రుణ యాప్‌ల కారకులెవరు?
పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్యాంకు ద్వారా అప్పు పొందాలంటే ఎన్నో నింబంధనలు. అనేక ఆధారాలు చూపాలి. బ్యాంకులు అడిగిన వాటిని తీసుకురాలేని వారికి అప్పు ఇచ్చే అవకాశమే లేదు. వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనం చేయాలనే సరళీకరణ విధానాల వల్ల చిన్న, చిన్న మొత్తాలు బ్యాంకుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు, కోట్లు అప్పు తీసుకునే ‘విలువైన విని యోగదారుల’ సేవలో బ్యాంకులు తరిస్తున్నాయి. ఇలాంటి అప్పులు తీసుకున్న వారు వాటిని చెల్లించ కుండా ఎలా దేశాలు దాటిపోతున్నారో, ఎలా ప్రపంచ కోటీశ్వరులు అవుతున్నారో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అత్యధికమంది వినియోగదారుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఈ రుణయాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
‘అప్పు అంటే ముప్పే’అన్న మాట రుణ యాప్‌ల దారుణాలు చూస్తుంటే అక్షర సత్యమని పిస్తుంది. పేద,మధ్యతరగతి ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని ఫోన్లద్వారా అప్పులు ఇచ్చేం దుకు నెట్లో వందలసంఖ్యలో రుణయాప్‌లు వున్నా యి.ఈయాప్‌లు అప్పుతీసుకునే వారికోసం మొదట వేట ప్రారంభిస్తాయి.ఆవేటలో చిక్కిన రుణగ్రహీత లను దారుణంగా వేధించి వసూళ్ళు చేస్తాయి. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేనివారు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. మన రాష్ట్రంలో గత రెండు నెలల్లో పది మందికిపైగా రుణయాప్ బాధితులు ఆత్మహ త్యలు చేసుకున్నారు.ఈరుణయాప్‌ల గురించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు గతనెల లోనే మూడు,నాలుగుసార్లు హెచ్చరికలు,విధాన నిర్ణయాలు చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.
నిత్యావసరాలు,అత్యవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు మానసిక, శారీరక శ్రమలు చేయడం ద్వారానైనా రావాలి. లేదా ఆ శ్రమలు చేసిన వారిని దోచుకోవడం ద్వారానైనా రావాలి.ఈ వ్యవస్థలో అత్యధికులు శ్రమ చేయడం, అతి కొద్దిమంది శ్రమను దోచుకోవడం జరుగు తుంది. అందువల్ల ఉత్పత్తి, అందుకు అవసరమైన శ్రమఈవ్యవస్థను నడపడంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. యంత్రవిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో విని యోగించడంవల్ల శ్రమతేలిక కావాలి. శ్రమ జీవికి విశ్రాంతి కలగాలి.కాని పని చేయగలిగిన వారంద రికి పనులు దొరకని పరిస్థితి ఏర్పడడమే ఈ వ్య వస్థ బలహీనతలన్నింటికీ మూలం. ఉన్న కొద్దిపాటి పనులకు పోటీ పెరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న యజమానులు వేతనాలు తగ్గిస్తారు. ఇది చివరకు నిత్యావసరమైన వాటిని కూడా కొనలేని స్థితికి ప్రజలను దిగజారుస్తుంది. కోవిడ్ సంక్షోభ సమయంలో చేసిన అప్పుల భారం, పనులు తగ్గడం శ్రమజీవుల జీవనాన్ని మరింత వేగంగా దిగజా ర్చింది.ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పేదలందరికీ నెలకు రూ.7,500ఇవ్వాలనే కనీస డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్ల గతంలో చేసే అప్పులకు తోడు కోవిడ్ తర్వాత పేద,దిగువ మధ్యతరగతి ప్రజలు రోజువారీ అవస రాలకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది.వీటికి తోడు బిజెపి పాలనా కాలంలో వేగంగా అమలవు తున్న సరళీకరణ విధానాలు ఒకవైపు ఉపాధిని తగ్గించి,మరోవైపు ధరల భారాన్ని పెంచాయి. వీటికితోడు వస్తు వ్యామోహాన్ని విపరీతంగా పెం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితితో సంబంధంలేని జీవనాన్ని ఈఆర్థిక విధానాలు అలవాటు చేస్తు న్నాయి. అత్యధిక మందిని ఆధునిక జీవన ఆశల ఊహల్లో పోటీ పడేటట్లు,భౌతికజీవనాన్ని మధ్య యుగాల నాటి మూఢనమ్మకాలు, విశ్వాసాల్లో నిలి చేటట్లు పాలకవర్గాలు ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తు న్నాయి. ఈసరళీకరణ విధానాల కత్తికి రెండు పక్కలా పదును వుంది. ఒకవైపు కార్పొరేట్ కంపె నీల సరుకులను ఎగబడి కొనేటట్లు చేయడం, మరోవైపు మతతత్వ శక్తుల భావజాలాన్ని ఆచరించే టట్లు చూడడం. అందుకే ఈ విధానాలను అన్ని వైపుల నుండి పాలక పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఎవరైతే ఉపాధి తగ్గించి, వేత నాలు తగ్గించి ప్రజల కష్టాలకు కారణమవు తున్నా రో వారే తమ సరుకులను అమ్ముకోవడానికి, కొను గోలుదార్లను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీ పడు తున్నారు. సీరియళ్లు,సినిమాలు,మీడియా ప్రకట నలు,హోర్డింగులు,అందమైన షాపింగ్ మాల్స్, ఆకర్షణీయమైన రాయితీలతో పాటు రుణ సదుపా యాలు ఇచ్చి కృత్రిమ కొనుగోలు పెంచి సరుకులు అమ్ముకోవాలని చూస్తున్నారు.-(వి.రాంభూపాల్)