విశాఖ ఉక్కు ఈ నెల 25 తర్వాత సమ్మె

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నెల 25 తర్వాత సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి.