• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home క‌థ‌నం-Kathanam

విశాఖ ఉక్కుపై దొంగ దెబ్బ‌

team-dhimsa-viz by team-dhimsa-viz
March 12, 2021
in క‌థ‌నం-Kathanam
0
విశాఖ ఉక్కుపై దొంగ దెబ్బ‌
0
SHARES
97
VIEWS
Share on FacebookShare on Twitter

ఓవైపు ఢల్లీిలో సాగు చట్టాను రద్దు చేయాంటూ రైతునిరసను మిన్నం టుతున్న వేళ ఏపీలోని విశాఖ లో మరో ఉద్యమం ప్రారంభ మైంది.ఉక్కు కర్మాగా రాన్ని ప్రైవేటీకరణ చేయాని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటైజేషన్‌ చేస్తే ఊరు కునేది లేదని వివిధ పార్టీ నేతు ప్రజా సంఘాు రోడ్డెక్కుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంక్పంతో ముందుకు కదని నిర్ణయం తీసుకుం టున్నాయి. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాు విరమించుకోవాని డిమాండ్‌ చేస్తూ కార్మికు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఏకగ్రీవంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమోదం తెలిపింది. దీన్ని అసెంబ్లీలో తీర్మాణం చేయడానికి ఏపీ సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ విశాఖలో రోజురోజుకు ఉద్రక్తమౌతోంది.

ప్రభుత్వ రంగ సంస్థను ఒక్కటొ క్కటి గా విదేశీ కార్పొరేట్‌కంపెనీకు ధారాదత్తం చేస్తున్న కేంద్రప్రభుత్వం మరో దొంగ దెబ్బతీసింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకంపెనీకి విశాఖ ఉక్కు ను కట్టబెట్టేందుకు కుట్రపూనడం దాని నయవంచన కు మరో తార్కాణం. వైజాగ్‌ స్టీల్‌ భాగస్వామ్యం తో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ పరిశ్రమను నెకొల్పేందుకు పోస్కోకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతు ఇచ్చేయడం దుర్మార్గం. దేశమంతా కరోనాతో పోరాడుతుంటే బిజెపి అండ్‌ కో మాత్రం ఈ విపత్తు సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థను,విమానా శ్రయాను, ఇతరభారీ పరిశ్రమను కాజేసే కుట్ర కు ప్పాడుతోంది. స్వదేశీ సంస్థను,ఉత్పత్తును ప్రోత్సహిద్దామంటూ ఒకవైపు‘లోకల్‌..వోకల్‌’ నినా దానిస్తూనే మరోవైపు బంగారుగుడ్లు పెట్టే ప్రభుత్వ రంగ స్వదేశీ పరిశ్రమను విదేశీ బహుళ జాతి సంస్థకు కట్టబెట్టడం మోడీ సర్కార్‌ దుర్మార్గాకు దర్పణం. విశాఖ ఉక్కు (వైజాగ్‌స్టీల్‌)అనేది ఒట్టిప్రభు త్వ రంగ సంస్థ మాత్రమేకాదు. ఎందరో మహనీ యు, ఎంతో మంది ప్రజత్యాగనిరతితో ఆంధ్రు ఆత్మ గౌరవానికి నిువుటద్దంలా రూపు దాల్చిన మహా కర్మాగారం. తొగుప్రజ ప్రగతి లో విశాఖ స్టీల్‌ ఒకమైురాయి. కార్మికుకు, అధి కారయంత్రాంగానికే కాదు స్థానిక ప్రజానీకం జీవనయానంలోనూ విశాఖ ఉక్కు ఒకభాగ మైంది. అణువణువూ పోరాట స్ఫూర్తితో జీవం పోసుకున్న ఈకర్మాగారం తొగు ప్రజ భావోద్వే గాతో పెనవేసుకుపోయిన మణి హారం. కలికితు రాయి వంటిఇలాంటి మహోజ్వ సంస్థపై కార్పొ రేట్‌ కన్ను పడకుండా ఉంటుందా? ఉండదు. దశా బ్దాుగా కార్పొరేట్‌ ప్రయత్నాను ప్రజు తిప్పి కొడుతూవచ్చారు. గతంలోవాజ్‌పేయి,మన్మో హన్‌ సింగ్‌ ప్రభుత్వా సమయంలోనూ ఇలాంటి ప్రయ త్నాు జరిగితే ప్రజు తిరగబడ్డారు. స్థానిక ప్రజా నీకం అనుమతి తీసుకోకుండా ప్రయివేటుకు కట్టబెట్టే చర్యు తీసుకోబోమని అప్పట్లో వారంతా ప్రకటిం చారు. ఎలాగైనా విశాఖఉక్కు కాజేయాని కంక ణం కట్టుకున్న పోస్కో మోడీ సర్కార్‌ తొలినాళ్ల నుంచే ప్రయత్నాు తీవ్రతరం చేస్తూ వచ్చింది. కార్మికలోకం చలో విజయవాడ చేపట్టి ఆప్రయత్నా ను ఆపగలిగింది. మోడీమంత్రివర్గంలోని ఉక్కు శాఖమంత్రి సైతం ప్రజ అనుమతి లేకుండా ముందుకెళ్లబోమని ప్రకటించారు. ఈచీకటి ఒప్పం దం కార్యరూపం దాల్చేందుకు ప్రధానమంత్రి కార్యాయమే నేతృత్వంవంహిం చిందన్న కథనాు నివ్వెరపాటుకు గురి చేసేవే. మోడీసర్కార్‌ ‘లోకల్‌.. వోకల్‌’ నినాదపు లోగుట్టేంటో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రయివేటు సంస్థకు భూము, వన యి అవసరమైన ప్రతిసారీ పాకు చెప్పే మాట ‘పరిసరప్రాంతా అభివృద్ధి..స్థానిక యువ తకు ఉపాధి’. ఈమాయ మాటతో కోట్లాది ఎక రా భూమును,మివైన ఖనిజవనరును కార్పొ రేట్‌ కంపెనీకు కట్టబెట్టినా..కేవం ప్రయివేటు పరిశ్రమ ఏర్పాటుతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఆసేతుహిమాచం ఒక్కటీలేదు. కానీవిశాఖ పరిశ్ర మ మూలాన ఉత్తరాంధ్ర రూపురేఖు అంతకు ముందుకంటే ఎంతోమార్పు చెందాయి. ప్రజ జీవన ప్రమాణాల్లోనూ స్పష్టమైన ప్రగతి కనిపిం చింది. జనజీవనంతో మమేకమైన ప్రభుత్వ సంస్థను అండదండందించి అభివృద్ధి చేయాల్సిన పాకులే ఆయువు తీసేందుకు కత్తినూరడం హేయం. సొంత గనుంటే విశాఖ ఉక్కుమరింత దృఢమవుతుం దని పదేపదే విన్నవిస్తున్నా పాకు చెవి కెక్కించు కోలేదు. బహుళ జాతి సంస్థ అయిన పోస్కోకు మాత్రం నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సర ఫరా చేయడానికి మోడీసర్కార్‌ అంగీకరించిం దంటే ఇంతకంటే ప్రజాద్రోహముంటుందా? విభజ న హామీు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌ ..ఇలాఅడుగడుగునా రాష్ట్రాన్ని వంచిస్తూ వస్తున్న బిజెపిమోసాను తొగు ప్రజానీకం ఇక నైనా తిప్పికొట్టాలి. అన్ని విధాుగా సామాజిక న్యాయాన్ని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38(1)ను అము చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలే కీకం.ఆర్టికల్‌39(బి)ద్వారా ఖనిజ వనరుపై ప్రభుత్వానికి ఉండే యాజమాన్యం, నియంత్రణను ప్రైవేటీకరణ దెబ్బ తీస్తోంది.
విశాఖ ఉక్కుపై మోడీ విషప్రచారం
ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కును నూరు శాతం తెగనమ్మాని నిర్ణయించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తొగు ప్రజ ఆత్మగౌరవం పైన,ఆర్థిక అస్తిత్వం పైన వేటు వేస్తే దాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న సమైక్య పోరాటంపై నిందాప్రచారాతో ఆపార్టీ రాష్ట్ర నాయకత్వం మరింత దారుణమైన పోటు పొడు స్తున్నది. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, వెనకబడిన ప్రాంతాకు తోడ్పాటుతో సహా విభజిత రాష్ట్రం విషయంలో చేసిన వాగ్దానాన్నీ వమ్ము చేసి కడుపు లో కుమ్మిన బిజెపి నాయకు ఇప్పుడు ప్రాణా ర్పణతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హరించే వినాశకర నిర్ణయం తీసుకోవడం వివక్షకు వికృత ఉదాహరణ. ఈనిర్ణయంపై ప్రజలో ఆగ్రహావేదను వ్యక్తం కావడం చూసి ‘మేమూ వ్యతిరేకమే. మావాళ్లకు చెబుతామ’ని ఢల్లీి యాత్రు చేసి క్లబొల్లి కబుర్లు చెప్పారు. మొదట ఇది దేశ మంతటికీ వర్తించే విధాన నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి వారు బాహాటంగా సమర్థించారు. ఎంఎల్‌సి మాధవ్‌ వంటి వారు ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదని హాస్యాస్పదమైన వాదను చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఢల్లీిలో హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసి మన చేతిలో ఏముందని సరిపెట్టారు. అయితే ఇలాంటి పైపై మాటతో ప్రజను మాయజేయలేమని తేలి పోయాక బిజెపి నేతు ప్లేటు మార్చేశారు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ తరహాలో అసు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిం దని సోము వీర్రాజు, జివిఎల్‌ వంటి వారు ఎదురు దాడి ప్రారంభించారు. ఇదంతా తమ హిందూత్వ ను దెబ్బ తీయడానికి రాజకీయ పక్షాు ఆడుతున్న నాటకమని తిట్టిపోస్తున్నారు. విశాఖ పక్కనే రామ తీర్థంలో సంఘటనను ఆసరా చేసుకొని పరుగు తీసిన బిజెపి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దెబ్బ తీయ డానికి ఆ మంత్రాన్నే ప్రయోగించాని చూడటం దాని మతతత్వ రాజకీయానికి, వంచనా శిల్పానికి పరాకాష్ట. మాయమాటన్నీ తోసిపుచ్చుతూ ఆందో ళన ఉధృతమవుతుండటంతో అసు రంగుతో బయిటకొచ్చిన బిజెపి విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమం పై విషప్రచారం విద్వేష వ్యాఖ్యకు దిగింది. పరి రక్షణలో పాుపంచుకోకపోగా అందుకోసం సాగే పోరాటంపై అసత్యాతో పెద్ద పత్రమే ప్రచురిం చారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం నిర్ణయమే తీసుకో లేదని చెప్పడంకన్నా అబద్ధం మరొకటి లేదు. ఆ వివరాు వాణిజ్య పారిశ్రామిక పత్రికన్నిటిలో వచ్చాయి కూడా. ‘’ఆర్థిక వ్యవహారా క్యాబినెట్‌ కమిటీ (సిసిఇఎ) రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో కేంద్రం వాటా వంద శాతం ఉపసంహరణకు విధానపరమైన నిర్ణయం తీసు కుంది. నష్టాలో నడుస్తున్న ఆ సంస్థ నుంచి వంద శాతం వాటాను అమ్మేసేందుకు కేంద్రం తీసుకున్న తుది నిర్ణయం మీ కల్పిస్తుంది. వంద శాతం పెట్టుబడు ఉపసంహరణ చేయడంతో పాటు యాజమాన్యాన్ని కూడా ప్రైవేటీకరించాని విధాన పరమైన నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ ‘డీపమ్‌’ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఫిబ్రవరి 3న అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక్కడ ఇంకో విపరీతమేమంటే ఇప్పటి వరకూ పెట్టుబడు ఉపసంహరణ అన్న పదంవాడుతున్న కేంద్రం ఏకంగా ‘వ్యూహాత్మక అమ్మకం’ అనే మాటను తాజా బడ్జెట్‌తో ముందుకు తెచ్చింది. ప్రధాని మోడీ ఉత్పత్తిపెంపు అనే ఊకదంపుడు పేరుతో ప్రైవేటీకర ణకు రాష్ట్రాను సిద్ధం చేసేం దుకు ముఖ్యమం త్రుతో జరిపిన సమావేశమే మరింత స్పష్టంగా వారి ఉద్దేశాను బహిర్గతం చేసింది.
అడుగడుగునా పోరాటమే!
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అన్నది మొదటి నినాదమేగాని ఉక్కు ఫ్యాక్టరీ సాధన, స్థాపన, నిర్వాసితు సమస్యు, పునరావాసం, ఉత్పత్తి, ఆధునీకరణ…ప్రతి దాని వెనక సుదీర్ఘమైన పోరాట చరిత్ర వుంది. 1978లో తమిళ దర్శకుడు కె.బా చందర్‌ తీసిన ‘మరో చరిత్ర’ విశాఖ ఉక్కు పైలాన్‌ సాక్షిగానే జరుగుతుంది. ‘ఈ ఫ్యాక్టరీ నిజమైనప్పుడు మన ప్రేమ నిజమవుతుంద’ంటాడు హీరో.ఆ చిత్రంలో వారి కథ విషాదాంతమవుతుంది గాని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం మాత్రం వీరోచి తంగా, విజయవంతంగా సాగింది.1966లో నిరసను, దీక్షు, రాజీనామాతో ఉక్కు ఉద్యమం మొదలైతే…ఉక్కుఫ్యాక్టరీ ఒకరూపం తీసుకో వడానికి కనీసం పాతికేళ్లు పట్టింది. 1991లో వి.పి.సింగ్‌ ప్రధానిగా బ్లాస్ట్‌ఫర్నేస్‌ ప్రారంభిస్తే 1992లో పి.వి.నరసింహారావు తదుపరి ఘట్టం ఆవిష్కరించారు. ఫ్యాక్టరీ సాధన పోరాటంలో ప్రాణార్పించిన అమరుతో పాటు నిర్మాణంలో కూడా కార్మికు,నిపుణు ప్రాణత్యాగాు చేశా రు. దేశంలో ఇతర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీతో పోలిస్తే విశాఖకు పెట్టుబడులోనూ గను కేటా యింపులోనూ వివక్ష అందరి కళ్ల ముందే జరిగిం ది. కార్మిక సంఘాు కమ్యూనిస్టు వెంటపడితే తప్ప ఈవిషయంలో ప్రధాన పాక పార్టీు చొరవ తీసుకున్నది లేదు. ప్రతినిధి వర్గాుగా వెళ్లిన సమ యంలో కసిరావడం,ప్రదర్శనగా వెళ్లినపు డుసభ లో ప్రస్తావించడంవంటివి జరుగు తూ వచ్చాయి (స్థానికంగా పునరావాసం, ఉద్యోగా క్పన వంటి విషయాల్లో మాత్రం కొందరు నేతు పోరాడే వారు). ఈపార్టీన్నిటి ఆర్థిక విధా నాలో, నమూ నాలో పెద్ద తేడా లేదు. విశాఖ ఉక్కు ఒకరూపం తీసుకోవడం దేశంలో సరళీకరణ విధానాు మొద వడం ఒకేసారి జరిగింది. వాస్త వానికి వాటికి ఆద్యుడైన అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఈఫ్యాక్టరీ ప్రధానఘట్టాన్ని ప్రారంభించడం యాదృ చ్ఛికం కాదు. తర్వాత దశ వారీగా జరిగిన ఉద్యమాు, ధర్నాు, నిరసనకు లెక్కే లేదు. కాని ఎప్పుడూ రాష్ట్రంలో పాక పార్టీ రాజకీయాలో అవి ప్రధాన స్థానం ఆక్రమించక పోగా ప్రైవేటీకరణ వ్యూహాలే ప్రధానంగా సాగాయి. ఎన్‌డిఎ,యుపిఎ-1హయాంలో కొన్ని పరిష్కారాు జరిగినా అంత కు అనేక రెట్లు వేగంతో ప్రైవేటీ కరణ,అమ్మకం వంటి ప్రతిపాదను కొనసాగుతూ వచ్చాయి తప్ప సద్దుమణిగింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాంటే దానికి ఎసరు పెట్టడం తప్ప ముందుకు తీసుకు పోవడం ఏలిక ఎజెండాలో లేకపోయింది.
ఉక్కు రక్షణకే ఉద్యమం
రాష్ట్ర విభజన తర్వాత ఎ.పికి మిగిలిన ఒకేఒక పారిశ్రామిక కేంద్రం విశాఖ పట్టణమైతే దానికి ప్రాణవాయువు ఉక్కు ఫ్యాక్టరీ. అయినా దాన్ని కాపాడుకోవడం కీకమనే మెకువ రాష్ట్ర పా కుకు లేకపోయింది. ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకున్నా కనీసం దీనిన్క్కెనా పటిష్టపర్చి కాపాడ టానికి కేంద్రానికీ మనసు లేకపోయింది. 2014లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కంపెనీ అంతర్గత మివ కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రూ.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వే ఎకరా భూముతో కసి దాని మివ రెండున్నర క్షకోట్లకు పైనే వుంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రతినిధు 2018 లో పర్యటించడం, 1700 ఎకరా భూమి వారికి కేటాయించి అధు నాతన ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణంకై 2019లో అవగా హనా ఒప్పందం ఎంవోయు కుది రాయి. ఆసమ యంలో వారు ముఖ్యమంత్రి జగన్‌ను కుసుకు న్నారు కూడా. ఈకామంతటా దేశంలో రాష్ట్రం లో భిన్నపార్టీు అధికారం చేస్తున్నా ప్రైవేటీ కరణ దిశలో అడుగు ఆగింది లేదు. వారెవరూ వాటి పై పోరాడలేదు సరికదా ప్రజతో ఆ సమా చారం పంచుకుని చైతన్యపరిచింది కూడా లేదు. ప్రస్తు తానికి వస్తే 2019లోనరేంద్ర మోడీ రెండవ సారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదను లెక్కకు మిక్కుటంగా వున్నాయి. సంస్థు మాత్రమేగాక కేంద్రం అధీనం లోని భూమును కూడా మివకట్టి అస్మదీ యుకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడిరది. వంద శాతం ప్రైవేటీక రణ జాబితాలో చేరింది. ఈవార్త వచ్చాక కార్మిక సంఘాు పోరాటం ఉధృతం చేశాయి.
బిజెపి దుర్నీతిపై పోరాటం
విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుం టుందనీ, అప్పటి వరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసిపి, జగన్‌ ప్రభుత్వ పెద్దు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతి పాదనతో లేఖ రాశారు. అందులో. ప్రత్యే కంగా గను కేటాయించడం, బ్యాంకు రుణాను ఈక్విటీగా మార్చడం, వంటి సూచను చేశారు. ఏడు వే ఎకరా భూమిని అమ్మి ఆమొత్తం అప్పుకు కట్టొచ్చని కూడా విశాఖ పర్యటన సమ యంలో కలిసిన కార్మిక నాయకుకు సూచించారు. ‘పోస్కో’ ప్రతినిధు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కుపై ఆసక్తి లేదని భావన పాడు, కడప, కృష్ణపట్నం వంటి విషయాు మాట్లా డారని తెలిపారు. ఆ పార్టీ ఎం.పి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ వంటి వారు పాదయాత్ర చేశారు. తొగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాస్‌ ఆరు రోజు నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శిం చేందుకు వచ్చిన చంద్రబాబు కార్మికు శిబిరాన్ని సందర్శించి ఐక్య పోరాటంలో తాము కలిసిరావ డానికి సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ విశాఖ ఉక్కుపై ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నాయని బిజెపి దాడి చేయడం అందరికీ తీవ్రాగ్రహం కలిగించింది. శుక్రవారం నాడు విశాఖలో కార్మిక సంఘా ఆధ్వర్యాన జరిగిన గొప్ప సభలో బిజెపి యేతర పార్టీన్నీ చేతు కలిపి పోరాటానికి మద్దతు ప్రకటించ డంతో బిజెపి దుర్నీతికీ దుష్ప్రచారాకు గట్టి సమా ధానం. ఈ ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విశాఖ ఉక్కును ప్రైవేటు పావ కుండా కాపాడుకోవాని కార్మికలోకం, రాష్ట్ర ప్రజానీకం కృతనిశ్చయంతో వుండటం అభినంద నీయం. రాష్ట్రంలో పెద్ద పార్టీలైన వైసిపి, టిడిపి తో సహా అందరూ రాజకీయ భేదాకు అతీతం గా రాష్ట్ర మనుగడకు సంబంధించిన ఈ అంశంపై ఉద్యమాన్ని బలోపేతంచేసి బిజెపి కపట నాట కానికి స్వస్తి చెప్పాలి. పదేపదే ఎ.పి పట్ల వివక్షకు, వికృత ప్రచారాకు ప్పాడుతున్న మోడీ సర్కారుకు మర్చిపోలేని పాఠం నేర్పించాలి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్‌ రాజకీయాను చాలా ప్రభావితం చేస్తుంది. మతతత్వ రాజకీయా ు ఎ.పిలో చ్లొబాటు కావని చాటి చెప్పి మనుగ డ కోసం నడుం బిగించవసిన సందర్భం ఇది. రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం మొదలైన ఈ సమిష్టి పోరాటం రేపు మిగిలిన న్యాయమైన హక్కు సాధనకు బాట వేయానేది ప్రజందరి ఆకాంక్ష.

ఇదీ ఉక్కు చరిత్ర
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే పోరాటం ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు 50ఏళ్లు దాటింది.ఇప్పుడు మళ్లీ ఉద్యమ జ్వా లు ఎగసిపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర హక్కు అంటూ జనం నినదిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నినాదం మారుమోగుతోంది.విశాఖ ఉక్కు ఉత్రరాంధ్ర హక్కు అంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రజల్లో బమైన సెంటిమెంట్‌ ఉండడంతో పార్టీ కు అతీతంగా నేతంతా విశాఖ ఉద్యమాన్ని భుజాన వేసుకునేందుకు మేముసైతం అంటు న్నారు.. కానీఇప్పుడు ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం అంత ఈజీగా జరగలేదు. 32 మంది ప్రాణాు అర్పించారు. జాతీయ నేతకు నిద్రపట్టకుండా విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ దిక్కు పెక్కటిల్లేలా నినదించారు..? మళ్లీ ఇప్పుడు ఉక్కు ఉద్యమం ఎగసి పడుతున్న నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ చరిత్రను ఒకసారి తొసుకుందాం..

దాదాపు 50ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే నినాదం మొదలైంది. అది 1966వ సంవత్సరం..నవంబర్‌ నె ఒకటవ తేదీ..విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆందోళనకాయి నినదిస్తున్నారు..ఉద్యమం ఉవ్వె త్తున ఎగసిపడడంతో పోలీసు క్పాుు జరి పారు. ఆక్పాుల్లో ముగ్గురు విద్యార్థు.. ఆరుగురు ఉద్యమకాయి మరణించారు.. అదే రోజు ఒక్క విశాఖలోనే కాకుండా….అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్తంగా పోలీసు క్పాుల్లో మొత్తం 32మందిప్రాణాు అర్పించారు. ఆ విషాద ఘటన జరిగిన మూడేళ్ల తరువాత కేంద్రం ప్రభు త్వం విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్న ట్టు ప్రకటించింది.1971లో శంకుస్థాపన జరిగితే.. రెండుదశాబ్దా తరువాత పూర్థిస్థాయి ఉక్కు పరిశ్ర మ పనును ప్రారంభమయ్యాయి.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపో యిన తరువాత..మద్రాసునగరాన్ని కోల్పోయా మన్న అసంతృప్తి ప్రజ మనసునుంచి చెరిగిపోలేదు. దానికి తోడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అన్యాయమే జరిగిం దని ఆంధ్ర ప్రజల్లో బమైన అభిప్రాయం ఏర్ప డిరది. దీంతోఉమ్మడిరాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నాుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో రూర్కెలా, మధ్యప్రదేశ్లో భిలాయ్‌, పశ్చిమబెంగాల్‌లో అసన్‌ సోల్‌ ఇలా మూడు కర్మాగారాు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించానుకున్న స్టీల్‌ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాుగోది బొకారోలో నెకొల్పాని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం రaార?ండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాన్నది అప్పటి కేంద్రప్రభుత్వ ఆలోచన. 1964శీతాకా సమావేశాల్లో ఆ ప్రణా ళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పరిశ్రమ విషయంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెకొల్పాలి అని ఏపీ నేతు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నిఇంకా నిర్లక్ష్యంచేస్తే సహించేది లేదని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్య మంత్రి ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయ కు సీపీఐకు చెందిన పి.వెంకటేశ్వర్లు, సీపీఎం కు చెందిన టి.నాగిరెడ్డి, స్వరాజ్య నేత జి.చ్చన్న, నేషనల్‌ డెమొక్రాట్స్‌ నేత తెన్నేటి విశ్వనాథం, ఇండి పెండెంట్‌ నేత వావిలా గోపా కృష్ణయ్య ఇతర నేతు మద్దతు ఇచ్చారు. అప్పటికే ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం చేసిన హిందుస్తాన్‌ స్టీల్‌ మాత్రం విశాఖపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీం సంజీవరెడ్డి ఉన్నారు. 1965 జనవరి 27న బ్రిటిష్‌ అమెరికన్‌ స్టీల్‌ వర్క్స్‌ ఫర్‌ ఇండియా కన్సార్షియం పేరుతో ఆయన ఒకసాంకేతిక నిపుణు బృందాన్ని నియ మించారు. ఇదిఆరువేర్వేరుస్థలాు విశాఖ పట్నం, బైదిలా,గోవా,హోస్పేట్‌,సేం,నైవేలీను పరిశీ లించిన తరువాత 1965జూన్‌ 25వన నివేదికను ఇచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్రతీరంలో అత్యంత అనుకూమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. ఓడరేవు ఉన్న విశాఖపట్నం అన్నివిధాలా అను వైనదని నివేదికలో పేర్కొంది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తం గా ఉక్కు కర్మాగారం బమైన సెంటిమెంట్‌గా మారింది. తెన్నేటివిశ్వనాథం సారథ్యంలో..ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బమైన అఖిపక్ష కార్యా చరణ కమిటీ ఏర్పడిరది. అప్పటికే నివేదిక ఆధా రంగా విశాఖలో ఉక్క కర్మాగారం ఏర్పాటు చేయా ని కేంద్రానికి బంగా తమ వాదన విని పించా రు. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చా రు. కానీ ఆయన 1966 జనవరిలో ఆకస్మికంగా చనిపోయారు.ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. దీంతో ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ బ్రేకు పడ్డాయి. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని డిమాండ్‌ చేస్తూ జూలై 1965న అసెంబ్లీలో ఒకతీర్మానాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని స్వయంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయిందనే ఆగ్రహంతో ఉన్న ప్రజ ఆవేదనను అర్థం చేసుకోవాలి అంటే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తప్పనిసరి అని అప్పటి కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పట్లో ఐదో ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని అప్పటిప్రధాని ఇందిరాగాంధి స్పష్టం చేశారు. కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాుకూడా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పట్టుపట్టాయి.. అలాంటి సమయంలో ఏపీకి స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తే మిగితారాష్ట్రాల్లో ఆందో ళను పెరుగుతాయని ఇందిర భయపడి ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఆస్యానికి కారణమైంది. ఒకవర్గంపై మరో వర్గం పైచేయి సాధించడానికి ఉక్కు సెంటిమెంట్‌ ను ఎత్తుకున్నాయని అప్పుడు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగాజరిగింది.ఈరాజకీయా మధ్యస్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యం కాదని బమైన అభిప్రా యం రావడంతో1966 అక్టోబర్‌, నవంబర్‌ నెల్లో ఉద్యమం బపడిరది. విశాఖఉక్కు-ఆంధ్రు హక్కు నినాదంతో ప్రజు ఉద్యమించారు. గుం టూరు జిల్లాతాడికొండకు చెందిన టి.అమృ తరావు 1966 అక్టోబరు15న విశాఖ పట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజా, కార్మిక,విద్యార్థి సంఘా ు ఉద్యమంలో చేరాయి. వారికి విపక్ష రాజకీయ పార్టీు మద్దతుగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసను ఎగసిపడ్డాయి. బంద్‌ు,హర్తాళ్లు, సభు, సమ్మొ,నిరాహారదీక్షుపెరిగాయి.1966 నవం బర్‌ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారును చెదర గొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫమవటంతో.. పోలీసు క్పాుు జరిపారు. తొమ్మిదేళ్ల బాుడు కె.బాబూరావు సహా తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థు కూడా ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతమైంది. ఉద్యమం హింసా త్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తు ధ్వంస మయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయ ఆస్తి నష్టం జరిగింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యా ర్థు నీం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏూరు కాువలో పడేశారు. ఆందోళన కారుపై పోలీసు క్పాుల్లో..తగరపువసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు,విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు,కాకినాడలో ఒకరు, వరంగల్‌లోఒకరు,సీలేరులోఒకరు, గుంటూ రులో ఐదుగురు చనిపోయారు. మొత్తంమీద విశాఖ తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా32మంది ఈ ఉద్యమం కోసం ఒకేరోజు ప్రాణాు అర్పించారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఒకేరోజు అంతమంది ప్రాణాు అర్పించడంతో ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 1966 నవంబర్‌ 3న ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సరే నందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది.అయితే..ఉద్యమాన్ని అణచి వేయ డానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరపైకి తెచ్చిందని వివిధ రాజకీయ పక్షాు విమర్శించాయి. అందరూ ఊహించినట్టే కేంద్రం మాత్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడాముందుకు వేయ లేదు.. ఆప్రతిపాదను పక్కన పడేసింది. మరోవైపు పోలీసు క్పాుపై న్యాయవిచారణ జరిపిం చాన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించటానికి నిరసనగా..1966 నవంబర్‌17నఅసెంబ్లీలో అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాు. ప్రతిపక్ష పార్టీకు చెందిన 67మంది ఎంఎల్‌ఏు..తమ శాసనసభ సభ్యత్వాకు రాజీనామా చేశారు. సీపీ ఐకి చెందిన నుగురు లోక్‌సభ సభ్యు కూడా రాజీనామా చేశారు. కానీ..ఆ తర్వాత1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీు పెద్దగా ప్రభా వం చూపలేకపోయాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 165అసెంబ్లీ సీట్లు,35లోక్‌సభ సీట్లు గొకుని కేంద్ర,రాష్ట్రాల్లో మళ్లీఅధికారంలోకి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీ బం 51 నుంచి 20కితగ్గిపోయింది. స్వతంత్ర పార్టీ 29 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ఆ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత..1970ఏప్రిల్‌ 17న.. విశాఖలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని నిర్ణ యించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. స్టీల్‌ప్లాంటుకోసం కురుపాం జమీందాయి 6,000 ఎకరా స్థలాన్ని విరాళం గాఇచ్చారు.
ఆమరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకు స్థాపన చేశారు.డీపీఆర్‌ తయారీబాధ్యతను మెస్సర్స్‌ ఎం.ఎన్‌.దస్తూర్‌ అండ్‌ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పను మొద య్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్‌ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరి లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధు కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కుఉత్పత్తి ఆరంభమైంది.మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పనిప్రారం భించింది. అలా ప్రారంభమైన ఉక్కపరిశ్రమ ఇప్పుడు26 వేఎకరాల్లో విస్తరించింది. ప్రతిఏడాది7.3 మిలి యన్‌ టన్ను ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. సుమారు 16వేమంది శాశ్వత ఉద్యోగు,17 వేకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుఉండగా.. క్ష లాది కుటుం బాు ఉపాధిపొందు తున్నాయి. కొన్నేళ్లపాటు లాభాు అందించిన స్టీల్‌ ప్లాంట్‌ను..ఇప్పుడు నష్టాపేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రతిపా దనతో మళ్లీ ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది.
-సైమన్‌ గునపర్తి / కె.అశోక్‌ రావ్‌ 

‌

READ ALSO

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

సంప‌ద శాపం

Related Posts

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు
క‌థ‌నం-Kathanam

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

January 7, 2022
సంప‌ద శాపం
క‌థ‌నం-Kathanam

సంప‌ద శాపం

December 4, 2021
మా గుండెల్లో చెరగని మీ సింహసనం
క‌థ‌నం-Kathanam

మా గుండెల్లో చెరగని మీ సింహసనం

November 10, 2021
అడవి తల్లికి గర్భశోకం
క‌థ‌నం-Kathanam

అడవి తల్లికి గర్భశోకం

November 10, 2021
వైవిధ్యం వారి జీవనం
క‌థ‌నం-Kathanam

వైవిధ్యం వారి జీవనం

October 12, 2021
పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి
క‌థ‌నం-Kathanam

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

September 14, 2021
Next Post
బాలోత్స‌వ్

బాలోత్స‌వ్

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

April 12, 2021
అడవి తల్లి ఒడిలో అక్షర శిల్పాలు  

అడవి తల్లి ఒడిలో అక్షర శిల్పాలు  

February 15, 2021
విశాఖ వేదికగా సీఎం జగన్ సంచలన నిర్ణయం

విశాఖ వేదికగా సీఎం జగన్ సంచలన నిర్ణయం

March 12, 2021

సెకండ్‌వేవ్‌..పెద్ద పీడకల

September 2, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3