దివ్యాంగుల జీవితాల్లో వెలుగులే లక్ష్యం

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయని కేంద్ర మత్స్య,పశుసంవర్దక,డెయిరీశాఖ మంత్రి పర్షోత్తం రూపాల పేర్కొన్నారు. ఎ.డి.ఐ.పి.(అసిస్టెన్స్‌ టు డిజెబుల్డు పర్శన్స్‌ ఫర్‌ పర్చేజ్‌ /ఫిట్టిం గ్‌ ఆఫ్‌ ఎయిడ్స్‌/ అప్లియెన్స్‌) పథకం కింద ఫిబ్రవరి 22న విశాఖపట్టణంలోని కైలాసపురం డీఎల్బీ గ్రౌండ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శిబిర్‌ పేరుతో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్శింహారావు,విభిన్న ప్రతిభా వంతులు,హిజ్రాలు,వయోవృద్ధుల సంక్షేమశాఖ ఎండీ కుమార్‌ రాజా,జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లాలోని దివ్యాంగులకు అందజేశారు. రూ.2.25కోట్లతో2,925 పరికరాలను అలింకో సంస్థ ఆధ్వ ర్యంలో తయారు చేయగా1,589 మంది దివ్యాంగులు అధికా రుల చేతులమీదుగా జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 1,589దివ్యాంగులకు ఒకేచోట ఇంతమొత్తంలో ఉపకరణాలు పంపిణీ చేయటం ఒక శుభ పరిణామమని,దీనికి సహకరిం చిన కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు,ప్రజాప్రతినిధులకు,అధికారు లకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా..అని కేంద్ర మంత్రి పుర్షోత్తం రూపాల పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌, సున్నిత మనస్తత్వం కారణంగానే దివ్యాంగులకు ఇంత స్థాయిలో మంచి జరుగుతుందని అన్నారు. అడిగితేనే గానీ కొంతమంది నేతలు స్పందిం చరు..కానీ నరేంద్ర మోదీ అడగకుం డానే పేదలకు అన్నీ ఇస్తున్నా (దేశ ప్రధానిగా) ఉండటం మనందరి అదృ ష్టం అని పేర్కొన్నారు.పేదల కోసం చేసే మంచి పని ఏదైనా విస్తృత ప్రచా రం కల్పించాలని ప్రసార మాధ్యమా లనుద్దేశించి అన్నారు. దివ్యాంగులపట్ల గౌరవ మర్యాదలతో మెలగాలి ః ` జీవీఎల్‌ అంగవైకల్యం అనేది కోరు కుంటే వచ్చింది కాదని..దురదృష్టంవల్ల వచ్చిందని..దివ్యాంగుల పట్ల మన మంతా గౌరవ మర్యాదలతో నడుచు కోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్శింహారావు సూచించారు.దివ్యాం గులకు సంబంధించిన కార్యక్రమం విశాఖలో నిర్వహిస్తున్నామని చెప్పగానే కేంద్ర ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందిం చారని,సహకారం అందించారని గుర్తు చేశారు.వారి ఆమోదంతో రాష్ట్ర,జిల్లా యంత్రాంగం సహాయంతో దివ్యాంగుల సమస్యలు,అవసరాలు తెలుసుకు న్నామని చెప్పారు.ఆ మేరకు1,589 మందికి రూ.2.25 కోట్లతో 2,925 ఉపకరణాలను తయారు చేయించామని జీవీఎల్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వికలాంగులు అనే పదం పూర్తిగా తొలగిపోయిందని, దాని స్థానంలో దివ్యాంగులు అనే పదం వచ్చిందని పేర్కొన్నారు. రెండు దఫాల భాజపా పాలనలో సుమారు 45లక్షల మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించామని,వచ్చే ఐదేళ్లలో మరొక 50లక్షల మందికి పరికరాలు అంద జేస్తామని జీవీఎల్‌ నర్శింహారావు చెప్పా రు. రైల్వే స్టేషన్లు,ఎయిర్‌ పోర్టలలో చేపట్టే ప్రతి పనినీ దివ్యాంగులను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నా మన్నారు.ఉపకరణాల తయారీలో అలింకో (ఆర్టిఫిసియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోరూ.25కోట్లతో 4వేలమందికి చేయూత ః ఎండీ కుమార్‌ రాజా
దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి నిర్ణయాలు తీసుకుందని దానిలో భాగంగానే రూ.25కోట్లతో నాలుగు వేల మందికి వివిధ ఉపకర ణాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని విభిన్నప్రతిభావం తులు,హిజ్రాలు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఎండీ కుమార్‌ రాజా వెల్లడిర చారు.దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్లు,మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహ నాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,750మంది దివ్యాంగ విద్యార్థు లకు త్రిచక్ర వాహ నాలు అందించా మని గుర్తు చేశారు. గుంటూరులో ఉన్న బ్రెయిలీ ప్రింటింగ్‌ కేంద్రం సాయంతో అంధ విద్యార్థుల సహాయార్థం బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని వివ రించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సం యుక్త ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తూ దివ్యాంగు లకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తు న్నామని ఎండీ పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన2,925 పరికరాలను రూ.2.25 కోట్లు వెచ్చించి అలింకో (ఆర్టిఫిసియల్‌ లింబ్స్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సంస్థ సహకారంతో తయారు చేయిం చామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ పేర్కొన్నారు.ఈ సంస్థ సహకా రంతో ఇప్పటికే విశాఖపట్టణం, విజయ నగరం జిల్లాల్లో 13చోట్ల ప్రత్యేక శిబిరా లు నిర్వహించామని, వారి అవసరా లను గుర్తించి చర్యలు తీసుకు న్నామని చెప్పా రు.ఈ వేదిక ద్వారా1,589 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అంద జేస్తున్నామని జేసీ తెలిపారు.2,925 పరికరా ల్లో 282 మోటరైజ్డ్‌ సైకిళ్లు,173ట్రైసైకిళ్లు, 219 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పేర్కొ న్నారు.క్రచ్చెస్‌ 657, వినికిడి పరికరాలు 868, వాకింగ్‌ స్టిక్స్‌ 146,బ్రెయిలీకిట్స్‌45, స్మార్ట్‌ ఫోన్లు 15,సాధారణ సెల్ఫోన్లు 10,సీపీ ఛైర్స్‌ 40,లింబ్స్‌ ఇతర పరికరాలు 470 వరకు ఉన్నాయని వివరించారు. కార్యక్రమం లో అలింకో సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ సింఫ్‌ు, విభిన్న ప్రతిభావంతులశాఖ విశాఖ పట్టణం జిల్లా ఏడీ మాధవి,విజయ నగరం జిల్లా ఏడీ జగదీష్‌, ఇతర అధికా రులు, పలువురు ప్రజాప్రతినిధులు,అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. -జి.ఎన్‌.వి.సతీష్‌