• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home తీరు-Teeru

సంస్కరణలు ఎవరి కోసం

team-dhimsa-viz by team-dhimsa-viz
September 14, 2021
in తీరు-Teeru
0
0
SHARES
16
VIEWS
Share on FacebookShare on Twitter

‘మీరు సంస్కరణలకు అను కూలమా, లేదా ప్రతికూలమా?’ అని నిరంతరం అడుగు తుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. ఏ నిర్దిష్ట సంస్కరణ కైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకిం చాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి. ఈసంస్క రణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడ తాయా,వారి జీవనో పాధులు,దేశ ఆర్థిక సార్వభౌమా ధికారం బలోపే తం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది’

మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేప థ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,కనీస మద్దతు ధరకు చట్ట బద్ధమైన హామీ కల్పించాలంటూ మనరైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగి స్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపా రన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తు న్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న మొత్తాల్లో ఉత్పత్తిని దెబ్బతీయడం (మోడీపెద్దనోట్లరద్దు),ఆహార కొర తలు…ఇవన్నీ కలిసి కరువు కాటకాలు పెంచేలా చేయవచ్చు.
పేదలను పణంగాపెట్టి గరిష్టస్థాయిలో లాభా లు ఆర్జించడం,పెరుగుతున్న దారిద్య్రం,మరింతగా విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు,అన్ని దేశాల్లో తీవ్రంగా పడిపోయిన దేశీయ డిమాండ్‌ పైనే దశా బ్దాల తరబడి సంస్కరణలు ప్రధానంగా దృష్టి పెడుతూ వస్తున్నాయని అంతర్జాతీయ, భారతదేశ అనుభవాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం,ప్రజలజీవితంపై దానిప్రభావం వినా శకరమైన రీతిలో వుంది. ఇది,కరోనాతో మరిం తగా పెరిగిపోయింది. ఇంకా ఆ ప్రభావం కొనసా గుతూనే వుంది. ఇదిమార్క్స్‌ మాటలను గుర్తు చేస్తోంది:‘పెట్టుబడిదారీ విధానం భారీఉత్పత్తి, మారకపు మార్గాలను సమకూర్చుకుంది. ఇది క్షుద్ర ప్రపంచంలో మంత్రాలు, మాయలతో శక్తులను సృష్టించే మాంత్రికుడి లాంటిది. ఆతరువాత వాటి ని అదుపు చేయడంలో ఆమాంత్రికుడు విఫల మవుతాడు.’ అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆది óపత్యంలోని నయా ఉదారవాద విధాన నిర్మాణంలో అంతర్భాగమే భారతదేశంలో సంస్కరణల క్రమం. ఇక్కడ గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం. ఇది, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యంత అద్వాన్నమైన స్వభావాన్ని తెలియచేస్తోంది. జంతు స్ఫూర్తిని వెల్లడిస్తోంది. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తు లను, అన్ని ప్రభుత్వ సంస్థలను, సేవలను, ఖనిజ వనరులను ప్రైవేటీకరించడానికి…ప్రజలపై యూ జర్‌ చార్జీల భారాన్ని మోపడానికి దారితీసింది. నయా ఉదారవాదమనేది అంతర్జాతీయంగా, భారత్‌లో కార్పొరేట్లకు పెద్ద లాభదాయకంగా మారింది. నయా ఉదారవాదం ప్రారంభమైనప్పటి నుండి సంపన్నులపై పన్నులు విధించడం అంతర్జా తీయంగా 79శాతం తగ్గింది.2008లోఆర్థిక మాం ద్యం తర్వాత,మూడేళ్ళ లోనే చాలామంది కోటీశ్వ రులు తమసంపదను పునరుద్ధరించు కున్నారు. 2018నాటికి వారి సంపద రెట్టింపు అయింది. ఈసంపద అంతాఉత్పత్తి ద్వారా పెరగలేదు. తీవ్రంగా వున్న ఈ ఆర్థిక మాంద్యం స్టాక్‌ మార్కెట్ల ను ఎందుకు ప్రతికూలంగా ప్రభావితం చేయలేదో వివరించిన స్పెక్యులేషన్‌ ద్వారా పెరిగింది. మరో వైపు,ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది ఆదా యం సంపాదించేవారు 2008ముందు నాటి స్థాయికి కోలుకోలేదు. సంఘటిత రంగంపై, కార్మిక వర్గ హక్కులపై దాడుల ఫలితంగా1979లో ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు… ఈనాడు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యంవహించే స్థాయికి క్షీణించాయి.
భారత్‌ : అసమానతల పెరుగుదల
పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.‘షైనింగ్‌ ఇండియా’ (వెలిగిపో తున్న భారతదేశం) ఎల్లప్పుడూ సఫరింగ్‌ ఇండియా (బాధలు పడుతున్న భారతం) పైనే స్వారీ చేసేది. వెలిగిపోతున్న భారత్‌..కమిలిపోతున్న భారత్‌కు విలోమానుపాతంలో వుంటుంది. 2020 మార్చి నుండి భారతదేశం లోని వంద మంది కోటీశ్వరులు తమ ఆస్తులను రూ.12,97,822 కోట్లు పెంచు కున్నారు. అంటే దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున చెక్‌ ఇవ్వగలిగేంత. కరోనా సమయంలో ముఖేష్‌ అంబానీ సంపాదించే మొత్తాన్ని ఒకనైపుణ్యం లేని కార్మికుడు సంపాదించాలంటే 10 వేల సంవత్సరా లు పడుతుంది. అంబానీ ఒక సెకనులో సంపాదిం చే మొత్తాన్ని ఈకార్మికుడు మూడేళ్ళకు సంపాది స్తాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక ‘ది ఇనీక్వాలిటీ వైరస్‌’ లోని తాజా భారత్‌ అనుబంధ నివేదిక పేర్కొంది.
మరోవైపు,2020 ఏప్రిల్‌లో ప్రతి గంటకు లక్షా 70వేల మంది తమ ఉద్యోగాలను కోల్పో యారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుండి చూసినట్లైతే 90 శాతం పెరిగి 42.29 వేల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 11మంది కోటీశ్వరుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కాన్ని పదేళ్ళపాటు లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్ళపాటు నిర్వహించవచ్చు. పైస్థాయిలో వున్న 20 శాతం లోని 93.4 శాతంతో పోల్చుకుంటే… నిరుపేదలైన 20 శాతంలో కేవలం ఆరు శాతానికే మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో వున్నాయి. భారత జనాభాలో దాదాపు 59.6 శాతం మంది ఒక్క గదిలోనో లేదా అంతకంటేచిన్న జాగాలోనో బతుకు తున్నారు. ప్రభుత్వ వ్యయం వాటాను బట్టి చూసి నట్లైతే ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ఆరోగ్య రంగ బడ్జెట్‌వున్న దేశాలలో భారత్‌ నాల్గవ స్థానం లో వుంది. కరోనా సమయంలో పెరిగిన తమ సంపదపై కనీసం ఒక శాతం పన్నును దేశంలోని పైస్థాయిలో వున్న 11 మంది కోటీశ్వరులు కట్టినా కూడా ‘జన్‌ ఔషధి’ పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది.ఈ పథకం వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి మందులు అందుబాటులో వుంటాయి. భారతదేశంలో దశాబ్దాలుగా అమలవు తున్న సంస్కరణలు ఆర్థిక అసమానతలను తీవ్రంగా పెంచుతున్నాయి. ప్రజలను దృష్టిలో వుంచుకుని వారికి అనుకూలమైన రీతిలో కాకుండా.. పెట్టుబడి దారులు లాభాలు ఆర్జించే రీతిలో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. సంపద సృష్టికర్తలను గౌరవిం చాలని ప్రధాని మోడీ మనకు ఉద్భోదిస్తున్నారు. సంపద అంటే విలువను డబ్బు రూపంలోకి మార్చడమే. ఆ విలువను సృష్టించేది కార్మిక వర్గమే. మన ప్రజల సర్వతోముఖ సంపదకు విలువను సృష్టించే వారిని గౌరవించాల్సిన అవసర ముంది.
దారిద్య్రం : అపార వృద్ధి
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వం,స్వాతంత్య్రం సము పార్జించి నప్పటి నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చినదాన్ని (దారిద్య్ర స్థాయిని లెక్కించడానికి మౌలికమైన పోషకాహార నిబంధనను) విడిచిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2200 క్యాలరీల పోషకాహారం వుండాలి. పట్టణభారతంలో అయితే అది 2100 క్యాలరీలుగా వుండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూసినట్లైతే 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 57శాతం మంది ఈ దారిద్య్ర రేఖకు దిగువున వున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా సర్వే తెలియచే స్తోంది. 2011-12లో మరోసారి నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఈశాతాలు వరుసగా 68, 65కు పడిపోయాయి.తిరిగి 2017-18లో మరో సారి విస్తృతంగా నమూనా సర్వే నిర్వహించారు. కానీ మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఫలితాలను వెల్లడిరచకుండా తొక్కిపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన డేటాబేస్‌ సంస్థలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. గ్రామీణ భారతంలో తలసరి వాస్తవ వినిమయం వ్యయం (కేవలం ఆహారమే కాదు) కేవలం 9శాతంగా మాత్రమే వుందని మీడియాకు లీకైన డేటా తెలియ చేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందు గానే గ్రామీణ, పట్టణభారతాల్లో సంపూర్ణ స్థాయిలో దారిద్య్రం అనూహ్యంగా పెరిగిందన్నది సుస్పష్టం. అప్పటి నుండి పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది.
కోవిడ్‌ మహమ్మారి విజృంభణ…ప్రజల ప్రాణాలను,వారిఉపాధులను కాపాడేందుకు అరకొరగా వున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఇబ్బందులు…పరిస్థితులను బహిర్గతం చేశాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాం ద్యం అంతర్జాతీయ నయా ఉదారవాద విధానంలో భాగమే. ఏదోవిధంగా ప్రజలను తీవ్ర స్థాయిలో దోపిడీ చేయడం ద్వారా లాభాలను గరిష్టంగా ఆర్జించాలన్నదే ఈ నయా ఉదారవాద విధానం. పొదుపు చర్యల నుండి వేతనాల్లో కోతల వరకు, ఉద్యోగాల లేఆఫ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న స్థాయి లో ఉత్పత్తిని దెబ్బ తీయడం (భారత్‌లో ఇది పెద్ద నోట్ల రద్దు ద్వారా జరిగింది) వంటి చర్యల ద్వారా ప్రజలను దోపిడీ చేస్తారు. ఆర్థిక కార్యక లాపాలకు సంబంధించిన అన్ని మార్గాలను ఆక్రమించు కోవడం, ఇప్పుడు కార్పొరేట్‌ లబ్ధికోసం భారత వ్యవ సాయ రంగాన్ని నాశనం చేయడం, కాంట్రాక్ట్‌ వ్యవ సాయం,ఫలితంగా ఆహార కొరత వంటివి ఈవిషయాన్ని మనకు స్పష్టంగా తెలియ చేస్తు న్నాయి. ఈనాడు, అంతర్జాతీయ ఆకలి సూచీ భారత్‌ను ‘తీవ్రమైన కేటగిరీ’లో నిలిపింది. పోషకా హార లోపం ప్రమాదకర స్థాయిలో పెరిగిపో తోందని,మరీ ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వుందని, ఫలితంగా శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతు న్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 తెలియ చేసింది.
మతోన్మాదం-కార్పొరేట్ల బంధం
2014 తరువాత కార్పొరేట్‌, మత రాజకీ యాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టం గా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అస మ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాం గాన్ని,అటుప్రజలకు ఇచ్చినహామీలను దెబ్బతీసింది.
ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడంఇండెక్స్‌)భారత్‌ను105వ స్థానం లో నిలిపింది. గతేడాది కన్నా ఇది అద్వా న్నమైన స్థితి. గతేడాది 79వస్థానంలో వుంది. మానవ హక్కుల సూచీలో భారత్‌ 94నుండి 111కి పడిపో యింది. యుఎన్‌డిపి మానవ వికాస సూచీ మనల్ని ఇంకా కిందకు..అంటే గతేడాది వున్న 129 నుండి 131వ స్థానానికి దింపేసింది. మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం…ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం ‘పాలనతో కార్పొరేట్ల కలయికకు’ దగ్గరగా ఉంది. ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో నూతన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. అసమానతలు వృద్ధికి ఆటం కం కలిగించి, అసమ ర్ధతను పెంచే స్థాయికి చేరుకు న్నాయి’ అని ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక పేర్కొంది.
నయా ఉదారవాద సంస్కరణల దివాళా
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యయాలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీలను అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రకటించాయి. ఇవి నయా ఉదారవాదానికి శాపం గా పరిణమిస్తాయి. దేశీయ డిమాండ్‌ను, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ‘’నేను కమ్యూనిస్టును కాను, కానీ….’’ అంటూ ప్రభుత్వ వ్యయం పెంచడాన్ని సమర్ధిస్తూ ఇటీవలే బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రసంగించారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రంరద్దు చేస్తోం ది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజ లపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యో ల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. భారత్‌లో ఈ సంస్కరణల పంథా ను మనం తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మన ప్రాధాన్యాలేంటనేది పున: నిర్వచించుకోవాల్సి వుంది. వ్యవసాయాన్ని బలో పేతం చేయాలి. ఆహార భద్రతను పటిష్టపరచాలి. ఆరోగ్యం,విద్యపై పెట్టుబడి పెంచాలి. ప్రస్తుతం మనకు ఎంతగానో అవసరమైన-ఆర్థిక, సామాజిక-మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభుత్వ పెట్టు బడులు పెద్దఎత్తున పెరగాలి.అప్పుడే ఉద్యోగాలు సృష్టించబడతాయి.దేశీయ డిమాండ్‌ పెరుగు తుంది. కేవలం మానవతావాద ఆందోళనల తోనే కాకుండా, సమానమైన ఆర్థిక పునరుద్ధరణకు కూడా ఇదొక్కటే మార్గం. అస్పష్టత,అహేతుకత,మన సమా జాన్ని అమానవీయం చేసేలా, మనసామాజిక సామ రస్యతను దెబ్బతీసే అన్ని విచ్ఛిన్నకర ధోరణులను తిరస్కరించడం అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రజా ప్రయోజనాలే కీలకమైన అటువంటి సంస్కర ణలు ఈనాడు భారతదేశానికి అవసరం. అంతేగానీ కార్పొరేట్‌ లాభార్జనే థ్యేయంగా గల సంస్కరణలు కాదు. ఇటువంటి సంస్కరణల దిశను సాకారం చేయగలిగే వేదిక ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యామ్నాయ సంస్కరణల పంథాను సూచించగల ప్రజాఉద్యమాలు,సమీకరణలు తగి నంత బలాన్ని పుంజుకోవాల్సి వుంది. మన ప్రజల పై మరిన్ని భారాలను మోపుతున్న, వారిని దెబ్బ తీస్తున్న భారత పాలకవర్గాల ప్రస్తుత దిశను మార్చ గలిగేలా ఈఉద్యమాలు వుండాలి. భారత దేశం లోని మూడు దశాబ్దాల సంస్కరణల క్రమం సరైన దిశ లోకి మారడానికి ఇదే సముచితమైన సమయం.
–(సీతారాం ఏచూరి)(ప్రజాశక్తి సౌజన్యంతో)

READ ALSO

మ‌హానీయ స్వామి వివేకానంద‌

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

Related Posts

మ‌హానీయ స్వామి వివేకానంద‌
తీరు-Teeru

మ‌హానీయ స్వామి వివేకానంద‌

January 7, 2022
డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్
తీరు-Teeru

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

January 7, 2022
రైతు కంట క‌న్నీరు
తీరు-Teeru

రైతు కంట క‌న్నీరు

January 7, 2022
సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26
తీరు-Teeru

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

December 4, 2021
ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా
తీరు-Teeru

ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా

December 4, 2021
పెట్రో ధరలు పైపైకీ
తీరు-Teeru

పెట్రో ధరలు పైపైకీ

November 10, 2021
Next Post
ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

Justice K Ramaswamy and Samata judgement

Justice K Ramaswamy and Samata judgement

November 3, 2020
సామాజిక కార్య‌క‌ర్త దిశ ర‌వి అరెస్టు

సామాజిక కార్య‌క‌ర్త దిశ ర‌వి అరెస్టు

March 12, 2021
ములుపు

ములుపు

March 13, 2021
72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

December 4, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3