‘ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్త అంశం ఏదైనా ఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగ రూపొందించి నేటికి ఒకవందకంటే ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. ఈసంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాం గాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి.చేసిన కొత్త విషయమే మిటంటే మనంరూపొందించిన రాజ్యాం గంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా...
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం గొప్పవిశిష్టత స్థానాన్ని సంతరించు కుంది. 1948, జనవరి నెలలో రాజ్యాంగం తొలిముసాయిదా ప్రతి విడుదలైంది. ఆముసాయిదాకు వివిధ వర్గాల నుంచి,ప్రజల నుంచి7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసం ఘం చర్చిం చింది.1949,నవంబర్ 26న నూతన రాజ్యాం గాన్ని, రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్ 24న 284 మంది రాజ్యాంగపరిషత్ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్స వంగా పరిగణిస్తున్నారు. 1950జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
కొందరు న్యాయమూర్తులు, భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుపకుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల,శాసనాల రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది.అలా 9వషెడ్యూల్లో285ఆయా రాష్ట్రాల, కేంద్రాల చట్టాలను చేర్చడం జరిగింది. జవాబుదా రీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబుదారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టికల్స్‌ను తొలిగించాలి.1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత గణతంత్ర రాజ్యాంగం 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌చే ఆమోదించబడిరది.70 ఏండ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు గురై మార్పు చేర్పులతో సుస్థిరంగా కొనసాగుతున్నది. భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒకే విలువ,ఒకే ఓటు..ప్రాదేశిక నియోజకవర్గాలు,చట్టసభలు, పరి పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనేవి మౌలికాం శాలు.భారత రాజ్యాంగం ఒకఉత్కృష్టమైన గ్రంథం. దీని రచనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వాళ్లంతా మహనీయులు. స్వాతంత్య్ర ఉద్యమంలో కలలుగన్న భవిష్యత్ స్వప్నాలను సాకారం చేయ డానికి భారత రాజ్యాంగం ఒక ప్రతీకగా రూపొం దింది. రాజ్యాంగనిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర, పరిణామం ఉన్నది.1948,జనవరినెలలో రాజ్యాం గం తొలి ముసాయిదా ప్రతి విడుదలైంది. ఆ ముసాయిదాకు వివిధవర్గాల నుంచి, ప్రజల నుంచి 7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసంఘం చర్చించింది.1949, నవంబర్ 26న నూతన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్ 24న 284 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవం బర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తున్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిణా మం: 1919 భారత ప్రభుత్వ చట్టం మాంటేంగ్ చేవ్ ఫర్డ్ అనే పేరుతో అనేక సంస్కరణలకు దారి తీసింది. ఈచట్టంద్వారా ఆంగ్లేయులు మన దేశంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. ఈచట్టం ద్వారా శాసనసభ నిర్మాణంలో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడిరది. తొలిసారిగా కేంద్రంలో ద్విసభా విధానం అమల్లో కి వచ్చింది. దిగువసభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఎగువ సభను కౌన్సిలర్ స్టేట్స్ అని పిలిచేవారు.1919 నాటి చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిషు ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొం దించింది. దీనికితోడు కొన్ని ఇతర కారణాలు కూడా 1935చట్టానికి దోహదం చేశాయి. స్వరాజ్య వాదుల ఉద్యమాలు సైమన్ కమిషన్ నివేదిక పరిణామాలు నెహ్రూ నివేదిక, జిల్లా నివేదిక, గాంధీ ఆధ్వర్యంలో జరిగినశాసనోల్లంఘన ఉద్య మం, రౌండ్‌టేబుల్ సమావేశాల వంటివి ఈ చట్టం చేయడానికి దారి తీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. 1933లోబ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం 1935 భారత ప్రభుత్వ చట్టానికి మూలా ధారం. అప్పటి బ్రిటిష్ ప్రధానిరావ్న్‌సేవ్న్‌కో డొనాల్డ్ 1932 ఆగస్టు 4న జారీ చేసిన కమ్యూనల్ అవార్డు పరిణామం కూడా ఈచట్టానికి కారణంగా భావిం చవచ్చు. ముస్లిం, ముస్లిమేతరులకు ప్రత్యేక నియో జకవర్గాలను కేటాయించారు. ఆక్రమంలో కమ్యూ నల్ అవార్డు పునా ఒప్పందంగామారి ఎస్సీ,ఎస్టీ లకు రిజర్వేషన్లు కొనసాగుతూ వస్తున్నాయి. 19 35లో భారత రాజ్యంగచట్టం రూపొందించ బడిరది. ఎన్నికలు జరిగాయి. 1946లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడిరది. నాటి రాజ్యాంగ పరిషత్‌లో నేటి బంగ్లాదేశ్,పాకిస్థాన్ భూ భాగాలకు చెందినవారూ ఉన్నారు.
1947ఆగస్టు29నాడు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చైర్మన్‌గా ఎన్నుకోబడినారు. ఈకమిటీలో ఏడుగురు సభ్యులున్నారు. వారు..డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,ఎన్.గోపాలస్వామి అయ్యంగార్,అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్,డాక్టర్ కె.ఎన్.మున్షి,సయ్యద్ మహ్మద్,ఎన్.మాధవరావు(బి.ఎల్.మిట్టల్) రాజీ నామా చేయగా ఇతను నియమించబడ్డారు.టి.టి.కృష్ణమాచారి(1948లోడి.పి.ఖైతాన్ మర ణించిన తర్వాత ఇతడు నియమించబడినారు. ఫెడరలిజం సమానత్వం ప్రాతినిధ్యం: 1.ప్రజా ప్రాతినిధ్యం, 2.ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా ప్రాతినిధ్యం,3.పార్టిసిపేటింగ్ ప్రజాస్వా మ్యం, 4.రిప్రెజెంటేటివ్ ప్రజాస్వామ్యం,5.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనాశాఖలు, 6.న్యాయవ్యవస్థ,7.పత్రికాస్వేచ్ఛా, భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా, పత్రికలు. అందువల్ల ప్రజాస్వామ్యంలో మూలస్తం భాలైన మూడిరటిలో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దేశం ఒక సమాఖ్యగా కొనసాగుతుంది. దీన్ని సరిగ్గా ఆచరిస్తే స్వేచ్ఛా సమానత్వం, అందరికీ సమానావకాశాలు అందించే ఫెడరలిజం, కేంద్రీ కృత పరిపాలన చక్కగా ఏకకా లంలో కొనసాగుతాయి. ప్రస్తుతం చట్టసభలకు ప్రాదేశిక నియోజకవర్గాలుగా ప్రతినిధులున్నారు. పరిపాలనా యంత్రాంగంలో కూడా ఐఏఎస్ మొదలుకొని నాన్ గెజిటెడ్ అధికారి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రకారం ఉద్యోగులు,అధికారులు ఎన్నికయ్యే వ్యవస్థ ను అమలు జరుపుకోవాలి. న్యాయవ్యవస్థలో కూడా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ద్వారా ఎంపిక జరుగాలి. అలాగే ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా పారిశ్రా మికీకరణ,అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి. పరి పానాధికారం యంత్రాంగంతో నియామకాలు, న్యాయవ్యవస్థలో నియామకాలు, ప్రాదేశిక నియోజక వర్గాలవారీగా జరుగడం అవసరం. నీట్ పరీక్ష వలె అఖిల భారతస్థాయిలో పరీక్షలు నిర్వహించి, స్థానికత ఆధారంగా నియామకాలు,ఎంపిక చేయా కొందరు న్యాయమూర్తులు,భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుప కుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల, శాసనాల రక్షణచర్యలు చేపట్టడం జరిగింది. అలా9వషెడ్యూల్లో 285 ఆయారాష్ట్రాల,కేంద్రాల చట్టా లను చేర్చడం జరిగింది. జవాబుదారీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబు దారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టి కల్స్‌ను తొలిగించాలి. ఉత్కృష్టమైన ఈభారత రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులందరి కర్తవ్యం.భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్.అంబే ద్కర్ రాజ్యాంగం గురించి ఇలా అంటారు. ‘ప్రపం చ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్తఅంశం ఏదైనాఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగం రూపొం దించి నేటికి ఒక వందకంటే ఎక్కువ సంవ త్సరాలు గడిచాయి. ఈ సంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాంగాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. చేసిన కొత్త విషయమే మిటంటే మనం రూపొందించిన రాజ్యాంగంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. రాజ్యాంగమే సుప్రీం
విభిన్న జాతులు,సంస్కృతులు, ప్రాం తాలు, మతాలు,కులాలు,భాషలసంక్లిష్ట సమాజం భారత దేశం. ఏదో ఒకఅంశంలో ఎపుడూ కేంద్రం తో రాష్ట్రాలు ఏదో ఒక ఘర్షణకు దిగుతుంటాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, రాష్ట్రాలు ఎదురుతిరిగేందుకు అవకాశం లేకుండా రాజ్యాంగంలోనే పకడ్బందీ ఆంక్షలు కూడా పొందుపరిచారు. ముందుగా రాష్టప్రతి, గవర్నర్ అనుమతి లేకున్నా శాసనం చెల్లుబాటు అయ్యే అవకాశం అధికరణం 255లో ఉంది.. అంతే కాదు అధికరణం 256లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, 257లో రాష్ట్రాలపై కేంద్రం నియం త్రణ గురించి కూడా ఉంది. జీఎస్‌టీ అమలు చేయాలని అప్పట్లో కేంద్రం నిర్ణయిస్తే చాలా రాష్ట్రాలు తొలుత వ్యతిరేకించాయి, తర్వాత అన్ని రాష్ట్రాలు గాడిలో పడ్డాయంటే దానికి కారణం రాజ్యాంగంలో సంలీనంగా ఉన్న ఆదేశ సూత్రాలే ననేది సుస్పష్టం. స్వాతంత్య్రాన్ని సాధించి, ప్రజా స్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతర ప్రజాస్వామిక దేశాలను అనుసరించి మన నాయకులు, పాలకులు దేశానికి చక్కని రాజ్యాం గాన్ని రూపొందించారు. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం. ప్రభుత్వానికి మూలచట్టం. అందు కే రాజ్యాంగ నిర్మాతలు ఆచర ణాత్మకమైన, సలక్షణ మైన రాజ్యాంగాన్ని నిర్మించ డమే ధ్యేయంగా పెట్టు కుని ప్రపంచంలోని ప్రజా స్వామిక రాజ్యాంగాలను అన్నింటినీ అధ్యయనంచేసి వాటిలో మన దేశ పరిస్థితుకు సరిపడే అంశాలను జోడిరచి వాటిని మన రాజ్యాంగంలో తగిన చోట పొందుపరిచారు.
అనేక దేశాల సంప్రదాయాలు
ఏక పౌరసత్వాన్ని, పార్లమెంటరీ విధా నాన్ని,స్పీకర్ పదవిని బ్రిటన్ నుండి,ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం అమెరికా రాజ్యాంగం నుండి, ఆదేశిక సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల వివరా లను ఐర్లాండ్ నుండి, ప్రాథమిక విధులను రష్యా నుండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుండి, అత్యవసర పరిస్థితిని వైమర్(జర్మనీ)నుండి ఉమ్మడి జాబితా,పీఠికలో వాడినభాషను ఆస్ట్రేలియా నుండి, గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్‌నుండి దత్తత తీసు కున్నారు.
ప్రవేశికే హృదయం
రాజ్యాంగం తొలి పుటలోనే ప్రస్తావన ఉంటుంది.‘‘భారతదేశ ప్రజలైన మేము..1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఈభారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకుంటున్నాం…ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రజా స్వామిక గణతంత్రంగా ప్రకటిస్తున్నాం, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కింది సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది- సామా జిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ,నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశ సమైక్య తను, అఖండతాభావాన్ని , సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం కొసం ఈ రాజ్యాం గాన్ని సమర్పించుకుంటున్నాం’’ అని పేర్కొని ఉంటుంది. మొత్తం రాజ్యాంగాన్ని రంగరించి, వడపోస్తే వచ్చే వ్యాఖ్యలివి. ఇందులో అర్థం మొత్తం ఉంది.
నందాలాల్ బోస్ స్వీయ లిఖిత గ్రంథం
రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజలు తమకు తామే సమర్పించు కున్న దరిమిలా విశ్వభారతిలోని శాంతినికేతన్ కళాకారులు ప్రముఖ చిత్రకారుడు నందాలాల్ బోస్ నేతృత్వంలో చక్కనిరాతప్రతిని సిద్ధంచేశారు. రాష్ట ప్రతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రధాన జవహర్ లాల్ నెహ్రూ మొదలైన ఆనాటి నేతలు ఆ ప్రతిపై తమ చేతిరాతతో సంతకాలు చేశారు.
ఘనకీర్తి
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని, తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం, ప్రభుత్వానికి మూల చట్టం.
వ్యక్తుల్లో ఆదర్శాలుండాలి
రాజ్యాంగ లక్ష్యాల ప్రాశస్త్యం అనేది దానిని అమలుచేసే పాలనావ్యవస్థల మీద, అంటే అమలుచేసే మనుష్యుల మీద ఆధారపడి ఉం టుంది. ఈవిషయాన్ని డాక్టర్ అంబేద్కర్, పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అనేక మార్లు నొక్కి వక్కాణించారు. ఈ నూతన రాజ్యాం గం కింద పరిస్థితులు వక్రమార్గం తొక్కాయంటే ఆ అపరాధం రాజ్యాంగానిది కాదు, రాజ్యాంగాన్ని అమలుచేసే వ్యక్తుల వల్ల మాత్రమేనని అంబేద్కర్ పేర్కొన్నారు. రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే అది నవనవోన్మేషంగా ఉండాలి. దేశ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా వొదిగేదిగా ఉండా లి. సరళంగా ఉండాలి. మార్పులకు సిద్ధంగా ఉండాలి. సమాజ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాజ్యాంగం కూడా మారాలి. తగిన మార్పులకు సిద్ధంగా ఉండాలని ఆనాడే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్ణయసభ సమాపక సమావేశంలో సభాధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రసం గిస్తూ ‘‘రాజ్యాంగం అనేది ఎలాఉన్నా..అది దేశాన్ని పాలించే వ్యక్తులపై, దాన్ని పాలించే తీరుతెన్నులపై ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఆ వ్యక్తులు నిజాయితీపరులై ఉండాలి.. వారికి దేశ ప్రయోజనాలు తప్ప మరో యావఉండరాదు’’ అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. భారతదేశానికి దివ్యమైన భవిష్యత్‌ను అందించేందుకు, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను సాక్షాత్కారం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆదిశలోనే ప్రభుత్వాలు కదలాలనీ,కదులు తాయని..సగటు భారతీయుడి ఆశ.
రాజ్యాంగం ఆసక్తికర సంగతులు
1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు చేశారు.
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడిరది. దీనికి అంబేడ్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రధాన కమిటీతో పాటు, కొన్నిఉప కమిటీలు ఏర్పడ్డాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదే.
రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్‌జాదా..ఇటాలిక్ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు,22 భాగాలుగా ఉంది.
రాజ్యాంగం మూల ప్రతులను దిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో చూడొచ్చు. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు.
మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్’ అని సరదాగా అంటారు. జపాన్, ఐర్లాండ్ ఇంగ్లండ్, యూఎస్‌ఏ, ఫ్రాన్స్.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాల్ని తీసుకున్నాం కాబట్టే ఆ విధంగా పిలుస్తారు. రాజ్యాంగం రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది. ఈ తేదీనే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటాం. మరో రెండు నెలల తర్వాత అంటే..1950, జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
ఏడు దశాబ్దాల రాజ్యాంగం… అందించిన ప్రజాస్వామ్యం
వందకోట్ల మందికి ఆమోద యోగ్యంగా వుండే పాలనా వ్యవస్థను రూపొందించడం అంత సులభం కాదు.అంతేకాదు..దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి కొన్ని చట్టాలు,వాటికి కొన్ని సవరణలూ తప్ప నిసరి..భారత దేశ స్థితి గతులను సమున్నతంగా మార్చేసిన కొన్నికీలక చట్టాలు,వారి సవరణల నొకసారి చూద్దాం..ఈ70ఏళ్లలో కాలానికను గుణంగా మనం ఎన్నో చట్టాలను రూపొందిం చుకున్నాం.. ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని సవరించు కున్నాం. కొన్ని చట్టాలు దేశ గతినే మలుపు తిప్పితే..మరికొన్ని వివాదాస్పదం కూడా అయ్యా యి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 నెలలకే మొదటి సవరణ జరిగింది. ఈసవరణద్వారా భూ సంస్కరణలకు ఎలాంటి సవాళ్లు ఎదురు కాకుండా దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చారు. దీంతో రాష్ట్రప్రభుత్వాలు చేసిన ఎన్నో భూ చట్టాలకు ఇది రక్షణ కవచంలా నిలి చింది.ఒకటే బాణం..ఒకటే భార్య..ఇది శ్రీరాముడి విధా నమే కాదు..కోట్లాది భారతీయుల మనోగతం కూడా..హిందూ సంప్రదాయం..హిందూ సంస్కృతి సంప్ర దాయాలను కాపాడుకోవడానికి 1955లో హిందూ వివాహ చట్టాన్ని రూపొందించారు. ఈచట్టం ద్వారా బహుభార్యాత్వం రద్ద వడమే కా కుండా..మహిళల రక్షణకోసం విడాకుల భావ నను కూడా ప్రవేశపెట్టారు.ఇక 1986లోవచ్చిన ముస్లిం మహిళ విడాకు హక్కుల రక్షణ చట్టాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దేశంలో అప్పట్లో తలెత్తిన మత హింసకు ఈచట్టమే దోహదం చేసిం దని కొందరు కారాలు మిరియాలు నూరితే.. ముస్లిం ఛాంద సవాదుల్ని సంతృప్తి పరచడం కోసమే దానిని తెచ్చి నట్టు మరికొందరు మండిపడ్డారు. ఇక సామాజిక రుగ్మతైన అంటరానితనాన్ని తరిమి వేయడానికి మన ప్రభుత్వానికి అయిదేళ్లు పెట్టింది. అంటరాని తనాన్ని నేరంగా ప్రకటిస్తూ 1955లో చట్టాన్ని చేశారు. దేశంలోభాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం అప్పట్లో ఊపందుకుంది. దీంతో 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశాన్ని 14 రాష్ట్రాలు,7కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిం చారు. తెలుగు, మళయాళీ, కన్నడీ గులకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ప్రపం చంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.ప్రపంచంలో మరెక్క డాలేనన్ని రాజకీయ పార్టీ లున్న దేశం కూడా మనదే..1980వ దశకం భారత రాజకీ యాల్లో అనారోగ్యకర ధోరణులకు బీజం పడిన సమయం..అధికార కాంక్షకు తోడు ఆయారాం,గయారాం సంస్కృతి పెచ్చరిల్లిన తరుణమూ అదే..దీని నియం త్రణ కోసమే ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది.ఆమ్‌ఆద్మీ..ఈనినాదంతో అధికారం లోకొచ్చిన..యుపి ఏగ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేసి నిరుద్యోగాన్ని,ఆకలి కేకలను రూపుమాపాలని తలపెట్టింది. అన్నదే తడవుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసింది. గ్రామీణ భారతావని రూపు రేఖలను సమున్నతంగా మార్చేసిన చట్టమది. సామా న్యుడి చేతిలో వజ్రా యుధం సమాచార హక్కు చట్టం..ప్రభుత్వ పాలనపై ఇదో డేగ కళ్ల పహారా.. అవినీతి, రెడ్ టేపి జం వేళ్లూనిన మన సమాజంలో తప్పు చేసిన అధికారి ఎంత పెద్ద వాడైనా నిలదీసే హక్కుని ఈచట్టం కల్పిస్తోంది.అంతేనా గతి తప్పి నడు చుకునే అధికారులపై కొరడా రaళిపిం చడానికీ ఈ చట్టం ఉపయోగపడు తోంది.
రాజ్యాంగమే రాచబాట
భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే రాచబాటని సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి పేర్కొన్నారు.72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ పట్నంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎండాడ ఎస్సీకాలనీ,జిల్లా పరిషత్,ఉన్నత పాఠశాలల్లో విద్యార్ధులకు రాజ్యాంగం`విలువలు అనే అంశంపై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంతో విశిష్టతను సంతరించుకుందని పేర్కొన్నారు. విద్యార్ధులంతా సమానత్వభావన కలిగి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలు,వారి సిద్దాంతాలను స్పూర్తిగా తీసుకుని విద్యావంతులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.న్యాయ,సాంఘిక,ఆర్థిక,రాజకీయ, స్వేచ్ఛా భావన,భావప్రకటన,నమ్మకం,విశ్వాసం,గౌరవం,సమానత్వం,అవకాశాలను పెంచుట.. సౌభ్రాతృ త్వం,వ్యక్తి హోదా,జాతిఐక్యత, సమగ్రతను పెంపొందించుటే రాజ్యంగం ఉద్దేశమని సూచించారు. దీన్ని గౌరవించడం మన అందరి కర్తవ్యమని పిలుపు నిచ్చారు.అంబేద్కర్ చెప్పినట్లుగా దేశం అభివృద్ధి చెందడ మంటే,అద్దాల మేడలు,రంగుల గోడలు కాదు..పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధిని పేర్కొన్నారని గుర్తిచేశారు.స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు,తెగలు,దళితులు,గిరిజనులు,వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడిరది. ప్రభుత్వ విధివిధానాలు,శాసనసభల రూపకల్పనతోపాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారని విద్యార్థులకు వివరించారు.-గునపర్తి సైమన్
Related