నా విజయం వ్యక్తిగతం కాదు..

‘‘ నేను రాష్ట్రపతిగా
ఎన్నిక కావటం
ఆదివాసీల విజయం…’’

‘ఒడిశాలోని ఓమారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన నేను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా..ఇది నావ్యక్తిగత విజయం మాత్రమే కాదు…దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామి నేషనే ఓరుజువు. నాకు ప్రాధమిక విద్య చదువుకోవడమే ఓకలగా ఉండేది. అలాంటిస్థాయి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను…50ఏళ్ళ స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీ య జీవితం ప్రారంభమైంది.

75ఏళ్ల ఉత్సవాల వేళ ప్రథమ పౌరురాలి పీఠానికి ఎన్నికకావడం గౌరవంగా భావిస్తున్నా.. స్వతంత్ర భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిని నేను. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా పనిచేయా ల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో ఉజ్వలయాత్ర కొనసాగించాల్సి ఉంది. ‘సబ్‌కా ప్రయాస్‌సబ్‌కా కర్తవ్య్‌’ నినాదంతో ముందుకు వెళ్లాలి. అభివృద్ధి నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. స్థిరమైన జీవన విధానం చాలా అవసరం… నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లటం ఎంతో పెద్ద విషయం.. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరం గా ఉన్న పేదలు, దళితులు,వెనుకబడినవాళ్లు,గిరిజనులు, తనను ఆశాకిర ణంగా చూడవచ్చు. నా విజయం వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయి. కోట్లాది మహిళల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తాను..అంటూ భారత 15వ రాష్ట్రపతిగా జులై 25న ప్ర్రమాణస్వీకారం అనంతరం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలిసారి ప్రసంగించారు. ాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం దేశ అత్యున్నత పీఠంపై తొలి ఆదివాసీ మహిళ ఆసీనులయ్యారు. భారత 15వ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జులై 25 ఉదయం 10.15 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్‌ ఎస్‌.వి.రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. సంప్రదాయ సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంయక్యనాయుడు,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా,పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు/ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలు కలలు కనొచ్చనేందుకు నేనే ఉదాహరణ ప్రమాణస్వీకారం అనంతరం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలిసారి ప్రసంగించారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోన్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ‘ఒడిశాలోని ఓమారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన నేను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా..ఇది నావ్యక్తిగత విజయం మాత్రమే కాదు…దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని,వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషనే ఓ రుజువు. నాకు ప్రాధమిక విద్య చదువుకోవడమే ఓకలగా ఉండేది. అలాంటిస్థాయి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను’’అని ముర్ము ఆనందం వ్యక్తం చేశారు.‘50ఏళ్ళ స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది.75ఏళ్ల ఉత్స వాల వేళ ప్రథమ పౌరురాలి పీఠానికి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నా..స్వతంత్ర భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిని నేను.స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాల్సి ఉంది.‘సబ్‌కా ప్రయాస్‌సబ్‌కా కర్తవ్య్‌’ నినాదంతో ముందుకు వెళ్లాలి.అభివృద్ధి నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. స్థిరమైన జీవన విధానం చాలా అవసరం’’ అని ముర్ము తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. యువత కేవలం తమ భవిష్యత్తు మీదనే కాకుండా దేశ పురోగతికి బాటలు వేయడంపైనా దృష్టి పెట్టాలని రాష్ట్రపతి కోరారు. దేశ ప్రథమ పౌరురాలిగా వారికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం
భారత 15రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ద్రౌపది ముర్ము జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తూ..నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం అని అన్నారు. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే అంటూ రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆమె గుర్తు చేసుకున్నారు. మా గ్రామంలో బాలికలు స్కూల్‌ కు వెళ్లటం ఎంతో పెద్ద విషయం అని తెలిపారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుక బడినవాళ్లు, గిరిజనులు, తనను ఆశాకిరణంగా చూడవచ్చన్నారు. తన నామినేషన్‌ వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కోట్లాది మహిళల ఆశలు, ఆశయా లకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు.జులై 26న కార్గిల్‌ దివస్‌ ను జరుపుకుంటున్నాం అని..కార్గిల్‌ విజయ్‌ దివస్‌ భారత్‌ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.విజయ్‌ దివస్‌ సందర్భంగా దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. అలాగే, అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం.
ద్రౌపది ముర్ము ఝార్ఖండ్ కు తొలి మహిళా గవర్నర్‌, ఆదివాసీ గవర్నర్‌ కూడా. పదవీ విరమణ తరువాత ఆమె తన సొంత రాష్ట్రం ఒడిశాలో మయూర్‌భంజ్‌ జిల్లాలోని రాయంగ్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఇది ఆమె స్వగ్రామం బైదాపోసిలోని బ్లాక్‌ ప్రధాన కార్యాలయం.
ద్రౌపది ముర్ము ఎందుకంత ప్రత్యేకం
జూన్‌ 21 సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు.అప్పటికి ఆమె రాయంగ్‌పూర్‌ (ఒడిశా)లోని తన ఇంట్లో ఉన్నారు. జూన్‌ 20న తన 64వ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. సరిగ్గా 24 గంటల్లో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తుందని ఆమె ఊహించి ఉండరు. ‘‘రాష్ట్రపతి పదవికి నన్ను నామినేట్‌ చేసినందుకు చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. టీవీ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది. దీనికి నేను ఎన్నికైతే రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల కోసం పనిచేస్తాను. రాజ్యాంగ నిబంధనలు, హక్కుల ప్రకారం పనిచేస్తా’ అని నాడు మీడియాతో మాట్లాడుతూ ఆమె అన్నారు.
గుమస్తాగా కెరీర్‌ ప్రారంభించి..
ద్రౌపది ముర్ము, 1979లో భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్‌ కాలేజీ నుంచి బీఏ పాస్‌ అయిన తరువాత,ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటి పారుదల,ఇంధన శాఖలో జూనియర్‌ అసిస్టెం ట్‌గా పనిచేశారు. తరువాతి కాలంలో ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. రాయంగ్‌ పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో గౌరవ ఉపాధ్యాయు రాలిగా పనిచేశారు. కష్టించి పనిచేసే ఉద్యోగిగా ఆమె గుర్తింపు పొందారు.
ఝార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌
2015 మే 18న ద్రౌపది ముర్ము రaార్ఖండ్‌కు తొలి మహిళ,గిరిజన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు సంవత్సరాలకు పైబడి నెలా 18 రోజుల పాటు ఈ పదవిలో కొన సాగారు. జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నికైన మొదటి గవర్నర్‌ ఆమె. అయిదేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా గవర్నర్‌గా కొనసాగారు. తన పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్నారు.
సీఎన్‌టఎస్‌పీటీ చట్టం సవరణ బిల్లు వివాదం 2017లో రaార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని రఘువర్‌ దాస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవని చెబుతుండేవారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్‌ పాలనలో తీసుకొచ్చిన చోటానాగ్‌పూర్‌ కౌలు దారీ చట్టం (సీఎన్‌టీ చట్టం),సంతాల్‌ పరగణా కౌలు చట్టం (ఎస్‌పీటీ చట్టం)లోని కొన్ని నిబం ధనలను సవరించాలని రఘువర్‌ దాస్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ, ఈ సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనంతరం దాన్ని గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. 2017 మే,అప్పటికి రaార్ఖండ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కు పంపారు. దీనివల్ల ఆదివాసీలకు ఏం లాభమని ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేకపోయింది. దాంతో ఆబిల్లు ముందుకు సాగలేదు.అప్పట్లో బీజేపీ నేత, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కరియా ముండా, మాజీ ముఖ్యమంత్రి (ప్రస్తుత కేంద్ర మంత్రి) అర్జున్‌ ముండా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ విష యమై అప్పట్లో జంషెడ్‌పూర్‌లో విలేఖరులతో మాట్లాడిన ద్రౌపది ముర్ము, ఈ సవరణ బిల్లుపై రాజ్‌భవన్‌కు దాదాపు 200 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఈ బిల్లుపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సవరణ బిల్లుపై ఆమె సంతకం చేయలేదు. ఆ సమయంలో ఆమె దిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను కలిశారు. అంతకు ముందు, జూన్‌ నెలలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రాజ్‌బాల వర్మ, ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ ఒకరి తరువాత ఒకరుగా గవర్నర్‌ను కలిసి బిల్లు విషయమై చర్చించారు. కానీ, ఈ విషయంలో ద్రౌపది ముర్ము వెనక్కు తగ్గలేదు. ఆమె, తన నిర్ణయంపై గట్టిగా నిలబడ్డారు. అదే విధంగా,మరోమారు రఘువర్‌ దాస్‌ ప్రభుత్వ హయాంలోనే పాతాళగడి వివాదం చెల రేగింది. అప్పుడు, ద్రౌపది ముర్ము ఆదివాసి గ్రామపెద్దలను, మాంకి, ముండాలను రాజ్‌ భవన్‌కు పిలిపించి, వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 2019 డిసెంబర్‌లో రఘువర్‌ దాస్‌ ప్రభుత్వం కూలిపోయి జేఎంఎం నాయకుడు హేమంత్‌ సోరెన్‌ రaార్ఖండ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నెలల తరువాత, హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం ట్రైబల్‌ కన్సల్టేటివ్‌ కమిటీ (టీఏసీ)ఏర్పాటుకు సంబంధించిన సవరణ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. ఈ సవరణ ప్రకారం టీఏసీ ఏర్పాటులో గవర్నర్‌ పాత్ర ఉండదు. అయితే,ద్రౌపది ముర్ము దానిపై సంతకం చేయకుండా ప్రభుత్వానికి తిరిగి పంపారు. యూనివర్సిటీలలో మార్పులు తన పదవీ కాలంలో పాఠశాలల, కాలేజీల పరిస్థితులను సమీక్షిస్తూ వాటి మెరుగుదలకు కృషి చేశారు.2016లో యూనివర్సిటీల కోసం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. వ్యతిరేకత వచ్చినప్పటికీ ఛాన్సలర్‌ పోర్టల్‌ను ప్రారం భించారు. యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌ చేసే మార్గమిది. వివిధ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్‌లతో చర్చిస్తూ, గిరిజన భాషల అధ్యయనానికి సంబంధించిన సూచనలెన్నో చేశారు. ఫలితంగా,యూనివర్సిటీల్లో చాలా కాలంగా మూతపడిన గిరిజన, ప్రాంతీయ భాషల ఉపాధ్యాయుల నియామకం మళ్లీ మొదలైంది. ద్రౌపది ముర్ము గవర్నర్‌గా ఉండగానే రాజ్‌భవన్‌లో అన్ని మతాలవారికి ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో హిందూ, ముస్లింలు, సిక్కు, క్రైస్తవులందరికీ సమాన గౌరవం కల్పించారు. భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి రాయరంగ్‌పూర్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకునే ప్రయాణంలో ద్రౌపది ముర్ము అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 11సంవత్సరాల తరువాత మయూర్‌భంజ్‌ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు ద్రౌపది ముర్ము.ఆమె తండ్రి బిరంచి నారాయణ్‌ తుడు. ఆయన సంతాల్‌ ఆదివాసి తెగకు చెందినవారు. ఆతెగల పంచాయతీకి అధిపతిగా వ్యవహరిం చారు.ద్రౌపది ముర్ము ..శ్యామ్‌ చరణ్‌ ముర్ముని వివాహం చేసుకున్నారు. ఆయన చిన్న వయసులోనే మరణించారు. వారికి ముగ్గురు సంతానం. వారిలో,ఇద్దరు కుమారులు చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గణేష్‌ చంద్ర హెంబ్రా మ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ద్రౌపది ముర్ము తన కూతురు, అల్లుడు, మనుమరాలితో ఉన్న ఫొటోలు కొన్ని మీడియాలో వచ్చాయి. ఇతర కుటుంబ సభ్యుల గురించి సమాచారం అందుబాటులో లేదు. ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలివే.. ద్రౌపది ముర్ము జీవితంలో ఎన్నో విషాదాలు దాటుకుని వచ్చారు. స్ఫూర్తిమంతమైన నేతగా నిలిచారు. ా 2009-14 వరకూ ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొ న్నారు. ఇద్దరు కొడుకులను, భర్తను కోల్పో యారు. తరవాత ఆమె తల్లి, సోదరుడు కూడా మరణించారు. ా 2009లో ద్రౌపది ముర్ము పెద్ద కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. లక్ష్మణ్‌ ముర్ముని అతని బెడ్‌పై అపస్మారక స్థితిలో గుర్తించారు.2012లో రెండో కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ా 2014లో ద్రౌపది ముర్ము భర్త శ్యామ్‌ చరమ్‌ ముర్ము కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందారు. ా ద్రౌపది ముర్ము కూతురు ఇతిశ్రీ ముర్ము ఓబ్యాంక్‌ ఉద్యోగి. ఆమె ఓరగ్బీ ప్లేయర్‌ను వివాహం చేసుకున్నారు. ా రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు ద్రౌపది ముర్ము టీచర్‌గా పని చేశారు. ఒడిశాలోని రాయ్‌రంగపూర్‌లో శ్రీఅరబిందో ఇంటి గ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తించారు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.. ద్రౌపది ముర్ము ఎన్నో సమస్యలు దాటుకుని పట్టుదలగా నిలబడ్డారని సన్నిహితులు చెబు తుంటారు.‘‘మా కాలంలో అమ్మాయిలకు చదువులెందుకు అని ప్రశ్నించేవారు. చదువుకుని ఏం చేస్తావని హేళన చేసేవారు. ఆ ప్రశ్నలన్నింటికీ ద్రౌపది సరైన సమాధాన మిచ్చింది’’ అని ద్రౌపది ముర్ము బంధువులు గర్వపడుతున్నారు.‘‘మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ముర్ము నిరూపించారు. ఆమె ఏదీ ఓపట్టాన ఒప్పుకోరు. లోతైన అధ్యయనం చేస్తారు. మాకు ఆమెతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఆమె నుంచి మేమెంతో నేర్చుకున్నాం. మహిళలు సాధించలేనిది ఏదీ లేదు అనటానికి ఆమె జీవితమే నిదర్శనం’’ అని ముర్ముతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుం టున్నారు. కొత్త రాష్ట్రపతి సొంత ఊరు ఊపర్‌బేడా ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌ జిల్లా కుసుమీ బ్లాక్‌లో ఊపర్‌బేడా ఉంటుంది. ఈ గ్రామం జనాభా దాదాపు 3,500.గ్రామానికి కాస్త దూరంలోనే జార్ఖండ్‌ సరిహద్దులు కనిపిస్తాయి. అక్కడే ఇనుము ముడి ఖనిజం గనులు కూడా ఉన్నాయి. కొండలు, చెరువుల మధ్య ఈ గ్రామం ఉంటుంది. భారత్‌లోని ఇతర గ్రామాల్లానే ఇక్కడి ప్రజలకు తమ అవసరాలు,కష్టాలు ఉన్నాయి. మరి ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే.. ఒక రాష్ట్రపతిని భారత్‌కు ఈ గ్రామం అందించింది.గ్రామం మధ్యలో ఉండే స్కూలుల్లోనే ద్రౌపది ముర్ము ప్రాథమిక విద్యను అభ్యసించారు.అలాగే ద్రౌపది ముర్ము పుట్టిన ఇల్లు ఇప్పుడు పూర్తిగా మారి పోయింది. అక్కడ ఒక పసుపు రంగు పక్కా ఇల్లు కనిపిస్తోంది. అయితే, ఇంటి లోపల ప్రాంతాలు మాత్రం ద్రౌపది చిన్నప్పుడు ఎలా ఉండేవో ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇప్పుడు ద్రౌపది అన్నయ్య కోడలు దులారీ టుడూ ఇక్కడ జీవిస్తున్నారు. ద్రౌపది చిన్ననాటి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా చూసేందుకు ఆ ఇంటి లోపల అన్ని ప్రాంతాలనూ అలానే ఉంచేశాం. ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు వీటిని చూసి చాలా సంతోష పడుతుంటారు. ప్రత్యేక వంటకమైన పఖల్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆమె ఇక్కడకు రావాలని మేం కోరుకుంటున్నాం.అని దులారీ చెప్పారు.అదే సమయంలో గిరిజనుల భాష,మతాల కోసం రాజ్యాంగంలో కొత్త నిబం ధనలు తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేయాలి’ అని మాంరీa అన్నారు. దేశానికి ఒక రాష్ట్రప తిని ఇస్తున్నామన్న ఉత్సాహం ఈ గ్రామ వాసు ల్లో నిండుగా ఉంది. గునపర్తి సైమన్‌