విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. గ్రామ స్థాయి నుంచి ఎన్నికల ప్రణాళికను రూపొందిం చేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల స్థాయిలో ఉన్న ప్రజ లందరికీ చేరువ చేసేలా ఒక పెద్ద డ్రైవ్‌ చేపట్టనుంది. ఆరు నెలల పాటు కొనసాగ నున్న ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా గ్రామాల్లో ఉన్న సంక్షేమ పథకాల అర్హులను గుర్తించి వారికి అవి అందేలా ఒక భారీ కార్యక్రమానికి కేంద్రంలోని మోదీ సర్కార్‌ శ్రీకారం చుట్ట నుంది. ఈ దీపావళి పండగ తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరుతో ఈ మెగా డ్రైవ్‌ను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. దేశంలోని 2.7లక్షల గ్రామ పంచాయతీల్లో ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రను చేపట్టనున్నారు. ఈ మెగా డ్రైవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఎవరు అర్హులు అనేది గుర్తించి వారికి ఆ పథ కాల్లో ఉన్న ప్రయోజనాలను అందించడమే ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రధాన ఉద్దే శం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో పూర్తిగా అందేలా చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 నెలల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర.. దీపావళి పండుగ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల ప్రయోజ నాలు ఇప్పటివరకు అదని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలని కేంద్ర మంత్రు లకు ప్రధాని సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర కోసం ప్రత్యేకంగా రథాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఫసల్‌ బీమా యోజన, పోషణ్‌ అభియాన్‌, ఉజ్వల్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌,పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన వంటి పథకా లకు సంబంధించి అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు నమోదు చేసుకోని..వాటి ద్వారా లబ్ధి పొందని వారికి ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. దీపావళి తర్వాత నుంచి ప్రారంభం కానున్న ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర 6 నెలలు కొనసాగనుంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెడు తుందని మోదీ సర్కార్‌ భావిస్తోంది.వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరుతో జార్ఖండ్‌లో నవంబర్‌ 15న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.గిరిజన నేత బిర్సా ముండా జయంతి అయిన నవంబర్‌ 15న జార్ఖండ్‌ లోని ఖుంటిలోని ఉలిహతు గ్రామం నుంచి ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. గిరిజనుల జన్మస్థల మైన ఉలిహతును సందర్శించబోతున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం.యాత్ర మొదట్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 25 నాటికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్‌ చేస్తుంది. 3వేల వ్యాన్లతో ఈ యాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 15వేల పట్టణ ప్రాంతాలను ఈ యాత్ర కవర్‌ చేస్తుంది. ప్రతి వ్యాన్‌ రెండు గంటలపాటు గ్రామ పంచా యతీలో ఉండి, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి వాటిని అందేలా చూస్తుంది. దీని ప్రధాన లక్ష్యం దిగువ, మధ్యతరగతి జనాభా. వారు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందేలా చూడటమే. ఇప్పటికే నవంబర్‌ 22 వరకు 21రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 69 జిల్లాల్లోని 393 ట్రైబల్‌ బ్లాక్‌లు, 9వేల గ్రామ పంచా యతీలు ఈ యాత్రలో కవర్‌ చేసింది. ఆ తరువాత ఈ యాత్ర ఇతర గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తారు. చివరికి వచ్చే ఏడాది లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాలనేది ప్రధాని మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది. అర్హు లందరికీ సంతృప్తస్థాయిలో పథకాలు అందిం చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఎంవై, పీఎం కిసాన్‌, ఫసల్‌ బీమా, పోషణ్‌ అభియాన్‌,ఉజ్వల,గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన తదితర పథకాలకు అర్హులను గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా 2.7లక్షల పంచాయితీలలో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ చేపడుతోంది.
విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విజయ వంతం చేయాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ఈ నెలలో ప్రారంభిస్తున్న విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోక్య రాజ్‌ తెలిపారు. నవంబర్‌ 15న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లి కార్జునతో కలిసి విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర సన్నద్ధత, కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు,పథకాలపై ప్రజలలో చైతన్యం,అవగాహన కోసం విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ను నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో ఈనెలలో ప్రారంభించు విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జనవరి 26వ తేదీ వరకు జరుగుతుందని, ప్రధానమంత్రి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు నోడల్‌ అధికారి, ఆహ్వన,ఉత్సవ కమీటీలను నియమించడం జరుగుతుందని తెలిపారు.విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన,సురక్ష బీమా యోజన,పోషన్‌ శక్తి నిర్మాన్‌ అభియాన్‌,జన్‌ధన్‌ యోజన,చేతి వృత్తి దారులకు తదితర పధకాలను ప్రచారం చేస్తూ రోజుకు రెండు పంచాయితీల్లో ప్రచార వాహనంతో చిత్ర ప్రదర్శన,సాంస్కృతిక ప్రదర్శనలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ధిదారులను సమీకరిం చడం,అవగాహన కల్పించడం జరుగు తుందని,వివిధ పథకాల కింద అర్హులై ఉండి ప్రయోజనం పొందని వారిని గుర్తించి వారికి పధకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం నిర్వహించే రోజులలో ఫ్యామిలీ డాక్టరు కార్యక్రమం కూడా ఉండేలా షెడ్యూలు చేసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.పధకాలకు సంబంధించిన శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మండల అభివృద్ది అధికారులు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, లబ్దిదారుల వీడియోలను సంబంధిత పోర్టలు నందు అప్లోడ్‌ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డా ఏ మల్లిఖార్జున మాట్లాడుతూ ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి చేతులమీదుగా విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. మైదానం, రూరల్‌ ప్రాంతాలలో ఈ నెల చివర నుండి ప్రారంభమగునని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు రెండు నెలలు పాటు జరుగు విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర షెడ్యూల్‌ ప్రకారం, ప్రణాళికా బద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. యాత్ర జరుగు రోజులలో సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.జిల్లా పరిషత్‌ సిఈఓ ఎం పోలి నాయుడు కార్యక్రమ షెడ్యూల్‌, వివిధ శాఖల అధికారులు చేయవలసిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి,గ్రామ,వార్డు సచివాలయ అధికారి,జిల్లా వైద్య అధికారి,జిల్లా పౌర సరఫరాల అధికారి, డి.ఆర్‌.డి.ఎ. ప్రోజెక్టు డైరెక్టరు, హౌసింగు ప్రోజెక్టు అధికారి, పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజరు,జిల్లా వ్యవసాయఅధికారి, జిల్లా ద్యానఅధికారి, జిల్లా మత్స్యఅధికారి, ఐ.సి.డి.ఎస్‌. ప్రోజెక్టు అధికారి,గ్రామీణ నీటి సరఫరా సూపరిం టెండెంటు ఇంజనీరు పాల్గొని వారి శాఖల పరిధిలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పధకాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. – గునపర్తి సైమన్‌