దేశాన్ని కదలించిన ‘టూల్‌కిట్స్’
సాధారణంగా టూల్‌కిట్స్ అంటే పరిభాషలో పనిముట్లు,పరికరాల అంటారు. సాంకేతిక విద్యారంగంలో విద్యను నేర్చుకోవడానికి పరికరాలను ఉపయోగిస్తారు.ఈ టూల్‌కిట్స్ అనే పదం ప్రస్తుతం దేశాన్ని గత కొద్దిరోజుగా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత ఉద్యమానికి సంబంధించిన టూల్‌కిట్‌ను పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాథన్‌బర్గ్‌కు దిశరవి పంపించారనే అభియోగంపై ఓయువపర్యావరణ కార్యకర్త దిశ రవిని దేశద్రోహిగా, అంతర్జాతీయ కుట్రదారుగా పరిగణించి ఢల్లీిపోలీసు వచ్చి అకస్మా త్తుగా అరెస్టుచేయడాన్ని యావత్ప్రపంచం విస్తుపోయేట్టు చేస్తున్నది. ఇందుకోసం ‘టూల్‌కిట్’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. అరెస్టుచేసే ముందు సమగ్రమైన సమాచారంగానీ, విచారణగానీ చేయకుండా అతిఉత్సహంతో ఎందుకు అరెస్టు చేశారనేది ప్రధానాంశం. గ్రేటామద్దతుతో నడిచే ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా’కు దిశ బెంగుళూరులో వ్యవస్థాపక సభ్యురాలు. వృక్షజాతుతో పాఉత్పత్తు తయారుచేసే స్టార్టప్ కంపెనీలో ఈమె పనిచేస్తున్నది. ఒకవేళ ఏదైనాతప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్ స్టేషన్లో విచారించాలి. నేరుగా దిల్లీకోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసుకెళ్లారు? టెక్నాజీ గురించి సరైన అవగాహన లేక పోవడంవన ఈవిషయంలో గందరగోళం తలెత్తిందనిపిస్తోంది. సామాజిక కార్యకర్త నోరును ఎందుకు నొక్కేయాని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించాలి. ఇదిచాలావిచారకరం.నిరాశ నిస్పృహను కలిగిస్తోంది. చెట్లను,పర్యావరణాన్ని కాపాడానుకునే ప్లిను దేశద్రోహలుగా చిత్రీకరించి భయపెట్టించడం సరికాదు. ఇందుకోసం ‘టూల్‌కిట్’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. ఉద్యమ కార్యకర్తను భయబ్రాంతుకు గురిచేసేందుకే కేంద్రం ఇలాంటి దుశ్చర్యకు ప్పాడుతున్నట్టు దిశరవి ఘటనే తార్కాణం. చట్టాన్ని అముపరిచేవారు చట్టబద్దంగా వ్యవహరిస్తున్నారా?లేదా అనేది పునరాలోచనుచేసుకోవాలి. నిజాయితీపరులైన ఉద్యమకారుపై అభాండాు వేయడం,వేదించడం,శిక్షించడం,పూర్వ కాం నుంచీ జరుగుతున్నదే. ఈచీకటి కోణాు తొసుకున్నకొద్దీ మెగు ప్రస్థానంవైపుకే మానవుడు ప్రయాణిస్తాడు. ఉద్యమంకూడా ఆ‘దిశ’గానే ప్రవహిస్తుంది.అదే దశలో దిశరవి ఘటనలో న్యాయమే గెలిచింది అనడంలో అతిశయోక్తికాదు.
దిశ రవికి బెయిల్ మంజూరు చేసిన ఢల్లీి కోర్టు :
టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశరవికి ఢల్లీి కోర్టులో ఊరటభించింది. ఢల్లీి అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా ఫిబ్రవరి 23న ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. రూ.క్షవ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరోఇద్దరి పూచీకత్తుతో ఆమెను విడుదల చేయాలని ఆదేశించారు. ఆమెకుబెయిల్ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతనసాగు చట్టాపై ఆందోళను నిర్వహిస్తోన్న రైతుకు మద్దతుగా సోషల్ మీడియాద్వారా టూల్‌కిట్‌ను షేర్ చేసినట్టు దశరవి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్థాన్ అనుకూ సంస్థ ‘పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ (పీజేఎఫ్)తో ఆమెకు ప్రత్యక్ష సంబం ధాలు ఉన్నట్టు నిరూపించే ఆధారాను పోలీసు సమర్పించలేకపోయారనికోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనతో ఆమెకు సంబంధంఉందని చెప్పడానికీ ఆధారాల్లేవని తెలిపింది. గతంలోఎటువంటి నేరచరిత్రలేని యువతికి అరకొర ఆధారాను పరిగణనలో తీసుకుని బెయిల్ నిరాక రించడానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలోబమైనమూలాలున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది. టూల్‌కిట్ గురించి పోలీసు చెబుతున్నాదానిని ఉపయోగించి ఆమెహింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వతీరుపై పౌరు నిరంతర పరిశీన ఉంటుందనేది నానిశ్చిత అభిప్రాయమని, కేవలం విధానాతో విభేదించాన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంతమాత్రానదానికి మందుగా దేశద్రోహి అభియోగం మోపడం సమంజసంకాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విభేదించడం,భిన్నాభిప్రాయంఉండడం,అసమ్మతి తెప డం,ఆక్షేపించడం అనేవి రాజ్యవిధానాల్లో వాస్తవికతను తెలియచేసే చట్టబద్ధసాధనాని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగ పౌయి ఉండడం ఆరోగ్యకర,దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేదినిర్వివాదాంశమని పేర్కొ న్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులోఉన్న ఉత్తమసాధానాను వినియోగించుకునే హక్కుపౌరుకు ఉందనిస్పష్టంచేశారు. వాట్సప్‌గ్రూపును ఏర్పాటు చేయడం, అపాయకరంకాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గాఉండడం తప్పేమీకాదని కుండబద్దు కొట్టారు. విచారణకు దిశ సహకరించాలని,దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరు కావాని సూచించిన కోర్టు..తమఅనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్మంజూరు కావడంతో దిశరవి తిహార్‌జైలు నుంచి విడుదయ్యారు. విభేదించేహక్కును రాజ్యాంగంలోని 19వఆర్టికల్ బంగా చాటుతోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళిక హద్దులేమీ లేవని జడ్జ్ తెలియజేయడం హర్షణీయం!