జాతీయ
విద్య విధానాలు..
చదువులకు దూరమౌతున్న చిన్నారులు…!

మూడవ వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థి తులు వేరు. వారి ఆహారపు విరామ సమ యం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగంలోకి దిగుతాయి.
భారత దేశంలో పేద,అణగారిన వర్గాల పిల్లల విద్యవిషయంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడిరది. ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులలో ప్రతి ముగ్గురులో ఒకరు పాఠశాలకు తిరిగి రావడం లేదు. విద్యారంగం నేడు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించని పక్షంలో ముందు ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుం దని యునెస్కో భారత్‌ను హెచ్చరించింది. ఈ పరి స్థితి నుంచి బైటపడాలంటే కేంద్ర,రాష్ట్రప్రభు త్వా లు… పేద,అణగారిన వర్గాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనా కారణంగా బడికి దూరమైన విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌.ఇ.పి), దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు చూస్తుంటే ఆ కొద్ది మంది పేద విద్యార్థులు కూడా చదువుకు దూరమైపోతారనేది స్పష్టమవుతోంది.
మ్యాపింగ్‌ తో విద్య కేంద్రీకరణ
కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకుకు దాసోహమంటున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభు త్వం…నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తును మొగ్గలోనే తుంచేస్తున్నది. పైకి మాత్రం ప్రపంచ స్థాయి విద్య అందిస్తామంటూ నమ్మబలుకుతున్నది.విద్యా రం గంలో నూతన విద్యా విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తుందని విద్యార్థులు, తల్లిదం డ్రులు, ప్రజానీకాన్ని మభ్యపెట్టేందుకు అవగాహన సదస్సులలో చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేస్తామని గొప్పలు చెప్తున్నారు. అం దుకు, అంగన్వాడీ పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రాథమిక స్థాయి విద్య అందించేందుకు గాను వారిని ప్రాథమిక పాఠశాలలో కలుపుతామం టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవంకతో…అద్దె భవ నాల్లో నడుస్తున్న అంగన్వాడీల అద్దెలు కట్టకుండా వాటి నిర్వహణకు పెట్టాల్సిన మదుపు తగ్గించు కోవాలనుకుంటోంది. దీంతో పసిపిల్లలకు, బాలిం తలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారం దూరమై మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది.దీన్ని గ్రహించ కుండా కేంద్ర ప్రభుత్వం…పెరిగుతున్న మాతా శిశు మరణాలు తగ్గించేందుకు స్త్రీల వివాహ వయ స్సు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా ఆటలాడుకునే వయసులో విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీర కంగా అనారోగ్యం పాలవుతారు.
ఇకపోతే3,4,5 తరగతులను ఉన్నత పాఠశా లలకు తరలిస్తామంటున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు 3వతరగతి పిల్లవాడిని అంతదూ రం పంపించడానికి భయపడుతున్నారు. ఎందు కంటే చాలా పాఠశాలలు రద్దీగా ఉన్న రహదారి పక్కన లేదా రహదారికి అవతలి వైపున ఉన్నాయి. వాహనాల రద్దీవల్ల చిన్నారులకు ఎప్పుడేమవు తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో ఉరది. అలాగని పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి తీసుకురావడం కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు సాధ్యం కాని పని. అందుకే చదువులైనా మాన్పించేస్తార కానీ పిల్లలనుఅంతదూరంపంపలేమనే దగ్గరికొస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీపిల్లల బంగారు భవిష్యత్తు కోసం దూర ప్రయాణం అసౌకర్యం అయినప్పటికీ దాన్ని అధిగమించి పిల్లలను ఉన్నత పాఠశాలకు పంపాలంటున్నది. ఉన్నత పాఠశా లల్లో అయితే సకల సౌకర్యాలు, ల్యాబులు, కంప్యూ టర్లు ఉంటాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని… పిల్లల మానసిక వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు హైస్కూల్‌ విద్య తోడ్పడు తుందని చెబుతుంది. అయితే అవే సౌకర్యాలు ప్రాథమిక పాఠశాలల్లో కల్పించవచ్చు కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉన్న 5 తరగతులకు 5 క్లాసులు బోధించి మిగిలిన3 పిరియడ్స్‌లో ముందున్న క్లాసు కు ప్రిపేర్‌ అయ్యేవారు. ఇప్పుడు ఈ3,4,5 తరగ తులను కలుపుతూ మొత్తంగా 8 తరగతులకు 8 క్లాసులను విరామం లేకుండా బోధించేట్లు చేయా లనుకుంటున్నది. దీంతో ఉన్నకొద్దిమంది ఉపాధ్యా యులతోనే అన్ని తరగతులకు సర్దుబాటు చెయ్య వచ్చు. మరో వైపు రాష్ట్రంలోఉన్న ఎయిడెడ్‌ పాఠశా లలను మూసివేస్తూ ఆ అధ్యాపకులను ఖాళీ పోస్టుల్లో భర్తీ చేస్తుంది. అదేవిధంగా ఎస్‌జిటి లకు కొంత శిక్షణ ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్లుగా బోధించాలం టున్నది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఈ రకంగా అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సంవత్సరానికి ఒక డిఎస్సీ తీస్తామన్న జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కడిఎస్సీ కూడా తీయలేదు. భవిష్య త్తులో సైతం తీయకుండా ఉండేలా రిటైర్మెంట్‌ వయస్సు రెండు సంవత్సరాలు పెంచింది. దీంతో డిఎస్సీకి ప్రిపేర్‌ అయినవాళ్లు దాన్ని పక్కన పెట్టి ఇతర ఉద్యోగాలకు సిద్ధం అవుతున్నారు. ఎన్‌ఇపి ద్వారా విద్యను ఒక దగ్గర కేంద్రీకరించి అధ్యాప కులను సర్దుబాటు చేస్తూ విద్యారంగానికి పెట్టాల్సిన ఖర్చు తగ్గించుకోవాలనుకుంటున్నది.
విద్య వ్యాపారీకరణ
‘నాడు-నేడు’ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అదనపు భవనాలు గానీ అదనపు మరుగుదొడ్లు గానీ నిర్మించలేదు. ఉన్నఫళంగా విద్యార్థులను మెర్జ్‌ చేస్తే ఆ పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి. ఇప్పటికే గదులు చాలక చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ గది, స్టాఫ్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌లను తరగతి గదులుగా మార్చి బోధిస్తున్నారు. అంతే కాకుండా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థితులు వేరు. వారి ఆహారపు విరామ సమయం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగం లోకి దిగుతాయి. కొంత కాలానికి విపరీతంగా ఫీజులు పెంచి ‘నచ్చితే చదవండి. లేకుంటే పోండి’ అని చెప్తాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది విద్దామంటే అవి మూతబడి ఉంటాయి. ఈ విధం గా ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు వారికి నచ్చి నట్టు దోచుకుంటూ విద్యద్వారా వ్యాపారం చేసు కుంటాయి.
విద్య కాషాయీకరణ
ఇప్పటికే బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో… తన ఆర్‌ ఎస్‌ఎస్‌ భావజాలాన్ని చొప్పిస్తూ సిలబస్‌లో మార్పు లు చేస్తున్నది. అయితే సిలబస్‌ రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉండటంతో…ఈ హిందూత్వ భావజా లాన్ని దేశమంతటా వ్యాపింపచేయడానికి ఆటంకం కలుగుతుంది. అందుకే సిబిఎస్‌ఇ సిలబస్‌ ద్వారా ఆ మార్గం సుగుమం చేసుకోవాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం చెప్పిన ప్రతీదానికి తల ఊపుతూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం …. రానున్న విద్యా సంవత్సరంలో33 కెజిబివిలు, 16 ఆదర్శ పాఠశాలలు, ఎ.పి రెసిడెన్షియల్స్‌, గురుకు లాలతో పాటు 500పైగా ఉన్నత పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ ప్రవేశ పెడతామంటున్నది. విద్య దూరం…తల్లిదండ్రులకు భారం…
ప్రాథమిక పాఠశాలలు మూసి వేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తరగ తులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు తరలించ నుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2 తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్పగించనుంది. అందుబాటులోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చినమేరంగి హైస్కూల్‌లో2.25 కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ,దాసరిపేట,తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠ శాలలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి.ప్రతిపేటలో పిల్లలు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడులు పెట్టారు.వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగు దల,పరివర్తనలో తేడా వుంటుంది.అందువల్ల చిన్న పిల్లలకు చదువుపట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరి లో ప్రైమరీ, హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ, పాడుతూ,ఏడుస్తూ బడికి వెళ్లే ఆరేళ్ల పిల్లడు,13 ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి… అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదుతరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాల నెల కొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభు త్వం ఏకపక్షంగా మూసేస్తోంది. వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి.‘అమ్మ ఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుం బంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి. లేదంటే పిల్లలను బడికి పంపడం ఆపేస్తారు. ‘అమ్మఒడి’ శాశ్వత పథకంకాదు.ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’వుండదు.‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదం డ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు.అందుకని సర్కారు బడులను సంరక్షిం చుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగతుల పిల్లలకు తరగతి గదులున్నాయా?బెంచీలు,కుర్చీలు న్నాయా? ఇతర మౌలికసదుపాయాలున్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట?గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యా శాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
వ్యాసకర్తలు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు-(డి. రాము/ ఎం.కృష్ణమూర్తి)