అంతట విస్తరిస్తున్న అడవి బిడ్డల పండుగ
మాయ మర్మం..కుట్రలు కుతంత్రాలు.. తెలియని స్వచ్ఛమైన జీవన స్రవంతిలో ఐక మత్యానికి సాంప్రదా య పరిరక్షణకు చిరు నామాలుగా నిలిచే అడవి తల్లి ముద్దుబిడ్డలు, ఆదివా సులుగా, గిరిజనులు గా, వనవాసులుగా, వివిధ పేర్లతో పిలవబడు తున్న వీరంతా మానవజాతికి కార కులైన మూలవా సులే…! నివ సించే ప్రాం తాలను బట్టి పిలి చే పేర్లలో మార్పులు ఉండ వచ్చు,జా తులు, తెగలు, వేరుగా ఉన్న అందరూ మూలవాసులు గా నే మన ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తారు….!!
ప్రపంచ జనాభాలో నాలుగు శాతం ఆదివాసులు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో సుమారు 30 కోట్ల మంది ఆదివా సులు ఉన్నారు. ఐదువేల తెగలు ఉన్నాయి ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఈ వనవా సులు ఉన్న ఎక్కువ మంది ఉన్నది మాత్రం మన ఆసియా ఖండంలోనే,ప్రపంచ ఆదివాసి జనాభాలో 70% మంది ఆసియాలోనేఉన్నా రు.మనదేశంలో ఏడు కోట్ల మందికి పైగా గిరిజనులు ఉన్నారు తరతరాలుగా వారిదైన సొంత జీవన విధానంలో అడవులను నమ్ము కుని జీవనం సాగిస్తున్నారు అడవి బిడ్డలకు వారిదైన జీవన శైలి సంస్కృతి విశ్వాసాలు ఉంటాయి. ఆచారాలను ప్రాణప్రదంగా నేటికీ కాపాడుకుంటూ సంస్కృతి పరిరక్షకులుగా ఉన్న వీరు ఆధునికల దృష్టిలో అనాగ రికలు, నాగరికత తెలియని తెలివి తక్కువ వారు.కానీ వారిలో ఉండే ఐక్యత సాంప్ర దాయ పరిరక్షణ మానవ విలువలు మన అందరికీ ఆదర్శనీయం వీరికి గల ఆ ప్రత్యే కతల దృష్ట్యానే భారత రాజ్యాంగంలోని 342 అధికరణం కింద మొత్తం 698 గిరిజన తెగలను భారత ప్రభుత్వం గుర్తించి వారికి ప్రత్యేక హక్కులను చట్టబద్ధం చేసింది.మధ్య భారతంలో గల ఆదివాసీలను 5వ షెడ్యూలు, ఈశాన్య భారతంలోని ఆదివాసీలను 6వ షెడ్యూలులో చేర్చి సగౌరవంగా పాలిస్తున్నారు. చారిత్రకంగా చట్టబద్ధంగా ఘనమైన చరిత్ర భద్రత గల వీరు ప్రత్యక్షంగా దుర్భర జీవనం కడుపు తున్నారు, ప్రకృతిలో మమేకమై నిష్కల్మ షంగా సత్యమార్గంలో జీవించటం వీరి విల క్షణతలు, వారి హక్కులు మానవ హక్కులలో అంతర్భాగమే అందుకే… ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994 డిసెంబర్ 23న ఆది వాసుల కోసం వారి అభివృద్ధి కోసం ఒక తీర్మా నం చేసి ప్రతి ఏటా ఆగస్టు 9న‘‘ప్రపంచ ఆది వాసి దినోత్సవం’’ నిర్వహించాలని ప్రకటిం చింది. అంతే కాదు 1994 2004 దశాబ్దాన్ని ఆదివాసీ దశాబ్దంగా ప్రకటించింది. మన దేశంలో 2007 ఆగస్టు 9నుంచి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం అధికారికంగా నిర్వహి స్తున్నారు. ఆర్థిక సంస్కృతిక విద్యా,ఆరోగ్య సామాజిక పర్యావరణ రంగాలలో ఆదివాసుల అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టడం ఈఆది వాసీ దినోత్సవం ప్రధాన లక్ష్యం.గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు ప్రభుత్వ రంగ సంస్థలైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖలు ఏర్పడి ఉన్న ,దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75వసంతాలు నిండి న గిరిపుత్రుల అభివృద్ధిలో ఆశించిన లక్ష్యా లు నెరవేరలేదు అనడంలో అసత్యం లేదు. ఆదివాసులు అంటే నాగరిక ప్రపంచానికి దూరంగా అడవులు కొండలు,కోనలు అసౌ కర్యాల నడుము దుర్భర జీవనం చేసేవారు, వారే అసలైన ఆదివాసులు వీరికి అందా ల్సిన ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్లు నేడు ఎవరికి వినియోగం అవుతున్నాయో అందరికీ తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా రాజకీయాల లబ్ధికోసం జరిగిన అనేక సమీకర ణల ద్వారా అసలైన అడవుల్లో జీవించే అడవి బిడ్డలు ఘోరంగా నష్టపోవడమే కాక విద్య ఆర్థిక సామాజిక జనాభాపరంగా వెను కబడి నేటికీ శ్రమజీవులు గానే జీవనం సాగి స్తున్నారు, ఉన్నత విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగులుగా ఎదగలేకపోతున్నారు, ఇక రాజకీయ రంగంలో నిజమైన అడవి బిడ్డలు నిరుపేద గిరిజనులు ఖరీదైన ఎన్నికల రణ రంగంలో ఎప్పుడూ జెండాలు మోసే రోజు వారి కూలీ కార్యకర్తలు గానే ఉండిపోతు న్నారు తప్ప చట్టసభల్లో అడుగుపెట్టి ‘‘అధ్యక్షా అనే….’’అర్హత శాశ్వతంగా కోల్పో తున్నారు. అటు రాజకీ యంగానే కాక సామాజికపరంగా వారికి గల మంచితనమే వారిని మోసం చేస్తుంది అనిపి స్తుంది, వారి అభివృద్ధి కోసం తెచ్చిన రిజర్వే షన్లు వారికే అవరోధంగా మారాయి అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థి తుల్లో పరిశీలనకు కష్టతరంగా కనిపిం చిన, తక్షణం షెడ్యూలు కులాల వారితో పాటు షెడ్యూలు తెగల వారి వర్గీకరణ పోరాటాన్ని గ్రహించి వెంటనే వర్గీకరణ అమలు చేయడమే గిరిజనాభివృద్ధికి ముందున్న మంచి మార్గం. వెనుకబడిన కులాలలో అమలు అవుతున్న విధానం ఈ రెండు తెగల కుల వర్గీకరణకు ఎందుకు కాదు అన్నది అమాయకులైన అడవి బిడ్డల అరణ్య రోదన ప్రశ్న?? ఎన్నో వినూత్న సంస్కర ణలు చేస్తున్న మన పాలకులు సరైన దృష్టి పెడితే వర్గీకరణ అంత కష్టమేమీ కాదు లేకపోతే మరో వంద సంవత్సరాలు గడిచిన నిజమైన అడవి బిడ్డలు నేడున్న దుర్భర పరిస్థి తుల్లోనే ఇలాగే ఉండిపోతారు తప్ప గిరిజన వికాసం కోరుకునే మేధావులు విద్యావంతులు ఆశించిన లక్ష్యాలు ఎంత మాత్రం నెరవేరవు. రోజురోజుకు పెరిగి పోయి పట్టణాల నుండి పల్లెలగుండా గిరిజన గుడేలకు పాకుతున్న ఆధునికత ముసుగేసుకున్న పాశ్చాత్య సంస్కృతి ద్వారా ఎన్నో గిరిజన కుటుంబాలు అనారో గ్యాల పాలై అసంపూర్ణ జీవితాలు గానే మిగిలి పోతున్నాయి. గిరిజనుల సాంప్రదాయంలో భాగమైన శారీరక శ్రమను తొలగించి ఆరోగ్యం నింపే సహజ తయారీలైన విప్ప, తాటి, ఈత,వేప, జీలుగు, కల్లుల స్థానంలో ఖరీదైన విదేశీ మద్యం వచ్చి ఎందరో గిరిజ నులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆధునికుల సాయం గా వచ్చి పడుతున్న ఆహార అలవాట్లు, ఆధ్యా త్మిక విధానాలు, వాహ నాలు,కూడా వారికి నష్టం కలిగించడమే కాక వారిదైన సంస్కృతి నుంచి వారిని దూరంగా తరిమేస్తూ కనిపించని నష్టం కలిగిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఉంది. గిరిజనులు వారిలాగే ఉండి అడవుల్లోనే నివసిస్తే అభివృద్ధి ఎలా సాధించగలరు? అని ఈ సందర్భంలో పాలకులు అధికారులు తమ సౌలభ్యం మాత్ర మే చూసుకుంటున్నారు తప్ప వారి ఆలోచన వారి సౌకర్యాల గురించి గమ నించడం లేదు వారు ఉన్నచోటనే వారిని ఉంచి అభివృద్ధి సౌక ర్యాలు అందించడం అసాధ్యం ఏమీ కాదు, కాకపోతే ఆర్థిక భారం కావచ్చు!! ఇక్కడ పెద్ద లంతా ఒకటే గమనించాలి నదుల్లో సహజ సిద్ధంగా జీవించే చేపలను ఆధునికత పేరు చెప్పి మన ఆర్థిక అభివృద్ధి కోసం చెరువులలో పెంచి వాటికి ఖరీదైన ఆహారం అందిం చడం ద్వారా చేపలకు ఎలాంటి ప్రయోజనం లేదనే సత్యం గమనించాలి. అదేవిధంగా అడవి బిడ్డ లకు కూడా వారి వారి తావుల్లోనే ఆధునిక సౌకర్యాలు కల్పించాలి, ఆదివాసులను వారిదైన పద్ధతులు సంస్కృతిలోనే ఆధునీకరించాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించడం ద్వారానే అభివృద్ధి చేయగలం అనుకోవడం అనాలో చితం.ఇక గిరిజన యువత కూడా ముందు చూపుతో ఆలోచించాల్సిన సమయం ఇది.క్షణికా ఆనం దాలు వ్యసనాలు చిన్న వయసు పెళ్లిళ్లు వంటి అభివృద్ధి అవరో ధాలకు అతి దూరంగా ఉంటూ మీదైన దీక్ష పట్టుదలతో సవ్యమైన చదువుల సారం పొంది తమను తాము సంస్కరించు కోవ లసిన సమయం ఇది,ప్రస్తుతం గిరిజన ప్రాంతాలు అన్నీ ఆగస్టు 9న ఆకుపచ్చ రంగు పులుముకుని ఆనందంగా సంబ రాలు చేసు కుంటూ గిరిజన వీరులకు అంజలి ఘటిస్తు న్నాయి, ఇదో మంచి పరిణా మం,ఈ సందర్భంలోనే ఆదివాసీ యువత అంతా ఆరోగ్య కరమైన అభివృద్ధి వైపు అడు గులు వేస్తా మని ప్రతిజ్ఞ పూనాలి. – అమ్మిన శ్రీనివాస్‌రాజు