దళిత,ఆదివాసీలకు ప్రత్యేక మహిళా కమిషన్
జెండర్ సమానత్వ ప్రపంచాన్ని ఊహిద్దాం, కలగందాం, దానికై పనిచేద్దాం. వివక్ష లేని సమాజం, మూస లేని వైవిధ్యాన్ని ఆహ్వానిద్దాం. ఇదీ, 2022 సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇతివృత్తం. పురుష పక్షపాతం ఉన్నంత కాలం మహిళలు అన్ని రంగాలలో వెనుకబడే ఉంటారు. అందుకే ‘బ్రేక్ ది బయాస్’ అని పిలుపునిచ్చారు. ‘మేము స్వేచ్ఛగా విహరించాలని అనుకుంటున్నాం కానీ రక్షణ పేరుతో మమ్ముల్ని కట్టి పడేస్తారు. మీతో పాటు సమానంగా బ్రతకాలని ఆశిస్తున్నాం కానీ సంస్కృతి, మతం, ఆచారాల పేరుతో అణగద్రొక్కుతారు. మరి సగం సమాజం, మానవత స్వేచ్ఛగా లేక పోతే మీకు మాత్రం స్వేచ్ఛ ఎక్కడిది ? స్వేచ్ఛగా ఉన్నామన్న భ్రమ తప్ప’. మహిళా లోకం ఆత్మ ఘోషను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా?
మనం ఒకఉదాత్త సమాజంలో ఉండే వాళ్ళం. ప్రపంచంలో మతఘర్షణలు, యుద్ధా లు, ఉద్యమాలు ఎక్కడ జరిగినా అంతిమంగా వాటి ప్రభావం మహిళలు,పిల్లలపైనే ఎక్కువగా ఉం టుంది. ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వస్తున్న సత్యమే. సామాజిక,ఆర్థిక,రాజకీయ రం గాలలో మహిళల పరిస్థితి సింహావలోకనం చేసు కుని,ఇక ముందుఎట్లా అడుగువేయాలి అనే విష యమై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద ర్భంగా నిర్ణయాలు తీసుకోవడం,కార్యాచరణకు పూనుకోవడం పరిపాటి.మరి,మన దేశంలో మహి ళలకి సంబంధించిన గణాంకాలు చూస్తే చాలా దిగులు కలుగుతోంది. నిరుత్సాహం ఆవహిస్తోంది. ఒక్కోసారి ఈలెక్కలు తప్పేమో అనిపిస్తుంది. ప్రభు త్వాలు చాటుకునే గొప్పలు, ఇచ్చే నినాదాలు అన్ని కూడా అబద్ధం అని అనిపిస్తాయి. ఎంత నిరుత్సా హపరిచినా,ఎంత అణచివేతకు గురి అయినా, ఫీనిక్స్ పక్షి లాగా మళ్ళీ రెక్కలు విరుచుకుని లేవడ మే మహిళలు చేసే పని. అదే ఉత్సాహంతో మహి ళలు,మహిళా స్వేచ్ఛ కాంక్షించే వాళ్ళు ఈ అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొక్కుబడో,శాలువాలో,పురస్కారాల కోసమో,ఎదో ఒకటి జరుపుకోవడం కూడా అవసరమే. ఆ అవస రం కూడా మహిళలలో పెరుగుతున్న చైతన్యం, అన్యాయాన్ని ఎదిరిస్తున్న సందర్భం, ప్రశ్నించే సమూహాల నుంచి వచ్చిందే అని మరవద్దు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవం,భారత స్వాతం త్య్ర అమృతోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షే మ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక మాధ్య మాల ద్వారా మహిళల రక్షణ, సాధికారతకు సంబంధించి అనేక అంశాలపై వివిధ కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు.ఈవారోత్సవాలకు ముగిం పుగా మార్చి8న ‘నారీశక్తి పురస్కార్’ పేరుతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా పోలీసులని సత్కరించనున్నారు.
సరే,మన దేశంలో మహిళలజీవన స్థితి గతుల్లో ఏమైనా మెరుగుదల ఉందా? వాస్తవాలు సంతోషించదగినవిగా లేవు.ఇదొక కఠోర వాస్తవం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2019లో4,05,861మహిళలపై నేరాలు జరిగినట్టు ఆసంస్థ నివేదిక ఒకటి వెల్లడిర చింది. 2018లో కంటే 2019లో ఆనేరాలు 7.3 శాతం పెరిగినట్టు ఆనివేదిక వెల్లడిరచింది.ఆ తరు వాత కొవిడ్ కాలంలో ఈనేరాలు మరింత ఎక్కువ గా నమోదయ్యాయన్నది విస్మరించలేని వాస్తవం. ఇప్పటికీ 38శాతం స్త్రీలు పని చేసే స్థలాల్లో వేధిం పులకు గురవుతున్నారు. ప్రతిప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో లైంగిక హింస వ్యతిరేక కమిటీలు, సాధికా రత కమిటీలు ఉండాలన్న విషయం ఇంకా పటిష్ఠం గా అమలులోకి రాలేదు, పెద్ద పెద్ద విద్యా సంస్థల లో ఈకమిటీల ఊసేలేదు! ఉన్న చోట్ల ఒక పాలసీ గా కాకుండా, మొక్కుబడిగా మాత్రమే ఉన్నాయి. సైబర్ కేసుల విషయం చూసినా అవి కూడా స్త్రీలకు వ్యతిరేకంగా జరిగినవే అధికం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్త్రీల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ గడ్డ మీద, తెలం గాణ ఉద్యమాలలో స్త్రీల పాత్ర తక్కువేమీ కాదు కదా.నేడు విద్యా,వ్యాపార,కళల రంగాలలో ఉన్న మహిళలు ఎక్కువే అయినా స్త్రీలపైన నేరాలు అత్య ధికంగా నమోదు అవుతున్నాయి. జాతీయ లెక్కల కంటే మనమే ముందున్నాము.2019 లెక్కల ప్రకా రం దేశంలో 7శాతం నమోదు అయితే తెలంగాణ లో 14.8శాతం నేరాలు పెరిగినాయి, ప్రతిరోజూ కనీసం ముగ్గురు మహిళలు అత్యాచారానికి గురవు తున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 18శాతం నేరాలు అత్యధికంగా నమోదయినాయి. అస్సాం తరువాత సైబర్‌నేరాలు తెలంగాణలోనే ఎక్కువ.ఇక 2022 లెక్కలు తీస్తే ఈనేరాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అధిగమిం చేందు కు ఏంచేయాలి?మహిళలను మొక్కుబడిగా, పావ లావడ్డీ పథకాలకు,ఆసరా పింఛన్‌లకి కుదించ కుండా అన్ని అభివృద్ధి పథకాల్లో, ప్లానింగ్‌లో వారిని సంపూర్ణ భాగస్వాముల్ని చేయాలి. జెండర్ సమా నత్వ అవగాహన పెంచటంచిన్నప్పటి నుంచే కుటుంబం,పాఠశాలలోనే మొదలు కావాలి. భేటీ పడావో,భేటీ బచావో నినాదాలకు మాత్రమే కాకుం డా ఒకఉద్యమంలాగా ఆచరణలోకి రావాలి. ఆడ పిల్లలకి,అన్నివర్గాలలోఉన్న పేదఆడపిల్లలకి చదువు కున్నంత మేరకు ఉచిత విద్య ఇవ్వాలి. కళ్యాణలక్ష్మి పథకాలకంటే విద్యకి పెద్ద పీట వేయాలి, ఒకసారి ఆడపిల్ల తనకాళ్ళ మీదతాను నిలబడితే ఈ వరక ట్నాల బెడద తగ్గుతుంది.వరకట్న,బాల్య వివాహాల నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలయేట్టు చూ డాలి. గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు అన్ని ప్రదేశా లలోను ఒంటరిస్త్రీలకు రక్షణ,పిల్లలకి విద్య, పెద్ద వాళ్లకి ఉపాధికల్పించాలి. స్త్రీలకి కేటాయిం చిన నిధులు పూర్తిగాస్త్రీల మీద మాత్రమే ఖర్చు చేయాలి. వన్‌స్టాప్ సెంటర్ల మీద రాజకీయ,స్థాని కుల జోక్యా లని తగ్గించాలి. అవి స్వతంత్రంగా పని చేసేటట్టు చూడాలి.మహిళా కమిషన్‌తో పాటు,దళిత ఆది వాసీ మహిళలకి ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేయాలి.దేశంలో,రాష్ట్రంలో నమోదైన నేరాలలో వీళ్ళ మీదే అత్యధిక శాతం జరిగాయి. కనీసం అవిపోలీస్ స్టేషన్ల దగ్గరదాకా కూడా వెళ్లవు. ఒక వేళ వెళ్లినా వివిధ ఒత్తిడుల మూలంగా శిక్ష దాకా పోకుండానే ముగుస్తున్నాయి.వీళ్ళకి ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వరమేన్యాయం జరిగేటట్టు చూడాలి. చివరగా ఈ దేశానికి సావిత్రిబాయి,ఫాతిమా టీచర్ల ని ఆదర్శ మహిళలుగా గుర్తించి,డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన కులనిర్మూలనకి స్త్రీల స్వేచ్ఛకి ఉన్న సంబంధాన్ని తెలుసుకొని ముం దుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే జెండర్ సమా నత్వం సుసాధ్యమవుతుంది.– (సుజాత సూరేపల్లి)