రాజకీయ తీర్పులు తర్వాత రాజ్యాంగ తీర్పులు

లోక్‌సభకూ ఎ.పి తో సహా నాలుగు శాసనసభలకూ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వాలు కొలువు తీరాయి.అప్రతిహతంగా సాగి పోతుందను కున్న నరేంద్ర మోడీ హవాకు బ్రేకులు వేశారు ఓటర్లు. మిశ్రమ కూటమిగానే ఆయన అధికారం చేపట్ట వలసి వచ్చింది. మోడీ సర్కారు ఏకపక్ష పోకడలకు ఇకనైనా కొంత పగ్గాలు పడతా యని ప్రజాస్వామిక లౌకిక వాదులు ఎదురు చూస్తున్నారు. ప్రజా న్యాయ స్థానంలో పరిస్థితి ఇదైతే రాజ్యాంగ న్యాయస్థానాల్లో అంటే న్యాయ వ్యవస్థలో ఏమైనా మార్పులు రావడా నికి ఇది దారితీస్తుందా అనే చర్చ న్యాయవర్గాల్లో సాగుతున్నది. ఎందుకంటే సంపూర్ణమైన ఆధిక్యత లేదంటే అంతకు మించిన సంఖ్యాబలం కలిగిన ఏక పార్టీ ప్రభుత్వాలు వున్నప్పుడు న్యాయవ్యవస్థ ఒకింత ఆలోచించి అడుగు వేస్తుందనేది ఇన్నేళ్ల అనుభవం. నిజానికి రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పటికీ రాజకీయ వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని ఇలా జరుగుతుంటుందని అంటుంటారు.
వివాదాలు, ఆరోపణలు
రాజ్యాంగ సంబంధమైన అంశా లలో కూడా సుప్రీం కోర్టు తీర్పులు, ఆదేశాలు, ఆలస్యాలు రకరకాల వ్యాఖ్యలకు విమర్శలకు దారితీశాయి.తెలుగు రాష్ట్రాలలోనూ వేర్వేరు ప్రభుత్వాలు,ముఖ్యమంత్రులు తమ తమ అను కూలతలను బట్టి కోర్టులపై వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయమే.కేరళ,పశ్చిమబెంగాల్‌, కర్ణా టక,ఢల్లీి,మహారాష్ట్ర,గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, తమి ళనాడు వంటి రాష్ట్రాలలోనూ కోర్టులపై వివాదా స్పద సన్నివేశాలు చూశాం. 1991-1996 మధ్య కాంగ్రెస్‌ మెజార్టీ కోల్పోయిన పరిస్థితి. తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం వున్నప్పుడే న్యాయ వ్యవస్థ క్రియాశీలత వంటి పదాలు ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. మాజీ ప్రధాని పి.వి.నర సింహారావును కూడా విచారించిన ఘట్టం అప్పుడే చూశాం. మళ్లీ 2004-14మధ్య మన్మోహన్‌ సింగ్‌ హయాంలో మరీ ముఖ్యంగా మలి దఫా పాలనలో 2జి స్ప్రెక్ట్రం,బొగ్గు గనుల వేలం,కామన్‌వెల్త్‌ క్రీడ లు ప్రతిదీ సుప్రీం కోర్టు ముందుకు రావడం దేశ రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపింది. అదే మోడీ హయాంలో రాఫెల్‌ కుంభకోణం వంటివి కూడా కోర్టులలో తేలిపోయాయి. అయోధ్య తీర్పు, శబరిమల వివాదం,కాశ్మీర్‌ 370అధికరణం ప్రతి పత్తి, పౌరసత్వ సవరణ చట్టం, ఇవిఎంలు, ఎన్ని కల బాండ్లు ఇంకా అనేక అంశాల్లో అత్యున్నత న్యాయస్థానం తీరు అసంతృప్తి మిగిల్చింది. రాజ కీయ నేతలు,మీడియా ప్రముఖులు,సామాజిక కార్యకర్తలు, ఆఖరుకు ముఖ్యమంత్రుల వంటి వారిపై కేసులలోనూ భిన్న ప్రమాణాలు పాటించ డం ప్రశ్నార్థకమైంది.సుప్రీంకోర్టు ప్రధాన నాయ మూర్తులు,ఇతర న్యాయమూర్తులు కూడా పదవు లలో పునరావాసం పొందిన తీరు మరో వివాద మైంది.ఈ నేపథ్యంలో బిజెపికి స్వంతంగా మెజార్టీ లేని ప్రస్తుత పరిస్థితి న్యాయవ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఇది ఇప్పుడు, అనేక మంది ని ఆలోచింపచేస్తున్న అంశం. సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ స్వయంగా ఈ మాటన్నారు. బలమైన కార్యని ర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‌) వుంటే న్యాయ వ్యవస్థ గట్టి వైఖరితీసుకోవడానికి కాస్త తటపటా యిస్తుందని ఆయన అన్నారు.
సిజెఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యలు
సిజెఐ చంద్రచూడ్‌ పదవీ కాలం ఈ నవంబర్‌ నెలతో ముగుస్తుంది.ఇటీవలి కాలంలో అత్యధిక కాలం పదవిలో వుంటున్న సిజెఐ ఆయనే. స్వలింగ వివాహాల వంటి సామా జి కాంశాల్లో సంచలన తీర్పులకు ఆధ్వర్యం వహించిన సిజెఐ చంద్రచూడ్‌ రాజకీయ రాజ్యాంగ అంశాల్లో ఒక విధంగా%ౌ%మిశ్రమ వ్యాఖ్యలే మూటకట్టుకున్నారు. ఎన్నికల బాండ్లపై వెలువడిన తీర్పు ఇటీవలి కాలంలో ప్రత్యేకించి చెప్పుకోవాలి. నవంబర్‌ రెండవ వారంలో పదవీ విరమణ చేసే ముందు ఆయన ఆరు రాజ్యాంగ సమస్యలపైతీర్పులు ఇవ్వాల్సి వుంటుంది. సిజెఐ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనాల ముందున్న తీర్పులు వాయిదా పడితే మళ్లీ కొత్త వారు రావ డం,వీటిని పునర్వ్యవస్థీకరించడం పెద్ద ప్రక్రియ. ఆలస్యానికి దారితీయొచ్చు. అందుకే వేగంగా పూర్తి చేస్తుంటారు.
ఎస్‌.సి, ఎస్‌.టి మైనార్టీ ప్రతిపత్తి
రాజ్యాంగం 16వ అధికరణం కింద వున్న ఎస్‌.సి, ఎస్‌.టి రిజర్వేషన్లలో వర్గీక రణ ఉప వర్గీకరణ చెల్లుతుందా అనే అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరిలో విచా రించింది.2010లో పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు 2004 ఎ.పి వర్గీకరణ అంశంలో ఇచ్చిన తీర్పుతర్వాత పంజాబ్‌ విధా నం అమలు కాకుండా పోయింది. అయితే ఈ విధంగా కొట్టివేయడం ఇందిరా సహానీ కేసులో 1992లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు విరుద్ధమని పంజాబ్‌ వాదిస్తున్నది. ఆ కేసు తర్వాత చిన్నయ్య కేసులో సుప్రీం కోర్టు ఉప వర్గీకరణ కుదరదని చెప్పింది. ఇప్పుడు దీనిపై తుది తీర్పు వెలువడవలసి వుంది.
ప్రతిష్టాత్మక అలీగఢ్‌ ముస్లిం యూని వర్సిటీ (ఎ.ఎం.యు) రాజ్యాంగం 30వ అధిక రణం ప్రకారం మైనార్టీ సంస్థ కిందకు వస్తుందా లేదా అనే అంశంలోనూ సుప్రీంకోర్టు తీర్పు వెలు వరించాల్సి వుంది.2006లో అలహాబాద్‌ హైకోర్టు మైనార్టీ ప్రతిపత్తి కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును ఎ.ఎం.యు సుప్రీంలో సవాలు చేసింది. తమ మైనార్టీ ప్రతిపత్తికి ముప్పు తెచ్చేలా ఎ.ఎం.యు చట్టానికి చేసిన వివిధ సవరణలు చెల్లవని వాదిం చింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రంజన్‌ గొగోరు సిజెఐగా వుండ గా ఈ కేసును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మా సనానికి అప్పగించారు.ఫిబ్రవరిలో ఈ కేసు విచా రణ ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వులో వుంచింది.ఈకేసులో తీర్పు దేశవ్యాపితంగా మైనార్టీ సంస్థల హక్కులకు సంబంధించి చాలా ప్రభావం చూపనుంది.
ఆస్తుల పున:పంపిణీ తప్పా?
మూడో కేసుకు మరింత కీలకమైన రాజకీయ ప్రాధాన్యత వుంది. నిజానికి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దాన్ని వివాదాస్పదం చేశారు కూడా. సంపద పున:పంపిణీ జరగాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక దశలో మతం రంగు కూడా పులిమా రు. వాస్తవం ఏమంటే రాజ్యాంగం 39వ అధికర ణం సమాజ భౌతిక వనరులను సమిష్టి ప్రయో జనం కోసం ఉపయోగించాలని చెబుతున్నది. సమాజ భౌతిక వనరులను ఉమ్మడి ప్రయోజనం కోసం పున:పంపిణీ చేయాలని ఈ అధికరణం(బి) పేర్కొంటున్నది. అయితే వ్యక్తిగత ఆస్తిని సమాజా నికి చెందిన భౌతిక సంపదగా పరిగణించవచ్చునా అనే అంశంపై సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. ముంబయిలోని ఆస్తియజమా నుల సంఘం పేరుతో20 వేలమంది భూయజ మానులు 1991లో మొదటి పిటిషన్‌ వేశారు. కొన్ని ఆస్తులను తీసుకోవచ్చునని మహారాష్ట్ర శాసనసభ చేసిన సవరణను వారు సవాల్‌ చేశారు. ఇదిలా వుండగానే 2019లో మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వమే గృహ చట్టానికి సవరణ చేస్తూ నిర్ణీత గడువు లోపల ఆస్తి యజమానులు గనక ఆస్తిని పునరుద్ధరించకపోతే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చని నిర్ణయించింది.ఈ సవరణవల్ల నివాస గృహ సముదాయాలను హస్తగతం చేసు కోవడానికి మహారాష్ట్ర భవన మరమ్మతులు పునరు ద్ధరణ బోర్డుకు నిర్నిబంధమైన అధికారాలు సంక్రమిస్తాయంటూ వారు ఆరోపించారు. ప్రైవేటు ఆస్తులు నిజంగా39(ఎ) అధికరణం కింద పున: పంపిణీ చేయడానికి అవకాశం వుంటుందా అనే అంశంపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వుంది. ఇక్కడ మౌలికమైన అంశం ఏమంటే రాజ్యాంగం సంక్షేమరాజ్య భావనలో ఆర్థిక అసమానతల తొలగింపు కీలకాంశం. మోడీ వంటి వారు మాత్రం ఇదేదో వ్యక్తి గత ఆస్తి హక్కుకు భంగకరమన్నట్టు ప్రచారం చేసి అదరగొట్టడానికి ప్రయత్నించారు. మన దేశంలో కూడా ఇటీవలి వరకూ ఈ సంపద పన్ను, వారసత్వ ఆస్తి పన్ను వుండేవి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ముంబయి కేసుకే గాక దేశ విధానాలకే గీటురాయి కానుంది.
గనులు, ఆల్కహాలు
ఇక మిగిలిన రెండు రాజ్యాంగ కేసులు రాష్ట్ర కేంద్ర హక్కులకు ఆదాయాలకు సంబంధిం చినవి.పారిశ్రామిక ఆల్కహాలు,మద్యపానం ఆల్క హాలు పరిధి గురించిన చర్చ ఇది. పారిశ్రామిక ఆల్కహాలుపై నియంత్రణ ఎవరిదనేది ప్రశ్న, ఇవి రెండూ స్పిరిట్‌ నుంచే తయారవుతాయి. మరిన్ని రసాయన ప్రక్రియల తర్వాత అది పారిశ్రామిక ఆల్కహాలుగా మారుతుంది. ఏడవ షెడ్యూలులో ఈ రెంటినీ వుంచడం పరస్పర విరుద్ధ వ్యాఖ్యానా లకు దారితీస్తున్నది. ప్రజా క్షేమం రీత్యా పరిశ్ర మలపై నియంత్రణ కలిగివుండే హక్కు కేంద్రానికి వుంది. మరోవైపున ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే విష పదార్థాలను నియంత్రణ రాష్ట్ర అధికారంగా వుంది.దాంతో ఎవరు అదుపు చేయా లనేదానిపై వివాదం కొనసాగుతున్నది. సిజెఐ చంద్రచూడ్‌ ధర్మాసనం దీన్ని విచారించి తేల్చ వలసి వుంది.గనుల నుంచి లోహాల తవ్వకంపై చెల్లించే రాయల్టీ పన్ను కిందకు వస్తుందా అనేది కూడా25 ఏళ్ల కాలంగా వివాదంగా వుంది.గనులు లోహాల చట్టం సెక్షన్‌9 వాటిని తవ్వుకునేవారు కేంద్రానికి రాయల్టీ చెల్లించాలని నిర్దేశిస్తుంది. దాన్ని గనక పన్నుగా పరిగణించేట్టయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనపు పన్ను విధించవచ్చు. 1963లో తమిళనాడు ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌పై రాయల్టీగాక అదనపు పన్ను విధించడంతో ఈ వివాదం మొదలైంది. దాని మీద వరసగా విచారణలు జరిపిన అనంతరం 1989లో సుప్రీంకోర్టు రాయల్టీ ఒక పన్ను అని నిర్ధారించింది. ఈ నిర్ణయం గనుల కాంట్రాక్టర్లకు పారిశ్రామిక వేత్తలకు మింగుడు పడలేదు.వారు అనేక హైకోర్టులలోనూ సుప్రీం లోనూ సవాలు చేయగా అదేదో అనుకోకుండా జరిగిన అచ్చు తప్పు వంటిదని అభిప్రాయం వెలిబుచ్చాయి. అదనపు పన్నును గురించి మాత్రమే కోర్టు పరిశీ లించింది తప్ప రాయల్టీని ఉద్దేశించి తీర్పు చెప్ప లేదని వివిధ కోర్టులు వ్యాఖ్యానించాయి. ఇది పన్ను అని తేలిస్తే రాష్ట్రాలు దాన్ని పెంచి ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుంది. అసలే వనరుల కొరతతో ఇబ్బంది పడే రాష్ట్ర ప్రభుత్వాలకు కాస్త వెసులుబాటు దక్కుతుంది. కొంతకాలం కిందట దీనిపై విచారణ జరిపిన తొమ్మిది మంది ధర్మాస నం తీర్పు రిజర్వు చేసి వుంచింది.
మరింత జఠిలం
వీటన్నిటిపై ప్రజాస్వామిక పరిష్కా రాలు వస్తాయా అని ఎదురు చూస్తుంటే పులి మీద పుట్రలా కొత్త వివాదాలు బయలుదేరాయి. ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను లిక్కర్‌ కేసులో కింద కోర్టు బెయిలుపై విడుదల చేస్తే ఢల్లీి హైకోర్టు విడుదల ఆపింది. కానీ పోస్కో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎడియూరప్పను అరెస్టు చేయాలని కింద కోర్టు ఉత్తర్వులిస్తే మాజీ ముఖ్య మంత్రి విషయంలో అలా ఎలా చెప్తారని హైకోర్టు ఆపేసింది. ఈ ద్వంద్వ నీతిని న్యాయ నిపుణులు తీవ్రంగా ప్రశ్నించారు. లోక్‌సభ ఫలితాలు వచ్చా కనే ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌%ౌ%ప్రముఖ రచ యిత్రి అరుంధతీ రారుపై రాజద్రోహ నేరారోపణ విచారణ జరపాలని అనుమతినివ్వడం కూడా నిరసనకు గురైంది. నేర చట్టాలను ఇష్టానుసారం మార్చి అమలుకోసం హడావుడి పడటం కూడా ఆక్షేపణకు దారి తీస్తున్నది. అందుకే రానున్న రోజుల్లో ఈ అంశాలు దేశంలో మరింత చర్చనీయం కానున్నాయి. కార్యాచరణకూ దారితీస్తాయి.
(వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు ప్రజాశక్తి సౌజన్యంతో..)

పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంభవిస్తున్న వాతావరణ ఉష్ణోగ్రతల్లో పెనుమార్పులు సంభవిస్తూ మానవ మనుగడకు విఘాతం కలుగుతోంది.ముఖ్యంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు పెరిగి సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుపోయారు.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది.చాలా ప్రాంతాల్లో 45డిగ్రీల కంటే ఎక్కువఉష్ణోగ్రత నమోదయిందని ఐదు రాష్ట్రాలకు వాతావరణశాఖ వెల్లడిరచిది. ఏప్రిల్‌, మే,జూన్‌ నెలల్లో వడదెబ్బ తగిలి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలను విన్నాం.ఢల్లీిలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి.ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా52.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై వడదెబ్బ కేసులు పెరిగాయి.వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు.
కేవలం భారత్‌లోనే కాకుండా..ప్రపంచదేశాల్లో గతజూన్‌లో దాదాపు 5బిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన వేడినిభరించారు.భారతదేశంలో 619 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.యుఎస్‌లోని ఓస్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన కొత్తవిశ్లేషణ ప్రకారం,జూన్‌లో తొమ్మిదిరోజులపాటు భారతదేశంనుండి 619మిలియన్ల మందితో సహా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు వాతావరణ మార్పు-ఆధారిత విపరీతమైన వేడిని అనుభవించారని పేర్కొంది.క్లైమేట్‌ సెంట్రల్‌ నివేదిక ప్రకారం జూన్‌లో పొక్కులు వచ్చే వేడి భారతదేశంలో 619 మిలియన్లు, చైనాలో 579 మిలియన్లు, ఇండోనేషియాలో 231 మిలియన్లు, నైజీరియాలో 206మిలియన్లు, బ్రెజిల్‌లో 176మిలియన్లు,బంగ్లాదేశ్‌లో 171 మిలియన్లు, యుఎస్‌లో 165మిలియన్లు, ఐరోపాలో 152మిలియన్లు, మెక్సికోలో 123మిలియన్లు, ఇథియోపియాలో 121 మిలియన్లు మరియు ఈజిప్టులో103మిలియన్లు.ఈవిధంగా ప్రపంచ జనాభాలో 60శాతానికి పైగా ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు. ఇదిజూన్‌16-24 మధ్య వాతావరణ మార్పులవల్ల కనీసం మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని క్లైమేట్‌ సెంట్రల్‌లోని చీఫ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఆండ్రూ పెర్షింగ్‌ వెల్లడిరచారు.ఒకశతాబ్దానికి పైగా బొగ్గు,చమురు,సహజ వాయువులను కాల్చడంవల్ల మనకు పెరుగుతున్న ప్రమాదకరమైన ప్రపంచాన్ని అందించిందని అభిప్రాయపడ్డారు.
అయితే ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో సంభవించ వచ్చని సమత గతమూడు దశాబ్దాల నుంచి గుర్తిచేస్తూనే ఉంది.వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమత ఉహించినట్లుగానే వాతావరణంలో సంభవిస్తున్న పెనుసవాల్‌ను నేడుప్రపంచదేశాల ప్రజలు ఎదు ర్కొంటున్నారు.ఈవేసవిలో ప్రపంచవ్యాప్తంగా వేడితరంగాలు అసహజ విపత్తులు ఉద్భవించాయి.
దేశంలోని దాదాపు 40శాతం ఏప్రిల్‌ నుండి జూన్‌ మధ్యకాలంలో సాధారణం కంటే రెట్టింపు హీట్‌వేవ్‌ రోజులను నమోదు అయ్యాంది. దేశంలోని కొన్ని నగరాలు 50 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి.పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నియంత్రణపై ప్రపంచదేశాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వయంత్రాంగంపై ఉంది.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సైతం భాగస్వాములు కావాలి.బహుళజాతి కంపెనీల నియంత్రణపై చర్యలు చేపట్టాలి.దీనికి సమాఖ్యతభావంతో పోరాడినప్పుడే వాతావరణ మార్పులుపై సమూలమైన మార్పులు తీసుకురాగలం. -రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

పోలవరం దారెటు..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకంగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టుపై టిడిపి కూటమి ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలో నిర్వాసితుల పరిహారం, పునరావాసానికి ప్రాధాన్యమివ్వకపోవడం ఆందోళనకర విషయం. రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షల మంది నిర్వాసితుల గురించి సర్కారు పొడిపొడి మాటలతో దాటవేయడం అమా నవీయం.జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల పునరావాసంపై పదేళ్లుగా దోబూచులాడుతున్న, నిధులివ్వకుండా తాత్సారం చేసిన, ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క మాట శ్వేత పత్రంలో ఉదహరించకపోవడం సరికాదు. ఒక వైపు తప్పులు చేసిన మోడీ ప్రభుత్వాన్ని కాపాడుతూ మరోవైపు గత వైసిపి ప్రభుత్వ ప్రమాదకర ధోరణులను ఎత్తిచూపి, అంతకు ముందు తన హయాంలో అద్భుతాలు చేశామని పేర్కొన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉండి, తనపై కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆధారపడ్డ స్థితిలో కూడా కేంద్రం నుంచి నిధులు సాధి స్తామనికానీ, గట్టిగా నిధులు అడుగుతా మనికానీ శ్వేతపత్రంలో కనీసమాత్రమైనా ముఖ్యమంత్రి చెప్పలేదు. టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలూ పోలవరం అంటే డ్యామ్‌ నిర్మాణం, ఇతర సివిల్‌ పనులుగా చూశాయే తప్ప ప్రాజెక్టు కోసం ఊళ్లూ, ఇళ్లు, భూములు త్యజించిన నిర్వాసితుల గోడు పట్టించుకోలేదు. రిజర్వాయర్‌ వలన లక్షా ఆరు వేల కుటుం బాలు మునుగుతాయని ఎప్పుడో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన 2005లో అంచనా వేశారు. రెండు దశాబ్దాల అనంతరం సామాజిక ఆర్థిక సర్వే పేరిట ముంపు కుటుంబాలను 96 వేలకు కుదించినట్లు శ్వేతపత్రంలో వెల్లడిరచారు. ఎగువ కాఫర్‌ డ్యాం కట్టాక కొద్దిపాటి వరదలొస్తే చాలు కాంటూరు సర్వేల కంటే అదనపు ప్రాంతాలు మునుగుతున్నాయి. ఇంకోవైపు ఈ ఇరవై ఏళ్ల కాలంలో జనాభా పెరిగింది.18 ఏళ్లు నిండిన వారూ పెరిగారు. జనాభా, కుటుంబాలు పెరుగుతుండగా, నిర్వాసితులయ్యే కుటుంబాలను తగ్గించడం వెనకున్న మర్మం ఏమిటో అర్థం కాదు. ఎక్కడేకాని ప్రాజెక్టులు గాలిలో కట్టరు. అభివృద్ధిలో భాగంగా ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు వాటి వలన నిర్వాసితులయ్యే వారందరికీ పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకనే నిర్మాణం ప్రారంభించాలన్నది సహజ న్యాయసూత్రం. అంతర్జాతీయ చట్టాలూ అదే చెబుతున్నాయి. దశల పేరిట నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామనడం త్యాగధనుల పట్ల ప్రభుత్వాల అమానవీయతను సూచిస్తుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచితం, అవకతవకల వలన పోలవరం స్తంభించినందున తొలి దశకు నాలుగేళ్లు పడుతుందని శ్వేతపత్రంలో టిడిపి సర్కారు తెలిపింది. తొలి దశ నిర్వాసితుల పునరావాసం రెండేళ్లలో పూర్తవుతుందని, రెండవ దశ పునరావాసం ఆపై దశలవారీగా కొనసాగుతుందని వెల్లడిరచింది. ఇన్నేళ్లయినా పునరావాసం కోసం పోరాడుతున్న గిరిజన, పేద నిర్వాసితులకు దరిదాపుల్లో పునరావాసం దక్కదని ప్రభుత్వ శ్వేతపత్రంతో అర్థమైపో యింది. తొలి, మలి దశల్లో పునరావాసానికి ఇంకా రూ.25 వేల కోట్లు కావాలంటోంది ప్రభుత్వం. మొదటి ప్రాధాన్యతలో ఆ నిధులు కేంద్రం నుంచి రాబట్టే విషయంలో మాత్రం నాలిక మడత పెడుతోంది. డిజైన్ల దగ్గర నుంచి అంచనాల వరకు, కాఫర్‌ డ్యాము నుంచి డయాఫ్రంవాల్‌, గైడ్‌బండ్‌, రివర్స్‌టెండర్ల వరకు అన్నీ కేంద్ర సంస్థల కనుసన్నల్లోనే జరిగాయి. కాబట్టి టిడిపి, వైసిపి,ఏ ప్రభుత్వం తప్పు చేసినా కేంద్ర అండదండలు పుష్కలంగా ఉందన్నది స్పష్టం. జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినందున పోలవరంలో తప్పిదాలకు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలో కేంద్ర సంస్థలు తప్పించు కోజాలవు. అవకతవకలకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పునరా వాసం కల్పించాలి. ముంపుపై శాస్త్రీయ సర్వే చేసి నిర్ధారిం చాలి.ఆగస్టులో గోదావరికి వరదల ముప్పు ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి. అందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలి.
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం – కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా వెల్లడి
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌?ను నిర్మించనున్నట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా వెల్లడిరచారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు.మరోవైపు ప్రాజెక్టులోని సమస్యలపై రెండు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వనునట్లు విదేశీ నిపుణులు తెలి పారు. ఈ క్రమంలోనే నిర్మాణాలకు అంత రాయం ఉండకపోవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నివేదిక ఆధారంగా డిజైన్లు, నిర్మాణాలు రూపొం దించనున్నారు.పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు.పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.కొత్త డయాఫ్రం వాల్‌ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు ఎంత దూరంలో కట్టాలి? ఎలా నిర్మిం చాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విం దర్‌ ఓహ్రా కోరారు. నాలుగు రోజులుగా పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్య లపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు బుధవారం నాడు దిల్లీ నుంచి కుష్విందర్‌ ఓహ్రా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ పాల్‌, సీస్‌ హించ్‌ బెర్గర్‌, రిచర్డ్‌ డొన్నెల్లీ,గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇంఛార్జ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి,పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్‌, కేంద్ర జలసం ఘం డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్‌, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్‌, గౌరవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.
నిపుణుల నివేదిక ఆధారంగానే..
ఇప్పటికే కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌, విదేశీ నిపుణులు ఛైర్మన్‌ ఓహ్రాకు ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీ లించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్‌ ఓహ్రా భేటీ నిర్వహించారు.విదేశీ నిపుణులు నలుగురు తమ అభిప్రాయాలు ఆయనకు తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని, వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు విదేశీ నిపుణులు వివరిం చారు.ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా వెల్లడిరచారు. ఆ నివేదికలను ఆధారంగా తీసుకుని ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్‌ నిపుణులు ఆఫ్రి పోలవరంలో పని చేస్తున్నారు. వారు డిజైన్లు రూపొందిస్తారు. వాటిని విదేశీ నిపుణులకు పంపి, ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర జలసంఘానికి సమర్పించి, డిజైన్లకు ఆమోదం తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఎగువ కాఫర్‌ డ్యాం గట్టిగా ఉన్నా సీపేజీ తప్పదేమో!
ఈ సందర్భంగా విదేశీ నిపుణులు మాట్లాడుతూ ఎగువ కాఫర్‌ డ్యాంలో నిర్మాణపరంగా ఎలాం టి భద్రతా లోపాలూ కనిపించడం లేదని తెలిపారు. సీపేజీ విషయంలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు మార్గాలు ఉన్నాయేమో చూస్తామని చెప్పారు. కాని పక్షంలో సీపేజీని ఎప్పటికప్పుడు తగ్గించు కుంటూ నిర్మాణం కొనసాగించేందుకు ప్రత్యా మ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని వారు వివరించారు. ప్రస్తుతం అక్కడ నాలుగు బోరు గుంతలు (బోర్‌ హోల్స్‌) తవ్వించి, తాము చెప్పిన పద్ధతిలో సమాచారం సేకరించాలని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు బోరు గుంతల సమాచారం మాత్రమే వచ్చిందని చెప్పారు. మొత్తం 18 బోర్‌ హోల్స్‌ తవ్వి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే ఇందుకు సమయం పడుతుందని, ఈలోపు కొంత సమా చారం వచ్చినా తమ అభిప్రాయం తెలియ జేస్తామని నిపుణులు వివరించారు. కట్టడం నుంచి మాత్రమే సీపేజీ ఉంటే ఒకరకంగా ఉంటుందని, దిగువన ఉన్న కటాఫ్‌ నుంచి కూడా సీపేజీ వస్తుంటే మరో తరహాలో ఉంటుందని విదేశీ నిపుణులు తెలిపారు. మధ్యంతర నివేదికలో దీనిపై స్పష్టమైన అభిప్రాయం తెలియజేస్తామని పేర్కొన్నారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులకు సంబంధించి కొన్నిచోట్ల ఒక స్థాయికి మించి దిగువకు ఇసుకను నింపలేకపోవడం, సాంద్రత పెంచలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతు న్నాయని, అది పర్వాలేదని వారు అభిప్రాయ పడ్డారు. కొన్ని మార్పులు సూచిస్తామని వారు చెప్పారు. పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం తదితర అంశాలపైనా విదేశీ నిపుణలు మాట్లాడారు. బంకమట్టి పరిస్థితులున్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. మొత్తం మీద విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజి నీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.-(జి.అంజిబాబు)

అడవుల నరికివేతతో భవితకు ప్రమాదకరం

అడవుల పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా..దశాబ్దాలుగా క్షేత్రస్థాయి లో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరు ద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దా లుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామ మాత్రం అవుతోంది. – గునపర్తి సైమన్‌
ప్రపంచ దేశాల్లో వందల కోట్ల జనాభా ప్రత్యక్షంగా,పరోక్షంగా అరణ్యాలపై ఆధారపడి జీవిస్తోంది. ప్రకృతి సంపదతోపాటు విశిష్టమైన జీవవైవిధ్యం కలిగిన అడవులు భూమిపై 80శాతం మేర వన్యప్రాణులు,వృక్షజాతులు,కీటకాలకు ఆవా సంగా ఉన్నాయివాతావరణ మార్పులకు దారితీసే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను అందించడంలో వనాలది విశేష పాత్ర.అడవుల్లో లభించే ఆహార, ఔషధ, కలపేతర ఉత్పత్తులద్వారా ఏటా భారీగా ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పూర్తిస్థాయి ఉపాధి పొం దుతున్నారు.75శాతం స్వచ్ఛమైన నీటి ప్రవాహా లకు అడవులే ఆధారంగా నిలుస్తున్నాయి. భూమిపై ఉన్న అటవీ ప్రాంతాల విశిష్టత, వాటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
లోపాలపై సమీక్ష అవసరం
అడవుల పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా, దశాబ్దా లుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది.పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది.అడవుల రక్షణకు 10చదరపు కిలోమీ టర్ల పరిధిలో ఓ బీట్‌ అధికారి చొప్పున నియమిం చాలని గతంలో జాతీయ అటవీ కమీషన్‌ సూచిం చింది.వనాల అభివృద్ధికి కేంద్రం,రాష్ట్రాల బడ్జెట్‌ లలో నిర్దిష్టంగా నిధులను కేటాయించాలని సిఫా ర్సు చేసింది.అవేవీ అమలుకు నోచుకోలేదు. అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచా లనే ఆశయంతో రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఉమ్మడి అటవీ యాజమాన్యం, సామాజిక అటవీ యాజమాన్యం వంటి పథకాలు కనుమరుగయ్యా యి.ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్త జాతీయ అటవీ విధా నం ముసాయిదాను ప్రకటించినా తరవాత పక్కన పెట్టేసింది.పర్యావరణ,అటవీ,వన్యప్రాణి సంరక్షణ, నీటి,వాయు కాలుష్య నియంత్రణ వంటి వేర్వేరు చట్టాలన్నింటినీ ఒకేగొడుగు కిందకు తీసు కొచ్చి సమగ్ర పర్యావరణ న్యాయ (నిర్వహణ)చట్టం తీసు కురావాలని సుబ్రమణియన్‌ కమిటీ కేంద్రానికి నివేదించింది.గతేడాది అటవీ పరి రక్షణ చట్టం-1980లో మార్పులుచేసి గనుల తవ్వకాలు, ప్రాజె క్టులకు అటవీ భూములిచ్చే ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిం చింది. వ్యతిరేకత రావడంతో ఆతరవాత వెనక్కి తగ్గింది. అడవుల పరిరక్షణలో ముందుగా వ్యవస్థా గత లోపాలను విశ్లేషించుకోవాల్సి ఉంది.దేశ వ్యాప్తంగా అడవితో మమేకమై జీవిస్తున్న స్థానికు లను వనాల పరిరక్షణలో భాగస్వామ్యం చేయడా నికి పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేయాలి.అటవీ ఆధారిత ఉత్పత్తులే జీవనాధారంగా బతుకు తున్న ఆది వాసులు, ఇతర సమూహాలకు జరిగిన అన్యాయా న్ని సరిదిద్దాలనే ఆశయంతో అటవీ హక్కుల గుర్తిం పు చట్టం తెచ్చారు. దాని ప్రకారం వారికి కనీస హక్కులు దఖలు పరచడంలో అలస త్వం చోటు చేసుకుంది.ఫలితంగా ఆదివాసులు, అటవీ సిబ్బం ది మధ్య ఘర్షణ వాతావరణం పెరిగి పోతోంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలి.దేశంలో భూమి లేని నిరుపేదలు అడవుల్లో కలపేతర ఉత్పత్తుల సేకరణ ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం మూడు కోట్ల మంది అసంఘ టిత పేదలు ఏటారమారమి రెండులక్షల కోట్ల రూపాయల విలువైన అటవీ ఫలసాయ ఉత్ప త్తులను సేకరిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా అడవుల్లో లభించే సేంద్రియ ఉత్పత్తులైన తేనె,కరక్కాయ, కుంకుడు,నల్లజీడి గింజలతో పాటుచెట్లవేర్లు, వృక్షా ల బెరడు, ఇతర మూలికలు,పుష్పాలు వంటి ఔషధ ఉత్పత్తులు, గృహోపకరణాలు కలపేతర అటవీ ఫలసాయం కిందకు వస్తాయి. మొత్తం సేకరిస్తున్న ఉత్పత్తుల్లో 60శాతందాకా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.ఇంతటి గిరాకీఉన్న ఈ ఉత్పత్తులను సేకరించే స్థానిక సమూహాలకు, ప్రభు త్వ వ్యవస్థ లకు సరైన ఆదాయం సమకూరడం లేదు.ఏళ్ల తరబడి అటవీ,గిరిజన సంక్షేమశాఖలమధ్య సమ న్వయం,సహకారం కొరవడటం,మార్కెట్‌ వసతు లు, రవాణా సౌకర్యాల కొరత మూలంగా పేదలు నామమాత్రం ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్ర యించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
లక్ష్య సాధనలో విఫలం
వనాలకు నష్టం వాటిల్లకుండా అటవీ ఉత్పత్తుల సేకరణ,మార్కెటింగ్‌,అటవీ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్రాల్లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ),గిరిజన మార్కెటింగ్‌ సహకార సమాఖ్య వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి.కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా చోట్ల లక్ష్య సాధనలో అవివిఫలమయ్యాయి. అటవీ ఉత్పత్తులను సేకరించేవారికి శిక్షణ,మార్కెట్‌ వస తులు,మద్దతు ధరకల్పించే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం మొదలైన వనధన్‌ కార్యక్రమమూ ఆశించిన లక్ష్యాలను అందుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయిదేళ్ల క్రితంకేంద్రం వెదురును కలపేతర అటవీ ఫలసాయాల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణ యానికి అనుగుణంగా వెదురుద్వారా జీవనోపాధు లను అభివృద్ధి పరిచేందుకు అవకాశాలున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.కలపేతర అటవీ ఫలసాయాల విషయంలో అటవీ,గిరిజన సంస్థలు నియంతృత్వ ధోరణివీడి స్థానిక సమూహాల జీవనో పాధుల వృద్ధికి,తద్వారా అడవుల పరిరక్షణ,విస్తీ ర్ణం పెంపునకు కృషి చేస్తే మంచి ఫలితాలు సిద్ధి స్తాయి.
విచ్చలవిడి నరికివేతతో వినాశనంకొన్ని దశాబ్దా లుగా వేగంగా క్షీణిస్తున్న అడవులతో మానవాళి భవిత ప్రమాదంలో పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశనా నికి గురవుతున్నాయని అంచనా.అడవులు క్షీణిం చడం మూలంగా జీవనోపాధులు, జలవనరులతో పాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తు లు ముప్పేట దాడి చేస్తున్నాయి. అడవుల పరిరక్షణ కు నడుం కడుతున్నామంటూ ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నా, విధానాల అమలు మాత్రం లోపభూయిష్ఠంగా ఉంటోంది.2010-2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 47లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు తరిగిపో యాయని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తేల్చి చెప్పింది.జాతీయ అటవీసర్వే-2021 నివే దిక సైతం భారత్‌లో వనాలసుస్థిర ప్రగతిలో లోపా లను ఎండగట్టింది.అటవీ నిర్మూలనఅంటే ఏమిటి, కారణాలు,ప్రభావాలు,ప్రయోజనాలు నిరోధించే పద్ధతులు పాటించాలి.
అటవీ నిర్మూలన అంటే ఏమిటి?
మనకు తెలిసినట్లుగా,అడవులు భౌతిక వాతావరణంలో ఇతర మొక్కలు మరియు జంతు వులతో పాటు దట్టమైన చెట్లు పెరిగే పర్యావరణ వ్యవస్థ.ఈఅడవులే పర్యావరణ వ్యవస్థను నియం త్రిస్తాయి,సమతుల్యం చేస్తాయి. అడవుల యొక్క ఏకైక ఆర్థిక ప్రయోజనం ఏమిటంటే వివిధ రకాల ఉపయోగాలు కలిగిన కలప.ఈ అడవుల యొక్క ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు ఆక్సిజన్‌ను విపరీ తంగా సరఫరా చేయడం, వన్యప్రాణులకు మద్దతు ఇవ్వడం,నీటి పట్టికను తనిఖీ చేయడం, కాలుష్యా న్ని తగ్గించడం, వాతావరణం మరియు ఉష్ణోగ్రతపై నియంత్రణ కలిగి ఉండటం,నేలనాణ్యతను నిలుపు కోవడం,మొక్కల జీవితంలో వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం, నేల కోతను నివారించడం. మరోవైపు అటవీ నిర్మూలన,మానవజాతి ప్రయోజనం అభి వృద్ధికోసం చెట్లను నరికివేయడం మరియు అడవు లను నరికివేయడం. మరో మాటలో చెప్పాలంటే, అటవీ నిర్మూలన అంటే అటవీ భూమిని అటవీ యేతర ప్రాంతంగా మార్చడం, ఫలితంగా పర్యా వరణ వ్యవస్థ క్షీణించడం. ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం, పారిశ్రా మిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 18మిలియన్‌ ఎకరాల అడవులు పోతున్నాయి.
అటవీ నిర్మూలనకు కారణాలు
అధిక జనాభా : అటవీ నిర్మూలనకు అధిక జనాభా ప్రధాన కారణాలలో ఒకటి. జనాభా పెరిగేకొద్దీ వసతి మరియు ఇతర అవసరాలకు ఎక్కువ భూమి అవసరమవుతుంది. చెట్లను నరికివేయడం అనేది ప్రజల సంఖ్య పెరుగుదలకు అనులోమాను పాతం లో ఉంటుంది.
కలపపంట : ఆధునిక ప్రపంచంలో కలపకు చాలా విలువ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి అధిక డిమాండ్‌ ఉంది. చెట్లను నరికి, దాని కలప కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. వివిధ ఉపయోగాలున్న మంచి నాణ్యమైన కలపను పొం దడం,పంపడం ద్వారా ప్రజలు చాలా ఆదా యాన్ని పొందుతారు. కలప సేకరణ పెరుగుతున్న వ్యాపా రం కాబట్టి,చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధం. కలప సేకరణలో 75%పైగాఅక్రమంగా జరుగు తోంది. వ్యవసాయ విస్తరణ : వ్యవసాయ తోటలు అడవిని స్వాధీనం చేసుకున్నాయి. దాని వస్తువులకు పెరుగు తున్న డిమాండ్‌ కారణంగా 49% అడవులు వ్యవ సాయం కోసం నరికివేయబడ్డాయి. వ్యవసాయం భూసారాన్ని సులభంగా క్షీణింపజేస్తుంది కాబట్టి, ఈ భూములు పశువుల పెంపకానికి కేటాయించ బడతాయి.
మౌలిక సదుపాయాల విస్తరణ : అటవీ నిర్మూల నకు ఇది ఒక అద్భుతమైన కారణాలలో ఒకటి. రోడ్‌వేలు,రైల్వేలుఎయిర్‌వేలను నిర్మించడానికి టోన్‌ల చెట్లు నరికివేయబడ్డాయి మరియు కత్తి రించబడతాయి.
ఫారెస్ట్‌ఫైర్‌ : అటవీ నిర్మూలనకు ఊహించని అడవి మంటలు మరొక కారణం.ఇది చాలా సహజమైన దృగ్విషయం అయినప్పటికీ, ఈ అడవి మంటల కారణంగా పెద్దప్రాంతాలు ధ్వంసమ య్యాయి.
పశువులను ఎక్కువగా మేపడం : పశువుల పెంప కం అటవీ నిర్మూలనకు మరొక కారణం. పశువుల మేత మరియు పెంపకం కోసం పెద్ద అటవీ ప్రాంతం క్లియర్‌ చేయబడిరది.
షిఫ్టింగ్‌ సేద్యం యొక్క అభ్యాసం : షిఫ్టింగ్‌ వ్యవసా యం అనేది ఒకరకమైన వ్యవసాయం,దీనిలో ఒక భూమిని నిరంతరం వ్యవసాయంకోసంఉపయోగి స్తారు.భూమి దాని సంతానోత్పత్తిని కోల్పోయిన వెంటనే, మరొక భూమిని సాగుకోసం తీసు కుం టారు.ఇది సాధారణ ఆచారం కాబట్టి ఎకరా ల్లో భూమి నిస్సారంగా మారింది.సాగుకోసం ఎక్కువ చెట్లను నరికివేస్తున్నారు.
అటవీ నిర్మూలన ప్రభావాలు
గ్లోబల్‌ వార్మింగ్‌: కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా చెట్లు వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగిస్తాయి. కాబట్టి చెట్లను కత్తిరించినప్పుడు ఆక్సిజన్‌ మరియు కార్బన్‌ డయాక్సైడ్‌ మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి అంతిమంగా కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు పెరుగుతాయి మరియు అది భూమి నుండి వేడిని తప్పించుకోవడానికి అనుమతించదు, తద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ వెనుక అటవీ నిర్మూలన ప్రధాన కారణం.
నేలకోత : అటవీ నిర్మూలన,నేలకోత కలిసి ఉం టాయి.చెట్లు దాని మూలాలు అంగరక్షకుడిగా పనిచేస్తారు. నేల స్థానంలో ఉండటానికి సహాయ పడతాయి. అన్ని వృక్షసంపద హ్యూమస్‌ అధికంగా ఉండే మట్టి యొక్క పై పొరను కలిగి ఉంటుంది. అడవుల నరికివేత వల్ల ఇవన్నీ కొట్టుకుపోతాయి. అటవీ నిర్మూలన తర్వాత నేల నష్టం రేటు ఆశ్చర్య కరంగా ఉంది.
జీవవైవిధ్యంలో నష్టం : మొక్కలు, జంతువులు, కీటకాలు,పక్షులు, పురుగులు మరియు బ్యాక్టీరియా శిలీంధ్రాల వంటి అనేక సూక్ష్మజీవులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందించే గృహాలు అటవీ. అటవీ నిర్మూలన వాటి సహజ ఆవాసాలకు అంత రాయం కలిగిస్తుంది కాబట్టి వీటన్నింటిలో అనేక రకాల జాతులను కోల్పోతుంది.
వరదలు : అటవీ నిర్మూలన తీవ్రమైన వరదలకు కారణమవుతుంది. అటవీ నిర్మూలన ప్రాంతంలోని నేల నీటిని పట్టుకోలేకపోతుంది,ఫలితంగా బుర దలు వరదలు ప్రేరేపిస్తాయి.
వాతావరణమార్పు : అటవీ నిర్మూలన వల్ల వాతా వరణం కూడా ప్రభావితమవుతుంది. వాతావర ణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయి మారడం దీనికి ప్రధాన కారణం. రాబోయే సంవత్సరాల్లో వాతావ రణంలో తీవ్రమైన మార్పు వస్తుందని పరిశోధకులు అంచనా వేశారు.
ఎడారీకరణ : అటవీ నిర్మూలనతో పాటు పైన పేర్కొన్న అంశాలన్నీ ఎడారీకరణకు దారితీస్తాయి. వాతావరణం వేడెక్కడం వల్ల నేల యొక్క సహజ ఆకృతి తగ్గి పొడిగా మారుతుంది. ఈ నేల సారవం తం కాకుండా సాగుకు పనికిరాదు. దీర్ఘకాలంలో ఇది ఎడారీకరణకు దారి తీస్తుంది.
నదులు,ఆనకట్టల సిల్టింగ్‌ : అటవీ నిర్మూలన వలన ఏర్పడే నేల కోత కారణంగా నదులు ఆనకట్ట లలో అవక్షేపాలు పేరుకుపోతాయి. దీంతో ఆనకట్ట ల జీవితకాలం తగ్గుతుంది.
పరిమిత మూలం : అడవులు సహజ వనరులు చెట్లను విపరీతంగా నరికివేయడంవల్ల అది పరిమి తంగాకొరతగా మారింది.అడవుల నరికి వేత వల్ల అడవులు అంతరించి పోతున్నాయి.
ఔషధాల నష్టం : అడవులలో సహజసిద్ధమైన ఔష ధాలు పుష్కలంగా ఉన్నాయి. అటవీ నిర్మూలన కారణంగా ఇవన్నీ ప్రమాదంలో ఉన్నాయి.
అటవీ నిర్మూలన యొక్క ప్రయోజనాలు
ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది.
అనేక పరిశ్రమలకు ముడి సరుకులను అందిస్తుంది.
చెట్లను నరికివేయడం ద్వారా బొగ్గు లభిస్తుంది, ఇది మంచి శక్తి వనరు.
పట్టణీకరణకు దారితీసే ఆర్థికాభివృద్ధి వృద్ధిని సక్రియం చేస్తుంది.
అటవీ నిర్మూలన కారణంగా ఆహార డిమాండ్‌ ఆహార సరఫరా సమానంగా ఉంటుంది.
నివాస అవసరాల కోసం ఎక్కువ భూమిని అందిస్తుంది.
అటవీ నిర్మూలన పశువుల మేతకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది తక్కువ ఆదాయ వర్గానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రక్రియ.
అటవీ నిర్మూలన నియంత్రణకు చర్యలు
అటవీ నిర్మూలన: నష్టాన్ని నయం చేయడానికి ఉత్తమ మార్గం మరింత ఎక్కువ చెట్లను నాటడం. ఏదైనా వాణిజ్య ప్రయోజనం కోసం ఒక చెట్టును నరికితే, ఏకకాలంలో 10 చెట్లను నాటాలి.
పర్యావరణ సంస్థలు: పర్యావరణానికి మద్దతునిచ్చే మరియు తిరిగి నింపే ఈ సంస్థల పట్ల మనమం దరం సహాయం చేయాలి. డబ్బు అప్పుగా ఇవ్వ వచ్చు ఎక్కువ చెట్లను కొనుగోలు చేయడానికి నాటడానికి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించ వచ్చు.
సరైన అవగాహన: మానవజాతి భవిష్యత్తు తరా లను రక్షించడానికి అటవీ నిర్మూలన అనం తర ప్రభావాల గురించి పౌరులందరికీ సరైన అవగా హన కల్పించాలి.
రీసైకిల్‌ చేసిన ఉత్పత్తులు : కాగితం,పుస్తకాలు, బ్యాగులునోట్‌బుక్‌ల వంటి రీసైకిల్‌ వస్తువులను ఉపయోగించమని వినియోగదారు లను ప్రోత్స హించాలి. తద్వారా ఈవస్తువుల తయారీకి అద నపు చెట్లను కత్తిరించాల్సిన అవసరం లేదు.
అటవీ సంరక్షణ చట్టం : అక్రమ కలప సేకరణను నివారించడానికి అటవీ సంరక్షణ చట్టాన్ని సవ రించి,ఖచ్చితంగా పాటించాలి.
వ్యవసాయ పద్ధతులు : వ్యవసాయపద్ధతుల్లో మార్పు అడవుల నరికివేతను తగ్గించగలదు.షిఫ్టింగ్‌ వ్యవ సాయాన్ని ఉపయోగించుకునే బదులు, రొటేషన్‌ క్రాపింగ్‌ని ఉపయోగించడం మరింత సాధ్యపడు తుంది.
ముగింపులో అటవీ నిర్మూలన అనేది పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రపంచ సమస్య. విలువైన చెట్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇది మానవ నిర్మిత సమస్య, పైన పేర్కొన్న వ్యూహాలను అనుసరించడం ద్వారా సులభంగా క్రమబద్ధీ కరిం చవచ్చు.అడవుల పెంపకానికి పెద్దపీట వేయక పోతే మానవజాతి అంతరించిపోయే ప్రమా దం ఉంది.భూమి భవిష్యత్తు మనపై, మానవులపై ఆధారపడి ఉంటుంది.రాబోయే తరానికి ఆస్తిగా ఉండే మరిన్ని చెట్లను నాటడం ద్వారా మన భూమి ని కాపాడుకోవాలి.

లోక్‌ అధాలత్‌తో సత్వర న్యాయం

కోర్టు పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదా లకు వెనువెంటనే పరిష్కారం.. ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరిం చటానికి లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడు తుంది. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీకుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కార మార్గాలు చూపుతారు.లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవడానికి వీలులేని విధంగా పరిష్కారం చూపుతారు. దీంతో లోక్‌ అదాలత్‌లో వందలాది కేసులు (దావాలు) పరిష్కారమవుతున్నాయి. వివిధ కేసుల్లో బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా లోక్‌ అదాలత్‌లో పరిష్కారం లభిస్తుంది. సత్వర న్యాయం కూడా లభిస్తుంది.
ఏండ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పరిష్కారమవుతున్నాయి. ఇరు వర్గాలకు రాజీకుదిర్చి,ఇద్దరికీ సమ్మతమైన న్యాయాన్ని అందిస్తున్నారు. లోక్‌ అదాలత్‌లో మోటారు వెహికిల్‌ యాక్టుల్లోనూ, ఆబ్కారీ (ఎక్సైజ్‌) కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ తగదాల కేసులు, ఇలా పలు కేసులు పరిష్కరిస్తున్నారు.
లోక్‌ అదాలత్‌ అంటే ఏమిటీ..?
రాజీ పడదగ్గ కేసుల్లో బాధితులు, ముద్దాయిలు ఇరువర్గాలు రాజీ పడదలచినచో వారు కోర్టుకు వచ్చి డిసెంబర్‌ 11న రాజీ చేసుకోవచ్చు. ఇరువర్గాలను రాజీకుదిర్చి సత్వర న్యాయం చేయడమే లోక్‌ అదాలత్‌ లక్ష్యం. ఇందులో పరిష్కరించిన కేసులపై పైకోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదు.
లోక్‌ అదాలత్‌లో ఏఏ కేసులు రాజీ పడొచ్చు?
కొట్లాట,దొంగతనం,చీటింగ్‌,అసభ్య పదజాలం, అతిక్రమణ, వ్యభిచారం, పరువునష్టం,బెదిరింపు, భార్యాభర్తల గొడవలు,మెయింటనెన్స్‌ క్రిమినల్‌ కంపౌండబుల్‌ కేసులు,ప్రీ-లిటిగేషన్‌, టెలిఫోన్‌, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు రాజీపడొచ్చు.
లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలు ఏమిటీ..?
కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవడం తప్పుతుంది. సమయం, డబ్బుల ఖర్చు కలిసివస్తాయి. కోర్టు ఫీజు లేకుండా ఇరువర్గాలు సంతోషపడే విధంగా రాజీ కుదుర్చుకోవచ్చు. సత్వర న్యాయం లభిస్తుంది. ఇరువర్గాలకు మేలు జరుగు తుంది. కోర్టు ఫీజు తిరిగి ఇస్తారు. లోక్‌ అదాలత్‌ కేసులకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సాధారణంగా అప్పీలు ఉండదు.సంబంధిత న్యాయవాది,పోలీసు అధికారి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులను సంప్రదించవచ్చు.
న్యాయసేవా అధికార సంస్థ అంటే ఏమిటీ..?
పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం అందించే ఏర్పాట్లను న్యాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.డబ్బున్నా ,లేకపోయినా అందరికీ సరైనా న్యాయం అందించడానికి ప్రభుత్వం జాతీయ,రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిల్లో న్యాయసేవా అధికార సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చు.ఈ సేవలను పేదలు వినియోగించుకోవాలి.
లోక్‌ అదాలత్‌ ద్వారా బాధితులకు సత్వర న్యాయం దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌ ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పని చేస్తోందని గుర్తు చేశారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌ వద్ద శనివారం ఉదయం జరిగింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.లోక్‌ అదాలత్‌ లాంటి వేదికల్లో పౌర శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి పరిధిలోని రాజీకాగలిగిన కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు పరిష్కారానికి వస్తాయన్నారు. ప్రభుత్వ సంస్థలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కక్షిదారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
కార్యక్రమంలో భాగంగా గనవ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, కాలుష్య నివారణ పద్ధతులపై రూపొందించిన పోస్టర్ను జిల్లా కోర్టు న్యాయ మూర్తులు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ,మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి ఎం.వెంకటరమణ,ఫ్యామిలీ కోర్టు జడ్జి కె. రాధారత్నం, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి. సత్యనారాయణ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌. కృష్ణ మోహన్‌, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.-జిఎన్‌వి సతీష్‌

పులి అడవి సంపన్నతకు ప్రతీక

పులి అడవి సంపన్నతకు ప్రతీక.నడకలో రాజసం.వేటలో గాంభీర్యం ప్రదర్శించే ఈజంతువు..ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉంటూ మిగతా జంతువులు,జీవుల జనాభాను పరోక్షంగా నియంత్రిస్తుంది. ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. పర్యావ రణాన్ని,జీవవైవిద్యాన్ని కాపాడుటంలో పులి పాత్ర కీలకమైనది.పులిలు ఉనికి అడవికి అందం,రక్ష.అడవిలో వాటి సంఖ్యను బట్టే పర్యావరణ సమతుల్యతను అంచనా వేయొచ్చు. పులులు అంతరించిపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. ఉదాహరణకు మారిషన్‌లో డోడోస్‌ పక్షులు అంతరించ పోవడంతో ఒక జాతి ఆకేసియా చెట్టు పునుత్పత్తి ఆగిపోయింది. ఒకజాతి అంతరించిపోయినప్పుడు,దాని ప్రభావం మరోదానిపై పడుతుంది.అందుకే పులులను రక్షించాల్సిన అవసరం ఏర్పడిరది. 2010లో రష్యాలోని సెయింట్‌ ఫీటర్స్‌ బర్గ్‌లో టైగర్‌ సమ్మిట్‌ జరిగింది.13దేశాల ప్రతినిధులు సదస్సుకు హజరయ్యారు.2022నాటికి పులుల జనాభాను రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పులులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పూతూ ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులిని,అటవీ ఆవరణ వ్యవస్థతో కలిపి రక్షించుకోవడం మానవ సమాజాల అవసరం.
ఎందుకు అంతరిస్తున్నాయంటే..
చెట్లను,దట్టమైన అడవులను నరికి పులుల ఆవాసాలను నాశనం చేయడం,పులుల చర్మం, గోర్లకోసం వేట,అక్రమ వ్యాపారం లాంటి ప్రధాన కారణాల వల్ల పులుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.భారతప్రభుత్వం 1973 ఏఫ్రిల్‌1న టైగర్‌ ప్రాజెక్టును చేపట్టి పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 3,820పులులు ఉంటే,ఇండి యాలోనే 2,967ఉన్నట్లు అంచనా.పులుల సంరక్షణ వాటి గణనకు సంబంధించి జాతీయ పులుల సంరక్షణ,సాధికారిక సంస్థ (ఎన్‌టీ ఎస్‌ఏ)నుప్రభ/త్వం 2005లో ఏర్పాటు చేసింది.ప్రతి నాలుగేండ్లకోసారి పులుల గణన చేపడతున్నారు.దేశంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధికంగా 526పులులు ఉన్నాయి. అందుకే అక్కడ 6టైగర్‌ రిజర్వులు ఏర్పాటు చేశారు. పులులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌టీఎస్‌ఏ తాజా లెక్కల ప్రకారం,,గత పదేండ్లలో 1,059 పులులు చనిపోయాయి. అనువైన ఆవాసాలు లేకపోవడం తదితర కారణాలవల్ల అవి బతక డం లేదు. పుట్టిన 15నెలల్లోనే 70శాతం వరకు చనిపో తున్నట్లు పులు అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో 3000పులులు ఉన్నాయను కుంటే ఏటా 1500 పులులు పుడితే ప్రతి పదేండ్లకు పిల్లల సంఖ్య పదివేల నుంచి 15వేలకు పెరగాలి.కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ఎన్‌టీఎస్‌ఏ లెక్కల ప్రకారం 2022నాటికి గరిష్టంగా 3925కు చేరుకుంది.దేశంలోని తొమ్మిది టైగర్‌ రిజర్వులతో 18వేల చదరపు కిలోమీర్ల విస్తీర్ణంలో ప్రారంభమైన ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమం..ప్రస్తుతం 53 పులుల అభయారణ్యాలతో 76వేల చదరపు కిలో మీటర్లలో విస్తరించింది.దేశం మొత్తం భూభాగంలో ఇది 2.3శాతంతో సమానం. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 785పులులు ఉన్నాయి. కర్ణాటక(563),ఉత్తరాఖాండ్‌ (560), మహారాష్ట్ర(444),తర్వాతస్థానంలో ఉన్నాయి టైగర్‌ రిజర్వ్‌ల విషయంలో..260పులులుతో ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ రిజర్వ్‌ మొదటి స్థానంలో ఉంది.తర్వాత స్థానాల్లో కర్ణాటకలోని బండీపుర్‌(150),నాగర్‌హోల్‌(141)మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గడ్‌(135)నిలిచాయి. తెలంగాణలో 2018లో 26పులులు ఉండగా..2022నాటికి 21కి తగ్గాయి.ఇక్కడి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 12పులులు ఉన్నాయి.మొత్తం 16 వరకు పులులు ఈ అభయారణ్యాన్ని వినియో గించుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 48పులులు ఉండగా..2022నాటికి 63కు పెరిగాయి.ఇక్కడి నాగార్జునసాగర్‌,శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌లో 58పులులు ఉన్నట్లు అంచనా వేశారు.దాదాపు 62పులులు ఈ రిజర్వ్‌ను వినియోగించుకుంటున్నాయి.
పులుల చరిత్ర..
2010 సంవత్సరంలో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ టైగర్‌ సమ్మిట్‌లో గంభీరమైన జీవులపై అవగాహన కల్పించడానికి దోహ దపడిన రోజు. 2022 సంవత్సరం నాటికి ఆయా దేశాల్లో పులుల సంఖ్య రెట్టింపు చేయా లని నిర్ణయించాయి. అడవి పులుల సంఖ్య విపరీతంగా తగ్గుముఖం పడుతూ ఉండ టంతో..1970 సంవత్సరం నుండి పులులను సంరక్షించే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, పులుల సంఖ్య వేగంగా తగ్గింది.ఈ నేపథ్యంలో 13 వేర్వేరు దేశాల ప్రభుత్వాలు 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.దీనిని టిక్స్‌-2లక్ష్యం అని కూడా పిలుస్తారు.
పులుల ప్రాముఖ్యత..
పులుల సంఖ్య తగ్గడానికి వివిధ కారణాలను మనం గమనించొచ్చు.పులులను అక్రమంగా వేటాడటం,వాటి చర్మం,గోర్లతో అక్రమ వ్యాపారం వంటివి చేయడంవల్ల వాటి ఆవా సాలు కోల్పోతున్నాం. వాతావరణ మార్పులు మనిషి-జంతు సంరక్షణ,పర్యాటకం పెరగడం, పులుల పరిరక్షణకు నిధుల కొరత వంటివి పులుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు.అందుకే పులుల సంఖ్యను పెంచేం దుకు,వాటి స్థిరమైన పరిరక్షణ స్థాపనకు క్షీణతకు కారణమయ్యే పరిస్థితులను పరిశీలిం చడానికి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
వన్యప్రాణుల సంరక్షణ..
వన్యప్రాణుల సంరక్షణ అనేది మనందరిది. వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ప్రకారం 2020 నాటికి ప్రపంచంలో ఉన్నది కేవలం 3,900 పులులే. వాటిలో సుమారు 70శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి. మరో మంచి విషయమేమిటంటే..ఇండియా,నేపాల్‌ చైనా, భూటాన్‌, రష్యాలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినా కూడా వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు.
జాతీయ జంతువు పులి..
మన దేశ జాతీయ జంతువు పులి.. రాచఠీవికి పెట్టింది పేరు. పులి అనేది ఎప్పుడూ శత్రువు ముందు తల వంచదు. దాని అడుగులు ఎల్లప్పుడూ ముందుకు పడతాయే తప్ప.. వెనక్కి వెళ్లవు. అది ప్రాణాలను లెక్క చేయదు. అందుకే అడవుల్లో పులి స్థానం సుస్థిరం. పులులు పుట్టాక.. అవి ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇష్టపడతాయి. రెండేళ్లు కాగానే అవి విడిగా వెళ్లిపోతాయి.మగ పులు లకు సెక్సువల్‌ మెచ్యూరిటీ వస్తుంది.ఆడపులు లకు నాలుగేళ్ల తర్వాత అది వస్తుంది.బాగా పెరిగిన పులి ఒక్కొక్కటి 140నుండి300 కిలో ల బరువు ఉంటుంది. ఆడపులి ఒకేసారి 35 కిలోల ఆహారాన్ని తినగలదు.
20 ఏళ్ల వరకు..
పులులు పుట్టినప్పటి నుండి 15 నుండి 20 సంవత్సరాలు జీవిస్తాయి.మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..పులులు పుట్టిన సమయం లో వాటికి కళ్లు కనబడవట.తమ తల్లి నుండి వచ్చే వాసనను బట్టి తల్లిని ఫాలో అవుతాయి. పులి పిల్లల్లో సగం ఆకలితో చని పోతాయట. లేదా చలికి తట్టుకోలేక చని పోతాయి.పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పిల్లలు చనిపోతాయి. ఔఔఖీ లెక్కల ప్రకారం..చాలా పులులు పిల్లలు గా ఉన్నప్పుడే చనిపోతున్నాయి. పులులు గంట కు 65కిలోమీటర్లు వేగంతో పరు గెత్తుతాయి. అంతేకాదు రాత్రి వేళ మనుషుల కంటే పులు లు ఆరు రెట్లు బాగా చూడగలవు. అవి పగటి వేళ కంటే రాత్రివేళ బాగా వేటా డగలవు. అలాగని పగటి పూట వేటను మిస్‌ చేసుకోవు.
ఒకేరకమైన చారలుండవు..
ప్రతి ఒక్క పులికి చారలు అనేవి వేర్వేరుగా ఉంటాయి. మనషుల్లో ఏ రకంగా ఇద్దరికీ వేలి ముద్రలు అనేవి వేర్వురుగా ఉండవో..అలాగే ఏరెండు పులులకు కూడా ఒకేరకమైన చారలు ఉండవట. టైగర్లు అందరి కంటే వేగంగా ఈత కొట్టగలవు.ఆహారం కోసం ఎంత దూర మైనా ఈదుకుంటూ వెళ్తాయట. బెంగాల్‌ సుం దర్‌ బన్స్‌ అడవుల్లో చాలా పులులు..ఈదుతూ వెళ్లడాన్ని పర్యాటకులు చూసి ఆనందిస్తుం టారు. అంతేకాదు పులులకు నీటిలో ఆడు కోవడం అంటే చాలా ఇష్టమట. పులి ఉమ్ములో యాంటీసెప్టిక్‌ గుణాలు ఉంటా యట.అందుకే పులులకు గాయాలైనప్పుడు అవి తమ నాలుక తో గాయాన్ని రుద్దుకుంటాయి. దానివల్లే ఆగా యం మానిపోతుందట.
పులులను ఎలా లెక్కిస్తారు..
1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3200లోపే ఉండటం పరిస్థితి ఏమేరకు దాపురించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఈవందేళ్లలో 90శాతంకుపైగా పులులు అంతరించిపోయాయి.విచక్షణ రహితంగా పులులను వేటాడటంతో పాటు అడవుల నరికివేత,ఆహార లభ్యత తగ్గడమే అవి అంతరించి పోవడానికి కారణమని వన్యప్రా ణుల నిపుణులు చెబుతున్నారు.2010లో ప్రపంచ వ్యాప్తంగా 3200 పులులు ఉండగా, 2020 ఏడాది నాటికి ఆ సంఖ్య 3900కి చేరింది.పులుల జనాభాలో పెరుగుదల సుమారు 22శాతం ఉందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రపంచంలో 690 పులులు పెరుగగా,ఒక్క భారత్‌ లోనే వాటి సంఖ్య 500 పెరగడం విశేషం. ప్రపంచంకెల్లా ఎక్కువ పులులు ఉన్న దేశం మనదేశమే.
వన్య ప్రాణుల గణాంక ఎలా జరుగుతుంది..?
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగైదు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు.
ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ
భారత్‌లో నాలుగేళ్లకోసారి పులులను లెక్కి స్తుంటారు. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగు తుంది.అటవీ సిబ్బంది నడిచే మార్గం లో వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటి గుర్తు లతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుం టారు. పగ్‌ మార్క్‌ విధానంలో సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్ర లను గుర్తిస్తారు.పులి పాదముద్రను బట్టి వయ సు నిర్దారిస్తారు.మొదటగా ఒక గాజుపలకపై స్కెచ్‌ పెన్‌ తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్‌ పౌడర్‌ చల్లుతారు.ఆ తర్వా త రింగ్‌ అంతా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ మిశ్రమా న్ని వేస్తారు. దాదాపు ఓ20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డకట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినది నమోదు చేసు కుంటారు. పాద ముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనేదాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు. అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి,సిలికాన్‌ జెల్‌ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ)కి పంపిస్తారు. అక్కడ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిం చి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు. ఇక అడవి జంతువులకు చెట్లకు, రాళ్లకు వాటి పాదాలను, శరీరాన్ని రుద్దుకుం టాయి.గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు శరీరంపై దురదను పోగొ ట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయని, అప్పుడు వాటి వెంట్రుకలు,గోళ్లు ఊడిపోతుం టాయని అధికారులు చెబుతున్నారు. అటవీ సిబ్బంది చెట్లు,రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించ గలుగు తారు.సేకరించిన వెంట్రుకలు,గోళ్లకు డీఎన్‌ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధారిస్తారు.
గిన్నిస్‌రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన
భారతదేశంలో పులుల లెక్కింపు విధానం గత ఏడాది కొత్త గిన్నిస్‌ రికార్డ్‌ స్నష్టించింది. కెమె రాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డస్‌’కు ఎక్కింది.
పులుల గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
పులి గట్టిగా గాండ్రిస్తే ఆశబ్దం 3కిలోమీటర్ల పరిధి వరకు వినిపిస్తుంది.ఏ రెండు పులుల శరీరంపై ఒకరకమైన చారలు ఉండవు. గతం లో ఎనిమిది పులి ఉపజాతులు ఉండేవి. కానీ ప్రస్తుతం మూడు మాత్రమే ఉన్నాయి. పులులు ఒంటరిగా జీవించేందుకే ఇష్టపడతాయి. విశాలమైన ప్రాంతాల్లోనే నివసిస్తాయి. పులి గరిష్టంగా గంటకు 65కి.మీ. వేగంతో పరుగెత్తగలదు ఇవి మంచి స్విమ్మర్స్‌. నీటిలో బాగా ఈద గలవు.ఆరోగ్యవంతమైన పులి గరి ష్టంగా 363 కేజీల వరకు బరువు పెరుగు తుంది.ఒత్తిడిలో ఉన్నప్పుడు పులులు చెట్లపైకి ఎక్కుతాయి.అప్పుడే పుట్టిన పులి పిల్లలకు కళ్లు కనిపించవు.6-8 నెలల తర్వాతే పూర్తి స్థాయిలో చూడగలవు.(జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా..)- ఎసికె.శ్రీహరి

కొత్త ప్రభుత్వం కొండంత ఆశలు

ఏపీలో చంద్రబాబు సర్కార్‌ మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ సిస్టమ్‌ (మీ కోసం) పేరుతో వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో, ఎస్పీ కార్యాలయం, నియోజకవర్గ స్థాయి, మున్సిపల్‌ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఎవరైనా అర్జీలు ఇవ్వాలనుకుంటే.. కచ్చితంగా ఆధార్‌, ఫోన్‌ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది.. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఓ నంబర్‌ కేటాయిస్తారు. ఆ నంబర్‌ ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అంతేకాదు అర్జీ అందజేసిన వారికి ఫోన్‌ లేకపోతే రక్తసంబంధీకులకు చెందిన ఫోన్‌ నంబర్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు పేరును మీకోసంగా మార్చింది ప్రభుత్వం. ప్రజలకు మరింత చేరువయ్యేలా నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
భూ రీసర్వే లోపాలు..పొలాల సరిహద్దు వివాదాలు..ధాన్యం డబ్బులు ఇంకా అందక పోవడం..వైద్యసాయం కోసం..భూ సంబంధిత సమస్యలు మోసాలు..ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. గత ప్రభుత్వం హాయంలో కొందరు కాళ్లు అరిగేలా తిరిగినా సమస్యలకు పరిష్కారం లభించలేదు.మొర వినేవారే కరవు.కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగు తుందనే కొండంత ఆశతో జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసల కోర్చి అనేక మంది సోమవారం కలెక్లర్లేట్లకు వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఆర్జీలు అందించారు.తమ వేదనను మొర పెట్టుకున్నారు.న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ సిస్టమ్‌)కార్యక్రమానికి సోమవారం రాష్ట్రంలోని అన్నీ జిల్లాలో శ్రీకారం చుట్టారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్‌పోర్టల్‌ను జూన్‌ 24న ప్రారంభించింది. జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్లలో,మున్సిపల్‌ కార్యాలయాల్లో,మండల కేంద్రాల్లోని తాహసీ ల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.ఆర్జీలను ఇచేందుకు తప్పనిసరిగా ఆధార్‌,ఫోన్‌ నంబరు ఇవ్వాలి.దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు.దాని ఆధారంగా సమస్య పరిష్కారం ఏదశలో ఉందో తెలుసుకునే వీలుం టుంది. 1.7.2019న అన్ని జిల్లాలలో జరిగిన స్పందన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. అధికారులు పరిష్కారాలు కూడా అంతేస్థాయిలో ప్రజలకు అందిస్తారని కోరు కుందాం.పూర్వం రాజుగారు ప్రజలు పడుతున్న పాట్లు స్వయంగా తెలుసుకోవటానికి మారువేషంలో తిరిగేవాడట.ప్రజలమధ్య పాదయాత్రలు చేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేవాడట.ఇంకోరాజు కోట గుమ్మం దగ్గర ధర్మగంట బిగించాడట. ఎవరైనా బాధితుడు వచ్చి ఆ గంట మోగిస్తే రాజుగారు బయటకొచ్చి బాధితుని మొరవిని న్యాయం తీర్చేవాడట. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఫిర్యాదులపట్ల ప్రభువులు తప్పక స్పందించాలి.
అంతులేని సమస్యలు
రేషన్‌ కార్డు లేదని..పాఠశాల,కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు,తాగునీరు,రోడ్లు,భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్న వించుకుంటారు. అయితే ఆస్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుం టారు.ఇప్పటివరకు ప్రజావాణి,మీకోసం, ప్రజావేదిక,ప్రజలవద్దకు పాలన,రచ్చబండ లాంటి రకరకాల పేర్లతో పాలకులు ప్రజల సమస్యలు తీర్చటానికి ప్రయత్నించారు.అదే కోవలో నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార కోసం స్పందన అనే కార్యక్రమం ఏర్పాటుచేశారు.కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజాఫిర్యాదులకు స్పందించే కలక్టర్ల సంఖ్య పెరుగుతుంది,స్పందనాకేం ద్రాలు ప్రజలకు దగ్గరకొస్తాయి.దూరం భారం తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమస్య గురించి అయినా సంబంధితశాఖకు ఈ వెబ్‌ సైట్‌ ద్వారా పంపవచ్చు.అర్జీ తగుచర్య కోసం సంబందిత అధికారులకు పంపబడుతుంది. ఎవరైనా ఎప్పుడైనా (24I7) కాల్‌ చేసి తమ అర్జీ పరిస్థితిని తెలుసుకోవచ్చు.అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కుర్చీలు వేసి అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నారు.నెల్లూరులో ఒక వికలాం గుడికి స్పందన కార్యక్రమంలోనే మూడు చక్రాల కుర్చీ అందజేస్తే అర్జీదారుడు ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడట. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించటం విశేషమే. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఫిర్యాదుల దినాల్లో ప్రజల అర్జీలను నమోదు చేశారు.అర్జీదారులందరికీ రశీదులు కూడా ఇచ్చారు.అర్జీదారులను కూర్చో బెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరిస్తామనటమే ఈ కార్యక్రమంలో గొప్పతనం.తక్షణమే పరిష్క రించకపోయినా ఫలానా తేదీ లోగా సమస్యను పరిష్కరిస్తామని రశీదులు ఇచ్చారు.అధికారులు ఇచ్చినమాట నిలుపుకుంటే కార్యక్రమం విజయవంతమౌతుంది.
జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే
స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఆయా శాఖల అధికారులు హాజరుకావాలి.తమ కింది స్థాయి సిబ్బందిని పంపకూడదు. గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.పైగా అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించటం పెద్ద పాలనా సంస్కరణే.తీసుకున్న వినతుల్ని ఎక్కడ పెట్టామో తెలియని అయోమయ దశ ఉండకూడదు. తీసుకున్న ప్రతిఅర్జీకి ఒక లెక్క ఉండాలి. అర్జీదా రుని పట్ల బాధ్యత ,సానుభూతి ఉం డాలి. జవాబుదారీ తనం లేని బద్దకస్థులు, జాప్యగాళ్ళు,లంచగొండులు పనులు సకాలంలో చేయకుండా ప్రజలను పీక్కుతింటున్నారు. సాంకేతిక విజ్నానం ఎంతో పెరిగిన 21వ శతాబ్దంలో కూడా ప్రజలు పనులకోసం ఏళ్ళతరబడి ఆఫీసులచుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిరావటం ఎంత అనాగరికం? ఒకే సమస్య తీరక పదే పదే దరఖాస్తులు ఇవ్వాల్సి రావటం,లంచాలు ఇస్తేతప్ప పనికాకపో వటం,పనికాలేదనే దిగులుతో మనుషులే రాలిపోవటం,రాలిపోయిన వాళ్ళ భార్యాబిడ్డ లను కూడా అదేపనిగా తిప్పటం లాంటి సంఘటనలు తలుచుకుంటే ప్రజలకు ఎలాం టి గతి పట్టించారో అర్ధమవుతుంది. వీళ్ళకసలు మానవత్వం ఉందా అనిపిస్తుంది. రైతులు పాస్‌ పుస్తకాలు రాక ఆత్మహత్యలు చేసుకోబోవటం,ఉద్యోగులు రిటైర్‌ అయ్యి ఏళ్ళుగడిచినా పెన్షన్‌, గ్రాట్యుటీ రాకపోవటం,సొంత ఆఫీసులో వాళ్ళే పనులు చెయ్యకపోవటం వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి సభ్యత సంస్కారం లేని లంచగొం డులను వెంటాడి పట్టు కోవాలి.కనీసం వాళ్ళు తీసుకున్న దరఖాస్తులను ఎన్నిరోజుల్లో పరిష్క రించాలో ఎన్నాళ్ళకు పరిష్కరించారో ఎందుకు ఇంత జాప్యం చేశారోజవాబు చెప్పే వ్యవస్థ ఉండాలి.అసలు తనక్రింది ఉద్యోగులను ఇలాంటి ప్రశ్నలు నిలదీసి అడగాలంటే శాఖాధికారి దగ్గర వివరాలు ఉండాలికదా?
శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా జరగాలి
సోమవారం కలక్టర్ల దగ్గర జరిగే స్పందనలో జిల్లా స్థాయిలోని సమస్యలే దాఖలవుతాయి. జిల్లాస్థాయిలో తేలని విషయాలు, శాఖాధిప తులకే చెప్పుకోవలసిన విషయాలు, శాఖాధి పతుల కార్యాలయాల్లోనే పేరుకుపోయిన విషయాలు కొన్ని ఉంటాయి.ఇప్పుడు ఆ అవ కాశం కల్పిస్తూ వివిధ శాఖల డైరెక్టర్లు, కమీషనర్లు ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలి. స్పందన కార్యక్రమాన్ని శాఖా ధిపతుల కార్యాలయాల్లోకూడా జరపాలి. శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా అర్జీలు తీసుకొని వారి స్థాయిలో పరిష్కార ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ప్రతివిషయానికీ అర్జీ తీసుకొని సచివాలయంలోని సెక్రెటరీలు, మంత్రుల దగ్గరకు,ముఖ్యమంత్రి నివాసానికి జనం వెళ్ళలేరు.అనంతపురం నుండి వచ్చిన విశ్రాంతమ్మ తోపులాటలో స్పృహ తప్పిపడి పోయిన సమస్య మళ్ళీ రాకుండా చూడాలి. ముఖ్యమంత్రిగారికి స్వయంగా అర్జీ అందిస్తేనే త్వరగా పని జరుగుతుందనే అపోహ పోవాలి.స్పందనలో అందుతున్న అర్జీల పరిష్కా రం ఎంత బాగా జరిగితే అంతబాగా ప్రజలు అధికారులను నమ్ముతారు.జిల్లా అధికారులు అర్జీలను చక్కగా పరిష్కరిస్తూ ఉంటే రాష్ట్రం నలుమూలలనుండి ప్రజలు తాడేపల్లి పరుగె త్తరు.కొడుకు విదేశీ విద్య ఉపకారవేతనం కోసం దరఖాస్తు లాంటివి ఇవ్వటానికి కూడా ఎంతోదూరం ప్రయాణం చేసి ముఖ్యమంత్రి నివాసం దాకా రాకూడదు. జిల్లాల్లో స్పందన విజయవంతం అయితే రాజధానికి ప్రజల ప్రయాణం తగ్గుతుంది.
పెండిరగ్‌ అర్జీల పై నిరంతర పరిశీలన జరపాలి
జిల్లా కార్యాలయ మాన్యువల్‌ లో ఫైళ్ళ నిర్వహణ,పెండిరగ్‌ ఫైళ్ళ పరిష్కారం పద్ధతులు సవివరంగా ఉన్నాయి.దానిప్రకారం ప్రతి అధికారీ తనకార్యాలయ గుమాస్తాల వ్యక్తిగత రిజిస్టర్లను నెలకొకసారి ఖచ్చితంగా సమీక్షించేవారు. అందువలన తన కార్యాలయంలో ఏ గుమాస్తా దగ్గర ఏ ఏ ఫిర్యాదులు ఎందుకు పెండిరగ్‌ లో ఉంటున్నాయి, ఎందుకు ఆగిపోతున్నాయి తెలిసిపోయేది. జాప్యానికి అధికారే కారణం కానక్కరలేదు.కిందిస్థాయి సిబ్బంది చేసే అహేతుక జాప్యం కూడా అధికారి అసమర్ధత గానే పరిణమిస్తుంది. అందువలన ప్రతి అది óకారీ తన కార్యాలయంలోని పెండిరగ్‌ అర్జీల పై నిరంతర పరిశీలన జరపుతూనే ఉండాలి. జాప్యం లేకుండా అర్జీలు పరిష్కరిస్తూనే ఉండాలి.-(నూర్‌ బాషా రహంతుల్లా)

పెరుగుతున్న జనాభా..తగ్గుతున్న వనరులు

దేశమంటే మట్టి కాదోయ్‌…దేశమంటే మనుషులోయ్‌…! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్‌…!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరు స్తున్న దేశం మనది. ప్రగతిఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపు ణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం…-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)
‘‘ప్రపంచ జనాభాదినోత్సవం’’ పేరుతో జూలై 11న జరిగే ప్రపంచ వార్షిక సంఘటన సంవత్స రాలుగా అభివృద్ధి చెందింది.ఈ వార్షిక వేడుక ప్రపంచ జనాభా పెరుగుదల విషయాలను భవిష్యత్తు తరా లకు మరింత స్నేహపూర్వ కమైన స్థిరమైన ప్రపం చాన్ని సృష్టించే ప్రతిపాదనలను పెంచుతుంది.
ప్రపంచ జనాభా దినోత్సవం 2024 ప్రాముఖ్యత
ప్రపంచం 8బిలియన్లకు చేరుకుంది.15ఏప్రిల్‌ 2024న,ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం ఆశ్చ ర్యపరిచే జనాభా డేటాను విడుదల చేసిన ప్పుడు ప్రపంచ జనాభా అధికారికంగా8బిలియన్ల మంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజల వద్దకు వెళ్లడం అనేది స్థిరమైన ఆర్థిక పద్ధతులు,కార్పొరేట్‌ బాధ్యత, న్యాయమైన ఆరోగ్యం మరియు విద్య యాక్సెస్‌ స్వచ్ఛంద కుటుంబ నియంత్రణకు మద్దతు ఇవ్వాల్సి న ఆవశ్యకతపై వెలుగునిస్తుంది.
థీమ్‌ : ‘‘స్థిరమైన భవిష్యత్తు కోసం స్థిరమైన జనాభా పెరుగుదల’’
ప్రపంచం8బిలియన్ల జనాభా పరిమితిని దాటిన కారణంగా,ఈ సంవత్సరం థీమ్‌గా ప్రకటించబ డిరది,‘‘స్థిరమైన భవిష్యత్తు కోసం జనాభా పెరు గుదలను కొనసాగించడం.’’అనేక కార్యక్రమాలు మరియు వర్క్‌షాప్‌లు జనాభా యొక్క అంచనా లతో వ్యవహరిస్తాయి,తద్వారా అటువంటి పెరు గుదల యొక్క కఠినమైన పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను చూపుతుంది.వాతావరణ మార్పు,వనరుల పరి మితులు, ఆర్థిక అస్థిరత మరియు సామూహిక వలసలు వంటి పోరాటాలను తీవ్రతరం చేస్తూ 2010 నాటికి 4బిలియన్ల అదనపు నివాసులు జన్మించవచ్చు.
2024 ప్రధాన లక్ష్యాల కోసం..
యుఎన్‌ఎఫ్‌పీఏ`2024లో జ్ఞాపకార్థం కోసం సూచించింది, జనాభా పోకడలు మరియు వాటి ప్రధాన చిక్కులపై అవగాహన మరియు అవగా హన పెంపొందించడం, ప్రభుత్వం ద్వారా స్థిర మైన విధానాలను ప్రోత్సహించడం, వ్యాపార సంస్థ లు మరియు ప్రపంచ సమాజాల యొక్క ఉత్పన్న మయ్యే అవసరాలను తీర్చడానికి ఉగ్రమైన పరిష్కా రాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.
గ్లోబల్‌ సెలబ్రేషన్స్‌..
ఎ.భారతదేశం
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద జనాభాగా, ప్రపం చ జనాభాలో4బిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్న దేశం, ప్రపంచ జనాభా దినోత్సవంలో భారతదేశం గొప్ప పాత్రను కలిగి ఉంది.జనాభా స్థిరీకరణపై ప్రభుత్వం ప్రారంభిం చిన జాతీయ నిధి దేశంలోని ప్రధాన నగరాల్లో సమావేశాలు,అవగాహన ప్రచారాలు,మార్చ్‌లు మరియు ఫండ్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది.స్త్రీ అభి వృద్ధి,సెక్స్‌ ఎడ్యుకేషన్‌ మరియు కుటుంబ నియం త్రణ కార్యక్రమాలు కార్యకలాపాలకు ఆధారం.
బి. చైనా
ఇది 2014-2015 మధ్య అమలులో ఉన్న సమయంలో,చైనా తన‘‘ఒక బిడ్డ విధానాన్ని’’ అమలు చేయడం ఆపివేసిన సంవత్సరం, అధికారు లు జనన నియంత్రణ పద్ధతులను సూచించడం మరియు స్టెరిలైజేషన్‌ చేయడం వంటి మరిన్ని తీవ్రమైన చర్యలను అమలు చేశారు. అయిన ప్పటికీ,ప్రస్తుతం,దాని యువ సంస్థల ద్వారా, చైనా ప్రభుత్వం వివిధ తేదీలలో ప్రపంచ జనాభా దినోత్స వంలో స్థిరమైన అభివృద్ధి మరియు పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై సెమినార్లు మరియు టోర్నమెంట్‌లను నిర్వహించడం ద్వారా తన విద్యా పాత్రకు సంబంధించి మరో అడుగు వేసింది.
సి.కెన్యా..
తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో, 53మిలియన్ల జనాభాతో,ఐక్యరాజ్యసమితి పాపు లేషన్‌ ఫండ్‌ కమ్యూనిటీ గ్రూపులు,పౌర సంఘాలు మారథాన్‌ కార్యకర్తలతో కలిసి మహిళా సాధి కారత,పునరుత్పత్తిని ప్రోత్సహించడానికి కవాతు లు, చర్చలు మరియు ర్యాలీలతో కూడిన ప్రచారా న్ని రూపొందించడానికి పని చేస్తుంది. కుటుంబ నియంత్రణ సేవలకు హక్కులు మరియు సార్వత్రిక ప్రాప్యత.సమాచార బూత్‌లు ఉచిత గర్భ నియం త్రణ సాధనాలు మరియు విద్యా సమాచారాన్ని అందిస్తాయి.
డి.యునైటెడ్‌ స్టేట్స్‌..
యునైటెడ్‌ స్టేట్స్‌లో,ఫెడరల్‌ ప్రభుత్వం ప్రపంచ జనాభాదినోత్సవ కార్యక్రమాలను అధికా రిక పరంగా నిర్వహించదు, బదులుగా, విశ్వవిద్యాలయాలు, సంఘాలు మరియు ప్రభుత్వే తర సంస్థలు ప్రచారాన్ని చేపట్టాయి. కళాశాల ప్రాంతాలలో జనాభా నిపుణులైన అతిథి వక్తలు ఉంటారు, పరిశోధన ఫలితాలను కూడా విడుదల చేస్తారు మరియు లక్ష్య అంశానికి సంబంధించిన సమస్యలపై సమావేశాలను నిర్వహిస్తారు.సియెర్రా క్లబ్‌ లేదా ప్లాన్డ్‌ పేరెంట్‌హుడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికా వంటి పర్యావరణ సంస్థలు, అవగాహన పెంచడానికి తరగతులను అందిస్తాయి మరియు అదే సమయంలో, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు చవకైన కుటుంబ నియంత్రణ సేవలను అంది స్తాయి.
నానాటికీ పెరుగుతున్న జనాభా వృద్ధి రేటును అరికట్టడానికి, ప్రపంచ జనాభా దినోత్స వాన్ని ఎల్లప్పుడూ వార్షిక వారసత్వంగా జరుపుకుం టారు, ఇది సమాజానికి అనుకూలమైన పరిష్కారా లను రూపొందించడానికి మన భాగస్వామ్య బాధ్యతను గుర్తు చేస్తుంది.అవగాహన పెంపొందిం చడం ద్వారా,కమ్యూనిటీలకు తలుపులు తెరిచే కార్యక్రమాల కోసం పోరాడడం మరియు హక్కులు మరియు స్వచ్ఛంద కుటుంబ నియంత్రణను నిర్ధారించడం ద్వారా,ఈ గ్రహం మీద నివసించే వారందరికీ మనం కోరుకునే భవిష్యత్తును మనం సాధించవచ్చు. 2024 నాటికి 8 బిలియన్ల మైలు రాయిని చేరుకోవడంలో,ఈ ప్రపంచ జనాభాది నోత్సవం ఒక మిషన్‌గా మరింత అత్యవసరం కాబట్టి ఇది ఆనాటి సవాళ్లను పరిష్కరించ గలదు. 2024లో ప్రపంచ జనాభా అధికారికంగా మొత్తం 8 బిలియన్లకు చేరుకోవడంతో ఇది ప్రపంచానికి నిజమైన మైలురాయి అని ఐక్యరాజ్య సమితి (యుఎన్‌)ఎత్తి చూపింది.
ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.1950తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగాఉన్నప్పటికీ,2080ల నాటికి 10.4బిలియన్ల (10 40 కోట్లు)కు చేరుకుం టుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభా శాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందర గా జరుగవచ్చని నమ్ముతు న్నారు. కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమా నంగా జరుగు తోంది.వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50శాతానికి పైగా కేవలం 8దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిర చింది.కాంగో,ఈజిప్ట్‌, ఇథియోపియా,భారత్‌, నైజీరియా,పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌,టాంజా నియా దేశా ల్లోనే ఈఅధిక జనాభా రేటు నమోదవు తుందని చెప్పింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తిరేటు ప్రతీ మహిళకు సగటు న 2.1 కంటే తగ్గిపోయింది.61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం1శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానో త్పత్తి రేటు ఉన్న దేశాల్లోచైనా కూడా ఒకటి. చైనా లో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభా లో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటిం చింది.దేశంలో ‘ఒకేబిడ్డ’అనే విధానాన్ని విడిచి పెట్టి,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టి నప్పటికీ చైనా జనాభా అనుకున్న దానికంటే వేగంగా తగ్గు తోంది.భారత్‌లో జనాభా పెరుగు తూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించ నుంది.జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతు న్నాయి.సైన్స్‌,మెడిసిన్‌ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగు దలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాలరేటు తగ్గిపోవ డంతోపాటు,ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం77.2 సంవత్స రాలుగా ఉండనుంది.కానీ, దీని ప్రకారం జనాభాలో 65ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10శాతంగా ఉండగా,2050నాటికి16శాతానికి పెరుగు తుంది.ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
జనాభా దినోత్సవం నేపపథ్యం ఇదీ..
ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగా హన కల్పించేందుకు అనేక కార్యక్రమా లను నిర్వహిస్తారు.జననాలరేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గ వర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏరోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుతుందని అంచ నా వేస్తారో,ఆరోజున (1987జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయిం చింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్య రాజ్యసమితి సాధారణ సభ తీర్మానం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియ జేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్ర మాలు దోహదపడతాయని తెలిపింది. కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవా ళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్స వం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉప యోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం నిలి చింది. అధిక జనాభా కారణంగా కోవిడ్‌-19 మహ మ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెం డా అనేది ఆరోగ్యవంతమైన భూమండలంపై ప్రజ లందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్‌ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటో నియో గుటెరస్‌ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు,పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈమిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తు న్నట్లు తెలిపారు.
జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!
ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత32ఏళ్లుగా జరుగుతు న్నదే. అయిన ప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతు న్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100 నాటికి మన దేశంలో జనాభా 1450 మిలియన్‌ తాకుతుందని అంచనా వే సింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‌ దాటు తుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌ లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‌ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6బిలియన్‌ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం…ప్రపంచ జనాభా విషయానికొచ్చే సరికి దాదాపు 16శాతం జనాభా మనదేశమే అకామొడేట్‌ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభాబీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటా యని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.
2050 నాటికి స్త్రీ, పురుషుల జనాభా సమానం
2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా. 2020లో, 1950 తర్వాత మొదటిసారిగా,జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ఈ శతాబ్దం చివరి వరకు మందగిం చడం కొనసా గుతుందని అంచనా వేసింది. ప్రపం చంలోని కొన్ని ప్రాంతాలలో,అంతర్జాతీయ వలసలు జనాభా మార్పులో ప్రధాన అంశంగా మారాయి. 2010, 2021మధ్య పది దేశాలు1 మిలియన్‌ కంటే ఎక్కువ వలసదారుల నికర ప్రవా హాన్ని అనుభవించాయని అంచనా వేయబ డిరది.ఈదేశాలలోచాలా వరకు,ఈ ప్రవాహాలు తాత్కాలిక శ్రామిక కదలికల కారణంగా ఉన్నాయి. భారతదేశం (-3.5 మిలియన్లు),బంగ్లాదేశ్‌(-2.9 మిలియన్లు), నేపాల్‌ (-1.6మిలియన్లు),శ్రీలంక(-1 మిలియన్‌). జనాభా రెట్టింపుతో వనరులపై తీవ్ర ప్రభావం46 అతితక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ూణజు) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండనున్నాయి. అనేక మంది 2023,2050 మధ్య జనాభాలో రెట్టింపు అవు తుందని అంచనా వేయబడిరది, వనరులపై ఇది అదనపు ఒత్తిడిని, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ూణGం) సాధనకు సవాళ్లను విసిరింది.జనాభా, స్థిరమైన అభివృద్ధి మధ్య సం బంధాన్ని వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఇతర ప్రపంచ పర్యావరణ సవాళ్ల నేపథ్యంలో పరిగణించాలని యూఎన్‌ నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల పర్యావరణ నష్టానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చుబీ అయితే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా పరిగణించ బడిన కాలపరిమితి, అందు బాటులో ఉన్న సాంకేతి కత,జనాభా,సామాజిక, ఆర్థిక సందర్భాలపై ఆధార పడిదాని ఆవిర్భావ సమయాన్ని వేగవంతం చేయ వచ్చు.

పోలవరంపై శ్వేత పత్రం విడుదల

పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.జగన్‌ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని…డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న విషయం జగన్‌కు కూడా రెండేళ్ల తర్వాత తెలిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితిపై వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో శ్వేతపత్రం విడుదల చేశారు. దానిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….‘‘సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వైసీపీ 5ఏళ్ల విధ్వంసంతో రాష్ట్రం ఎలా నష్టపోయిందో కూలంకుశంగా ప్రజల్లో చర్చజరగాలి. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించారు. ఫోర్త్‌ ఎస్టేట్‌ కూడా గత ప్రభుత్వానికి భయపడిరది. కోర్టులను కూడా బ్లాక్‌ మెయిల్‌ చేసి జడ్జిలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.రాష్ట్ర పునర్నిర్మాణం జరగడానికి మేమంతా కష్టపడి పని చేస్తాం. ప్రజలు గెల వాలి..రాష్ట్రం నిలవాలి అని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచి…చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టడంలో అందరూ భాగమైతే దానికి మేము బాధ్యత తీసుకుంటాం. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న వాటిలో 7 ప్రధాన అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ పెట్టే ముందు మన సమస్యలు కూడా కేంద్రం ముందు ఉంచాలి. అందుకే 25 రోజుల్లోనే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెడతాం. ఇరిగేషన్‌ సంబంధించి ఒక వెబ్‌ సైట్‌ ప్రారంభించి అందులో అన్ని అంశాలను ఉంచుతాం.చెప్పిన తప్పులనే వందసార్లు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు…దానికి వాస్తవాలతో చెక్‌ పెడతాం. అవాస్తవా లన్నింటికీ ప్రజలే బుద్ధి చెప్పేలా వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం. రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతో ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే టీడీపీ హయాంలో రూ.67 వేల కోట్లు ఇరిగేషన్‌ పై ఖర్చు చేశాం.కనీసం గత ప్రభుత్వం వాటి నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పోలవరానికి శాపంగా మారిన జగన్‌
‘‘రాష్ట్రానికి రెండు ప్రధానమైన ప్రాజెక్టుల్లో ఒకటి పోలవరం…రెండు అమరావతి. ఆ రెండూ రాష్ట్రానికి రెండు కళ్లులాంటివి.అవి పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి ఉన్న నష్టాన్ని పూడ్చుకోవచ్చు. జగన్‌ పోలవరానికి ఒక శాపంగా మారారు. జగన్‌ చేసిన నేరం క్షమించరానిది.కుల,మత,ప్రాంతాలకు అతీతంగా జగన్‌ను అందరూ నిలదీయాలి. రాష్ట్రాన్ని నాశనంచేసే హక్కు ఎవరికీ లేదు. దక్షణ భారతదేశంలో అత్యధిక నీళ్లు ఉండే ఏకైక నది గోదావరి.యేటా3వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోంది.వీటిని విని యోగించుకుంటే రాష్ట్రంలో కరవు అనేది ఉం డదు. పోలవరంలో ముంపునకు గురయ్యే 7 మండలాలు నాడు తెలంగాణలో ఉన్నాయి… అవి ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంతో మొదటి కేబినెట్‌ సమావేశంలోనే ఏపీలో కలుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఉత్తరాంధ్ర, రాయల సీమకు తాగు,సాగు నీరు అందించే బహు ళార్ధక సాధక ప్రాజెక్టు. 2014లో విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే 2019 నుండి 2024 మధ్య జరిగిన నష్టమే ఎక్కువ. పోలవరం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు…23.50 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు.పరిశ్రమలకు సమృద్ధిగా నీరందించవచ్చు.టీడీపీ హయాంలో ఒకే రోజున 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించాం. నేను 31 సార్లు క్షేత్రస్థాయిలో పోలవరంలో పర్యటించాను. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయానికి ఊతం వస్తుందనే శ్రద్ధ పెట్టాను. ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్‌ చేశాను. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ హయాం లో రూ.11,762.47కోట్లు ఖర్చు చేస్తే…వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్‌ చేతకానితనం, అహం భావం వల్లే ప్రాజెక్టు దెబ్బతింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రాజెక్టు పనులు నిలిపేశారు. ప్రాజెక్టు పరిస్థితి ఏంటో చూడ కుండా పనులు నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండానే పని చేసే ఏజన్సీలను తొలగించారు.2019జూన్‌ నుండి నవంబర్‌ వరకు ప్రాజె క్టుకు ఏజన్సీ లేదు. వరదలతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని రెండేళ్ల తర్వాత కనుక్కు న్నారు. టీడీపీ హయాంలో ఉన్న కాంట్రాక్టరు పనితీరు సంతృప్తిక రంగానే ఉంది..మార్చా ల్సిన పనిలేదని పీపీఏ తమ మినిట్స్‌ లో పేర్కొంది. 2009లో కాంట్రాక్టరును మార్చడం వల్ల హెడ్‌ వర్క్స్‌ పనులు నిలిచిపోయాయి… కాంట్రాక్టర్‌ ను మార్చితే జాప్యం జరుగుతుం దని పీపీఏ హెచ్చరించింది. కొత్తకాంట్రాక్టరను మార్చడం వల్ల పనుల్లో జాప్యం జరుగిందని పీపీఏ తెలిపింది. ఒకే పనిని రెండు ఏజన్సీలు చేస్తే నాణ్యత దెబ్బతింటుదని చెప్పినా వినలేదు. కాంట్రాక్టర్‌ ను మార్చడం, ముందు చూపు లేకపోవడంతో పనులు తీప్ర జాప్యం అవుతా యని కేంద్ర ఇరిగేషన్‌ సెక్రటరీకి పీపీఏ లేఖ కూడా రాసింది. మేము అధికారంలో ఉన్న ప్పుడు ఏనాడూ ఏకపక్ష నిర్ణయాలు తీసు కోలేదు..కానీ జగన్‌ ఇష్టానుసారంగా నిర్ణ యాలు తీసుకున్నారు.తనకు అన్నీ తెలుసు అన్నట్లుగా వ్యవహరించారు.’’అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డయాఫ్రం వాల్‌,కాఫర్‌ డ్యాం డ్యామేజీ
‘‘పోలవరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపేందుకు నీతి ఆయోగ్‌ నియమించిన నిపుణుల కమిటీ కూడా ప్రభుత్వ అసమర్థ ప్రణాళికతోనే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని నివేదిక ఇచ్చింది. డయాఫ్రం వాల్‌, ఎగువ కాఫర్‌ డ్యాం,దిగువ కాఫర్‌ డ్యాంలు దెబ్బ తిన్నాయి. 2018లో రూ.436 కోట్లతో డయాఫ్రం వాల్‌ పూర్తి చేశాం…కానీ గత ప్రభుత్వ నిర్వాకంతో డ్యామేజ్‌ అయిన పనులకే ఇప్పుడు రూ.447 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలు స్తోంది. కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది..దానికి కూడా మూడు నాలుగు సీజన్లు పడుతుందని అధికారులు అంటున్నారు. జగన్‌ మూర్ఖత్వంతో చేసిన పనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. జగన్‌ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగో ళిక పరిస్థితులే మారిపోయాయి. ఎగువ కాఫర్‌ డ్యాం నుండి వచ్చిన వరద ఉధృతికి గ్యాప్‌-1వద్ద 150 మీటర్ల గట్టు కొట్టుకు పోయింది. జగన్‌ నిర్లక్ష్యం,విధ్వంసంతో ప్రాజెక్టుకు సహజ సిద్ధంగా లభించేవి కూడా ప్రమాదంగా మారి ప్రాజెక్టు స్థితినే మార్చే శాయి. గైడ్‌ బండ్‌ కుంగిపోయింది. నేరుగా నీళ్లు వస్తే ప్రజర్‌ తగ్గుతుందని గైడ్‌ బండ్‌ను రూ.80కోట్లతో నిర్మించాం.డయాఫ్రం వాల్‌, ఎగువ-దిగువ కాపర్‌ డ్యాం,గైడ్‌ బండ్‌ ఈ మూడు డ్యామేజీలు జగన్‌ నిర్వాకంవల్లే జరిగినవే…వాటి వల్ల ప్రాజెక్టు పనులు,పవర్‌ హౌస్‌ ఆలస్యం అవుతున్నాయి.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సైతం దారి మళ్లింపు
‘‘టీడీపీ ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేస్తే…వైసీపీ 3.84 శాతం మాత్రమే పూర్తి చేసింది. దానికి తోడు నిధుల కొరత కూడా తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో రాష్ట్ర నిధులు ఖర్చు చేసి రీయింబర్స్‌ చేయించాం… వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయకుండా రూ.3,385 కోట్లు దారిమళ్లించింది. టీడీపీ హయాంలో వచ్చిన గిన్నిస్‌ రికార్డుకు కేంద్రం కూడా ప్రశంసలు కురిపిస్తే..వైసీపీ హయాంలో నిపుణులు,పీపీఏ చివాట్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు.45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే…వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించింది.రూ.55,548 కోట్లకు కేంద్రంతో ఆమోదం తెలిపేలా మేము కృషి చేస్తే…గత ప్రభుత్వం అసలు నిధులు కూడా అడగలేదు. నిర్వాసితులకు జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు. పరిహారం ఎకరాకు రూ.19లక్షలు ఇస్తానన్నారు. పరిహారం అందిన వారికి కూడా రూ.5 లక్షలు అదనంగా ఇస్తానన్నారు. పరిహారం ఇవ్వక పోవడమే కాకుండా నిర్వాసితుల జాబితాలు మార్చి పరిహారం కాజేశారు. సకల వసతులతో కాలనీలు నిర్మిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.అధికారం,ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్నీ చెప్పాడు. పునరావాసానికి రూ.4,114కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసి మోడల్‌ కాలనీలు నిర్మిస్తే…వైసీపీ ప్రభుత్వం రూ.1687కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
ప్రాజెక్టు పూర్తిపై పూటకో మాట
‘‘పోలవరం ప్రాజెక్టు పూర్తిపై పూటకో మాట మాట్లాడారు. మొదటి సారి 2021ఏప్రిల్‌ నాటికి, రెండోసారి 2021డిసెంబర్‌ నాటికి, మూడోసారి 2022 ఏప్రిల్‌ నాటికి,నాలుగో సారి 2021 డిశంబర్‌ నాటికి..ఇక ఐదో సారి ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేం అని చేతులెత్తేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇప్పుడు కేంద్రం అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించి ప్రాజెక్టు దుస్థితిపై అధ్యయనం చేయాల్సి వస్తోంది. హైడల్‌ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి కావాల్సి ఉన్న ప్పటికీ పూర్తికానందున ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. జగన్‌ నిర్లక్ష్యంతో డ్యామేజ్‌,రిపేరు పనులకు రూ.4,900 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టుపై 38 శాతం మేర ఖర్చులు పెరిగా యి. టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌ లోనే సమాధానం ఇచ్చింది. మా ప్రభుత్వంలో అవినీతి జరిగిందని నిరూ పించడానికి అనేక ప్రయ త్నాలు చేశారు. పిచ్చి కుక్క ముద్ర వేసి కుక్కను చంపినట్లు…మంచి ప్రాజెక్టుపై అవినీతి నెపం వేసి విధ్వంసం చేశారు.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్‌ దుస్సాహసమే ప్రాజెక్టు నాశనానికి కారణం
‘‘ఐదేళ్లు మేం పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలియకుండా దాచి పెట్టారు. కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌, గైడ్‌ బండ్‌ తో పాటు అన్ని చోట్లా సమస్యలు సృష్టించారు. ప్రజలంతా అర్థం చేసుకోవాలి…ప్రాజెక్టు సర్వనాశనానికి జగన్‌ దుస్సాహసమే కారణం. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలానే జరుగుతుంది. కొందరు ఆంబోతుల మాదిరిగా వచ్చి మమ్మల్ని తిట్టొచ్చు…విమర్శలు చేయొచ్చు.కాఫర్‌ డ్యాంకు,డయాఫ్రం వాల్‌ కు తేడా తెలియ కుండా…ప్రాజెక్టు వద్దకెళ్లి కాఫర్‌ డ్యాం ఎక్కడుందో వెతుక్కునే వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు.కాఫర్‌ డ్యాం కూడా పర్మినెంట్‌ కాదు…నీటి డైవర్షన్‌ కోసమే కాఫర్‌ డ్యాం నిర్మాణం మూడునాలుగేళ్ల పాటు ఉంటుంది. మొదటి శ్వేతపత్రం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపైనే విడుదల చేశాం. ఇది పూర్తైతే పక్క రాష్ట్రాలకు కూడా నీరు ఇవ్వొచ్చు. తెలం గాణకు కూడా సాగర్‌ కాల్వ ద్వారా నీరందించ వచ్చు.రాయలసీమ బాగుండాలంటే నల్లమల అడవి గుండా టన్నెల్‌ ద్వారా బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీరందించవచ్చు.కానీ ఇప్పు డు ప్రాజెక్టు పరిస్థితి చూస్తే బాధ,ఆవేదన కలుగుతోంది. కాఫర్‌ డ్యాం ద్వారా నీరు లీక్‌ అవుతోంది…దాన్ని పరిష్కరించకుండా పనులు ముందుకు సాగవు. ఇక్కడి ఇంజనీర్లు రిస్క్‌ తీసుకోవాలన్నా భయపడే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టులో పైకి తెలిసిన డ్యామేజీ కంటే… తెలియని డ్యామేజీ చాలా ఉంది. 2021లోనే ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటికీ 2022లో పూర్తి చేస్తాం,2023 నాటికి పూర్తి చేస్తాం అని చెప్పారు. డయాఫ్రం వాల్‌ కు కనీసం రెండు సీజన్ల సమయం పడుతుందని అధికారులు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి రావడానికి ప్రధాన దోషైన జగన్‌ ను ప్రజలు ఇంటికి పంపారు. 45.72 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం జరుగు తుంది.ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ కూడా అదే ఎత్తులో ఉంటుంది.
ఓట్ల కోసం నిర్వాసితులను కూడా మోసం చేశారు
‘‘నిర్వాసితుల సమస్యలను చూస్తే బాధేస్తోంది. వర్షాల సమయంలో నీళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుండి వెళ్లిపోతే పరి హారం రాదేమోనని భయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును తలచుకుంటేనే బాధే స్తోంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా… మనమంతా కలిసి పని చేసి సంక్షోభం నుండి ప్రజల్ని, రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్టు పట్ల గత ప్రభుత్వం చేసిన దుర్మార్గంతో ఒడిశా,చత్తీస్‌గడ్‌ కూడా కేసులు వేసింది.ప్రాజెక్టును ఆషామాషీగా తీసుకో కూడదు…తేడాలు జరిగితే ప్రమాదం ఏర్పడు తుంది..కానీ గత ప్రభుత్వం పట్టనట్లు వ్యవహ రించింది. గతంలో కేంద్రం అనుమతితో ట్రాన్స్‌ ట్రాయ్‌ తో చేసుకున్న ధరల ఒప్పందం ప్రకారమే నవయుగకు పనులు అప్పగించాం… కానీ వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పిలిచింది. నేను రివర్స్‌ టెండరింగ్‌ నిర్ణయం తీసుకున్నాను…అమలు చేయండి అని మాట్లా డారు. నేను కట్టానన్న అక్కసుతోనే పట్టిసీమను పక్కనబెట్టారు. ప్రజా చైతన్యమే అన్నింటికీ పరిష్కారం అవుతుంది. ప్రజల్లో చైతన్యం లేక పోతే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని పాలకులు తప్పులు ఎక్కువ చేస్తారు. రాజకీయా ల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్‌. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదనే ప్రజలు కూటమికి ఘనవిజయాన్ని ఇచ్చారు. పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రికి 936 మంది భద్రతా సిబ్బంది అవసరమా.?నేను బయటకు వెళ్లినా అలవాటులో పోలీసు అధికా రులు పరదాలు కడుతున్నారు. ప్రజలకు ఇబ్బం ది కలిగేలా ట్రాఫిక్‌ కూడా ఎక్కువ సేపు ఆపొద్దని అధికారులను ఆదేశించాను.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.-జిఎన్‌వి సతీష్‌

పార్లమెంట్‌లో పెరగని మహిళా ప్రాతినిధ్యం

మహిళలను జాతి నిర్మాతలుగా మలచడానికి, నారీ శక్తిని గౌర వించడానికి ప్రధాని మోడీ పార్ల మెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2023లో ఆమోదించారని, గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయే ప్రచారం జరిగింది. పార్లమెంట్‌ ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టం ప్రకారం పార్ల మెంటు, శాసనసభ ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అనేది 2026లో జాతీయ జనాభా గణన పూర్తయి, పార్లమెంటు స్థానాల పునర్వ్యవస్థీకరణ (డి-లిమిటేషన్‌) పూర్తయిన పిదప అమలులోకి వస్తుంది. అంటే 2029లో మాత్రమే అది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కారణాలవల్ల ఈ డెడ్‌లైన్‌ మిస్‌ అయితే 2034లో జరగబోయే ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్‌ అమలయ్యే పరిస్థితి లేదని మనం అర్ధం చేసుకోవాలి.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది.ఆ పేరుతో ఏడాదిపాటు సంబరాలు కూడా జరుగుతున్నాయి.మరి75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా మహిళల పరిస్థితి దేశంలోఎలా ఉంది?మహిళలకు దక్కాల్సిన సమా న అవకాశాల పరిస్థితి ఏంటీ? ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే నినాదం ఇంకా అలాగే ఎందుకు మిగిలింది?అన్ని అన్నీ రంగాల్లో సమాన హక్కులు సరే,చట్టాలు చేసి దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభల్లో మహిళలకు ఏమేరకు భాగ స్వామ్యం దక్కింది?మనపార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళల ప్రాతినిధ్యం తొలిసారిగా వంద దా టింది.ప్రస్తుతం లోక్‌సభలో 81మంది,రాజ్య సభ లో29మంది మహిళా ఎంపీలుఉన్నారు. మొత్తంగా చూస్తే 14.9శాతమే.సమాన అవకాశాల నినాదం ప్రకారం చూసినా,33శాతం రిజర్వేషన్‌ బిల్లు పరంగా చూసినా చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం చాలా తక్కువే.ఇక ఆయా రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల పూర్తియిన తర్వాత కూడా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా సగటున 9శాతం మంది మహిళలు మాత్రమే ఎంపీలయ్యారు.ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే పురుషులకు కొంచెం అటుఇటుగా మహిళా ఓటర్లు ఉంటారు.కానీ ఎన్నికల్లో పోటీ,గెలుపు విషయానికి వచ్చేసరికి మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
దేశంలోని మిగితా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా..తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 317మంది మహిళలు పోటీ చేయగా,.27మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.అంటే గెలిచిన 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 140మంది మహిళలు పోటీ చేస్తే ఆరుగురు మాత్రమే గెలిచారు.122మంది డిపాజిట్లు కోల్పోయారు.2019ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 211మంది పోటీ చేస్తే 14 మంది మహిళలు గెలవగా,174మందికి డిపాజిట్‌ దక్కలేదు.ఇక 2014లో చంద్రబాబు సీఎంగా ఏర్పడిన ఏపీ కేబినెట్‌లో పరిటాల సునీత, అఖలి ప్రియ,మృణాళిని,పీతల సుజాత మంత్రులుగా పని చేశారు. తెలంగాణా ఏర్పడ్డాక కొలువుదీరిన మొదటి కేబినెట్‌లో ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు.2018లో తెలంగాణాలో ముందుస్తు ఎన్నికలు రావడం,ఆతర్వాత మరోసారి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కేబినెట్‌లో చోటు దొరికింది.వారే సత్యవతి రాతోడ్‌,సబితా ఇంద్రారెడ్డి.సబితా వేరే పార్టీ నుంచి రాగా,సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.అంటే టీఆర్‌ఎస్‌ బీ`ఫారం మీద గెలిచిన ఏ ఒక్క మహి ళా ఎమ్మెల్యే ఇప్పటి వరకు మంత్రా కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఏర్పడిన వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో పుష్పశ్రీవాణి,వనిత, సుచరిత, విడుదల రజనీ మంత్రులయ్యారు.
ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే మహిళా సభ్యుల ప్రాతినిధ్యం తీసికట్టుగానే ఉంది. ఇంకా చెప్పా లంటే తగ్గింది.74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇది మొత్తం పార్లమెంట్‌ సభ్యుల్లో 13.6శాతం మాత్రమే.2019లో78మంది మహి ళలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.ఇది14.4 శాతంగా ఉంది.గత ఎన్నికల్లో 726మంది మహిళ లు పోటీ చేయగా,2024ఎన్నికల్లో పోటీ చేసిన వారి సంఖ్య 797కి పెరిగింది.అయినా ఎన్ని కయి న మహిళా పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య తగ్గడం గమనార్హం.
ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షిం చేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విషయం మనకు తెలిసిందే.రాష్ట్రాలలో శాసనసభలకు జరిగే ఎన్ని కల సందర్భంగా,మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను కూడా రాజకీయ పార్టీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల లాగే,పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో ప్రత్యేక పథకాలను పొందు పరిచాయి.ఆంధ్రప్రదేశ్‌,ఒడిషా ఎన్నికలలో పాలక, ప్రతిపక్ష పార్టీలు మహిళలే కేంద్ర బిందువుగా అనేక పథకాలు తీసుకువచ్చాయి. వీటన్నింటి ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని,ఓట్లు వేయడానికి మహిళా ఓటర్లు పోటెత్తుతారని అందరూ భావించారు. కానీ విపరీతమైన ఎండ తీవ్రత,ఓటింగ్‌ పట్ల నిరాసక్తత వంటి కారణాలతో ఓటింగ్‌ శాతం తగ్గింది.
2019లో దేశవ్యాప్తంగా 67.01శాతం పురు షులు ఓట్లేయగా,67.18శాతం మహిళలు ఓట్లేశారు.ఈ ఎన్నికలలో 65.08శాతం పురు షులు ఓట్లేస్తే, 65.78శాతం మాత్రమే మహిళా ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో 31కోట్ల మంది మహిళా ఓటర్లు ఓట్లేసినప్పటికీ, గతంతో పోలిస్తే దాదాపు 2 శాతం మహిళా ఓటింగ్‌ తక్కువ నమోదవడం గమనార్హం. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో మాత్రం 80 శాతం పైబడి మహిళా ఓటింగ్‌ నమోదైంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 52దేశాల్లో పార్లమెంట్‌ ఎన్ని కలు జరిగాయి.ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపియు) సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 27.6శాతం మహిళలు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. ఈవిషయంలో 185ప్రపంచ దేశా ల్లో భారత్‌ స్థానం 143గా ఉంది.ఈ ఏడాది ఎన్ని కలు జరగడానికి ముందు మన దేశ పరిస్థితి ఇది. ఈ ఎన్నికల తర్వాత,మన దేశస్థానం ఇంకా దిగ జారే ప్రమాదం ఉంది.ఫిన్లాండ్‌, నార్వే, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌,స్వీడన్‌ దేశాలు ఎప్పుడో మహిళా సమానత్వాన్ని సాధించాయి.అక్కడి ప్రజాప్రతి నిధుల్లో అత్యధికులు మహిళలే.
మన పార్లమెంట్‌లో మహిళల భాగస్వా మ్యం అంతంత మాత్రంగా ఉంటే, అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి.ఈ మధ్యే మెక్సికోలో మొట్టమొదటి సారిగా ఓ మహిళ అధ్యక్ష పీఠానికి ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన ఇద్దరు అభ్యర్థు లూ మహిళలే కావడం విశేషం.ఇదేదో ఒక రోజు లో జరిగింది కాదు. మెక్సికో కూడా లిబరల్‌ దేశ మేమీ కాదు. అక్కడ కూడా ఛాందసవాద శక్తులు, గుత్త పెట్టుబడిదారీ శక్తులు వివిధ రంగాల్లో మహి ళల భాగస్వామ్యాన్ని అడ్డుకుంటూనే ఉన్నాయి. అయితే, వీటిపై పురోగామి శక్తులు,ఫెమినిస్టులు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. దాని ఫలితమే ప్రస్తుతం మెక్సికోలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మన దేశంలో పార్లమెంటరీ రంగం లోనే కాదు నిర్ణయాత్మక రంగాలలోనూ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువుగా ఉంది. దేశం అను కున్న రీతిలో అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన అవరోధంగా ఉంది.1947లో దేశ మొత్తం అక్షరా స్యత కేవలం 12 శాతం ఉండగా నాడు మహిళల్లో అక్షరాస్యులు 6 శాతం మాత్రమే. ప్రస్తుతం మొత్తం అక్షరాస్యత 77.7శాతం ఉండగా మహిళలది 70.3 శాతంగా నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే గణనీ యంగా పెరిగింది. 1957లో కేరళలో నంబూద్రి పాద్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేసింది.1977లో పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం కూడా భారీగా భూ సంస్కరణలు అమలు చేసింది. మిగులు భూమి ని పేద ప్రజలకు ఇవ్వబడిరది.తినడానికి ఆహారం, చదువుకోవడానికి విద్య ప్రజలకు లభించింది. అందుకే మానవాభివృద్ధిలో మొదటి స్థానం కేరళ రాష్ట్రానిది.100శాతం అక్షరాస్యత సాధించబ డిరది. ఈ నిర్ణయాల వల్ల కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో మహిళల స్థితిగతులు గణనీయంగా పెరిగాయి.
1992లో 73,74రాజ్యాంగ సవరణ ల ద్వారా మహిళలకు అన్ని స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2002లో పట్టణ స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,మహారాష్ట్ర, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో పంచాయతీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.ఫలితంగా వారి ప్రాతి నిధ్యం గణనీయంగా పెరిగింది. మరోవైపు చూస్తే చదువు,అవకాశాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు,అత్యాచారాలు దేశంలో ఏదో మూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయి.స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసు కొచ్చినా పోరాటం తప్పడం లేదు. అసంఘటిత రంగాలలో మహిళలు వారి కనీస సదుపాయాల కోసం నిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. మణి పూర్‌లో కుకీ ప్రజలపై జరిగిన దాడులు, మహిళ లపై జరిగిన అత్యాచారాల ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని,సుప్రీంకోర్టు హెచ్చరిక చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో పురుషాధిక్య ధోరణి, లైంగిక అణచి వేత పోవాలంటే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.దీనితో పాటుగా రాజకీయాల తీరు తెన్ను లు మారాలి. పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్‌ సభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులని, అనేకమంది ఎంపీలకు నేర చరిత్ర ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛందసంస్థ తెలియచేస్తోంది. ధన మయ,నేరమయ రాజకీయాలు రూపుమా పకుండా పురోగామి,మహిళాభ్యుదయ రాజకీయాలు సాధ్యమా అనేదే ప్రశ్న? దురదృష్టవశాత్తు మహిళా భ్యుదయంలో ముందంజలో ఉన్న కేరళ రాష్ట్రం నుంచి ఒక్క మహిళా పార్లమెంట్‌ సభ్యులు కూడా ఎన్నిక కాలేదు.
అన్ని పార్టీలూ మహిళలను నిలబెడితేనే మహిళా ప్రాతినిధ్యం సాధ్యం. కనుక పార్లమెంట్‌ లో,చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే మహిళా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి. ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యామ్నా య ఆర్థిక విధానాలతో ముందుకు వచ్చే వామపక్ష, అభ్యుదయ శక్తులను ప్రజలు ఆదరించాలి. మత వాద,చాందసవాద రాజకీయ శక్తులను ఓడిర చాలి.అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడే, ప్రత్యామ్నాయ శక్తుల రాజకీయ ప్రాబల్యం పెరిగి తేనే నిజమైన మహిళాభ్యున్నతి,మహిళా సాధి కారత సాధ్యం అవుతుంది.
పార్టీల్లోనూ అంతంతే..
రాజకీయపార్టీల విషయానికివస్తే నలు గురు మహిళలు పార్టీలకు అధ్యక్షులుగా ఉండి విజయంవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. మాయావతి,సోనియాగాంధీ,మమతా బెనర్జీ, మెహ బూబా ముప్తీ రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా,పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. జయలలిత వంటివారు కూడా పార్టీని ఎంత సమర్ధ వంతంగా నడిపారో,ఎలా అధికారంలోకి తెచ్చారో మనకు అనుభవంలోఉన్నదే.అయితే మిగతా రాజకీయ పార్టీల్లో మహిళు ఎక్కడ ఉంటు న్నారు? వారి పాత్ర ఏమిటీ ని ఆలోచించినప్పుడు నిరాశా పూరిత వాతావారణమే కనిపిస్తుంది. ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ,కోశాధికారి వంటి పదవులకు మహిళలు కనీసం నామినేషన్‌ వేసే పరిస్థితి కూడా పలు పార్టీల్లో లేదు.దశాబ్దాలుగా పురుషల డామి నేషన్‌ ఆయా పార్టీల్లో పరంపరంగా కొనసాగుతూ వస్తోంది.ఎంపీటికెట్లు,ఎమ్మెల్యే టికెట్లు దాటి పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి మెజార్టీ పార్టీల్లో మహిళలకు లేదు.
33శాతం రిజర్వేషన్‌ బిల్లు పరిస్థితి..
మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌ ఆమోదం పొందలేదు.2008లో తొలి సారిగా పార్లమెంట్‌ ముందుకు వచ్చిన ఈబిల్లుకు కొన్ని పార్టీలు ససేమిరా అన్నాయి.మహిళలకు ఒకసారి రిజర్వుచేస్తే శాశ్వతంగా తమకు అధికా రం దక్కదన్న భావన ఆబిల్లుకు ఆమోదం కాకుండా అడ్డుపడుతోంది.యూపీఏ హాయంలో ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు జరిగాయి.ఆ తర్వాత వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం ఈబిల్లు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ దక్కుతున్నా ఎన్ని కైన తర్వాత 90శాతం మగవారే పెత్తనం చెలాయి స్తున్నారు.పేరుకే మహిళలు సీట్లోకూర్చుంటున్నా భర్తో,అన్నో,తండ్రోవ్యవహరాలను చక్కబెడు తున్నా రు. ఇది రాజ్యాంగ విరుద్దం అని తెలిసినా చూసీ చూడనట్లు నడిచిపోతోంది.అసలు ఈ పరిస్థితి ఎందుకు తెలెత్తుతోంది?సంప్రదాయకంగా మహిళ లను ఇంటికి,ఇంటి వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన మెజారిటీ కుటుం బాల్లో ఉండటమే ప్రధాన కారణం.ఇల్లు,పిల్లలు తప్ప మరోగోల పట్టని మహిళే మెజారిటీ,వారిని ఛట్రంలోనే ఉంచుతున్నది మెజారిటీ పురుషస్వా మ్యమే అయినా అక్కడక్కడ మహిళలు కూడా ఇందుకు దోహదపడుతున్నారు.ప్రాధమికంగా చదువుకునే విషయం నుంచి ఈ వివక్ష మొదలవు తుంది.ఆడపిల్లలకు చదువుఎందుకనే చర్చ మొదలు కొని ఎక్కువ చదువుకుంటే సరైన భర్తను తేలేమన్న హిపోక్రటిక్‌ భావాలతో సమాజం నిండిపోయింది. ఇలాంటివెన్నో వారు రాజకీయంగా ఎదగకపోవ డానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.- (పి.సతీష్‌)

1 2