ప్లాస్టిక్ ముప్పు..ఎప్పుడో కనువిప్పు..!
రోజూ అన్ని అవసరాల కోసం ఓచిన్న గిరిజన గ్రామం నుంచి నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు.జీవితంలో ప్లాస్టిక్ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉదయం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవసరాలకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం.ఆశ్చర్యమేమంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్ బాటిల్స్,రక్తంభద్రపరచే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్లాస్టిక్ వినియోగంపై అవగాహనఉన్నాకూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూ అదుపు లేకుండా ప్లాస్టిక్ వాడుతున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని కుగ్రామాలే కాకుండా టూరిజం,సందర్శన, కాఫీతోటలు,విహారయాత్రి స్థలాలు ప్లాస్టిక్‌మయంగా మారుతున్నాయి. ఇలా నింగి,నేల,నీరులోరేణువులుగా మారుతూ ఆరోగ్యానికి పెనుసవాల్ విసురుతున్నాయి.
నేను ఏజెన్సీప్రాంతానికి వచ్చినప్పుడు ప్లాస్టిక్‌గ్రామాల్లో గిరిజనులు తమ అవసరాల కోసం దాచుకొనే నగదును పూర్వం వెదురు బొంగుల్లో దాచుకునేవారు.నేడు ఆపరిస్థితి భిన్నంగా మారింది. ప్లాస్టిక్ సంచుల్లో చుట్టుకొని నగదును దాచుకుంటున్నారు.ఆనాడు ప్లాస్టిక్ అంటే సారా ప్యాకెట్లులే కన్పించేవి.ఇప్పుడు విచ్చలవిడిగా అన్నీరకాల నిత్యావసర సరకులు,ఆఖరికి టీ,ఆహారపదార్ధాలు ప్లాస్టిక్ సంచులనే దర్శనమిస్తున్నాయి.ప్లాస్టిక్‌లేనిదే జీవితం నడవడం లేదనే స్థాయికి పేరుకు పోయింది. పాస్టిక్తో పాటు చెత్త పేరుకుపోతోంది. నేను1997వరకు పాడేరులో నివాసము ఉన్నప్పుడు చెత్త,ప్లాస్టిక్ ఎక్కడబడితే అక్కడ డంప్ చేసేవారు. అయితే డపింగ్ చేసే చెత్త,ప్లాస్టిక్ విషయంలో శాస్త్రీయపద్దతిని పాటించడం లేదు.శాస్త్రీయపద్దతిలో చెత్తను వినియోగించడమనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవశ్యకత ఉంది.ఇది పర్యావరణానికి,మానజీవితానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.లేకపోతే చెత్త విస్తరించి వర్షకాలంలో వాగులు,గెడ్డలు,డ్రైయినేజీల్లో పొంగి ప్రవహించినప్పుడు ఆ చెత్త జలాశాయాల్లోకి చేరి త్రాగు,సాగునీటిని కలుషితం చేస్తుంటాయి.దీనిద్వారా కేవలం గిరిజనప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాల్లో తాగునీటి వనరులు కలుషితంగా మారే ప్రమాదం పొంచిఉంది.ఇప్పటికే తాటిపూడి, మేగాద్రిగెడ్డ,రైవాడ,ఏలేరు కాలువ,వంటి జలాశాయల నుంచి నగరానికి,మైదాన ప్రాంతానికి తరలిస్తున్న త్రాగు,సాగునీటివనరుల్లో చెత్త,ప్లాస్టిక్ చేరి కలుషితమవుతున్నాయి.ఈ నీటినే నగర/పట్టణ ప్రాంతాల ప్రజలు మంచినీళ్లుగా తాగుతున్నారు.
మైదాన ప్రాంతాల నుంచి ఈ మిగుల జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. ఆ జలాలతో ప్లాస్టిక్,చెత్తచెదారాలు సముద్రంలోకి చేరి జీవరాశులు కాలుష్యానికి గురవుతున్నాయి.ఇటీవల ఓ పరిశోధనలో తిమింగలం కడుపులో ప్లాస్టిక్ సంచులు కన్పించినట్లు తెలిపింది.కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాదు..చెత్త కూడా ప్రజల జీవిన విధానానికి హానికలిగిస్తోంది.వీటి నియంత్రణకు ప్రభుత్వం సరిjైున శాస్త్రీయ పద్దతులు అవలంబించాలి.మన అవసరాలను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన లేదు. పర్యావరణానికి భంగం కలుగకుండా ఈభూగోళాన్ని తర్వాత తరాలకు అందించే దృష్టితో,సమకాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలనే ఆలోచనాలేదు.
ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది.వీటిలో ఏప్రిల్ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్ పన్ను ప్రతిపాదన కూడా ఉంది. ఈపన్ను కింద ప్లాస్టిక్‌లో వస్తువులను ప్యాకింగ్ చేస్తే దానికి పన్ను విధించబడుతుంది. దీంతోపాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. రీసైక్లింగ్ ఆధారిత పరిష్కారాలు ఈ కార్పొరేట్,శాసనవిధానాలపై విశ్లేషణ ఈకంపెనీలు రీసైక్లింగ్ ఆధారిత పరిష్కారాలను ఇష్టపడ తాయని నిర్ధారించింది. అయినప్పటికీ పరిస్థితులు షరామామూలే.చెత్తలో పలురకాలు ఉన్నాయి. వాటిని విభజించి రీసైక్లింగ్ చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్