• About Dhimsa
  • Contact Us
Wednesday, May 18, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home క‌థ‌నం-Kathanam

విశాఖ ఏజెన్సీలో కాల్సైట్‌ లీజుల కలకలం

team-dhimsa-viz by team-dhimsa-viz
September 2, 2021
in క‌థ‌నం-Kathanam
0
విశాఖ ఏజెన్సీలో కాల్సైట్‌ లీజుల కలకలం
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter

‘‘ విశాఖ జిల్లా మన్యప్రాంతం విశాలమైన అడవులతో విస్తరించుకున్న ప్రాంతం. వ్యవసాయం,అటవీ ఉత్పత్తులే ఇక్కడ ఆదివాసీల జీవనాధారం. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈనేపథ్యంతోనే గత 30 ఏళ్ళ నుంచి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’

విశాఖ మన్యంలో మైనింగ్‌తవ్వకాలపై మరోమారు కలకలం రేపుతోంది. జిల్లాలోని అనం తగిరి మండలం వలాసీ పంచాయితీ పరిధి మారు మూల లోతట్టు గ్రామాలైన కరకవలస,రాళ్లవలస, నిమ్మలపాడులో కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దు చేసి స్థానిక గిరిజన సొసైటీలకే మై నింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు మళ్లీ ఉద్యమానికి తెర లేపనున్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతం గా అమలు పర్చవలసిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తుతుంది. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు.సమతజెడ్జిమెంట్‌,పీసాచట్టం, అటవీహక్కుల చట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగబద్దమైన చట్టా లను వ్యతిరేకించి..మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.         ఆదివాసుల హక్కులు,మైనింగ్‌ తవ్వకా లపై పూర్వంనుంచి సమత పలు ఉద్యమాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు కంచెచేనుమేసే చందంగా వ్యవహరింస్తోంది. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు,అమయకత్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

సమత ఉద్యమ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాలు రాజ్యాంగంలోని ఐదవషెడ్యూల్‌ పరిధిలోకి వస్తా యి. స్థానికులైన గిరిజనుల భూములు అన్యా క్రాం తం కాకుండా ఈషెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. గిరిజనుల భూమిని గిరిజనేతరులు స్వాధీనం చేసుకో కుండా భూమి బదిలీ నిబంధనలు నిరోధిస్తాయి. అయినా రాష్ట్రంలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు. గిరిజనేతర భూస్వా ములు,వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి గిరిజనుల భూమిని విడిపించడానికి సమత, గిరిజ నులు నిరసనవంటి అన్ని ప్రజాస్వామ్య ఆందోళనా పద్దతులను అనుసరించింది. గిరిజనులకు బెయిలు కోసమో,షెడ్యూలు ప్రాంతాల చట్టాలను అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడానికిగాని సమత అనేక సార్లు కోర్టు గడపతొక్కవలసి వచ్చింది.
ఆదివాసుల హక్కుల కోసం పోరాడే ఒక చిన్న సామాజిక కార్యాచరణ సంస్థ సమత. అట్టడుగు స్థాయిలో గిరిజనుల సంక్షేమం,అభ్యున్నతి కోసం శ్రమించే సామాజిక సంస్థగా మేముగడిరచిన అనుభవం తూర్పు కనుమల్లోని విశాఖ మన్యంలోని పలు గ్రామాల్లో ఆదివాసీ సమస్యలను పరిష్కరిం చడం మొదలుకొని పర్యావరణ,ప్రజల హక్కులపై ప్రభావం చూపగల అంశాలను పరిశీలించే విస్తృత స్థాయికి తీసుకువెళ్లింది. విశాఖ ఏజెన్సీలోకాల్సైట్‌, బాక్సైట్‌, సున్నపు రాయి,అబ్రకం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజ నిక్షేపాలు వెలికి తీతకు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి ప్రభుత్వం లీజుకి చ్చింది.సదరు లక్ష్మీనారాయణ అపారమైన గనుల తవ్వకాలు చేపట్టలేక చేతిలెత్తేశారు.తర్వాత ప్రభు త్వం బిర్లా కంపెనీకి లీజులు ఇచ్చింది. శతాబ్దంగా బొర్రా కొండల్లో నివస్తున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు నిరాకరించింది. మరోవైపు ప్రభుత్వం గిరి జన,అటవీభూములకు 1970నుంచి గనుల కంపెనీలకు లీజుకు ఇస్తుందంటూ స్థానిక గిరిజన యువకులు సమత కార్యాలయానికి వచ్చి సాయం కోరారు. ఈ భూముల అన్యాక్రాంతం వ్యవహారాన్ని సమత స్వీకరించి,ఆ ప్రాంతాన్ని సందర్శించింది. బొర్రా పంచాయితీలో నెలకొన్న పోడుభూముల పట్టాలు సమస్యలను పరిశీలించి తెలుసు కోవడానికి సమత తరుపున జియాలజిస్టులు, న్యాయవాదులతో పాటు కొంతమంది సామాజిక వేత్తలతో ఆప్రాంత సమస్యలను అధ్యాయనం చేపట్టాం.
అప్పట్లో ఈప్రాంతంలో పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు, పోలీసులకు మధ్య ఈప్రాంతం రణభూ ములుగా ఉండేవి. స్థానికుల హక్కుల కోసం జరిగే ఏ ఉద్యమాన్నయినా అటు నక్సలైట్లు, ఇటు పోలీ సులు కూడా మొదట అనుమాన దృక్కులతోనే చూసే వారు. సమతకు కూడా ఇటువంటి విషమ పరిస్థితి తప్పలేదు. రెండు పక్షాలు తమ సామ్రాజ్యంలోకి సమత చొర బాటును జీర్ణించుకోలేకపోయాయి. అట్టడుగుస్థాయి సామాజిక సంస్థగా ఇన్ని సంవత్స రాలు సమత ఈరెండు పక్షాల శత్రుత్వాన్ని ఎదుర్కొ నవలసి వచ్చింది. ప్రజలను సంఘటితం చేస్తున్న లేదా కోర్టు స్టే ఉత్తర్వులు వాస్తంగా అమలు జరుగు తున్నదీ లేనిదీ తనిఖీ చేసేందుకు గ్రామాల్లో పర్యటి స్తున్న మా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్భంధించి, వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పి శారీరక, చితహ్రింసలకు గురి చేశారు. అప్పట్లో తామంతా మీడియాను శ్రయించి వారి ద్వారా అక్రమ నిర్బంధ అంశాన్ని వెలుగలోకి తీసుకెళ్లాం. ఆ తర్వాత ఆనాటి విశాఖనగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న డిటీనాయక్‌ సాయంతో జిల్లాఎస్‌పీ ద్వారా సంప ద్రింపులు జరిపి అక్రమ నిర్బంధంలో ఉన్న సమత బృందాన్ని విడుదల చేయడంజరిగింది. ఆతర్వాత సమత బృందం అక్రమ నిర్భందం నుంచి విడుదలైన సందర్భంగా మండల కేంద్రమైన అనంతగిరిలో చుట్టుపక్కల గిరిజన గ్రామస్థులతో కలసి భారీ బహిరంగ సభ నిర్వహించాం. ఈ మీటింగ్‌లోనే ఖనిజం వెలికితీత ప్రభావితప్రాంతాలైన కరక వలస,రాళ్లవలస, నిమ్మ లపాడు గిరిజన గ్రామ స్థులు కలసి వారి భూసమస్య లను వివరించారు. బిర్లాకంపెనీకి ఇచ్చిన లీజులు షెడ్యూలు ప్రాంతాలలో భూమి బదిలీ, నిబంధన లకు(ఎల్‌టీఆర్‌1/70)విరుద్దమని తేలింది. దాంతో లీజుల చట్టబద్ద తను ప్రశ్నించడం ప్రారం భించాం. ఈ సమస్యపై బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంతోపాటు గిరిజనుల భూములను గిరిజ నేతరులకు బదిలీ చేయడానికి ప్రభుత్వానికి గల హక్కును ప్రశ్నిస్తూ కోర్టుకువెళ్లాం. ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతరుడైన వ్యక్తి కిందకే వస్తుందని, అందు వల్ల షెడ్యూల్డు ప్రాంతాలలో గిరిజనేతరులకు లీజులు మంజూరు చేసే అధికారం దానికి లేదని హైకోర్టులో 1993లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాం. 1.అన్యాక్రాంతమవుతున్న బొర్రా పంచా యితీ భూములు, 2.నిమ్మలపాడు ఖనిజ తవ్వకా లపై ప్రభుత్వం బిర్లా కంపెకనీకి ఇచ్చిన లీజులు, ఖనిజ తవ్వకాలకోసం గిరిజన భూము లను స్వాదీ నం చేసుకొని నిర్మించిన రోడ్డు నిర్మాణంపై మూడు కేసులు వేశాం. దీనిపై హైకోర్టు లీజులపై స్టే మంజూరు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బొర్రా పంచాయితీ గిరిజ నులు తమ సొంత భూములను తాము సాగుచేసు కోగలిగారు. 1995లో హైకోర్టు గనులలీజుపై స్టేను ఎత్తివేసి కేసు కొట్టివేసింది. తర్వాత దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా మాప్రయత్నం ఫలించింది. 1997,జులైలో కోర్టు సంపూర్ణధర్మాసనం ఈ కేసులో చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. షెడ్యూలు ప్రాంతాలలో గనులు లీజులు భూమి బదిలీ నిబంధనలకు విరుద్దమని, అవి చెల్లనేరవని విస్ఫష్టంగా ప్రకటించింది. ా షెడ్యూలు ప్రాంతంలోని ప్రభుత్వ భూములు,అటవీభూములు,గిరిజన భూములను గిరిజనేతరులకు గానీ,ప్రైవేటు పరిశ్రమ లకుగానీ లీజుకు ఇవ్వకూడదు. ా బొర్రా పంచాయితీలో ఆయా భూముల్లో నివసిస్తున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టా ఇవ్వాలి. ఈభూములను లీజుకు ఇవ్వరాదు ా షెడ్యూలు ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం గనుల తవ్వకం కోసం గిరిజనేతరులకు లీజుకు ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలుకు విరుద్దం. ా షెడ్యూలు ప్రాంతంలో గనుల తవ్వకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ లేదా గిరిజనులతో కూడిన సహకార సంస్థ మాత్రమే చేపట్టాలి. అది కూడా అడవుల పరిరక్షణ చట్టం,పర్యావరణ పరిరక్షణ చట్టం లోపడే జరగాలి. ా సామాజిక వనరులను పరిరక్షించే హక్కు, అధికారం గ్రామసభలకు,గిరిజనులకు ఉందని,గిరిజనులకు స్వయంపాలన హక్కులను కల్పించాలని ఉద్ఘాటించడం ద్వారాను సుప్రీం కోర్టు రాజ్యాంగ 73వ సవరణ హక్కు, ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయితీరాజ్‌(షెడ్యూలు ప్రాంతా లకు విస్తరణ)చట్టాలను గుర్తించింది. న్యాయబద్దమైన నష్టపరిహారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నిమ్మల పాడు ఖనిజ తవ్వకాల కోసం నిమ్మలపాడు నుంచి డముకు వరకు 25 కిలోమీటర్ల దూరం నిర్మించిన రోడ్డు కారణంగా గిరిజనుల భూములు కోల్పో యారని వాటికి న్యాయబద్దమైన నష్టపరిహారం చెల్లించాలని సమత మరోసారి పోరాటం చేసింది. రోడ్డు నిర్మాణం మూలంగా చాలా మంది గిరిజన రైతుల భూములు రోడ్డు నిర్మాణంలో కలసిపోగా, రైతులు పెంచిన పెద్దపెద్ద వృక్షాలు నేలమట్టమ య్యాయి. చట్టప్రకారం వాటి నష్టపరిహారం చెల్లిం చాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వశాఖల ద్వారా భూములు,చెట్లు కోల్పోయిన రైతులకు నష్టపరిహారా న్ని ఇప్పించింది. ఈఉద్యమంలో సమతతో పోరాటం చేసిన వారి గ్రామాల్లో రోడ్డు వెడల్పు తగ్గించి నిర్మించారు.నష్టపరిహారం సంపూర్ణంగా లభించింది. పోరాటంలో పాల్గోనని గ్రామాల్లో రోడ్డు వెడల్పు పెంచారు. వారి నష్టపరిహారం లభించలేదు. ఏపీఎండీసీకి లీజులు అప్పగించిన బిర్లా కంపెనీ సమత తీర్పుతో బిర్లాకంపెనీ తన లీజు లను ఉపసంహరించుకొని ఈ రెండు లీజులను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపీఎండీసీ)కి అప్పగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలీజులు ఏపీఎండీసీ వద్దనే ఉంచుకుందనిగానీ, సొంతంగా మాత్రం ఖనిజతవ్వకాలు చేపట్టలేదు. సమత తీర్పును అనుచరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం స్థానిక గిరిజన సొసైటీలకు మైనింగ్‌ చేసుకోవడానికి లీజులు ఇవ్వాలి. కానీ ఏపీఎండీసీ స్థానిక గిరిజన సొసైటీకి ఇవ్వడంలేదు. వారికి ఇవ్వకుండా ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాప్తి సమయంలో రెండుసార్లు ఈటెండర్లకు పిలిచి శంకర్‌,దొరియారు రుక్మిణి అనే ఇద్దరికి రైజింగ్‌ కాంట్రాక్టర్లగా లీజులు ఇచ్చినట్లు అనధికారంగా తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో ఖనిజనిక్షేపాలున్న గిరిజన గ్రామాల్లోకి గిరిజనేతరులు ప్రవేశించి అక్కడ గిరిజనుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా పట్టాదారుల అనుమతి లేకుండా గిరిజన రైతులభూముల్లో చొరబడి కాల్సై ట్‌ ఖనిజ తవ్వకాల కోసం భూమి పూజలు చేసినట్లు కూడా తెలిసింది. ఇదిఏజెన్సీ షెడ్యూలు ప్రాంతం. ఇక్కడ ఎల్‌టీఆర్‌1/70చట్టం,సమతజడ్జిమెంట్‌, పీసాచట్టం,అటవీహక్కులచట్టం,నియామగిరి గ్రామ సభ హక్కులచట్టం వర్తిస్తాయి. ఈప్రాంతం రాజ్యాం గ ప్రకారం ఐదువ షెడ్యూలు ప్రాంతంలో ఉన్నందున చట్టాలను అమలుపరిచే బాధ్యత అధికా రులపై ఉంది. చట్టాలను ఉల్లంఘించి షెడ్యూలు ప్రాంతమైన ఏజెన్సీలో ఖనిజతవ్వకాలు కోసం ప్రభుత్వం లీజులు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఏపీఎండీసీ ఇప్పటి వరకు మైనింగ్‌ ఉన్న భూమికి సంబంధించిన గిరిజన రైతులకు అధికారికంగా ఎటువంటి నోటీసులుగాని, సూచన లుగాని ఇవ్వకపోవడం శోచనీయం. పీసా చట్టం ప్రకారం గ్రామసభ తీర్మాణం లేనిదే ఏజెన్సీ ఏరియా లో ఖనిజతవ్వకాలు చేపట్టరాదు.
మైనింగ్‌ విషయానికి వస్తే
ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ అధి కారులు ఖనిజ తవ్వకాలు చేపట్టే గిరిజన ప్రాం తాల్ని సందర్శించిన దాఖలాలులేవు. అక్కడ ఆహ్ల కరమైన పచ్చని పొలాలు ఉన్నాయి.మైనింగ్‌ తవ్వే ప్రదేశాల్లో గిరిజన రైతులకు సంబంధించిన జిరా యితీ భూముల్లో వివిధ రకాల పంటలు పండిరచు కొని జీవనం గడుపుతున్నారు. గ్రామ కంఠానికి ఆయుపట్టుగా నిలిచాయి. పట్టాలు ఉన్న పల్లపు భూములు,మెట్ట భూముల్లో రాగులు,వరి,గంటెలు, జోన్నలు,పప్పుదినుసులు పండిరచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మైనింగ్‌ తవ్వకాలు జరిపితే ప్రశాంతంగా ఉండే గిరిజనగ్రామాల్లో కలుషి తమ య్యే ప్రమాదం పొంచి ఉంది. ఆదివాసులు ప్రత్య క్షంగా జీవనాధారాన్ని కోల్పోతారు. కాల్సైట్‌ తవ్వ కాల మూలంగా జలధారలు తగ్గిపోయి, పంట పొలలన్నీ కాలుష్యానికి గురైపోతాయి. ఖనిజ తవ్వ కాల వెలికతీతకు ఉపయోగించే భారీ బ్లాస్టింగ్‌ శబ్దాలకు సమీపంలో చుట్టూ ఉన్నకొండల్లో జీవించే జంతజీవరాశుల పరిస్థితి అగమ్యగోచరంగా మార నుంది. గిరిజన గ్రామాలన్నీ కాలుష్యకోరల్లో చిక్కు కుని అనేక రకాలనైన ప్రమాదకర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మొత్తం ఆదివాసీ జన జీవనం అతలాకుతలమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చుట్టుపక్కల గిరిజన గ్రామాలన్నీ నిర్వాసితులయ్యే అవకాశం ఉంది. గిరిజన ప్రజలు నిర్వాసితులైతే చట్ట ప్రకారం ప్రభు త్వ అధికారులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈసందర్భంలో ఐటీడీఏ,రెవెన్యూ,చట్టపరంగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఖనిజతవ్వ కాల కు చుట్టూఉన్న అటవీప్రాంతమంతా కాలుష్య బారి నపడే ప్రమాదం పొంచిఉంది. దీనిపై అటవీ శాఖ సంరక్షణ అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
సమతపై పెరుగుతున్న ప్రజా విశ్వాసం
ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల గిరిజనుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలోను,రాజ్యాంగ హక్కుల సాధనలోను న్యాయపరమైన ఈ విజయం ఎంతో కీలకమైనపాత్ర సమత నిర్వహిస్తోంది. దీంతో షెడ్యూలు ప్రాంతాలలో గనుల తవ్వకాలు వెంటనే నిలిచిపోయాయి. గిరిజనుల భూమి మళ్ళీ వారి చేతికి వచ్చింది. అప్పటి నుంచి వారు వ్యవ సాయం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారు. సామాజిక,ఆర్ధిక,న్యాయం కోసం పోరాడు ఆదివాసీలకు సమత తీర్పు ఎంతో మనో నిబ్బరం కలిగించింది. దేశవ్యాప్తంగా ఆదివాసీలు డిమాండు చేస్తున్న హక్కులను,సాధికారీకరణను బలపరిచింది.భవిష్యత్తులోప్రస్తుతం నిమ్మలపాడు లో కల్లలోం సృష్టిస్తున్న కాల్సైట్‌ లీజులు స్థానిక గిరిజన సొసైటీకి అప్పగించి రాజ్యాంగ విలువలకు శాస్త్రీయ దృక్పధానికి అధికార యంత్రాంగం సహక రించాల్సిన బాధ్యత,అవశ్యకత ఎంతైనాఉంది. లేని పక్షంలో గిరిజనులు మరోసారి మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కాల్సైట్‌ ఖనిజ టెండర్లపై అభ్యంతరాలు
విశాఖ మన్యంలో కాల్సైట్‌ ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఏండీసీ) పిలిచిన టెండర్లఉ వివాదాస్పదమవుతున్నాయి. టెండరు నిబంధనలపై గిరిజన సంఘాలు అభ్యం తరాలు చెబుతున్నాయి. అనంతగిరి మండలం నిమ్మలపాడు గ్రామ పరిధిలో 8.725 హెక్టార్లు,24 హెక్టార్లలో రెండు లీజులను గతంలో ఏపీఎండీసీ కేటాయించారు. వీటిలోదాదాపు 1.20కోట్ల మెట్రిక్‌ టన్నుల కాల్సైట్‌ ఖనిజం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండులీజుల్లో ఖనిజం తవ్వకాలు, విక్రయాలు ఏపీఎండీసీ గత మే నెలలో టెండర్లు పిలిచింది. కాల్సైట్‌కు గనులశాఖ సీనరేజ్‌ రుసుం టన్నుకు రూ.90ఉండగా, దీనికి ఒక టిన్నర రెట్లు అదనంగా టన్నుకు రూ.225ను కనీస ధరగా ఏపీఎండీసీ ఖరారు చేసింది. ఈ మొత్తంతోపాటు ప్రతి టన్నుకు సీనరేజ్‌ ఫీజు,జిల్లా ఖనిజ నిధి,మెరిట్‌ అదనంగా గనులశాఖకు చెల్లించాలి. ఈ లీజులు ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో గిరిజనులు వ్యక్తి గతంగా (ట్రైబల్‌ ఇండివిడ్యువల్స్‌)టెండర్లలో పాల్గో నేలా నిబంధన విధించారు. గిరిజనులు భాగస్వా మ్యులుగా ఉన్న సంస్థలకు అవకాశం ఇవ్వలేదు.
గ్రామ సభ లేదు..సొసైటీకి అవకాశమివ్వలేదు
ఈ రెండు లీజుల్లో తవ్వకాలకు సంబంధించి స్థానికంగా గ్రామసభ నిర్వహించి ప్రజల ఆమోదం, గ్రామసభ తీర్మానం పొందలేదని గిరిజన సంఘా లు పేర్కొంటున్నాయి. గిరిజనులు వ్యక్తిగతంగా మాత్రమే టెండరు వేయాలనడం,వారు భాగస్వా ములుగా ఉన్న సంస్థలను అవకాశం ఇవ్వకపోవ డం ఏమిటని శ్రీఅభయ గిరిజన మ్యూచువల్‌ ఎయి డెడ్‌ లేబర్‌ కాంట్రాక్ట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమి టెడ్‌ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మా భూముల జోలికి వస్తే ఊరుకోం ధర్మన్న,మాజీ సర్పంచ్‌
ఇక్కడ మాతాత,ముత్తాతల నుంచి భూ ములను సాగు చేసుకుంటున్నాం. బిర్లా కంపెనీ వారు మైనింగ్‌ కొరకు వచ్చినపుడు సుప్రీం కోర్టుకు వెళ్లి రాజ్యాంగం ప్రకారం మా హక్కులు కాపాడు కొన్నాము. దానిప్రకారం ట్రైబల్‌ సొసైటీ నీ ఏర్పాటు చేసుకొన్నాము. పీసాచట్టం ప్రకారం షెడ్యూల్‌ ప్రాం తంలో ఉన్న వనరులపై మాకుహక్కు ఉన్నది. 11.05.2016న 5.96 హెక్టార్లకు ఏపీఎండిసి వారు టెండర్‌కి మేము క్వాలిఫై అయ్యి ఎల్‌3గా యున్నాము ఇప్పటికి మా డిపాజిట్‌ తీసుకోలేదు. ఈవిషయంపై 18112015 ఛీఫ్‌ సెక్రటరీ,స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ హైదరాబాద్‌ వారికి లెటర్‌ ఇచ్చియున్నాం.13062016 మా ప్రతిపాదనను పునపరిశీలించవలసిందిగా కోరాం. సమత జడ్జి మెంట్‌ ప్రకారం తమ సొసైటీకే లీజులు ఇవ్వాలి. 2015న హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమరు మాఅప్లికేషన్‌ కన్సిడర్‌ చేస్తామని ఒప్పు కున్నారు.బలవంతంగా మైనింగ్‌ చేపడితే చావుకైనా వెనకాడం.8.725హెర్టార్లకు సంబంధించిన భూమి పక్కా జిరాయితీ.మాభూముల్లో లీజుదారులు చొరబడితే సహించేది లేదు. అనేక గ్రామాలకు మధ్యన మైనింగ్‌ ఏరియా చింపి ప్రసాద్‌, సొసైటీ అధ్యక్షుడు
కాల్సైట్‌ మైనింగ్‌ ఏరియా ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాల సమీపములో యున్నది. చుట్టు ఉన్న పచ్చని మాగాణి భూము కలుషితమయ్యే అవకా శం ఉంది. ఈ కాల్సైట్‌ మెటీరియల్‌ తక్కువ డెన్సిటీ ఉన్న కారణముగా, భారీయంత్రముల వలన ఎక్కువ పొడిగా మారి మెటీరియల్‌కు నష్టం జరిగే అవకాశా లున్నాయి. వందలాదిమంది ఈ మైనింగ్‌ పనిపై ఆధారపడియున్నారు. మాకున్న పరిమిత మైనింగ్‌ దృష్ట్యా2011నుండి అనేక పర్యాయములు Aూవీణజని సంప్రదించి మా వినతులు ఇవ్వ డమై నది.5.96 హెక్టర్స్‌లోనిభూమి మరియు 8.725 హెక్టలలోనిభూమి మాజిరాయితీ పట్టా భూములని అనేక పర్యాయములు Aూవీణజకి తెలియజేయడం జరిగింది.
–గునపర్తి సైమన్‌

READ ALSO

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

సంప‌ద శాపం

Related Posts

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు
క‌థ‌నం-Kathanam

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

January 7, 2022
సంప‌ద శాపం
క‌థ‌నం-Kathanam

సంప‌ద శాపం

December 4, 2021
మా గుండెల్లో చెరగని మీ సింహసనం
క‌థ‌నం-Kathanam

మా గుండెల్లో చెరగని మీ సింహసనం

November 10, 2021
అడవి తల్లికి గర్భశోకం
క‌థ‌నం-Kathanam

అడవి తల్లికి గర్భశోకం

November 10, 2021
వైవిధ్యం వారి జీవనం
క‌థ‌నం-Kathanam

వైవిధ్యం వారి జీవనం

October 12, 2021
పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి
క‌థ‌నం-Kathanam

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

September 14, 2021
Next Post
దిశ చట్టం ఉన్నా..ఆగని అఘాయిత్యాలు

దిశ చట్టం ఉన్నా..ఆగని అఘాయిత్యాలు

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

December 4, 2021

దేశాన్ని కదలించిన ‘టూల్‌కిట్స్‌’

March 12, 2021
మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

January 7, 2022
We break indigenous societies and yet are scared of ‘them’

We break indigenous societies and yet are scared of ‘them’

November 3, 2020

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3