హైడ్రోప్రాజెక్టుపై గిరిజనం తిరుగుబాటు
జనాలను రక్షించేవాడని షిర్డిసాయికి పేరు. కానీ.. అక్కడ షిర్డిసాయి మాత్రం గిరిజనుల గుండెపై బాణం సంధిస్తు న్నాడు. వేలాది జనాలను రోడ్డున పడేస్తున్నాడు. వందల ఎకరాలు నేలమట్టం చేయి స్తున్నాడు. ప్రకృతిఒడిలో పెరిగిన పంటలను ధ్వం సం చేయిస్తున్నాడు.షిర్డిసాయి తలచుకోవడం.. కేంద్రం తలవంచటం చకచకా జరిగి పోయాయి. మరి అనుగ్రహించాల్సిన షిర్డిసాయినే ఆగ్రహిస్తే, వాళ్ల బతుకులేం కాను? నోరు లేని గిరిజనం, తమ గోడు ఎవరికి వినిపించాలి? కొత్తగా వచ్చే ప్రాజెక్టు వల్ల ఊళ్లు వదిలి వెళ్లేవారికి దిక్కెవరు? షిర్డిసాయి అంత పని చేస్తాడని ఊహించని ఆ అమాయకులను ఆదుకు నేదెవరు? అసలు ఎవరీ షిర్డీ సాయి? పల్లెపై ఎందుకు పగ పట్టారు? ఇదీ ఇప్పుడు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం యర్రవరంలో గిరిజనగోస. దీన బాంధవుడు షిర్డీసాయి ఏమిటి? ఆదివాసీలను రోడ్డుపాలు చేయడమేమిటను కుంటు న్నారా? పేరులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం షిర్డీసాయినే! ఆయన పేరు పెట్టుకున్న ఆ కంపెనీ ఇనుపపాదాల కింద, ఇప్పుడు వేలాది గిరిజనుల జీవితాలు నలిగి నాశనం కానున్నాయి. సర్కారే సదరు కంపెనీకి సలాము కొడుతున్నందున, గత్యంతరం లేని గిరిజనం పిడికిలి బిగించింది. షిర్డిసాయి కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకొద్దంటూ, మన్యంవీరులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కారుకు వ్యతిరేకంగా, చింతపల్లి ఏజెన్సీ బంద్‌తో తమ తడాఖా చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింత పల్లి మండలం,గొందిపాకలు పంచాయతీ లోని ఎర్రవరం గ్రామంలో..షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపె నీకి సర్కారు ధారాదత్తం చేసిన హైడ్రోపవర్ ప్రాజెక్ట్, కొండకోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజ నుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది.ఎర్రవరం పరిధిలోని హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్నిగిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని రోడ్డెక్కారు.పంటలు, ఫలాలు పండి స్తూ జీవిసిస్తున్నామని..పవర్ ప్రాజెక్టు వస్తే జీవనా ధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. తమకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.జనవరి 8నవిశాఖపట్నంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావవేశం ఏర్పాటు చేశారు.చింతపల్లి,అరకు,ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల వద్ద ఆల్‌పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిరసనలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి వద్ద ఆదివా సీలు తెల్లవారుజామున గుమిగూడి రాస్తారోకో నిర్వహిం చారు.కనీసం నాలుగు గంటలపాటు వారు తమ ఆందోళనను కొనసాగించారు.అనంతరం మండల కేంద్రానికి తరలివెళ్లిన ఆందోళనకారులు హనుమాన్ జంక్షన్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నాకు దిగారు. సమావేశంలో గిరిజన సంఘం అఖిల భారత కార్యవర్గ సభ్యుడు పి.అప్పల నరస మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మరియు రాష్ట్రం. యర్రవరం జలవిద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం అట వీ,పర్యావరణ అనుమతులు ఇచ్చింది. దాని ఆధా రంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టును షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అప్పగించింది, ’’అని అప్పల నరస అన్నారు మరియు ఏజెన్సీ ప్రాంతాలలో సహజ వనరులను దోపిడీ చేయ డానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చర్యలను పలుచన చేస్తోందని ఆరోపించారు.రౌండ్ టేబుల్ సమావేశంలో సమత కోఆర్డినేటర్లు కందుకూరి సతీష్‌కుమార్,గునపర్తి సైమన్‌సీపీఎం అనంతగిరి జెడ్పీటీసీ దిసరి గంగరాజు పాల్గొన్నారు. బంద్ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గోని మాట్లాడుతూ గిరిజనుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, గిరిజనుల రక్షణ కోసం పార్టీ ఉమ్మడిగా ఆందోళన చేపడుతుందని ప్రకటించారు.
ప్రాజెక్టు లక్ష్యం ఇదీ..
యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును, ఒక్కొక్కటి 300 మెగా వాట్లసామర్థ్యంతో,నాలుగు యూనిట్లు ప్రారంభిం చాలన్నది లక్ష్యం.తాండవ రిజర్వా యర్‌లో కలిసే పిట్ట ఒరుకుగెడ్డపై,రెండు రిజర్వా యర్లు నిర్మించాల న్నది ఒకప్రతిపా దన. యర్ర వరం ఎగువడ్యాం నుంచిగానుగుల దిగువ ప్రాం తంలోని దిగువ డ్యాం వరకూ సొరంగం తవ్వి, మధ్యలో జలవిద్యు దుత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలన్నది మరో ప్రతిపాదన.ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం5,400 కోట్లుగా అంచనా వేశారు. నిజానికి 2020లో చింతపల్లి మండలంలో బాక్సైట్ తవ్వ కాల ఆలోచ నకు నాటిసీఎం వైఎస్ బీజంవేశారు. దానిని నక్స లైట్లు సహా, అన్ని రాజకీయపార్టీలూ వ్యతిరేకిం చాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం,జీఓ 97నురద్దు చేస్తూ మరో జీఓ ఇచ్చిం ది.దానితో మన్యంలో మంటలు చల్లారాయి. జగన్ సీఎంఅయిన తర్వాత, బాబు సర్కారు ఇచ్చిన జీవోనురద్దు చేసింది. ఫలితంగా పులివెం దులకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ తెరపైకి వచ్చింది. ప్రైవేట్ కంపెనీ ఏజన్సీతో సర్వే చేయించడం,ఆ వెంటనే డీపీఆర్ సిద్ధం చేయిం చడం,ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ,పర్యావరణశాఖ అనుమతికోసం ఢల్లీికి పంపించడం,ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగిం చేందుకు అంగీ కారం,2021 డిసెంబర్ 21న కేంద్రం అనుమ తులు జారీ చేయడం యుద్ధప్రాతి పదికన జరిగి పోయాయి. ఆతర్వాత దానిని షిర్డీ సాయి ఎలక్ట్రి కల్ కంపెనీకి అప్పగిస్తూ,జగన్ సర్కా రు మంత్రి వర్గం తీర్మానిచింది.షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీ పాలకపార్టీకి,ఆత్మబంధువులన్న ఆరోపణ ల నేప థ్యంలో..ఆ కంపెనీకి ప్రాజెక్టు ధారాదత్తం చేసిన వైనం విమర్శలకు గురవు తోంది.ప్రాజెక్టును షిర్డీసాయి ఎలక్ట్రి కల్ కంపెనీకి కట్టబెట్టే అత్యుత్సా హంలో..నిబంధ నలకు నీళ్లొదిరారన్న ఆరోపణ లు వెల్లువెత్తుతు న్నాయి. విచిత్రంగా నిబంధనలు నిశితంగా పరిశీ లించిన తర్వాతనే, ఏ ప్రాజెక్టున యినా ఆమోదించే కేంద్రం ప్రభుత్వం కూడా.. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చకచకా అనుమతి ఇచ్చిందంటే, ‘షిర్డీసాయి మహత్యం’ఏస్థాయిలో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటు హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటు పై గిరిజనం ఆందోళన చేస్తుంటే..ఇటు బీజేపీ వారికి మద్దతు నివ్వక పోగా,కేంద్రంలోనిబీజేపీ సర్కారు అనుమ తులన్నీ ఆగమేఘాలపై జారీ చేయ డాన్ని గిరిజను లు మండిపడుతున్నారు. ఫలితంగా ఈవివా దంలో బీజేపీఅడ్డంగా ఇరుక్కుపోయినట్ట యింది. ఇక తమ జీవనాధారమైన పంటపొలాలు ధ్వంస మయి, జీవితాలు రోడ్డునపడటంపై గిరిజనం గగ్గోలు పెడుతోంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరే కంగా చింతపల్లి ఏజెన్సీ ఏరియాను బంద్ ప్రకటిం చగా,అనూహ్య స్పందన లభించింది. ఆదివాసీలు మూకుమ్మడిగా రోడ్డెక్కి, సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు.ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని హెచ్చ రించారు. మా జీవితాలు హరించే హక్కు ప్రభుత్వా నికి ఎవరిచ్చారని గర్జించారు. షిర్డీసాయి కంపెనీకి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ గళమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంవల్ల తాము అనాధలమవు తామ ని ఆందోళన వ్యక్తం చేశారు. షిర్టీసాయి కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టు వల్ల..చింతపల్లి,కొయ్యూరు మండ లాల్లోని 2500ఎకరాలు నేలమట్టమవుతాయి. ఆరకంగా నాలుగు పంచాయతీలోని ఆదివాసీలు రోడ్డునపడతారన్నమాట. దాదాపు 20 వేల మంది ఆదివాసీలు,32 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, మూటా ముల్లె సర్దుకుని పోవాల్సిందే. అదొక్కటే కాదు..కొన్ని దశాబ్దాల నుంచి,తాత ముత్తాతల కాలం నుంచీ సాగుచేసు కుంటున్న పంటలు కూడా ప్రాజెక్టుకు బలవుతా యన్నది గిరిజనుల ఆందోళన. 600ఎకరాల్లో గిరిజ నులు సాగుచేస్తున్న జామ,అనాస,మల తోటలు నేలకూలనున్నాయి. 1500 ఎకరాల్లో సాగుచేస్తున్న మిరియాలు, కాఫీ తోటలు నేలమట్టం కానున్నాయి. మొత్తంగా అక్కడ ఇక పచ్చని చెట్లు, పంటపొలాలు మాయమవుతాయన్నమాట.
రాజ్యాంగానికి తూట్లు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ద్వారా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు కల్పించారు. వారికి రక్షణగా భూబదలాయింపు చట్టాలుచేశారు. వాటినీ జగన్ సర్కారు భేఖారుచేస్తోంది. ఆదివాసీల సంప దను ఆస్మదీయులకు అడ్డదారుల్లో దోచి పెట్టాలని చూస్తోంది. గిరిజనప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మిం చాలంటే ప్రభావిత ప్రాంతాల్లో మొదట గ్రామసభను నిర్వహించి,వాటి ఆమెదంతోనే అనుమతులు ఇవ్వాలన్న నిబంధనను జగనన ప్రభుత్వం తుంగ లో తొక్కేసింది.ముఖ్యమంత్రి,మంత్రులు సచివా లయంలో కూర్చునే..షిర్డీసాయి సంస్దకు పీఎస్పీ ప్రాజెక్టుని కేటాయించేశారు. అది ఆచరణలోకి వస్తే ఏజెన్సీలోని కొయ్యూరు,చింతపల్లి,గూడెంకొత్తవీథి మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందిని గిరిజనులు మూడు వేల ఎక రాల భూములు కోల్పోతారని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చట్టాలను తుంగలోకి తొక్కి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ చర్యలను నిరిసిస్తూ స్థానికలు ఆందోళనలు చేపడుతున్నారు. ముంపు ప్రభావిత మండలాల్లో బంద్‌లు,నిరసనలు,ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
తాండవ జలాశయంపై ప్రభావం
ఎర్రవరంలో నిర్మించనున్న పీఎస్పీతో అనకాపల్లి,తూర్పుగోదావరి జిల్లాలో ఆయకట్టు కలిగిన తాండవ జలాశయంపై ప్రభావం పడు నుంది.కొయ్యూరు,చింతపల్లి మీదుగా జలాశయం లోకి ప్రవహించే నీటి వనరులపై ఈ పీఎస్పీని నిర్మించబోతున్నారు.0.4టీఎంసీల సామార్ద్యంతో ఎగువు,దిగువన రెండు రిజర్వాయర్లు నిర్మించి, విద్యుదుత్పిత్తి చేయనున్నారు.దీనివల్ల జలాశయం లోకి వచ్చే0.4టీఎంసీల నీరు తగ్గిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికార్లులు అంటున్నారు. సుమారు 4వేలఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధ కంగా కానుంది.
చట్టం ఉల్లంఘన
ఐదో షెడ్యూల్ పరిథిలోని ఆదివాసీ గ్రామాల్లో భూములను గిరిజనేతరులకు బదలా యించడానికి వీల్లేదు.క్రయవిక్రయాలు పూర్తిగా గిరిజనుల మధ్యే జరగాలని 1/70చట్టం చెబుతోం ది.1995లో అనంతగిరి మండలంలో కాస్సైట్ గనుల వివాదంపై సమతా స్వచ్చంధ సంస్థ సుప్రీం కోర్టు ఆశ్రయించినప్పుడు షెడ్యూల్ ఏరియాలో ప్రభుతాన్ని కూడా గిరిజనేతరురాలిగానే భావిం చాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కోంది. అయినా జగన్ ప్రభుత్వానిక లెక్కేలేదు. గిరిజన ప్రాంతంలో చేపట్టే కార్యాకలాపాలకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి.సభలో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత వారి ఆమోదం ఉంటేనే ముందుకెళ్లాలని పీసా చట్టం చెబుతోంది.ఒడిశాలోని నియాంగిరి కొండ ను బాక్సైట్ కోసం వేదాంత గ్రూప్‌నకు కేటాయించి నప్పుడు సుప్రీంకోర్టు ఇదేవిషయాన్ని స్పష్టం చేసింది. అక్కడ గ్రామసభ నిర్వహించకుండా స్థానిక ప్రజాప్రతినిధి సంతకంతో అనుమతి చూపించడాన్ని తప్పపట్టింది.ఆకేటాయింపు రద్దుకు సిఫార్సు చేసింది.కానీ ఆవేవీ వైకాపా ప్రభుత్వం చెవికెక్కవు.
ఆదివాసీల ఆగ్రహ జ్వాల
ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు(పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమో దం తెలపడంపై గిరిజన సంఘాల నాయకులు, మండిపడుతున్నారు.గిరిజనులు వ్యతిరేకిస్తున్న ప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వైఎ స్సార్ కడప జిల్లా వైసీపీ నేతకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యర్రవరం పీఎస్పీ నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంఘం నాయకులు అదానీ దిష్టి బొమ్మను దహనం చేసి హైడ్రో పవర్ ప్రాజె క్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాక్సైట్ తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును అడ్డుకుంటామని, వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరిం చారు.
కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు
ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మా ణానికి కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులను ఇది వరకే మంజూరు చేసింది.యర్రవరంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఓ ప్రైవేటు ఏజెన్సీ2020 జనవరి22 నుంచి 25వరకు సర్వే చేపట్టి ప్రాథమిక డీపీఆర్ సిద్ధం చేసింది. పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు 2021 డిసెంబరు 21న మంజూరయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవస రమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు(పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి కేబినెట్ ఆమోదంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అప్ప గించింది.
ముంపునకు గురికానున్న 32 గ్రామాలు
హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంవల్ల 32గిరిజన గ్రామాలు ముంపునకు గురికాను న్నాయి. దీంతో ఈ ప్రాంత గిరిజనులను గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి వుంది. ప్రధానంగా కొయ్యూరు మండలంపి.మాకవరం పంచాయతీకి చెందిన గానుగుల,రామచంద్రపురం,రామరాజుపాలెం, దిబ్బలూరు,వెలగలపాలెం పంచాయతీలో కిత్తాబు, చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలోవంట్లమామిడి,తాటిబంద,రాసపనస, ఎర్ర వరం,గాగులబంద,బొర్రమామిడి,పొర్లుబంద, రోలుగుంట,దంపులగుంట,వేనం,తాడపాలెం, పోతురాజుగుమ్మల,చీమలపాడు,సమగిరి,రాస పనస,తోటమామిడి,గొడుగుమామిడి,ఎర్రబొమ్మలు పంచాయతీ ఎర్రాబెల్లి,తప్పలమామిడి,జీడు మామి డితోపాటు మరో ఏడు ఆవాస గ్రామాలు ముంపు నకు గురికానున్నాయి.
అడవులను అదానీకి కట్టబెడతారా !
జల విద్యుత్ ప్రాజక్టువల్ల 4800 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభు త్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్ ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టులో కేవలం 5వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభు త్వ సంస్థలోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్ ఉద్యోగాలు పొందగలమా అనేది ప్రశ్న. జోలపుట్ డ్యాం,మాచ్‌ఖండ్ పవర్ప్రాజెక్టు నిర్మాణం 1955 లో జరిగినప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితులైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు.
ఉపాధి పేరుతో మోసం
జల విద్యుత్ ప్రాజక్టువల్ల 4800 మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టులో కేవలం 5 వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభుత్వ సంస్థ లోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్ ఉద్యోగాలు పొందగలమా అనేదిప్రశ్న.జోలపుట్ డ్యాం, మాచ్ ఖండ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం 1955లో జరిగిన ప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితు లైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు. ఇప్పుడు మాత్రం ‘కేవలం 10 కుటుంబాలున్న 25 మంది జనాభాగల కొయ్యూరు మండలంలోని చిన్నయ్య కొండ అనే ఊరు మాత్రమే మునుగుతుంది. అందు లో కేవలం 22హెక్టార్ల ప్రైవేటు భూమి నష్టపోతు న్నారు.279 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 257హెక్టార్ల అటవీభూమి ఉంద’ని ప్రభు త్వ సంస్థ ఎన్.ఆర్.ఇ.డి.సి.ఏ.పి చెప్పడం మోసం. అధిక సంఖ్యలో అడవిపై ఆధారపడి జీవిస్తున్న చుట్టుపక్కల నిర్వాసిత గ్రామాల ప్రజల వివరాలను పూర్తిగా దాస్తున్నది. రాష్ట్ర క్యాబినెట్ సత్య సాయి గ్రీన్ ఎనర్జీని అదానీ కంపెనీకి అప్పగిం చడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంత సహజ వనరులు ఆదివాసీలకు చెందాలని, ఆదివాసీ ప్రాంతంలో అదానీ ప్రవేటు సంస్థల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ…చింతపల్లి, జి.కె వీధి,కొయ్యూరు మండలంలో గిరిజనసంఘం నాయకత్వంలో మిగతా గిరిజన సంఘాలు, ప్రతి పక్ష పార్టీల ఆధ్వర్యంలో డిసెంబర్ 14న మూడు మండలాల్లో బంద్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సహజ వనరులున్నా వెనకబాటే
అడవుల విస్తీర్ణంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాష్ట్రంలోకెల్లా మొదట స్థానంలో ఉంది.అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేటికీ గిరిజన గ్రామాలలో వైద్యం కోసం డోలీ మోతలు కొనసాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేక మైదాన ప్రాంతంలో వలసలు వెళుతున్నారు. రక్త హీనతతో గిరిజన బాలింతలు,చిన్నపిల్లల మర ణాలు సర్వసాధారణంగా ఉన్నాయి. అక్షరాస్యత చాలా తక్కువ.సహజ వనరులు పుష్కలంగాఉన్న ప్పటికీ గిరిజనప్రజలు పేదరికంతో ఉన్నారు. పాడేరు ఏజెన్సీలో సుమారు 5 లక్షల కోట్ల రూపా యల విలువైన 515 మిలియన్ టన్నుల బాక్సైట్ మైనింగ్ వనరులు పుష్కలంగా ఉన్నాయి.చైనా క్లే, గ్రానైట్, లేటరైట్,రంగురాళ్ళు,క్వార్ట్డ్జ్, లైమ్ స్టోన్ తదితర సహజ వనరులతో లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదనిలయంగా ఉంది. ప్రపం చంలోనే అత్యంత రుచికరమైన ఆర్గానిక్ కాఫీ పంట పండే దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యా లు, పసుపు, పిప్పళ్లు, అల్లం, మిరియాల పంటలకు అనువైన ప్రాంతం.జీడి,అటవీ ఉత్పత్తులు, వనమూ లికలు,రాజ్మా విస్తారంగా దొరికే తూర్పు కనుమల అటవీ ప్రాంతమిది. ఇంకోవైపు దేశంలోనే అత్యంత ఎక్కువ మంది గిరిజనులను నిరాశ్రయులను చేసిన పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం. ఈ జిల్లాలో గిరిజనులు 82.67శాతం.రాజ్యాంగంలోని 5వషె డ్యూల్ ప్రాంతంలోని గిరి జన ప్రాంత హక్కులు, విద్య,వైద్యం,ఉపాధిని …గిరిజన సలహా మండలి, రాష్ట్ర గవర్నర్,దేశ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కాపా డాల్సి వుంది. ఆదివాసీల హక్కులు, సహజ వనరు లు,అటవీ భూముల రక్షణ చూడాల్సి ఉంది. కానీ దేశ విదేశీ బహుళజాతి సంస్థల ఒత్తిడితో కేంద్రం లోని బీజేపీ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మోనిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 2024 వరకు ఆదివాసీ అడ వులను అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించడానికి పూనుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీప్రాంతంలోని అడవు లు, భూములలో ప్రైవేటు కంపె నీల ప్రవేశంపై నిషేధం ఉన్నది. ఐదవ షెడ్యూల్ ప్రాంత అడవుల్లో బడా బహుళజాతి కంపెనీలు సులభంగా ప్రవేశిం చడానికి వీలుగా పర్యావరణ అటవీ సంరక్షణ చట్టం-1980ను సవరించి మరింత సులభతరం చేసింది. అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టం-1980 ప్రకారం అటవీ ప్రాంతంలోని భూములను అటవీయేతర కార్యక్రమాలకు కేటాయించరాదు. మైనింగ్,భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ భూము లు కేటాయించరాదు. ప్రభుత్వ ప్రాజెక్టు అయితే 70శాతం గ్రామ సభలో ఆమోదం పొందడం తప్పనిసరి. ప్రైవేటు కంపెనీలకు 80శాతం గ్రామ సభ ఆమో దం పొందడం తప్పనిసరి. అయితే ఇప్పుడు సవరిం చిన నిబంధనల ప్రకారం ఎటు వంటి ఆమోదం పొందనవసరం లేదు.
చట్టవిరుద్దంగా వెళుతున్నారు..!
క్షేత్రస్థాయిలో పరిస్థితు లను అధ్యయనం చేయకుండా ఎక్కడో కూర్చుని నిర్ణ యాలు తీసు కోవడం తపుని విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ సీఎంజగన్‌కు లేఖ రాశారు. లేఖసా రాంశం ఇలాఉంది.రాష్ట్ర ప్రభు త్వం, పార్వతీపురం మాన్యం జిల్లాలో రెండు ప్రాజెక్టులు,అంటే కురుకుట్టి దగ్గర 1,200హైడ్రోపంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, కర్రి వలస దగ్గర 1,000హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, మరియు AూR జిల్లాలో ఎర్రవరం దగ్గర ఇంకొక 1,200వీఔ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్,ఆదానీ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయిం చడం,ఆప్రాంతాల్లో అమలులో ఉన్న పీసా,అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించడం అవుతుంది.ఆ రెండు చట్టాల కింద,ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చే ముందు, అక్కడి గ్రామ సభలను సంప్రదించి, వారి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రామసభల అనుమతి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రాజెక్టుల మీద,ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు.ఇదే విష యాన్ని,సుప్రీం కోర్టువారు,ఒరిస్సాలో కలాహండి ,రాయగడ జిల్లాలలో,అక్కడిప్రభుత్వం, గ్రామ సభల అనుమతి లేకుండా,వేదాంత కంపెనీకి బాక్సైట్ మైనింగ్ అనుమతి ఇవ్వడంచట్టవిరుద్ధమని, 20 13,ఏప్రిల్18నఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పాటించవలసిఉంది. సుప్రీం కోర్టువారి ఆదేశాల ప్రకారం,అక్కడ పద కొండు గ్రామాలలో గ్రామసభలు ఆమైనింగ్ ప్రాజె క్టును చర్చించి,తిరస్కరించడము వలన, ప్రాజెక్టు రద్దయింది. ఇదే కాకుండా, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజ్ తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చట్టాన్ని ఉల్లంఘిం చడం అవుతుంది.సుప్రీంకోర్టువారు,అప్పటి విశాఖ పట్నం జిల్లా షెడ్యూల్డ్ ప్రాంతంలో, అనంతగిరి మండలంలో,ఒక ప్రైవేటు కంపెనీ కి ఇచ్చిన నిర్ణ యాన్ని 1997లో సమతా కేసులో రద్దు చేశారు. ఆకారణంగా,ఈమూడుహైడ్రో ప్రాజేక్ట్ లను అదానీ కంపెనీకి ఇవ్వడం చెల్లదని మీరు గుర్తించాలి. రాజ్యాంగంలో 5వషెడ్యూల్ పారా4కింద రాష్ట్రం లో ఏర్పాటు చేయబడిన ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (ుతీఱపaశ్రీ Aసఙఱంశీతీవ జశీబఅషఱశ్రీ),ఇటువంటి ప్రాజె క్టుల మీద చర్చించవలసినది.రాష్ట్రప్రభుత్వం ుAజ వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజె క్టుల మీద నిర్ణయం తీసుకోవడం, రాజ్యాంగాన్ని ధిక్కరిం చినట్లు అవుతుంది.షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజ నుల జీవితాలమీద,వారి సంప్రదాయం మీద ప్రభా వం కలిగించే పెద్ద ప్రాజెక్టులు పెట్టే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం,రాజ్యాంగం338A(9)కింద జాతీ య స్థాయి ట్రైబల్ కమీషన్ (చీa్‌ఱశీఅaశ్రీ జశీఎఎఱంంఱశీఅ టశీతీ ్‌ష్ట్రవ ూషష్ట్రవసబశ్రీవస ుతీఱపవం- చీజూు) అభిప్రాయాన్ని ముందే తీసుకోవాలి. మీ ప్రభుత్వంచీజూుతో ఎటువంటి సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదు. మీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అదానీ కంపెనీకి, ఎటువంటి పోటీ లేకుండా,ఇవ్వడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘‘జాతీయహైడ్రోఎలక్ట్రిక్ విధానం’’ ప్రకారం, పోటీ లేకుండా హైడ్రోప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం చెల్లదు. ఈ మూడు ప్రాజెక్టు వలన,గిరిజన ప్రాంతాల్లో వారి జీవితా లకు, సాంస్కృతికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నా యి. వారు ఆధారపడే జలవనరులకు అంతరా యం కలుగు తుంది. అటవీహక్కుల చట్టం క్రింద, వారికి అక్కడ అటవీ సంపద మీదఉన్న హక్కులకు అంత రాయం కలుగుతుంది. ఇన్ని విధాలుగా గిరిజన ప్రజలకు నష్టాలు కలిగే అవకాశాలున్నా, వారితో, వారి గ్రామసభలతో ముందుగా సంప్రదిం చకుం డా, ఇటువంటిపెద్ద ప్రాజెక్ట్‌ల మీద ఏకపాక్షి కంగా నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హైడ్రో ఎలక్ట్రిక్ విధానాన్ని ఉల్లంఘిస్తూ, ప్రాజెక్టులను అదానీకంపెనీకి పోటీ లేకుండా ఇవ్వ డం సబబు కాదు. ఈవిషయాలమీద, నేను ఎన్నో సార్లు మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి లేఖలు రాసినా,వారు స్పందించలేదు. నా లేఖల నకళ్ళను జతపరుస్తున్నాను ఈవిషయాలను దృష్టిలో పెట్టు కుని, మీ ప్రభుత్వం తత్ క్షణం, ఈ మూడు ప్రాజెక్టు లను రద్దు చేయాలని నా విజ్ఞప్తి. గిరిజన ప్రాంతా లలో అమలులోఉన్న చట్టాలను, గిరిజనుల హక్కు లను గౌరవిస్తూ మీ ప్రభుత్వం ఆలస్యం చేయకుం డా ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటారని విశ్వసిస్తు న్నాను ఆలేఖలో వివరించారు.-(మార్తి సుబ్రహ్మణ్యం)