దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..!
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ చేపడుతోంది. పౌరుల్లో దేశభక్తి పెంపొందేలా పలు అవగాహన కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కో ఆపరేటివ్ సొసైటీలు ఇలా అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వేయతర సంస్థలన్నీ ఈ క్యాంపెయిన్‌లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కి విస్తృత ప్రచారం కల్పించారు.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహి స్తోంది.ఆజాదీ కా అమృత్ మహో త్సవ్‌లో భాగంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హర్ ఘర్ తిరంగా..ఎర్రకోటపై ఎగిరిన జాతీయ జెండా..భారత 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా మువ్వె న్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్క రించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేశారు. వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర సర్కార్ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా ప్రచారానికి ఊహించని స్పందన వచ్చింది. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడిది.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రదర్శనను తిలకించారు.ప్రభుత్వ పథకాలతో రూపొందించిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఎన్నికల హామీలను అమలు పర్చకపోవడం ద్వారా ప్రజలకు కొన్ని పార్టీలు అన్యాయం చేశాయన్నారు. స్వతంత్రంగా ఉండా ల్సిన మీడియా కొందరికి భజన చేస్తుందని స్వాతంత్య్ర సమరయోధులు ఎన్నడైనా ఊహించారా? అని జగన్ ప్రశ్నించారు. పరి పాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన చేపట్టామన్నారు. గత మూడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామన్నారు జగన్.
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. ఈరోజు ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయని చెప్పారు. తెలంగాణలో 1.25 కోట్ల జెండా లను ప్రతి ఇంటికీ అందించామని.. తెలంగాణ రాష్ట్రం మొత్తం త్రివర్ణ జెండాలతో రెపరెపలా డుతుందని కేసీఆర్ తెలిపారు.
ఐక్యమతమే మన ఆయుధం కావాలి మన వారసత్వాన్ని భావి తరాలకు అందించాలిసమా జంలో వివక్షను తొలగిస్తామనే నమ్మకం ఉంది.సంపూర్ణ అభివృద్ధి మన లక్ష్యం కావాలి. వచ్చే 25 ఏళ్లు దేశానికి అత్యంత కీలకం.. ప్రణాళికలతో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదాం. ప్రస్తుతం ఆహారధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం.బానిసత్వ విముక్తి కోసం పోరాడుదాం అని కేసీఆర్ ప్రసంగించారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటి..?
బ్రిటీష్ తెల్లదొరల కబంధహస్తాల నుంచి భారత మాతకు విముక్తి లభించి75ఏళ్లు కావస్తున్న సంద ర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిం చారు. ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృత్ అంటే అజరామరం..మహోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం..‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభం అని అర్థం. దాదాపు రెండు వందల ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోధ్యమం.. స్వాతంత్య్రోద్యమం..భారత జాతి దాస్య శృంఖ లాల నుంచి విముక్తి కోసం ఎందరో మహాను భావులు తమ ప్రాణాలను సైతం తృణప్రా యంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరా జ్యం సిద్ధించింది.
75 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు !
దేశవ్యాప్తంగా జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..ఆగష్టు 15న ఉదయం ఢల్లీిలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి తర్వాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.చరిత్ర విస్మరించిన స్వాతం త్య్ర యోధులను ఇవాళ భారత దేశం గౌర వించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ముందుగా ఆయన..దేశ ప్రజ లకు స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు,నేతాజీ సుభాష్ చంద్రబోస్,బాబాసాహెబ్ అంబేద్కర్,వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు.త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం.వారంతా బ్రిటిష్ పాలన పునాది ని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారు లకు ఈదేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామ రాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఇవాళ 76వ స్వాతంత్ర దినోత్సవ త్రివర్ణ పతా కాన్నిగర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. 75ఏళ్ల స్వాతంత్య్ర భారతం ఇవాళ ఓమైలు రాయిని దాటింది.ఈ75ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడు కుల్ని ఎదుర్కొన్నాం.ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించ లేదు.భారతదేశం ప్రజా స్వామ్యానికి తల్లిలాంటిది.భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూ పించుకుంది.ఈ75ఏళ్ల ప్రయాణంలో,ఆశలు, ఆకాంక్షలు,ఎత్తులు,కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరు కున్నాము.పేదవాళ్లకు సాయం అందిం చడమే నాలక్ష్యం.దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం.మన ముందు ఉన్న మార్గం కఠిన మైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలం లో సాధిం చాల్సిన బాధ్యత మనపైఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకువెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు.ప్రధాని మోదీలో తొమ్మిదవసారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవి ష్కరించారు.వచ్చే25ఏళ్లు ఐదుఅంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి సూచించారు.
- దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి
- బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి
- మన దేశ చరిత్రి,సంస్కృతినిచూసి గర్వ పడాలి
- ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి
- ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి -సైమన్ గునపర్తి