విలీనం చట్ట విరుద్దం..!
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవకాంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవప్‌మెంట్ అథారిటీస్ (వీఎంఆర్‌డీఏ)పరిధిని విస్తరించి విశాఖ జిల్లాలోని13మండలాను విలీనం చేసుకుంది. దీంట్లో షెడ్యూల్డ్ ప్రాంతం నాతవరం మండంలోని చమ్మచింత, ధర్మవరం అగ్రహరం,కవవోడ్డు శరభవరం(కె.విశరభవరం,కురువాడ,పొట్టి నాగన్నదొరపాలెం(పీఎన్‌డీ పాలెం),సరుగుడు వంటి ఆరు షెడ్యూల్డ్ గ్రామాను వీఎంఆర్‌డీఏలో చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని షెడ్యూల్డ్ ప్రాంతాలో గ్రామాను మినహాయించాన్నది ప్రభుత్వ ఉద్దేశం అనిపించినప్పటికీ, ఈ ఆరుగ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకోవడం చట్టబద్దత కాదు. వీఎంఆర్‌డీఏలో విలీనమైన ఈగ్రామాకు గిరిజనులకు వరమైన షెడ్యూల్ ప్రాంత పంచాయితీరాజ్ విస్తరణ చట్టం(పీసా),గిరిజనుకు అండగా నిలిచి సుస్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్న అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)వంటి రెండు చట్టాు వర్తిస్తాయి.
పీసా చట్టం గిరిజన ప్రాంత ప్రజ ఆచారసాంప్రదాయాలు,సంస్కృతి,ఉనికి,వనరులను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడుతూ వారిఅభివృద్ధికి బాట వేస్తోంది. గ్రామస్థాయిలోజరిగే సామాజిక,ఆర్ధికాభివృద్ధి పథకాు,ప్రణాళిక అముకు ఈచట్టం గ్రామసభ ముందస్తు అనుమతులిస్తూ ప్రత్యేక అధికారాలు ఇస్తోంది. తరతరాలగా అటవీభూము సేద్యంచేసుకుంటూజీవిస్తున్నా, వాటిపై వారికి హక్కు కల్పిస్తూ వారికి సామాజిక హోదాపెరిగేందుకు,జీవవైవిధ్యం,అటవీసంరక్షణకు సంబంధించిన హక్కు అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)ద్వారా లభిస్తోంది. గిరిజనుకు ఆహార భద్రతను కూడా ఈచట్టం కల్పిస్తోంది. అందువ్ల షెడ్యూల్డ్ ఏరియాలోఉన్న ఆరు గ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి విలీనం చేయడం చట్టవిరుద్దం.అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్ఈ ఉల్లంఘన. పీసా చట్టా ప్రకారం గిరిజిన ప్రాంతాల్లో గ్రామసభ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహిస్తారు.మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మందిఎస్టీ సభ్యుహాజరైతేనే కోరంగాపరిగణిస్తారు.గ్రామసభల్లో వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికు,ఉమ్మడి భూముజాబితా,ఇంటి స్థిరాస్తు యాజమాన్యా బదలాయింపు,పంచాయతీ లెక్క ఆడిట్ నివేధికు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకొని తీర్మాణాు చేసుకుంటారు.షెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభఅధికారాన్ని విఎంఆర్‌డీఏ వంటిసంస్థ జోక్యం చేసుకునే విధానం రాజ్యాంగానికే విరుద్దం.ఇది గిరిజనలకు రాజ్యాంగహక్కు కోల్పోయే ప్రమాదంఉంది.గిరిజన గ్రామసభకు, వీఎంఆర్‌డీఏ నిర్ణయాకు చాలా తేడాలుంటాయి. అందువల్ల ఏపీప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన చట్టాలకు పూర్తి విరుద్దం.పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్ఈ యొక్క వర్తమానానికి సంబంధించినంతవరకు, ఏపీ హైకోర్టు తీర్పు మరియు ఇతర హైకోర్టు తీర్పు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో, పైనపేర్కొన్న ఆరు గ్రామాను మరియు తప్పుగా చేర్చబడిన ఇతర షెడ్యూల్డ్ గ్రామాను మినహాయించటానికి 23-3-2021నాటి జీవోల సంఖ్య 20ను వెంటనే ఉపసంహరించుకోవాని ఆదివాసీలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గిరిజను ఎక్కువగా నివసించే అనేక ఇతర గ్రామాు ఉన్నాయి.
జిల్లాలోని షెడ్యూల్డ్ ప్రాంతాతో సమానంగాఉన్న 800గ్రామాను ప్రతిపాదించింది. ఐదవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీచేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1986లో చాలా కాలం క్రితం కేంద్రానికి ప్రతిపాదను సమర్పించింది. ఆ ప్రతిపాదను ప్రాసెసింగ్ అధునాతన దశలో ఉన్నాయి. 23-3-2021నాటి జీవోలసంఖ్య 20కిందికు షెడ్యూల్డ్ ప్రాంతాకు సమానంగా ఉండే చీడికాడ మండలం (ఒకగ్రామం),గోలుగొండ మండలం(8గ్రామాలు),మాడుగుల మండలం (21గ్రామాలు),నాతవరం మండలం (2గ్రామాలు)రావికమతంమండలం (3గ్రామాు),రోలుగుంట మండలం (8గ్రామాలు),దేవరపల్లి మండలం (12గ్రామాలు),అనంతగిరి మండంలో (36 గ్రామాలు) ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాలో భాగంగా ఇటువంటి గ్రామాలను తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉన్నందున,విఎంఆర్‌డీఏ పరిధిలో కూడా వీటిని చేర్చడం అవివేకం అని ఆదివాసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామసభ అధికారంపై తాజా జీవోల20న చేర్చినవాటిని పరిగణనలోకి తీసుకుంటే,పెసా మరియు ఎఫ్‌ఆర్‌ఎ నిబంధనను ఉ్లంఘించినట్లు అవుతుంది.దీనిపై ప్రభుత్వం పుణరాలోచన చేయాల్సిన అవశ్యకత ఉంది!. వీఎంఆర్‌డీఏలో విలీనం చేసిన జాబితాలో షెడ్యూల్డ్ ప్రాంతానికి చెందిన ఆరుగ్రామాను తొలగించాని గిరిజను డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సమూహం నుంచి ప్రభుత్వానికి గిరిజన ఉద్యమేసెగ తగకముందే నాటి జీవో సంఖ్య20ను ఉపసంహరించుకోవాలి!
-ఎడిటర్ రెబ్బాప్రగడ రవి