స్వేఛాయత వాతావరణంలో ఎన్నికలు`2024
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 2024 మే13న జరుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛా యుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు జరిగేం దుకు సహకరించాలని జిల్లాఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి,నామినేషన్లు,ప్రచారం, పోలింగ్,కౌంటింగ్ తదితర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో స్థానిక వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మార్చి 20నవిస్తృత అవగా హన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అనగా జూన్ 6వ తేదీ వరకు ఈకోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్ని కల సంఘం,రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి ఆదే శాల మేరకు జిల్లాలోని ప్రతి రాజకీయ పక్షం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్వేచ్చా యుత వాతావరణంలో, పారదర్శకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పక్షాలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన క్షణం నుంచి జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విగ్రహాలకు ముసుగులు వేశామని,ఏడు వేలవరకుకటౌట్లు,జెండాలు, హోర్డింగులను తొలగించామని పేర్కొన్నారు. ప్రభుత్వ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు,పోస్టర్లు, బ్యానర్లను అనుమతించబో మని తేల్చిచెప్పారు. హైవేలు, ప్రధాన రహదారులు సమీపంలో ఇప్పటి వరకు ఉన్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు రిటర్నింగ్ అధికారి అనుమతితో కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున నూతన ప్రదేశాల్లో హోర్డింగులు పెట్టు కునేందుకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇంటి పైకప్పులపై కటౌట్లు, జెండాలు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకోవా లన్నారు. ర్యాలీలు, పాఠశాల, కళాశాల మైదానాలు, అతిథి గృహాలు వంటివి వినియోగించుకోవాలన్నా రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి అని, అయితే ఇందుకోసం సువిధ యాప్ ఉందని, అందు లో ముందుగా 48గంటల ముందు నమోదు చేసుకున్నవారికి రాజకీయ పక్షాలపై వివక్ష లేకుండా తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. పార్లమెంటు అభ్యర్ధి రూ.95 లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్ధి రూ.40లక్షల వరకు వ్యయం చేసుకునే వెసులుబాటు ఉందని, అయితే ఎన్నికల నియమావళి అమలు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం వరకు చేసిన ఖర్చులన్నీ ఆయా పార్టీ ఖాతాల్లో నమోదు చేస్తామని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి వ్యక్తిగత ఖాతాల్లో నమోదవుతా యని చెప్పారు. రాజకీయ పక్షాలకు చెందిన ప్రతి అభ్యర్ధిపై నిఘా ఉంటుందని,వారు ఖర్చుచేసే ప్రతి పైసాను ఎన్నికల వ్యయంలో లెక్కిస్తామని పేర్కొ న్నారు.ఆర్‌ఓ అనుమతి లేకుండా బైకు ర్యాలీ, ఇతర ర్యాలీలను నిర్వహించరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, కోడ్ ఉల్లంఘనగా భావించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనరాదని, ఒకవేళ ఎక్కడైనా పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభు త్వ ఉద్యోగులు,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లోతప్ప,ఇతర కార్యక్రమాల్లో పాల్గొన రాదని,అలా పాల్గొన్నారని తమ దృష్టికి వస్తే ఏమా త్రం ఉపేక్షించబోమని,అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు.పౌరులు కోడ్ ఉల్లం ఘన సంబందించి చర్యలు గుర్తించినచో సి.విజల్ యాప్ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయ వచ్చని,నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించి ఫిర్యాదుదారునికి తీసుకున్న చర్యలు గురించి తెలియజేస్తామని చెప్పారు. సి-విజిల్ యాప్ లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు అందాయని, వాటిపై వివరాలు తెలియజేసినట్లు కలెక్టర్ వివరించారు. అభ్యర్ధి, ఏజెంట్లు, అనుచరులు వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండరాదని, అలాగే వస్తు రూపేణా రూ.10వేలకు మించి ఉండరాదని,డొనేషన్స్ రూపేణా రూ.20వేలకు మించి స్వీకరించరాదని కలెక్టర్ తేల్చిచెప్పారు.లక్ష రూపాయలకు మించి నగదు బదిలీ చేసినట్లయితే నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగానికి, ఆదాయపు పన్నుశాఖ వారికి తెలుస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పెయిడ్ ఆర్టికల్స్ విషయంలో అటు అభ్యర్థులు,ఇటు మీడియా ప్రతినిధులు అప్రమ త్తంగా ఉండాలని,అటువంటి వాటిని ఎం.సి. ఎం.సి.(మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మోన టరింగ్) కమిటీ పరిశీలించి తదుపరి చర్యలకై ఆర్.వో.కు రిఫర్ చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రా నిక్ మీడియాకు అందిస్తామని తెలిపారు. ఊహాగా నాలకు తావిస్తూ ధృవీకరణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని, వార్తలను ప్రచారం చేసేముందు జిల్లాఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి సరైన సమాచారాన్ని పొందిన తదుపరి మాత్రమే ప్రచారం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులకు సూచిం చారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ః జీవీఎంసీ కమిషనర్ నోడల్ అధికారి- సీ.ఎం.సాయికాంత్ వర్మ : రాజకీయ పార్టీ లేదా వ్యక్తులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల వేళ ప్రజలు నచ్చిన విధంగా ఓటు హక్కు ను వినియోగించుకునేలా చేయడం ఎన్నికల ప్రవర్త నా నియమావళి ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూ లుతో ఎం.సి.సి.అమల్లోకి వచ్చిందన్నారు. పర్య వేక్షణ నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది బృందాలను నియమించామని, జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఎం.సి.సి. అమల్లోకి వచ్చిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగులు,కటౌట్లు,జెండాలను తొలగిం చామ ని,విగ్రహాలను మూసివేశామని గుర్తు చేశారు. ఇకపై రాజకీయ పక్షాలు హోర్డింగులు, జెండాల కొరకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరిఅని,కరపత్రాలు,గోడపత్రికలపై ఆర్.ఓ. అనుమతితో పాటు ప్రచురించిన ముద్రణ సంస్థ పేరు తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు. ఏ విధంగానైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పక్షాల అభ్యర్ధులు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలు,ర్యాలీలు,సభల నిర్వహణ కోసం వినియోగించుకునే ప్రాంగణాల కోసం సువిధ యాప్ నందు దరఖాస్తు చేసుకోవాలని లేదా ూఱఅస్త్రశ్రీవ ఔఱఅసశీష జశ్రీవaతీaఅషవ జవశ్రీశ్రీ ద్వారా సంబంధిత Rూనుండి అనుమతులు తీసుకో వచ్చు ను. ముందుగా చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. 10 వాహనాలను ఒక యూనిట్ గా వినియోగించుకోవాలని, పది వాహనాలకు దాటితో 100అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయా లని స్పష్టం చేశారు. వాహనాలు ఎవరి పేరున తీసుకున్నారో,వారు మాత్రమే వినియోగించు కోవాలని,వేరే వ్యక్తులు వినియోగించినట్లయితే కోడ్ ఉల్లంఘన కింద వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమావేశాలు, లౌడ్ స్పీకర్లను వినియోగించరాదన్నారు.పోలీసు అధికా రులు చెప్పిన ప్రకారం రోడ్ షోలు, ర్యాలీలు చేసుకో వాలని సూచించారు. ఓటర్ల స్లిప్పులను బి.ఎల్.ఓ లు పంపిణీ చేస్తారని, పార్టీల ప్రతినిధులు చేయాల్సి వస్తే తెల్ల కాగితంపై ఉన్న ఓటరు స్లిప్పులనే విని యోగించాలే తప్ప,ఇతర రంగులు వినియో గించ రాదని,అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద పరిగణి స్తామని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో హో టళ్లు, అతిథి గృహాల్లో బయట వ్యక్తులు ఉండరాదని సూచించారు. ఎటువంటి చీరలు,నగదు, వస్తువులు ఇతరులకు పంపిణీ చేయరాదని,అలా చేస్తే ఆ వాహనాన్నిసీజ్ చేస్తామని అన్నారు.మంత్రులు అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించ రాదని, అధికారిక పనులను ఎన్నికలకు వినియోగిం చుకునేలా చేస్తే అటువంటి వాటిని కూడా కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తామని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య గొడవలు సృష్టించరాదని,దేవాల యాలు,చర్చిలు,మసీదులను రాజకీయాలకు వినియో గించరాదని స్పష్టం చేసారు. ఓటరును ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం చేయరాదని, అలాగే అభ్యర్థుల ఇళ్ల ముందు ధర్నాలు చేయరాదన్నారు. ఒక పార్టీ సమావేశాలను ఇతర పార్టీలు ఆటంకం కలిగించేలా వ్యవహరించరాదని, ఎటువంటి ఆయు ధాలు కలిగి ఉండరాదని ఆయన రాజకీయ పక్షా లకు వివరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహ రించాలి ః సీపీ డా.ఎ.రవిశంకర్ : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయ పక్షాలు వ్యవహరించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ డా. ఎ. రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పక్షాలు నిర్వహించే సమావేశాలు, సభలు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు వినియోగించుకునే ముందు ఆయా రిటర్నింగ్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇందుకోసం సువిధ యాప్ ఉందని, సువిధలో నమోదు చేయలేని వారు రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతి పొందవచ్చ న్నారు. సమావేశాలు నిర్వహించే తేదీ, సమయం, ర్యాలీలో పాల్గొనే వ్యక్తుల సంఖ్య తదితర వివరాలు స్పష్టంగా ఉండాలని, అన్ని పార్టీల దరఖాస్తులను పరిశీలించిన పిదప అనుమతిని మంజూరు చేస్తా మని తెలిపారు.రాజకీయ పక్షాల చేసే ప్రతి పనినీ సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్,ఎం.సి.సి.,తదితర బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని అన్నారు. వీటిలో పోలీసు అధికారులు ఉంటారని, అయితే ఈ బృందాలకు ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధిపతిగా వ్యవహ రిస్తారని చెప్పారు. రాజకీయ పక్షాలు ముందుగా నమోదు చేసిన రూటులో కాకుండా వేరే మార్గాన ర్యాలీలు నిర్వహిస్తే వాటిని కోడ్ ఉల్లంఘనగా గుర్తిస్తూ, పంచనామా చేసి ఎంపీడీవో నివేదిక ఇస్తారన్నారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ బూత్ లలో హాజరయ్యే వారి వివరాలు ముందుగా ఇవ్వాలని, వారి వివరాలు పరిశీలించి అనుమతి ఇస్తామని తేల్చిచెప్పారు. మతపరంగా గొడవలు, వ్యక్తిగత తగాదాలు ఉం డరాదని, ముగ్గురు వ్యక్తులతో కూడిన గ్రీవెన్స్ కమిటీ జిల్లాలో ఉందని,ఎన్నికలకు సంబంధించిన ఎటు వంటి ఫిర్యాదులనైనా చేయవచ్చని పేర్కొన్నారు.-(జి.ఎ.సునీల్ కుమార్)