వివాదాస్పద సంస్కరణలు`అటవీ చట్టం సవరణలు

భారత దేశంలో అధికంగా నివసించే ఆదివాసీ ప్రాంతాల్లో అపారమైన వనరులు,గనులు, ఖనిజాలు,నీటివనరులు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే! దేశంలో ఉన్న అటవీ పరివాహక ప్రాంతాలన్నీ గిరిజన జీవనవిధానంతో ముడిపడి ఉంది.ఎన్ని వనరులున్నా అక్కడ నివసించే గిరిజనుల పరిస్థితుల్లో మార్పులేదు.భారత రాజ్యాంగంలో గిరిజన,దళిత తెగలకు రక్షణ కవచం లాంటి చట్టాలను పొందిపరిచాయి.రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకొనేందుకు జాతీయ ఎస్టీ కమిషన్‌ కూడా ఏర్పాటైంది.ఇన్ని వ్యవస్థలున్నప్పటికీ గిరిజనులు అన్యాయానికి గురవు తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు,జిల్లాలు విభజన నేపథ్యంలో వారి జీవితాలు ఛిన్నాభిన్నమైంది.వలస పక్షుల్లా విలవిలలాడుతున్నారు.పాలకుల స్వార్ధ రాజకీయాలకు బలైపోతున్నారు.
ఆదివాసీల జీవనవిధానం అడవితో ముడిపడిఉంది.అయితే అడవిలోసంస్కరణల అలజడి.. చట్టంలో కీలక మార్పులు జోరందుకున్నాయి.94 ఏళ్ల చరిత్ర గల భారతీయ అటవీ చట్టం1927 (ఐఎఫ్‌ఏ) సవరణలకు ఉపక్రమించారు. ఈచట్టం అన్నీ రకాల వ్యవస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అటవీ సంరక్షణ నియమాలు2022 పేరుతో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలపై తీవ్రమైన ప్రభావంచూపుతోంది.కోట్లాది మంది గిరిజనులను అడవుల నుంచి గేంటేసి పరిస్థితులు దాపురించనున్నాయి. అడవులు,అటవీ సందపను బదలాయింపు చేస్తే అటవీ సంక్షరక్షణ చట్టం(1980)లో కఠినంగా నిబంధనలున్నాయి. ఈ నిబంధనలను తొంగలోకి తొక్కి అటవీ సంపదను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పాలకులు కుట్రపన్నుతున్నారు. ఈ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా గిరిజ నులు వ్యతిరేకిస్తున్నా పాలకులు పెడచెవినపెడుతున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే అడవులపై ఆధారపడ్డ కోట్లాదిమంది గిరిజనులు బలవంతంగా గెంటివేతకు గురవుతారు. ముఖ్యంగా షెడ్యూల్‌ ప్రాంతాల్లో విలువైన మైనింగ్‌,ఖనిజ సంపదను అంబానీ,ఆదాని వంటి కార్పొరేట్లకు కట్ట బెటేందుకు ఈబిల్లును తీసుకొస్తున్నదని గిరిజన తెగలు భావిస్తున్నాయి. అటవీ భూమిని పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టాలంటే 1980చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతబిల్లులో ఆనిబంధనలన్నింటిని సరళతరం చేస్తూ సింగిల్‌ విండో విధానం ద్వారా కేంద్ర క్యాబినేట్‌ ఆధ్వర్యంలో వేసిన ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ అనుమతి అవసరం. ఈ నిబం ధనలు బదలాయించాలంటే జాతీయ ఎస్టీ కమిషన్‌(ఎన్‌ఎస్‌టీ) అనుమతులు తప్పనిసరి. ఎన్‌ఎస్‌టీ అనేది ఆర్టికల్‌338ఎ ప్రకారం ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ అధికారం. ఆ ఆర్టికల్‌లోని క్లాజ్‌(9) ప్రకారం యూనియన్‌,ప్రతి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కమిషను సంపద్రించాల్సిన అవశ్యకత ఉంది.రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా,కమిషన్‌ సూచనలను అంగీకరించాలి.ఒక వేళ కమీషన్‌తో విభేదించాలని అనుకుంటే దానికి గలకారణాలను స్పష్టంగా పేర్కొనాలి.కమిషన్‌ అధికారిక నిబంధనలకు ధీటుగా బిల్లుతోపాటు పార్లమెంటు ముందు ఉంచాల్సిన అవసరం ఉంచాలని ఇప్పటికే పలువురు మేథావులు,గిరిజన సంస్థలు,సంఘాలు రాష్ట్రపతికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే! ఈ పరిస్థితిల్లో అడవి బిడ్డలకు అండగా ఉన్నట్టు కనబడే ఈ చట్టం,వాస్తవానికి వారికిఅడవి తల్లికి మధ్య ఉన్న బంధాన్ని పావుగా ఉపయోగించుకుంది.ఫలితంగా ఇన్నేళ్లూ వారు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారనే వాదనలున్నాయి. ప్రైవేటు సంస్థల హక్కులను పెంచే దిశగా ఉండటం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇవేమీ ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రయత్నం అడవి బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,థింసా