హరి వెంకట్‌కి అరుదైన అవకాశం
తిండికి కరువై…చదువుకు దూరమై…ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా?ఈఆలోచనతోనే గమ్యం తెలియని వీధి బాలల కోసం‘ధరణి’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి…వారికి ప్రాథమిక విద్యే కాదు…జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న హరివెంకట్ రమణ ప్రయాణం ఇది…
విద్య, విజ్ఞానం… రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే… నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే… మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు హరి వెంకట్. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బం దులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. తన నెలకొల్పిన సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా, విశాఖలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లల కు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. తన కళాత్మక సృజనతో కార్టూన్లు ద్వారా అవగాహన ప్రచార మాధ్యమాలు ద్వారా,వ్యాసాలు రాస్తూ చైతన్య పరు స్తున్నారు. మనుషుల అక్రమరవాణా అన్నది భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్న ఒకనేరం. ఒకసారి రవాణా బారిన పడిన తరువాత బాధితులు బలవంతంగా వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, పళ్లి,మత్తు పదార్ధాల చేరవేత, పిల్ల లను ఉపయో గించి చేసే లైంగిక చిత్రాల వంటి మరెన్నో దారుణ చర్యలకు గురవుతున్నారు. మన దేశంలో మను షూల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇవి భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860లోని 370-370ఎ విభాగాలు మనుషూల అక్రమ రవాణాను నిర్వచించి శిక్షారం చేస్తున్నాయి. సెక్షన్ 371,ఐపిసి బానిస వ్యాపారాన్ని నేరంగా పరిగణిస్తుంది బీ సెక్షన్ 372-373 ఐపిసి ప్రకారం వ్యభిచారం కోసం బాలికల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడం నేరంబీ అనైతిక రవాణా (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ బాధితులను రక్షిం చడం, పునరావాసంతోపాటు వారి నైతిక ప్రవర్తనను సరిదిద్దడం గురించి చెబుతుంది. ఈ అంశాలపై పని చేస్తున్న హరికి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ లింగ ఆధారిత హింస,మానవ అక్రమ రవాణా అంశాలపై పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలసి మానవ అక్రమ రవాణా అరికట్టాడానికి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై చర్చించారు. ఈనేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలు, అధ్యయన యాత్ర అనుభవాలను ఆయన కలం నుంచి జాలు వారిన వ్యాసమే ఇది..!
అమెరికా వెళ్లాలని చాలామందికిఉంటుంది. నేను నాహైస్కూల్,కాలేజిరోజులలో విద్యా ర్థి సంఘంలో పనిచేసాను.ఆ ప్రభావమో,సాహిత్య ప్రభా వమో వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పెట్టు బడిదారీ,బూర్జువాలాంటి పదాలువల్లెవేసిన వారి పిల్లలంతా అక్కడే ఉండటం, నాతోపాటు హైదరా బాద్ రూమ్ లోవున్న మాకజిన్స్ అమెరికా వెళ్ళాక అయిపూ, అజాలేక పోవడంవలన అమెరికా నాకెప్పు డూఒక ఆశ్చర్యం. డిగ్రీ తరువాత ఒకటి రెండుచిన్న ఉద్యోగాలు చేసి హైద రాబాద్‌లో యాని మేషన్ రంగంలో పనిచేసే వాడిని, అయితే సాహిత్యం సామజిక రంగంపై మక్కువతో 2006 సంవత్సరంలో ధరణి స్వచ్ఛంధ సంస్థను స్థాపించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌తో కలిసి గ్రామాలలో యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ గ్రంధాలయాలు, యువతకు కెరీర్ గైడన్స్ అంశాలపై పనిచేశాను.
వీధి బాలలు,బాలకార్మికులను గుర్తించి వారిని ప్రభుత్వ బడులకు పంపడం. బాల్య వివా హాల అనర్ధాలపై ప్రచారం, బాలికల విద్య ఆవశ్య కత,గుడ్ టచ్ బాడ్ టచ్ అంశాలపై ప్రభుత్వ పాఠశాలలు,హాస్టళ్లు,అంగన్వాడీల్లో తల్లులకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పిం చి ఒక ఉద్యమంలాగ దీనిని కొనసాగించాను. దాదాపు వేలాది మందికి ఈవిషయం చేరవేసే ప్రయత్నం చేసాను.పిల్లలతో, కమ్యూనిటీతో బాల్య వివాహాలనిషేధం,పిల్లలపైలైంగిక వేధింపుల నిరో ధం,బాలల భద్రత వంటి అంశాలపై గోడ పెయిం టింగ్‌లు వేయించాను.బాలికలు అక్రమ రవాణాకు గురికాకుండాపట్టణ మురికివాడలలో, పాఠశాల లలో,కళాశాలల్లో చాలా కాలం నుంచి మానవ అక్రమ రవాణా నిరోధానికి కౌమారులు తీసుకో వలసిన జాగ్రత్తలు వివరిస్తూవొచ్చాను, ఈ అంశం పై యానిమేషన్, పోస్టర్లు,పిల్లలకు అర్ధం కావడానికి పోస్టర్లు, పత్రికలలో వ్యాసాలు రాసేను. ఒకానొక రోజు ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్ ప్రభుత్వం నుంచివొచ్చింది. ఇంకే ముంది యెగిరి గంతేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకు న్నాను. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్3వ తారీఖు వరకు జరిగిన ఈ పర్యటన ఒక మంచి విజ్ఞాన అనుభవం.
అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పర్యటన
ఢల్లీి నుంచి ఆమ్స్టర్ డాం మీదుగా 13 ఆగస్టు నడల్లాస్ చేరుకున్నాము. లింగ ఆధారిత హింస, మానవ అక్రమరవాణా అంశంపై చర్చలు, మేధో మధనాలు,సలహాలు,సూచనల ఆహ్వానాలు అమె రికా రాజధాని వా షింగ్టన్ డి.సి.సంయుక్త రాష్ట్రా లయిన నార్త్ డకోటా(మైనాట్, బిస్మార్క్ నగ రాలు)సియాటల్(వ్వాషింగ్టన్ రాష్ట్రం),పెన్సో కోలా (ఫ్లోరిడారాష్ట్రం)లలో జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ డిపా ర్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ (విదేశీ వ్యవహారాలు) సందర్శించడం జరిగింది అమెరి కాలో ఫెడరల్ వ్యవస్థ పనిచేసే విధానం,అటార్నీ జనరల్ అసోసియేషన్, గృహహింస అరికట్టడం, బాధితులకు సహాయం చేసే పనిచేసే ఎన్జీవోలతో వ్వాషింగ్టన్ డీసీలో సమావేశం అయ్యాము. నార్త్‌డ కోటా రాష్ట్రంలోట్రైబల్ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆదిమతెగలలో లింగ ఆధారిత హింస అందుకు కారణాలు,మానవ అక్రమరవాణా జరుగుతున్న విధానం తెలుసుకున్నాము.సియాటెల్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆ రాష్ట్ర సెనేటర్ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకు వొచ్చిన పలు చట్టాలు,బాధితులతోనే (సెక్స్ వర్కర్స్) నిర్వహిస్తున్న సంస్థలు,పిల్లల కొరకు అక్కడి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కార్యాలయాలు,బాలలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారినుంచి వివరా లు రాబట్టడానికి అనుసరించే సృజనాత్మక విధా నాలు తెలుసుకున్నాను.
అమెరికాలో లింగ ఆధారిత హింస
మహిళలు పురుషులపై ఆధారపడటం,ఆర్ధిక స్వేఛ్చ లేకపోవడం.ఆర్ధికంగా పతనమైన వలస కుటుం బాలు,అప్పులు,కుటుంబాలకు మిగిలిన వ్యక్తులతో డ్పాటు లేకపోవడం వలన లింగ ఆధారిత హింస అమెరికాలో ఎక్కువ.ఎక్కువ గృహ హింస కేసులు ఆసియా దేశాలు అందునా భారత్ వంటి దేశాల నుంచి వొచ్చిన కుటుంబాల నుంచే నమోదు కావ డం వంటివి అక్కడ గృహ హింసపై పనిచేస్తోన్న ఒకస్వచ్ఛంధ సంస్థ(ఎన్.జీ.ఓ)చెప్పగా ఆశ్చర్య పోయాను. చాలా సందర్భాలు,కేసులు ఆర్ధిక అస్థిరత వల్లనే అవుతున్నాయి అని నాకు అనిపించింది. ప్రతీది డబ్బుతో ముడిపడిఉండటం,భద్రత లేనిఉద్యోగాలు,వీకెండ్ ఎంజాయిమెంట్‌కి ఎక్కువ ప్రాధా న్యత ఇవ్వటం,పదహారు సంవత్సరాల నుంచి పిల్లలుస్వతంత్రంగాఉండటం (అందువలన తప్పు లేదు గాని,మద్యం,డ్రగ్స్ వంటి వాటికి అడిక్ట్ అయ్యే వారు ఎక్కువ)కూడా కొన్నికారణాలుగా అనిపిం చింది. మన దేశంలో కుటుంబవ్యవస్థను రక్షించడం కొరకు,మగవాడు చెప్పింది చేయాలి.స్త్రీ ఇలానేఉండాలిఅనే భావాలప్రచారం వలన మనకు మహిళలపై, పిల్లలపై హింస ఎక్కువ. ఇది మన సంస్కృతిలోబాగా వేళ్ళూనుకు పోయివుంది. చిన్న తనం నుంచే మనకు మగ,ఆడ అనే బేధాలు ఎక్కువ. ఇవి మహిళలు పిల్లలపై హింసకు,లైంగిక హింసకు కారణమవుతున్నాయి.అయితే లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో క్రైసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాయి.వీటికి5శాతం వరకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.మిగతావి డోనర్ ఏజెన్సీ లు,వ్యక్తిగత డోనర్లు ఈక్రైసిస్ సెంటర్లలో మహిళ లు రక్షణ పొంద వొచ్చు.శిక్షణ పొందవొచ్చు ,తిరిగి తమ కుటుంబాన్ని కలవాలి అనుకున్నపుడు వెళ్ళవొచ్చు. చాలా సందర్భాలలో తిరిగి మహిళలు కుటుంబం వద్దకే వెళ్లిపోతుంటారు. అయితే ఈ బాధిత కార్యాలయాలు అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచట్టం కనుక మనదేశంలోవలే జాతీ యస్థాయి చట్టాలు, అమలు విధానాలు వుండవు. ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడానికి వారికి అడ్డంకిగా మారుతుంది. నేను సియాటెల్ నగరంలో ఒక రెఫ్యూజీ సెంటర్‌కు వెళ్ళాను..అది పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. అమెరికాను పీడిస్తున్న అక్రమ రవాణా అంశం తగిన లేబర్ లేకపోవడం, వ్యవసాయ పనులకు లేబర్ కావాల్సిరావడం కూడా ఈ మానవ అక్రమ రవాణాకు కారణం,అలా తీసుకువొచ్చిన వారి పాస్‌పోర్టుల తీసేసుకొని వారిని సెక్స్ ట్రేడ్‌కు వాడు తున్నారు.ఇంకా ఇక్కడప్రాస్టిట్యూట్ సర్వైవర్స్ నడుపుతున్న ఒక ఎన్జీఓను కలవడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఇంటర్లో గాట్,డంకెల్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బోలెడు కార్టూన్లు వేసాను. ఇప్పుడు అదే సెంటర్లో వరల్డ్ అఫైర్స్ ఆఫీసులో మీటింగులో పాల్గొనడం ఒకచిత్రమైన అనుభూతి. ఇక్కడ కింగ్ కౌంటీ కౌన్సిల్ మెంబెర్‌ని కలిసాము,ఆమె మానవ అక్రమ రవాణా నిరోధా నికి ఎన్నోచట్టాలను గత ఇరవై ఏళ్లుగారూపొం దించి ప్రవేశ పెట్టారు. మానవ అక్రమ రవాణా నిరోధాన్ని కేవలంచట్టాలు ఎంత వరకు తగ్గిస్తా యి? అన్న నా ప్రశ్నకు సమాజంలో మానవ అక్రమ రవాణా పట్ల ఒకసాంస్కృతిక మార్పు రావాల్సి ఉంటుం దని ఆమె చెప్పారు.
ఆదిమ తెగలలో లింగ ఆధారిత హింస
లింగ ఆధారిత హింస ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. సమాన అవకాశాలు లేకపోవడం, కుటుం బాలలో ఆర్ధిక అస్థిరత,మానసిక సమస్యలు, విపరీ తమైన త్రాగుడు,డ్రగ్స్ తీసుకోవడం ఒక ప్రధాన కారణంగా ఇక్కడ కలిసిన వ్యక్తుల,సమూహాల చర్చలనుబట్టి అర్ధమయ్యింది. మహిళల ప్రయివసీ కాపాడటం, బహిరంగ ప్రదేశాలలో వారిని గౌరవించే విధానం ఇక్కడ చాలా బాగుంది. కానీ అటువంటి సివిక్ సెన్స్ అభివృద్ధి చెందినచోట లింగ ఆధారిత కుటుంబహింస ఎక్కువగాఉండటం ఆశ్చర్యకరం.మన దగ్గర తరాలుగా అంది పుచ్చు కున్న ‘‘మనువాద భావాలు’’ మహిళలను రెండో పౌరులుగా చూస్తే ఇక్కడ గిరిజన తెగలలో,వలస దారులలో కూడా లింగ ఆధారిత హింస ఎక్కువ ఉన్నట్లు అర్ధమవుతుంది.ఆదిమ తెగలు స్త్రీ కేంద్రం గా స్త్రీని గౌరవించే ఆచారాలు కలవి,అటువంటి చోట మెయిన్ స్ట్రీమ్‌సమాజం ప్రభావం పడి వాటి పై కూడా లింగఆధారిత కుటుంబ హింస పడిర ది. ఇంకా వందల ఆదిమతెగలు ఇక్కడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ట్రైబల్ కోర్టులు ఉంటాయి అయితే వాటి కంటేపై స్థాయిలో స్టేట్, ఫెడరల్ కోర్టులదేపై చేయి. మిగతా సమా జంతో కలిసి అవకాశాలు అందిపుచ్చు కోవడం లో వెనుకంజ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్లలేక పోవడం కూడా కుటుంబ,లింగ ఆధారిత హింసకు కారణంగా నాకు అనిపించింది.ఇందుకు ప్రత్యామ్నాయంగా భాషను కాపాడు కోవడం,స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవడం ఆయా తెగలు చేస్తున్నాయి. అమెరికా అనేక గిరిజన తెగలను నిర్మూలించివారి పునాదులపై సౌధాలు నిర్మించింది అన్న చరిత్ర అందరికి తెలిసిందే.
పర్యటన స్పూర్తి
ఈపర్యటన ఇచ్చిన స్పూర్తితో మానవ అక్రమ రవాణా నిరోధం అంశంపై మరింతగా పనిచేస్తాను, ముక్యంగా యువతులు,కౌమార బాలికలు, బాలురు ఈకూపంలో ఇరుక్కోకుండా వారికి విభిన్న మాధ్య మాల (మీడియా,కార్టూన్లు, పవర్ పాయింట్ ప్రెసెం టేషన్,యానిమేషన్ )ద్వారా తెలియజేస్తాను. అక్రమ రవాణాలో చిక్కుకున్న వారికి ప్రభుత్వంనుంచి సహా యం అందేలాచేయడం,ఇందుకోసం ఏర్పడిన కమి టీలు సమావేశం అయ్యేలా కృషి చేయడం, జాతీయ స్థాయి సంస్థలతో ఈఅంశంపై కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం చేస్తాను. ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలను వెట్టి నుంచివిముక్తి చేయడంకోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటి పని వారల సంఘంతో కలిసి గృహ కార్మి కులు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తాను. జిల్లాన్యాయ సేవాధికార సంస్థతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయ టానికి కోరుతాము.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఇంకా పిల్లలు, మహిళల కోసం పనిచేసే సంస్థలతో కలిసి పని చేయడంద్వారా బాల, బాలి కలు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రయత్నించ వొచ్చు. ఇంటి పనివారు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, విదేశాలలో వెళ్లే వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వుంది.
వ్యాసకర్త : బాలల హక్కుల కార్యకర్త, విశాఖపట్నం-(హరి వెంకట రమణ)