నిత్యనూతన ప్రవాహం అంబేడ్కర్ సిద్ధాంతం

సమకాలీన రాజకీయాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్ నిర్దేశించిన మార్గదర్శనాలను అనుసరించడం అనివార్యంగా మారింది.

గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరించిన రాజకీయాలు, సంస్థలు, పార్టీలు నేడు అంబేడ్కర్ ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద, సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్ 14 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ సిద్ధాంతాలు, అభిప్రాయాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీయాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది.

నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్ ఊసే ఎత్తని కొన్ని పార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చుకునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంతవరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు.

సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు దళితుల కోసం పనిచేయడానికి ప్రత్యేక సంఘాలనే ఏర్పాటు చేసుకున్నాయి. దళిత హక్కుల పోరాటసమితి, కుల వివక్ష వ్యతిరే క పోరాట సంఘం ఈ రెండు పార్టీల అనుబంధ సంఘాలుగా నిర్మించారంటేనే ఆ మార్పుని గమనించాల్సిన అవసరం వున్నది. మావోయిస్టు లాంటి ఎంఎల్ పార్టీలు నేరుగా కాకపోయినా తమ తమ రాజకీయాలతో ఉన్నవాళ్లతో కొన్ని సంఘాలను నిర్మించి పనిచేస్తున్నాయి. దీనిని ప్రాముఖ్యం కలిగిన రాజకీయ పరిణామంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు పూర్తిగా హిందూమతాన్ని రక్షించి, పెంచి పోషించడానికి ఉద్భవించిన ఆరెస్సెస్ లాంటి సంస్థలు, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచన ప్రకారం తాము అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని ప్రకటించుకున్నాయి. యేడాది క్రితం ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవతి ఒక విధాన ప్రకటన చేశారు. తాగునీటికి, దేవాలయానికి, శ్మశానానికి అందరికీ ఒకే స్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు.

అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గత పాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్ ను ఒక శక్తిగా నిలబెట్టాయి. అంబేడ్కర్ సిద్ధాంతాలపై ఎంత లోతైన చర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 25 ఏళ్ళ చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది.

బడుగు బలహీనవర్గాలకు వెలుగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాలు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థికవేత్త. ఈ దేశంలో అసమానతలకు మూలమైన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూలనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891 ఏప్రిల్‌ 14 వ తేదీన రాంజీ భీమాబాయి దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు భీమ్‌ రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబావదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమానించే ఒక ఉపాధ్యాయుడు ఆ పేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వికులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌ కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయులు స్వగ్రామం వీరికి ఆ గ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతి ఏటా జరిగే గ్రామ దేవత ఉత్సవాలకు ఉ పయోగించే పల్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబేద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌ పాల్‌ మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాలన్నింటిలొనూ మహర్లు కొంత సాహసవంతులు గాను బుద్ధి బలం, ఉత్సహంకలవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరువలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొలుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తి సాంప్రదాయం ప్రవక్తలు కులభేదాలను పాటించలేదు, ఒప్పుకొనలేదు.
రాంజీ సక్‌పాల్‌ కు 14 మంది సంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషుల జన్మ వృత్తాంతాలలో కొన్ని అద్భుత సంఘటనలు ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాలు వస్తుండేవాట. ప్రపంచ దేశాలు అంబేద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జి గా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లతోపాటు, శూద్ర కులం నుంచి ఎదిగిన ఓసీ కులాల నాయకులు పాలకులు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కుల నాయకుడిగానే చూస్తారు. ఈ దేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్ని బట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది.


సబ్బండ వర్గాల సమ్మిళితంగా రాజ్యాంగం
అంబేద్కర్‌ ఒక దళితుల కోసమే కాదు ఈ దేశ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తెలుస్తుంది. 1945 వరకు దాదాపు 40 డిగ్రీల వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటి వ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీ రాష్ట్రపతి). ఇద్దరు దళితవర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాలు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావడం అధిపత్యకులాలకు ఇష్టం లేకపోవడం కుల వివక్ష పొలేదనడానికి ఒక ఉదా మన కరెన్సీ రూపాయి నోట్ల పై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణం గాంధీ అగ్రకులం వ్యక్తికావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.


అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అని పేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540 -45 లొ 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండియన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడింగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరి క్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీ లో పీహెచ్‌డీ, 1920 లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్పడింది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గాల కొసం బ్రిటిష్‌ కాలంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాలు 8 గంటల పని దినములు చేస్తే ఇండియాలో మాత్రమే 12 నుండి 14 గంటల వరకు పనిచే చేసే పద్ధతి అమలులో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పనిదినం అమలు అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాలంలో అనేక కార్మిక చట్టాలను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.

ఆడమగ తేడా లేకుండా వేతనానికి పోరాటం
ఆర్టికల్‌ 39 లో కార్మికులకు యజమాన్యపు హక్కు కావాలని స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని, బీమా ఉచిత విద్యా సౌకర్యం యజమానుల కార్మికుల పిల్లలకు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలని చేయాలని చెప్పారు. ఆర్టికల్‌ 39 ప్రకారం కార్మికునికి ఉచిత న్యాయం అందేల రూపొందించారు. ఆర్టికల్‌ 41లొ ఉద్యొగహక్కు కల్పించాలని, 42 ఆర్టికల్‌ 43 ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని అభిలాషించారు. కార్మికునికి వారానికో రోజు సెలవు ఇవ్వాలని సూచించన వ్యక్తి అంబేద్కర్‌. బౌద్ధాన్ని స్వీకరించిన అంబేద్కర్‌ దళిత బడుగు బలహీన వర్గాలను మరోసారి మోసం చేయడం కోసమే తాము హిందువుగానే పుట్టాం కానీ హిందువు గా చావను, అని వారు చెప్పారు. నా దళిత హక్కుల ను నా సోదరులు హక్కులను మాత్రం ఏనాడు అనుభవించ లేదంటూ అంబేద్కర్‌ రచించిన సంగతిని గుర్తుండే ఉంటుంది.


పాలకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాలు మైనార్టీలు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమాల ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనులపై దాడులు చేస్తూ చంపడమే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బలహీన వర్గాల ప్రజలపై నిత్యం దాడులు చేయటం, వారి ప్రాణాలు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాలకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాలని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్యం నుండే పిల్లలకు మహనీయులత్యాగాలు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.

(డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ జయంతి సంద‌ర్భంగా…) -కె.స‌తీష్ కుమార్