ప్రకృతి సహజీవనమే పర్యావరణ పరిరక్షణ
పంచభూతాత్మకమైన అనంత సృష్టిలో మానవుడు ఒకభాగం, అంతే కానీ తానే సర్వస్వం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయా లనే ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు. పంచభూ తాత్మకమైన ప్రకృతిలో విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది. ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే సమతలం చేస్తూ అడవుల అన్నిం టిని సమూలంగా నరికివేస్తూ భూమాతను సంపదవిహీనంగా చేస్తున్నాడు, భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగా మళ్ళించి వేస్తున్నాడు. భూగర్భ జలాలను అడు గంటించేస్తున్నారు దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది. అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తు న్నాడు. తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు. ఇది ప్రకృతి ప్రకోపించనంత కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని ఎవరు రక్షించగలరు? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడిరది. ప్రకృతి అనుకూల జీవన విధానంతో ప్రకృతిని కాపాడు కుంటూ వస్తోంది. దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈరోజు కాలుష్యం కానీ పంచ భూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు. కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే మాట చెప్పడం లేదు. ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే మారడో అప్పటి వరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటా యి. ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా కనబడటం లేదు. ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబ డుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నా యి కాబట్టి నదులను,వాగులు,వంకలను కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి. అందుకే మనం ప్రతి రోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచి స్తుంటాం. అది మన జీవితంలో ఒక భాగము. అదే పాశ్చాత్య దేశాలలో సంవ త్సరంలో ఒకరోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు. పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరం ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవ త్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతి తో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించు కోవటంపై దృష్టి కేంద్రీ కరించబడిరది. 2021-2030 దశాబ్దం యుఎన్ లాంఛనం గా వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్ జాతుల నష్టాన్ని నివారించు కోవటానికి, మరియు ఆహారభద్రత, నీటి భద్రతా,జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు దశాబ్దాల నుండి ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆచరణ లోకి తీసుకోని వస్తున్నది.కొద్దీ సంవత్సరాల పూర్వం దేశ వ్యాప్తంగా విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవ సాయం ఊపు అందుకొంది,దాని కొనసాగింపు గానే, ఈ మధ్యనే భూమిసంరక్షణ, భూమిసు పోషణ,దిశలో పెద్దఎత్తున దేశమంతా ఒక ఉద్యమం ప్రారంభమైనది. ఇట్లా మన దేశంలో అనేక ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మొదలైయి నాయి. నీటి సంరక్షణపై అవగాహన పెంచటా నికి ఆ నీటి వనరులను కాపాడు కోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ ‘రివర్స్ ఆఫ్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియో ను విడుదల చేసింది. భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా ఆ వీడియో తయారు చేయబడిరది. ఆ వీడియోలో పెరుగుతున్న జనాభాపై,నదులను కాపాడుకోవటంపై, నీటి వనరుల దోపిడీ దాని పర్యవసానాలపై, కథనం సాగుతుంది. పర్యా వరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది. ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలను చేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది.
పర్యావరణానికి తగిన గౌరవం, విలువ ఇస్తున్నామా?
ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ఈ సంవత్సరం దీనిని ‘‘పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ ‘‘(జుషశీంవర్‌వఎ Rవర్‌శీతీa్‌ఱశీఅ) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్ వార్మింగ్ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.అభివృద్ది చెందాము అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగు తున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే,దేశాల అనాలో చిత నిర్ణయాల వల్ల కూడా ఈ సమస్య ఉత్పాతంగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. నిజమే ప్రపంచం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే తరువాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరనంత చిక్కుల్లోకి పోయే పరిస్థితి ఏర్పడిరది . ఇటు వంటి విషమ పరిస్థితుల్లో ‘‘విశ్వగురువు‘‘ భారత దేశమే ప్రపంచానికి దారి చూపగలదు. పర్యావరణ పరిరక్షణలో రెండు ప్రధాన సమస్యలు మనకు కనపడతాయి. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి నిర్వహణ. రెండోది ప్రజల భాగస్వామ్యం. జపాన్,సింగాపుర్ వంటి దేశా లలో పరిశుభ్రత చాలా కచ్చితంగా పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన దేశం గురించి వేరే దేశస్థులు ఏమి ఆలోచిస్తారో మనం కూడా చూసుకోవాలి కదా. మొదట మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చెపుతోందో తెలుసుకుని, మన వంతుగా ఏమి చేయాలో ఆలోచించాలి . ప్రభుత్వం ఏమి చేస్తోంది 2014 లో ప్రధాని మోదీ శౌచాలయపు ప్రాధా న్యతను ఏకంగా ఎర్రకోట పై నుంచే చెప్పారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో శౌచలయాల నిర్మాణం జరిగింది. 2019లో తిరిగి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత మొదలు పెట్టిన కార్యక్రమాలలో ‘స్వచ్చ భారత్ అభియాన్ ‘మొదటిది. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ పర్యావరణ పరిరక్షణలో మొదటి మెట్టు స్వచ్చమైన పరిసరాలు అంటూతానే స్వయంగా చీపురు అందుకొని మొదలు పెట్టారు. ఈ స్వచ్చ భారత్ అభియాన్ ఒక ఉద్యమంగా మొదలై 2019 నాటికి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో పని చేసి దాదాపు 94%లక్ష్యం 2019లో మిగిలిన 6%తరువాతి కాలంలో సాధించ కలిగారు (ఈవెబ్ సైటు చూడవచ్చు ష్ట్ర్‌్‌జూం://ంషaషష్ట్రష్ట్రపష్ట్రaతీa్.ఎవస్త్రశీఙ.ఱఅ). అదే విధంగా ‘నమామి గాంగే‘ అన్న నినాదంతో గంగానది పరీవాహక ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణ,కాలుష్య నివారణ,శుద్దీకరం వంటి అనేక కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే షaఎజూa aష్ ద్వారా అటవీ భూమిని ఎంత వాడుతాము అంత తిరిగి మళ్ళా అడవిని తయారు చేయటానికి అవసరమైన నిధులను తప్పని సరిగా సిద్దం చేసే చట్టాన్ని రూపొందిం చారు. దాదాపు రూ.95వేలకోట్ల నిధి సిద్దం చేశారు. పర్యావరణ రక్షణ ఒక నినాదంగా మిగిలి పోకుండా అది ఒకవిధానంగా మారేం దుకు అవసరమైన నిపుణతలను పెంచేందుకు Gతీవవఅ ూసఱశ్రీశ్రీ ణవఙవశ్రీశీజూఎవఅ్ ూతీశీస్త్రతీaఎ ను ంసఱశ్రీశ్రీ ఇండియాలో ఒకభాగంగా చేశారు. ఇది ఒకమంచి కార్యక్రమం ఈ వెబ్ సైటు ను చూడండి ష్ట్ర్‌్‌జూ://షషష.స్త్రంసజూ-వఅఙఱం. స్త్రశీఙ.ఱఅ).ప్రభుత్వం ఈపర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే కర్బన ఉద్గారాలను (షaతీపశీఅ వఎఱంంఱశీఅం) తగ్గించే ఉద్దేశ్యం తోనే దాదాపు పునరుత్పాదక వనరులు (తీవఅవషaపశ్రీవ వఅవతీస్త్రవ ంశీబతీషవం) అయిన సౌర శక్తి, వాయు శక్తి వాడకాన్ని ప్రోత్సహి స్తోంది. ఎలెక్ట్రిక్ వాహనాలు,భారత్ 6’ నిబం ధనలకు అనుగుణమైన వాహనాల తయారీ వంటి చర్యలు చెప్పట్టింది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించేవిధంగా గట్టి అడుగులే పడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే మరి ప్రజల భాగ స్వామ్యం ఏమిటీ??
ప్రజల భాగస్వామ్యం
పర్యావరణ స్పృహ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగలో ఏదో ఒక ప్రకృతి సంబందంమైన అంశాలు ఉండటం మనం గమనించవచ్చును. అసలు మన మొదటి పండుగ యుగాది అంటేనే ప్రకృతి క్రొత్తచివురులుతొడగటం. ఆయా ఋతువులో ఏర్పడే ఆయా మార్పులను అర్ధంచేసుకొని పండుగలు జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది? తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి ఇవ్వమని ఉచితంగా పచ్చనిరంగు, నీలి రంగు డబ్బాలులు ఇస్తే,నగరంలో కేవలం 25% మాత్రమే వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. 5000 టన్నుల చెత్తనుతడి,పొడి విభజన చేయడం అసాధ్యమని, దానివల్ల ఎంతో కాలు ష్యం కలుగుతోందని ఒక మునిసిపల్ అధికారి వెల్లడిరచారు. నిజానికి అది ఇళ్ళలో వారికి చాలా చిన్న పని. ఇంటిలో చెత్తని తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య విభాగానికి ఇస్తే చాలు. ఇంత సులభమైన పని కూడా మనం చేయలేమా? భారతీయులు తమ మూల విధా నాలకు విలువ ఇస్తూ, ప్రకృతి తో మమేకమయ్యే అవసరం ఇప్పుడు చాలా కనిపిస్తోంది. మనం వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలుపెట్టి, ఇల్లు, వీధి,గ్రామం,జిల్లా,రాష్ట్రం, దేశం ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితే మన జీవిత కాలం లో ఏదో ఒకచిన్న సకారాత్మక మార్పునైనా చూడగలుగుతాము. పారిశ్రామిక కాలుష్య నివారణ,షaర్వ ఎaఅaస్త్రవఎవఅ్ మొదలై నవి ప్రభుత్వపు పనులేనని భావించకుండా మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మన దైనందిన అంశాలలో మొట్ట మొదటగా ప్రారంభించాల్సిన విషయం, పర్యావరణ కాలు ష్యాన్ని తగ్గించడం కోసం మీ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లోని చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా తప్పనిసరిగా విభజించడం. ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించడం. ప్రకృతి అందించే సౌరశక్తి, వాయు శక్తిని ఎక్కువ వినియోగంలోనికి తెచ్చుకోవడం. వీలైనంత వరకు సేంద్రీయ విధానం వైపుకు మారటం. జ్యూట్,కొబ్బరి,గుడ్డలతో తయారు కాబడ్డ సంచీలు,తాళ్ళు, ప్రకటన వస్తువుల ఉపయోగాన్ని పెంచటం. తమ తమ పరిధి మేర ఎంతో కొంత స్వచ్చ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం. ఇలా అనేక చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టి దేశం కోసం స్వంత లాభం కొంత మానుకుని, మన భావితరాలకి మంచి పర్యా వరణాని అందించడం కోసం మనవంతు ప్రయ త్నం చేయకపోతే ముందు ముందు ఎన్ని ఉత్పా తాలను చూడాలో ఈ రెండు సంవత్సరాలలో బాగా అర్ధమయింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయ త్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజం గా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతా వరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారు కాగలవు. మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది. వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగి నంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవుల పైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం పర్యావరణానికి చేటు
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో` వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమి లో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగు తుంది.పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచు కుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉండాల్సిన అవశ్యకత ఉంది.