దేశా ల్లో అటవీరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఆదర్శంగానిలుస్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడల్లా ఒక మొక్క నాట డాన్ని ఫ్రాన్స్ ప్రోత్సహిస్తున్నది. భారత రాజ్యాంగంలోని 51ఎ(జి) అధికరణ ప్రకారం అడవ్ఞలు,వన్యప్రాణులు సహా ప్రకృతి సంపదను పరిర క్షించడం,అభివృద్ధిపరచడం ప్రతిపౌరుడి కర్తవ్యం. అడవులు అంతరిస్తున్నబట్టే వన్యప్రాణులు అరణ్యాలు వదిలి జనారణ్యంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగించేఅంశం. అడవులు వన్యప్రా ణాన్ని కాపాడటానికి భారత ప్రభుత్వం కృషి చేయా లని 48(ఎ)అధికరణ స్పష్టం చేస్తున్నది. న్యాయ స్థానాలు కూడా అటవీభూమి సంపద విషయాల్లో ఎన్నోసార్లు ఆదేశాలుజారీచేశాయి. భారత ప్రభు త్వం కూడా అడవుల అభివృద్ధికి వేలాదికోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి అది అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అడవుల పెంపకం, పరిరక్షణ, ప్రోత్సాహంతో పాటు హరిత, ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా పరి శ్రమలకు గట్టి నిబంధనలను విధించాలి. అటవీ విధ్వం సానికి దారితీస్తూ వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్న స్మగ్లర్ల విషయంలో ఉక్కు పాదం మోపాలి. అటవీ సంరక్షణలో రాజకీయా లకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఆలోచిం చాలి. స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాము లను చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.– జి.ఎన్.వి.సతీష్