సంకల్పంతో అడుగులేద్దాం..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌, ఆలోచనలకు అనుగుణంగా ప్రతి పౌరుడూ, అధికారీ, ప్రజాప్రతినిధి, స్వచ్ఛంద సేవకులు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగస్వా మ్యం కావాలని అభివృద్ధి లక్ష్యాలను చేరుకు నేందుకు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోందని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విశాఖ వేదికగా గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏయూ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన తప్పక నిలుస్తుందని.. ఈ కలను నిజం చేసేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని, అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా గవర్నర్‌ ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతి భారతీయుడికీ ఆర్థిక ప్రయోజనాలు అందించటమే వికసిత్‌ భారత సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా రాబోయే 25 ఏళ్లలో(అమృత కాల) లక్ష్యాలను చేరుకునేందుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రణాళికాయుతంగా అడుగులేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అర్హులెవరూ సంక్షేమ, ఆర్థిక ఫలాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదని, వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఎక్కడిక్కడే సహాయక కేంద్రాలు పెడుతున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయు ష్మాన్‌ భారత్‌ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌ అభియాన్‌,దీనద యాల్‌ అంత్యోదయ యోజన,పీఎం ఉజ్వల్‌ యోజన, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన, పీఎం భారతీయ జన్‌ ఔషధి పరియోజన తదితర పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ, ఆర్థిక ఫలాలు అందాయని తన ప్రసంగంలో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ గుర్తు చేశారు. పేదలకు మరింత చేరువవటం,వారి అభిప్రా యాలను తెలుసుకోవటం, వారితో మమేకం కావటం, వారి నుంచి నేర్చుకోవటం తదితర ప్రయోజనాలు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రతో ఒనగూరుతాయని పేర్కొన్నారు. అనంతరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రారంభిస్తూ అందరిచేత గవర్నర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
విశాఖ నగర అభివృద్ధికి అవిరళ కృషి చేశాం – జీవీఎంసీ కమిషనర్‌ ః కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ విశాఖ నగర అభివృద్ధికి అవిరళ కృషి చేశామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రారంభో పాన్యం చేశారు. ఇప్పటి వరకు నగర పరిధి లో అమలు చేసిన పథకాలు, వెచ్చించిన వ్యయం,లబ్దిపొందిన వారి వివరాలను వివరించారు. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా 24,192 మంది లబ్ధిపొందారని వారికి బ్యాంకు లింకేజీ ద్వారా రూ.311.46 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు అందించామన్నారు. 1.18 లక్షల మందికి ఒన్‌ సెంట్‌ గృహాలు మంజూరు చేశామని తెలిపారు. అమృత్‌ మొదటి విడతలో భాగంగా రూ.124.99 కోట్లు, రెండో విడతలో రూ.70.44 కోట్లు వెచ్చించి వివిధ పనులు చేపట్టామని వివరిం చారు. 315 మంది నిరాశ్రయులు నివసించేం దుకు అనువుగా రూ.50 లక్షలతో ఎన్‌.యు. ఎల్‌.ఎం. పథకంలో భాగంగా ఎనిమిది షెల్టర్‌ హోంలు నిర్మించామని తెలిపారు. పీఎం స్వానిధిలో భాగంగా 23,675 మంది కి రూ.26.21 కోట్ల మేర లబ్దిచేకూర్చా మని పేర్కొన్నారు. 5.22 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అందజేశామ న్నారు. రూ.1000 కోట్లతో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడిర చారు. పీఎం పోషణ్‌, మిషన్‌ వాత్సల్య ఇతర పథకాల ద్వారా ఎంతోమందికి అండగా నిలిచామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రగతి నివేదికను వివరించారు.
పేదలందరికీ ఆర్థిక ఫలాలు అందాలి ః సాల్మన్‌ ఆరోక్య రాజ్‌
పేదలందరికీ ఆర్థిక ఫలాలు అందించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వాటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించటం, అవకాశాలను సృష్టించటం కోసమే కేంద్రం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను చేపడుతోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సాల్మన్‌ ఆరోక్య రాజ్‌ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ యాత్ర ఉద్దేశాలను అర్థం చేసుకొని భాగస్వామ్యం కావాలని, అర్హతల మేరకు పథక ఫలాలు పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చిత్తశుద్ది -నగర మేయర్‌ ః కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు నగర మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చిత్తశుద్దితో పని చేస్తున్నారని గుర్తు చేశారు. సదుద్దేశంతో తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని పిలుపునిచ్చారు.
అధికారులందరం ప్రత్యేక సంకల్పంతో పని చేస్తాం – జాయింట్‌ కలెక్టర్‌ ః భారత ప్రధాన మంత్రి,రాష్ట్ర గవర్నర్‌ పిలుపు మేరకు అధికారులందరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రంలో భాగస్వామ్యం అవుతామని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక సంకల్పంతో పని చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్‌ పేర్కొన్నారు. కార్యక్రమం లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టుల గురించి వివరిం చారు. జిల్లా ప్రజలు కూడా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో మనస్ఫూర్తిగా భాగస్వా మ్యం కావాలని సూచించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన పెదజాలారి పేటకు చెందిన దొడ్డి ఆదిలక్ష్మి, మద్దిలపాలెనికి చెందిన సుచిత్ర, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న నానాజీ వారి అభిప్రాయాలను సభలో పంచుకున్నారు. ఏయూ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన సభలో పాల్గొనడానికి ముందు రాష్ట్ర గవర్నర్‌ ప్రాంగణంలో ఏర్పటు చేసిన వివిథ పథకాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అక్కడ పథకాల వివరాలను పరిశీలించారు. నిర్వాహకుల ద్వారా పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్ద నెలల చిన్నారికి గవర్నర్‌ అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు. రెండో విడతలో భాగంగా గాజువాక పరిధిలో 10 వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ఏయూ కన్వెన్షన్‌ హాలు వద్ద మొక్క నాటి శ్రీకారం చుట్టారు. సభా వేదికపై ఉజ్వల పథకంలో లబ్దిపొందిన పలువురు మహిళలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. క్రీడాకారులు దాసరి స్రవంతి, కుసుమంచి తేజేశ్‌, వెలగలనేటి కిరణ్‌ కుమార్లను గవర్నర్‌ చేతుల మీదుగా సత్కరిం చారు. కార్యక్రమంలో ఏయూ ఇన్ఛార్జి వీసీ ప్రొ.కె.సమత,స్థానిక కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. –జిఎన్‌వి సతీష్‌