లేటరైట్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

లేటరైట్‌ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతో పాటు…రవాణాకోసం వేలాది పచ్చటి చెట్లను అడ్డంగా నరికి రోడ్డు వేసిన వైనంపై ‘నిజ నిర్ధార ణ’కు ఆదేశించింది.ఈవ్యవహారంపై విశాఖ జిల్లా నాతవరం మండలం గునుపూడికి చెందిన దళిత ఐకయ ప్రగతి సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు స్వీకరిం చడమే కాకుండా..‘మా జోక్యం అవసరం అని భావిస్తున్నాం’అని కూడా ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈఅభిప్రా యానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో మైనింగ్‌ లీజుదారు జర్తాలక్ష్మణరావుతోపాటు పంచాయ తీరాజ్‌ సహా పలు శాఖల అధికారులు దాదాపు ఇబ్బందుల్లో పడినట్టేనని ప్రభుత్వ వర్గాలే అభిప్రా యపడుతున్నాయి. అడవిలోకి చొచ్చు కురా వడమే కాకుండా వేలాదిచెట్లు కొట్టి రోడ్డువేయడంపై స్థానిక గిరిజనులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయపరంగా ఉన్న మార్గా లపై జాతీయ పర్యా వరణవాదులతో కొంతకా లంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కొండ్రు మరిడియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు.ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే.రామకృష్ణన్‌,సభ్య నిపుణుడుకే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం జులై 26వ తేదీన పిటిషన్‌ను విచారించి,అదేరోజు జులై 30న ఆదేశాలుఇచ్చింది.
పిటిషన్‌లో ఏముందంటే..

అటవీ సంరక్షణచట్టం-1980లోని సెక్షన్‌ 2 కింద సరైన అటవీ అనుమతులు లేకుండా, అటవీ సంరక్షణ రూల్స్‌-2003ను పాటించకుండా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే చేయని కొండ పోరంబోకు భూమి(యూఎసహెచ్‌పీ)లో 212 హెక్టార్ల భూమిలో 20ఏళ్లపాటు మైనింగ్‌ చే సేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజనుల కోసం ఉద్దేశించిన రహదారిని ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండా మైనింగ్‌కోసం పెద్దది గా విస్తరించుకున్నారు. ఈరహదారి నిర్మాణం కూడా అటవీ హక్కుల చట్టం-2006లోని నిబంధ నలకు విరుద్దంగా చేశారు. మైనింగ్‌కోసం సమర్పిం చిన గ్రామసభ తీర్మానపత్రం వట్టిబోగస్‌. ఆ విష యం తెలిసినా దాని ఆధారంగానే మైనింగ్‌కు అను మతి ఇచ్చారు. దీంటోపాటు అటవీ హక్కుల చట్టం-2006తోపాటు ఇతర కీలకచట్టాలను కూడా ఉల్లంఘించారు. దీనివల్ల పర్యావరణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈనేపధ్యంలో విశాఖ,తూర్పు గోదా వరి మన్యంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఆర్‌ఎఫ)తో కలిసి ఉన్నభూమిలో అటవీ సంరక్షణ చట్టం-1980, రూల్స్‌-2003ని ఉల్లంఘించి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని ఆదేశించాలి. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్‌ ని నిలు వరించి ఆ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ విష యంలో చట్టబద్ధమైన అంశాలు, నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలి. సరుగుడు లోని రిజర్వ్‌ ఫారెస్టను కాపాడలేకపోయిన, తప్పులు చేసిన అధికారులపై అపరాధరుసుం విధించాలి’’
ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..
ఫిర్యాదులో పిటిషనర్‌ లేవనెత్తిన అంశా లపై విచారణకు ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ లోని సీనియర్‌అధికారి లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా స్వతంత్ర ఏజెన్సీబీ విశాఖ కలె క్టర్‌,విశాఖ జిల్లా అటవీఅధికారి(డీఎఫఓ),గనులశాఖ సీనియర్‌ అధికారి,రాష్ట్రకాలుష్య నియంత్రణమండలి (పీసీబీ) నుంచి సీనియర్‌ అధికారి ఉంటారని,కమిటీకి అవస రమైన లాజిస్టిక్‌ సహకారం,సమన్వయం కోసం రాష్ట్ర గనుల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొంది. ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చట్టాల ఉల్లంఘనలను పరిశీ లించి,వాటిపై వాస్తవిక,కార్యాచరణ నివేదికను అందించాలని కోరింది. అంటే,మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం,రహదారులు నిర్మించిన అటవీ, డంపింగ్‌ యార్డు,పర్యావరణంపై ప్రభావం చూపే ప్రతీ పాయుంట్‌ను కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే…మైనింగ్‌కోసం కేటాయించిన భూమి వాస్తవిక పరిస్థితి ఏమిటో,అక్కడ మైనింగ్‌ చేపట్ట డానికి అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం ఏమైనా అనుమతులు తీసుకోవాలా? ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి (హెచ్‌ఓ ఎఫఈ)ని ఎన్‌జీటీ ఆదేశించింది.
ఏడు అంశాల్లో విచారణ..
లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాం తాన్ని తనిఖీ చేసి..వాస్తవిక పరిస్థితులను అధ్య యనం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మొత్త ఏడు అంశాలను పరిశీలిం చాలని నిర్దేశించింది.అవి..ౌ మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం ఒరిజినల్‌ రెవెన్యూ రికార్డుల (స్వాతంత్య్రానికి ముందున్నవి) ప్రకారం ఎక్కడుందో నిర్ధారణ చేయాలి. ౌ మైనింగ్‌దారు నిబంధనల ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం-1980 మేరకు అనుమతులు తీసుకొన్నారా? ౌ అక్కడ ఏ పద్ధతిలో మైనింగ్‌ జరుగుతోంది… దాని వల్ల పర్యావరణం,జీవావరణం (జంతు జాలం)పై ఎంత మేర ప్రభావం ఉంటుంది.. ఇప్పటికే ఏ మేరకు దెబ్బతీసింది? ౌ లీజుదారు ఏమైనా పరిమితికి మించిన మైనింగ్‌ చేశారా…ఒక వేళ అదే జరిగితే ఏ స్థాయిలో అది ఉంది? ౌ ఆ ప్రాంతంలో లీజుదారు ఏమైనా చట్టప రమైన అనుమతులు తీసుకోకుండా రహదారిని విస్తరించారా? ౌ లీజుదారు మైనింగ్‌కు అనుమతులు,క్లియ రెన్స్‌లు తీసుకున్నప్పుడు జారీ చేసిన నిబం ధనలను, కాలుష్యనియంత్రణ మండలి నియమనిబంధనలు పాటించారా? ౌ ఇంకా….ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా…వాటిపై సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలేమిటి? పర్యావరణ నష్టం జరిగి ఉంటే పర్యావరణ పరిహారాన్ని అంచనావేశారా? ఈ అంశాలపై సమగ్ర పరిశీలనచేసి ఆగస్టు31లోగాపీడీఎఫ్‌ రూపం లో నివేదిక సమర్పించాలని జాయింట్‌ కమిటీకి దిశానిర్దేశం చేసింది.
ఫిర్యాదుదారుకీ భాగస్వామ్యం
ట్రైబ్యునల్‌ మరోకీలకమైన ఆదేశం ఇచ్చింది. ఫిర్యాదుదారు కొండ్రు మరిడయ్యను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. విచారణ చేపట్టే సమయంలో హాజరు కావా ల్సిందిగా ఫిర్యాదుదారునికి నోటీసులు ఇవ్వాలని, మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో ఫిర్యా దుదారు కూడా ఉంటారని నిర్దేశించింది. ఈ సమ యంలో పర్యావరణ,అటవీ చట్టాల ఉల్లంఘనలు, అక్రమాలపై కమిటీకి ఆయన తన నివేదిక అందిం చొచ్చునని పేర్కొంది. కమిటీ తన నివేదికను సమ ర్పించడానికి అది(ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్టు) ఉపయోగపడుతుందని ఉత్తర్వులో పేర్కొంది. జాయింట్‌ కమిటీ విచారణ వేగంగా సాగడానికి ఫిర్యాదుదారు వారం రోజుల్లోగా తన వద్ద పత్రా లు,రిపోర్టులను కమిటీ సభ్యులకు అందించాలని కోరింది.
ఇదీ నేపథ్యం..
విశాఖజిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద 121హెక్టార్లలో లేటరైట్‌ మైనిం గ్‌కు గతంలో లీజులుపొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్యనేతలు తమ దారికి తెచ్చుకున్నారు. గత నెల నుంచి లీజుగనిలో లేటరైట్‌ తవ్వి, తరలిం చడం మొదలుపెట్టారు. ఈ ఖనిజాన్ని తరలించ డానికి క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అప్పటికే ఉన్న కాలి బాటను 20-30 అడుగుల మేర వెడల్పు చేశారు. దీనికోసం ఐదు కిలోమీటర్ల మేరవిస్తరించిన ఫారెస్టు ను గుల్ల చేశారు.రెవెన్యూ,అటవీశాఖల అనుమతు లు లేకుండా ఆరేడు వేలవృక్షాలను నరికివేశారు.
చెట్టుకు రూ. ఐదు వేలు..
విశాఖ జిల్లా నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు అనే వ్యక్తి సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసు కొన్నారు. అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు ఆయనకు లీజు మంజూరుచేశారు. సుమారు 19 హెక్టార్లలో 2016-17లో తవ్వకాలు ప్రారంభించి తొమ్మిది నెలల్లో మూడు లక్షల టన్నుల లేటరైట్‌ను ఆ క్వారీలో వెలికితీశారు. సుందరకోటకు చెందిన ఓగిరిజనుడు మైనింగ్‌లో నిబంధనలు ఉల్లంఘిం చారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.ఖనిజం రవాణాకు 1.5కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం దాదాపు మూడు వేల చెట్లు కొట్టివేశారని ఫిర్యాదు చేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీ లించిన హైకోర్టు..తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. అంతేకాక క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, వన్యప్రాణులకు ముప్పు లేకుండా పగటిపూట మాత్రమే క్వారీ తవ్వకాలు చేపట్టాలని సూచించింది. రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.ఐదు వేలు వంతున మొత్తం రూ.1.5కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి,గనులశాఖ,అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్వారీలో తనిఖీలు చేసి, నిబం ధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ని నిలిపి వేశారు. తాజా ట్రైబ్యునల్‌ ఆదేశాలతో స్థానిక గిరిజనులు అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకొం టున్నారు. ఇప్పుడూ తమకు అలాంటి న్యాయం అందించాలని కోరుకుంటున్నారు.
సీనియర్‌ జర్నలిస్టు జక్కల నాగ సత్య నారాయణ(జనాస)అందించిన వివరాలు ప్రకారం
రిజర్వ్‌ ఫారెస్ట్‌ పొడవునా రహదారుల ఏర్పాటు
పేరుకే గిరిజనుల సంక్షేమం కోసం రహ దారి..కానీ, అక్కడ జరిగింది…కాకినాడ పోర్ట్‌ కు అడ్డరోడ్డులో లేటరైట్‌ను యథేచ్ఛగా తరలించుకు పోయేందుకు రోడ్డు నిర్మాణం.జాతీయ రహదారి మీదుగా తరలిస్తే ఇబ్బందులొస్తాయని తలంచి అడవి మార్గం అయితే ఖనిజరవాణాకు గోప్యంగా ఉంటుందని భావించినట్టుంది. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్లనిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరిం చవు ..అందులోనూ ప్రజలకు సంబంధం లేకుండా ఖనిజాన్ని తరలించ డానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలు పనికాదు. దీంతో క్వారీయజమానులు కొత్త ఎత్తుగడతో ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ ప్రజా ప్రయోజనంపేరిట అనుమతులు పొందారు. అను కున్నదే తడవుగా ఖనిజాన్ని తరలించేందుకు కాకి నాడ పోర్టుకు దగ్గరదారైన రౌతులపూడి మం డలం రాఘవపట్నం,జల్దాం,దబ్బాది,సిరిపురం మీదుగా బమిడికలొద్దుక్వారీ వరకూ దశల వారీగా 2అడుగుల కాలిబాటను 8అడుగులరోడ్డు కోసం అనుమతులు తెచ్చుకొని ఏకంగా 32 అడు గుల వెడల్పుతో19రోజుల్లో..17కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించేశారు. ఇప్పుడా రోడ్డుపై14 టైర్ల టిప్పర్లు వేగంగా దూసుకు పోతున్నాయి.నాతవరం మండలం సరుగుడుపంచాయితీ పరిధిలోని భమిడికలొద్దు రిజర్వ్‌ఫారెస్టులోని 121హెక్టార్లలోని సుమారు 5000కోట్ల లాటరైట్‌ ఎర్ర మట్టిని తవ్వుకు నేందుకు ఆంధ్రప్రేదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకున్న క్వారీ నిర్వాహకులు తొలుత రోడ్డునిర్మాణంపై దృష్టి సారించారు. రిజర్వ్‌ ఫారెస్టులోరోడ్ల నిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరించవు. అందులోనూ ప్రజలకు ఏవిధం గానూ సంబంధం లేకుండా కేవలం లాటరైట్‌ ఖనిజ సంపదను తరలించడానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలుపనికాదు. అందుకు రిజర్వ్‌ ఫారెస్టు లోని వివిధగ్రామాలను కలుపుతూ ప్రజాప్రయో జనం అనే ముసుగులో అనుమతులను పొందారు. విశాఖ జిల్లాలోని సరుగుడు,తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరు,తుని మండలాల మీదుగా లాటరైటు ఖనిజాన్ని జాతీయ రహదారికి తరలించి అక్కడ నుంచి నేరుగా వివిధ దారుల్లో కాకినాడ పోర్టుకు చేర్చాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ పోర్టుకు దగ్గర దారైన ప్రత్తిపాడు నియోజక వర్గం రౌతుల పూడి మండలం రాఘవ పట్నం, జల్దాం, దబ్బాది, సార్లంక, సిరిపురం మీదుగా బమిడికలొద్దు క్వారీ వరకూ దశల వారీగా సుమారు 17కిలో మీటర్ల మేరకు వివిధ భాగాలుగ పక్కాగా ఒకే మట్టిరోడ్డుగా నిర్మించాలని తలంచి రంగం సిద్దంచేసారు. దాన్ని గుట్టుగా పక్కాగా అమలు చేసారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అటవీశాఖ రేంజ్‌ పరిధి లోని రౌతులపూడి మండలం సార్లంక నుంచి విశాఖ మన్యంలోని సిరిపురం వరకు రహదారి నిర్మించాలని జూన్‌10న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్‌తో అటవీశాఖకు ఓదర ఖాస్తు పెట్టారు. 15న అటవీశాఖ రేంజర్‌ వెళ్లి ప్రతిపాదిత ప్రాంతా న్ని పరిశీలించి,అది 2అడు గుల కాలి బాట అని, దాన్ని 8అడుగుల రహదారిగా మార్చాల్సిన అవ సరం లేదని రిపోర్టు ఇచ్చారు. ఆ మరుసటి రోజే జిల్లా స్థాయి కమిటీ సమావేశమై సిరిపురం, సార్లంక, దబ్బాది గ్రామాల ప్రజల రాకపోకలు, వైద్య పరమైన అవసరాల కోసం ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) లో జూన్‌ 16న తీర్మానించారు. ఐతేఈరోడ్డే అడిగితే లేటరైట్‌ రహదారి విషయం బయ టకు వస్తుందని తెలివిగా ఆలోచించి, ఒకేసారి 109రోడ్లను అందులో రంప చోడవరం ఐటిడిఏ మన్యం పరిధిలో 66, కాకి నాడ పంచాయితీరాజ్‌ విభాగం పరిధిలో 43కు తీర్మానించి అదేరోజు ఈ రహదార్ల నిర్మాణానికి అనుమతిస్తూ అటవీశాఖ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అడవిలో రహదారులు నిర్మిం చాలంటే అటవీశాఖ,గ్రామపంచాయతీల తీర్మానం, ఐటీడీఏ అనుమతి తప్ప నిసరి.వాటికి ప్రభుత్వ నిధులూ ఉండాలి. అన్నిరకాల అనుమతులు వచ్చాక రహ దారి నిర్మాణం ప్రారంభంకావడానికి కనీసం ఐదా రు నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మన్యంలో మాత్రం కేవలం 19 రోజులే పట్టింది. అంటే ఇక్కడ ప్రభుత్వ నిధులతో పని లేకుండా మైనింగ్‌ సొమ్ములతో పనిపూర్తి అయ్యింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ 32అడుగుల మేర మట్టిరోడ్డు కనిపిస్తోంది. ఇప్పుడా రోడ్డులో14 టైర్ల టిప్పర్లు దూసుకుపోతున్నాయి.
పర్యావరణానికి భారీ నష్టం
దట్టమైనఅటవీ ప్రాంతంలో వేలాది గా ఎదిగిన పచ్చని వృక్షాలు,చెట్లు విచాక్షణ రహితంగా నరికేశారు.తమస్వార్ధం కోసం రిజర్వ్‌ ఫారెస్టును నాశనం చేసేశారు. అడవిని నరికే సమయంలో అడ్డోచ్చిన అటవీ జంతువు లను యంత్రాలతో నిర్ధాక్షణ్యంగా చంపేశారు. వేలాది చెట్లు నేలమట్టంచేసి పర్యావరణానికి తీవ్ర విఘా తం కల్పించారు. ఇంటి ముందు సొంతంగా పెంచుకున్నచెట్టు నరకాలంటేనే…రూల్స్‌ ఒప్పు కోవు! రిజర్వు ఫారెస్టలో చెట్టుపై గొడ్డలి వేటు వేస్తే…అదో పెద్ద నేరం! అక్కడ…కేంద్ర అను మతి లేకుండా ప్రభుత్వాలే చిన్నపని కూడా చేయలేవు. కానీ ప్రైవేటు వ్యక్తుల సారథ్యంలో కొండకోనల్లో వందలు,వేల సంఖ్యలో చెట్లను నరికేసి,రోడ్డు వేయడాన్ని ఏమనాలి? వాటి ఆన వాళ్లు లేకుండా చేశారు. దశాబ్దాల వయసున్న టేకు,నల్లమద్ది, తెల్లమద్ది వంటి వృక్షాలను కొట్టేసు కొంటూ పోయి..నెలన్నరలోనే రోడ్డు వేసేశారు. ఈ మార్గంలోని చెల్లూరు- భమిడికలొద్ది మధ్య నున్న అయిదు కిలోమీటర్ల పరిధి రోడ్డు పూర్తిగా రిజర్వ్‌ అడవే. రిజర్వు అడవి పరిధిలో అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. రహ దారికోసం అడ్డంగా ఉన్న టేకు,దండారి,నల్ల మద్ది,తెల్లమద్ది,తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన భారీ వృక్షాలను నేలకూల్చేశారు. చిన్నా పెద్దా కలిసి ఆరేడువేల చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణాలకు ముప్పు వాటిల్లు తుందనే స్పృహ కూడా లేకుండా అడ్డగోలుగా నేలకూల్చేశారు.పైగా కేవలం 425 మీటర్ల రిజర్వు ఫారెస్టు పరిధిలో 21చెట్లు మాత్రమే తొలగించామని చెప్పడం అతిపెద్ద వింత. నిజా నికి…రిజర్వు ఫారెస్టులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరి. కానీ ఇక్కడ ఇవేం లేకుండా టిప్పర్లు తిరిగేస్థాయిలో30 అడుగులకు మించి రహదారి నిర్మించేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంతో భారీ యంత్రాలు మోహరించి ఎక్కడికక్కడ చెట్లతో పాటు కొండలను కూడా గుల్లచేసేశారు.– కొండ్రు మ‌రిడియ్య‌, అధ్య‌క్షుడు ద‌ళిత ప్ర‌గ‌తి ఐక్య‌సంఘం
జిఎన్‌వి సతీష్‌