భూముల చుట్టూ సమస్యల ముళ్లు

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటు న్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు…తాము సాగు చేసు కుంటున్న భూమికి ఆధీనధ్రువీకరణ పత్రంఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొం దించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెం డిరగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కా రం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధిం చింది.దీనివల్ల గందరగోళ పరిస్థి తులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.
కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తా మంటు న్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన దానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరు లో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛి కాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించక పోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్క రిస్తోంది. గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈఅంశంపై విచారించిన అనం తరమే క్రమబద్ధీ కరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈతప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య గిరిజనప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు,అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు,గిరిజనులకు మధ్య తెల్ల కాగి తాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొందరు రైతుల మధ్య విస్తీర్ణం లో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరు వురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పాసు పుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌ తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలాచోట్ల పాసు పుస్త కాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసు పుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండిరగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల విస్తీర్ణంలో కోత
కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈకార ణంతోనే మొద ట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీ ర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తి రించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర ్లకుదర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌
ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధి లో 60వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరి గాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు,సగటున 36నిమిషాల సమ యం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిపడుతోంది. ఎన్ని రిజిస్ట్రే షన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.
పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తు న్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్య లకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్‌ కుమార్‌. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చా యి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభు త్వం చెప్పింది. అయితే అధికారికంగా దర ఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమా చారం ఇవ్వడంతో పాటు అప్పీల్‌ చేసుకునే అవకా శం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏభూమో తేలితే ఆచట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిం చాలని సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటు న్నారు. 10ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలం టున్నారు. గ్రామస్థాయిలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు. అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కుకోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సం రక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌లు కీలకపాత్ర పోషి స్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయా లంటున్నారు.
ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతోనే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారు. వారిని బెదిరి స్తున్నారు. సాగు చేసుకోకుండా అడ్డుప డుతున్నారు. అమీ తుమీతేల్చుకోకుంటే బతుకులు రోడ్డున పడ తాయి.అటవీ అధికారులను నిర్బంధించండి. పోరాటాలు చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉండాలి.‘‘అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వారికీ వర్తింపజేస్తాం’ – 2018 శాసన సభ ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘‘గిరిజనులను రక్షించాలి. పోడు భూముల వ్యవహారాన్ని తేల్చేయాలి. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీశాఖ ఉన్న తాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలం దరినీ తీసుకెళ్లి… తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బా ర్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా’ అని ఇచ్చేస్తాం. దానిని ఫైనల్‌ చేసేస్తాం. ఆ తర్వాత ఒకఇంచు భూమి కూడా ఆక్రమణల పాలు కానివ్వం. పొరుగు రాష్ట్రం నుంచి గుత్తి కోయలు వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తు న్నారు. దీంతో మన గిరిజనులు నష్టపోయే పరిస్థితు లుంటున్నాయి. అందుకే ఈ పోడు భూములకు ఎక్కడో ఒక దగ్గర భరత వాక్యం పలకాలి. ఆర్‌వో ఎఫఆర్‌ చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తాం. ఆ పేద గిరిజనులకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి. వాళ్లు బతకాలి. వాళ్లూ మన బిడ్డలే ’’ -2019 జూలై నెలలో పోడుభూములపై అసెం బ్లీలో సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన భరోసా ‘‘రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్క రించాలని కేబినేట్‌ సమావేశంలో చర్చించాం. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. 2005 సంవత్స రం కటాఫతో రాష్ట్రంలో అవకాశం ఉన్న అందరికీ పోడు భముముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం’’-నల్లగొండ జిల్లా హాలియాలో (ఆగస్టు 2న) జరిగిన నాగార్జునసాగర్‌ నియోజక వర్గ ప్రగతి సమీక్షలో సీఎం.
ఇలా పోడుభూముల సమస్యపై కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే హామీలిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దశాబ్దన్నర కాలం నుంచి రావణ కాష్టంలా రగులుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం నాటి కేబినేట్‌ సమావేశంలో, సోమవారం నాటి హాలియా ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై పాలకులు ప్రతిసారీ హామీలు,భరోసాలు ఇస్తున్నారే తప్ప,అవి ఆచరణ లోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించేలా ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని తెచ్చినా…తెలంగాణలో అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క సెంటు భూమిపై కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని గుర్తుచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై పలుమార్లు భరోసా ఇస్తున్నా… ఆయన హామీలు ఆచరణలోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 13లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నాయని, ఇంత భారీ మొత్తంలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం తాజాగా ప్రకటించి నందున ఇప్పటికైనా ఈసమస్యకు పరిష్కారం లభి స్తుందని ఆదివాసీలు ఆశిస్తున్నారు.
2005లోనే..
పోడు భూములపై ఆదివాసీ బిడ్డలకు సాగు హక్కులు కల్పించాలని దశాబ్దన్నర క్రితమే కేంద్రం నిర్ణయించి..‘రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫఆర్‌) యాక్ట్‌-2006’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై సర్వే చేసి, న్యాయబద్ధంగా ఉన్న కేసులను గుర్తించి, పొసెషన్‌లో ఉన్న వారికి భూసాగు హక్కులు కల్పిం చాలని ఆదేశించింది. 2005 డిసెంబర్‌ 13 వరకు సాగులో ఉన్న పోడుభూములపై హక్కులు కల్పిం చాలంటూ ప్రకటించింది. తెలంగాణలో.. ఆదిలా బాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి మొత్తం 24 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉంది. రాష్ట్రంలో గోండు,బంజారా,కోయ,చెంచు,తోటి,కొలాం,నాయిక పోడ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు, కొంత మంది గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007లో పోడుభూములపై సర్వే చేయించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నట్లు తేలింది. ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములున్నాయని తేల్చారు.
పరిష్కారమేదీ?
వైఎస్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా.. పోడు భూములకు సాగు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా తెలంగాణలోనే 1,86,679 క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో వ్యక్తిగత ఆర్జీలు1,83,252 కాగా, సామూహిక(కమ్యూనిటీ-గూడెంలోని ఆదివాసీ లందరూ కలిసి సాగు చేసుకునే భూమి) ఆర్జీలు 3,427.2020 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన వివరాల ప్రకారం..మొత్తం క్లెయిమ్స్‌లో 94,360 క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. దాదాపు 7.54లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. కానీ..గిరిజన సంఘాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్కారు ఒక్క ఎకరంపై కూడా హక్కులు కల్పించ లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాదర్బార్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప…ఎక్కడా నిర్వ హించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో మొదటి దశ కింద 3.16లక్షల ఎక రాలకు హక్కులు కల్పించారని, ఇందులో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద 40వేల ఎక రాలను వెనక్కి తీసుకుందని ఆరోపి స్తున్నారు. ఇంకా 10లక్షలకు పైగా ఎకరా లకు హక్కులు కల్పించాల్సి ఉందని వివరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైగా… వర్ధన్నపేట వంటి ఆర్డీవో కార్యాలయాల్లో అప్పటివరకూ ముద్రించి ఉన్న ఆర్‌వోఎఫఆర్‌ బుక్స్‌ను చెత్తబుట్టలో పారేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వివ రాల ప్రకారం చూసుకున్నా..ఇంకా92,319 క్లెయిమ్స్‌ పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే,అది పాత లెక్క. ఇప్పటి లెక్క ప్రకారం క్లెయిమ్స్‌ లక్షకు పైగానే ఉంటాయని సంఘాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి 10లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, వీటిపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాం డ్‌ చేస్తున్నాయి. పోడుభూముల వ్యవ హారం బయ టకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇవ్వడంతో ఇక తమబతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిం చామని.. కానీ, ఇప్పటివరకూ ఒక్క ఇంచు భూమి సమస్యను కూడా పరిష్కరించలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమ స్య తీవ్రతను గుర్తించిన సీపీఐ బుధవారం (ఆగస్టు 4) నుంచి‘పోడుయాత్ర’ను చేపడుతోంది. ఇప్పటి కైనా కేసీఆర్‌ పోడు భూముల సమస్యను పరిష్క రించాలనిగిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అస్తిత్వంలో లేని కమిటీలు..
ఆర్‌వోఎఫఆర్‌ కింద సాగు హక్కులు కల్పించడానికి పెద్ద ప్రక్రియే ఉంది. ఇందుకోసం గ్రామ,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇవి ఉన్నాయో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. కాగా..పోడు భూములకు సంబంధించి ముందుగా గ్రామ స్థాయి కమిటీకి గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించి, ఆదరఖాస్తులు వాస్తవమో కాదో గ్రామ కమిటీలు తేలుస్తాయి. అర్హమైన ఆర్జీలను జిల్లా కమిటీలకు పంపుతారు. జిల్లా కమిటీలు వాటిని పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపు తాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆర్జీలను ఆమో దిస్తుంది. అనంతరం ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు ఆఆర్జీల్లో పేర్కొన్న భూములపై జాయింట్‌ సర్వే చేసి, నిజమో కాదో నిర్ధారిస్తాయి. సరిహద్దులు కరెక్టే అని తేలితే…భూసాగు హక్కులు కల్పిస్తారు. కానీ. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామసభలు జరిగిన సంద ర్భాలు లేవని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు వర్సెస్‌ గిరిజనులు
అధికారులు వర్సెస్‌ గరిజనులు
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు,గిరిజనులకు మధ్య తరచూ వివా దాలు నెలకొంటున్నాయి. గిరిజనులు సాగు చేసు కుంటు న్న భూమి తమదేనంటూ అటవీ అధికారులు క్లెయి మ్‌ చేస్తున్నారు.ఎక్కడ చదును భూమి కనిపిస్తే… అక్కడ అటవీ శాఖాధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిపోడు వ్యసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో కూడా కొన సాగుతోంది. దీంతో గిరిజనులు తిరగబడు తున్నా రు. తరతరాలుగా తాముసాగు చేస్తున్నా మని, ఆ భూమి తమదేనని చెబుతున్నారు.దీనిపై ఇరు వర్గాల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగు తున్నాయి.
-ఆదిలాబాద్‌ నుంచి సునీల్‌ నాయక్‌