• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home తీరు-Teeru

బొక్కోసిన నిధులకు పక్కాగా లెక్కలు..?

team-dhimsa-viz by team-dhimsa-viz
October 12, 2021
in తీరు-Teeru
0
బొక్కోసిన నిధులకు పక్కాగా లెక్కలు..?
0
SHARES
11
VIEWS
Share on FacebookShare on Twitter

వివిధ జిల్లాల పరిధిలో సుమారు 60 వేల పనులను పరిశీలించి 1000 కోట్ల రూపాయలకు పైగా ఉపాధి నిధులు దారిమళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగానే నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేవలం 60 వేల పనుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో దొపిడీ బయట పడిరదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సుమారు 16 లక్షల పనులను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో అన్న సందేహాలు అధికారుల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. ఏడు రకాల రికార్డుల్లో: అనుకూలంగా పద్దులు 13 జిల్లాల పరిధిలోని 12,944 గ్రామ పంచా యతీల పరిధిలో 20 లక్షల రూపాయలకు పైబడిన పనులు ఇప్పటి వరకు 8, 517 జరిగాయి. అలాగే 10 లక్షల పైన 20 లక్షలలోపు 2, 548 పనులు చేపట్టారు.5 నుంచి 10 లక్షల లోపు సుమారు 1000 పనులు మంజూరు చేశారు. 2 లక్షల నుంచి 5లక్షల లోపు 426 పనులు, లక్ష నుంచి 2లక్షల లోపు 126 పనులు మంజూరు చేశారు. గడిచిన రెండు మూడు నెలల్లో చేపట్టారు. గత ఏడాది నుంచి ప్రస్తుత ఏడాది వరకు అన్ని రకాల పనులు సుమారు 16 లక్షలకు పైగా మంజూరు చేశారు. అందుకు సంబంధించి వేలకోట్ల రూపాయలను కేటా యించారు. రాష్ట్రాన్ని లోటు బడ్జెట్‌ వెంటాడుతున్నా అభివృద్ధి పనుల విషయంలో వెనుకడుగుకు ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా వీలైనంత వరకు ఎక్కువ పనులను మంజూరు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు.
ఆదిశగానే కూలీలకు వీలైనంత ఎక్కువ రోజులు పనిదినాలు కల్పించాలని ఆదిశగా గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మేర పనులు మంజూరు చేస్తూ వస్తున్నారు. అయితే కింది స్థాయిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీఏ), ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)లు ఉపాధిహామీ పథకాన్ని పక్కదారి పట్టించేసి ప్రభుత్వ ఆశయానికి అడుగడుగునా గండి కొట్టారు. ఫలితంగా రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ దిశ గానే త్వరలో ఉపాధి పనులను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి రాబోతున్నాయి. అయితే తాము చేసిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మండల స్థాయిలో అధికారులు కేంద్ర బృందం వచ్చేలోపు తమకు అనుకూలంగా లెక్కలను సరిదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటివరకు బొక్కేసిన నిధులకు సంబంధించి ఎక్కడా కూడా తమ తప్పులు కనిపించకుండా ఉండేలా పక్కాగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు.ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏడు రకాల రికార్డుల్లో పద్దులను అనుకూలంగా మల్చుకుంటున్నారు. గడిచిన వారం పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉపాధి హామీ సిబ్బంది ఈతరహా పనిలోనే నిమగ్నమయ్యారు.
రాష్ట్రంలో కూలీలకు వీలైనంత వరకు ఎక్కువ రోజులు పనిదినాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రతి జిల్లాలోనూ అవసరమైన మేరకు అడిగిన వెంటనే పనులు మంజూరు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌ 1వ తేది నుంచి జులై నెలాఖరు వరకు నాలుగు నెలల కాలంలో రికార్డు స్థాయిలో 71. 90 లక్షల మందికి పనులు కల్పించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కూలీలకు పని కల్పించడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇదే విషయమై ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీఎం జగన్‌ పనితీరును ప్రశంసించారు. రోజువారి కూలీకి 221 రూపాయలు వంతున గడిచిన నాలగు నెలల్లో సుమారు 4485 కోట్ల రూపాయలు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించి మరో రికార్డు సృష్టించారు.
ఇలా సీఎం జగన్‌ ఉపాధి పథకం ద్వారా అభి వృద్ధి పనులు చేపట్టడంలో కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుం టుంటే కింది స్థాయి సిబ్బంది మాత్రం తమ చేతివాటంతో అవినీతిలో రికార్డు సృష్టిస్తున్నారు. ఇదే విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇటీవల రాష్ట్ర సామాజిక తనిఖి జవాబుదారీతనం పారదర్శకత సంస్థ (ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ) పలు జిల్లాల్లో పనులను తనిఖీ చేసింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించింది. వివిధ జిల్లాల పరిధిలో సుమారు 60 వేల పనులను పరిశీలించి 1000 కోట్ల రూపాయలకు పైగా ఉపాధి నిధులు దారిమళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగానే నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేవలం 60 వేల పనుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో దొపిడీ బయట పడిరదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సుమారు 16 లక్షల పనులను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో అన్న సందేహాలు అధికారుల్లో సైతం వ్యక్తమవుతున్నాయి.
ఏడు రకాల రికార్డుల్లో: అనుకూలంగా పద్దులు 13 జిల్లాల పరిధిలోని 12,944 గ్రామ పంచా యతీల పరిధిలో 20 లక్షల రూపాయలకు పైబడిన పనులు ఇప్పటి వరకు 8, 517 జరిగాయి. అలాగే 10 లక్షల పైన 20 లక్షలలోపు 2, 548 పనులు చేపట్టారు.5 నుంచి 10 లక్షల లోపు సుమారు 1000 పనులు మంజూరు చేశారు. 2 లక్షల నుంచి 5లక్షల లోపు 426 పనులు, లక్ష నుంచి 2లక్షల లోపు 126 పనులు మంజూరు చేశారు. గడిచిన రెండు మూడు నెలల్లో చేపట్టారు. గత ఏడాది నుంచి ప్రస్తుత ఏడాది వరకు అన్ని రకాల పనులు సుమారు 16 లక్షలకు పైగా మంజూరు చేశారు. అందుకు సంబంధించి వేల కోట్ల రూపాయలను కేటాయించారు.
కొన్ని పనులకు సంబంధించి బిల్లులు చెల్లించగా మరికొన్ని పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పనులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆడిట్‌ బృందం పలు జిల్లాల్లో పనులను తనిఖీ చేసింది. సుమారు 16 లక్షల పనులను పరిశీలించి వాటిలో 2. 60 లక్షల పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది.
అలాగే 60 వేల పనులకు సంబంధించి ఆడిటన్ను నిర్వహించింది. దీంతో ఉపాధి అక్రమాలు వెలుగు లోకి వచ్చాయి. అసలు కేంద్రం సూచించిన నిబం ధనలను పాటించకుండా అందుకు పూర్తి భిన్నంగా పనులు చేపట్టి కోట్లాది రూపాయలను బొక్కేసిన ట్లుగా గుర్తించింది. కేవలం కొన్ని పనులను పరిశీ లిస్తేదే 40శాతంకు పైగా అక్రమాలు బయట పడ్డాయి. పూర్తి స్థాయిలో ఆడిట్‌ నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదు. ఇదే విషయంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం, అందుకోసం కేంద్రం నుంచి తనిఖీ బృందాలను పంపాలని నిర్ణయం తీసుకోవడంతో కింది స్థాయి అధికారులు రికారులను సరిచేసే పనిలో పడ్డారు.
చెరువు పూడికతీత పనుల్లో వారిదే ఇష్టారాజ్యం: చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడం ద్వారా ఇటు రైతులతో పాటు అటు గ్రామీణ కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించినట్టవుతుందని దిశగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన మేర చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని జలవనరుల శాఖకు సూచించారు. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు.
ఉపాధి నిధులతో శ్రీకారం చుట్టిన ఈ పనులకు సంబంధించి కింది స్థాయిలో టీఏ, ఎస్‌ఏలు మండల స్థాయి అధికారులతో కలిసి కూలీల సొమ్మను కూడా బొక్కేశారు. అసలు చెరువు పనులు చేపట్టకుండానే చేసినట్లుగా రికారులు చూపి ఆయా గ్రామాలకు చెందిన కూలీల పేరుతో మసర్లు వేసి వారికి వారానికి 1200 నుంచి 1400 చెల్లించినట్లుగా రికార్డులు చూపారు. తిరిగి కూలీల నుంచి ఆసామ్ములో 40శాతం తమ ఖాతాకు మళ్లించుకున్నారు. ఈ తరహా అక్రమాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో సీఎం జగన్‌ ఆశయాలకు తూట్లు పడడంతో పాటు ప్రశంసించిద కేంద్రమే. పనుల పరిశీలనకు ప్రత్యేక బృందాలను పంపే పరిస్థితికి వచ్చింది.
ఉపాధి హామీ చట్టం అమలులో ప్రభుత్వాల వైఫల్యం

  • దడాల సుబ్బారావు,తూ॥గో॥జిల్లా
    కేంద్రం లోని యుపిఎ ప్రభుత్వం 20 05లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది. పనులు దొరక్క పొట్ట చేత పట్టుకుని వలసపోయే కార్మికుల కోసం ఏర్పాటు చేసినదీ పథకం. దీని ప్రకారం ఒక కుటుంబానికి సంవత్సరంలో 100 పని దినాలు కల్పించాలి. పని చేసిన తరువాత 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని షెడ్యూల్‌- 2,పేరా29నిబంధన సూచిస్తున్నది. 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించకపోతే 16వ రోజు నుండి రోజుకు 0.05 శాతం నష్టపరిహారం చెల్లించాలని చట్టం చెబుతున్నది. సకాలంలోనే వేతనాలు చెల్లిస్తున్నాం కనుక ఎటువంటి నష్టపరిహారం చెల్లించనవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పార్లమెంటరీ స్టాండిరగ్‌కమిటీ రాష్ట్రంలోని 20 192020,20202021,20212022 సంవ త్సరాలలో ప్రభుత్వం చెల్లించిన ఉపాధిహామీ వేత నాల రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వాస్తవం కాదని, వేతనాలు చెల్లించడంలో ఆలస్యం అవుతున్నప్పటికి, కూలీలకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించడం లేదని నిర్ధారణ అయిం ది. ఇదే విషయాన్ని తన నివేదికలో పేర్కొన్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపు రెండు దశలుగా ఉంటుంది. పనిపూర్తి అయిన 8 రోజుల్లోగా నిధులు చెల్లించాలని కోరుతూ కేం ద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలి. అనం తరం కేంద్ర ప్రభుత్వం కూలీల బ్యాంక్‌ఖాతా లోకి 7రోజుల్లోగా వేతనాలు జమ చేయాలి. పని పూర్తైన 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. ఈ పద్ధతి ఏవిధంగా అమలు జరుగుతున్నదనే విషయం మీద రాష్ట్రంలోని మొత్తం 12,956 పంచా యతీలలో 130పంచాయతీల(1శాతం)లో పార్ల మెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రాండమ్‌ సర్వే జరి పింది. 20202021,20192020 సంవత్స రాలలో జాబ్‌ కార్డులు వారీగా బ్యాంక్‌లో జమ చేయబడిన వేతనాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపడం, కేంద్రం సకాలంలో వేతనాలు చెల్లింపు గురించి పరిశీ లించింది. దీనిప్రకారం చూస్తే 3.95 లక్షల జాబ్‌ కార్డులను పరిశీలించగా34శాతం జాబ్‌ కార్డు దారులకు 2021ఆగష్టు 10నాటికి వేతనాలు చెల్లించలేదని, కేవలం 130 పంచాయతీల్లో 2.58 లక్షల జాబ్‌ కార్డుదారులకు మాత్రమే వేతనాలు సకాలంలో చెల్లించడం జరిగిందని స్టాండిరగ్‌ కమిటీ ఇటీవల తన నివేదికలో బహిర్గతం చేసింది. రాష్ట్రం నుండి కేంద్రానికి నివేదిక పంపడంలో, కేంద్రం వేతనాలు జమ చేయడంలో నెల రోజులకు పైగా ఆలస్యం అవుతున్నదని, ఇదిసరికాదని స్టాం డిరగ్‌ కమిటీ సూచించింది. చట్ట ప్రకారం 15 రోజుల్లో ఆ వేతనాలు చెల్లించాలనే నియమాన్ని తప్పకుండా అమలు చేయాలని సూచించింది. 20 శాతం కన్నా తక్కువ జాబ్‌ కార్డుదారులకు మాత్రమే నిబంధనల ప్రకారంగా వేతనాలు చెల్లిస్తున్నారని 3 శాతం పైగా జాబ్‌ కార్డుదారులకు రెండు నెలలు పైగా వేతనాల బకాయిలు ఉంటున్నాయని నివేదిక పేర్కొన్నది. దాదాపు సగం మంది జాబ్‌ కార్డు దారులకు వేతనాల చెల్లింపులో 30 రోజులు పైగా ఆలస్యం అవుతున్నదని,31రోజుల నుండి 45 రోజుల వరకు10,763(8.3శాతం) జాబ్‌ కార్డు దారులకు,46-60రోజుల వరకు 17,638 (13.7 శాతం),60రోజుల పైన 38,405 (29.8 శాతం) జాబ్‌ కార్డుదారులకు వేతనాలు బకాయిలు వున్నా యని నివేదిక పేర్కొన్నది.15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టిం చుకోకపోవడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేంద్రం ఇవ్వాల్సిన నిధులు నెలరోజులు పైగా బకాయిలు పెట్టింది. కరోనా కాలంలో పను లు తగ్గిపోయాయి. గత సంవత్సరం ఏప్రిల్‌-జులై కాలంలో 20.09 కోట్ల పని దినాలు కల్పించగా ఈ సంవత్సరం కేవలం 19.12 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించబడ్డాయి. సకాలంలో వేతనాలు చెల్లించాలని, పని దినాలు కూడా పెంచాలని స్టాం డిరగ్‌ కమిటీ సూచించింది. పనులు పూర్తి అయిన తరువాత సకాలంలో వేతనాలు చెల్లించడంలో జరిగే జాప్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఆలస్యానికి నష్టపరిహారం చెల్లించాలని, ఆ విధంగా చూస్తే ఏప్రిల్‌-జులై మధ్య కాలంలో 20212022 ఆర్థిక సంవత్సరంలో రూ.26 కోట్లు,2020్ష2021 సంవత్సరంలో రూ.12 కోట్లు, 2019్ష2020 సంవత్సరంలో రూ.36కోట్లు కేంద్రం నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉందని కూడా స్టాండిరగ్‌ కమిటీ పేర్కొన్నది. ఉపాధి కూలీలకు వేతనాలు నెలల తరబడి బకాయిలు ఉంటున్నాయి. నష్టపరిహారం కూడా చెల్లించడం లేదు. అందువల్ల పని చేసిన కూలీలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్ప డుతున్నది. కనుక చట్టప్రకారం సకాలంలో వేతనా లు చెల్లించాలని సుప్రీంకోర్టులో ఒకస్వచ్ఛంద సంస్థ పిల్‌ వేయగా కూలీలకు నష్టపరిహారం తప్పని సరిగా చెల్లించాలని 2018 మే 18 తేదీన కోర్టు తీర్పు చెప్పింది.
    ‘కరోనా రెండవ దశలో చాలా ఎక్కువ గా ప్రాణ నష్టం జరిగింది. ప్రతిరోజు వేల కేసులు, కొన్ని సందర్భాలలో లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకోవాలంటే ఉపాధి పని దినాలు 100 నుండి 200 రోజులకు పెంచి సకాలంలో వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం ఇస్తున్న రూ.245 వేతనం సరిపోదు. ధరలు పెరగడం వల్ల వ్యవసా య కార్మికుల జీవన పరిస్థితి అంతకంతకు దిగ జారిపోతున్నది. కనుక రోజుకిరూ.600 వేతనం చెల్లించాల’ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. కరోనా వ్యాధి దేశమం తటా తీవ్రంగా సోకిన పరిస్థితిలో పట్టణ ప్రాంతా ల్లో ఫ్యాక్టరీలు మూత పడడం, పనులు కోల్పోవ డంతో, వలస కార్మికులు తిరిగి గ్రామాలకు రావ డంతో ఉపాధిపనికి డిమాండ్‌ పెరిగింది. ఉపాధి పథకానికి బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయలు పైగా కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పెడ చెవిన పెడుతున్నది. కరోనా వల్ల పని దినాలు పడిపోతున్నాయని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని కేంద్రం గుర్తించింది. కానీ దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వంప్రజలను ఆదుకో వాలని, ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని, అందు కు ఆదాయపన్ను చెల్లించని వారందరికి నెలకు రూ.7500,తలకు 10 కేజీల బియ్యంచొప్పున కనీసం 6నెలల పాటు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు,ప్రజాసంఘాలు,వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తుంటే…కంటితుడుపుగా కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం తలకు నెలకు 5కేజీల చొప్పున 10కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపు కుంటున్నాయి. కానీ దేశంలో బడాపెట్టబడిదారు లకు కరోనా కాలంలోనే రూ. రెండున్నర లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు కట్టబెట్టాయి. కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ప్రజలనుండి గోళ్ళూడగొట్టి పన్నులు వసూలు చేసి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ధారబోస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరే కంగా గ్రామీణపేదలు ఏకతాటిపై నిలబడి పోరా డాలి.(వ్యాసకర్త: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు)
    -కందుకూరి సతీష్‌ కుమార్‌

READ ALSO

మ‌హానీయ స్వామి వివేకానంద‌

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

Related Posts

మ‌హానీయ స్వామి వివేకానంద‌
తీరు-Teeru

మ‌హానీయ స్వామి వివేకానంద‌

January 7, 2022
డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్
తీరు-Teeru

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

January 7, 2022
రైతు కంట క‌న్నీరు
తీరు-Teeru

రైతు కంట క‌న్నీరు

January 7, 2022
సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26
తీరు-Teeru

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

December 4, 2021
ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా
తీరు-Teeru

ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా

December 4, 2021
పెట్రో ధరలు పైపైకీ
తీరు-Teeru

పెట్రో ధరలు పైపైకీ

November 10, 2021
Next Post
మద్దతు ధర ఎలా?

మద్దతు ధర ఎలా?

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

మ‌హిళా మేలుకో..!

మ‌హిళా మేలుకో..!

March 12, 2021
మా ఊళ్ళో మా రాజ్యం

మా ఊళ్ళో మా రాజ్యం

February 15, 2021

వలస కార్మికులకు సామాజిక వంటశాలలు

September 2, 2021
బాలల దినోత్సవం సందడే సందడి

బాలల దినోత్సవం సందడే సందడి

November 10, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3