స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసంమే..
‘‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మాణాన్ని అడ్డగోలు సవరణలు చేసి రెండవ సారి పంపింది. తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రేస్ పార్టీల్లో ఉన్న ఎస్టీ ఎమ్మేల్యేలు, గిరిజన సలహా మండలి (టిఎసి) సభ్యులే భాద్యత వహించాలి!. ఆదివాసీ రిజర్వేషన్లపై పాలక పక్షలు అనుసరిస్తున్న వ్యతిరేక విధనాలను నిరసిస్తూ, బోయవాల్మీకీ, మత్సకార, వడ్డేర, రజక కులాను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం! ఆదివాసుల మనుగడను కాపాడు కొందాం!!’’ –రామారావు దొర
2017 డిసెంబర్ 12 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా ఏబై లక్షల మంది జనాభా కలిగిన బోయవాల్మీకీ పద్దెనిమిదికి పైగా దాని ఉపకులాలను షెడ్యూల్డ్‌తెగల(ఎస్టీ) జాబితాలో చేర్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. ఇప్పుడు మత్సకార, వడ్డేర, రజక కులాలను కూడా ఎస్టీ జాబితాలోకి చేర్చడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ప్రొఫసర్ ఆర్.డి సంపత్ కుమార్ నేతృత్వంలో ప్రొఫెసర్ రంగరావు, ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్ పి.డిసత్యపాల్ కుమార్ లతో కూడిన త్రి సభ్య కమిటిని నియమించింది. 2014 లో భ్రుత్వం ఏర్పడ్డ వెంటనే మరో రెండు కులాలను చేర్చింది. 1976 లో లంబడా, ఎరుకుల, యానాది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. పై మూడు సందర్బల్లో కూడా బిసిఎ జాబితాలో ఉన్న రిజర్వుడ్ కులాల్నే కలపడం జరిగింది. కాని అన్ని సందర్బల్లో పాలకుల అంతిమ లక్ష్యం మాత్రం రాజకీయంగా ప్రయోజనం పొందడం. మహారాష్ట్రలో బిసిలుగా, కర్ణా టకలో ఎస్సీలుగా,రాజస్థాన్‌లో ఒసిలుగాదేశంలో వివిద రాష్ట్రల్లో వివిధ సామాజిక హోదల్లోఉన్న లంబడాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలు గా గుర్తించినందుకు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ మెధక్ జిల్లా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నుండి పోటి చేసి గెలుపొంది దేశప్రధాని అయ్యిం ది. నేడు కూడా నాయుడు గారు మరోసారి పొందడానికి, రెడ్డి గారు తొలి సారి అధికారంలోకి రావడానికి ఆదివాసులను బలి చేయడానికి పూనుకొన్నారు. ఆదివాసుల ఉనికిని దెబ్బతీసి, ప్రకృతి వనరులను బహుళాజాతి కంపెనీలకు దొచిపెట్టడానికి సిద్దమయ్యారు. దీనికి అన్ని రాజకీయ పక్షలు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయలు అటుంచి భారత రాజ్యంగంలో రిజర్వేషన్లునిర్థేసించిన ఉద్దెశాలు, లక్ష్యలు ఎవరికి పట్టడంలేదు. ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టే! ఏకత్వంలో అనేక భిన్నదృక్పదాలు కనిపిస్తాయి. మన రాజ్యం గం నిర్ధేశించి అమలులోఉన్న అతి ముఖ్యమైనది మూడు రకాల రిజర్వేఫన్లు. మొదటిది ఆదివాసులు (ఎస్టీ), రెండవది దళితులు (ఎస్సీలు), మూడవది వెనుకబడిన తరగతులు (బిసిలు). వెనుకబడిన తరగతులకు సామాజిక, ఆర్ధిక వెనబాటు ప్రామనికం కాగా, దళితులకు అంటరాని తనం, సామాజిక అసమానతలు ప్రమనికమైంది. అదే ఆదివాసుల విషయానికొస్తే అన్నిటికంటే భిన్నంగా సాంస్కృతిక, సాంప్ర దాయక విలువలకు ప్రాదన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఏ రాజ్యంగం లోలేని విధంగా 5వ,6వషెడ్యూల్స్ ద్వారా భూహక్కులతో సహా రిజర్వు చేయబడిరది. దీనికి కారణం మనది సర్వశత్తక గణతంత్ర రాజ్యమైనం దుకు మామ్రే కాదు! ఈ దేశమే ఆదివాసులదైైనందుకు!. తిల్కా మంజీ, బిర్సా ముండా,కొమురంభీం, గాంగంటందొర, మర్రికామయ్య వంటి అనేక మంది ఆదివాసీ యోధుల తిరుగుబాట్లువల్ల సాధ్యమైంది. కాని నేడు ఆదిపత్య కులాల బ్లాక్ మెయిలింగ్ స్వార్థ రాజకీయలకు రిజర్వే షన్లు అంగడి సరుకుగా మారింది. ఇప్పటి వరకు అనేక కులాలను ఎస్టీ జాబితాలో కలపడానికి మాత్రమే కమిటిలు వేస్తున్నారు. షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఇతర కులాలను చేర్చడం వల్ల రాజ్యంగం అమల్లోకి వచ్చింది మొదలు విద్య,ఉద్యోగ,సామాజిక,ఆర్ధిక,రాజకీయ దోపిడియే కాకా! ఆదిమ తెగల గుర్తింపు, ఉనికికి పునాదులైన సంస్కృతి, సాంప్రాదాయక విలువలతోపాటు, ఆదిమజాతుల నిర్ములనకు విద్వాం శకర ప్రక్రియా జరుగుతున్నది. ఆనష్టాన్ని అంచన వేయడానికి ఇప్పటి వరకు ఒక కమిటి గాని, కమీషన్ గానీ వేయలేదు!. ఆ…ప్రయత్నం కూడా ఏ…నాడు జరగలేదు!. ఇప్పుడు ‘‘సామాజికన్యామం’’ అనే నినాదంతో ఈదేశ సంపదనంత మేమే! తినేసినట్టు! అన్ని కులాల వారు ఎస్టీలో చేరిస్తేనే అభివృద్ధి చెందుతామని, ఎస్టీల్లో చేర్పిస్తే తప్ప! చదువు రా…దని!, అభివృద్ధి చెందలే…రని ఆదిపత్య కుల పాలకులు సైతం ప్రజలను రెచ్చగొట్టి తెగల మీదికి ఉసగొలుపతున్నారు. రాజ్యం గం నిర్ధేశించిన స్పూర్తికి విరుద్దంగా ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా పాలకులు తమ స్వార్ధరాజకీయ ప్రయోజ నల కోసం అభివృద్ధి చెందిన కుల సమాజన్ని ఆదిమజాతుల్లోకి చేరుస్తు వస్తున్నారు. 39 కులాలు తెగలజాబితాలో కలపాలనీ కోరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ‘ట్రైబల్ ఎడ్వజరీ కౌన్సిల్ (టిఎసి)’ గుర్తించింది. పైకు లాలను తెగల్లో చేర్చడానికి ఆయా కులాలకు తగిత అర్హాతలు లేవని‘‘గిరిజన సాంస్కృతిక పరిశోదన మరియు శిక్షణ కేంద్రం (టి.సి.ఆర్ అండ్ టి.సి) జరిపిన మానవ సామాజిక అధ్యయనం (ఎత్నోగ్రషఫిక్ స్టడీ) ద్వారా గుర్తించి వెల్లడిరచింది. ఆజాబితాలోనే బోయవాల్మీకీ,మత్సకార,వడ్డేర,రజక కులాలు కూడా ఉన్నాయి. తగిన అర్హాత కలిగి లేరని నిర్ధరణ అయినప్పటికి ఆయా కులాలు వారు తమని ఎస్టీ జాబితాలో కలపమని పదే పదే విన్నవిస్తున్నందున, ఇకమీదట ఏకులాలను తెగల్లోకి కలపమని సిపారసు చేయకూడద’’ని తీర్మణించింది. రాజ్యంగంనిర్ధేశించిన ప్రమాణాలకు లోబడి పని చేసే ప్రభుత్వ సంస్థ అయిన టి.సి.ఆర్ అండ్ టి.సి రిపోర్టును, టిఎసి తీర్మా ణాన్ని తుంగలోకి తొక్కిన ప్రభుత్వం ప్రొఫెసర్ పిడి సత్యపాల్ కుమార్ రిపోర్టునే తీసుకొని బోయవాల్మీకీ కులాలను ఎస్టీ జాబితాలో కలపడం, మళ్ళీ అదే ప్రొఫెసర్‌ను త్రి సభ్య కమిటిలో సభునిగా నియమించడం వెనుక తెలుగు రాష్ట్రల్లో నాలుగు నుండి ఐదుకోట్ల మంది కుల సమాజ జనాభాను తెగల్లోకి విలీనం చేసి ఆదిమజాతులు ఉనికిని దెబ్బతీసి ప్రకృతి వనరుల దోపిడికి పాల్పడనుంది. పాలకుల కుట్ర పన్నగానికి సహోదర దళితుడు, కుహాన మేధావిjైున ప్రొఫెసర్ పిడి సత్యపాల్ కుమార్ లాంటివారు సహాకరిస్తారు. ఈ మాట ఎందుకంటున్ననంటే విశాఖ ఏజేన్సికి ఆయనకున్న అనుబంధం, అవగహాన మరో ఏ ఆంత్రో పాలాజిస్టుకు కూడా ఉండవేమో! ఆదివాసులపైన అద్యాయనం పేరుతో ప్రతీ సంవత్సరం ఎంతో మంది తన విద్యార్ధులను ఏజేన్సి కొండల మీదికి తరలించేవాడు. ఇక్కడ వాల్మీకీ తెగ జీవనవిధానం, అచార సాంప్రదాయలకు, రాయలసీమ జిల్లాల్లో నేరచరితులుగా ముద్ర వేయబడి బ్రతుకు తెరువు కోసం రెడ్లు, కమ్మ పెత్తందారి కులాల వద్ద ప్యాక్షనిజంచేసి బ్రతికిన బోయ,బోయవాల్మీ కులాలకు పోలికలున్న యనీ, వీరిని ఎస్టీ జాబితాలో కలపాలనీ సిపారసు చేసారు. ఇందులో రాజకీయ ప్రయోజనమా! ఆర్ధిక ప్రయోజనమా! ఏదైనా ఉండవచ్చు! ఉంటుంది. ఈరిపోర్టు వెనక చంద్రబాబునాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య మంత్రి పదవి దక్కించుకోవడంతోపాటు, ఆదివాసుల ఉనికిని సమూ లంగా నిర్మూలించాలనే కాంక్ష స్పష్టంగా కనబడుతుంది. దీనికి మిత్రుడు ఇచ్చిన రిపోర్టు సారంసం వనరుగా ఉపయోగపడుతుంది కనుక రిజర్వే న్లను ఆదిపత్య కులాలుబ్లాక్ మెయిలింగ్ రాజకీయలకు వాడు కొంటున్నారు: బోయ,బోయవాల్మీకీ కులాలను కలపడం పరికొత్త అంశంగా కనబడినా బలవంతులైన ఆదిపత్య కులాలకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగల్లో బలహీనులైనా తెగలపై ఆదిపత్యం కొనసాగిస్తునే ఉన్నారు. 1935 లో భారత ప్రభుత్వ చట్టం (బ్రిటీషుచట్టం) దేశంలో 212ఆదిమ తెగలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించగా, రాజ్యంగంఅమల్లోకి వచ్చేనాటికి (1950) ఆజాబితా 429కి పెరిగింది. అనేక రాజకీయ ఒత్తిడ్ల కారణంగా నేడది 790కి పైగా పెరిగిపోయింది. అయినా ఇంకా చేరుస్తునే ఉన్నారు. అన్ని రంగల్లో ఆదివాసుల కంటే చైతన్యవంత కులాలను రాజకీయ అవస రాలకోసం కలుపుతున్నారు. అందరిని ఒకేవిధంగా పరిగనించడం వలన సాంకేతికంగా తరువాత చేర్చబడిన వారే మొత్తం ప్రయోజనం పొందుతుతారు. మాతెగలకు కేటాయించిన రిజర్వేషన్ ఫలాలైనా విద్య,ఉద్యోగ,ఉపాది,ఆర్థిక,రాజకీయ ప్రయోజనలు అందుకోలేక ఆయా రంగాల్లో నిలదొక్కుకోనే అవకాశన్ని కోల్పోతున్నాము. అంతే కాకుండా ఆదివాసులు, దళితులు, స్త్రీలు, వెనుకబడిన తరగతులు, ముస్లీం మైనార్టీప్రజలు అందరితో సమానస్థాయికి ఎదగడానికి ఉద్దేశించిన రిజర్వేషన్లు అగ్రవర్ణ పాలకుల ‘‘బ్లాక్ మెయిలింగ్’’ రాకీయా లకు (తెలుగురాష్ట్రల్లో రెడ్డి,కమ్మ,వెలమ) వనరులుగా వాడుకొంటు న్నారు. తప్పితేఅయా వర్గలకు ఒరగబెట్టిందేమిలేదంటే అతిశయోక్తి కాదు. 50శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండకూడదనే నియమం అత్యున్నత ధర్మాశనం చెప్పినప్పటికి, కాపులకు ప్రత్యేక కేటటగిరిలో 5శాతం ఇవ్వడానికి నిర్ణయించింది పాలకపక్షం. కానీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నప్పుడు అలాంటి నియమం ఏమి లేకుండా ఇప్పుడున్న 6శాతన్నే! వచ్చే ఏబై లక్షల మందికి పంచిపెడుతుంది. అదిక జనాభా కలిగి అభివృద్దికి చేరువైన కులాలను ఎస్టీల్లో కలిపి అంత శాతం రిజర్వేషన్ పెయచితే సరిపోతుందని అనవచ్చును. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, దబాయించడానికి పనికొస్తుంది. తప్పితే! పరిష్కారం ఎంత మాత్రం కానే…కాదు. లంబడా, ఎరుకుల, యానాది కులాలను కలిపినప్పుడు అప్పటి పాలకులు కూడా ఇదే నిర్లక్ష్య వైకరిని ప్రదర్శించింది. ఆదివాసీ తెగల్లో ఆవయించి ఉన్న నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం రాజకీయ నిరాశక్తత వంటివి పరిగణన తీసుకోకుండా నాలుగు శాతంగాఉన్న ఎస్టీ రిజర్వేషన్ ఆరు శాతానికి పెంచింది. 6 శాతంలో కొద్ది మేరకైనా అందుకోలేక పోగా! 4 శాతం కూడా కోల్పోయిన స్థితిని చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సాంస్కృతిక సాంప్రదాయక విలువలకు ఏసందర్బంలో కూడా ప్రామా ణికంగా తీసుకొన్న దాకలాలు లేవు. సామాజిక న్యాయమంటూ రాజకీయ పరమైన ఒత్తిడ్లే ప్రధాన అర్హాతగా తీసుకొన్నారు. బోయల విషయంలో అదే జరిగింది. కలపబోయే మత్సకారులు, వడ్డేరా, రజకుల విషయంలో ఇదే జరుగబోతుంది. మరిన్ని కులాల డిమాం డ్లన్ని రాజకీయ పార్టీల పరిశీలనలో ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోన్ రెడ్డి గార్ల పరిశీలనలో ఉంది. ఓట్ల పంపకాల లెక్కలు తెలాక ఎన్నికల వేల మన ముందుకు రానుంది. కులాలను తెగల జాబితాలో చేర్చే క్రమంలో షెడ్యూల్ద్ ప్రాంతల్లో విపరీతమైన వలసలు పెరిగుతుంది. ఇతర వలస జనాభా వలన ఒత్తిడికి తట్టుకోలేక, స్థానిక సమూహాలు అంతరించిపోతున్న పరిస్థితులు వివ్వవ్యప్తంగా చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో లంబడాలనుఎస్టీ జాబితా లో చేర్పినపుడు అదే జరిగింది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష 32 వేల 464 మందిగా ఉన్న లంబడా జనాభా 1981 నాటికి ఆ సంఖ్య 11 లక్షల 58వేల 342కు చేరుకొందని గణంకాలు స్పష్టం చేస్తుంది. అంటే పదేళ్ళలో దేశానలు మూలల నుండి 11లక్షలకు పైగా జనాభా వలస వచ్చి చేరిపోయారు. నేడు విశ్వవ్యప్తంగా గుర్తింపు పొందిన ‘గోండు, కోయ’ వంటి సమూహాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఈపరిణామం గుణపాఠంగా మన ముందున్న సవాలు. షెడ్యూల్డ్ తెగల్లోకి ఇతరకులాలను చొప్పించే కుతంత్రలను అడ్డుకోవడం మా ఆదివాసుల మనుగడ సమస్య మాత్రమే.. కాదు. విశ్వమానవ మానవ మనుగడ సమస్య కూడా?.