పిల్లలు ఇక్కడ.. బడి ఎక్కడో..!
ఇంతకు మునుపు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో, పిల్లలు దాని బారిన పడ్డారా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ,భౌతిక విద్యా బోధన విధానానికి మాత్రం ఆన్లైన్ విద్య ప్రత్యామ్నాయం కాదనే విషయం మనకు తెలుసు. పిల్లలు ముఖ్యంగా ప్రైమరీ,ప్రీప్రైమరీ చదివే చిన్నారులు…తోటి పిల్లలు,ఉపాధ్యాయులు, ఇతరుల నుంచి (హ్యూమన్ ఇంటరాక్షన్) నేర్చుకోగలగడంతో పాటు సామాజికంగా,మానసికంగా అభివృద్ధి చెంద గలరు.అయినా,పాఠశాలలు మూసివేయడం ద్వారా మనం వారి జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నాం. వీటి ఫలితాలు చాలా వినాశకరంగా ఉంటున్నాయి. సెప్టెంబర్, 2021 సర్వే నివేదిక ప్రకారం… పిల్లల్లోచదివే,రాసేసామర్థ్యంస్థాయి బాగా తగ్గిపో యింది. సగం మంది పిల్లలు కొన్ని పదాల కంటే ఎక్కువ చదవలేక పోతున్నారు. మూడో వంతు పిల్లలు చదువుకునే క్రమంలోనే లేరు.
కోవిడ్-19 మన జీవితాలు తలకిందు లు కాకూ డదనే విశ్వాసం అలాగే మిగిలి పోయిం ది. డెల్టా కన్నా ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెంది… తక్కువ ప్రభావం చూపుతున్నప్పటికీ…మనపై విధించిన ఆంక్షలు రోజువారీ జీవితాలపై మరొక సారి ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ రాత్రి కర్ఫ్యూలు, సరిహద్దుల్లో సోదాల లాంటి నిబంధ నలు ఇంతకు ముందున్న వేరియంట్‌ను కట్టడి చేయనట్లయితే…వేగంగా వ్యాప్తి చెందే వేరి యంట్‌ను కూడా ఆ నిబంధనలు కట్టడి చేయవనే విషయం వివేకవంతులకు స్పష్టమవ్వాలి.
లోపించిన హేతుబద్ధత
కానీ,ఇరవై నెలల పాటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించినప్పుడే మన హేతు బద్ధతను వదిలేశాం. రాజకీయ నాయకులకు పాఠ శాలలు ఒకతేలికైన లక్ష్యాలుగా మారాయి. పాఠ శాలల మూసివేత,కోవిడ్‌ను కట్టడి చేసే ఒక సున్ని తమైన చర్య అనీ, దాని కోసం వారేదో చేస్తున్నారనే భావనను ప్రజల్లో కలిగిస్తుంది. కానీ ఇది, హేతు బద్ధతలో, వాస్తవంలో పాదుకొనని ఒక భావోద్వేగ ప్రతిచర్య. కోవిడ్-19 రెండవ వేవ్ ముందు కూడా, చిట్ట చివరికి మూసివేసేది, మొట్ట మొదట ప్రారం భించాల్సింది పాఠశాలలేనని అనేకమంది నిపుణు లు సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ఇదీలాగుంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యావిధానం గోరుచెట్టుపై రోకలపోటు చందంగా మారింది. ప్రక్షాళన కారణంగా ఎంతో మంది పేద పిల్లలకు విద్య దూరం కావడంతో దాని ప్రభావంతో తల్లిదం డ్రులకు భారంగా పరిణ మించింది. ప్రాథమిక పాఠశాలలు మూసివేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తర గతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్ 172 విడుదల చేసింది. వచ్చేవిద్యా సంవత్సరంనాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యా ర్థులను ఉన్నత పాఠశాలలకు తరలించనుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2తరగతుల పిల్లలను అంగన్వాడీలకు అప్ప గించనుంది. అందుబాటు లోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠ శాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చిన మేరంగి హైస్కూల్లో2.25కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ, దాసరిపేట, తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠశా లలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి. ప్రతిపేటలో పిల్ల లు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడు లు పెట్టారు. వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగుదల,పరివర్తనలో తేడా వుంటుంది. అందు వల్ల చిన్న పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరిలో ప్రైమరీ,హైస్కూల్ ఏర్పాటు చేశారు. ఆడుతూ,పాడుతూ,ఏడుస్తూ బడికివెళ్లే ఆరేళ్ల పిల్లడు,13ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి…అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠ శాల నెలకొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏకపక్షంగా మూసేస్తోంది.
వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి. ‘అమ్మఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుంబంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి.లేదంటే పిల్లలను బడికి పంప డం ఆపేస్తారు.‘అమ్మ ఒడి’ శాశ్వత పథకం కాదు. ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’ వుండదు. ‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదండ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు. అందుకని సర్కారు బడులను సంరక్షించుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగ తుల పిల్లలకు తరగతి గదులున్నాయా? బెంచీలు, కుర్చీలున్నాయా? ఇతర మౌలిక సదుపాయాలు న్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట? గంట గంటకు ప్రైమరీ స్కూల్ నుండి హైస్కూలుకు, హైస్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యాశాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
యువతకు తీరని అన్యాయం
ప్రపంచబ్యాంకు సలహాతో చంద్రబాబు ప్రారంభిం చిన విద్య ప్రైవేటీకరణను రాజశేఖ రరెడ్డి విస్తృత పరిచారు. ప్రైవేటు బిఇడి కాలేజీలకు విస్తారంగా అనుమతులు ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేస్తే టీచర్లు అవుతారనే భ్రమ యువతలో కల్పించారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి ట్రైనింగులు, ఆపైన కోచింగులు పూర్తిచేసి టీచర్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఆశాభంగమే మిగిలింది. ప్రాథమిక పాఠశాలల మూసివేత మూలంగా ఖాళీగాఉన్న 25వేలు టీచర్ పోస్టులు భర్తీ చేయక పోగా మరో 75వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు తేలు స్తున్నారు. ఇపుడున్న 1:0విద్యార్థి,టీచర్ నిష్ప త్తిని1 :35 గా మార్చేశారు. గత రెండేళ్లు డీఎస్సీ లేదు.
ఎస్.సి,ఎస్.టి,బి.సిలుప్రభుత్వవిద్యను కాపాడుకోవాలి
వేల సంవత్సరాలపాటు భూమిపై హక్కు లేక ఆర్థిక అణచివేతకు, చదివే హక్కు లేక కుల పీడనకు గురైన ఎస్.సి,ఎస్.టి బి.సి సామా జిక తరగతుల ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అందు బాటులో ఉండడంతో కొంతమేరకైనా చదువు కోగలుగుతున్నారు. అత్యంత వెనకబడిన తరగతుల (ఎం.బి.సి) పిల్లలు నేటికీ ప్రభుత్వ బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈ తరగతుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వనిర్ణయంతో తీవ్రంగ నష్టపోతారు. ఉన్నత సామాజిక తరగతుల్లోని పేదలుకూడా నష్టపో తారు. నూతన విద్యావిధానం అమలు చేయడం అంటే ఇదే! విద్యారంగంలో తిరోగమనాన్ని నిల వరించి అందరికీ ప్రభుత్వ విద్య అందే విధంగా, విద్యా హక్కు అమలు సంపూర్ణంగా జరిగేలా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మన ముందుంది.పేద పిల్లలకు విద్య దూరం..తల్లిదం డ్రులకు భారంగా పరిణమించకూడదు.
విద్యకు సంబంధించిన సమస్యలు ఏదో ఒక రోజు పరిష్కారం చేస్తారనే ఒక నిరాధారమైన, అస్పష్టమైన హామీలను అంగీకరించినప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉం టున్నాయి. పాఠశాలలు మూసివేసినప్పటికీ, పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా పెరిగినట్లు బ్రిటన్ దేశపు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా,‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్’’ పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ‘’జాతీ య ఎమర్జెన్సీ’’గాపేర్కొంది.భారతదేశంలో, మాన సిక ఆరోగ్య సమస్యల్ని పక్కకు పెడితే, పాఠశాలల మూసివేత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాలసమస్య మరింత అధ్వా న్నంగా తయారైంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరే కంగా కొన్ని దశాబ్దాలుగా సాధించిన ప్రగతి, పాఠ శాలల మూసివేత కారణంగా వెనుకపట్టు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం,10.1మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారని ఒక అంచనా. పౌష్టికాహార లోపాలు, బాల కార్మికులకు సంబం ధించిన రోజువారీసమాచారం మన దగ్గర ఉండి ఉంటే, బహుశా మనం భారతదేశం లోని పిల్లల బాధల పైన దృష్టి పెట్టేవారం.అంతే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు మూసివేసి ఉండేవాళ్ళం కాదు. ‘పిల్లలు పాఠశాలల నుండి ఇంటి దగ్గర ఉండే పెద్దలకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంద’’ని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సిన్లు అంటువ్యాధిని అడ్డుకోలేవనే విషయం తెలుసు కాబట్టి, పెద్దవారి ప్రయోజనాల కోసం, పిల్లల పాఠశాలలను మూసివేయడం అసం బద్ధమైన విషయం. పిల్లలకు శాస్త్రీయమైన పరీక్షల తర్వాత ఉపయుక్తమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు. ఇప్పటికీ పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్‌కు…విద్యను, పాఠశా లలను ముడిపెట్టడంలో అర్థం లేదు. పిల్లలకు కోవిడ్-19 ఎమర్జెన్సీ లేదు కాబట్టి వారికి వ్యాక్సిన్ అత్యవసరం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. వాస్తవానికి, రోగి నిరోధకశక్తికి సంబంధించి ‘’నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్’’ (ఎన్.టి.ఎ.జి) అభిప్రాయమిది. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ ఆమోదం, ఎన్.టి. ఎ.జి అభిప్రాయాన్ని సవాల్ చేస్తున్నది. విద్య అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. పాఠశా లలను సుదీర్ఘకాలంపాటు మూస ివేయడం ద్వారా, ఒక బలహీనమైన ప్రత్యామ్నా యానికి అవకాశం ఇవ్వడంద్వారా,మనంపిల్లల హక్కులను ఉల్లం ఘనకు గురిచేస్తున్నాం. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పిల్లల కోసం నోళ్ళు విప్పాలి. అంటు వ్యాధుల వ్యాప్తి, నియంత్రణ శాస్త్రవేత్తలు,డాక్టర్లు, విద్యావేత్తలు ధృ వీకరించినట్లు‘పిల్లలకు 2022 సంవత్సరం సంతో షంగా ఉండాలని’ కోరుతూ మనలో ఒకగ్రూప్ ఓప్రయత్నాన్ని ప్రారంభించింది.2022 ఆ తరు వాత కాలం కూడా పిల్లలు అన్ని విధాలా సంతోష కరమైన పాఠశాల జీవితం,సంతోషకరమైన బాల్యా న్ని పొందాలని ఆశిద్దాం. (వ్యాసకర్త ఐ.ఐ.టి ముంబైలో (‘ద హిందూ’సౌజన్యంతో )(ప్రొఫెసర్.భాస్కరన్ రామన్/ఎం.కృష్ణమూర్తి)