• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home పోరు-Poru

పోడు రైతుల పోరు

team-dhimsa-viz by team-dhimsa-viz
November 10, 2021
in పోరు-Poru
0
పోడు  రైతుల పోరు
0
SHARES
18
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

తరతరాలుగా పొడు భూములనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న జిల్లా పోడు రైతుల పరిస్థితి అగమ్య ఘోచరంగా మారుతోంది. వానాకాల సీజన్‌ మొదలైనప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అటవీ శాఖాధికారుల నుంచి అడుగ డుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి పొడు భూములపై హక్కులు కల్పిం చాలని అధికారుల చుట్టు కాళ్లరిగేలా తిరుగు తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడాపోడు భూములను సాగు చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 31లోపు సాగు చేసుకున్న అటవీ భూములకు హక్కు పత్రాలు అందించాలని కేంద్ర అటవీ హక్కుల చట్టం పేర్కొంటుంది. అలాగే 70 ఏళ్లకు పైగా పోడు భూములను సాగు చేసు కుంటున్న గిరిజనేతర రైతులకు కూడా భూమిపై హక్కు కల్పించాలని చట్టం స్పష్టం చేస్తుంది. అసలే నిరక్షరాస్యులైన పోడు రైతులకు చట్టాలపై ఏ మాత్రం అవగాహన లేక పోవడంతో భూమిపై హక్కు పొందేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో 1లక్ష ఎకరాల వరకు పొడుభూములు ఉన్నట్లు అటవీ శాఖాధి కారుల అంచనా వేస్తున్నారు. అనాధికారికంగా మాత్రం పొడు భూముల విస్తీర్ణం మరింత అధికంగానే ఉంటుందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56వేల 358మంది పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రామ సభల ద్వారా 37వేల 372 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు లక్ష 35వేల 99ఎకరాలకు గాను హక్కు పత్రాలను అందజేశారు. మరో 18వేల 886 దరఖాస్తులను వివిధ రకాల కారణాలతో తిరస్కరించారు. అయినా రైతులు ఆ భూము లను సాగు చేసుకోవడంతో అటవీ శాఖాధి కారులు దాడులు చేస్తూ లాక్కునే ప్రయత్నం చేయడంతో వివాదాస్పదంగా మారుతోంది. ఇలాంటి భూముల్లో హరిత హారం మొక్కలు నాటేందుకు అటవీ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. అటవీ హద్దుల చుట్టు భారీ కందకాలు తవ్వడంతో పంట చేనులోకి వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలో పోడు భూములపై వివాదం చెలరేగుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోడు భూములకు హక్కుపత్రాలు కల్పించాలన్న డిమాండ్‌తో రైతులు రహదారుల దిగ్బంధానికి సిద్ధమవుతున్నారు.
అమలుకు నోచుకోని హామీలు..
ప్రతి సారి ఎన్నికల సమయంలో జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ప్రధానంగా పోడు భూముల సమస్యను ప్రస్థావిస్తూ పరిష్కరిస్తా మంటూ హామీలివ్వడం,ఆ తర్వాత ఆ విష యాన్నే పూర్తిగా మరిచి పోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతోంది. ఏజెన్సీలో గిరిజనేతర రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతామంటూ చెబుతున్న పట్టింపేలేకుండా పోతోంది. గత్యంతరం లేక పోడు భూములను సాగు చేసుకుంటున్న అటవీ శాఖ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేసి ట్రాక్టర్‌, కాడెద్దులను స్వాధీనం చేసుకుంటున్నారు. అసలే పొడు రైతుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండ డంతో అటవీ శాఖ అధికారుల దెబ్బకు కోలు కోలేక పోతున్నారు. చేసేది ఏమి లేక వ్యవ సాయ కూలీలుగా మారుతున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే ధ్వంసం కావడంతో ఊపిరి తీసుకుంటున్నా రు. ఉన్న కాస్త పోడు భూమిని వదులుకోలేక కన్నీళ్లు పెట్టుకుం టున్నారు. అయినా అటవీ శాఖ అధికారులు కనికరం చూపించక పోవడంతో పంటల సాగుకు దూరమవుతున్నారు. అటవీ భూము ల్లోకి చొరబడితే అడ్డుకొని తీరుతామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించడంతో గిరిజన గ్రామాల్లో నిత్యం పోడు సాగు భయం భయంగానే సాగుతోంది.
పరిష్కారం చూపని సమగ్ర సర్వే..
గతంలో చేపట్టిన సమగ్ర భూ సర్వే ద్వారా పోడు భూములకు పరిష్కారం దక్కుతుందని భావించినా ఇప్పటికి అవే కష్టాలు కనిపిస్తున్నాయి. అటవి శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేక పోవడంతో భూ హద్దులపై వివాదమే కొనసాగుతోంది. గతంలో పోడు భూముల్లో సర్వే చేపట్టిన సిబ్బంది రైతు లకు ఎలాంటి రశీదులను ఇవ్వక పోవడమే అసలు సమస్య కు కారణమంటున్నారు. ప్రస్తుతం రైతులు పోడు భూముల్లో సాగు చేస్తున్నట్లు గుర్తించేందుకు కూడా అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామ సభల్లో హక్కుదారులను గుర్తించిన ఎలాంటి ఆధారం లేదన్న సాకుతో హక్కు పత్రాలు ఇవ్వడంలే దంటు న్నారు. ఏనాడైనా భూమిపై హక్కులు రాక పోతా య న్న ఆశతో అధికారుల చుట్టూ తిరుగుతు రైతులు అవస్థలపాలవుతున్నారు. ఎలాంటి భూ సమస్యకు ఆ స్కారం లేకుండా పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నా పోడు భూముల సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీసం గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులకైనా హ క్కు పత్రాలు అందిస్తే కొంత మేరకైనా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కనుంది.
పోడు భూములపై హక్కు కల్పించాలి..
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా జీవిస్తున్న గిరిజన రైతులకు పోడు భూములపై తక్షణమే హక్కులు కల్పించాలి. ప్రస్తుతం సాగు చేసుకుం టున్న రైతులందరికీ అవకాశం ఇవ్వాలి. అధికారులు పోడు రైతులను వేధిస్తే సహించేది లేదు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చి ఇప్పుడు అటవీ శాఖ అధికారులతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసం. ప్రతి పోడు రైతుకు హక్కు పత్రం ఇవ్వాలి..ఇటీవల ముగిసిన తెలంగాణ శాసన సభలో పోడు భూముల సమస్యపై గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తావనలు, ప్రకటనలు వింతగా ఉన్నాయి. అటవీ హక్కుల చట్ట సారానికి వ్యతి రేకంగా సాగుతున్న ఈ మాటల గారడీలు ముఖ్యమంత్రి ఎందుకు ఎవరి ప్రయో జనం కోసం చేస్తున్నారు? పరిమితులులేని పారిశ్రామీకరణ,మైనింగ్‌,భారీ ప్రాజెక్టుల నిర్మాణలే అటవీ, పర్యావరణ వినాశనానికి కారణమని ప్రపంచ పర్యావరణ శాస్త్రం చెపుతుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఆదివాసులు చేసే కొండపోడు సాగు వలన అడవి తగ్గిపోతుందని గగ్గోలు పెడు తోంది. నిజమేమిటో పోడు చట్టంలో ఉంది. అడవిని ఆదివాసులను విడదీసి చూడరాదు. పర్యావరణ సమతుల్యాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నది వారే. అడవిని తల్లిగా భావించి చేసే ఆరాధనలో ఒక పార్శ్వం పోడుసాగు. పచ్చదనాన్ని పునరుత్పత్తి చేయడమే పోడుసాగు సారం. వర్షాలు రాకపోవటానికి పోడు వ్యవసాయానికి సంబంధం లేదు. మేఘాల నాకర్షించే మహావృక్షాలను పోడులో నరకరు. చేపలు నీరు తాగటం వలనే చెరువులు ఎండిపోతున్నాయని నమ్మటం ఎంత అశాస్త్రీ యమో రిజర్వు ఫారెస్టులో గిరిజనులు పోడు చేయటం వలన అడవులు నాశనమవు తున్నాయని చెప్పటం అంతే అశాస్త్రీయం. అటవీ భూములపై సాగు హక్కు మాత్రమే కాదు, ఈ చట్టం అన్ని అటవీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చమని చెప్పింది. సెక్షన్‌ 4(5) ఏ పోడు సాగుదారుల్ని హక్కుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అతని సాగులో ఉన్న భూమి నుండి తొలగించరాదని స్పష్టంగా చెపుతోంది. కాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలగింపులకు పాల్పడుతున్నది. అసిఫాబాద్‌ జిల్లా, కొలాంగొంది గ్రామాన్ని రాత్రికిరాత్రి బలవంతంగా ఫారెస్టు, పోలీసు వారు కలిసి ఖాళీ చేయించారు. వారు ఇస్తామన్న భూమిగాని, కడతామన్న ఇండ్లుగాని రెండేం డ్లుగా ఇవ్వలేదు. హైకోర్టు సుమోటుగా ఆదేశించినా కూడా ములుగు జిల్లా తాడ్వాయి మండలం జనగలంచ, దేవునిగుట్ట, ఏటూరు నాగరం మండలం చింతలమొర్రి, మంగపేట మండలం ప్రాజెక్టు నగర్‌ గుంపుపై ఫారెస్టు సిబ్బంది దాడులు, గుడెసెల కూల్చివేత, కాల్చి వేత సాగుతూనే ఉన్నది. అసిఫాబాద్‌ జిల్లా కొత్త సారసాలలో ట్రెంచింగ్‌ పనులను అడ్డగించారని నాయక్‌ పోడ్‌ గిరిజనులపై పీడీ యాక్ట్‌ క్రింద కేసు నమోదు చేసారు. మంచిర్యాల జిల్లా, జెన్నారంలో చేతివృత్తులవారిపై కేసులు పెట్టారు. వారి గొడ్డళ్ళు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక 200పైగా కొత్త ఫారెస్టు చెక్‌పోస్ట్‌లు పెట్టి ప్రతి చెక్‌పోస్ట్‌కి సాయుధ పోలీసులను, మిలిషియా గస్తీ దళాలను ఏర్పాటు చేయటం దేనికోసం. ఇది అటవీ రక్షణకా? లేక అడవి బిడ్డలను భయభ్రాంతులను చేయటానికా? వలస రావటం, వలస పోవటం నేరం కాదు. బతుకుదెరువు కోసం ఆవాగు ఒడ్డున ఈ కొండమాటున నివాసాలు ఏర్పాటు చేసుకొని తమదైన సాంప్రదాయ జీవనం గడిపేవారిని, 3,4దశాబ్దాల క్రితం నుండి మన అడవులలో ఉన్నవారిని మనవారు కాదని నిందించటం న్యాయం కాదు. గిరిజన గ్రామాల పొలిమేరలకు (సరిహద్దులు) వారిని రక్షించే శక్తులుంటాయని నమ్ముతారు. గిరిజన గ్రామ సాంప్రదాయపు పొలిమేరను గిరిజనుల కట్టుబాట్లు, అలవాట్లు కు చట్టబద్దత కల్పించటమే ఈ చట్టం యొక్క ప్రత్యేకత. 2015 జూలైలో మొదలైన ‘’హరిత హారం’’ లక్ష్యాన్ని మించి విజయవంతమైందట! 230 లక్షల మొక్కలు నాటాలకుకొని 239 లక్షల మొక్కలు నాటారట. ఫలితంగా 3.67 శాతం అడవి పెరిగిందట! కాని ఎవరి భూమి లో ఎక్కువగా నాటారు. హక్కులు గుర్తించని గిరిజనుల భూములు, హక్కు పత్రాలు ఇచ్చిన భూములను కూడా ఆక్రమించి మరీ నాటారు. గిరిజనులు వేసుకున్న పంటలను దన్నేశారు. మొక్కలు నాటడం-పీకడం, గోతులు తవ్వటం, పూడ్చటం ఒక్కమాటలో ఆదివాసులకు అటవీ అధికారులకు మద్య ఘర్షణ (తగాదా) కేంద్రీకృతమైంది. దీనికి ప్రభుత్వం కాదా కారణం? తిరస్కరించిన క్లెయిమ్స్‌ పరిశీలిస్తే 35శాతం తిరస్కరణకు కారణం 2005, డిశంబర్‌ 13తర్వాత సాగు చేస్తూ ఉన్నారని అటవీశాఖ వాదించింది. ముఖ్యమంత్రి సభకి చెప్పిందేమిటి? తెలంగాణ ఆవిర్భావం నాటికి (అంటే 2-6-2014)కట్‌ ఆప్‌ డేట్‌ కొరకు చట్టాన్ని సవరించి ఎక్కువమందికి పట్టాయిచ్చేలా చేస్తారట, అందుకు శాసనసభ తీర్మానం చేస్తారట, ప్రధానమంత్రి వద్దకు అఖిల పక్షం తీసుకువెల్తారట! సమస్యని పరిష్కరించటం మాని మరింత సంక్లిష్టం చేయటం ఏం న్యాయం..?
‘’కన్నతల్లికి కూడుపెట్టని కొడుకు పినతల్లికి పట్టుచీర కొంటానన్నాడట…’’ అలా ఉంది సర్కారు తీరు. పార్లమెంట్‌ చేసిన చట్టానికి అసెంబ్లీ తీర్మానం ఏమిటి? ప్రధాన మంత్రి వద్దకు అఖిలపక్ష రాయబారాలు దేనికి? నిజంగానే చట్ట సవరణ చేయాలన్నా కరోనా గ్యాప్‌ వచ్చినా 2014 నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మీ పార్టీ ఎంపీలు సవరణ తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇటీవల మన పక్కరాష్ట్రంలో లక్షన్నర ఎకరాల పోడుకు పట్టాలిచ్చారు. మీరెందుకు ఇవ్వలేరు?
అక్టోబరు మూడో వారంలో ధరఖాస్తులు తీసుకుంటారట. శాసనసభ్యులు దీనికి నాయకత్వం (బాధ్యత) వహించాలట. అంటే చట్టంలో / రూల్స్‌లో ఉన్న విధంగా కాక పోడు రైతులు పదవీకారుల చుట్టూ తిరగాలన్నమాట!
అడవిలోపల ఇక గ్రామాలను ఉండనివ్వరట. సభ బయట గౌరవ ముఖ్యమంత్రి చెప్పే శుభాషితాలు విని పోడు రైతులు రెండు నిర్థారణలకు రావచ్చు. 1. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం-దాని నాయకుడు పోడు చట్టంలోని ప్రతి పేరాకు, ప్రతి సెక్షన్‌కు వ్యతిరేకం. 2. హక్కు పత్రాలు ఇవ్వకుండా సాకులు వెతుకుంటున్నారు. కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన దాడిను పోడు రైతులపై (ఆదివాసులపై) మొహరించివుంది. గతంలో 2002-2003లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలలో 3లక్షల మంది ఆదివాసీ పోడు రైతులను 1,52,600 ఎకరాల అటవీభూమి నుండి తొలగించిన చరిత్ర బీజేపీకి ఉంది. సుప్రీంకోర్టు 13-2-2020 నాటి తీర్పులో తిరస్కరించిన ధరఖాస్తు దారులైన పోడు రైతులను భూమి నుండి తొలగించాలని ఆదేశించింది. ఇది పోడు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం గిరిజనులను తొలగించి అడవిని, అటవీ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్ట డానికి అవసరమైన చట్ట సవరణలు చేస్తోంది. పోడు రైతులు కోరేదేమిటి? ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 25లక్షల ఎకరాలు అటవీ భూమికి పోడు హక్కు పత్రాలు ఇస్తానని నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా 2007-2008 కాలంలో మొదటి రోడ్‌ మ్యాప్‌ ప్రకటించి 1,65,502 మంది గిరిజనులకు సుమారు 4.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చారు. 1,53,231 ధరఖాస్తులు తిరస్కరించారు. సుమారు 2103 వన సంరక్షణ సమితుల పేరుతో 10 లక్షల ఎకరాల ఉమ్మడి హక్కు పత్రాలు పొంది అటవీ శాఖ ఆధీనంలోనే ఉంచుకుంది. జాతీయ మోనిటరింగ్‌ కమిటీ వీటిని రద్దు చేసి విఎస్‌ఎస్‌ సభ్యులకు పంచమన్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 13లక్షల ఎకరాల అటవీభూమి గిరిజనుల, గిరిజనేతర పేదల సాగులో ఉన్నది. దీనిలో గణనీయమైన భాగం రెవెన్యూ అటవీశాఖ మధ్య వివాదాస్పదంగా ఉంది. సమగ్ర సర్వే జరగలేదు. అటవీ హక్కుల నిర్ధారణ కోసమైనా శాస్త్రీయమైన సర్వే తక్షణ అవసరం. ఈ ప్రభుత్వానికి నిజంగా గిరిజనులపై ప్రేమ ఉంటే చట్టంపై గౌరవముంటే అటవీ హక్కుల చట్టం అమలుకు రెండో రోడ్‌ మ్యాప్‌ (షెడ్యూల్‌) తక్షణం ప్రకటించాలి. పోడురైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. వలస ఆదివాసీ గ్రామాలపై ఫారెస్టు వారి దౌర్జన్యాలు ఆపాలి. కందకాల తవ్వకాలు (టెంచింగ్‌) నిలిపివేయాలి. చట్టంపై అధికారులకు పోడు సాగుదార్లకు అవగాహన కలిగించాలి. పోడు రైతులందరికి క్లైయిమ్‌ ఫారాలు ఉచితంగా సరఫరా చేయాలి. కళాజాతాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలి. తిరస్కరించిన ధరఖాస్తులను పున:పరిశీలన చేయాలి. గ్రామసభ పరిధిని అధికారాలను కుదించరాదు. నూతన ఎఫ్‌.ఆర్‌.సి. కమిటీలు ఏర్పాటు చేయాలి. కానీ సాంప్రదాయపు హక్కులకు చట్టబద్దత కల్పించుటలో,జరిగిన చారిత్రక అన్యాయాల్ని సరిచేయటంలో ఈ చట్టం ఒక ముందడుగు. కంపెనీలకు కార్పొరేట్లకు దాసోహం అంటున్న పాలక వర్గాలు భూమి సమస్యను సంపూర్ణంగా పరిష్కరిస్తా యని భ్రమపడరాదు. అందుకే చట్టం పట్ల అవగాహన పెంచుకుని, పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించడమే ఇప్పుడు పోడురైతుల ముందున్న కర్తవ్యం.
పోడు రైతులకు హక్కులు
అడవిబిడ్డల కల నెరవేరబోతున్నది. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించు కున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తుండగా, దసరా తర్వాత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరి స్తారని సర్కారు ప్రకటించింది. పూర్తిస్థా యిలో పరిశీలన తర్వాత యంత్రాంగం పట్టాలు జారీ చేయనుండగా,సర్వత్రా హర్షం వ్యక్తమవు తున్నది. ఏళ్లకేళ్లుగా తమ భూములకు పట్టాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రస్తుతం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తమకు మేలు జరుగుతుందని గిరిజనం మురిసిపోతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉం టారు. వీరంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. పట్టాలున్న గిరిజనులు సర్కారు అందిస్తున్న సాయం తో తమ భూముల్లో పంటలు పండిస్తూ ఉపాధిని మెరుగుపర్చు కుంటున్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీ గూడేలు,గిరిజన తండాలకు ఆనుకొని ఉన్న ఖాళీ భూములు,అడవులు నరికివేతకు గురైన భూముల్లో కొందరు ఎన్నో ఏళ్లుగా పంట లు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో పోడు వ్యవసాయం చేస్తున్న కొందరి రైతులకు అప్పటి ప్రభు త్వం అటవీ హక్కు పత్రాలను అందజేసింది. ఉమ్మడి జిల్లాలో 1,36,117 ఎకరాల్లో పంటలు పండిస్తున్న 37,324 మంది రై తులకు ప్రస్తుతం హక్కు పత్రా లు ఉన్నాయి. ఆదిలా బాద్‌ జిల్లాలో17,657 మంది రైతులకు 69,654 ఎకరాలు,ఆసిఫాబా ద్‌ జిల్లాలో 12,635 మం ది రైతులకు 46,329 ఎక రాలు, నిర్మల్‌ జిల్లాలో 5500 మంది రైతులకు 16,589 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1532 మంది రైతులకు 3544 ఎకరాలకు సం బంధించిన హక్కు పత్రాలను అందజేశారు. ప్రత్యేక రాష్టం ఏర్ప డి.. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత హక్కు పత్రాలున్న గిరిజన రైతులందరికీ రైతుబంధు పథకం వర్తింపజేస్తున్నారు. రెండు సీజన్‌లకుగానూ రూ.136.11 కోట్ల రైతుబంధు డబ్బులను వారి బ్యాం కు ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పంట పెట్టుబడితో గిరిజన రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
పోడు భూముల సమస్యకు పరిష్కారం
రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప ట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించా రు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ సమస్యకు పరిష్కారం లభించనున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 వేలకు పైగా రైతులు లక్ష నుంచి 1.25 లక్షల ఎకరాల్లో పో డు వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నా రు. ఏజెన్సీ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో అటవీభూముల్లో గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా పోడు వ్యవసాయం కారణంగా పలు సమస్యలు వస్తున్నా యి. అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అక్కడికి వెళ్ల డం.. రైతులు అడ్డుకోవడంలాంటి ఘటన లు జరుగుతున్నాయి. ఈ భూములు సాగు చేస్తున్న వారికి బ్యాంకు రుణాలు, ఇతర సా యం కూడా లభించదు. సీఎం తీసుకున్న నిర్ణయంతో పోడు వ్య వసాయం చేస్తున్న రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నా యి. దసరా తర్వాత రైతు ల నుంచి ఆయా నియోజకవర్గాల ఎ మ్మెల్యేలు దరఖాస్తులు తీసుకుంటారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత అధికారులు అర్హులైన వారికి పట్టాలు జారీ చే స్తారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో తమకు సాయం అందడం తో పాటు ఇ తర ప్రయోజనాలు చేకూరే అవకాశముందని గిరిజ న రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇంద్రవెల్లిలో సీఎం చిత్రపటానికి గిరిజన రైతులు క్షీరాభిషేకం చేశారు.-డాక్టర్‌ మిడియం బాబూరావు,ర‌చ‌యిత‌-మాజీ పార్ల‌మెంటు స‌భ్యులు

Related Posts

పోరు-Poru

విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

January 7, 2022
ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
పోరు-Poru

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

January 7, 2022
నోబెలే గుర్తించింది..మరి పాలకులు…?
పోరు-Poru

నోబెలే గుర్తించింది..
మరి పాలకులు…?

January 7, 2022
ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు
పోరు-Poru

ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు

December 4, 2021
72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి
పోరు-Poru

72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

December 4, 2021
ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి
పోరు-Poru

ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి

December 4, 2021
Next Post
మా గుండెల్లో చెరగని మీ సింహసనం

మా గుండెల్లో చెరగని మీ సింహసనం

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

September 14, 2021
అమ్మాయి వివాహం వ‌య‌స్సు 21కి పెంపు

అమ్మాయి వివాహం వ‌య‌స్సు 21కి పెంపు

January 7, 2022
గిరిజ‌నుల గోడు వినేదెవ‌రు?

గిరిజ‌నుల గోడు వినేదెవ‌రు?

September 2, 2021
పోవరం ఎవరికి వరం.. ఎవరికి శాపం…!

పోవరం ఎవరికి వరం.. ఎవరికి శాపం…!

April 12, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3