అందరికీ న్యాయం అందేదెలా?

రాజ్యాంగం మనకు వివిధ చట్టాల ద్వారా చాలా హక్కుల్ని కల్పించింది. అయితే పొద్దున్న లేచించి మొదలు..రాత్రి పడుకునే వర కూ ఎక్కడో ఒకచోట ఏదోఒక సమస్య తలెత్తు తూనే ఉంది.మన చుట్టూ జరిగే అనేక మోసా లు,దోపిడీలు,నేరాలు-ఘోరాలు వంటివి నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం.. మరీ ముఖ్యం గా దళితులు,గిరిజనులు,మైనారిటీలు, మహి ళలపై అనేక రకాలుగా హింస పెరిగి పోతోంది. ఈవిషయాన్ని ఇటీవల ఎన్‌సి ఆర్‌బి విడుదల చేసిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిలో చాలామందికి న్యాయం అంద డంలేదు.అవగాహన లేక కొందరు మిన్న కుం డిపోతే.. అక్రమార్కులు, అరాచక శక్తుల ఆగడా లకు భయపడి మరికొందరు బాధితులు గానే మిగిలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లు,కోర్టుల్లోనూ అన్యాయం జరు గుతున్న దుస్థితి..ఈక్రమంలో రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులను ఎలా పొం దాలి..? తగిన న్యాయం..రక్షణకోసం ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి పరిమితమైన అంశా లపైనే అంశాలపై ప్రత్యేక కథనం.. (సురేష్‌ కుమార్‌ పొత్తూరి)

సుప్రీం తీర్పులు….: అనితకుశవహ వర్సెస్‌ పుషవ్‌ నుండాని14-21లోపొందుపరచబడినహక్కు,చట్టం ముందు అందరూ సమానమే.పౌరులందరికీ సామాజిక,రాజకీయ,ఆర్థిక న్యాయం జరగాలి. ఈ ప్రాథమిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆదేశాలు. అనేక చోట్ల రాజ్యాంగంలో వీటిగురించి ప్రస్తావించ బడిరది. సమాజంలోపేద,బలహీనవర్గాలకు న్యాయ సహాయం అందించబడాలి.అదిఉచితంగా జరగా లని 39ఎ అధికరణ నిర్దేశిస్తుంది.
అందే సేవలు..: న్యాయవాది సేవలు అందుతాయి. అనగా కోర్టులో కక్షిదారుని తరపున వాదనలు విని పించబడతాయి.న్యాయ సలహాలు ఇవ్వబడ తాయి. సముచిత కేసులలో కోర్టులో చెల్లించవలసిన ప్రాసెస్‌ రుసుము,సాక్షికి అయ్యే ఖర్చులు,కోర్టు వ్యవహారంలో ఆకేసుకు అయ్యే ఇతర ఖర్చులు చెల్లించబడతాయి. కేసులో వాదనలు తయారుచేయడం. అప్పీలు దాఖలు చేయడం. కేసు కాగితాలు కోర్టులో దాఖలు చేసే విధంగా ఫైలు, పుస్తకాలు తయారు చేయడం. కాగితాలను అనువాదం చేయడం. వాదనలు లిఖితపూర్వకంగా తయారు చేయడం (డ్రాఫ్టింగ్‌) ధృవపరచబడిన తప్పులు,ఉత్తర్వులు,సాక్ష్యా లు చట్టపరమైన కాగితాలు అందించడం. మహిళా బాధితులకు నష్టపరిహారం..: అత్యా చారాలు,యాసిడ్‌ దాడులువంటి విషయాలలో మహిళలపైదాడులు జరిగినప్పుడు వారికిగాని, వారివారసులకుగాని నష్టపరిహారం చెల్లిం చేందు కు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘మహిళా బాధి తుల నష్టపరిహార నిధి’ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. న్యాయ సేవా సంస్థల సూచన మేరకు తగిన మొత్తాన్ని ప్రభుత్వం మహిళా బాధితులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో చెల్లించే నష్టపరిహారం ఇతర నష్టపరిహారాలకు సంబంధంలేదు.ఈ నష్ట పరిహారం కోసం జిల్లాలో లేదా న్యాయసేవ సంస్థ లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసంస్థలలో దరఖా స్తుల నమూనాలు లభ్యమవుతాయి. లైంగిక దాడు లు జరిగినప్పుడు కూడా ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ సేవా పథకాలు..: ఈ న్యాయ సేవా సంస్థల ద్వారా సమాజంలో వివిధ రకాలైన నిస్సహాయ వ్యక్తులు అనగా విభిన్న ప్రతిభావంతులు, బాలలు, వృద్ధులు,గిరిజనులు,ప్రకృతి వైపరీత్యాల బాధితు లు, అసంఘటిత బాధితులు, నిరుపేదలు, మత్తు పదార్థాల బాధితులు మొదలైనవారి కోసం పథ కాలు ఏర్పాటు చేయబడ్డాయి.
న్యాయ సహాయం ఏ దశ నుండి లభిస్తుంది?..:
న్యాయ సహాయం కేసుల ప్రారంభం నుంచి అనగా సివిల్‌ కేసుల్లో దాఖలుఅయిన దగ్గర నుంచి సహా యం పొందవచ్చు.క్రిమినల్‌ కేసులలో ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు అయిన దగ్గర నుంచి అనగా అరెస్టు కు ముందు నుంచి పొందవచ్చు. అలాగే కేసు యొక్క అన్ని దశలలోను అనగా అప్పీలు, రివిజన్‌ దశ లలో కూడా పొందవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?..: సమస్య ఉన్న ప్రాంతాన్ని బట్టి, సమస్యలో ఉన్న విషయాన్ని బట్టి ఆయా (తమకు దగ్గర) తాలూకా / మండల స్థాయి న్యాయ సేవా అధికార సంస్థల వద్ద ప్రథమంగా దాఖలు చేసుకోవాలి.ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య వలన ఆ సంస్థకు పరిధి లేకపోతే వారి సూచన మేరకు తగిన సంస్థలో దాఖలు చేయాలి. ప్రతి స్థాయిలోను అనగా తాలూకా,జిల్లా స్థాయి న్యాయ సేవా సంస్థలు తాలూకా, జిల్లా కోర్టులలోనే స్థాపించబడి ఉంటాయి. కాబట్టి తమకు దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సంస్థను సంప్రదించడం ప్రథమ కర్తవ్యం.రాష్ట్ర స్థాయి సమస్యలు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల వద్ద పేర్కొనాలి. ఇవికాక రాష్ట్ర హైకోర్టులో న్యాయ సహాయం కావలసి వస్తే హైకోర్టు స్థాయిలో ప్రత్యేక సేవా సంస్థ ఉంటుంది. దానిని సంప్రదించవచ్చు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి సంస్థఉంటుంది. కనుక అక్కడా సంప్రదించవచ్చు.
లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు..: ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు గ్రామీణస్థాయిలో ఏవిధంగా వైద్య సహాయం అందిస్తాయో ఆవిధంగా గ్రామీణ ప్రజలకు, నిరక్ష రాస్య,నిరుపేద ప్రజలకు న్యాయ సహాయం అందా లనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన పథకం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.ఈ విధానంలో సాధారణంగా ప్రతి ఆదివారం,బుధవారాలలో గ్రామాలలోని పంచాయి తీలు లేక స్థానిక సంస్థల కార్యాలయాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఈక్లినిక్‌లకు పారా లీగల్‌ వాలంటీర్లు,లీగల్‌ ఎయిడ్‌న్యాయవాదులు హాజర వుతారు.ఈక్లినిక్‌లలో గ్రామీణప్రాంతాలలో ఉన్న న్యాయ సమస్యలు కాక, వీధి దీపాలు,రహదారులు, ఇళ్ళ స్థలాలు వంటి సమస్యలు..వాటినిఎలా పరి ష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. అక్కడే ఏవైనానోటీసులు,జవాబులు,పిటీషన్లతయారీ, దర ఖాస్తులు మొదలైన విషయాలలో సలహాలు, సహా యం చేస్తారు.ఎక్కువ సహాయం అవసరమైతే న్యాయసేవా అధికార సంస్థకు ఆ కేసును పంపిస్తారు. ఈ విధంగా సహాయం చేయడం ద్వారా కేసులు కోర్టుల దాకా రాకుండానే పరిష్కరించేందుకు ప్రయ త్నం చేస్తారు.
కుటుంబ హింస ఎదుర్కోవాలంటే..: ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కుటుంబ హింస 20-50 శాతం వరకూ ఉంది.1946లో ఐరాస స్త్రీల స్థితిగ తుల అధ్యయనం కోసం ఏర్పరచిన కమిషన్‌ నివేదిక ఆధారంగా 1979 డిశంబరు 18న ఐరాస ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దీనిని ‘కన్వెన్షన్‌ ఆన్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ డిస్‌ ఇంటిగ్రేషన్‌ ఎగైనెస్ట్‌ ఉమెన్‌’ అంటారు. ఈ ఒప్పందం అమలు కొరకు ఏర్పరిచిన కమిటి 1992లో కొన్ని సిఫార సులు చేస్తూ మహిళలపై హింస, వివక్ష ఉన్నాయనీ వాటిని అరికట్టాలనీ తనసిఫార్సు నెం.19లో పేర్కొంది. మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింస అంతమొందించేందుకు ఐరాస ప్రకటన 1993లో మొదటిసారిగా కుటుంబ హింసను నిర్వచించింది. ఈనిర్వచనం మహిళలపై కుటుంబంలో జరిగే హింసను అన్ని కోణాల నుంచి నిషేధించింది. 1994లో మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసిన కమిటి,1995బీజింగ్‌ అంతర్జాతీయ మహిళా సమా వేశం రూపొందించిన ఉద్దేశ్యాలలో కూడా కుటుం బ హింస అరికట్టడం ప్రధానమైనది. అంతర్జాతీయ కుటుంబ హింసకు వ్యతిరేకంగా వచ్చిన ప్రకట నలు,ఒప్పందాలు, ప్రచారం ఫలితంగా44 దేశా లలో కుటుంబ హింసకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి.మనదేశంలో కూడా మహిళా సంఘాలు, ప్రజాతంత్ర వాదుల ఒత్తిడి ఫలితంగా కుటుంబ హింస నుంచిమహిళల రక్షణచట్టం-2005 వచ్చిం ది. ఒక మహిళను ఆమె భర్తగానీ, అతని బంధువు లుగానీ హింసిస్తే అది భారత శిక్షాస్మృతి 498ఎ కింద నేరం.ఈచట్టంలో భాగ స్వామి కావటానికి స్వచ్ఛంద సంస్థలకు,రిజిస్టరు సొసైటీలకు అవకాశం ఉంది.
రక్షణ.. ఆర్థిక సహాయం..: ఈచట్టం కేవలం చట ్టబద్ధమైన వివాహితే కాక,వివాహాన్నిపోలి ఉన్న సం బంధాన్ని కలిగియున్న మహిళలకూ రక్షణ కల్పిం చింది. బాధితురాలు ఏవిధమైన సంబంధం అనగా ఉమ్మడి కుటుంబం ద్వారా ఏర్పడిన,రక్త సంబం ధం ద్వారా ఏర్పడిన సోదరి,తల్లి,ఒంటరి మహి ళలు ఎవరైనా రక్షణ పొందవచ్చు. వీరున్యాయ సేవల అథారిటీల చట్టం 1987 ప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. కుటుంబ హింస వల్ల బాధితురాలికి అయిన ఖర్చులు, నష్టపరిహా రంగా ఆమెకు లేదా ఆమె పిల్లలకు తగినంత మొత్తాన్ని చెల్లించాలని హింసకు పాల్పడిన వ్యక్తిని మెజిస్ట్రేట్‌ ఆదేశించవచ్చు.
సహాయం ఎలా?..: బాధితురాలు ఈచట్టం ద్వారా సహాయం పొందుటకు మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి.ఈదరఖాస్తును బాధితురాలు స్వయం గాగానీ,రక్షణ అధికారుల ద్వారాగానీ లేదా ఆమె తరఫున మరి ఎవరైనాగానీ దాఖలు చేయొచ్చు. ఈదరఖాస్తులో తనకు కలిగిన బాధను వివరిస్తూ తనకు కావాల్సిన సహాయాన్ని అర్థించాలి.ఈ దర ఖాస్తు ద్వారా తనపై కుటుంబ వ్యక్తి నుంచి తగిన పరిహారం ఇప్పించమనీ కోరవచ్చు.
ఎన్నిరోజుల్లో పూర్తవుతుంది..: దరఖాస్తు అయిన తేదీ నుంచి సాధారణంగా మూడు రోజుల లోపల మేజిస్ట్రేట్‌ దరఖాస్తుల విచారణ ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభమైన తేదీ నుంచి60రోజుల లోపల పూర్తిచేసేందుకు మేజిస్ట్రేట్‌ ప్రయత్నిస్తారు.
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం నేరం..: ఐపిసికి 2013లో వచ్చిన సవరణల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సెక్షన్‌ 166 (ఎ) ప్రకా రం నేరంగా పరిగణించబడుతుంది.నిర్ధిష్టంగా 354,354ఎ,345బి,345సి(2),345డి,376 (ఎ),376బి,376సి,376డి,376ఇ సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించబడే సమాచారం అందినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే నేరంగా పరిగణిం చడుతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచా రాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకురావడం జరిగింది.
సంక్షేమ పథకాలు పొందడంలో..:కేవలం న్యాయ పరమైన విషయాలు మాత్రమే కాక, ఏదైనా సంక్షేమ చట్టాలు ఉంటే వాటి ప్రకారం లబ్దిదారులకు రావా ల్సిన ప్రయోజనాలను పొందే విషయంలో సలహా లు,సహాయాలు అందిస్తారు.అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా సలహాలు, సహా యాన్ని అందజేస్తారు.ఆవిధంగా న్యాయాన్ని పొంద డంలో కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.
ఫ్రంట్‌ ఆఫీస్‌ అంటే ఏంటి?..: న్యాయసేవలు అందుబాటులో ఉండేందుకు న్యాయసంస్థల్లో ఏర్పర చిన గదిని ‘ఫ్రంట్‌ ఆఫీసు’ అంటారు. అన్ని న్యాయ సేవా సంస్థలు ఈగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ గదిలోనే న్యాయవాదులు, పారాలీగల్‌ వాలం టీర్లు అందుబాటులో ఉంటారు.ఈగది సమర్థ వం తంగా,నాణ్యతతో కూడి ఉండాలి. (వ్యాసకర్త: సుప్రీంకోర్టు న్యాయవాది)