పసి దివ్వెలు వసివాడనొద్దు
బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి.పేదరికంతో చదువులు చతికిల పడుతున్నాయి. కుటుంబ పోషణలో సమిధులవు తున్నారు. చదువులు, ఆటలతో గడపాల్సిన బాల్యం బజారున పడుతోంది. పేపర్బాయ్స్గా, హోటళ్లలో సర్వర్లుగా,సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా పసి హృదయాలు హృద్యమైపోతున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో బాలకార్మిక చట్టం అలంకారప్రాయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు,యువత, రాజకీయ నాయకులు అంతా సహకరిస్తే ఎంతో మంది బాలకార్మికులకు ఉజ్వల భవిష్యత్తు అందించవచ్చనడంలో సందే హంలేదు. జూన్ 12న ప్రంపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పేదరికమే ప్రధాన కారణం
బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ,అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే.. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు. వ్యవసాయంలోనూ,ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రు లకు సాయంగా వెళ్ళేవారు కొందరయితే, కర్మాగా రాల్లో, దుకాణాల్లో, ఇతరత్రా పనుల్లోకి వెళ్ళి తల్లి దండ్రులకుఆర్థికసాయాన్ని అందించేవారు మరికొందరు. తల్లిదండ్రుల అవగాహనా రాహి త్యంతో చట్టాలు అమలు కావడం లేదనే వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది.ముఖ్యంగా విజయ నగరం,విశాఖపట్నం,శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు,మంగళగిరి తదితర పట్టణాల్లో మురికి వాడల్లోని తల్లిదండ్రులు పిల్లల తాత్కాలిక సంపా దన ఆశిస్తున్నారు. అలాంటి వారు తాత్కాలిక ప్రయోజనం ఆశించకూడదు. చదువు కోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహిం చిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుంది.
తూతూ మంత్రం చర్యలు..
ఏటా ఏదో సందర్భోచితంగా బాలకా ర్మికులను పట్టుకొని బడిలో పడేసి చేతులు దులి పేసుకుంటున్న చర్యలు పెద్దగా ప్రయోజనం ఇవ్వ డం లేదు. ఏటా పాఠశాలలు తెరచే సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.కొన్నేళ్లుగా ఈతంతు నడుస్తున్నా ఫలితం పెద్దగా కానరా వడంలేదు. లెక్కలు చూపడంతో సరిపుచ్చడంవల్ల బాలకార్మికులు ఎక్కడకక్కడే దర్శనమిస్తున్నారు. బడిలో పేరున్నా బయటే పిల్లలు ఉంటున్నారు. ఈపరిస్థితిలో మార్పు తీసుకు వచ్చేందుకు యం త్రాంగం అంతా బాధ్యత వహించాలి. బాల కార్మి కుల లెక్కలు కూడా లోపభూయిష్టంగాఉంటు న్నాయి. ఏపట్టణంలో తీసుకున్నా వందలాది మంది కన్పిస్తున్నారు. పల్లెలో అయితే పది మంది వరకు దర్శణ మిస్తున్నారు. అధికారుల లెక్కలు మాత్రం వందలోపే కన్పిస్తున్నాయి.
బోలెడు అవకాశాలు..
పల్లెల కంటే పట్టణాల్లోని మురికి వాడ ల్లో బాలకార్మికులు ఎక్కువ కన్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాభ్యాసానికి అవకాశాలు కూడా ఎక్కువే. కేజీబీవీలు, వసతిగృహాలు, ఇతర సౌక ర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్విని యోగం చేసుకొనేలా యంత్రాంగం మురికివాడల్లోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పైసా ఖర్చులేకుండా ఒకటి నుంచి డిగ్రీవరకు చదువు కోవచ్చన్న నమ్మకం కల్పించాలి. ఉపకార వేతనాలు, ఉచిత పుస్తకాలు, ఇతర సౌకర్యాలపై అవగాహన పర్చాలి.తల్లిదండ్రులకు ఉపాధి మార్గాలు వివరిం చాలి. రుణాలు మంజూరు చేయించి చిల్లర వ్యాపా రాలు చేసుకొనేలా చూడాలి.అంచనాగా ఒక్క విజయనగరం జిల్లాలో15ఏళ్ల మధ్య పిల్లలు: 6.20లక్షలు బాలకార్మికుల 7,400 మంది. కేజీబీవీలు 33.అన్ని విభాగాల వసతిగృహాలు: 155.
అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోబాలకార్మిక వ్యతిరేక దినోత్స వం ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సన్నద్దమవుతున్నారు. కార్మికశాఖతో పాటు బాల కార్మిక నిర్మూలనా సంస్థ, స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికులను బడికి పంపించాలని అవగాహన పరచ నున్నట్లు ఆశాఖ ప్రతినిధులు తెలిపారు.ప్రకృతి విప త్తులు,యుద్ధాలు ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తా యి. మరణాలు,అంగవ్కెకల్యాలతో పాటు. నిలువ నీడను,జీవనోపాధిని దెబ్బతీస్తాయి. బాధితుల బతు కులను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఏటా20 కోట్ల మంది ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాయి. ఇందులో మూడో వంతు బాలలే ఉంటున్నారు. వీరికి తోడు పేదరికంలో మరెందరో మగ్గుతు న్నారు. వీరంతా పొట్ట కూటికోసం బాలకార్మికులుగా మారుతు న్నాయి. పద్నాలుగేళ్లలోపు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని చట్టాలు చెబుతున్నా…అవి సక్రమంగా అమలు కాని పరిస్థితులు వెక్కిరి స్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాన్న ఆశయంతో ఏటా జూన్ 12న అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినంగా ఐక్యరాజ్య సమితి,అంతర్జాతీయ కార్మిక సంస్థలు పాటిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులు బాల లను దైన్యంలోకి నెడుతున్నాయన్నదే ఈ ఏడాది నినాదం.
బాలకార్మికులెంతమంది?
1998జాతీయ గణంకాల ప్రకారం 5నుంచి14సంవత్సరాలున్నవారు 253 మిలియ న్లుంటే,వారిలో12.6మిలియన్ల మంది చిన్నారులలు బాలకార్మికులే.2009-10 గణాంకాలు పరిశీలిస్తే కొంత మార్పు ఉంది.4.98 మిలియన్లకు ఈ సంఖ్య తగ్గింది. 5నుంచి 14 సంవత్సరాల లోపు మొత్తం పిల్లలజనాభా 259.64 మిలియన్లు. వీరి సంఖ్య తాజా గణాంకాల ప్రకారం చూస్తే మరింత తగ్గిందనే చెప్పాలి.
చట్టాలెన్నో..
భారతదేశంలోనే కాదు ప్రపంచ మొత్తం మీద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో చట్టాలున్నాయి. అయినా ఆసియా దేశాలలో ఇప్పటికీ బాలకార్మికుల సంఖ్య ఎక్కువే. భారత రాజ్యాంగంలోని24వ ఆర్టికల్తో పాటు, ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948,ద ఛైల్డ్ లేబర్ యాక్ట్ 1986, ద జువ్కెనల్ జస్టిస్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఆఫ్ 2000, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఆటు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 వంటి చట్టాలెన్నో ఉన్నాయి.
నిర్బంధ విద్య చట్టం కూడా నీరుగారుతోంది.
పైన పేర్కొన్న చట్టాలన్నీ అమలు కాక పోవడం,విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో బాలకార్మిక సంఖ్య అధికంగా ఉండటం మనం చూస్తున్నాం.2009లో వచ్చిన నిర్బంద విద్య చట్టం పరిశీలించినా కూడా ఇదేపరిస్థితి. ఈచట్టం ప్రకా రం ప్రాథమిక విద్యను తప్పనిసరి చేశారు. అంతేనా కార్పొరేట్ పాఠశాలల హవా కొనసాగుతున్న నేప థ్యంలో ప్రతీ ప్రైవేటు పాఠశాలలో25శాతం సీట్ల ను పేద విద్యార్థులకు అందివ్వాలని సూచిం చారు. అయినా ఈనిబంధనలను ఎక్కడా అమలు చేయడం లేదు.
ఇలా నిర్మూలించవచ్చు…
ె బాలకార్మిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
ె ఎదుటి వారికీ అవగాహన కల్పించాలి.
ె సమాజంలో మార్పు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత కృషిచేయాలి.
ె సంస్థలు వారి కార్యకలాపాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక భాగంగా చేయాలి.
ె సమస్య తీవ్రతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
ె ముందుగా మన ఇళ్లల్లో పిల్లలు పనిచేయకుండా చూడాలి.
ె ఉపాధి చూపించే వారికి పిల్లలకు పనులు ఇవ్వొద్దని తెలియజేయాలి.
ె మన చుట్టూ ఉండే చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా చూడాలి.
ె పిల్లలను పనికి పంపేవారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
విజయనగరం జిల్లాలో బాలకార్మికుల సంఖ్య గతంతో పోల్చితే తగ్గిందని చెప్పాలి. వెనుక బడిన జిల్లా కావడంతో ఇక్కడకు ఇతర జిల్లాల నుంచికానీ, ఒడిశా నుంచి కానీ వలసలు వచ్చేవారు లేరు. ఈ సంఖ్య అటు శ్రీకాకుళంలోనూ,ఇటు విశాఖలోనూ కనిపిస్తుంది. ఇటుకబట్టీల్లో గతంలో కొంతమంది చిన్నారులు పనిచేస్తుండేవారు. ఇప్పుడా ఆ పరిస్థితి మారిందనే చెప్పాలి. అయినా ఉన్న కార్మికుల సంఖ్య మరింత తగ్గించే ప్రయత్నాలు జరగలేదు. గత ఏడాది మొత్తం కేవలం 9 కేసులు మాత్రమే నమోదు చేశారు. ఒక్కటంటే ఒక్క అవగాహన సదస్సును కూడా కార్మిక శాఖ నిర్వహించలేదు. ఈ బాధ్యత అడపాదడపా ఒకటి రెండు స్వచ్ఛందసేవా సంస్థలు చేపడుతున్నాయి.
1098కి ఫోన్చేస్తే..
ఎవరైనా బాలకార్మికులను చూసినా.. లేదా ఒక చోట పనిచేస్తున్నట్టు సమాచారం ఉన్నా 1098కి ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది చ్కెల్డ్లైన్ టోల్ఫ్రీ నెంబరు. వెంటనే సంబంధిత చ్కెల్లైన్ సిబ్బం ది వచ్చి ఆపిల్లాడిని జిల్లాచ్కెల్డ్వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరుస్తారు. వారు కౌన్సెలింగ్ ఇచ్చి జిల్లా లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్ హోమ్ తరలిస్తారు.అక్కడ ఆచిన్నారి నుంచి తగిన వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లాడిని పాఠశాలకు పంపేలా తగిన చర్యలు తీసుకుంటారు. ఒక వేళ వారికి ఎవరూ లేరనుకుంటే వారిని సరిపడే వసతిగృహానికి పంపి విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకుంటారు.
ఎన్సీఎల్పీని నీరుగార్చారు..
నేషనల్ చ్కెల్డ్లైన్ ప్రాజెక్టు మూడేళ్ల కిందట వరకూ బాగానే నడిచింది. దీని కింద స్వచ్చంద సేవాసంస్థలు బాలకార్మిక పాఠశాలలు నడిపేవారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని నడపడం లేదు. దేశంమొత్తం మీద 800కుపైగా జిల్లా లుంటే 273జిల్లాల్లో ఇప్పటికీ ఎన్‌ఎసీఎల్పీఉన్నట్టు రికార్డులు చూపుతున్నారు. అందులో విజయ నగరం,విశాఖ,శ్రీకాకుళం ఉండటం విశేషం. అయితే ఇక్కడ ఎటువంటి పనులు జరగడం లేదు. పేరుకే ప్రాజెక్టు ఉంది. దీనికి కారణం నిర్భంద విద్య చట్టం. ఈచట్టం వచ్చిన తరువాత ఇంకా బాలకార్మిక పాఠశాలలతో పనేముందని వాటిని ప్రభుత్వం మూసేంది.ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు నిర్భంధ విద్య క్షేత్రస్థాయిలో అమలువుతున్నదీ లేనిదీ మాత్రం చూడటం లేదు.
ఒక్క కార్యక్రమమూ లేదు..
363 రోజులు గుర్తురాకున్నా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయింది. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏదో ఓ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. కానీఈసారి తదను గుణంగా ఎలాంటి కార్యక్రమూ చేపట్టడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదు.
చాలా వరకూ నిర్మూలించాం…
గతంలో చేసిన కార్యక్రమాలతో చాలా వరకూ బాలకార్మిక వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. కొద్దిమంది ఎక్కడ్కెనా ఉన్నా వారికి పునరావాసం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. చ్కెల్డ్లైన్ ద్వారా వారికి తగిన పునరావాసం కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రణాళికలు కొత్తగా రూపొందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయమై మరింత వృద్ధి సాధించేందుకు ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు కోరారు. వీటిని కూడా అమలు చేసి త్వరలోనే బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం.
- డీవీఎస్ ప్రసాద్, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డ్కెరెక్టర్
ప్రతి ఏడాది జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్స వంను ప్రారంభించింది.
లక్ష్యాలు
అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం. బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు.- సైమన్ గునపర్తి