పిల్లలదే ఈ ప్రపంచం..

ఈ ప్రపంచం పిల్లలకు సరిపడా ఉండాలా? ప్రపంచానికి వీలుగా పిల్లలుండాలా?అని అడుగుతారు రవీంద్రనాధ్‌ ఠాగూర్‌.‘సమా జంలో అత్యంత హానికి గురికాగల వాళ్ళు ‘పిల్లలు’.వారికి హింస,భయం లేని జీవి తాలను అందిద్దాం’అన్నారు నెల్సన్‌ మండేలా. బాల్యాన్ని కోల్పోయి బానిసలుగా దుర్భరమైన బతుకులీడుస్తున్న పిల్లలు మన చుట్టూ ఇంకా ఎందరో ఉన్నారు.‘మూడు మూరల కర్రతో ముప్పై ఎడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముళ్ళయ్యో’ అనే పాల బుగ్గల జీతగాళ్ళు ఇంకా గ్రామాల్లో కన్పిస్తూనే ఉన్నారు.‘బంగ్లాలూడ్చీ, బాసన్లు తోమీ, కలిగినోల్ల కాల్లే పడితే తినబోతే ఎంగిలి కూడూ..నీ ఈపునిండా ఎర్రని వాతలే’ ఇలా పట్నం వచ్చి పనుల్లో ఉండి హింసను అనుభవిస్తూ బెదురు చూపులతో గడుపుతున్న చిన్ని ప్రాణాలు ఇంకా ఉన్నాయి.‘కన్నోరి నెరగవు ఉన్నోరినెరగవు ఆదరించే వారినె రగవూ..చెత్త కుండే తండ్రై సాకేనా నీళ్లపంపు తల్లైసాకెనా’అంటూ తప్పిపోయి వచ్చినా, పారిపోయి వచ్చినా,తప్పించుకొని వచ్చినా.. అనాధలై వీధిలోనే బతికే బాల్యం,ఛిద్రమైన వీధి బాలలూ పెరుగుతున్నారే కానీ తరగడం లేదు. బాలల హక్కులను కాపాడేందుకు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రజల్లో అవగా హన కల్పించేందుకు 2002 నుండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రకటించి ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇటుక బట్టీలలో మట్టి కొట్టుకున్న చిన్నారులు,చిన్నారి వేళ్ళతో రాళ్ళను గాజుల్లో పొదిగి వంటి నిండా అంటుకున్న మెరుపులుతో,అమాయకంగా చూస్తున్న గిడసబారిన పిల్లలూ ఇలా ఎన్నో సీన్స్‌ కళ్ళ ముందు కన్పిస్తూ..35ఏండ్లు గడిచి పోయా యి.వీళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. బాల కార్మిక వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకా యలుగా వర్థిల్లుతూనే ఉంది. ఇంకా ఎన్నేళ్ళు? పిల్లలంతా హాయిగా ఆనందంగా ఉండే రోజు రాదా? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలి పోతూనే ఉన్నాయి. కుటుంబ కలహాలు, గృహహింస ప్రకృతి విపత్తులు,కుల,మత సంఘర్షణలు,నిర్లక్ష్యానికి గురైనవారు, తప్పి పోయిన పిల్లలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు, ఆకలి, పేదరికం వల్ల పనిదొ రకని కుటుంబాలతో వలస వచ్చిన పిల్లల జీవితమంతా ఓ గమ్యం తెలియని ప్రయా ణం.ఈ ప్రయాణంలో సుమారు 214 మిలి యన్ల మంది పిల్లలున్నారు.
బాధ్యత ప్రభుత్వాలదే
వలస వెళ్ళిన చోట హింస,దోపిడీ,సౌకర్యాలు లేకపోవడం,అనారోగ్యాలు,పిల్లలకు చదువు లేకపోవడం..అన్నిటినీ మించి కొత్త చోటులో నిర్భంధిస్తారా? వెనక్కి పంపుతారా? ఆపుతా రా? ఉండనిస్తారా?తెలియదు. వాళ్ళు ఉండా లనుకుంటున్నారా? తిరిగి వెళ్ళాలను కుంటు న్నారా?అని పిల్లల్ని అసలు అడగరు. వలస కార్మికుల రక్షణ కోసం కార్మికశాఖ అనేక విధానాలను రూపొందించింది.వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలతో కూడా సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. ఆ క్రమంలో పిల్లలు దోపిడీకి గురి కాకుండా చదువుకి ఏర్పాట్లు చేయడం,మరీ ముఖ్యంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం అవస రం.వాళ్ళ భవిష్యత్‌ నిర్మాణంలో వాళ్ళే భాగస్వా మ్యం వహించాలి కదా!
యావత్‌ సమాజ బాధ్యత
1973లో అంతర్జాతీయ కార్మిక సంస్థ హక్కుల ప్రకటన 138వ ఒడంబడిక,1999లో182 ఒడంబడిక బాలకార్మికతను ఈ విధంగా నిర్వచించింది.12,14 ఏండ్ల లోపు పిల్లలు ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి పనిచేయడం, ప్రమాదకర, హానికర పనుల్లో బలవంతంగా నియమించబడటం, వ్యభిచారానికి ఉపయో గించటం, అక్రమ రవాణా చేయబడటం, అసాంఘిక కార్యకలాపాల్లోకి, ప్రమాదాల్లోకి నెట్టివేయబడటం’ అత్యంత దారుణం. అలాగే 1989లో విశ్వ బాలల హక్కుల ప్రకటన ఏం చెపుతుందంటే ‘ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి,చదువుకు,ఆరోగ్యానికి హాని కలిగిం చేలా వారి శారీరక, మానసిక, సామాజిక, నైతిక ఎదుగుదలకు ఆటంకం కలిగించే పనుల నుండి పిల్లల్ని రక్షించాలి’ అని. పిల్లల సంక్షేమం యావత్‌ సమాజ బాధ్యత అని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ అంగీకరించి హామీనిచ్చాయి. అయితే హైదరాబాద్‌లో జరిపిన ఓచిన్న సర్వే ప్రకారం28,560మంది వీధుల్లోకి వచ్చేస్తే వాళ్ళల్లో 18,670మంది బాలకార్మికులుగా మారారు. 18,827 మంది చదువుకోగా, అసలు చదువుకోని వాళ్ళు 17,056. వీధుల్లోనే నివసిస్తూ పని చేసేవాళ్ళు 20,056 మంది ఉన్నారు. భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య.ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపం చంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబం ధించింది కూడా.బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి స్థిరమైన,దీర్ఘకాలిక కృషి ఎంతో అవసరం. బాలకార్మికుడు అనే పదానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనమే మిటంటే ‘బాల్యాన్ని నాశనం చేసే రీతిలో పిల్లలతో పని చేయించడం’.పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి అవరోధమై, వారికి అక్షరాస్యత,వినోదాన్ని పొందే అవకాశం ఇవ్వని పనిని,ఆస్థితిని బాలకార్మిక వ్యవస్థగా పేర్కొంటారు.బాలలంటే 5నుంచి14 సంవత్స రాల వయసు గలవారు. అయితే, తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఎందరో బాలలు బాలకార్మికులుగా జీవిస్తున్నారు. అవసరాల కోసమో, అదనపు ఆదాయం కోసమో పేద కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి పంపిస్తున్నారు. ఎంతో మంది బాల లు వ్యవసాయ పనుల్లో, నిర్మాణ రంగాల్లోనే కాకుండా ప్రమాదకర వృత్తులైన ఇసుకబట్టీలు, పలకల తయారీల్లో, క్వారీల్లో, గాజు పరిశ్రమ, మైనింగ్‌ రంగాల్లో బ్రతుకీడుస్తున్నారు. దీనివల్ల పిల్లలు శారీరక, మానసిక పెరుగుదల లేకుండా దీర్ఘకాల దుష్పరిణామాలకు గురవుతున్నారు. పిల్లల్లో సహజంగా ఉండే నైపుణ్యాలు, సామర్ధ్యాలు నశించిపోవడం, భావి భారత మానవ వనరులు దుర్వినియోగమవడమే.
ఎప్పుడు ప్రారంభమయింది..?
పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన మొదటి రోజుల్లో ఈ బాలకార్మిక వ్యవస్థ కూడా ప్రారంభమైంది. మొదటిసారి 1803లో బ్రిటన్‌ బాలకార్మిక నియంత్రణ కోసం చట్టం తెచ్చింది.1819లో ఫ్యాక్టరీ చట్టాలు వచ్చాయి. పనిగంటల నియంత్రణ ఫ్యాక్టరీల్లో, కాటన్‌ మిల్లుల్లో జరిగింది.ఆతర్వాత 1948లో కర్మాగారాల చట్టం వచ్చింది.1966లో బీడీ, చుట్ట కార్మికుల పని పరిస్థితులు ఉద్యోగ నిబం ధనలు వచ్చాయి.1970లో కాంట్రాక్ట్‌ కూలీల నియంత్రణా,నిషేధ చట్టం.ఆ తర్వాత అంత: రాష్ట్ర వలస కార్మికులచట్టం 1979 వచ్చింది. 1988లో దుకాణాలు, సంస్థల చట్టం. 1958 లో వాణిజ్యనౌకల చట్టం.1952లో గనుల చట్టం పై అన్ని చటాలు 14ఏండ్లలోపు పిల్లలు పనిచేయటాన్ని నిషేధిస్తున్నాయి.
మానవహక్కుల ఉల్లంఘనే
బాలకార్మికత కూడా మానవహక్కుల ఉల్లంఘనే అనిచెప్పవచ్చు.రాజ్యాంగం ప్రకారం కూడా స్వేచ్చా,సమానత్వం,గౌరవం,వివక్షత, హింస లేని జీవితాలు పిల్లల హక్కు.రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 24 ప్రకారం14ఏండ్ల లోపు పిల్లలు ఫ్యాక్టరీలలో లేక ఇతర అపాయకరమైన పరిస్థి తులతో పనిచేయడం నిషేధించబడిరది. ఆర్టికి ల్‌ 39 (ఇ)(ఎఫ్‌) ప్రకారం లేతవయసులో ఉన్న పిల్లల ఆరోగ్యం,శరీరసత్తువ దుర్వి నియోగం కాకూడదు.వయసుకి తగని వ్యాపకాల్లో బలవం తంగా నెట్టే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలి.పిల్లలను, యువతను దోపిడీకి గురికాకండా చూడాలి.‘పిల్లల అభివృద్ధి కోసం జాతీయ ప్రణాళికల్లో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యమైన ప్రాధాన్యత కలిగి ఉండాలి. అసమా నతలను పోగొట్టి సామాజిక న్యాయాన్ని అందించడం మన అందరి ముఖ్య ఉద్దేశ్యం కావాలి. మన జాతీయ విధానం ప్రకారం సంపూర్ణమైన బాలల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అన్నారు జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌.ఒక న్యాయమూర్తిగా ఉంటూ పిల్లల హక్కుల చట్టాలలో సవరణల కోసం విశేష కృషి చేసిన గొప్ప వ్యక్తి ఈయన.
తీవ్రమైన దోపిడీ
120అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం.. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య లో బాలకార్మికులున్నారు.14ఏండ్ల లోపు బాల లు 250మిలియన్ల (ఇప్పుడిరకా పెరిగిఉండ వచ్చు) మంది బాలకార్మికులు ఉంటే,వారిలో 50 మిలియన్ల మంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.20మిలియన్లు వెట్టి చాకిరీలో, 20లక్షల మంది ముఖ్యంగా బాలికలు అక్రమ రవాణాకు గురౌతున్నారు. మరికొంత మంది కుటుంబాల్లో ఇంటి పనుల్లో ఉండి పోతు న్నారు.అలాగే వ్యవసాయ పనులు,చేతి వృత్తులు,కుటీర పరిశ్రమల్లో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నారు. ఇంకానిర్మాణ పనులు,చెత్తతో ఉత్పత్తులు,ఇతరుల వద్ద పని చేయడంతో పాటు స్వయం ఉపాధి పనులు చేస్తున్నారు.వెట్టి చాకిరీలో భాగంగా కార్పెం టర్‌,ఎంబ్రాయిడరీ పనులు,గనులు,షాపులు, రెస్టారెంట్స్‌లో పసులు,వ్యభిచారం,అశ్లీలంతో కూడిన పనులు చేయించబడుతున్నారు. 2000లో ప్రపంచ వ్యాప్తంగా Gశ్రీశీపaశ్రీ వీaతీషష్ట్ర aస్త్రaఱఅర్‌ జష్ట్రఱశ్రీస ూaపశీబతీ జరిగింది.ఈ సందర్భంగా నేను 24గ్రామాలు కాలినడకన తిరిగి ప్రచారం చేశాను.పాటలు, నాటికల ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పని చేశాను.ఆక్రమంలో 12ఏండ్ల బాలకార్మికుని కొట్టి చంపిన సంఘటన దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఆ యజమాని (హంతకుడు)కి శిక్ష పడేలా చేయగలిగాం.
కారణాలు ఇవే
బాలకార్మిక వ్యవస్థకు మూలకారణాలైన పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత, వేధింపు లుతో పాటు మంచి పాఠశాలలు,నాణ్యమైన విద్య అందివ్వలేకపోవడం.లాగే మహిళలకు పరిమిత అవకాశాలు,మరీ ముఖ్యంగా పిల్లలు పనిచేస్తే వచ్చే ప్రమాదాలు,నష్టాలను తేలిగ్గా చూసే విధానం,యజమానుల లెక్కలేని వైఖరులు వీటన్నింటిపై అందరికీ అవగాహన కల్గించాలి. ప్రయారిటీలో పిల్లలుండాలి. ఈసమస్యలను ఇప్పుడు మనం తేలిగ్గా తీసు కుంటే రేపటి సమాజం ఆటవిక సమాజం కాగలదు.పిల్లలు భావి సంపద అని చెప్తుంటారు.కానీ మెటీరియల్‌గా,ఆస్తిగా చూడ టం సరికాదు.ప్రాణం ఉన్న ఆలోచన ఉన్న వ్యక్తులుగా వారిని చూడాలి.అంటే సుస్థిర అభి వృద్ధి లక్ష్యాలను సాధించుకునే దిశగా ప్రభు త్వాలు,పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు కలసి ప్రయత్నం చేయాలి.
బాలల హక్కుల చట్టం ప్రకారం
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేసిన చట్టాలు అమలు చేసేందుకు రూపొందించిన యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అందరిది.బాలకార్మిక చట్టం 1986 సవరణ చేస్తూ బాలలు,యువ కార్మిక (నిషేద నియంత్రణ)చట్టం2016గా రూపొందించడం జరిగింది.దీని ప్రకారం14 ఏండ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం.14నుండి18ఏండ్ల యుక్తవయసు పిల్లల్ని ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోవడం నేరం. దీనికి 6నెలల నుండి 2ఏండ్ల వరకూ జైలు శిక్షతో పాటు 50వేల వరకు జారిమానా ఉం టుంది.పై నేరాలు తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా చేయబడితే 10వేల జరిమానా. అలాగే ముందుగా డబ్బు అప్పు ఇచ్చి పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కూడా నేరంగా పరిగణించ బడుతుంది.దీనికి 1976ప్రకారం 3ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.
బాలల సంక్షేమ సమితి
బాలల సంక్షేమ సమితి అనే సంస్థ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిరది. పిల్లలు పనిలో ఉన్న సమాచారం అందగానే చైల్డ్‌ లైన్‌ లేదా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది,పోలీసులు,లేబర్‌ డిపార్ట్‌మెంట్‌,లేబర్‌ ఆఫీసర్‌ లేదా స్వచ్చంద సంస్థలుగాని రిస్క్యూ చేసి ఎప్‌ఐఆర్‌ నమోదు చేసి 24 గంటలలోముందు హజరుపరచాలి. పనిలో పెట్టుకొన్న యజమానికి లేబర్‌ కోర్ట్‌ ద్వారా శిక్షలు,జరిమానాలు ఉంటాయి.బాలల న్యాయ చట్టం ప్రకారం బాలలను ఎవరైనా పనిలో పెట్టుకొన్నా, వెట్టిచాకిరీ కోసం వినియో గించినా,పని కోసం అమ్మినా,కొన్నా,జీతం ఇవ్వకుండా యజమాని వాడుకున్నా 5ఏండ్ల జైలు,జరిమానా విధిస్తారు.పై నేరాల్లో పిల్లలు వికలాంగులైతే నేరస్తులకు రెట్టింపు శిక్ష ఉం టుంది.
ఎవరికి ఫిర్యాదు చేయవచ్చు – (ఐక్యరాజ్యసమితి విశ్వ బాలల హక్కుల తీర్మానంలో పొందుపరిచిన హక్కులే పైన తెలియజేసిన 12 అంశాలు), వ్యాసకర్త : ఎక్స్‌ చైర్మన్‌,ఛైల్డ్‌వెల్‌ఫేర్‌ కమిటీ- (పి.శ్యామలాదేవ

    నైపుణ్యం గల యువతతోనే ప్రపంచాభివృద్ధి

    మానవుడు ఆదిమకాలం నుంచి శ్రమ ద్వారా నేటి కంప్యూటర్‌ యుగం తాజాగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) దాకా ప్రయాణం సాగిస్తున్నాడు. శ్రమకు ఆలోచనతో, సృజనాత్మకతతో, నైపుణ్యం జోడిరచడం ద్వారా మాత్రమే ఇంతటి ముందడుగు సాధించగలిగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్నా, నిలబడాలన్నా తప్పకుండా స్కిల్స్‌ ఉండాల్సిందే. ప్రపంచదేశాల్లో ఎక్కడాలేని యువశక్తి మన దేశంలోనే ఉంది. వారికి సరైన నైపుణ్యం కల్పించి, వారి సామర్థ్యాల్ని సద్వినియోగం చేసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. పదేళ్లుగా కోట్లాది మంది యువత తమ కలల్ని సాకారం చేసుకోలేక, ఉపాధి లేక నిర్వీర్యంగా ఉన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ యువశక్తిని ఉపయోగించుకుంటేనే సాధ్యం. నైపుణ్యాలు గల యువతతోనే ప్రపంచ అభివృద్ధి, శాంతి సాధ్యమవుతుంది.
    ఆధునిక పోటీ ప్రపంచంలో సరైన,నైపుణ్యాలు ఉంటేనే కొలువులు దక్కించుకోవడం సాధ్యమవు తుంది.ఆ నైపుణ్యాలను మప్పేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఆశించిన ప్రయోజనాలను అందించడం లేదు.ప్రస్తుతం యువజనుల నైపుణ్యాల మెరుగుదలకు వృత్తి శిక్షణా,ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌, ఆన్లైన్‌ కోర్సులు,వర్క్‌షాపులు,సెమినార్లు,మెంటార్‌ షిప్‌,వెబ్‌నార్స్‌,సాఫ్ట్‌ స్కిల్స్‌ట్రైనింగ్‌,లాంగ్వేజెస్‌ ట్రైనింగ్‌, కెరియర్‌ కౌన్సెలింగ్‌,జీవన నైపుణ్యాలు,క్రీడలు, సృజనాత్మక సాధనాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రిటికల్‌ థింకింగ్‌ వంటివి వేదికలుగా ఉన్నాయి.అయితే అవి అందరికీ అందుబాటులో లేకపోవడం లేదా వాటి గురించి ఎక్కువ మందికి ముఖ్యంగా యువతకు తెలియకపోవడం, తెలియజేసే పరిస్థితిలో పాలకులు లేకపోవడం మన దురదృష్టకరం.ఇప్పటికే గ్రామాల్లోకి అన్ని సౌకర్యాలు వస్తున్నప్పటికీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా-ఉన్న ఉపాధిని ఊడగొట్టే పరిస్థితి నెలకొంది.గ్రామీణస్థాయి నుంచే బేసిక్‌ స్కిల్స్‌ అభివృద్ధికి ప్రత్యేకకృషి జరగాల్సి ఉంది.ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న విద్యకు,చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయింది.విద్యకు,నైపుణ్యాలకి,ఉపాధికి అంతరాన్ని తగ్గించాలి.చదువుతోపాటు స్కిల్స్‌ నేర్చు కోవడంద్వారా నేటియువతకు బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
    నైపుణ్యాలు-పథకాలు
    ప్రస్తుతం సాంకేతిక విద్య అన్ని రంగాల్లో కీలకమైంది. యువతలో నైపుణ్యాలు పెంపొందిం చేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు,అనేక వేదికలు-సంస్థల ద్వారా స్కిల్స్‌ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌యోజన,నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌,స్కిల్‌ ఇండియా మిషన్‌, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన,జమ్మూ కాశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఉడాన్‌,రోజ్‌ గార్‌ మేళా, క్రాఫ్ట్‌ మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ వంటి పేర్లతో యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఒక్క స్కిల్‌ ఇండియా మిషన్‌ ద్వారా ప్రతి సంవత్సరం కోటిమందికి పైగా స్కిల్స్‌ నేర్చుకొని బయటకు వస్తారని ప్రభుత్వం చెబుతుంది.కానీ అందులో ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయో చెప్పడం లేదు. అంతేకాదు..నాణ్యమైన నైపుణ్యాలు ఇంకా అందుబాటులోకి రావడంలేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అందరికీ స్కిల్‌ నేర్పించడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది. అక్కడక్కడ కొన్ని ప్రైవేటు సంస్థలు లేదావ్యక్తులు లాభాల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు నిర్వహి స్తున్నారు.అవి అందరికీ అందుబాటులో ఉండడం లేదు.ఫీజులు కూడా భయంకరంగా వసూళ్లు చేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడున్న దానికి మూడిరతలు స్కిల్‌డెవలప్‌మెంట్‌ వేదికలను ఏర్పాటు చేయాలి.వాటికి నిధులు ఇవ్వాలి. నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. అప్పుడుగానీ పరిస్థితి మెరుగుపడదు.నేడు సాధారణ డిగ్రీ చదివిన వారికి ఎటువంటి అవకాశాలు ఉండడం లేదనేది జగమె రిగిన సత్యం. కేవలం డిగ్రీ కాగితాలతో యువత కడుపు నిండదు. నాణ్యమైన శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచడానికి-నాణ్యమైన శిక్షణా కార్యక్ర మాలు ఉండాలి.పరిశ్రమల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి.గ్రామీణ ప్రాంతాల నుండి కూడా యువత ఈ శిక్షణా కార్య క్రమాలకు సులభంగా చేరుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం,నిధులను కేటాయించడం-నైపుణ్యా భివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ఒక్కటే మార్గం.
    2024 థీమ్‌
    చాలా సంవత్సరాలుగా ఉపాధి, ఆర్థిక అసమానత వంటి ప్రపంచ సవాళ్లను యువత ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ‘శాంతి, అభివృద్ధి కోసం యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, స్థిరమైన పురోగతికి ఏజెంట్లుగా యువత ఉండాలి’ అని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.
    ప్రపంచ అనుభవం
    కొన్ని రంగాల్లో అయితే కచ్చితంగా నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం లేదా ఆరంగంలో ప్రత్యేక శిక్షణ తర్వాతే ఉపాధి వంటి నిబంధనలు కూడా ఉన్నాయి.ఏరంగంలోనైనా బేసిక్‌ స్కిల్స్‌ అనేవి తప్పనిసరి. జర్మనీలో డ్యూయల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌’ ద్వారా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు పరిశ్రమల్లో శిక్షణ పొందుతారు.ఇది వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సింగపూర్‌ స్కిల్స్‌ ఫ్యూచర్‌ వంటి కార్యక్రమాలు నిరంతరం నైపుణ్యా లను మెరుగుపరచే అవకాశాలను కల్పిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో సైతం 80శాతం నైపుణ్యం కలిగిన వారికే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ రోజు అమెరికా లాంటి దేశాల్లోనూ విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు మెరుగుదలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. చదువు, దానికి తగ్గ శిక్షణ ఉంటుంది.ఈ రోజు ప్రపంచ దేశాలు అందరికీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కొందరు యువతకు మాత్రమే నైపుణ్య శిక్షణా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరికొందరు అవగా హన, అవకాశాలు అందుబాటులో లేకపోవ డం వల్ల వెనుకబడుతున్నారు.యువతలో స్కిల్స్‌ పెంచేందుకు మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలి.పాఠశాల, కాలేజీ స్థాయిల్లోనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిం చాలి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014జూన్‌లో యువజనులకు నైపుణ్య శిక్షణా,ఉద్యోగ అవకా శాలు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించారు. యువత కు బేసిక్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పించేందుకు ముందుగా ఇంజనీరింగ్‌ కళాశాలలో టెక్నికల్‌ ఎంప్లాయిమెంట్‌ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. తర్వాత డిగ్రీ కళాశాలలో ఆతర్వాత నిరుద్యోగ యువతకు కుట్టు,బ్యూటీపార్లర్‌,టైలరింగ్‌, ఎంబ్ర యిడరీ,ఎలక్ట్రికల్‌, కొలిమి వంటి చేతి వృత్తులలో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది.
    ప్రస్తుతం 26నైపుణ్య కళాశాలలు, 192 స్కిల్‌ హబ్‌లు కేంద్రంగా నడుస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 70 శాతంపైన యువత బేసిక్‌ స్కిల్స్‌ రావడం లేదు. ప్రస్తుతం ఇతర పట్టణాలకు వెళ్లి, బతకడానికి ఎక్కువ స్కిల్స్‌ నేర్పుతున్నారు. భవిష్యత్తులో మాత్రం ఎక్కడికక్కడే ఉపాధి అవ కాశాలు కల్పించే స్కిల్స్‌ నేర్పించాలి. గ్రామ స్థాయి నుంచి సొంత భవనంతో పర్మినెంటు ఉద్యోగులచే సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి, నిధులు ఇవ్వాలి. ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు సెజ్‌,నాన్‌సెజ్‌,యస్‌ఈజడ్‌ పేర్లతో తీసుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఐటి, ఫార్మా, వ్యవసాయ,ఎంఎస్‌ఎంఈ ఇండిస్టీస్‌ను అభివృద్ధి చేయాలి.ఈ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకున్న ఎంప్లాయ్మెంట్‌ ఎక్స్ఱెంజ్‌ ఆఫీసును నిరుద్యోగ యువతకు స్కిల్‌ శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధు లు కేటాయించి, ఖర్చు చేయాలి. ఈరోజు సాంకే తిక విద్య కీలకమైంది. కాబట్టి ప్రతి కళాశాలలో ఇంటెన్సివ్‌ నిర్వహించాలి.రాష్ట్రంలో 245 ఇంజ నీరింగ్‌ కళాశాలలు ఉన్న కేవలం నాలుగైదు కళా శాలల్లో చదివినవారికి మాత్రమే ఉద్యోగాలు వస్తు న్నాయి.అంటే దానికి కారణం స్కిల్స్‌,దాని అను బంధ ఏక్విమెంట్స్‌ ఉండటమే.మన రాష్ట్రంలో విస్తారంగాఉన్న సహజ వనరులను శుద్ధి చేసుకునే స్కిల్స్‌ అందుబాటులోకి తెచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చు ఎంతో కొంత నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు.ప్రభుత్వం విద్యా విధానాలను మెరుగుపరచడం, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం చేయాలి. అలాగే పరిశ్రమలతో కలసి శిక్షణా కార్యక్రమాలను రూపొందించ డం, నిధులు కేటాయించడం, యువతను ప్రోత్సహిం చడం వంటివి చేయాలి. నైపుణ్యాభివృద్ధికి కావాల్సి న వనరులు అందుబాటులో ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల అవసరాలను పరిగణన లోకి తీసుకుని అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలి. యువత భవిష్యత్తు కొరకు నైపు ణ్యాలు అత్యంత ముఖ్యమైనవి. మంచి నైపుణ్యాలు ఉన్నప్పుడే వారు సమాజంలో, పరిశ్రమల్లో మంచి స్థాయికి చేరుకుంటారు.ప్రస్తుత పరిస్థితుల్లో, టెక్నాలజీ ప్రగతితో పాటు, అనేక కొత్త నైపుణ్యా లను నేర్చుకోవడం అవసరం. యువతలో ఉన్న నిరుద్యోగాన్ని రూపు మాపడానికి మనరాష్ట్రంలో ఉన్న వనరుల ఆధారం గా చేసుకుని, విద్యార్థులకు ప్రాథమిక దశలోనే స్కిల్స్‌ నేర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం యూత్‌ పాలసీ ప్రకటించాలి.యూత్‌ పాలసీలో విద్య, వ్యవస్థాపకత-ఆవిష్కరణ, నైపుణ్యా భివృద్ధి,ఉపాధి,ఆటలు,సంఘసేవ,సామాజిక న్యా యం,దేశరక్షణ,ఐక్యత,సంక్షేమ పాలన రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాలతో కూడిన పాలసీ ప్రకటించాలి.
    రంగాల ప్రాధాన్యత
    మన దేశంలో ఇప్పటికీ ప్రాథమిక రంగం వ్యవసాయమే. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం.కాబట్టి యువ రైతు లకు నూతన వ్యవసాయ పద్ధతులు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. గ్రామీణ,మండలస్థాయిలో అయినా ఇటువంటి యంత్రాంగం ఏర్పాటు చేయడంద్వారా వ్యవసా యాన్ని లాభసాటి చెయ్యొచ్చు.వ్యవసాయంలో ఇప్ప టికీ పాతకాలపు పద్ధతులే ఉండటం,భూసార పరీ క్షలు,విత్తన పరీక్షలు,భూగర్భజలాలు గురించి, ఎరు వులు గురించి,వాతావరణ మార్పులు గురించి అవ గాహన లేకపోవడం వల్ల-రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు.దాని ఫలితంగా వలసలు వెళ్తున్నారు. రైతులు పండిరచిన ప్రత్తి,వేరుశనగ,టమోటా, ఉల్లి,వరి,మిరప,పండ్లుతోటలు ప్రాసెసింగ్‌ యూ నిట్లు ఏర్పాటు చేసి-శిక్షణ ఇవ్వాలి. స్కిల్స్‌ నేర్పిం చడం,డైరీఫాం,కోళ్ల పరిశ్రమ,చేపల పెంపకం మొదలైన వాటికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. ఇలాంటి చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయాల్సి ఉంది.స్వయంఉపాధిని పెంచాల్సిన అవ సరం ఉంది.ఇందులో ఎటువంటి స్కిల్‌, ట్రై నింగ్‌ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జరిగే అన ర్థాలు మనం ఇటీవల చూస్తున్నాం. కేవలం లాభా లు కోసం కార్పొరేట్‌ సంస్థలు దారుణాలకి పాల్పడ్డ సంఘ టనలు కోకొల్లలుగా ఉన్నాయి.ఉదాహర ణకు పరిశ్రమలో కార్మికు లకు స్కిల్‌ నేర్పకుండా పని చేయించడంవల్ల ప్రమాదాలు జరగడం. గ్రామాలలో కనీసం విద్యుత్‌పై అవగాహన లేని వారు ఆపరేటర్లుగా,లైన్‌మెన్లుగా ఉంటున్న పరిస్థితి. వారందరికీ వారి వారి రంగంలో స్కిల్స్‌ నేర్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు అక్కడ మనం చూడ వచ్చు.పరిశ్రమల్లో స్థానికులకు శిక్షణ ఇవ్వాలి. తద్వారా75శాతం స్థానిక యువతకే అవకాశం ఇవ్వొచ్చు. తృతీయ రంగం -సేవలు రోజు రోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో పెరుగు తున్న అభివృద్ధి. సమాచార రంగం అత్యధిక ఆదా యం వస్తున్నది. యువతకు ముఖ్యంగా స్కిల్‌ఉన్న యువతకు అత్యధిక అవకాశాలు ఈరంగంలో కనిపిస్తు న్నాయి.సమాచారం రంగం ఎంత వేగం గా పెరుగుతున్నా-సరైన స్కిల్స్‌ లేకపోతే అంతే ప్రమాదం జరుగుతుంది.విద్యార్థులకు కనీసం ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించ కుండా పాస్‌ చేస్తు న్నారు.ఇది నైపుణ్యాలు రాకపోవడంతో పాటు వారి భవిష్య త్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ప్రభు త్వంలో నెహ్రూ యువజన కేంద్రాలు నిధులు,సిబ్బంది లేక తీవ్రనిర్లక్ష్యానికి గురయ్యాయి. భారత నిర్మాణ వాలంటీర్లకు స్కిల్స్‌ నేర్పించి, వారి ద్వారా విద్యార్థులకు,నిరుద్యోగులకుబేసిక్‌ స్కిల్స్‌తో ట్రైనింగ్‌ ఇచ్చి-స్టయిఫండ్‌,వసతి సౌకర్యాలు కల్పించాలి.
    నైపుణ్యం కలవాడే విజేత
    చదువు పూర్తవగానే ఇక మనం నేర్చు కోవాల్సింది ఏం లేదు అని అనుకోవద్దు. నేర్చు కోవడం అనేది నిరంతర ప్రక్రియ,నేటిపోటీ ప్రపం చంలో ఎంత నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా తక్కువే అవుతుంది. జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా పురోభివృద్ధి సాధించాలంటే ఎప్పటిక ప్పుడు మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి,కొత్త నైపు ణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి. నైపుణ్యా లను మెరుగుపరచుకోవడానికి మార్గాలను వెతక డం వ్యక్తిగత వృద్ధికి మొదటి మెట్టు. మిమ్మల్ని మీరు నవీకరించుకుంటూ ఉంటే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు,ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవచ్చు, కెరీర్‌లో పురోగతిసాధించవచ్చు.జీవితంలోఉన్నత స్థితికి చేరుకోవచ్చు.నైపుణ్యాల ఎంపిక కూడా చాలా కీలకం. మీరు మీ బలాలు, బలహీ నతల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే, మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్న నైపుణ్యాలను ఎంచుకోవడం పై ఆలోచన చేయండి. మీరు మీ బలమైన నైపుణ్యా లపై పనిచేస్తూ వాటిని తదుపరి స్థాయికి తీసుకెళ్లా లనుకుంటున్నారా?లేక,బలహీనంగా ఉన్న నైపు ణ్యాలను సానపెట్టాలనుకుంటున్నారా? లేక కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అనేది నిర్ణయించుకోండి.మీరు ఏనైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలని ఎంచుకున్నా, అది మీరు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి, మీరు మీ లక్ష్యా న్ని సాధించడానికి, మీ కెరీర్‌లో ముందుకు సాగడా నికి సహాయపడేదై ఉండాలి.
    ఇతరుల అభిప్రాయాన్ని అడగండి
    ఎంచుకున్న నైపుణ్యాలపై మీ అంచనా అంత కచ్చితమైనది కాకపోవచ్చు.కాబట్టి ఈ మార్గంలో మీ సందేహాలు తీర్చడానికి,అపోహ లను తొలగించడానికి మీ స్నేహితులు,కుటుంబ సభ్యులు,సహోద్యోగులతో మాట్లాడండి,వారు ఏ నైపుణ్యాలను మెరుగుపరచాలని సిఫార్సు చేస్తారో అభిప్రాయాన్ని అడగండి
    విమర్శలను స్వీకరించండి
    పనితీరు బాగాలేదని మీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని వ్యక్తిగత దాడిగా తీసుకో కండి,వారికి విరుద్ధంగా ప్రవర్తించకండి. బదులు గా,ఇతరులు వారు చెప్పేది వినండి,దానిపై చర్చిం చండి.ఇతరుల విమర్శలు, సూచనలను తార్కిక దృక్కోణం నుండి విశ్లేషించడానికి ప్రయత్నించండి. అవి సరైన పాయింట్‌ని హైలైట్‌ చేస్తున్నాయో లేదో చూడండి.నిజమేనని భావిస్తే ఆ విమర్శలను స్వీకరించి నైపుణ్యాలను మెరుగు పరుచు కోడానికి సిద్ధంకండి.
    నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వండి
    నైపుణ్యాలను నేర్చుకోవడమే కాదు, వీటిని సాధన చేయడం కూడా ముఖ్యమే. ఏవస్తు వునైనా ఉప యోగించకుండా ఉంటే అదికొంత కాలానికి తుప్పు పట్టడం,పనిచేయకుండా పోతుం ది.నైపుణ్యం అయినా అంతే, మీరు వాడకుండా ఉంచే నైపుణ్యం సాధనచేయకపోతే కొంతకా లానికి నిరుపయోగంగా మారుతుంది.అప్పుడు నేర్చుకుని కూడా లాభం లేదు. కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్దిష్ట నైపుణ్యంలో నైపుణ్యం సాధించాలను కుంటే, నిరంతరం శిక్షణ పొందాలి.
    వ్యాసకర్త:-,డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి- (గుమ్మల రామన్న)

    జీవజాలానికి రక్షాకవచం.. ఓజోన్‌!

    సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా భూమ్మీది సకల జీవరాశిని ఓజోన్‌ పొర సంరక్షిస్తుంది. ఇది భూతలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణంలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్‌ పొర ప్రభావితమవుతోందన్న విషయంపై 1970ల నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్‌ పొర సన్నగిల్లినట్లు (ఇదే ‘రంధ్రం’గా వ్యాప్తిలోకి వచ్చింది) ఆ తరవాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష, జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్‌ పొర దెబ్బతి నడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లూరో కార్బన్లు (సీఎఫ్‌సీ),బ్రోమోప్లూరో కార్బన్లు (బీఎఫ్‌సీ). వీటిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 1987సెప్టెంబరు 15న మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను ఆమోదించాయి.సెప్టెంబరు 16ను అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవంగా ఐరాస సర్వసభ్య సమావేశం 1994లో ప్రకటించింది.దీన్నే ప్రపంచ ఓజోన్‌ దినోత్సవంగానూ పేర్కొంటారు.
    ప్రమాదకర కిరణాలు..

    జీవజాలంతో పాటు మొక్కలకూ అతినీల లోహిత కిరణాలు తీవ్ర హాని కలిగిస్తాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) సంస్థ మూడున్నర దశాబ్దాల క్రితమే దీనిపై ఓనివేదిక ప్రచురించింది.ఓజోన్‌ పొర బాగా దెబ్బతింటే రాబోయే 88 సంవత్సరాల్లో ఒక్క అమెరికా లోనే నాలుగు కోట్ల క్యాన్సర్‌ కేసులు అధికంగా నమోదై, ఎనిమిది లక్షల మరణాలు సంభవిస్తా యని హెచ్చరించింది. అతినీలలోహిత కిరణా లు నేరుగా భూమి మీదకు ప్రసరిస్తే మనుషులు పలు రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వృద్ధా ప్యం,కంటి సమస్యలు పెరుగుతాయి. రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది.మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది.పలు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ధ్రువప్రాంతా ల్లో ఓజోన్‌ పొర పలుచబడినట్లు వివిధ నివే దికలు వెల్లడిరచాయి.దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది.ఫలి తంగా తీర ప్రాంతాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది.విపరీతమైన ఇంధన వినియో గం,ఏసీలు,ఫ్రిజ్‌లలో వాడే ప్రమాదకర రసా యనాలు ఓజోన్‌ పొరకు నష్టంచేస్తాయి. సీఎఫ్‌ సీలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న హైడ్రోఫ్లూరో కార్బన్ల(హెచ్‌ఎఫ్‌సీ)తోనూ ఆపొరకు ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. వీటన్నింటికీ తోడు కార్చిచ్చులు సైతం ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి.అమెజాన్‌ అడవుల కార్చిచ్చు,ఈమేరకు ఆపొరపై ప్రభా వం చూపినట్లు పర్యావరణ సంస్థలు గతంలోనే ఆందోళన వ్యక్తంచేశాయి.ఆస్ట్రేలియాలో అడవుల దహనమూ ఓజోన్‌ పొరకు నష్టం కలిగించినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఓజోన్‌ పొర స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి ఓనివేదికను విడుదల చేస్తుంది.గతంతో పోలిస్తే ఓజోన్‌ పొర క్రమేణా కోలుకుంటున్నట్లు 2018లో విడుదలైన నివేదిక వెల్లడిరచింది. ఓజోన్‌ పొర క్షీణతకు దారితీసే పదార్థాల సాంద్రత వాతా వరణంలో తగ్గుతున్నట్లు తేలింది.కెనడా, స్వీడ న్‌,డెన్మార్క్‌,నార్వే వంటి వాటితో పాటు మరికొన్ని దేశాలు క్లోరోఫ్లూరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ను కట్టడి చేసేందుకు మొదటి నుంచీ ప్రయత్ని స్తున్నాయి. అమెరికాలో ఈపీఏ ఆధ్వర్యంలో సీఎఫ్‌సీ ఉత్పత్తిదారులతో అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు.ఓజోన్‌ పొర రక్షణ కోసం 1985లో28దేశాలు వియన్నా కన్వెన్ష న్‌లో సంతకం చేశాయి.ఓజోన్‌ పొరకు హానికా రకమవుతున్న రసాయనాలపై చర్చించేందుకు సంసిద్ధమయ్యాయి. అదే ఆతరవాత మాంట్రి యల్‌ ప్రొటోకాల్‌కు దారిదీపమైంది. అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా ఈ ప్రొటోకాల్‌ను అభివర్ణిస్తారు.
    భూమిపై జీవరాశులను రక్షించే కవచం..
    సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమిపై జీవుల మనుగడకు కారణమవుతుంది. అయితే ఈ కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు ప్రమాదకరమైనవి.ఇవి భూమిని చేరకుండా ఓజోన్‌ పొర అడ్డుకుంటుంది.ఇది లేకపోతే జీవుల మనుగడ సాధ్యం కాదు.1970వ దశకం చివర్లో ఓజోన్‌ పొరలో రంధ్రాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పొరను దెబ్బతీసే వాయువుల వల్ల దీనికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి.రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనింగ్‌తో పాటు ఇతర కూలింగ్‌ టెక్నాలజీ డివైజ్‌ల నుంచి ఈ వాయువులు విడుదలవుతున్నాయి. ఓజోన్‌ పొరను కాపాడ టానికి 1985లో వియన్నా ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి.ఓజోన్‌ ప్రాముఖ్యత గురించి దశాబ్దాలుగా అవగాహన ఉన్నప్పటికీ దాన్ని కాపాడాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది.ఎందుకంటే భూమిపై జీవుల మనుగడకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దుర దృష్టవశాత్తు క్రితం శతాబ్దంలో మానవులు చేపట్టిన వేగవంతమైన పారిశ్రామికీకరణ.. అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులకు కారణ మైంది. అడవుల్లో కార్చిచ్చు,అకాల వరదలు ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా ఇబ్బందులకు గురిచేశాయి.అయితే వియన్నా ఒప్పందంలోని మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ వల్ల అనుకూల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ శతాబ్దం మధ్య నాటికి ఓజోన్‌ పొర పూర్వ వైభవానికి(1980కి ముందు) చేరుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు.గ్రీన్‌ హౌస్‌ వాయువులు,మిథైల్‌ బ్రోమైడ్‌,మిథైల్‌ క్లోరో ఫామ్‌,కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌,క్లోరోఫ్లోరో కార్బన్స్‌, హైడ్రో ఫ్లోరో కార్బన్స్‌లాంటి రసాయన వాయు వులు ఓజోన్‌ పొర క్షీణతకు కారణమవుతు న్నాయి.
    ప్రస్తుతం ఓజోన్‌ పొర సురక్షితంగా ఉందా?
    మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ పూర్తి స్థాయి సంక్షో భాన్ని నివారించినప్పటికీ అడవుల ప్రమాదం నుంచి మనం ఇంకా బయటపడలేదు.ఈ ఏడా ది లాంకాస్టర్‌ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం నేచర్‌ అనే జర్నల్లో ప్రచురిత మైంది.ఓజోన్‌ పొరను రక్షించనట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వివరించారు. ఈ శతాబ్దం చివరినాటికి 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కు ఉష్ణోగ్రత పెరిగితే ఓజోన్‌ పొరను రక్షించలేమని,ఫలితంగా వాతావరణ మార్పులతో భూమిపై జీవనం తుడిచిపెట్టడానికి కారణమవుతుందని పేర్కొన్నారు.
    ఓజోన్‌ పొరను ఎలా రక్షించాలి?
    క్షీణతకు కారణమయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్‌ లాంటి వాయువులను ఉత్పత్తి చేసే ప్రొడక్టులను వినియోగించకూడదు.ఎయిర్‌ కండిషనర్లు లాంటి ఉపకరణాలను జాగ్రత్తగా చూసు కోవడంవల్ల వాతావరణంలోకి క్లోరోఫ్లోరో కార్బన్స్‌ లీకేజీని నివారించవచ్చు.వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణాపై ఆధారపడితే కొంతమేరకు పరిస్థితిని అదుపు చేయవచ్చు.వాతావరణ మార్పును మానవాళి నిలువరించాలంటే ఓజోన్‌ పొరను రక్షించడం ఎంతో ముఖ్యం.
    చైనా మొండితనం..
    మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై సంతకాలు చేసిన ప్పటికీ ఫ్రాన్స్‌, యూకే ప్రభుత్వాలు మాత్రం తమ సీఎఫ్‌సీ పరిశ్రమలను కాపాడుకోవడానికి మొదట్లో ప్రయత్నించాయి.దానిపై పలు విమర్శ లూ వ్యక్తమయ్యాయి.ఓజోన్‌ పొర దెబ్బతినడా నికి మానవ తప్పిదాలే కారణమని బలమైన ఆధారాలు వెలుగు చూడటంతో 1990లో లండన్‌లో జరిగిన సమావేశంలో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను బలోపేతం చేశారు. దేశాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సీఎఫ్‌సీల ఉత్ప త్తిని నిరోధించడానికి లక్ష్యాలను నిర్దేశించారు. చైనా మాత్రం వాటికి తలొగ్గకుండా ప్రమా దకర విధానాలను అనుసరిస్తూనే ఉంది. ప్రపంచ సీఎఫ్‌సీ-11ఉద్గారాల్లో 40-60శాతం చైనా నుంచే వెలువడుతున్నాయని రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. దీనిపై అంతర్జా తీయ సమాజం ఆందోళన వ్యక్తంచేసినా చైనా తన విధానాలను అలాగే కొనసాగిస్తోంది. మరోవైపు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను బలో పేతం చేశాక సీఎఫ్‌సీ ఉద్గారాలు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి.బ్రోమిన్‌ కలిగిన రసా యనాల వినియోగం క్షీణించడంతో ఓజోన్‌ పొరపై దుష్ప్రభావం చూపే హానికారక పదార్థాల తీవ్రత తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ ఓజోన్‌ పొరను ఎక్కువగా దెబ్బతీస్తు న్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మాంట్రి యల్‌ ప్రొటోకాల్‌ పరిధిలోకి రాకపోవడం వల్లే ఈపరిస్థితి నెలకొంది.పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ రక్షాకవచాన్ని సంరక్షించుకోవ డానికి ప్రపంచ దేశాల సమష్టి కృషి కొన సాగాలి. ఓజోన్‌ పొరపై దుష్ప్రభావం చూపే రసాయన సమ్మేళనాలన్నింటినీ కచ్చితంగా నియంత్రించాలి.ఓజోన్‌ క్షీణత పదార్ధాల నియంత్రిత ఉపయోగాల దశలవారీ,సంబంధిత తగ్గింపులు ఓజోన్‌ పొరను దీని కోసం భవిష్య త్తు తరాలకు రక్షించడంలో సహాయపడటమే కాకుండా,వాతావరణ మార్పులను పరిష్కరిం చడానికి ప్రపంచ ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడ్డాయి.అంతేకాకుండా,ఇది హానికర మైన అతినీల లోహిత వికిరణాన్ని భూమికి చేరకుండా పరిమితం చేయడం ద్వారా మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించింది. – (నాదెళ్ల తిరుపతయ్య)

    వర్గీకరణ సమస్య..

    సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ సమ స్యపై మరోసారి వాదోపవాదాలకు తెరతీ సింది. వర్గీకరణ రాజ్యాంగ బద్దమేనని, రాష్ట్రా లు నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం అడ్డు కాదని కోర్టు మెజారిటీ తీర్పు నిచ్చింది. ఏడుగురి ధర్మాసనంలో ఒక్కరు మాత్రమే ఈ అభిప్రాయంతో విబేధించారు. ఈ సందర్భం లోనే ధర్మాసనంలోని నలుగురు న్యాయవ ుూర్తులు ‘క్రీమీ లేయర్‌’ను కూడా ప్రవేశ పెట్టడం మంచిదని విడివిడి తీర్పుల్లో పేర్కొ న్నారు. ప్రధాన న్యాయ మూర్తి, మరొకరు మాత్రం ఈ విషయంపై మౌనం వహించారు. మొత్తంమీద సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా లేవనెత్తబడిన రాజ్యాంగ పరమైన అభ్యంతరాలపై స్పష్టమైన తీర్పునిచ్చింది. వర్గీకరణ చెయ్యాలా..? వద్దా…? అన్న నిర్ణ యాన్ని రాష్ట్రాలకు వదిలివేసింది. కోర్టుకు వచ్చిన వ్యాజ్యం రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ తీర్పు కేంద్రానికి కూడా వర్తిస్తుంది.-బి.వి.రాఘవులు
    గతంలో కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ సమస్య ముందుకొచ్చినప్పుడు సిపియం వర్గీకరణను సమర్థించింది. ఎస్సీల్లోనే వివిధ ఉపకులాల మధ్య విద్యా,ఉద్యోగాలలో కొట్టొచ్చినట్లు వ్యత్యాసాలు వున్నాయని అధ్యయన కమిటీలు స్పష్టమైన వివరాలు/ డేటాపై ఆధారపడి సమర్పించిన నివేదికల ఆధారంగా నిర్ధారించినప్పుడు సిపియం వర్గీకరణకు సానుకూలత ప్రకటించింది.
    తీర్పు నేపథ్యం-కొన్ని అంశాలు
    పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తమ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎస్సీ తరగతిలో వర్గీకరణ చెయ్యడానికి నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కోర్టు తీర్పుల మూలంగా ఈ నిర్ణయాలు అమలులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వచ్చిన వాజ్యంపై వర్గీకరణ రాజ్యాంగబద్దం కాదని సుప్రీం కోర్టు 2005లో తీర్పునిచ్చింది.ఈ తీర్పును సవాలు చేస్తూ వచ్చిన అనేక పిటిషన్లన్నింటిని కలిపి విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం 2024 ఆగష్టు 1వ తేదీన తన తీర్పును వెలువరించింది. తీర్పులో వివాదాస్పదంగా మారిన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.
    రాజ్యాంగంలో 341 అధికరణం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయడానికి అనుమతించదన్న వాదనను కోర్టు తిరస్కరించింది.ఎస్సీ,ఎస్టీ జాబితాలపై నిర్ణయించే హక్కు పార్లమెంటుదై నందున వర్గీకరణ అంశం కూడా పార్లమెంటు పరిధిలోనిదని,ఇందులో రాష్ట్రాలజోక్యానికి తావు లేదన్న వాదనను తిరస్కరిస్తూ, తమ పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. వర్గీకరణ చేసే హక్కు పార్లమెంటుదా,రాష్ట్రాలదా అనే అంశంకన్నా, అసలు వర్గీకరణ చెయ్యడం అవసరమా లేదా అన్నది ముఖ్యం.ఈ అంశంపై స్పష్టత వస్తే ఎక్కడి నుండి ప్రారంభించడం బాగుంటుందన్న అంశం క్ఱేవలం సాంకేతిక,ఆచరణాత్మక సమస్య అవుతుంది.
    వర్గీకరణ చట్టబద్దమా కాదా అన్న అంశాన్నే కాకుండా సమానత్వం సాధించడం అన్న కోణంలో కూడా వర్గీకరణ సమంజసమేనని కోర్టు అభిప్రాయపడిరది. ఎస్సీ తరగతి అస్పృశ్యత ‘అంటరానితనం’ గురయ్యే కులాల బృందంగా ఏర్పడినందున అది ఒక ‘ఏకఖండ’ (హోమోజీనియస్‌) బృందం,అందువలన దాన్ని విడదీయడం సమంజసం కాదన్న వాదనను కోర్టు తిరస్కరించింది. అస్పృ శ్యతకు ఎస్సీ తరగతిలో ఉన్న ఉపకులాన్ని గురవుతున్నా వాటి మధ్య అన్ని విషయాలలో ఏకరూపత లేదు. సామాజిక,ఆర్థిక,విద్యావిషయాలలో వ్యత్యా సం వుందని, హెటటిరో జీనియస్‌ బృంద మని కోర్టు భావించింది.ఈ వ్యత్యాసాలను అధిగ మించ డానికి వర్గీకరణ సమంజసమేనని కోర్టు చెప్పింది.
    విమర్శలు-ఆక్షేపణలు
    ఈఅంశంపై కోర్టు సరైన సమాచా రం/ డేటా లేకుండానే నిర్ధారణ చేసిందని ఆక్షేపణ లు వచ్చాయి. ఈ విమర్శలో పసలేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నియమించిన అధ్యయన కమిషన్ల రిపోర్టులు అంతర్గతంగా ఎస్సీ ఉప కులాల మధ్య వున్న వ్యత్యాసాలను బహిర్గతం చేశాయి. 2011 జనరల్‌ సెన్సెస్‌లో ఎస్సీ ఉపకులాలపై ఉన్న సమా చారాన్ని పరిశీలించినా వ్యత్యాసాలపై నిర్ద్వం ద్వమైన సమాచారం దొరుకుతుంది. కొంత మంది వ్యత్యాసాలున్నాయని అంగీకరిస్తూనే, ఎస్సీలలో వెనకబడిన ఉపకులాలు, ముందంజలో ఉన్న కులా లతో పోటీ పడగల స్థాయికి రావడానికి అవసర మైన ప్రత్యేక సదుపాయాలను అదనంగా కేంద్రం, రాష్ట్రాలు కల్పిస్తే సరిపోతుందని వర్గీకరణ అవస రం లేదని అంటున్నారు. ఈసూచనలో అభ్యం తరం పెట్టాల్సిందేమీ లేదు కానీ ఇది వర్గీకరణకు ప్రత్యామ్నాయం కాదు. దానికి జత చేయాల్సింది మాత్రమే. వర్గీకరణ అనేది రిజర్వేషన్‌ హక్కులో భాగంగా వుంటుంది. వర్గీకరణ వలన లాభం ఏ కొద్దిపాటిదైనా, తక్షణం అందుబాటులోకి వస్తుంది. సదుపాయాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటాయి.
    ‘వర్గీకరణ’రిజర్వేషన్ల వ్యవస్థను ఉని కిలోకి తెచ్చిన మౌలిక భావనకు భంగం కల్గిస్తుం దని గతం నుండి వస్తున్న విమర్శ.ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా వస్తున్నది.అణచివేత, అస్పృ శ్యత వంటి సామాజిక అంశాలు రిజర్వేషన్ల వ్యవస్థ ఉనికికి ప్రాతిపదిక అని ఇప్పుడు కోర్టు వెనకబాటు తనం, తగ్గిన ప్రాతినిథ్యం వంటి అంశాలను ప్రవేశ పెట్టి రిజర్వేషన్‌కున్న ప్రాతిపదికను బలహీనం చేస్తు న్నదని ఈవిమర్శ సారాంశం.
    ఈవిమర్శకు తగిన ప్రాతిపదిక వుం దని అను కోలేం.ఎస్సీలలో అంతర్గత వ్యత్యాసా లను అధిగ మించేందుకు ముందుకు వచ్చిన అంశాన్ని రిజర్వే షన్ల మౌలిక భావనకు వ్యతిరేకం అని భావించ డానికి ఆస్కారం లేదు. మన దేశం లో రిజర్వేషన్ల చారిత్రక నేపథ్యం, అస్పృశ్యత లేని తరగతులకు కూడా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిం చిన తీరును పరిశీలిస్తే, రిజర్వేషన్లను, ప్రాతినిధ్యా లకు ఏదో ఒక్కఅంశం ప్రాతిపదికగా వున్నది అనుకో వడం సాధ్యంకాదు.సామాజిక అణచి వేత, అస్పృశ్యతలను నేరాలుగా రాజ్యాంగం ప్రకటిం చింది.వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చట్టా లు కూడా తెచ్చాయి. అవి అధ్వాన్నంగా అమలు చేయబడుతు న్నాయనేది వేరే విషయం.అయితే సామాజిక బలహీనత అధిగమించడానికి చట్టాలే సరిపోవని,విద్య,ఆర్థిక,రాజకీయ సాధికారతలను కూడా ఇవ్వడం అవసరమని భావించే,విద్య, ఉపాధి,రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి.
    జనరల్‌ కోటాకు మళ్లింపు-బ్యాక్‌లాగ్‌ విధానం
    వర్గీకరణ మూలంగా నిండని ఖాళీల సంఖ్య పెరు గుతుందని,వాటిని జనరల్‌ కోటాలోకి మళ్ళించడం ద్వారా ఎస్సీలకు అన్యాయం జరుగు తుందని కొందరు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిండని ఖాళీలను జనరల్‌ కోటాలోకి మార్చాలన్న ప్రయత్నం వర్గీకరణ అంశంతో ముడిపెట్టడం సరికాదు. జనరల్‌ కోటాలోకి మార్చాలనే ప్రయ త్నాలు వర్గీకరణ అంశం చర్చకు రాకముందు నుండి జరుగుతున్నాయి.వీటికి వ్యతిరేకంగా జరి గిన ఉద్యమాల మూలంగానే ‘బ్యాక్‌లాగ్‌’ అన్న పద్ధతి ప్రవేశ పెట్టబడిరది.అయినా ఇప్పటికీ ఇటు వంటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. ఈమధ్య యుజిసి రిజర్వుడ్‌ ఖాళీలను జనరల్‌ కోటాలోకి ఎటువంటి పరిస్థితుల్లో మార్చవచ్చో వివరిస్తూ మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదిం చింది.తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హడా వుడిగా ఉపసంహరించుకుంది. ఇటువంటి ప్రయ త్నాలను అడ్డుకోవడం తప్ప ఈఅంశాన్ని వర్గీకర ణతో ముడిపెట్టడం తప్పు. అలాగే వర్గీకరణ అనేది ఎస్సీ తరగతి అంతర్గత అంశం: ఉన్న కోటాలో ఉప విభజన. అందువలన ఒక బృందంగా చూసి నప్పుడు ఎస్సీ తరగతిగా నష్టపోయేది వుండదు. ఒక ఉపతరగతిలో ఖాళీ మిగిలిపోతే ఇంకో తరగ తిలో అర్హులైన వారితో నింపవచ్చు. అన్ని ఉప తరగతుల నుండి కూడా భర్తీ కాకపోతే బ్యాక్‌ లాగ్‌లో పెట్టవచ్చు. ఈ పద్ధతి వలన కోటా ఎస్సీ తరగతి దాటి బయటకు పోవడం వుండదు. రాష్ట్రా లు గానీ కేంద్రంగానీ వర్గీకరణ తీసుకువస్తే ఎస్సీ కోటా బయటకు పోకుండా రాజ్యాంగ, చట్టబ ద్దమైన ఏర్పాటు చేసేట్లుగా చూడాలి.
    అభివృద్ధిలో వ్యత్యాసాలు-పరిష్కార మార్గాలు
    వర్గీకరణకు మరికొన్ని అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. వర్గీకరణ దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని వీటిలో ఒకటి.వాస్తవం ఏమంటే ఎస్సీల్లోని వివిధ ఉపకులాల మధ్య పెరు గుతున్న వ్యత్యాసాలే వర్గీకరణ డిమాండ్‌కు దారితీ శాయి.వ్యత్యాసాలను అధిగమించే చర్యలను సమ ర్థించడమే ఐక్యతకు మార్గం తప్ప,వాటిని వ్యతిరే కించడం కాదు.దీని ద్వారా వ్యత్యాసాల పేరుతో అనైక్యతను సృష్టించేవారి ఆటలు కట్టించడం సులభం. అలాగే బూర్జువా రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనా లకు ఉపయోగించు కొంటున్నాయనేది మరో విమర్శ. ఓట్లకోసం ఒకసామాజిక తరగతిని ఇం కొక సామాజిక తరగతికి వ్యతిరేకంగా రెచ్చ గొట్టడం, సమీకరించడం బూర్జువా పార్టీలు ఒక శాస్త్రంగా మార్చివేశాయనేది నిజం.ఈ కుటిల ప్రక్రియ ప్రయోగంలో బిజెపి అన్నిటికన్నా ముం దున్నది. ఎస్సీల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసా లను గుర్తించి, పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారా మాత్రమే బూర్జువా పార్టీల అనైక్యత సృష్టిం చే ఎత్తుగడలను తిప్పికొట్టగలం.
    వర్గీకరణ సర్వరోగ నివారిణి కాదు
    సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూ లంగా తీర్పిచ్చింది కాబట్టి ఇక ఎస్సీల్లోని వెనకబ డిన ఉపకులాల సమస్యలన్నిటికి పరిష్కారం దొరికి పోయిందని ఎవరైనా భావిస్తే వారికి నిరాశే ఎదుర వుతుంది.అలా చూస్తే రిజర్వేషన్లే సామాజిక అణ చివేతను,దళితుల వెనకబాటు పరిస్థితిని పరిష్కరిం చలేదు.సరళీకరణ విధానాలొచ్చిన తర్వాత (బూర్జు వా పార్టీలన్నీ వీటిని అమలు చేస్తున్నాయి) రిజర్వే షన్లు ఇంకా నామమాత్రం అవుతున్నాయి.ఈ స్థితిలో వర్గీకరణ పెద్ద మార్పు సాధిస్తుందని అను కోరాదు.ఎస్సీలలోని కొన్ని తరగతులలో అసం తృప్తి కారణమవుతున్న ఒక అంశానికి తక్షణ పరి ష్కారం చూపించడం ద్వారా ఐక్యతను పెంపొం దించడం జరిగితే, అదే మనం ఆశించ గల పెద్ద లాభం.అసలైన పరిష్కారం వెనకబాటుకు కారణ మైన మౌలికఅంశాలను పరిష్కరించడంలోఉంది. ఇప్పటికీ దళితులను అట్టడుగు స్థాయికి కట్టిపడ వేస్తున్న భూసంబంధాలను బద్దలుకొట్టాలి.భూ పంపిణీ జరగాలి.నాణ్యమైన విద్య,వైద్యం,ఉద్యో గం,ఆహారం,ఆవాసం హక్కులుగా మారాలి. ప్రయి వేటు రంగంలో రిజర్వేషన్లు రావాలి. వీటిని సాధిం చుకుంటేనే దళితులకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వేషన్ల పరిమితులను దాటి తమ వెనకబాటు తనాన్ని అధిగమించేందుకు సత్తా వస్తుంది.
    క్రీమీ లేయర్‌ అవసరం లేదు
    సుప్రీం కోర్టు తను పరిష్కరించాల్సిన ‘వర్గీకరణ’ వివాదంపై తీర్పు చెబుతూనే ‘క్రీమీ లేయర్‌’పై కూడా వ్యాఖ్యలను చేసింది. నలుగురు న్యాయమూర్తులు ‘క్రీమీ లేయర్‌’ను ఎస్సీ, ఎస్టీలకు కూడా అనువర్తింప చేయాలని అభిప్రాయపడ్డారు. ఇది అమలు చేయాల్సిన తీర్పులో భాగం కాకపో యినా, వివాదాస్పద అంశం. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీ లేయర్‌ వుండకూడదని సిపియం అభి ప్రాయం. చారిత్రకంగా ఎటువంటి ఆస్తిపాస్తులు కల్గివుం డడానికి నోచుకోని ఎస్సీలలో ఇప్పటికీ స్థిరమైన ఆస్తిపాస్తులు కల్గిన స్పష్టమైన ఒక తరగతి ఏర్పడ లేదు.కొద్దిమంది రాజకీయ నాయకులను, ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను, కొద్ది మంది పరిశ్రమల యజమానుల పేర్లను చూపించి క్రీమీ లేయర్‌ను ప్రతిపాదించడం న్యాయం కాదు. ఈ కుటుంబాల చేతిలో తగినంత సంపద పోగుబడిరదని, వారి సామాజిక హోదా పెరిగిందని,అటువంటి కుటుంబాల సంఖ్య తగినంత మోతాదులో వుందని మాట వరసకు అంగీకరించినా వాటి సంపద, సామాజిక హోదా తర్వాతి తరాలకు పాస్‌ఆన్‌ అవుతుందన్న పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఎస్సీ తరగతిలో క్రీమీ లేయర్‌ గురించి ఇప్పుడు చర్చిం చడం అసందర్భం.
    20 ఏండ్లుగా సుప్రీంకోర్టులో నాను తున్న కేసులో తమ అభీష్టం మేరకు తీర్పు రావ డంతో మాదిగల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్ని కల సమయంలో మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీ తో కలిసిపోవడాన్ని విమర్శించిన వారున్నారు. పార్టీ విధానాలపరంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న మాదిగ కులస్థుల వర్గం మంద కృష్ణ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టింది. సొంత భావజాల పరంగా చూస్తే వ్యక్తిగా మంద కృష్ణ కూడా ప్రధాని మోదీ శరణులోకి వెళ్లడం విచిత్రమే. కోర్టులో కేసు కదలడానికి, అనుకూల తీర్పునకు ఇదే అదనుగా భావించిన మంద కృష్ణ ప్రధాని ముందు బహిరం గంగా కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్‌తో లొంగ దీసుకున్నాడు.అది బహిరంగ ఎన్నిక ప్రచార వేదిక కాబట్టి వర్గీకరణపై కమిటీ వేస్తామని మోదీ సభా ముఖంగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి శుభకరంగా ఉండటంతో ఈ వర్గీకరణకు కాలం కలిసివచ్చినట్లయింది.మాల, మాదిగ..రెండు కులాలు దళిత జాతివే అయినా రెండిరటి మధ్య సంస్కృతి, సంప్ర దాయాలపరంగా చాలా భేదాలున్నాయి. ఒకరి పిల్లను ఒకరు చేసుకోరు.ఎవరి అయ్యవార్లు వారి కున్నారు. మాదిగల కన్నా మేము గొప్ప అనే భావన మాలల్లో అన్ని విషయాల్లోనూ కనబడుతుంది. రెండు భిన్న కులాల్లో ఉండే సహజ వ్యత్యాసాలుగా వీటిని చూడవచ్చు.ఇదంతా కాలమాన జీవన విధానంలో భాగమే తప్ప కోరి విభేదిస్తున్నది కాదు. అయితే, సంఖ్యాపరంగా ఎక్కువున్న ఈ రెండు ఎస్సీ కులాల మధ్య రాజ్యాంగ ప్రయోజనాలు కూడా సమతూ కంగా ఉండాలని అందరు కోరు కుంటా రు.నిజా నికి ఈ సమస్యను కోర్టులో,ప్రభుత్వాలో తీర్చ వలసిన అవసరం లేదు.అంబేద్కర్‌ ఆలోచనా సా రాన్ని దళితులంతా ఆచరణలో చూపవలసిన బాధ్య త వారిపై ఉన్న ది.రిజర్వేషన్లు ఎస్సీ,ఎస్టీల ఉమ్మడి ఆస్తి.తండ్రి ఆస్తిని పిల్లలు పంచుకునే న్యాయ పద్ధతి ఇక్కడ అవసరం.ఒకే కడుపులో పుట్టిన బిడ్డలు తాము సమానంగా ఎదగాలని, ఆర్థికంగా బలహీనంగాఉన్న తోబుట్టువులకు ఎక్కు వ పాలు ఇవ్వాలని కోరుకుంటారు.పెద్దలు చెప్పిన పంప కాన్ని ఒప్పుకుంటారు.ఆస్తి విషయంలో పిల్లలు గొడవకు దిగితే పోయేది కుటుంబ పరువేననే స్పృహ అవసరం.దాయాదులుగా కాకుండా అన్నద మ్ముల్లా ఆలోచించాలి.మాల,మాదిగలు సామ రస్యంగా తమ వాటాల నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుపెడితే ఇంత కాలహరణ జరిగేది కాదు. రిజర్వేషన్లు మనవి, దాని లెక్కలు మనమే తేల్చుకుం దామనే ధోరణి ఇప్పటికైనా అవసరమే. (ప్రజాశక్తి సౌజన్యంతో..) వ్యాసకర్త సిపియం పొలిట్‌ బ్యూరో సభ్యులు

    పట్నం..పల్లెలు..కన్నీటిమయం

    వర్షం విలయం సృష్టించింది.మిన్నుమన్నూ ఏకమైనట్టుగా కుంభవృష్టి కురడంతో విజయ వాడలో జనజీవనం అతలాకుత లమైంది. వానలకు వాగులు,వంకలు పొంగిపోర్లి కాలనీల్లోని లోతట్టు ప్రాంతా లను ముంచెత్తాయి. పధానంగా విజయ వాడ నగరపాలక సంస్థలకు భారీ నష్టం వాటిల్లింది.నగర శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి.నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడ మేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి.శివారు ప్రాంతాలవారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5`7అడుగుల మేర వరదనీరు చేరగా,ప్రధాన, అంతర్గత రహదారులపై నాలుగు అడుగల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది.ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక,నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలులేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతు న్నారు. వరదనీరు పెరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి.ఎత్తయిన భవనాల్లో చిక్కుకు పోయినవారు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రతిక్షణం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు.సహాయక చర్యలు ఆశాజనకంగా లేక ఆందోళన చెందుతున్నారు.చాలామంది ఇళ్లలోనే ఉండ పోియి అవస్థలు పడుతున్నారు.
    భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తం అయ్యింది. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.గత 30ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో రికార్డ్‌ వర్షపాతం నమో దైంది.బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి.నగరంలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదైంది.ఒక్క రోజే 29సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలి పింది.భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాలనీలు,ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది.బాధితులు సాయం కోసం ఎదురుచూ స్తున్నారు.విజయవాడను వరదనీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతోంది.దీంతో బడమేరు 11 గేట్లు ఎత్తివేశారు.కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరదనీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది.
    రికార్డు స్థాయిలో వర్షాలు
    విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30ఏళ్ల రికార్డు బద్దలైంది. చరి త్రలో ఎన్నడూ లేనంతగా..ఒకేరోజు (ఆగస్టు 31 శనివారం) 29సెంటి మీటర్ల వర్షపాతం నమో దైంది.అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.ఆటోనగర్‌ నుంచి బెంజి సర్కిల్‌ వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. సెప్టెంబర్‌ 1న కూడా బెజవాడలో భారీవర్షాలు కురువడంతో బెజవాడ గజగజ వణికిపోతోంది.
    ముంపులో కాలనీలు :విజయవాడ,గుంటూరు నగరాల్లో అనేక కాలనీలువరద నీటిలో నాను తున్నాయి.అపార్ట్‌మెంట్లసెల్లార్లలోకి వర్షపు నీరు చేరి,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెల కొంది.నగర శివార్లలోని కండ్రిగ వద్ద రహ దారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది నివాసాలు నీటము నిగాయి.రైల్వేట్రాక్‌ అండ ర్‌పాస్‌ వద్ద 4బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు… బస్సులను బయటకు తీశారు.మైలవరంలో వెలగలేరు గేట్లుఎత్తి వేశారు.దీంతో చుట్టుపక్కల కాలనీ ల్లోకి వరద నీరు చేరింది.రాజరాజేశ్వరి పేట వరద నీటిలో చిక్కుకుంది.
    బుడమేరు ఉగ్రరూపం
    సరిగ్గా20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది.వాగులు,వంకలు ఆక్రమ ణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది.20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్‌ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు.20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగం గా విస్తరించడం,బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోదశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజ వాడ పుట్టిముంచింది.2005సెప్టెంబర్‌లో వచ్చి న భారీ వర్షాలతో నగరం అతలాకు తలమైంది. విజయవాడ మూడొంతులు ముంపు నకు గురైంది. వరదల కారణంగా విజయవాడ లో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపం తో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్త డంతో అదంతా విజయవాడను ముం చెత్తింది. తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్‌, చిట్టీనగర్‌,ఇతర కాలనీలు జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
    ప్రకాశం బ్యారేజీ
    కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ ఫ్లో ,ఔట్‌ ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని,ప్రజలు అప్రమ త్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
    రాజధాని ప్రాంతం
    అమరావతి ప్రాంతంలో వరద నీరు చేసింది. చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరకట్ట సమీపంలోకి వరదనీరు చేరుతోంది. హైకోర్టుమార్గంలో వరదనీరు చేరింది.విజయ వాడలో గత రెండు రోజులుగా కురిసిన కుండ పోత వర్షాలకు రోడ్లు చెరువులను తలపి స్తున్నా యి. మురుగు నీరురోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు,ద్విచక్రవాహనాలుకొట్టుకు పోయా యి. 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయ వాడ విలవిల్లాడిరది.పాతబస్తీ,బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు,జాతీయ రహదారి,ఆటో నగర్‌ లో భారీ వరద పోటెత్తింది.విజయవాడ సమీ పంలోని జాతీయరహదారుల నీటిలో చిక్కు కుపోయాయి.
    మొగల్రాజపురం ప్రమాదం
    విజయవాడలోని మొగల్రాజపురం వద్ద ఆగస్టు 31న కొండచరియల విరిగిపడ్డాయి. ఈ ఘట నలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.పడిపోయిన కొండ రాళ్లను డ్రిల్లింగ్‌ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొల గింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మొగల్రాజపురం మృ తుల కుటుంబాలకు ప్రభుత్వంరూ.5లక్షల పరిహారం ప్రకటించింది.
    ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
    విజయవాడలో భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొటోకాల్‌ ఆఫీస్‌,డోనర్‌ సెల్‌ ధ్వం సం అయ్యాయి.ఈప్రదేశంలో భక్తులు లేకపో వడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఘాట్‌ రోడ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్‌రోడ్‌ను మూసివేశారు.
    రాయనపాడు ఘటన
    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభా వంతో ఏపీలోభారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడ లోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్‌ పరిధిలో ఉన్నరాయనపాడు రైల్వేస్టేషన్‌లోకి భారీ గా వరదనీరువచ్చిచేరింది రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు.ఆరో బెటాలియన్‌ ఎస్డీఆర్‌ఎఫ్‌ రెస్కూ టీమ్‌ రంగంలోకి దిగిసహాయక చర్యలను చేప ట్టింది.రాయనపాడులో నిలిచి పోయిన తమిళ నాడు ఎక్స్‌ ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించి, విజయవాడస్టేషన్‌కు తరలించారు. ప్రయాణికు లను ప్రత్యేక రైలులో తమిళనాడుకు తరలి స్తున్నారు.
    వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎంపర్యటన
    విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంద రికీ సాయం అందు తుందని చంద్రబాబు వివ రించారు.సీఎం మాట్లాడారు.ఈ క్రమం లోనే వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్‌ చేరుకున్నాయి.వీటి ద్వారా సింగ్‌నగర్‌ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరో వైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.మరోవైపు ప్రైవేట్‌ హోటల్స్‌,దుర్గగుడి,అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్య వేక్షణతో అధికారులుఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు.ఎవ్వరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని,అందరికీ సాయం అందు తుందని పేర్కొన్నారు.మూడు పూటలా బాధితు లకు ఆహారం అందించాలని చెప్పారు.చిన్నా రులు,గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.ఒకేప్రాంతంలో కా కుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లా లన్నారు. -గునపర్తి సైమన్‌

    మరో వయనాడ్‌ ఎలా ఆపాలి..?

    వయనాడ్‌ ఒక ప్రదేశం మాత్రమే కాదు. పర్యావరణ దుర్ఘటనలకు అదొక ప్రతీక. అటువంటి విపత్తులు మరెన్నో సంభవిం చేందుకు ఆస్కారమున్న పరిస్థితులకూ వయనాడ్‌ ఒక తాజా ప్రతీక.సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్‌లో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడిన దుస్సంఘటనకు బాధ్యులు ఎవరు? ఎవరి అలక్ష్యం ఆ ఉపద్ర వానికి దారితీసింది? ప్రాణనష్టం, ఆస్తినష్టం హృదయ విదారకంగా వాటిల్లేందుకు కారణ మైన ప్రమాదం అనివార్యమైనది కాదు.నేను నా గత కాలమ్‌లో ఈ అంశాలను చర్చించాను (ఆగస్టు15,‘వయనాడ్‌ విపత్తుకు కారకులు ఎవరు?’).
    మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు. ఆ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజ లను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. విషాదసీమ వయనాడ్‌ ఘోషిస్తున్న సత్యమది. వయనాడ్‌ విలయం వాటిల్లి నాలుగు వారాలు గడిచిపోయాయి.మనదృష్టి వేరే ప్రదేశాలలో వాటిల్లిన ప్రాకృతిక విధ్వంసాల పైకి మళ్లింది. అక్కడా ఇక్కడా, ఈ ధరిత్రిపై మరెక్కడైనా కొట్టివేయలేని ఒక సుస్థిర సత్యంగా ఉన్న వాతావరణ మార్పు, వయనాడ్‌ వినాశనంలో నిర్వహించిన పాత్రనూ నా గత కాలమ్‌లో వివరించాను. పశ్చిమ కనుమలలోని వయనాడ్‌ ప్రాంతం ఇప్పటికే దుర్బల పర్యావరణ సీమగా మారిపోయింది. విచక్షణారహిత మానవ కార్యకలాపాల మూలంగా వాతావరణ వైపరీత్యం పెచ్చరిల్లడంతో వయనాడ్‌ ఒక విషాద సీమగా పరిణమించింది. అందుకే పర్యావరణ విపత్తులు సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకు వయనాడ్‌ ఒక ప్రతీక అన్నాను. మరి మరో ‘వయనాడ్‌’ సంభవించకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?
    తొలుత వయనాడ్‌లో అభివృద్ధి కార్యకలాపాలు అమలవుతున్న తీరుతెన్నులను అవగతం చేసుకుందాం.నా సహచరులు రోహిణి కృష్ణమూర్తి, పులాహ రాయ్‌ ఆ‘అభివృద్ధి’ని నిశితంగా పరిశీలించారు.జూలై 29 అర్ధరాత్రి వయనాడ్‌ జిల్లాలో సంభవించిన దుర్ఘటన నివారింప సాధ్యం కానిదని వారి దర్యాప్తులో వెల్లడయింది.భీతి గొల్పుతున్న వాస్తవమది. మరింతగా వివరిస్తాను. వెల్లెరిమల గ్రామ పరిధిలో కొండచరియలు విరిగిపడ్డాయి.సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా కె.కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక (2013)పేర్కొన్న గ్రామాలలో వెల్లెరిమల కూడా ఒకటి. ‘పశ్చిమ కనుమల సమగ్ర సుస్థిరాభివృద్ధికి అనుసరించవలసిన పద్ధతులను’ సిఫారసు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆ కమిటీలో నేనూ ఉన్నాను. గ్రామ వైశాల్యంలో ఇరవై శాతానికి పైగా సున్నిత పర్యావరణ ప్రదేశాలు ఉన్న గ్రామాలు అన్నిటిలోనూ ప్రకృతి వనరులను మరింతగా ధ్వంసం చేసే అభివృద్ధి కార్యక లాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.ముఖ్యంగా మైనింగ్‌,క్వారీయింగ్‌ లాంటి విధ్వంస కార్యక లాపాలను అసలు అనుమతించవద్దని కూడా కస్తూరి రంగన్‌ కమిటీ స్పష్టంగా సూచించింది. నవంబర్‌ 2013లో కస్తూరి రంగన్‌ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఐదవ సెక్షన్‌ కింద వయనాడ్‌ జిల్లాలో 60,000చదరపు కిలో మీటర్ల సువిశాల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదని ప్రకటించింది. మైనింగ్‌,క్వారీయింగ్‌తో సహా ఆప్రాంతంలో నిర్దిష్ట అభివృద్ధి కార్యలాపాలు జరగకూడదని ఆంక్షలు విధించింది.అయితే కేరళ ప్రభుత్వం ఆ సిఫారసులకు ఒక సవరణను కోరింది సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా పేర్కొన్న గ్రామాలలో నిలిపివేయడానికి వీలులేని ఇతర అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతున్నందున అటువంటి గ్రామాలను పూర్తిగా సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రత్యేకించకూడదని తమ సొంత కమిటీ ఒకటి నిర్ధారించిందని, కనుక ఆ గ్రామాలను మాత్రమే పాక్షికంగా సున్నిత పర్యావరణ గ్రామాలుగా ప్రకటిం చాలని కేరళ ప్రభుత్వం అభ్యర్థించింది. కస్తూరి రంగన్‌ కమిటీ సున్నిత పర్యావరణ ప్రాంతా లుగా పేర్కొన్న 13గ్రామాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పులహరాయ్‌ పరిశీలిం చారు.ఆ13గ్రామాలలోను15క్వారీయింగ్‌ ప్రదేశాలు ఉన్నట్లు వెల్లడయింది. ఒక్క నూల్‌ పూరa్హ గ్రామంలోనే 6 క్వారీయింగ్‌ ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంగా ప్రత్యేకించిన భూములలోనే అవన్నీ ఉన్నాయి. ఈ నియ మోల్లంఘన కథ ఇంకా ఉంది. 2017లో మైనింగ్‌ నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించిందని రోహిణి పరిశోధనలో వెల్లడయింది. ఒక నివాస గృహానికి 50 మీటర్ల ఆవల అటవీ భూములు, కొండ వాలు ప్రాంతాల్లోగానీ ఎక్కడైనా సరే పేలుడు సామగ్రిని ఉపయోగించేందుకు ఆ సవరణలు అనుమతిచ్చాయి.అంటే మీ ఇంటి వెనుక ఉన్న కొండలను అస్థిరపరిచే పరిస్థితులను సృష్టించడం చట్టబద్ధమే అవుతుంద!. ఈపరిస్థితులను నివారించేందుకు మనమేమి చేయాలి అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. పశ్చిమ కనుమల పర్యావరణ రక్షణకు తొలుత మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ సిఫారసులను,ఆ తరువాత కస్తూరి రంగన్‌ కమిటీ సూచనల అమలును సున్నిత పర్యావరణ ప్రాంతాల ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాంతాలలో పర్యటించి నప్పుడు పర్యావరణ పరిరక్షణ చర్యల పట్ల ప్రజల విముఖతను నేను స్వయంగా గమనిం చాను. పరిరక్షణ పద్ధతులు, చర్యలను ప్రజలు వీథులలోకి వచ్చి నిరసిస్తున్నారు. వారు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారా? వాస్తవమేమిటంటే సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా తమ తోటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, తాము అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులపై ఆంక్షలు విధించవచ్చని వారు భయపడు తున్నారు. వారి భయాందోళనలకు కారణమేమిటి? పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం, అదీ హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తుండడమే సుమా! పర్యావరణ పరిరక్షణ విధానాల రూపకల్పనలో మనం ఈ వాస్తవాలను తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ వ్యవస్థల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను మనం శీఘ్రగతిన మార్చుకోవల్సివుంది. వాతావరణ మార్పు పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది తప్పనిసరి. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటు న్నందున ప్రకృతి వనరులకు హాని కలిగిస్తున్న సదరు కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలనే భావన ప్రాతిదికన పర్యావరణ పరిరక్షణ విధానాలను రూపొందిస్తున్నారు. ఇది సరైన విషయమే కావచ్చు గానీ మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు.. ఇది వాస్తవం. ఆప్రాం తాలు జనవాసాలు మాత్రమే కాదు, వ్యవసాయ భూములకు నెలవులు కూడా. మరి అటువంటి సున్నిత పర్యావరణ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజలను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. ఇందుకు ఆ ప్రాంతాలలోని సామాజిక సముదాయాలకు ప్రయోజనకరమైన ప్రోత్సాహకాలు సమకూర్చాలి.
    కాఫీ,తేయాకు తోటల పెంపకం, పర్యావరణ-పర్యాటకం మొదలైన హరిత జీవనాధారాల ప్రాతిపదికన అభివృద్ధి పథకాలు రూపొందించు కోవడం చాలా చాలా ముఖ్యం. ప్రజల భూములను వారి భాగస్వామ్యంతో సంరక్షిం చడాన్ని మనం నేర్చుకోవాలి. వయనాడ్‌ విపత్తు చెప్పుతున్న సత్యమది. వాతావరణ మార్పు చిక్కులు జటిలమవుతోన్న ఈకాలంలో విషాదసీమ వయనాడ్‌ పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. మనం వాటిని నేర్చుకోవాలి. నేర్చుకోవడమంటే పర్యావరణకు అనుసరించే పద్ధతులను మార్చుకోవడమే. పర్యావరణ పరిరక్షణలో గుణప్రదమైన మార్పును సత్వరమే సాధించలేనిపక్షంలో మన మనుగడ శాశ్వతంగా అపాయంలో పడుతుంది.
    అదుపులేని వినియోగమే అసలు సమస్య
    భారత్‌కు, వచ్చే నెల ప్రత్యేకమైనది. అవును, జూలైలో, జనాభా విషయంలో మనం చైనాను అధిగమించబోతున్నాం.ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ప్రస్తుతం చైనా జనాభా 145కోట్లుగా ఉన్నది.భారత్‌ జనాభా త్వరలోనే ఆ స్థాయికి చేరుకుని, అధిగ మించనున్నది.మరి కొద్ది రోజులలో ఈ మహా మార్పు సంభవించనున్నది. సరే, ప్రపంచ అగ్రగామి కానున్న జన భారతం పర్యావ రణంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనున్నది? నేను పదే పదే అడిగే ఈ ప్రశ్నను ఇప్పుడు ప్రత్యేకించి మరీ అడుగుతున్నాను. పెరుగుతున్న జనాభా మనుగడకు మరిన్ని వనరులు అవసరం. జనాభా పెరుగుదల పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని భావించనవసరం లేదు. ఎందుకంటే ఇంచు మించు 37కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికా, రెండున్నర కోట్ల జనాభా మాత్రమే ఉన్న ఆస్ట్రేలియా భారత్‌ కంటే పర్యావరణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆయా దేశాలు ఉపయోగించుకుంటున్న జీవ వన రులను గణించిన ‘ఎర్త్‌ ఓవర్‌ షూట్‌ డే’ అనే బృందం ఒకటి ఇలా అంచనా వేసింది: ఈ ధరిత్రిపై ఉన్న ప్రతి ఒక్కరూ అమెరికన్‌లా జీవించాలంటే ఐదు భూగోళాలు అవసరమవు తాయి. ఒక ఆస్ట్రేలియన్‌లా జీవించాలంటే 4.5 భూగోళాలు అవసరమవుతాయిబీ ఒక భారతీయుడులా జీవించాలంటే మన భూగోళం లో 0.8శాతం భాగం సరిపోతుంది! తక్కువ జనాభా ఉన్న దేశాలే వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఉద్గారిస్తూ మానవాళి మనుగడకు ముప్పును ముమ్మరం చేస్తున్నాయి. చెప్పవచ్చిందేమిటంటే పర్యావరణ సమస్యలకు జనాభా పెరుగుదల నేరుగా కారణం కాదు. దేశ ప్రజల వినియోగ రీతులే పర్యావరణ శిథిలత్వానికి దారి తీస్తున్నాయి. సంపన్న దేశాల వినియోగంతో పర్యావరణానికి జరుగుతున్న హాని తీవ్రంగా,విస్తృతంగా ఉం టోంది.భూమి,నీరు,అడవులు మొదలైన సహజ వనరులను అవి అపరిమితంగా ఉపయోగించు కుంటున్నాయి. శిలాజ ఇంధనాలను ధనిక దేశాలు వాడుకొంటున్న తీరు తెన్నుల వల్లే భూ తాపం పెరిగిపోతోంది. మరి సంపన్న దేశా లలో గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు కనిపించ డానికి కారణమేమిటి?వాయు కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోగల అధునాతన సాంకేతి కతలను అభివృద్ధి పరచుకోవడమే. అలాగే సంపన్న దేశాలలో ఆవాసమూ, వ్యవసాయమూ లేని ప్రదేశాలు చాలా విస్తృతంగా ఉండడం వల్లే వారి నివాస ప్రాంతాలు భద్రంగా ఉన్నాయనే వాదన ఒకటి ఉన్నది. ఇది నిజం కాదు. తమ తమ నివాస ప్రాంతాలలోని సహజ వనరులను అవి అపరి మితంగా వాడుకుంటున్నాయి. ఫలితంగా అడవులు తరిగిపోతున్నాయిబీ భూసారం క్షీణించిపోతోందిబీ జల వనరులు కలుషితమ వుతున్నాయి. పేద దేశాలూ తమ స్థానిక వనరులను విచక్షణా రహితంగా వినియోగిం చుకుంటున్నాయి. ఇప్పటికే నరికివేసిన అడవులు, బీడువారిన భూములను, కాలుష్య జలరాశులపై పేద దేశాల గ్రామీణ ప్రాంతాల వారు ఆధారపడుతున్నారు. పర్యా వరణ విధ్వంసం ఇంత స్పష్టంగా కనిపిస్తు న్నప్పటికీ పర్యావరణంపై ఆ దేశాల సంయుక్త ప్రభావం సంపన్న సమాజాలు నెరపుతున్న దానికంటే తక్కువే. పర్యావరణంపై భారత జనాభా ప్రభావం వాస్తవానికి తక్కువే. కారణమేమిటి? భారత ప్రజలు పేదవారు కావడమే. పేదరికం వల్లే వారు పొదుపుగా జీవించడం నేర్చుకున్నారు. అయితే మనం సంపన్నులం అవుతున్న కొద్దీ ప్రపంచ మధ్య తరగతి ప్రజల జీవన శైలిని అలవరచు కోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదని చెప్పక తప్పదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్‌ జీవన శైలికి మనం వెంపర్లాడు తున్నాం.సంపద్వంత జీవితానికి, ఆధునికతకు ఆ జీవన శైలినే ఒక ప్రమాణంగా భావిస్తున్నాం కదా. సంపన్న దేశాల మధ్యతరగతి ప్రజల వలే మనమూ అనారోగ్యకరమైన వినియోగ రీతులను అలవరచుకోకపోయినా, మన జనాభా అధికం గనుక పర్యావరణంపై మనం నెరపే ప్రభావం తక్కువగా ఉండబోదు. ఆదా యాలు పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరిగిపోతోంది. మన వీథులు చెత్తా చెదారంతో నిండిపోతుండడమే ఇందుకొక తార్కాణం..అలాగే వాయు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. పెరుగుతున్న ఆదాయాలతో అత్యధికులు పూర్తిగా సొంత వాహనాలను సమకూర్చుకుంటున్నారు.ఆవాహనాలను మెరుగైన సాంకేతికతలతో రోజూ కాలుష్య కారకం కానివిగా చేసినప్పటికీ వాటి సంఖ్యా ధిక్యత కాలుష్యం పెరుగుదలకు విశేషంగా దోహదం చేస్తోంది. కనుక, మనం మూడు అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలి. అవి: జనాభా పెరుగుదలను అదుపులో ఉంచడమె లా?ఈ జనాభా లబ్ధి (ఒక దేశంలో పని చేసే వయసు ఉన్న జనాభా పెరగడం వల్ల సమ కూరే ఆర్థిక వృద్ధి)ని ఎలా ఉపయోగించు కోవాలి? (ప్రతీ మానవుడూ ఒకఅద్భుత జీవి, ఒక విలువైన ఆస్తి అనడంలో సందేహం లేదు)బీ మన జనాభా పెరుగుతున్న కొద్దీ, మిగతా ప్రపంచం వలే స్వయం వినాశక రీతిలోకి పోకుండా ఉండేందుకు మనమేమి చేయాలి? మొదటి ప్రశ్నకు సమాధానం సాపేక్షంగా స్పష్టమే: భారత్‌ ఇప్పటికే తన ‘జీవితకాల సంతాన సాఫల్య రేటు’ (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌)లో తగ్గుదలను చూస్తోంది. బిహార్‌, జార?ండ్‌, మణిపూర్‌, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌లు మాత్రమే ఇందుకు మినహా యింపు. జననాల రేటు విషయంలో దేశసగటు కంటే అధిక సంతానోత్పత్తి రేటును ఈ రాష్ట్రా లు కలిగివున్నాయని ఇటీవలి ‘జాతీయ కుటుం బ ఆరోగ్య సర్వే’ వెల్లడిరచింది.ఈ రేటు ‘రీప్లేస్‌మెంట్‌ లెవల్‌ కంటే తక్కువకు పడిపోయింది (జనాభా సంఖ్య స్థిరంగా కొనసాగడానికి సరిపడా ఉండే కొత్త జననాల స్థాయిని ‘రీప్లేస్‌మెంట్‌ లెవల్‌’గా పిలుస్తారు). ప్రస్తావిత రాష్ట్రాలలో ప్రతీ మహిళ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం ఇప్పటికీ పరిపాటిగా ఉన్నది! బాలికలు విద్యావంతులు అయినప్పుడు, మహిళలకు ఆర్థిక సాధికారిత,ఆరోగ్య,ఆర్థిక భద్రత ఉన్న ప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. పిల్లలను కనాలా, వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకునే అధికారం మహిళలకు మాత్రమే ఉండాలి. అది మహిళల పురోగతిని సూచిస్తుంది. సరే, జనాభా లబ్ధి విషయానికి వద్దాం. విద్యతో ముడివడివున్న అంశమిది. విద్యాహక్కు మరింత మందికి సమకూరేలా మనం చూడవలసిన అవసరమున్నది. ఇక చివరగా పర్యావరణ భద్రత చాలా ముఖ్యం. అయితే ఇది చాలా కష్టతరమైన విషయం. ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు వినియోగదారీ మనస్తత్వంతో వినూత్నంగా ఉంటున్నాయి.ఈ వాస్తవాన్ని విస్మరించలేము. మార్కెట్‌ శక్తులు ప్రపంచవ్యాప్తంగా వినియో గదారుల జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయి. సుఖసంతోషాలతో కూడిన నివాసయోగ్యమైన ధరిత్రిని మనం కోరుకుంటున్నాం. ఈ విషయ మై మనం తక్షణమే, సమగ్రంగా చర్చించాల్సిన సమయమాసన్నమయింది.
    (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)వ్యాసకర్త :(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు) – సునీతా నారాయణ్‌

    పంచాయితీలకు పునరుజ్జీవం

    పంచాయితీలకు పునరుజ్జీవం కల్పించేం దుకు ఓ ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ్పభుత్వం ముందడుగు వేసింది ఆగస్టు 23న ప్రపధమంగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భాగం గా రూ.4,500 కోట్లతో 87రకాల పనులను గ్రామాల్లో చేయించ డానికి ఉపక్రమించారు. పంచా యితీరాజ్‌ సంస్కరణల్లో భాగంగా పంచాయి తీలకు ఇచ్చే సొమ్ము ను రూ.10వేలకు,మేజర్‌ పంచాయితీలకు ఇచ్చే సొమ్మును రూ.25వేలకు పెంచినట్లు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ,గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ఆగస్తు23 నుంచి ప్రత్యేక కార్య కమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ‘గ్రామ సభలు’ ప్రారంభించారు. మైసూరువారిపల్లెలో నిర్వ హించిన గ్రామ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థా యి గ్రామ సభ నిర్వహించారు.
    గ్రామాలు పచ్చగా ఉంటేనే: అన్నం పెట్టే రైతు బాగుంటే…అన్నీ బాగుంటాయి..గ్రామాలు పచ్చగా…ఉంటే మన మంతా హాయిగా..ఉంటామని పవన్‌కల్యాణ్‌ అన్నా రు.పార్టీకోసం పనిచేసేందుకు ముందు కొచ్చే వారి ని తాను వదలుకోనని, మనుషులను కలుపు కొనే వ్యక్తినని,విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు. గ్రామా భివృద్ధికి ఏంచేయాలన్నఅంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభు త్వం పంచా యతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్‌వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్య లుచేపడుతున్నామన్నపవన్‌,13వేల 326 పంచా యతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్‌: గత ప్రభు త్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్‌ మండిపడ్డారు.భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మైసూరు వారిపల్లె సర్పంచ్‌గా సంయుక్త నిలబడి గెలిచారని ప్రశంసించారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగిందన్న పవన్‌, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు.ఉన్న నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామా లకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ అబి óవృద్ధి,స్వర్ణగ్రామాలు చేసుకోవాలనేదే తమ లక్ష్య మన్న పవన్‌,ఒకరి అనుభవం,ఇంకొకరి సంక ల్పం,మరొకరి విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో కళాశాలలు,క్రీడా మైదా నాలు కూడా లేని పరిస్థితి ఉందని, ప్రభుత్వ భూములుంటే నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వపరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే అవుతుందని,దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పా టు చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి వలసలు నివారించి, ఉపాధి అవకాశాలు పెంచు తామన్నారు.వలసలు ఆగడానికి స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ వర్సిటీ తీసుకొస్తామన్న పవన్‌, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరం నాయకులు తయారుకా వడానికి పంచాయతీలే పట్టుగొమ్మలని, పంచాయ తీల నుంచి కొత్త నాయకులు రావాలని పిలుపు నిచ్చారు. యువత, మహిళలు కల్పించుకుంటే తప్ప గ్రామపంచాయతీలు మారవన్నారు.
    లక్ష్యం ఇదీ..
    ఎన్నికలప్రచార సమయంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకివస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం.దాని ప్రకారమే పంచాయతీలు సుసం పన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామ’ని ఉప ముఖ్య మంత్రివర్యులుకొణిదల పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామపంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి,గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయ నున్నారని తెలియజేశారు.మహాత్మా గాంధీ జాతీ య ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ. 4,500కోట్లనిధులతో,87రకాల పనులను గ్రామా ల్లో చేయనున్నామన్నారు.దీనిద్వారా మొత్తం 9కోట్ల పనిదినాలు,54లక్షలకుటుంబాలకు ఉపాధి కల్పిం చే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొ న్నారు. దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల సంయుక్త ఆధ్వర్యం లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చి చేందుకు మొత్తం 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ఆగస్టు 23న ప్రారంభించారు.‘‘దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలు పెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌.73వరాజ్యాంగ సవరణ ద్వారా పంచాయ తీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశా బ్దాలు దాటింది.రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశల విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలు పెడుతున్నాం. గత మూడు దశాబ్దాలుగా పంచాయతీ లకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్‌ పంచాయతీలకు రూ.100, మేజర్‌ పంచాయతీలకు రూ.250ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్క రణల్లో భాగంగా మైనర్‌ పంచాయతీలకు రూ.10వేలు,మేజర్‌ పంచా యతీలకు రూ.25వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉం టామని భరోసాను ఇచ్చాం.
    మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందాం
    పంచాయతీ సంస్కరణలు కొన సాగిం పులో భాగంగా గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణ యాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామా లను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది.భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుం దని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పంతో,ముఖ్యమంత్రి చ్రంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రపంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకు నేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పంచాయ తీలకు ఉండే అధికారాలను గ్రామాలఅభివృద్ధికి ఉప యేపడేలా చేసి…పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
    గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం
    జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కంలో భాగంగా గత ప్రభుత్వంలో 2019-2023 సంవత్సరం వరకు రూ.40,579కోట్లు నిధులు వచ్చాయి.ఈ పనుల పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. గ్రామీ ణాభివృద్ది కోసం ఈనిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి.కానీ గత ప్రభు త్వంలో ఈ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈనిధులను ఇష్టానికి వాడు కున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో పంచా యతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపో యింది.2014-19వరకు రాష్ట్రవ్యాప్తంగా పంచా యతీల ఆదాయం రూ.240కోట్లు ఉంటే,2019 `23 సంవత్సరాల్లో ఆ ఆదాయం గణనీయంగా తగ్గి కేవలం రూ.170కోట్లే వచ్చింది.క్షేత్రస్థా యిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభు త్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచా యతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంక ల్పంతో పని చేస్తోంది. పంచాయతీలు వాటి కాళ్ల మీద అవే నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నాం. పంచా యతీలకు సంబంధించిన విద్యుత్తును అవే ఉత్పత్తి చేసుకునేలా,వాటి ఆదాయం అవే సంపాదించు కునేలా తయారు చేస్తాం.రాష్ట్రాభివృద్ధిలోనే కాకుం డా దేశాభివృద్ధిలోనూరాష్ట్ర పంచాయతీలు కీలకం గా వ్యవహరించేలా తయారు చేస్తాం.
    పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి ఆదాయం సృష్టిస్తాం.
    రాష్ట్రంలోని గొప్పదనం ఏమిటంటే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కళలు, ఆహార పదార్ధాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి వాటికి మన గ్రామాలు ప్రత్యేకం. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణాజిల్లా లో చిలకలపూడి, కొండపల్లి హస్త కళలకి ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకత లను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగు మతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషి స్తాం. గ్రామసభలకు యువత, మహిళలు విరివిగా పాల్గొవాలి. పంచాయతీల్లో మహిళలు ఎక్కువగా పాల్గొవాలని కోరుకుంటున్నాను.
    పంచాయతీల ఆదాయం పెంచేలా సామాజిక అడ వుల పెంపకం
    పంచాయతీల్లో చాలా భూమి నిరు పయోగంగా ఉంటోంది.దాన్ని క్రమపద్ధతిలో విని యోగించుకోవాలి.స్వచ్ఛభారత్‌ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓప్రణాళిక ప్రకా రం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్‌,గ్రీన్‌ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టిపెడుతున్నాం.డెన్మార్క్‌ అనే చిన్నదేశం నుంచి కలపను మన దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది.రూ.6వేల కోట్ల విలువైన కలపను ఏటా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేవలం కలప కోసం ఇంత వెచ్చిస్తున్నాం.గ్రామ పంచాయతీలకు సం బంధించి వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవి విభాగంలో కలపను పెంచాలని భావిస్తు న్నాం. దీని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయం గా పెరుగుతుంది. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంది. మూగ జీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయోగిస్తాం.గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రొత్సహిస్తాం.
    గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ బలహీనం చేశారు
    గత ప్రభుత్వంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు,ఉపాధి పనుల్లోచాలా అవకతవకలు జరిగా యి.జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనులకు పైపు లైన్లు వేసి వదిలేశారు. వాటికి కనెక్షన్‌ ఇవ్వలేదు. మరోపక్క పైపులైన్ల కోసంతవ్విన పనులు ఉపాధి హామీ పథకంలో చేశారు. అసలు ఏ పనులు దేనికి చేశారో గ్రామ సర్పంచులకు తెలియదు. మస్తర్‌ బుక్‌లో సంతకాలు పెట్టించుకోవడం తప్పితే, సర్పంచులకు ఏపనులు ఎక్కడ చేశారన్న వివరాలు చెప్పలేదు.దీనిలో బోలెడు అవకతవకలు జరిగా యి.నిధుల దుర్వినియోగం దారుణంగా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షిం చాల్సిన,నిధుల దుర్వినియోగం అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయ లేదు. సామాజిక తనిఖీ విభాగానికి కూడా పోలీస్‌ అధికారిని హెడ్‌గా పెట్టాలని ఆలోచిస్తున్నాం. దీనిపై అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకుం టాం. గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ విభాగం బాధ్యుడిని తప్పించాము. రకరకాల అభియోగాలు వచ్చిన అధికారులను పక్కన పెట్టాం. నిఘా విభాగంపై నిఘా పెట్టాల్సి వచ్చింది. పంచాయతీ ల్లో సిటిజన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు ఉండాలి. దాన్ని ప్రతి పంచాయతీల్లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వంలో పెండిరగ్‌ లో ఉండిపోయిన రూ.2 వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వంలో విడుదల చేశాం. మెటీరియల్‌ కంపో నెంట్‌ గ్రాంట్‌ ను త్వరలోనే ఇస్తాం.
    నీటి పునర్వినియోగంపై దృష్టి
    నీటి కోసం గ్రామాల్లో బోర్లు హద్దులు దాటి వేస్తున్నారు.దీనివల్ల ఫ్లోరైడ్‌ ఎక్కువగా పడు తోంది. భూమి పొరలను దాటి నీటి కోసం లోతు లకు వెళ్తున్న కొద్దీ ఫ్లోరైడ్‌ వస్తోంది. నీటిని పునర్వి నియోగంపై దృష్టి సారించాలి. అప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. తక్కువ దూరంలోనే నీళ్లులభిస్తాయి.ప్రస్తుతం గ్రామాల్లో పల్స్‌ సర్వే చేస్తు న్నాం.పంచాయతీల్లో నీటి పరిస్థితిపై 16 అంశా లతో సర్వే నిర్వహిస్తున్నాం.22 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇది రాష్ట్రం మొత్తం మీద పూర్త యితే అన్ని పంచాయతీల్లో ఉన్న వాటర్‌ సోర్సు మీద ఓస్పష్టత వస్తుంది.అప్పుడు ఓప్రణాళిక ప్రకా రం నీటి సమస్యను తీర్చేందుకు ముందుకు వెళ్తాం.
    విశాఖలో పరిశ్రమల కాలుష్యం మీద నిఘా పెడతాం
    అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్ర మల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగి స్తున్నాయి.ఎసెన్షియా ఫాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆపరిశ్రమలకు చెందిన ఇద్దరు యజ మానుల మధ్యఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్‌ చేయడం మీద దృష్టి పెడతాం.సేఫ్టీ ఆడిట్‌ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతాను. ఇప్పటికే హిందూస్తాన్‌ షిపింగ్‌ యార్డు వారితో ఒకసారి మాట్లాడాను. మీరు తీసుకుంటున్న రక్షణ చర్యలు చెప్పాలని కోరితే, వారు బాగానే తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కానీ పూర్తి భద్రత ఇవ్వాలనేది ప్రాథమిక బాధ్యత.సేఫ్టీ ఆడిట్‌ ను కఠినంగా అమ లు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని చెబుతున్నారు.అయితే పరిశ్ర మలు కచ్చితంగా అక్కడి పనిచేసే వారికి కనీస రక్షణ పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమ ల్లో రక్షణ అంశం మీద నేనే ప్రత్యేకంగా దృష్టి పెడతాను.ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యే కంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో రోజురోజుకీ కాలు ష్యం పెరుగుతోంది.దీన్ని అరికట్టడంపై దృష్టి పెడ తాం.పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా,ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’’అన్నారు.
    ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు – ప్రతీ పేదకు సొంత ఇల్లు : సీఎం చంద్రబాబు
    మన గ్రామంలో ఏం చేసుకోవాలి.. ఏ పనులు పూర్తి కావాలి..ఎలా పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకోవాలి? అనే ఆలోచన ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ఉండాలి.గ్రామసభల్లో గ్రామానికి అవసరం అయ్యే పనుల మీద గ్రామస్తులంతా సమగ్రంగా చర్చిం చాలి.అంతా ఒక్కటిగా తీర్మానాలు చేసుకొని గ్రామ అభివృద్ధిని, ప్రగతికి ముందుకు నడిపించే చైతన్యం ఉన్నప్పుడే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధిని సాధి స్తాయి.స్వర్ణ పంచాయతీలుగా మారి సంపన్న ఆర్థిక,అభివృద్ధి ప్రగతి సాధించేలా పటిష్టమైన ప్రణాళికను గ్రామస్తులే రూపొందించుకోవలసిన అవసరం ఉంది.గ్రామ పంచాయతీ మొదటి పౌరు డు అయిన సర్పంచులకు విశిష్టమైన శక్తి, అధికా రాలు ఉన్నాయని,దానిని సరైన రీతిలో ఉపయోగిం చుకుంటే ప్రతి గ్రామం రాలేగావ్‌ సిద్ధిగా మారు తుంది.ఇంట్లో ఆడపిల్ల చదివితే ఆ ఇంటికి వెలుగు అంటారు. అదే ఆడ పిల్ల చదివితే దేశానికి కూడా వెలుగు. పంచాయతీల నుంచే భారతదేశ రాష్ట్రప తిగా ఎదిగిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ప్రస్థా నం ఎంతో స్ఫూర్తిదాయకంమని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఉమ్మడి తూ.గో.జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు.ఈక్రమంలో సీఎం వానపల్లి లోని పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించు కున్న అనం తరం వానపల్లి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయ తీల్లో ‘గ్రామ సభలు’ పెట్టామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నరేగా కింద రూ.4,500కోట్ల పనులకు అను మతి తీసుకున్నామని నరేగా కింద వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84లక్షల కుటుంబా లకు పని దొరుకుతుందని సీఎం తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నాకు.2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగమని సీఎం చంద్రబాబు తెలిపారు.గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహి ళలు ఇబ్బంది పడ్డారని వైఎస్సార్‌ సీపీ సభ లకు వెళ్లినవారు బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టా రని మండిపడ్డారు.గ్రామాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకమని సీఎం తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. 2014-19మధ్య 27,444కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తామని సీఎంచంద్రబాబు హామీ ఇచ్చారు.గ్రామాల్లోని పేద లకు ఇళ్లుకట్టించే బాధ్యత ప్రభు త్వంతీసు కుంటుం దని తెలిపారు. ఇళ్లకు విద్యుత్‌, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.నిరుద్యోగ యువ తకు ఉపాధి ఎలా కల్పించాలనే ఎప్పుడూ ఆలోచిస్తు న్నానని ఇంతా16వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టు లు భర్తీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరిం చారు.గత ఐదేళ్లలో ఉద్యోగులు, పింఛనుదారులకు జీతం సరిగా వచ్చేది కాదు. పేదవాడికి రూ.15కే మూడుపూటలా భోజనం పెడుతున్నాం. నైపుణ్యం ఉంటేనే యువత ఆదాయం పెరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.-జిఎన్‌వి సతీష్‌

    ప్రాధమిక హక్కులకు భంగం కలిగితే..!

    నేటి సమాజంలో అధికారులు, ప్రభుత్వ కార్యాల యాలు, చట్టబద్దమైన వ్యక్తులు వారి విధులు, దేశ పౌరులు చేసే చర్యలు లేదా పలు అంశాలు చట్టానికి లోబడే ఉండాలి.లేని పక్షంలో చట్టపరమైన సంస్థలు, న్యాయస్థానాల నుంచి పలు రకాలైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు సుభిక్షంగా,స్వేచ్ఛగా బ్రతికేందుకు, నివసిం చేందుకు కొన్ని ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది. అటువంటి మన ప్రాథమిక హక్కులకు ఎవరైనా…భంగం వాటిల్లే విధంగా చేస్తే వారిపై మనం హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో ఈ రిట్‌ పిటిషన్‌ వేసి తద్వారా మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవచ్చు.
    కొన్ని సందర్భాల్లో చాలామంది ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినా…ఎలా రక్షణ పొందాలో తెలియదు. ఒకవేళ తెలిసినా పెద్దవారితో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న సందేహం ఉంటుంది. కానీ మిత్రులారా మనం ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే… సమాజంలో వ్యక్తిగత అంతస్తుల్లో, పేద,గొప్ప, వీరు అధికారులు,వీరు పెద్దవారు,వారు చిన్న వారు అనే తేడాలు ఉంటుంది.ఇది సహజం. కానీ మనం నీతిగా,నిజాయితీగా ఉండి, మన తప్పు లేకుండా…వేరే వారు సో కాల్డ్‌ పెద్ద వారు మన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే..ఈ రిట్‌ పిటిషన్‌ను వారిపై హై కోర్టులో లేదా కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టులో వేసి చూడండి.తప్పు చేసిన వాడు బెంజ్‌ కారులో తిరిగేవాడు అయినా… సరే, ఒక్క సారి కోర్టు మెట్లెక్కితే,గెంజి తాగే నీతో పాటు సమానంగా కోర్టు హాల్లో న్యాయ మూర్తి ముందు నేలపైనే నిలబడాలి. తప్పు చేసిన వాడు బోయింగ్‌ విమానాల్లో తిరిగే పెద్దమనిషి అయినా సరే…కోర్టులో న్యాయ మూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబ డాల్సిందే.ఇదే న్యాయానికి,చట్టానికి ఉన్న పవర్‌. న్యాయం,చట్టం ముందు అందరూ.. సమానులే. కాబట్టి ‘‘పవర్‌ కమ్స్‌ ఫ్రమ్‌ సిన్సియారిటి’’ అనే వాక్యాన్ని మనం మరువ కూడదు.మన బలం,బలగం నిజాయితీయే అయి ఉండాలి.మనం ఏ తప్పూ చేసి ఉండ కూడదు.
    ఇక రిట్‌ అంటే తెలుసుకుందాం.
    భారతదేశ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు వాటి న్యాయపరమైన అధికారంతో జారీ చేసే అధికారిక వ్రాతపూర్వక ఉత్తర్వు అని అర్థం. రిట్‌ అనేది ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు లేదా న్యాయస్థానాలకు, ప్రభుత్వ అధికారులకు ఓఅంశంపై చర్య తీసుకోమని లేదా కార్యకలాపాలు చేయకుండా ఆపమని ఆదేశించడం. మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థలోమొత్తం ఐదు రకాల రిట్‌లు ఉన్నాయి: 1) హెబియస్‌ కార్పస్‌, 2) మాండమస్‌, 3)క్వో-వారంటో,4) సెర్టియోరారి, 5) ప్రొహిబిషన్‌ (నిషేదం). భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే,పరి రక్షించేందుకు ఈరిట్‌ పిటిషన్‌ను హైకోర్టులో గాని,సుప్రీం కోర్టులో గాని పౌరులు దాఖలు చేయవచ్చు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా,భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు ద్వారా రిట్‌లు (ఆదేశాలు) జారీ చేయబడతాయి.భారత రాజ్యాంగంలోని పార్ట్‌ (ఆర్టికల్‌12-35)లో పొందుపరచబడిన ప్రాథ మిక హక్కులు పౌర స్వేచ్ఛలకు హామీ ఇస్తున్నా యి.భారతీయు లందరూ భారతదేశ పౌరులుగా శాంతి,సామ రస్యంతో తమ జీవితాలను గడప వచ్చు.ఈరకంగా రాజ్యాంగం మనకు కల్పిం చిన హక్కులను‘ప్రాథమిక హక్కులు’అని పిలు స్తారు.ఇంతకు మునుపు మొత్తం ఏడు ప్రాథ మిక హక్కులు ఉండేవి వీటినుంచి 1978లో 44వ సవరణద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడిరది. చట్టబద్ధ మైన హక్కుగా ఆస్తిహక్కు మార్పు చెందింది.కాబట్టి ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులుఉన్నాయి.

    1. సమానత్వ హక్కు (ఆర్టికల్‌ 4-18)
    2. స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్‌19-22)
    3. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు (ఆర్టికల్‌ 23-24)
    4. మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్‌ 25-28)
    5. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు (ఆర్టికల్‌ 29-30)
    6. రాజ్యాంగ పరిష్కారాల హక్కు (ఆర్టికల్‌ 32-35) ఉన్నాయి.
      ప్రాథమిక హక్కులకు బంగంకలిగితే భారత రాజ్యాంగం,ఆర్టికల్‌ 32 మరియు 226 ప్రకా రం,ఏవ్యక్తి అయినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ను ఆశ్రయించే హక్కును కలిగి ఉన్నాడు.
      1) హెబియస్‌ కార్పస్‌ :
      ‘హెబియస్‌ కార్పస్‌’అంటే చట్టవిరుద్ధంగా అరెస్టు చేయబడిన,నిర్బంధించబడిన లేదా ఖైదు చేయబడిన వ్యక్తిని విడుదల చేయడానికి ఈ రిట్‌ ఉపయోగించబడుతుంది.ఈహెబియస్‌ కార్పస్‌ రిట్‌ కారణంగా,అలా నిర్బంధించ బడిన వ్యక్తిని అతని నిర్బంధం చట్ట బద్ధతను పరిశీలించడానికి కోర్టులో హాజరుపరిచమని పోలీసులను కోర్టు నిర్దేశిస్తుంది.అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టు భావిస్తే, ఆవ్యక్తిని వెంటనే విడుదల చేయాలని అదేశిస్తుంది.ఉదాహరణ: ఓవ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన 24 గంటల లోపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి. కానీ హాజరు పరచలేదు అప్పుడు ఆ అరెస్టయి న వ్యక్తికి సంబంధించిన వారు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను,నిర్బంధంలో ఉన్న వ్యక్తి స్వయంగా లేదా అతని తరపున బంధు వులు లేదా స్నేహితులు దాఖలు చేయవచ్చు. ఇది ప్రభుత్వ అధికారులు మరియు వ్యక్తులు ఇద్దరికీ వ్యతిరేకంగా జారీ చేయబడుతుంది.
      2)మాండమస్‌ రిట్‌ : దిగువ కోర్టులు,ట్రిబ్యునల్‌,ఫోరమ్‌ లేదా ఏదైనా పబ్లిక్‌ అథారిటీని తమ విధిని సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనా లేదా పూర్తి చేయని ఏదైనా చర్యను చేయమని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించదానికి ఉపయోగ పడును. ప్రభుత్వ అధికారి చట్టంప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత చేయకుండా పౌరులను ఇబ్బంది పెడితే, మాండమస్‌ రిట్‌ పిటిషన్‌ వేయొచ్చు.ఉదాహరణ: ఒక ఎమ్మార్వో ఆఫీసులో పౌరులకు చట్టప్రకారం జరగాల్సిన ఏదైనా పనిని జరగకుండా చేయుట,ఆ ప్రభు త్వ అధికారి తన విధులను సక్రమంగా చేయ కుండా పౌరులను ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నప్పుడు ఈ పిటిషన్‌ వేయొచ్చు.ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది.
      3) క్వో వారంటో రిట్‌ : క్వో-వారంటో రిట్‌ ఒకవ్యక్తి తనకు అర్హత లేక పోయినా ప్రభుత్వ కార్యాలయంలో నియమించ బడడం. అర్హత లేకపోయినా అధికారిగా చలా మణి అవడం.ఈ పరిస్థితుల్లో అర్హత లేని అతను ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించ కుండా నిరోధించడానికి ఈరిట్‌ జారీ చేయ బడును.‘క్వోవారంటో’అంటే ‘ఏవారెంట్‌ ద్వారా’ అని అర్థం.ఈ రిట్‌ ద్వారా,ప్రభుత్వ కార్యాల యాన్ని కలిగిఉన్న వ్యక్తి ఆపదవిని ఏ అధికా రం క్రింద కలిగిఉన్నారో చూపించమని కోర్టు ఆదేశిస్తుంది.ఆ పదవిని నిర్వహించేందుకు వ్యక్తికి అర్హత లేదని తేలితే,అతన్ని దాని నుండి తొలగించవచ్చు.దీని లక్ష్యం ఏమిటంటే,ఒక వ్యక్తి తనకు అర్హత లేని పదవిని నిర్వహించ కుండా నిరోధించడం,ఇది ప్రైవేట్‌ కార్యాల యానికి వర్తించదు.ఉదాహరణ: ఏదైనా ప్రభుత్వకార్యాలయంలో అర్హతలేని అధికారి ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తే,అది గమనించిన ఏవ్యక్తి అయినా ఈక్వో వారంటో రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో వేయొచ్చు.
      4) రిట్‌ ఆఫ్‌ సెర్టియోరారి :
      ‘సెర్టియోరారి’ అంటే ‘ధృవీకరణ’ఒక నివారణ వ్రాత.దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్‌ తన అధికా రాలకు మించిన ఉత్తర్వును జారీ చేసిందని లేదా చట్ట తప్పిదానికి పాల్పడిరదని హైకోర్టు లేదా సుప్రీం కోర్టు అభిప్రాయపడినప్పుడు , క్రింది కోర్టులకు సర్టియోరి రిట్‌ జారీ చేయ బడుతుంది.ఈరిట్‌ దిగువ కోర్టులు, ట్రిబ్యు నల్‌లు లేదా ఫోరమ్‌లు కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు,ఫైల్‌లు,సంబంధిత పత్రాలను తదుపరి సమీక్ష కోసం ఉన్నత న్యాయస్థానా లకు అందించాలని లేదా అవసరమైతే వాటిని రద్దు చేయాలని ఆదేశిసిస్తుంది.ఉదాహరణ: ఒక సబార్డినేట్‌ కోర్టు అధికార పరిధి లేకుండా లేదా దాని ఉనికిలో లేని తీర్పులు ఇవ్వడం లేదా క్రింది స్థాయి న్యాయస్థానం అధికార పరిధిని అధిగమించడం లేదా అధిగమించడం ద్వారా తన అధికార పరిధిని మించి వ్యవహ రించినప్పుడు,లేదా ఒకసబార్డినేట్‌ కోర్టు చట్టం లేదా విధివిధానాల నియమాలను విస్మరించి నప్పుడు,లేదా ఒక సబార్డినేట్‌ కోర్టు సహజ న్యాయం యొక్క సూత్రాలను ఉల్లంఘించి నప్పుడు సర్టియోరరీ పిటిషన్‌ ద్వారాక్రింది కోర్టులకు చట్టబద్ధంగా నడచుకొనుటకు ఉత్తర్వులు ఇస్తుంది.
      5) రిట్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ (నిషేదం): దిగువ కోర్టులు, ట్రిబ్యునల్‌లు లేదా ఫోరమ్‌లు తమకు అధికార పరిధి లేని కేసు విచారణను నిషేధించాలని సుప్రీం కోర్టులు లేదా హైకోర్టు ల ద్వారా ఈ రిట్‌ జారీ చేయబదుతుంది. దిగువ కోర్టులు,ట్రిబ్యునల్‌లు,ఇతర పాక్షిక-న్యాయ అధికారులు తమ అధికారానికి మించి ఏదైనా చేయకుండా నిషేధించడానికి కోర్టు ద్వారా నిషేధం యొక్క రిట్‌ జారీ చేయ బడిరది.ఇది డైరెక్ట్‌ ఇనాక్టివిటీకి జారీ చేయ బడుతుంది. మరియు ఆ విధంగా కార్యాచ రణను నిర్దేశించే మాండమస్‌ నుండి భిన్నంగా ఉంటుంది.దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్‌ అధికార పరిధి లేకుండా లేదా పరిదికి మించి లేదా సహజ న్యాయ నిబంధ నలను ఉల్లంఘించినప్పుడు లేదా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఇది జారీ చేయబడుతుంది.దిగువ న్యాయ స్థానం లేదా ట్రిబ్యునల్‌ స్వయంగా అల్ట్రా వైర్‌ అయిన చట్టం ప్రకారం పనిచేసినప్పుడు కూడా ఇది జారీ చేయబడుతుంది.
      ఎవరు రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు
      రాష్ట్రంచే పౌరుల ప్రాథమిక హక్కులకు బంగం వాటిల్లితే ఏ వ్యక్తి అయినా రిట్‌ పిటిషన్‌ దాఖ లు చేయవచ్చు.అందువల్ల, ప్రభుత్వ అధికా రులు,ప్రభుత్వ సంస్థలు,రాష్ట్రానికి వ్యతిరేకంగా తమ హక్కులను అమలు చేయడానికి లేదా రక్షించడానికి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసే హక్కు ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. ఈ పిటిషన్లు వెయ్యడానికి ముందుగా వారి రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళాలి ఆ తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అయితే కొన్ని సందర్భాల్లో నేరుగా సుప్రీంకోర్టు లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే,ముందుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదో పిటిష నర్‌ వివరించాలి.
      రిట్‌ పిటిషన్‌ ఎక్కడ దాఖలు చేయవచ్చు?
      ఆర్టికల్‌ 32ప్రకారం,సుప్రీంకోర్టులో రిట్‌ పిటి షన్‌ దాఖలు చేయవచ్చు.పిటిషనర్‌ తన ప్రాథ మిక హక్కును ఉల్లంఘించినట్లు రుజువు చేయ గలిగితే మాత్రమే సుప్రీం కోర్టు రిట్‌ జారీ చేయగలదు. ప్రాథమిక హక్కు ఉల్లంఘన విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు రాజ్యాంగంలోని పార్ట్‌లో ఉన్నందున అది ప్రాథమిక హక్కు అని గమనించడం ముఖ్యం. ఆర్టికల్‌ 226 ప్రకారం,ఏదైనాహైకోర్టు ముందు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించినట్లయితే ఆర్టికల్‌ 32ని సస్పెండ్‌ చేయవచ్చు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ ఆర్టికల్‌ 226ని సస్పెండ్‌ చేయడం కుదరదు.ఆర్టికల్‌ 32 మరియు 226 రెండూ భారత రాజ్యాంగం కింద అందించిన ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి మార్గాలను అందిస్తాయి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఏ వ్యక్తి అయినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో రిట్‌ దాఖలు చేయవచ్చును.
      కాబట్టి నేడు చాలా అంశాలు కుటుంబ పంచా యితీలు, గ్రామపెద్దల,కులపెద్దల పంచాయి తీలు దాటుకొని చివరకు తగిన న్యాయంకోసం కేసుల ద్వారా కోర్టులకు చేరుకోవడం గమని స్తున్నాం.ఈ కాలానికి అనుగుణంగా అందరూ చట్టాన్ని తెలుసుకోవడం విధిగా భావించి దేశం లో సుభిక్షంగా,సంతోషంగా జీవించాలని కోరుకుందాం!
      వ్యాసకర్త : ఫ్రీ లీగల్‌ అవేర్నెస్‌ పర్సన్‌- (చెన్నా ప్రమోదిని)

    బంజారా తండాల్లో తీజ్‌ ఉత్సవాలు

    ప్రతి ప్రాంతానికి,వర్గానికి ఓ సంస్కృతి ఉంటుంది.ఆ సంస్కృతిని నిలబెట్టే పండుగలూ ఉంటాయి.అలాంటి పండుగే తీజ్‌ ఉత్సవం.తెలుగు రాష్ట్రాల్లోని గోర్‌ బంజారాలు పవిత్రంగా జరుపుకునే వేడుక ఇది. వర్షాలు నిండుగా కురవాలనీ,పంటలు దండిగా పండాలనీ కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. ‘బతుకమ్మ’ పండుగ తరహాలో చేసుకునే సాగే తీజ్‌ పండుగ శ్రావణ మాసంలో వస్తుంది.తొమ్మిది రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ గిరిజనోత్సవం జరగనుంది.ఈ వేడుక విశిష్టతపై తెలంగాణ ఆదిలాబాద్‌ జిల్లా ‘‘రాథోడ్‌ శ్రావణ్‌’’ థింసా పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం..

    కరవు నుండి, కాపాడే ప్రకృతి పండుగ..తీజ్‌ !
    తొమ్మిది రోజుల సంబురాలు కఠోర నియ మాలు.. డప్పుల మోతలు తండాల్లో కేరింతలు పెళ్ళికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు బావ మరదళ్ల అల్లరిచేష్టలు ఆపై భక్తి భావం వీట న్నింటి మేళవింపే తీజ్‌ పండుగ!పూర్వం తండాలలో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని,తీజ్‌ పండుగ నిర్వహి స్తారు.ఈపండుగ బతుకమ్మను పోలి ఉం టుంది.తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజిం చి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు.ఈఉత్స వాలను పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు,సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్‌’ అంటారు.అలాగే గోధుమ మొలకలను కూడా‘తీజ్‌’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్‌ లో గోధుమ మొలకలను పూజించడం ఆనవా యితీ.ఆగస్టు నెలలో ఈ వేడుకలు మొదలువు తాయి.తీజ్‌ ఉత్సవం.బంజారాల సంస్కృతికి దర్పణం.ఈ తొమ్మిది రోజులు అమ్మాయిలకు అగ్నిపరీక్షే.ఉప్పుకారం లేని భోజనం తినాలి. మాంసాహారాలు ముట్టకూడదు, తండా నుంచి బయటికి వెళ్లకూడదు.యువతులు పుట్టమట్టి తెచ్చి కులదేవతలను కొలుస్తూ పాటలుపాడి తండా నాయకునిచేత బుట్టలో ఆమట్టిని పోయించి గోధుమలను చల్లుతారు.స్వయంగా మూడు పూటలు బావుల వద్దకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చి తీజ్‌లపై చల్లుతారు.అలా తొమ్మిది రోజుల్లో గోధుమ నారు ఏపుగా పెరుగు తుంది.అలా బుట్టల్లో గోధుమ మొలకలను పెంచి, వాటి చట్టూ ఆడిపాడి,తొమ్మిదోరోజు వాగులో నిమజ్జనం చేస్తారు.వర్షాలు సంవృ ద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఊరంతా బాగుండాలని,మంచి మొగుడు రావాలని కోరుకుంటూ,అంతరించి పోతున్న గిరిజన సంస్కృతిని అపూర్వంగా కాపాడు కోవడానికి అడవిబిడ్డలు ప్రతి ఏటా తీజ్‌ పండు గను భక్తిగా జరుపుతున్నారు. చెట్టు,పుట్ట, గుట్టలకు నిలయమైన అడవుల్లో గుడిసెలు నిర్మించుకొని గోసేవ,ప్రకృతి సేవ చేస్తూ తమ దైన సంస్కృతిని, సంప్రదాయాలను నిలుపు కుంటూ సాగిపోతారు బంజారాలు.అనాదిగా సాతిభవానీలను (సప్తమాతృకలు) కొలుస్తూ ఆ జగదంబలోనే జగతిని దర్శిస్తారు.మొలకనారు ను ఆతల్లికి మరోరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈరెండు పండుగలకు దగ్గరి పోలికలు,సామీప్యతలు చాలా విషయా ల్లో కనిపిస్తాయి.ఈరెండు పండుగలు కాలా నుగుణంగా కొద్దిగా ముందు వెనకాల నిర్వ హించబడినా రెండిరటి లక్ష్యంసృష్టి కళ్యాణమే. తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండుగ జరుపబడితే,తీజ్‌ పండుగను మాత్రం దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు బంజారాలు. రెండు పండుగల్లో ప్రకృతే ప్రధాన దైవంగా కొలవబడుతుంది.ముత్తైవదులు,కన్నెపిల్లలు తమ జీవితాలు మంగళమయం అవ్వాలనే ఆకాంక్ష తో ఈ పండుగలను జరుపుకుంటారు.తీజ్‌ కొండ కోనల్లో,అడవుల్లోని తండాల్లో నిర్వహిం చబడితే, బతుకమ్మ మైదాన ప్రాం తాల్లో నిర్వహించబడుతుంది.బతుకమ్మ,తీజ్‌ రెండు పండుగలు ప్రకృతి మాతను ఆరాధించే ప్రజల హృదయ నిర్మల తను ఆవిష్కరిస్తు న్నాయి. పండుగలు జరుపుకునే విధానాలు, పద్ధతులు వేరువేరు కావచ్చు.కానీ రెండిరటి లక్ష్యం లోక కల్యాణం అన్నది మాత్రం గమనించవలసిన అంశం. పాట, ఆటల మధ్య పువ్వులు, మొల కలు పరవశించి ప్రాణశక్తిని ప్రజారణ్యం లోకి ప్రసారం చేస్తున్న విధానం రెండు పండుగలలో కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ విధంగా గౌరవిస్తోందో అలాగే బంజారా గిరిజ నుల సంప్రదాయ తీజ్‌ పండుగను కూడా సాద రంగా గౌరవిస్తు న్నది.ఈపండుగలు రెండు తెలంగాణ గడ్డ ఆత్మగౌరవ ప్రతీకలుగా దర్శనమిస్తాయి.
    బంజారా సాంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక
    బంజారా సాంస్కృతి,సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైన తీజ్‌ పండుగ తీజ్‌.తీజ్‌ అనగా గోధుమ మొక్కలు అని అర్థం.ఈ పండుగను మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోనే కాక పోరుగునున్న ఆంధ్రప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటక,గోవా,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గడ్‌,రాజస్తాన్‌, గుజ రాత్‌ మొదలగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఈ పండుగ మొదట ఎలా ప్రారంభమౌతుందంటె తండా ల్లోని ప్రజలందరూ ఆ తండాకు చెందిన పెద్ద ఆయన నాయక్‌ ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని ‘‘నాయక్‌’’అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న గుల్లలని తీసుకు వస్తారు.ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్ల లు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో,గువ్వలతో, ముత్యా లతో,పూసలతో,మరియు బాసింగాలు కట్టి పెళ్ళి కూతులా అందంగా ఆగుల్లలని ముస్తాబు చేస్తారు.ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణ పూర్ణిమి రోజు ఉదయంలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందం గా ముస్తాబై కొత్తబట్టలు ధరించి ‘‘నాయక్‌’’ ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లలో ఆమట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి శ్రావణంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ఆవరణలో అందరూ సమావేశమై నాయక్‌ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్‌,భార్య నాయకణ నాని బెట్టిన గోధుమ లను చల్లడంతో ఈఉత్సవం ప్రారంభ మౌతుంది.అందరు పాటలు పాడుతూ,నాట్యం చేస్తూ ఈకార్యక్రమంలో పాల్గోంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా ‘‘మోదుగు’’ ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి,గోదుమ లని చల్లుతారు.పెళ్ళికాని ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు ‘‘పులియా గెణో’’ ‘పూర్ణ కుంభం’లా తలపై పెట్టుకొని బావి నీళ్లు కాని బోరింగ్‌ నీళ్ళుకాని చెరువు నీళ్లుకాని తీసుకు వచ్చి తీజ్‌కి పో స్తారు.ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్‌ కినీరు పోయకుండా ఆపి కొన్ని పోడుపు కథలు వేస్తారు.వాటికి సమాధా నం చెప్పినవారికి తీజ్‌కి నీళ్ళు పోయ్యనిస్తారు. ఈవిధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూనీళ్ళు జల్లూతూ అగరు బత్తులతో ధూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.పాటలు పాడుతూ తోమ్మిదవరోజు గోకుల అష్టమినాడు ‘డంభోళి’ పండుగను జరుపుకుంటారు.ఆరోజు పెళ్ళి కాని ఆడ పిల్లలు కొత్త బట్టలు ధరించుకొని నాన బెట్టాన సెనగలను తీసుకోని పోలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు అప్పుడు ఆడ పిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమీస్తారు. అక్కడి నుండి నల్లని బంక మట్టిని తీసుకోని నాయక్‌ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళికాని ఆడ, మగవాల్లు ఆ మట్టితో డోక్రి,డోక్రా ముసలమ్మ ముసలోడులను పీట పై తయారు చేస్తారు దానినే ‘గణగోర్‌’అంటారు.తయారు చేసిన మట్టి బొమ్మల పై రైక బట్ట,తువ్వాల కప్పు తారు.‘డంబోళి’రోజు రాత్రి ఎనిమిది,తోమ్మిది గంటలకు తండా వాళ్లందరూ భోజనం చేసిన తర్వాత గోదుమ పిండితో తయారు చేసిన గోదుమ రోట్టే,బెల్లం నెయ్యితో కలిపి హుండలు తయారు చేస్తారు. దానిని ‘చుర్మో’అంటారు. తయారు చేసిన చుర్మోను హరితి పెళ్ళేంలో వేసి ఆగరుబత్తి,కోబ్బరికాయ,కుంకుమ,నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరు పెళ్ళి కాబోయె ఆడపిల్లలతో తండా నాయక్‌ ఇంట్లో డోక్రి, డోక్రా పూజలు చేసి డంబోళి పైన ఇలా పాట పాడుతారు.మరుసటి రోజు ఉదయాన్నె ఆడ పిల్లలందరు డోక్రి,డోక్రాను నెత్తి మీద పెట్టు కొని ఊరి బయట ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు.అప్పుడు ఈ పాట విధంగా పాట పాడుతారు. ఈ పాటాల్లో ముసలమ్మను పోగు డుతూ,ముసలయ్యని విమర్శిస్తూ పాట పాడుతారు.గణగోర్‌ని చెరువులో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానంచేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్‌ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్‌ గుల్లలను మధ్యలో పెట్టు కొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.ఆ తర్వాత గ్రామప్రజలు,పెద్దలు, నాయకులు, కార్భారి,ఢావ్‌,ఢవ్‌ గేర్యా మాన్కరి అందరూ వచ్చి సహపంక్తి భోజనం (బాలాజీ బండారో) చేస్తారు.నాయక్‌ అగరుబత్తీలు పెట్టి కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహిస్తారు.పూజ అనం తరం ఆడపిల్లలు తమ తీజ్‌ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆగుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్‌ని తెంపుతారు. తెంపిన తీజ్‌ని ఆడ పిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు.గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడ పిల్లలు తీజ్‌ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కోక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు.ఒక్కొక్కరు తీజ్‌ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆతీజ్‌ ని మొక్కతూ పెళ్ళికాని వారు హరాలకి పెళ్ళి అయిన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్‌,నాయకణ్‌ జోన్నలు, గోధుమలు,సెనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం ఐదు గంటలకు అందరు తినటం ఆతర్వాత ఎడ్లకు రaూలు వెసి అలంకరించి,బండి కట్టి అందులో తీజ్‌ని ఉంచి బాజా బజంత్రీలతో తాండా అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండా చెరువులో తీజ్‌ గుల్లలని నిమజ్జనం చేస్తారు. ఆసమ యంలో ఆడ పిల్లలు బాదపడటం,ఏడ్వటం చేస్తారు.ఎందుకంటే తోమ్మిది రోజులు ఉపవాస దీక్షతో,భక్తి శ్రద్ధలతో,పాటలతో,నృత్యాలతో ఆనందంగా జరుపుకోని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక అంతేకాకుండా పెళ్ళి అయినచో ఈతీజ్‌ ఉత్సవం జరుపుకోలే మన్న బాదతో ఏడుస్తారు.తీజ్‌ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముల్లు కాళ్ళు కడుగుతారు.అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నాయక్‌ ఆధ్వర్యంలో గుడాలను ఆరగిస్తారు.తీజ్‌ పండుగ అనేది పెద్దలను గౌరవించాలని, గిరిజన సాంప్రదాయాన్ని,సంస్కృతిని కోనసా గించాలని, పచ్చదనంతో కుటుంబాలు ఎప్పుడు పచ్చగా వెలగాలని పెళ్ళి కాని యువతులకు మంచి భర్త దోరకాలని అంటారు.

    అమరావతిలో అభివృద్ధి ప్రాజెక్టులు పురోగతి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈనేప థ్యంలో పాలక పక్షం అమరావతి ప్రాజెక్టుల్లో పనులు పురోగతిపై నిమగ్నమైంది.ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మరోపక్క పురపాలక శాఖ మంత్రి పి.నారాయణరావు,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు పెట్టుబడిదారులతో సమీక్షలు,చర్చలు నిర్వహించి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
    రాష్ట్రానికి స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపి టల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ూAజI) కింద నిధులు ఇచ్చేం దుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో తొలి విడతగా రూ.15 వందల కోట్లు విడుదల య్యాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఏయే మార్గాల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ గుర్తించి ఆమేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రెండుసార్లు దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తాజాగా ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం నిధులకోసం దిల్లీ వెళ్లి ప్రయత్నించారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో మూల ధన వ్యయం పెరిగే విధంగా కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభు త్వమే ఇందుకు నిధులు ఇస్తుంది.దాదాపు 50ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరు స్తుంది.సాకి పథకం కింద ఈఆర్థిక సంవత్సరంలో 2వేల200కోట్లరూపాయలు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.ఈపథకం కింద రూపొం దించిన విధివిధానాల ప్రకారం ప్రతిపా దనలు పంపితే కేంద్రం ఆమోదం తెలుపుతుంది. కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 66 శాతం కేంద్రం విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆ మేరకు తొలి విడతగా 15వందల కోట్ల రూపా యలు రాష్ట్రానికి వచ్చాయి.ఈ నిధులను ప్రత్యే కంగా నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వా లని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పటి నుంచో పెద్ద మొత్తంలో బిల్లులు పెండిరగులో ఉన్నాయి. గుత్తేదా రులు అనేకమంది ఈ కారణంగా చేతులెత్తేశారు. ప్రస్తుతం వచ్చే నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి పనులను ముందుకు నడిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
    అమరావతిలో బ్యాంకుల ప్రతినిధి బృందాల పర్యటన
    రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు,ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఈరెండు బ్యాంకుల ప్రతినిధి బృందాలు అమరా వతిలో పర్యటించనున్నాయి.ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ, సీఆర్‌డీఏ ఉన్నతాధి కారులతో వరుసగా భేటీ అవుతారు.మధ్యలో మూడురోజులు రాజ ధానిలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మా ణాలు,ఆర్థిక వనరులకు అవకాశం,దశల వారీగా ప్రణాళికలు ప్రభుత్వం, సీఆర్‌డీఏ పరంగా వాటి అమలు తదితర అంశాలకు సంబంధించి ఉన్నతా ధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. వరల్డ్‌ బ్యాంకు బృందంలో 23 మంది, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు బృం దంలో నలుగురు సభ్యులు ఉన్నారు.వెలగపూడిలోని సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఇవాళ భేటీ అవు తారు. అనంతరం ముఖ్యమం త్రితో సచివాలయంలోనే అత్యున్నతస్థాయి సమా వేశంఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక ఆలోచ నలు,ఆర్థికసాయం,ప్రణాళికపై చర్చించను న్నారు. ప్రభుత్వ ప్రాధాన్య తలు,విధానపరమైన కార్యాచర ణపై బృందానికి ముఖ్యమంత్రి వివరించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ (సాకి) కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో తొలి విడత గారూ.1500కోట్లు విడుదల య్యాయి.ఆర్థిక కష్టా ల్లో ఉన్న రాష్ట్రాన్నిగాడిలో పెట్టేందుకు ఏయే మార్గా ల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా కేంద్రం నుంచి నిధు లు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ గుర్తించి ఆమేరకు ఇప్ప టికే రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈనేపథ్యంలో రాష్ట్రఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రెండుసార్లు దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌,ఆశాఖ ఉన్నతాధి కారులతో మాట్లా డారు.తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు సైతం నిధుల కోసం ఢల్లీి వెళ్లి ఆర్థిక మంత్రిని కలిశారు.
    గ్లోబల్‌ గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానం
    పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్య స్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో,5బిలియన్ల యూఎస్‌ డాలర్ల గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు, గ్లోబల్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌,యాక్సిస్‌ ఎనర్జీ ప్రమో ట్‌ చేసిన క్లీన్‌ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ ఎవ్రెన్‌ ముందు కొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్‌,యాక్సిస్‌ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో పాటు ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమ య్యారు.రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్‌, 5500 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్‌ సంస్థ ప్రతిని ధులు వెల్లడిరచారు. వీటిలో 3000మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని,2026 చివరి నాటికి ఆప్రాజెక్టులు ప్రారంభమవుతాయని తెలి పారు.పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళి కలే కాకుండా, ఇంటి గ్రేటెడ్‌ మాడ్యూల్‌ తయారీ, పంప్డ్‌ స్టోరేజ్‌,బ్యాటరీ స్టోరేజ్‌,ఈ -మొబిలిటీ, గ్రీన్‌ అమ్మోనియా వంటి వాటిలో రాష్ట్రంలో అద నపు అవకాశాలను ఎవ్రెన్‌ అన్వేషిస్తోం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదా రులకు అనువైన విధానాలను అమలుచేస్తోందని ,పెట్టుబడిదారు లకు, ప్రజలకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో సమయానుకూల అనుమతులతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు,రాష్ట్ర ప్రభు త్వం పెట్టుబడులకు అనుకూల వాతావర ణాన్ని కల్పి స్తుందని అన్నారు. ఇంధన రంగంలో పెట్టు బడులను సాకారం చేయడంద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన అవకాశాలకు,ఉద్యోగ కల్పనకు, స్థిర మైన అభివృద్ధి సాదించేందుకు పుష్కలంగా అవకా శాలున్నాయన్నారు.సౌర,పవన ఇంధన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఏపీలో ఆకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. సోలార్‌ పార్కులు,రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్‌లు, పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ఇంధనశాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలి పారు.సుమారు 1ట్రిలియన్‌ యుఎస్‌ డాలర్లతో ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది ఉద్యోగు లతో ఇన్వెస్ట్మెంట్‌ మేనేజ్మెంట్‌లో బ్రూక్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఉందని బ్రూక్‌ ఫీల్డ్‌ అధికారులు తెలి పారు.బ్రూక్‌ఫీల్డ్‌ రెన్యూవబుల్స్‌ పునరుత్పాదక ఇంధనాన్ని,ప్రపంచ ఇంధన పరివర్తన,వాతావర ణ పరివర్తనకు సంబందించిన కార్యక్రమా లను ముందుకు తీసుకెళ్లడానికి 100బిలియన్‌ యూ ఎస్‌ డాలర్లతో ఐదు ఖండాలలో విస్తరించి ఉన్న హైడ్రో,పవన,సౌర,స్టోరేజి విద్యుత్‌ పంపిణి వంటి వాటిలో 7,000 కంటే ఎక్కువ విద్యుత్‌ ఉత్పాదక సౌకర్యాలలో 33,000 మెగావాట్లకు మించి ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉందన్నారు. బ్రూక్‌ఫీల్డ్‌ రెన్యూవబుల్స్‌ 5 ఖండాలలో విస్తరించి ఉన్న బహు ళ పునరుత్పాదక సాంకేతికతలలో155,000 మెగావాట్ల గ్లోబల్‌ డెవలప్మెంట్‌ పైప్‌లైన్‌ను కలిగి ఉందన్నారు. బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థ, దశాబ్దానికి పైగా నైపుణ్యం కలిగిన క్లీన్‌టెక్‌ కంపెనీ అయిన యాక్సి స్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని, 2019లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలుచేసి,1.8 Gఔ సౌర,పవన ప్రాజెక్టులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని తెలిపారు. దేశంలో క్లీన్‌ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ముందుకు తీసుకు వెళ్లేందుకు బ్రూక్‌ఫీల్డ్‌ మరియు యాక్సిస్‌ ఎనర్జీ మధ్య 51:49% హోల్డింగ్‌తో ఎవ్రెన్‌ సంస్థ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.ఉద్యోగాల కల్పన,పన్ను సహకారంద్వారా రాష్ట్ర ఆర్థికవృద్ధికి ఈ పెట్టుబడులు ఎంతగానో తోడ్పడ తాయని,ఈ పెట్టుబడి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రపంచ ఇంధన పరివర్తనకు సహాయపడడంలో ఎవ్రెన్‌ నిబద్ధతను తెలియచేస్తుందని, అలాగే క్లీన్‌ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను వారి ప్రధాన గమ్యస్థానంగా మారుస్తుందని బ్రూక్‌ఫీల్డ్‌ అధికా రులు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌లతో సమావేశం అయిన వారిలో బ్రూక్‌ ఫీల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు నావల్‌ సైనీ,ముర్జాష్‌ మనీ క్షణ, ఎవ్రన్‌ సంస్థ ఎండీ రవి కుమార్‌ రెడ్డి, సీఈఓ సుమన్‌ కుమార్‌,యాక్సిస్‌ సీఈఓమురళి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీవీవీ సత్య ప్రసాద్‌లు ఉన్నారు.
    రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు.ప్రభుత్వం చేపట్టిన మరుక్షణం నుంచి అమరావితిలో అభిమృద్ధి పనులు వేగంగా జరుగు తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిర్విరామంగా చర్చలు జరుపుతోంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసు కుంది. అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీ కరణ ప్రక్రియ వేగవంతం చేసిన విషయం తెలి సిందే. సీఎంతో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ చర్చలు: అమరా వతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ ప్రతి నిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మా ణనికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధులు అమరావతిలో పర్యటిచనున్నారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశల వారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ చర్చలు జరిపారు.అమరావతి ప్రాజె క్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యట నలు, భూసమీకరణ,మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు.రాజధాని పరిధిలో ప్రభు త్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్‌,ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్ర బాబు వివరించారు.అలాగే రాజధాని అమరా వతిలో ప్రస్తుత పరిస్థితులు వచ్చే కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను చంద్రబాబు వారికి వివరిం చారు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు.వరల్డ్‌ బ్యాంకు బృందం ఏపీలో పర్యటించింది. పురపా లకశాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధి కారులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి,ఆర్థిక సాయానికి సంబం ధించిన అంశాలపై సీఎంతో చర్చించారు.
    ఎపిలో భారీవిస్తరణకు హెచ్‌ సిఎల్‌ సన్నాహాలు!
    `మంత్రి లోకేష్‌తో భేటీ అయిన హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు : ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ హెచ్‌ సిఎల్‌ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది.గత టిడిపి ప్రభుత్వ హయాం లో ఆంధ్రప్రదేశ్‌ లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌ సిఎల్‌ ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది.రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టా లని నిర్ణయించినట్లు హెచ్‌ సిఎల్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి శివ శంకర్‌, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివప్రసాద్‌ వెల్లడిరచారు. హెచ్‌ సిఎల్‌ సంస్థ ప్రతినిధులుఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ తో సమావే శమయ్యారు. ఎపిలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు తెలిపారు. ఐటిలో ప్రస్తుతం అంతర్జాతీ యంగా చోటుచేసు కున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకే తిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించ డానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్‌ సెన్సస్‌, స్కిల్‌ డెవెలప్మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు.రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకా రాలు అందిస్తామని చెప్పారు.ఈసందర్భంగా విస్తరణకు కావాల్సిన కొన్నిఅనుమతులు, గత ప్రభు త్వం నిలిపివేసిన రాయితీలు విడుదలచేయా ల్సిం దిగా హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు మంత్రిని కోరారు.
    విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం
    మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ…గత టిడిపి హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్‌సిఎల్‌ ఛైర్‌ పర్సన్‌ శివ్‌ నాడా ర్‌తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్‌ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. రికార్డు టైంలో అనుమ తులు,భూ కేటాయింపులుచేసి,యుద్ధ ప్రాతి పదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతి నిచ్చిందని అన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్ధత కారణంగా సంస్థ కార్య కలాపా లు ముందుకు సాగలేదు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయింది.పూర్తి స్థాయి అనుమ తులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బం దులు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది…అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. మీ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తాం,ఇందుకు అవసరమైన అన్ని అనుమ తులను త్వరితగతిన క్లియర్‌ చేస్తాం,గత ప్రభు త్వంలో పెండిరగ్‌ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం.మరో 15,500మందికి ఉద్యో గాలు కల్పించడమే లక్ష్యంగా మీరుపనిచే యండి, అందుకు అవసరమైన పూర్తి సహ కారం మేము అందిస్తామని మంత్రి లోకేష్‌ పేర్కొ న్నారు.ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌ సిఎల్‌ సంస్థ ప్రతినిధులను అభినందించారు.– జి.ఎన్‌.వి.సతీష్‌

    1 2 3 67