భారతీయ అటవీ చట్టం`1927 సవరణలు ఎవరి కోసం?

అడవిలో సంస్కరణల అలజడి..చట్టంలో కీలక మార్పులు మొదలువుతున్నాయి. భారతీయ అటవీ చట్టంలోని నిబంధనలు పాతబడిపోయిన కారణంగా ఈ చట్టాన్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వశాఖ 2019 ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఏ ముసాయిదా సవరణను విడుదల చేసింది.దీనిపై గిరిజనుల హక్కుల బృందాలు,పర్యావరణ కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది.ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలతో అటవీ అధికా రులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టి నట్ల అవుతుందని,ఆయుధాల వినియో గానికి సైతం అనుమతులున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
వలస కాలంలోనే ప్రభుత్వాలు అడవిని లాభదాయక వనరుగా పరిగణించాయి. భారతీయ అటవీ చట్టం – 1927 అడవిని స్థిరీకరించి, అటవీ ఉత్పత్తుల రవాణా కలప, ఇతర ఉత్పత్తులపై పన్ను విధించేందుకు చట్టం రూపొందించింది. రక్షణా, రవాణా, రాబడి ఈ మూడు అంశాలే శాసన పీఠికలో పేర్కొన్నారు.
గత మార్చిలో అటవీ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఫారెస్టు పాలసీ డివిజన్‌ వారు ఈచట్టానికి పలు సవర ణలు ప్రతిపాదిస్తూ చర్చకు ముసాయిదా విడు దల చేశారు.రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌జీఓల తోనూ,అడవితో సంబంధ మున్న వారందరినీ పిలిచి ఈ సవరణలపై చర్చించి సూచనలు పంపాలని కేంద్రం కోరింది.
సవరించదలచిన ‘పీఠిక’ ఏం చెపుతోంది?
ఉపోద్ఘాతంలో పైమూడు లక్ష్యాలతోపాటు మరికొన్ని జోడిరచారు.అవి 1.అడవుల పరిరక్షణ, అటవీ వనరులను క్రమబద్ధంగా నిర్వహించటం వాటికి పరిపుష్టి కలిగించటం, 2.పర్యావరణ సమతుల్యం (స్థిరత్వం) కాపాడటం, వాతావరణ మార్పులకు సంబం ధించిన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టు బడివుంటూ పర్యావరణ వ్యవస్థల సేవలను నిరంతరాయంగా కొనసాగించటం,3.ప్రజలు, ప్రత్యేకంగా అడవిపై ఆధారపడిన ప్రజా సంక్షేమం,4.జాతీయ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చటం,5.అటవీ ఆధారిత సాంప్రదాయ జ్ఞానం బలపర్చటం మద్దతు తెలపటం. పర్యా వరణ సమస్యలకు విశ్వవ్యాపిత స్వభావం ఉంటుంది. అందుకే దేశంలో అడవులను వాటి తోని జీవావరణాన్ని కాపాడే చట్టాలున్నాయి. వన్యమృఘ సంరక్షణా చట్టం1972, అటవీ పర్యావరణ పరిరక్షణాచట్టం-1980,విపత్తుల నిర్వహణాచట్టం లాంటివి.ఈ చట్టాలను అమలుచేసి అడవిని రక్షించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు.అలా చేయకుండా వలసకాలం నాటి చట్టాన్ని సవరణల పేరుతో ఎందుకు ప్రభుత్వం మార్చాలంటుందో అర్థం కాదు.ఈ చట్టాలు పుట్టకముందే అడవులలో ప్రజలు నివసిం చేవారు. అడవులను వర్గీకరించే టప్పుడు వారి నివాస ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని రక్షిత (ప్రభుత్వ) అడవులుగా ప్రకటించేవారు. మన దేశానికి ఆక్రమ ణదారులుగా వచ్చిన బ్రిటిష్‌ వారు ఆదివా సుల్ని ఆక్రమణదారులన్నారు. నేటి మన పాలకులు అడవిని నమ్ముకుని బతుకు తున్నవారిని ఆక్రమణదారు లంటున్నారు. చూడండి సెక్షన్‌.2 (41) నిర్వచనాలు. అలాగే సెక్షన్‌ 2 (3), సెక్షన్‌2 (4)లలో నిర్వచించిన ‘’కమ్యూనిటీ’’ ‘’విలేజ్‌ ఫారెస్టు’’ ఆశ్చర్యకరంగా, గత చట్టాలు చెప్పిన వాటికి విరుద్ధంగా వున్నాయి. కమ్యూనిటీ అంటే జాతి, మతం కులం, భాషా సంస్కృతితో సంబంధం లేనిదట! విలేజ్‌ ఫారెస్టు ప్రభుత్వానిదట! గత చట్టాలతో లేని ఒక కొత్త వర్గీకరణ ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తోంది. అదే ‘’ఉత్పత్తి అడవులు’’ సెక్షన్‌ 2 (10),సెక్షన్‌ 34సి (1) చెప్పేదేమంటే దేశంలో అటవీ ఉత్పత్తులను పెంచాలంటే (నాణ్యత ఉత్పాదకత) ఉత్పత్తిదారులైన కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టాలి. సెక్షన్‌ 80(ఎ) ప్రయివేటు అడవు లను ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధారిత టూరిజం పేరుతో ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించటం ఎవరి అభివృద్ధికి? ఆదివాసుల హక్కులను హరించి, మరో చారిత్రక అన్యా యానికి తెరతీస్తోంది.అటవీ అభివృద్ధి పేరుతో నడుస్తున్న రకరకాల పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్ధిక విధానాలతో, విదేశీ అప్పులతో మొదలయ్యాయి. వన సంరక్షణ సమితి, జాయింట్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (జేఎఫ్‌ఆర్‌సీ) (వీఎస్‌ఎస్‌) లాభాలు పంచి ఆదాయాలు పెంచలేదు. అవినీ తికి నిలువెత్తు నిదర్శనాలు సెక్షన్‌ 28 1 (ఎ), (బి), (సి), (ఇ), (ఎఫ్‌) ప్రకారం వాటిని స్థానిక సంస్థలతో సమానగుర్తింపు ఇస్తారట. పీసా చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామ సభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణచట్టం పీసాచట్టాన్ని కాని, అటవీ హక్కుల చట్టం 2006ని గాని గుర్తించి నట్టులేదు. అటవీ హక్కుల చట్టం ఎఫ్‌ఆర్‌ఏ గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్ర అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్‌ చేసిన చట్టం ఇది. ఏమిటా చారిత్రక అన్యాయం? అది గిరిజనుల హక్కు లకు సంబంధించింది.వలస చట్టాలు, స్వాతం త్య్రం తర్వాత చట్టాలు`1967 ఏ.పీ.అటవీ చట్టం సెటిల్‌మెంట్‌ అధికారులను నియమిం చాలని, వారి హక్కులను గుర్తించాలని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు. పోడు చేసి బతకటం ఒకఅటవీ నేరంగా పరిగణించబడి జైలు శిక్షలూ జరిమానాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఏపీలో పోడు పునరావాసం పేరుతో సాగుదారుడికి రూ.25 వేలు ఇస్తామని భూమి లాక్కున్నారు. డబ్బులివ్వలేదు. ఈ స్థితిలో 2006లో యూపీఏ -1 వామపక్షాల మద్దతుతో గడిచిన ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పోడుహక్కు గుర్తించి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వడం గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించటం,ఉమ్మడి హక్కులుగా రోడ్డు, మేపుభూమి,స్మశాన భూములు కేటాయిం చాలంది. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుంచి నెట్టేయరాదని చట్టం చెప్పినా, దీన్ని అమలు చేయలేదు. ఈ సవరణ చట్టం సెక్షన్‌10 ఇప్పుడు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించమంటోంది. అంటే ఏమిటి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ధృవపడుతోంది. ఎఫ్‌ఆర్‌ఏ చట్టంలో లబ్దిదారుల గుర్తింపు, పట్టాల పంపిణీకి ఎఫ్‌ఆర్‌ఏ కమిటీ ద్వారా జరగాలి. కానీ ఈచట్టం మళ్ళీ ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లకు అప్పగించటం దేన్ని సూచిస్తోంది? డిపార్టుమెంట్‌ పెత్తనాన్ని కాదా? 2013 ఎల్‌ఏఆర్‌ఆర్‌ చట్టం అమలులో వుండగా ఈ పాత చట్టంలో (అంటే1894 చట్టం) సవరణలు అవసరమా? సెక్షన్‌ 11(1), (2), (3)Ê(4) ప్రతిపాదిత సవరణలు చాలా అసందర్భంగా వున్నాయి. అటవీ భూములను అటవీయేతర పనులకు (ప్రాజెక్టులు, మైనింగ్‌ కార్యకలాపాలు) బదిలీ చేయటానికి సంబం ధించి 1980 అటవీ పర్యావరణ చట్టం, తదనంతర గైడ్‌లైన్స్‌ చాల నిర్దిష్టంగా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా పాత చట్టాలకు సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం? కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టటానికా ఈ తాపత్రయం?
ఈ సవరణకు అర్ధం ఏమిటి?
పోడుసాగు ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన ఐదేండ్లలో అంతం కావాలట. సెక్షన్‌ 10 (3) (ఎ), సెక్షన్‌ 20(1)(సి) ప్రకారం పోడుసాగు ఐదేండ్ల తర్వాత యథావిధిగా అటవీ నేరంగా పరిగణిస్తారన్నమాట. ఉన్న చట్టాన్ని అమలు చేసి భూములు ఇవ్వనిరా కరిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మరో చారిత్రక అన్యాయానికి సిద్ధపడటం కాదా?
అటవీ నేరాలు – శిక్షలు
1927 చట్టంలో అటవీ నేరాలపై కేసులు పెట్టే అధికారం కేవలం ఫారెస్టు-పోలీసు అధికారికే వుండేది. ఇప్పుడు సవరణ చట్టంలో రెవిన్యూ అధికారికి కూడా సెక్షన్‌ 52(1) ద్వారా సంక్ర మిస్తుంది. కేవలం అనుమానం ప్రాతిపదికగా వారెంట్‌ లేదా నోటీసు లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయొచ్చు.సెక్షన్‌ 64(1)(ఎ)(బి)(సి)(2) అధికారం ఇస్తున్నాయి. ఫారెస్టు రేంజర్‌కే నేరాలు పరిశోధించే అధికారం,సెక్షన్‌ 190 సి.ఆర్‌.పి.సి ప్రొసీజర్‌ 1973 వినియోగించే అధికారం సెక్షన్‌ 64(బి),(సి) ఇస్తున్నాయి. అటవీ నేరాలను మైనర్‌-మేజర్‌ నేరాలుగా విభజించటం సెక్షన్‌64(4)ద్వారా లభిస్తుంది. అటవీభూమికి సంబంధించినవి మేజర్‌ నేరా లుగా పరిగణిస్తారు. అటవీ హక్కులచట్టం- 2006 సెక్షన్‌ 3,సబ్‌ సెక్షన్‌(1)క్లాజు (సి) ప్రకారం ఆదివాసులు, ఇతర అటవీ నివాసులు తేలికపాటి అటవీ ఉత్పత్తులు సేకరించు కోవటానికి,కలిగి ఉండటానికి,రవాణా చేసుకోవటానికి, అమ్ముకోవటానికి హక్కు కలిగివున్నారు. కాని ప్రస్తుత సవరణ చట్టం సెక్షన్‌ 2(3),(ఎ) ప్రకారం అడవీ ఉత్పత్తులు సేకరించటం, కలిగి ఉండటం, రవాణా, అమ్మ టం అటవీ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ఇప్పటి దాకా గిరిజనులు ఉచితంగా సేకరించిన పలు ఉత్పత్తులు, ఇప్పుడు అటవీ నేరాలవు తాయి. విశాఖ ఏజన్సీలో అడ్డాకుల సేకరణ, తునికాకు సేకరణ,కొండరెడ్లు సేకరించిన తేనె ఎవరైనా కలిగి వుంటే అటవీ నేరమౌతుంది. ఈ సవరణచట్టం సెక్షన్‌ 78(1) ప్రకారం 6నెలల జైలుశిక్ష, రూ.10వేల జుల్మానా విధి స్తారు. ఇది1927 చట్టంలో ఒకనెల జైలు, రూ.500 జరిమానాగా ఉంది. ఈ చట్టం సెక్షన్‌ 78(1)(ఎ) ప్రకారం,సెక్షన్‌ 26లో పేర్కొన్న నేరాలు అంటే తాజాగా పోడుకోసం చెట్లు నరకడం,అడవిలో అగ్ని రాజేయటం, పశువులు మేపటం, చేపలు పట్టటం లాంటి నిషేధిత పనులు చేస్తే మొదటి దఫా శిక్షగా మూడేండ్లు జైలు శిక్ష లేదా రూ.5-50 వేలు జరిమానా లేదా రెండు కలిపి కూడా విధించ వచ్చు. ఇదే నేరాలు రెండోసారి చేస్తే ఒక ఏడాది కఠిన జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించవచ్చు.
ప్రయివేటు అడవులకు అనుమతి
ఈ సవరణ చట్టం సెక్షన్‌ 80, 80(ఎ) ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు, కంపెనీలకు పనికిరాని అటవీ భూములనిచ్చి మేలైన అటవీ ముడిసరుకులు తయారు చేసుకునే అవకాశం ఇస్తారట. ఇవి సంయుక్తంగా కూడా నిర్వహించ వచ్చునట. ఇందుకు జాతీయ ఫారెస్టు రీబోర్డు (సెక్షన్‌ (1), (2), (3), (4)) ఏర్పాటు చేస్తారట. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతీయ అడవుల చట్టం- 2019కి ప్రతిపాదించిన సవరణలు అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయి. చట్టం పీఠికలో వారి సంక్షేమం కోసం సవరణ చేస్తున్నట్టు చెప్పి, వారి ఉనికినే ప్రశ్నార్ధకంచేసే సవరణలు ప్రతిపాదించారు. వీటిని పూర్తిగా పునఃపరిశీలన చేయాలని, ఉపసంహరించాలని కోరుతూ ఉద్యమించాల్సిన తక్షణ కర్తవ్యం మనమందు ఉన్నది.
అటవీ చట్టం నిర్వీర్యం
దేశీయ పాలకులు వలస పాలకుల అటవీ విధానాన్నే అమలుచేస్తున్నారు.1952లో ప్రకటించిన అటవీ విధానమే అందుకు నిదర్శనం. ఈ విధానం ద్వారా రిజర్వ్‌, రక్షిత, గ్రామ అడవులుగా అటవీ ప్రాంతాన్ని విభజించారు. దాని ఫలితంగా అడవిపై గిరిజనుల హక్కు పరిమితమైంది.1973లో ‘టైగర్‌ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పూనుకున్నది. 1980లో కేంద్రం తెచ్చిన మరో గిరిజన వ్యతిరేక చట్టం ద్వారా గిరిజనులను అడవి నుంచి ఖాళీ చేయించే చర్యలు చేపట్టింది.1996లో సుప్రీం కోర్టు తీర్పు లో యాజమాన్యం,గుర్తింపు, వర్గీక రణతో సం బంధం లేకుండా ప్రభుత్వ రికార్డు ల్లో నమోదైన అన్ని ప్రాంతాలకు చట్టాన్ని వర్తింపజేయడం వల్ల గిరిజనుల హక్కు లకు తీవ్ర అన్యాయం జరిగింది. అడవిపై గిరిజనుల హక్కులను హరించే చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి.1830లో బీహార్‌, బెంగాల్‌లలో కోల్‌ తిరుగుబాటు, 1855-56 లో సంతాల్‌ తిరుగుబాటు,1802-03లో రంప తిరుగుబాటు, 1922-24లో అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరు గుబాటు, కుమ్రం భీం నాయకత్వంలో 1940 లో గోండుల తిరుగుబాటు, 1967 నక్సల్బరీ గిరిజన రైతాంగ పోరాటం, 1968-70లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ముఖ్యమైన గిరిజన పోరాటాలు. గిరిజన పోరాట ఫలి తంగా కొన్ని చట్టాలు తప్పలేదు. 1917లో చేసిన భూ బదలాయింపు క్రమ బద్ధీకరణ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు భూములు కలిగి ఉండవచ్చు. ఏజెన్సీ ప్రాంతం లో చాలాకాలంగా నివసిస్తున్నవారిని గిరిజను లుగా గుర్తించడం ద్వారా గిరిజనేతరుల భూములకు రక్షణ ఏర్పడిరది. అలాగే గిరిజ నుల భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టం అవకాశం కల్పించినట్లయింది. గిరిజన ప్రాంతాల్లో భూములు ఉం డటాన్ని నిషేధించింది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా 1970 లో 1/70 చట్టం వచ్చింది.ఈచట్టం ప్రకారం గిరిజన ప్రాంతా లలో భూములు అమ్మకూడదు, కొనకూడదు. కానీ ఈ చట్టంలో అనేక మార్పులు జరుగడం వల్ల గిరిజన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగు తున్నది. అటవీ చట్టాలను పాలకులు నీరుగా ర్చారు. కోర్టులు సైతం గిరిజన హక్కులపై పరస్పర విరుద్ధ తీర్పులిచ్చాయి. ఒకే న్యాయ మూర్తి గిరిజనులకు అనుకూలంగా,వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు న్నాయి. ఇలా చట్టంలోని లొసుగుల వల్ల గిరిజనులకు చెందాల్సిన వేల ఎకరాల భూములు గిరిజనేతరుల పాలయ్యాయి. అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించినా వారు పోరాటం ఆపలేదు. దీంతో తామే భూములు పంచు తా మని యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల బిల్లును విడుదల చేసి 2006 పార్ల మెంట్‌ ఆమోదంతో చట్టంగా మార్చింది. ఈ బిల్లులో 1980కి పూర్వం గిరిజనుల ఆక్రమ ణలో ఉన్న భూములనే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పటంతో గిరిజ నులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి బిల్లులో మార్పులు చేసి 2005కు పూర్వం వారి అధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పి 2006 డిసెంబర్‌లో బిల్లును చట్టసభల్లో ఆమోదిం పజేసి చట్టంగా ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చట్టంలో అనేక సవరణలు ప్రతిపా దించింది. వివిధ రకాల రక్షిత భూము లను చట్ట పరిధి నుంచి తప్పించింది. అటవీ ప్రైవేట్‌ భూములను చట్టపరిధి నుంచి తొలగిం చింది. 1980కి పూర్వం ఇతర సంస్థలు పొందిన భూ ముల ను మినహాయించాయి. ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాలను చట్ట పరిధి నుంచి తప్పించాలి. నివాస, ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం ప్రయత్నించి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గడం కొసమెరుపు.- (డా.మిడియం బాబురావు),వ్యాసకర్త : మాజీ పార్లమెంటు సభ్యులు