75వ గణతంత్ర దినోత్సవ వేడుక
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్య్రం సిద్దించింది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్, అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్)కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు.
అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘’భారత గణతంత్ర’’ దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్య్రం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు.
రాజ్యాంగ సభ 11సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నా యి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్‌లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేం దుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసు లలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది. 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్య్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేచ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడడం ప్రోటోకాల్ పరంగా దేశం అందించే అత్యున్నత గౌరవం. కాలక్రమేణా ఈవెంట్ యొక్క ఫాబ్రిక్ మరియు దాని రన్-అప్‌లో భాగంగా మారిన అనేక ఉత్సవ కార్యక్రమాలలో ముఖ్య అతిథి ముందు మరియు కేంద్రంగా ఉంటారు. వారికి రాష్ట్రపతి భవన్‌లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత సాయం త్రం భారత రాష్ట్రపతిచే రిసెప్షన్ ఇవ్వబడుతుంది. వారు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ గౌరవార్థం పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. వారి గౌరవార్థం ఒక విందు ఉంది, ప్రధానమంత్రి ఆతిథ్యం ఇచ్చే లంచ్ మరియు ఉపరాష్ట్రపతి విదేశాంగ మంత్రి కాల్స్. 1999 మరియు 2002 మధ్య ప్రోటోకాల్ చీఫ్‌గా పనిచేసిన మాజీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అంబా సిడర్ మన్బీర్ సింగ్, ముఖ్య అతిథి సందర్శన ప్రతీకాత్మకతతో నిండి ఉందని ఇంతకు ముందు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు ‘‘ఇది ముఖ్య అతిథి భారతదేశ గర్వంలో పాల్గొంటున్నట్లు చిత్రీకరిస్తుంది. ఆనందం, మరియు భారత రాష్ట్రపతి మరియు ముఖ్య అతిథి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరువురి ప్రజల మధ్య స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది’’.ఈ ప్రతీ కవాదం భారతదేశం మరియు దాని ఆహ్వానిత దేశం మధ్య సంబంధాలను ఏర్పరచడానికి మరియు పునరుద్ధరించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది, ఎక్కువ రాజకీయ మరియు దౌత్యపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.
అయితే రిపబ్లిక్ డే ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు?
ఈవెంట్‌కు దాదాపు ఆరు నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆహ్వానాన్ని పొడిగించే ముందు అన్ని రకాల పరిగణన లను పరిగణనలోకి తీసుకుంటుందని రాయ బారి మన్బీర్ సింగ్ చెప్పారు.భారతదేశం మరియు సంబంధిత దేశానికి మధ్య ఉన్న సంబంధాల స్వభావం అత్యంత కేంద్ర పరిశీలన. రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించడం భారత దేశం మరియు ఆహ్వానించబడిన దేశం మధ్య స్నేహానికి అంతిమ సంకేతం. భారతదేశం యొక్క రాజకీయ, వాణిజ్య, సైనిక మరియు ఆర్థిక ప్రయోజనాలు ఈ నిర్ణయానికి కీలకమైన చోదకాలు, ఈ అన్ని అంశాలలో ఆహ్వానించ బడిన దేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించు కోవాలని కోరుతోంది.ముఖ్య అతిథి ఎంపికలో చారిత్రాత్మకంగా పాత్ర పోషించిన మరో అంశం 1950ల చివరలో మరియు 1960ల ప్రారంభంలో ప్రారంభమైన నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ తో అనుబంధం.అనేది ప్రచ్ఛన్న యుద్ధం యొక్క గొడవల నుండి దూరంగా ఉండటానికి మరియు వారి దేశ నిర్మాణ ప్రయాణాలలో ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి కొత్తగా వలసరాజ్యం చేయబడిన దేశాల అంతర్జాతీయ రాజకీయ ఉద్యమం. 1950లో జరిగిన కవాతుకు మొదటి ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో, %చీAవీ% యొక్క ఐదుగురు వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
1950లో మొదటి గణతంత్ర వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే రోజున దిల్లీలో ఎలాంటి సందడి ఉంటుందో టీవీల్లో చూస్తున్నారు. పేపర్లలో చదువుతున్నారు. కానీ 68 సంవత్సరాల క్రితం, మొదటి ‘రిపబ్లిక్ డే’ ఎలా జరిగిందో మీకు తెలుసా?ఆనాటి వేడుకలను కళ్లారా చూసిన వారు ఆరోజును ఎలా మరువగలరు? ఆనాటి జ్ఞాపకాలను సీనియర్ వ్యాసకర్త ఆర్.వి.స్మిత్ బీబీసీతో పంచుకున్నారు. 1950 జనవరి 26న పురానా ఖిలా ఎదుట ఉన్న బ్రిటిష్ స్టేడియంలో రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది. డా.రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి అక్కడే ఉన్నారు.ఆ ఉదయం..ఆ స్టేడియంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత పెరేడ్ ప్రారంభమయ్యింది. గాల్లోకి పేల్చిన తుపాకీ చప్పుళ్లు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి.చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లూయీస్ మౌంట్‌బాటన్ నుంచి గవర్నర్ జనరల్ బాధ్యతలను సి.రాజగోపాలాచారి అప్పటికే స్వీకరించి ఉన్నారు. వీదేశీ పాలన పూర్తిగా అంతరిం చిపోయి, అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే! స్వతంత్ర దేశంగా పురుడుపోసు కుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది.అప్పటి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-భారత్‌కు శుభా కాంక్షలు తెలుపుతూ, ఇండియాకు కామన్‌వెల్త్ దేశాల సభ్యత్వం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అప్పటికే అంతర్థానమైన నేతాజీ సుభాస్ చంద్రబోస్ ‘దిల్లీ చలో’ పిలుపునిస్తూ రిపబ్లిక్ డే వేడుకల్లో తిరిగి ప్రత్యక్షమవుతా రన్న వార్తలు దావానంలా వ్యాపించాయి. అప్పటికి రెండేళ్ల ముందే మహాత్మ గాంధీ మరణించారు. రిపబ్లిక్ వేడుకల్లో ఆయన లేకపోవడం లోటుగా కనిపించింది. ఇప్పుడు జరుపుతున్నంత ఆర్భాటంగా ఆనాటి రిపబ్లిక్ డే వేడుకలు జరగలేదు. కానీ అప్పటికి ఆ వేడుకలు కూడా బ్రహ్మాండంగానే జరిగాయని చెప్పుకోవాలి. రిపబ్లిక్ వేడుకల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్, సైనిక దళాలు పాల్గొన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాల శకటాలు ఆనాడు లేవు.
ఇప్పటిలా న్యూ దిల్లీ, ఎర్రకోటల మీదుగా పెరేడ్ సాగలేదు. ఆనాటి పెరేడ్ మొత్తం ఆ స్టేడియానికే పరిమితమైంది. కానీ 1951 నుంచి పెరేడ్ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. వేడుకల్లో భాగంగా యుద్ధ విమా నాల విన్యాసాలు జరిగాయి. కానీ ఆ విన్యా సాల్లో జెట్ విమానాలు, థండర్‌బోల్ట్ విమానాలు లేవు. అప్పటికి వినియోగంలో ఉన్న డకోటా, స్పిట్ ఫైర్స్ మాత్రమే విన్యాసాల్లో పాల్గొన్నాయి.
మొట్ట మొదటి భారత సైన్యాధిపతి కరియప్ప. ఈయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఎంతో గౌరవం, కీర్తి సంపాదించిన వ్యక్తి.
‘’ఈరోజు నాకు, మీకు, మనతో పాటు మన కుక్కలకు కూడా స్వాతంత్య్రం వచ్చింది’’ అంటూ సైనికాధిపతి కరియప్ప బారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరియప్ప ప్రసంగం. అక్కడివారిలో ఆనందం, ఉత్సా హాన్ని నింపాయి. ఇప్పటికీ నాకు గుర్తే. రిపబ్లిక్ డే సందర్భంగా జామా మసీద్ సమీపంలోని ఓ హోటల్ యజమాని అందరికీ స్వీట్లు పంచాడు. ఆ స్వీట్ల రుచి నాకింకా గుర్తుంది. అవి మహాద్భుతంగా ఉన్నాయి.చాందినీ చౌక్‌ను అందంగా ముస్తాబు చేశారు. వీధుల నిండా ప్రజలు. వారి చేతుల్లో చిన్నచిన్న జాతీయ జెండాలు. వారంతా చాలా ఉత్సా హంగా కనిపించారు. ఎక్కడచూసినా బంతిపూల హారాలు. పూల వ్యాపారులు ఆ ప్రాంతమంతా రోజా పూలను చల్లారు. ఒకరికొకరు పువ్వులు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఆగస్ట్ 15న పురుడుపోసుకున్న స్వతంత్ర భారతం.. 1950, జనవరి 26కు ఓ రూపం తీసుకుందన్న భావన వారిలో స్పష్టంగా కనిపించింది. దిల్లీలో ప్రధాన కూడలి ‘కన్నాట్ ప్లేస్’ను చాలా అందంగా ముస్తాబు చేశారు. నగరంలోని కొన్ని హోటళ్లు, ప్రధాన దుకాణాలు తమ అమ్మకాలపై డిస్కౌంట్లు కూడా ప్రకటించాయి.ఇక ఆ రాత్రి చూడాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలన్నీ దీప కాంతులతో వెలిగిపోయాయి. రాష్ట్రపతి భవన్‌ను కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు.ఎర్రకోట, పార్లమెంట్ భవనం, ఆల్ ఇండియా రేడియో కార్యాలయం, ఇండియా గేట్, అన్నిటి వైభ వాన్ని ఆరోజు చూడాలి. ఆ అందమే వేరు! మరోవైపు, క్లబ్బులు, రెస్టారెంట్లలో పాటలు పాడుతూ..నృత్యాలు చేస్తూ.. ఒకటే కోలాహలం, సంబరం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే!
ఆ కాలంలో జీన్స్ ప్యాంట్లు లేవు. కానీ, పాశ్చాత్య దుస్తుల్లో కనిపించే అందమైన యువతులు క్లబ్బులు, రెస్టారెంట్లలో తళుక్కుమన్నారు. అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఒకట్రెండు చిన్నచిన్న గొడవలూ జరిగాయి. ఎక్కడచూసినా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు గురించే చర్చలు నడిచాయి.జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్ మరెందరో ఆ విందులో పాల్గొన్నారు.చివరగా ఆ రాత్రి జరిగిన ముషాయిరాలు, కవిసమ్మేళనాలతో తొలి రిపబ్లిక్ డే వేడుకలు అలా ముగిశాయి..
(బీబీసీ సౌజన్యంతో..)-జి.ఎన్.వి.సతీష్