వేతనాల్లో వృద్ధిలేమి-ప్రభుత్వ నిర్లక్ష్యం
వివిధ దేశాల్లో చెల్లిస్తున్న వేతనాల వ ృద్ధిపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఒ) గత నెల26న విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వేతనాల వృద్ధిలో, అసమానతల్లో, లింగవివక్షా పూరిత వేతనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సంపద ఏ స్థాయిలో పెరిగితే అదేస్థాయిలో దానికి కారకులైన వారి సంపాదనల్లోనూ మార్పు రావాలి. అలా రానప్పుడే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుంది. ఐఎల్ఒ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2016లో 2.4శాతం వేతన వృద్ధి ఉంటే, 2017లో అది1.8శాతానికి పడిపో యింది. ఇవే వివరాల్లో చైనాను మినహా యించి చూస్తే, ప్రపంచ వేతన వృద్ధి, 2016లో 1.8శాతంగా ఉంటే 2017లో 1.1శాతానికి పడి పోయింది. చైనా ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా తదనుగుణంగా ఘనమైన వేతన వ ృద్ధి సాధిస్తూ ప్రపంచ సగటుకు తోడ్పాటునిస్తున్నది. ఐఎల్ఒ వెలువరించిన ఈ వృద్ధి, నిజ వేతనం, అనగా ద్రవ్యోల్బణంతో సరిచూసి లెక్కించగా నమోదైంది. అయితే ఇది 2008 తరువాత అత్యంత తక్కువ వ ృద్ధిగా ఇప్పుడు నమోదయింది. అభివృద్ధి చెందిన జీ20 దేశాలలో 2015లో 1.7శాతంగా ఉంటే 2016లో 0.9 శాతానికి పడిపోయింది. 2017లో 0.4శాతానికి పడిపోయింది. ఐరోపాలో 2015లో 1.6శాతానికి, 2016లో 1.3శాతానికి, 2017 లో 0 (సున్నా)గా నమోదయింది. అమెరికాలో చూసినట్టయితే 2015 లో 2.2శాతం, 2016లో 0.7శాతం, 2017 లోనూ 0.7శాతం నమోదయింది. ఇలా తక్కువ వేతన వృద్ధి కనబరిచిన దేశాలన్నింటి లోనూ వారి వారి జీడీపీలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ వేత నాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? 2015లో అమెరికా సంపద 17ట్రిలియన్ డాలర్లు ఉంటే 2017లో 21ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరి వేతనాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? దీనిని బట్టి ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలలో వేతన వృద్ధి మందగిం చిందని అర్థం. సంపద స ృష్టిస్తున్న కార్మికులకు సరైన వాటా రావటం లేదు. అందుకే గతేడాది వెలువడిన ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో సృష్టించిన సంపదలో 82శాతం సంపద ఒక శాతం ప్రజల దరికి చేరుతుంది అనే వాస్తవం దీనిద్వారా తేటతెల్లమవుతోంది. సంపద పోగు పడడానికి శ్రామికులకు చెల్లించకుండా ఉంటేనే సాధ్యమవు తుందనే సత్యం మళ్లీమళ్లీ రుజువుతోంది. వేతనాల వృద్ధి మందగించడానికి 3 కారణాలుగా ఐఎల్ఒ ప్రకటించింది. 1.ఉత్పత్తిలో గణనీయమైన నెమ్మది ఏర్పడిరది. 2. ప్రపంచ పోటీతత్వం పెరిగింది. 3. కార్మికులు బేరమాడే శక్తి కోల్పోయారు. ఉత్పత్తిలో నెమ్మదస్తత ఏర్పడటానికి కారణం సరైన డిమాండు లేకపోవడం, ఈ డిమాండు ఉండాలంటే ప్రజల్లో కొనుగోలుశక్తి ఉండాలి. ఈశక్తి ఉండాలంటే పనికిదగ్గ ప్రతిఫలం ఉండాలి. కానీ పెట్టుబడిదారుల అత్యాశను కట్టడి చేయనంత వరకు ఈసంక్లిష్టత అధిగమించడం కష్టమే. ఇక పోటీ తత్వం కారణంగా సంయోగాలూ సంలీనాలతో చిల్లర వర్తకాన్ని దెబ్బ తీయడంతో వినియోగానికి సరుకు అందుబాటు తగ్గి ఉత్పత్తి నెమ్మది స్తుంది. మొదటి రెండు కారణాలతో పాటు కార్మిక చట్టాలను నీరుగా ర్చటం, ఆశ్రిత పెట్టుబడిదారీతనం ఎక్కువవడం, పెరుగుతున్న నిరు ద్యోగం, పెరిగిన పెట్టుబడిదారీ ఆధిపత్యం దృష్ట్యా కార్మికులు బేర –జి. తిరుపతయ్య