• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home చూపు-Chupu

ఆకలి కేకలు తప్పడం లేదా..!!

team-dhimsa-viz by team-dhimsa-viz
January 7, 2022
in చూపు-Chupu
0
ఆకలి కేకలు తప్పడం లేదా..!!
0
SHARES
30
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

పీసా చట్టం`గిరిజనులకు వరం

రైతు గెలిచాడు

‘ అభివృద్ధింటే అద్దంలా మెరిసే రోడ్డు..ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈభూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం,ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. పోషకాహార లోపం..చిక్కిపోయిన పిల్లలు(ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు),ఎదుగుదలలేని పిల్లలు(వయస్సుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు),పిల్లల మరణాలు(ఐదేళ్లలోపు పిల్ల మర ణాల రేటు)వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉప యోగించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. దీని ప్రకారం భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్ధం చేసుకో వచ్చు.తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొం టున్న ఐదేళ్లలోపు పిల్లలసంఖ్యలో మొత్తం 116దేశాల్లో భారత దేశం టాప్‌ ర్యాంక్‌లో ఉంది’’
పెరిగిన ఆదాయాన్ని,సంపదను నేరుగా ప్రజలకు మళ్ళించడం ద్వారా వారి జీవన ప్రమా ణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడు తున్నాయి. తద్వారా భారత్‌లో తీవ్ర ఆర్థిక వ్యత్యా సాలపై ఉన్న అపప్రదను పోగొట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. బ్రిటీష్‌ పాలనా కాలం నుంచి భారత్‌కు పేద దేశమన్న పేరు అంతర్జాతీయంగా నెలకొంది. సొంత పాలన ఏర్పడ్డాక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక నీలి విప్లవాలొచ్చాయి. అనూహ్యంగా సంపద పెరిగింది. ఐటీ రంగం అందుబాటులో కొచ్చాక భారత్‌ దానిపై ఆధిపత్యం సాధించింది. ప్రపంచానికే భారత్‌ ఐటీ కేంద్రంగా రూపుదిద్దు కుంది. మౌలిక సదుపాయాల కల్పనా రంగం లోనూ భారతీయ నిపుణులు ప్రపంచ స్థాయి ప్రమా ణాల్ని సాధించారు. వీరంతా దేశ సంపద పెరిగేం దుకు తోడ్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచంలో భారత్‌కున్న పేద దేశమన్న పేరు పోవడంలేదు. సంపద పెరగడమే కాదు..దాన్ని సక్రమంగా పంపి ణీ చేయగలిగినప్పుడే ఈ దేశం పేదరికం నుంచి బయటపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమాన గౌరవం పొందగలుగుతుంది. అందు కోసమే ఇప్పుడు ప్రభుత్వాలు తాపత్రయ పడుతు న్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు..
ప్రపంచ సైనిక శక్తిలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌ నుంచి ప్రపంచ కుబేరుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కరోనా కల్లోలంలో కూడా భారతీయ కార్పొరేట్లు అదనంగా ట్రిలియన్ల డాలర్లను పోగేశారు. అంబానీలు,అదానీలు ప్రపం చ మార్కెట్లను సైతం శాసించగలిగే స్థాయికెదిగారు. ముఖేష్‌ అంబానీ ఒకసెకన్‌ కాల వ్యవధిలో సంపా దించే అదాయం సగటు వ్యక్తి మూడేళ్ళ పాటు కష్టపడితే వచ్చే మొత్తానికి సమానమని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కరోనాతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. కానీ జియో లు,రిలయన్స్‌లు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాల్లో లక్షల కోట్ల వ్యాపారం పెరిగింది. ఆఖరకు ఆన్‌లైన్‌ లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు కూడా అంతర్జా లం కోసం కార్పొరేట్‌ సంస్థలకు భారీగా చెల్లింపులు జరపక తప్పలేదు. మరోవైపు ప్రపంచ పేదల్లో 60శాతం మంది పేదలు భారత్‌లోనే ఉన్నారు.ఒక్క 2020లో కోవిడ్‌ మహమ్మారి కొత్తగా ఏడున్నర కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేసింది. వీరి కుటుం బ రోజువారి ఆదాయం రోజుకు వంద రూపా యాలలోపే.దేశంలో ఒకపూట మాత్రమే ఆహారం తింటున్న వారి సంఖ్య 13.40కోట్లకు చేరింది. ఇది పరస్పర భిన్న దృక్కోణాలు కలిగిన భారత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. ఓవైపు దేశంలో సంపద పెరిగింది. కోవిడ్‌ కారణంగా కనీసం ఐదారేళ్ళ పాటు తిరిగి భారత ఆర్థికవ్యవస్థ కోలుకో లేదన్న అంచనాలు పటాపంచలయ్యాయి. ఏడాది తిరగకముందే ఆర్థిక వ్యవస్థ వేగంగాపుంజు కుంది. పరిశ్రమలు,వ్యాపారాలు పునరుద్దరణకు నోచుకు న్నాయి. ప్రభుత్వాలకు పన్ను వసూళ్ళు అనూ హ్యంగా పెరిగాయి. అయితే దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందు బాటులో లేవు. ముఖ్యంగా వైద్యం ప్రైవేటు, కార్పొ రేట్‌ రంగంలో బందీ అయింది. ప్రభుత్వ దవా ఖానాలు నామమాత్రం గానే సేవలంది స్తున్నాయి. ఉన్నత విద్యావకాశాలు ప్రైవేటు రంగానికే పరిమి తమయ్యా యి. దీంతో జనం జీవన ప్రమాణాలు పెరగడంలేదు. పెరుగుతున్న సదుపా యాలన్నీ ఉన్నత వర్గాలకు,ప్రభుత్వోద్యోగులకే పరిమిత మౌతున్నాయి.
తాజాగా కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రజల ముందు చేదు నిజాల నుంచింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక విద్య, వైద్యా లు పూర్తిగా ప్రభు త్వ నియంత్రణలో ఉంటున్నాయి. లేదా ప్రభుత్వమే ప్రజలకు ఉచితవైద్యాన్ని అంది స్తోంది. అదీకాకుంటే ప్రభుత్వం వైద్యబీమా కల్పి స్తోంది. భారత్‌లోఇంకా వైద్య బీమా విస్తృత పరిధి లోకి రాలేదు. కేవలం ఉన్నత వర్గాలకే ఇది అందు బాటులో ఉంది. దీంతో 70శాతం పైగా ప్రజలు ఆధునిక వైద్యానికి నోచుకోలేక పోతున్నారు. వైద్యంపై ప్రభుత్వం జీడీపీలో మూడు శాతం ఖర్చు పెట్టాల న్న నిబంధన ఉంది. ప్రస్తుతం అది 1.2శాతంగానే ఉంటోంది. దీన్ని మూడుశాతానికి పెంచితే ప్రజలు తమ చేతి నుంచి ఆరోగ్యంపై చేసేవ్యయంలో 60 శాతం తగ్గుతుందని నిపుణుల అంచనా. ఈ నేప థ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా తమ ప్రాధాన్యతల్ని సవరించుకుంటున్నాయి. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వరంగం కీలకంగా ఉంది. మౌలిక సదుపాయాల నుంచి పరిశ్రమలపై ప్రభుత్వాలు,పెట్టుబడులు పెట్టి నిర్వహణ చేపట్టా యి. లాభనష్టాల్ని ప్రభుత్వాలు భరించేవి. రాన్రాను దేశంలో ప్రైవేటు రంగం వేళ్ళూనుకుంది. ప్రస్తుతం అది విస్తరించింది. దీంతో అంచెలంచెలుగా ప్రభు త్వం ఒక్కో బాధ్యతను వదిలించుకుంటోంది. ప్రైవేటురంగానికి అప్పజెబుతోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పనా రంగం దాదాపుగా ప్రైవేటు పరిధిలోకొచ్చేసింది. తాజాగా పరిశ్రమల్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని నీతిఅయోగ్‌ సూచించింది. దీంతో అభివృద్ధి మొత్తం ప్రైవేటు రంగంలోనే ముందుకు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వం నయాపైసా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా నిర్వహణ వ్యయం పేరిట ప్రైవేటు సంస్థలు చేపట్టే వసూళ్ళలో రాయల్టిగా ప్రభుత్వానికి కొంతమేర ఆదాయం కూడా లభిస్తుంది. ఈ దశలో ప్రభుత్వాలు ఇక పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టేం దుకు వీలేర్పడుతుంది. ఒకప్పుడు వేలకోట్లలోఉన్న రాష్ట్రాల బడ్జెట్‌ ఇప్పుడు లక్షల కోట్లు దాటేసింది. ఇక కేంద్ర బడ్జెట్‌ అయితే గత పదేళ్ళలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదే సమయంలో అభి వృద్ధిపై వెచ్చించాల్సిన వ్యయం తగ్గిపోయింది. దీంతో పెరిగిన ఆదాయం,సంపదల్ని పేదల జీవన ప్రమాణాల మెరుగుకు వినియోగించేందుకు ప్రభుత్వాలు సమాయత్తమౌ తున్నాయి. ఇందులో భాగంగా నేరుగా నగదునే ప్రజల ఖాతాల్లోకి మళ్ళించే ప్రణా ళికల్ని అమల్లోకి తెస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లోకొ చ్చేసింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ నేడో రేపో అమ లుకు సిద్ధమౌతుంది. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలౌ తున్న సంక్షేమాన్ని తామధికారంలోకొస్తే అమల్లోకి తెస్తామంటూ హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి రైతులకు రుణమాఫీ,మహిళలకు నేరుగా వారి ఖాతాల్లో నెలవారీ నగదు,వృద్దులు, వితంతువులు,వికలాంగులకు ఆర్ధిక ఆసరా. వీటితో పాటు మహిళలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యాబోధన. ప్రజలందరికీ కార్పొరేట్‌ వైద్యం, ఉండేందుకు ఇల్లు,వంటి పథకాలకివి ప్రాధాన్యత నిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. ఉద్యోగులు కూడా ఊహించని స్థాయిలో పెంపును ప్రతిపాదిం చింది. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విర మణ వయసును పెంచడం,సర్వీస్‌ ప్రయోజనాల్ని మరింత విస్తృతపర్చడం చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నామమాత్రపు ధరపై ఆహార ధాన్యాల సరఫరా కొనసాగుతోంది. కేవలం పది రూపా యల నామమాత్రపు ఫీజుతోనే అత్యాధునిక వైద్యాన్ని అందించే అఖిలభారత వైద్య శాస్త్ర సంస్థల్ని దేశం లోని వివిధ ప్రాంతాల్లో కేంద్రం నెలకొల్పుతోంది. ఐఐటీలు,ఐఐఎంలు, ఎన్‌ఐటీలను కొత్తగా ఏర్పాటు చేస్తోంది.ప్రజలందరిని ఆరోగ్య బీమా పరిధిలోకి తెస్తోంది.విద్యార్థులకు చిన్నారులకు పౌష్టికాహార పథకాన్ని అమలు చేస్తోంది.
సంపద ఒక వైపు `ఆకలి మరో వైపు
ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం కారణాలేమైనా దేశంలో సగటు జీవుల బతుకు ఆగమైంది. ఉపాధికిదూరమై, ఆదా యం లేక పస్తులుంటున్నారు. ఆకలి అనేది ప్రభు త్వాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి సమస్యను పరిష్కరించే చర్యలకు పాలకులు పూనుకోకపోవడం విషాదం. ఆకలితోనో, పోషకాహార లోపంతోనో మరణించడానికి కారణం తగినన్ని ఆహారధాన్యాలు లేకపోవడం కాదు. ఏప్రిల్‌ 2021 నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాల్ని అందిం చలేని పాలకుల వైఫల్యం. సమాజ మనుగడకు విరామ మెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగ మనానికి దారులు వేస్తున్న ప్రజల ఆకలి చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది. ఒక దేశంలో ఎంత మంది శతకోటీశ్వరులు ఉన్నారన్నది ప్రమాణికంగా చూడకూడదు. ఆదేశంలో ఆకలి దప్పులు లేని ప్రజలు ఎందరున్నారనే దాన్ని బట్టి ఆ దేశం ఔన్న త్యాన్ని అంచనా వేయాలి. పాలకుల అనాలోచిత అపసవ్య విధానాలు వ్యవసాయాన్ని, ఆర్థికాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. కార్పొరేట్‌ ప్రపంచీకరణ అనుకూల విధానాలు ప్రజల ఆహార హక్కును, రైతుల మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. అందు వలన ఈ సంక్షోభ సమయాన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సామాజిక శాస్త్రవేత్తలు,ఆర్థిక నిపుణులు ప్రభు త్వానికి సూచించారు. అందరికి ఆహార భద్రత కల్పిస్తే ప్రభుత్వానికి అదనంగా పడే భారం రూ. 20 వేల కోట్లు మాత్రమే. అదిదేశ జిడిపిలో 0.09 శాతం మాత్రమే. ఈ మాత్రం ప్రజల కోసం ఖర్చు చేయరా అని సామాజిక మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కరోనా రెండవ దశ ఉధృతి కార ణంగా ప్రాణనష్టం పెరగటంతో పాటు జీవనాధా రాలను కోల్పోయ్యారు. దీంతో అసంఘటిత రంగ కార్మికులు తీవ్రమైన దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య పెరిగింది. మన దేశంలో 23కోట్ల దినసరి కూలీలు, 20 కోట్లు వలస కార్మికులుగా ఉన్నవారు, స్థిర నివాసం లేక ప్రభుత్వ రేషన్‌ సౌకర్యాలు అందక ఆకలికి గురవుతున్నారు లక్షల్లో ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కోట్లాది బడుగుజీవులకు రోజువారి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటి స్తున్నారు. ఫలితంగా ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి బాధతో, ప్రతి ఇద్దరి బిడ్డల్లో ఒక్కరు పోషకా హార లోపంతో బాధపడుతున్నారు. దీంతో కొవిడ్‌ మరణాల కన్న ఆకలి చావులు పెరిగే ప్రమాద ముందని సామాజిక ఆర్థికవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రకోపంవల్లనే ఈ వైపరీ త్యం అని ప్రభుత్వం బుకాయిస్తుంది. నిజానికి కరోనారాక ముందు కూడ ఆకలిచావులు ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వ విధానపర వైఫల్యమని చెప్పవచ్చు. ప్రభుత్వం చెబుతున్నంత పటిష్టంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదు. పలు విడత లుగా ప్రకటించిన ఉద్దీపన నిధుల్లో సింహాభాగాన్ని రాయితీలు, పన్ను మినహాయింపులు సంపన్న కార్పొరేట్లకే అందాయి. ప్రజలకు అందించింది చాల స్వల్పం.
సామ్రాజ్యవాదానికి మనదేశ సార్వభౌ మత్వాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన వ్యవస్థ గతసర్దుబాటు చర్యలను వ్యవసా యరంగం లో చేపట్టింది. పర్యవసానంగా మన దేశ ఆహార భద్రత నియంత్రణ చట్రం నిర్వీర్యమయింది. ఆహార సార్వభౌమత్వం డొల్లగా మారింది. మొత్తం ఆహార వ్యవస్థ కార్పొరేట్‌ నియంత్రణలోకి వెళ్లింది. ఫలి తంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతు న్నాయి. ఇక వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు (ఇన్‌పుట్స్‌) పెరిగి వ్యవసాయం రైతులకు గిట్టు బాటు కాకుండా పోతుంది. వ్యవసాయ ఇన్‌పుట్స్‌ (విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు, పని ముట్లు వగైరా) కోసం కార్పొరేట్లపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడిరది. అలాగే వినియోగదారుడు కూడ నేరుగా రైతుల వద్ద కాకుండా కొన్ని(మాల్స్‌) సంస్థ లపై ఆధారపడవలసి వస్తుంది. ప్రపంచీకరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ),సరళీకరణ విధానాలు రైతాంగాన్ని, వ్యవసాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆహార భద్రతను సంక్షోభంలోకి నెట్టాయి. వ్యవ సాయం కార్పొరేట్‌ వశమైంది. ఇవాళ ఒకే సంక్షో భంలో వ్యవసాయ సంక్షోభం,ఆహార సంక్షోభం రెండు కలిసిఉన్నాయి.
ఆర్థిక సంస్కరణలు పెంచిన అసమానతలు
1991 నుంచి ప్రభుత్వాలు అమలు చేసిన సరళీ కరణ,ప్రైవేటీకరణ,ప్రపంచీకరణ(ఎల్‌పిజి) విధా నాలు వ్యవసాయాన్ని కృంగ దీశాయి. నిరుద్యోగాన్ని పెంచాయి. ఫలితంగా ఆర్థిక అంతరాలు పెచ్చరి ల్లాయి. మన దేశ సంపద గడిచిన మూడు దశాబ్దా లలో పదిరెట్లు పెరిగింది.పెరిగిన సంపదలో దేశంలోని ఒక్కశాతం కుటుంబాలు73శాతం సంప దను కైవశం చేసుకున్నారు.99శాతం కుటుం బాలకు దక్కేది కేవలం 27శాతం సంపద మాత్ర మే. కరోనా వచ్చిన 2020మార్చి నుండి 2021 మార్చి వరకు దేశంలోని 100మంది కోటీశ్వర్ల సంపద రూ.12,97,822 కోట్లు అదనంగా పెరి గింది. ఇదే కాలంలో 2లక్షల మంది ఉపాధి కోల్పోయారు. బిలియనీర్లు, మిలియనీర్లు 30 శాతం సంపద పెంచుకున్నారు. ఇవాళ దేశంలో60 శాతం కుటుంబాలు ఒక్కగదిలోనే బతుకులు వెళ్లదీ స్తున్నా రు. ఆర్థిక సంస్కరణల వల్ల చిన్న వృత్తులు, చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. కనీసఉపాధి కరువై ప్రజలు,భవిత అగమ్యగోచరంగాఉన్న యువత, దిగువ మధ్య తరగతి, రైతాంగం,కార్మికవర్గం తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నారు. కాస్తోకూస్తో ఆధారం గా ఉన్న ఉపాధి అవకాశాలు కూడా కరోనావల్ల లేకుం డా పోయాయి.
విపత్తులోనూ కోట్లకు పడగలెత్తిన కుబేరులు
భారత్‌లో మోడీ ప్రభుత్వ విధానాల దెబ్బకు మోజారిటీ ప్రజలు కొనుగోలు శక్తి, ఆదాయాలను కోల్పోతోంటే మరోవైపు అపార కుబేరులు అమాం తం పెరిగిపోతున్నారు. ముఖ్యంగా కరోనా కాలం లోనూ దేశంలో కొత్తగా 40మంది కుబేరులు పుట్టు కొచ్చారని తాజాగా ఫోర్బ్స్‌వరల్డ్‌ బిలియనీర్స్‌ రిపోర్ట్‌ లో వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 177కు చేరింది. 2021జనవరిలో హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021ధనవంతుల జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. మిగిలిన 32మంది విదేశాల్లో ఉంటున్నారు. దేశంలో వారానికో కుబేరుడు పుట్టుకొస్తున్నాడని స్పష్టమవు తోంది. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 జాబి తాను ప్రపంచంలో 68దేశాల్లో ఉన్న2,402 కంపె నీలు,3228 బిలియనీర్లను పరిగణనలోకి తీసుకొని విడుదల చేశారు.హురున్‌ రిపోర్ట్‌ ప్రకారం గుజ రాత్‌కు చెందిన ఇద్దరు బడా కార్పొరేట్లు అదానీ, అంబానీల ఆదాయం గతకొన్నేళ్లుగా భారీగా పెరి గింది. ముకేష్‌ అంబానీ మొత్తం సంపద గతేడాది కాలంలో 24శాతం పెరిగి 83 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.6.09లక్షలకోట్లు) చేరుకుంది. గౌతమ్‌ అదానీ కుటుంబం ఆదాయం రెట్టింపై రూ.2.34లక్షలకోట్లకు చేరింది. తర్వాత స్థానంలో శివనాడర్‌ కుటుంబంరూ.1.94లక్షల కోట్ల సంపద తో ఉంది.లక్ష్మినారాయణ మిట్టల్‌ రూ. 1.40లక్షల కోట్లకు చేరింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ ఎస్‌.పూనావాలా రూ.1.35 లక్షల కోట్ల సంపదతో 113 స్థానంలో నిలిచారు. మన దేశ ఆర్థిక వృద్ధి అత్యంత తీవ్ర అసమానతలతో కూడి ఉన్నందున అతి కొద్ది మందికే ప్రయోజనాలను అందిస్తోంది. మార్కెట్లపై నియంత్రణను తొలగించి, ప్రజాధనంతో ప్రోత్సాహకాలను అందించి,పన్ను రాతీయతీలు కల్పించడం వల్లనే సంపన్నుల వద్ద సంపద మేట వేస్తోంటే, శ్రమ జీవులు మాత్రం ఆకలి మంటల్లో చిక్కుకు పోతున్నారు.
అల్పాదాయం,నిరుద్యోగం,వ్యవసా యం ప్రధానంగా ఉన్నఆర్థికవ్యవస్థలో,ఆర్థిక అసమా నతలు,వనరుల అల్ప వినియోగం. అల్ప వేతనాలు, పౌరభాగస్వామ్య లోపం,సంక్షేమ పథకాల వైఫల్యం లాంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణమని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్తలు పేర్కొ న్నారు. వీటన్నింటికి తోడు ఇటీవల కరోనా విపత్తు పేదరికానికి మరింత ఆజ్యం పోసిందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనదేశంలో మెజార్టీ మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పెద్ద సంపాదనే కుటుంబ సభ్యులందరికి ఆహార సముపార్జనకు సాధనం. ఆయనే ఉపాధి కోల్పో వడం, లేదా మరణిస్తే పేదలతో పాటు ఆ కుటుం బాలు సైతం ప్రభుత్వ రేషన్‌తో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. చాలా కుటుంబాలు ఆకలి, అర్థాకలితో పోషకాహార లోపం. ఆరోగ్య సమస్య లతో రోడ్డున పడ్డారు. ఇది వారి ఆహార, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపింది. గత సంవత్స రం కేంద్ర ప్రభుత్వం మార్చిలో అనాలోచితంగా, ముందస్తు చర్యలు ఏమి తీసుకోకుండా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వలస కార్మికుల సమస్యలు వర్ణనా తీతం అని చెప్పవచ్చు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజూ 2200 క్యాలరీలు,పట్టణాల్లో 2100క్యాలరీ లకు సమానమైన ఆహారముండాలి. కానీ గ్రామీణ ప్రాంతంలో 41 శాతం, పట్టణ ప్రాంతంలో 53 శాతం మందికి మాత్రమే లభిస్తున్నాయి. ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో ప్రభుత్వాలు ఆర్థిక’ సంస్కరణలకు తెరదీశాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థలకు పెద్దెత్తున ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిం చాయి. ఇదంతా సాధారణ ప్రజల సొమ్ము. ఇది మొత్తం ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థల గుప్పెట చేరింది. ప్రజలు అనాధలుగా మిగిలారు.
అత్యధికుల్లో పోషకాహార లోపం
కరోనా సంక్షోభం పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతికి ఉపాధిని దూరం చేసింది. మరోవైపు సంక్షేమ పథకాలపై కేంద్రం నిధుల వ్యయం తగ్గించుకోవడంతో వారిని మరిన్ని సమ స్యలు చుట్టుముట్టాయి. ఆ వర్గాల్లోని మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర స్థాయిలో ఉందని తాజా అధ్యయనం ఒకటితేల్చింది. సుదీర్ఘ కాలంగా ఉపాధి లేకపోవటం, సంక్షేమ పథకాల తోడ్పాటు దూరమవ్వటం దేశవ్యాప్తంగా కనపడు తోంది. ఆ వర్గాల్లో అనేక కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సమస్యను పాలకులు చాలా తేలిగ్గా తీసుకుని ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తున్నారని అధ్యయనంలో పరిశోధకులు చెబుతు న్నారు. గర్భిణుల్లో రక్తహీనత, తక్కువ బరువుతో శిశుజననాలు నమోదు కావటం‘పోషకాహార సంక్షో భానికి’ సంకేతాలని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌, ఆర్థిక పరిశోధకుడు అన్మోల్‌ సోమాంచీ చెబుతు న్నారు.సరైన ఆహారం లభించక బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలో 20 కోట్లకు మించి ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఎజెం డాలో ఆహార భద్రత అంశం నీరుగారి పోతోంది. ఆకలి బాధలు, చావులు లేని సమాజం కోసం విధానాలు రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా సమస్యను మరింత జఠిలం చేసే చర్యలు చేపట్టడం ఘోరం. పౌరసరఫరాల శాఖ ద్వారా ఇచ్చే ఆహార దినుసులు కుటుంబానికి సరిపోవడం లేదు. ఆహారం అంటే పౌష్ఠికాహారం అనే అవగాహన ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో నిరుపేదల ఆకలి తీరడం ఒక భ్రమగానే మిగులుతుంది. పేదల ఆకలి తీర్చని ఎన్ని పథకాలు ఉన్నా, దేశ సంపద ఎంత పెరిగినా ప్రజలకు పంపిణి కాకుంటే ఎలాంటి ఫలితం ఉండదన్నది అక్షర సత్యం. రానున్న కాలంలో ఆకలితో ముడిపడిన మానవాళి కష్టాలు మరింతగా పెరిగే అవకాశముందని, పేదలు మరింత తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ‘నేచర్‌ ఫుడ్‌ జర్నల్‌’ పేర్కొంది. అంతర్జాతీయ నివేదికల నుంచి దేశీయ సూచీల వరకూ అన్నీ దేశంలో నెలకొన్న ఆహారోత్ప త్తుల కొరతను స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన కాలం వెళ్లదీస్తున్న అభాగ్యు లు ఆకలికేకలహోరును ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. అయినా ఆసియాలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, త్వరలో చైనాను అధిగ మించే సత్తా మనకు ఉందని ఊహాజనితమైన భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. దేశజనాభా (130 కోట్లు)లో 14శాతం మంది పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. 15నుంచి 45 సంవ త్సరాల మధ్య వయసున్న మహిళల్లో 34.7 శాతం మంది రక్తహీనతతో అల్లాడుతున్నారు. అత్యధికులు ఆరోగ్యపరమైన సమస్యలతో సతమత మవుతు న్నారు. పౌష్టికాహార లేమి కారణంగా మరణిస్తున్న తల్లులు, బిడ్డల సంఖ్య కూడ ఎక్కువే ఉంది. ఇటీవ లనే ‘హంగర్‌ వాచ్‌’ సంస్థ దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 3,994 మందిని కలిసి నిర్వహించిన సర్వేలో కలచివేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అట్టడుగు వర్గాలలో ఆకలి మహమ్మారి తిష్ట వేసుకు కూర్చుందని తెలిపింది. లాక్‌డౌన్‌ విధించ డానికి ముందుకంటే సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2020లో తీసుకునే ఆహారం తగ్గింది. తినే తిండిలో పోషక విలువలూ క్షీణించాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఖాళీ కడుపుతోనే నిద్రకు ఉపక్రమించాల్సిన పరిస్థితిలో మార్పేమీ రాలేదు. ఆదాయం లేకపో వడంతో తినడానికేమీ లేక,ఒకవేళ కొద్దిగా ఆహారం కొనుగోలు చేయగలిగినా పోషకాహారం తీసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులు, మైనారిటీ తెగలకు కేవలం నెలకు రూ.5వేలలోపు ఆదాయం ఉం టుంది.వీరివి అత్యంత దయనీయ గాథలు. లాక్‌ డౌన్‌ ముగిసినప్పటికీ అధికశాతం కుటుంబాల ఆదాయం 62శాతం తగ్గింది.గత ఏడాదితో పోల్చి తే ఈ ఏడాది ఆకలితో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగనుందని అమెరికా వ్యవసాయ విభాగం తాజాగా అంచనా వేసింది. అలాగే ఆహార అభద్రతను ఎదుర్కొనే జనాభా భారత్‌లో 70 శాతం మించే అవకాశం ఉందని పేర్కొంది. ఆకలి సమస్య తీవ్రమవడానికి ప్రధాన కారణం కుటుంబాల ఆదాయం పడిపోవడమేనని నిర్ధారిం చింది. ఈ క్రమంలోనే కొవిడ్‌ తర్వాత మహ మ్మారి మహిళలపై తీవ్ర ప్రభావం చూపే అవకా శం ఉందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, యూఎస్‌ అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డిపి) వెల్లడిరచింది. అందువల్ల కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లో శ్రమ, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు అవకా శాలు కల్పించాలని సూచించింది.2021 నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన డం ఆందోళన కలిగిస్తోంది.యుఎన్‌ లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వ ఆచరణ
పేదరికాన్ని 2030 నాటికి అంతం చేయాలనే ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మన ప్రభుత్వకృషి నత్త నడకను తలపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడిరచింది. ప్రతి నిమిషానికి 11ఆకలి చావులు నమోదవుతున్నాయనే నివేదిక సారాంశమే దీనికి నిదర్శనం. అయినా కూడా యుద్ధాలు, అంతర్యు ద్ధాల కోసం పాలకులు భారీ మొత్తంలో మారణా యుధాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ,ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్‌ డాలర్లు (సుమారుగా రూ.3.6లక్షలకోట్లు) పెరిగిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది.2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్నది. దేశాన్ని సమగ్ర అభివృద్ధి పథం లో నడిపించడం కోసం తక్షణం చేపట్టాల్సిన పని దారి ద్య్రాన్ని నిర్మూలించడం. పేదరికం తగ్గా లంటే ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజారోగ్య వ్యవస్థను, సార్వత్రిక విద్యను, ప్రజల కొనుగోలు శక్తిని మెరుగు పరుచాలి.అభివృద్ధిఫలాలను ప్రజలందరికి సమా నంగా అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రజా సంక్షే మం కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు ప్రజల సాధికారిక కార్యక్రమాలకు నాంది పలు కాలి. అంటే ప్రతి కుటుంబం స్వయం పోషకం కావాలి. ప్రధానంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపుకై వ్యవసాయం, సామాజిక రంగం, ఉపాధి కల్పనవంటి రంగాలపై పెద్దఎత్తున ఖర్చు చేయాలి. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే వాతావరణం సృష్టించాలి. లింగ భేదం లేకుండా మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలను తీసుకురావాలి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి.
భారత్‌ వంటి దేశాల్లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం తప్పని సరి. ఈరంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండిరతలు పేదరికం తగ్గుతుందనే ఆర్థిక వేత్తల అంచనాలున్నాయి. వ్యవసాయం లాభదాయకం కావాలంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్‌ తక్షణం విరమించు కోవాలి. ఇప్పటివరకు దేశంలో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వ అనుచిత విధానాలు ఒకవైపు,మరోవైపు కరోనా సంక్షోభం వెరసి అస్తు బిస్తుగా జీవిస్తున్న ప్రజల జీవితాలు దుర్భర మవుతున్నాయి. కరోనా విజృంభించిన రెండు దశల్లో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పేరిట రెండు విడత లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షల కోట్లు కార్పొరేట్లకే కట్ట బెట్టారు. నైపుణ్యాల కల్పన, యువ తకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అప్పుడే నేటి సంక్షో భానికి చరమ గీతం పాడడంతో పాటు పేదరికం అంతం అవుతుంది. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కన్నా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ విధా నాల్లో ప్రజానుకూల విధానాలు అమల్లోకి రావడం లేదు. అందువల్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించే ఐక్య నిర్మాణాత్మక, ప్రభావశీల ప్రజా పోరాటాలు మాత్రమే ప్రజలను రకరకాల విపత్తుల నుండి, నిరుద్యోగం నుండి, పేదరికం నుండి, ఆకలి బాధల నుండి రక్షించగలుగుతా యన్నది చారిత్రక సత్యం.
-ఎ.నరసింహారెడ్డి

Related Posts

పీసా చట్టం`గిరిజనులకు వరం
చూపు-Chupu

పీసా చట్టం`గిరిజనులకు వరం

January 7, 2022
రైతు గెలిచాడు
చూపు-Chupu

రైతు గెలిచాడు

December 4, 2021
అడుగంటిన బొగ్గు నిక్షేపాలు
చూపు-Chupu

అడుగంటిన బొగ్గు నిక్షేపాలు

November 10, 2021
చత్తీష్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌మ‌త ర‌వి భేటీ
చూపు-Chupu

చత్తీష్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌మ‌త ర‌వి భేటీ

November 10, 2021
ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు
చూపు-Chupu

ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు

October 12, 2021
కుదుపేసిన గులాబ్‌ తుఫాన్‌
చూపు-Chupu

కుదుపేసిన గులాబ్‌ తుఫాన్‌

October 12, 2021
Next Post
మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

నిత్యనూతన ప్రవాహం అంబేడ్కర్ సిద్ధాంతం

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

September 2, 2021
ఏజెన్సీపై గిరిజనేతర పార్టీల ఆధిపత్యం

ఏజెన్సీపై గిరిజనేతర పార్టీల ఆధిపత్యం

February 15, 2021
మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!

మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!

April 12, 2021
పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

April 12, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3