వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షోభం
రైతాంగ ఉద్యమాలకు అశోక్ ధావలే గత ముప్పై సంవత్సరాలుగా దిశా నిర్దేశం చేస్తున్నారు. ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్.కె.ఎం)లో ప్రధాన భాగస్వామిగా ఉన్న ‘ఆల్ ఇండియా కిసాన్ సభ’ (ఎ.ఐ.కె.ఎస్) అఖిల భారత అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. వ్యవసాయ రంగంపై మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల ప్రభావం గురించి…బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకు రైతాంగం చేపట్టిన చారిత్రాత్మక పోరాటం గురించి….ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు….
మన దేశ జనాభాలో మూడిరట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావం వల్ల నేటికీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న తీరుపై మీ అభిప్రాయం ఏమిటి ? 75 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో మూడిరట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న మాట నిజం. సరళీకరణ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను వేగవంతం చెయ్యడంలో విఫలం చెందాయి. వ్యవసాయంలో అతి తక్కువ వృద్ధిరేటు ఉన్న కారణంగా సగానికి పైగా వ్యవసాయ కుటుం బాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గింది. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా ఉన్న కారణంగా పారిశ్రామిక వృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడిరది. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు మినహా, దేశంలో వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణ వ్యవసాయ నిర్మాణంలో ప్రభుత్వ పెట్టుబడుల కొరత వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిరది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ గ్రామీణ అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. గ్రామీణ వ్యవస్థలో అప్పటికే ఉన్న అసమానతలను..1991 తరు వాత వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షో భం..మరింత తీవ్రతరం చేసింది. వ్యవ సాయ వృద్ధి రేటు మందగించింది. ప్రభుత్వ పెట్టు బడులు పూర్తిగా తగ్గిపోయాయి. పెట్టుబడి సబ్సిడీలలో కోతల ఫలితంగా పెట్టుబడి ఖర్చు లు భారీగా పెరిగాయి.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాల ఫలితంగా ఆర్థిక దోపిడికి అవకాశం ఉన్న దిగుమతుల ప్రవాహం పెరగడం వల్ల సరుకుల ధరలు కుప్పకూలాయి. దాంతో అన్ని పంటలపై లాభదాయకంగా ఉండే ధరలు తగ్గిపోయాయి. చిన్న, సన్నకారు రైతులకు అందాల్సిన ఆర్థిక వనరులను ధనిక వర్గాలకు, బడా కార్పొరేట్ సంస్థలకు మళ్ళించారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, గత మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలే ప్రధాన కారణం. 1992లో హర్యానా లోని హిస్సార్ లో జరిగిన ఎఐకెఎస్ జాతీయ మహాసభ, ఈ నయా ఉదార వాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా హెచ్చరిం చింది. ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ, వ్యవసాయ రంగం గణనీయమైన వృద్ధిని పొందలేదు. చిన్న రైతులు విముక్తి కాలేదు. ఎందువల్ల ?గ్రామీణ అభివృద్ధి ఏమైనా జరిగిందా ?వారు వ్యవసాయ రంగం అవసరా లను తప్పుగా అర్ధం చేసుకోవ డంతో ఈ రంగంలో సంస్కరణలు విఫలమ య్యాయి. ఈరంగా నికి వ్యవసాయ సంస్కరణ లు, భారీ ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. వ్యవసాయ రంగంలో దేశీయంగా, బయట కూడా మార్కెట్లు తెరిస్తే, వ్యవసాయ రంగం దానంతటదే పెరగడం ప్రారంభమవుతుందని మన విధాన నిర్ణేతలు ఊహించుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రభుత్వం చేయాల్సిన వ్యయంలో కోత విధింపు…భారతదేశ ఆహార భద్రతకు ప్రమాదమని స్థూల ఆర్థిక శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ?ఒక వ్యవస్థగా స్వేచ్ఛా వాణిజ్యం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అపనమ్మకం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఒక విశ్వసనీ యమైన సంస్థగా భావించడం లేదు. అందుకే ఈ దేశాలు ప్రాంతీయ, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాయి. డబ్ల్యూటీఓ ప్రయోజనకరంగా ఉన్నట్లైతే, మళ్ళీ కొత్త ఒప్పందాలతో అవసరం ఏమిటి? ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగానికి ప్రమాదం తెచ్చిపెట్టాయి. చౌకగా లభించే వస్తువులను దిగుమతి చేసుకోవడంతో ధరలు బాగా పడిపోయి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం లోకి నెట్టబడిరది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో బాగా వెనుకబడిన దేశాల్లోని ఆహార భద్రతపై స్వేచ్ఛా వాణిజ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వారు వాణిజ్య పంటలను ఎగుమతి చేసే ప్రయత్నం చేసి, ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతారు. కానీ వాణిజ్య పంటల ధరలు బాగా పడిపోతున్నాయి కాబట్టి, ఎగుమతుల ద్వారా పొందే ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. అందువలన ఈ దేశాలు ఇంతకుముందు చేసుకున్న పరిమాణంలో దిగుమతి చేసుకోడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇది వారి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. మంచి లాభాలతో ధాన్యాలను ఉత్పత్తి చేసే చిన్న, సన్నకారు రైతుల సామర్థ్యంపై ప్రభుత్వ వ్యయంలో కోతలు ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ల లాభాలు, సబ్సిడీలలో కోతలు విధిస్తున్న కారణంగా పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. రైతులు బహుళజాతి కార్పొరేషన్లపై ఆధారపడేవారిగా మారిపోతున్నారు. ఇవన్నీ చిన్న, సన్నకారు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. 1980లో భారత వ్యవసాయ వృద్ధి రేటు, నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన 30 ఏళ్ళ కాలం లోని వ్యవసాయ వృద్ధి రేటు కంటే ఎక్కువ. సంస్కరణలు వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించడంలో విఫలమ య్యాయని చెప్పడానికి ఈ ఒక్క సూచిక చాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015-2022 మధ్య కాలంలో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసింది. ఇది ప్రస్తుత బిజెపి పాలకుల అతి పెద్ద వైఫల్యం. వాస్తవానికి ఈ కాలంలో రైతుల ఆదాయాలు బాగా పడిపో యాయి. పెద్దనోట్ల రద్దు, అనాలోచితమైన జీఎస్టీ పన్ను విధానం, అనాగరికంగా విధించిన లాక్డౌన్ లాంటి నిర్ణయాలు రైతాంగాన్ని దెబ్బతీశాయి. ఈ సంస్కరణలు తమ స్థితిగ తులను దుర్భరం చేశాయని వారు ఆగ్రహంగా ఉన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా మీరు నాయకత్వం వహిస్తున్న రైతాంగ ఉద్యమాల అనుభవాలను వివరిస్తారా ? గత ముప్పై ఏళ్ళుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఏర్పడిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం,4లక్షల మంది రైతుల ఆత్మహ త్యలకు దారి తీసింది. ప్రాథమిక సమస్యగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు… పెట్టుబడికి అయిన ఖర్చుకు అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరగా హామీ ఇవ్వాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసం హరించుకోవాలని, పెట్రోల్-డీజిల్-గ్యాస్ ధరలను సగానికి తగ్గించాలని, రైతులు వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, ఇన్సూరెన్స్ కంపెనీలకు కాకుండా బాధల్లో ఉన్న రైతాంగానికి పంట బీమా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని, సన్న-చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కార్మికులకు రెట్టింపు పని దినాలు, రెట్టింపు వేతనాలను అమలు చేయాలని, గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, రైతుల నుండి బలవంతంగా భూసేకరణను నిలిపి వేయాలని, భూ సంస్కర ణలను చేపట్టాలని కోరుతూ పోరాటాలు జరిగా యి. అదే విధంగా కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయా లని, ప్రైవేటీకరణను నిలుపుదల చేసి, బిజెపి పాలకులు దేశాన్ని తెగనమ్మే చర్యలకు అంతం పలకాలని పోరాటాలు జరిగాయి. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమా లను తీవ్రతరం చేస్తున్నాం. ఈ ఉద్యమాలకు పరాకాష్టగానే ఢల్లీి సరిహద్దుల్లో జరుగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమాన్ని చూడాలి. సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో 2020 నవంబర్ 26న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రైతు ఉద్యమం పది నెలల కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ ఉద్యమం మతం, కులం, ప్రాంతం, రాష్ట్రం, భాషలను అధిగమించి కొనసాగుతోంది. అణచివేత, అపఖ్యాతిపాలు చేసే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొం టోంది. విజయం సాధించే వరకు ఈ పోరా టాన్ని తీవ్ర తరం చేయాలని రైతులు పట్టు దలతో వున్నారు. కాంట్రాక్టు వ్యవసాయం వలన కలిగే లాభాలను, అనర్థాలను వివరిస్తారా ? కొంత కాలంగా మన దేశంలో కాంట్రాక్టు వ్యవసాయం అమలులో ఉంది. కార్పొరేట్ కంపెనీలు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన ధరను చెల్లించి రైతులను మోసం చేయకుండా హామీ ఇవ్వాలి. అయితే మన చట్టాలు అందుకు భిన్నంగా వున్నాయి. కాంట్రాక్టు వ్యవసాయంలో కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వున్నాయి. రైతులు తమ భూములను ఈ కంపెనీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందే మోనని భయపడుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎఐకెఎస్ అనేక నిరస నోద్యమాలను నిర్వహిస్తున్నది. ఆ చట్టాల గురించి వివరిస్తారా?వ్యవసాయ చట్టాలు దేశంలోని రైతుల బతుకు తెరువుపై తీవ్ర దాడిగా చెప్పవచ్చు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఎపిఎంసి), ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (ఇసిఎ)లు 1960 నుండి రైతులకు, వినియోగదారులకు రక్షణగా ఉన్నాయి. అవి రైతులు మెరుగైన ప్రయోజనాలు, స్థిరమైన ధరలు (ఎపిఎంసి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ) పొందడానికి సహాయపడ్డాయి. ఎపిఎంసి వ్యవస్థను ఉపసం హరించి…వాటిని ఆదానీ, అంబానీ గ్రూప్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్ వ్యవస్థ పతనంతో రైతులు పూర్తిగా కార్పొరేట్ కంపెనీల అదుపు లోకి నెట్టివేయబడతారు. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రైతుల మరణాలకు దారి తీస్తుంది. అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, రిటైల్ మరియు రవాణా రంగాలను కార్పొరేట్ చేతుల్లోకి చేర్చుతుంది. అంటే దీనర్థం, వినియోగదారులు ఆహార పదార్థాలను మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కనీస మద్దతు ధరను కల్పించే వ్యవస్థను, ప్రభుత్వ ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసే లక్ష్యంతోనే…బిజెపి ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. భారతదేశంలో 81 కోట్ల మంది ఉపయోగిం చుకొనే ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ధ్వంసం చేయబడుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే కాక, ప్రజలందరికీ వ్యతిరేకమైనవి. ఈ వ్యవ సాయ చట్టాలు రాజ్యాంగబద్దం కావు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాల్సిన అంశాలు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అగౌరవ పరస్తూ, సమాఖ్య నిబంధనలను తుంగలో తొక్కి, రాష్ట్రాల హక్కులను కాలరాసి పార్లమెంట్లో చట్టాలను తెచ్చింది. – భాస్కరరావు